|
పూణే పేలుళ్లు ఇండో-పాక్ చర్చలకు విఘాతం కాదుపూణేలో జరిగిన బాంబు పేలుళ్ళు భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరుగనున్న విదేశాంగ కార్యదర్శులు స్థాయి చర్చలకు ఎలాంటి విఘాతం కలిగించబోవని అమెరికా వ్యాఖ్యానించింది. ఇరు దేశాల మధ్య జరిగే ఎలాంటి తరహా చర్చలైనా అమెరికా ప్రోత్సహిస్తుందని అమెరికా రాజకీయ వ్యవహారాల సహాయ మంత్రి పీజే.క్రౌలీ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 19 Feb 2010 | 8:02 am జిడిపి వృద్ధి రేటు 7.2 శాతానికి చేరుకుంటుంది : రంగరాజన్ఈ ఏడాది మార్చి చివరి నాటికి దేశీయ జిడిపి వృద్ధి రేటు 7.2 శాతానికి చేరుకుంటుందని పిఎమ్ఈఎసి ఛైర్మెన్ సి.రంగరాజన్ శుక్రవారం మీడియాకు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 19 Feb 2010 | 7:12 am రూ. 110 కోట్ల ఆదాయాన్ని నిర్దేశించుకున్న ఆర్ఏడీఏజీతమ సంస్థలో భాగమైన రిలయన్స్ వెబ్‌స్టోర్ లిమిటెడ్ ద్వారా టెలికాం ఉత్పత్తులు, సేవలను నేరుగా వినియోగదారులకే అందజేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామని, ఇందులో భాగంగా 110 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందగలమని రిలయన్స్ వెబ్‌స్టోర్ లిమిటెడ్ డైరెక్టర్, ప్రధాన కార్యనిర్వహణాధికారి స్వరూప్ చౌధరీ మీడియాకు తెలిపారుSource: Yahoo! Telugu: News | 19 Feb 2010 | 6:50 am పుంజుకోని కొనుగోళ్లు: నష్టాల్లో సెన్సెక్స్మదుపుదారులు కొనుగోళ్లపై ఆసక్తి చూపకపోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో వారాంతమైన శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, 181 పాయింట్లు క్షీణించి, 16,146 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 55 పాయింట్లు కోల్పోయి, 4,831 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 19 Feb 2010 | 6:43 am శివసేన రాజనీతి అర్థకావడం లేదు: నటుడు షారూక్శివసేన పార్టీ రాజనీతి తనకేమాత్రం అర్థం కావడం లేదని బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ అభిప్రాయపడ్డారు. తన తాజా చిత్రం "మై నేమ్ ఈజ్ ఖాన్" చిత్రంలో ఏదైనా సన్నివేశం వారికి అభ్యంతరకరంగా ఉంటే మాత్రం వారికి క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు షారూక్ వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 19 Feb 2010 | 6:36 am నక్సలైట్ల అడ్డాగా మారిన ఉస్మానియా: ప్రభుత్వంరాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నక్సలైట్లకు ఉడ్డాగా మారిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు.. ఉస్మానియా ఘటనపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. అంతేకాకుండా, ఉస్మానియా వర్శిటీ వ్యవహారంపై విచారణ జరపాలని కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది.Source: Yahoo! Telugu: News | 19 Feb 2010 | 6:12 am మూడు వేలమందిని నియమించనున్న మారుతిరానున్న మూడు సంవత్సరాలలో తమ సంస్థ దాదాపు మూడు వేలమందికి ఉపాధి అవకాశాలు కల్పించనుందని మారుతి సుజుకీ ఇండియా మేనేజింగ్ కార్యనిర్వహణాధికారి (హెచ్ఆర్, ఆర్థికం, ఐటీ)ఎస్‌వై సిద్దీఖీ శుక్రవారం కోలకతాలో మీడియాకు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 19 Feb 2010 | 6:11 am అమ్మకాల ఒత్తిడి: నష్టాల్లో స్టాక్ మార్కెట్దేశీయ రియాల్టీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, శుక్రవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో 173 పాయింట్లు క్షీణించి, 16,154 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 56 పాయింట్లు కోల్పోయి, 4831 పాయింట్లు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 19 Feb 2010 | 6:01 am భారత్‌లో వ్యాపారం ప్రారంభిస్తాం: ఫ్రెంచ్ రిటైలర్ కేర్ఫోర్భారతదేశంలోని రిటైల్ వ్యాపార రంగంలో అగ్రగాములుగానున్న పలు సంస్థలలో తమ సంస్థ భాగస్వామ్యాన్ని పొందేందుకు అనుగుణంగా పలు వ్యాపర సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ రిటైల్ వ్యాపార సంస్థ అయిన కేర్‌ఫోర్ సంస్థ తెలిపింది.Source: Yahoo! Telugu: News | 19 Feb 2010 | 5:57 am దలైలామాతో భేటీ: ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం: చైనాటిబెట్ బౌద్ధమత గురువు దలైలామాతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భేటీ కావడాన్ని చైనా తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది చైనా-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతుందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మా జాక్సూ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.Source: Yahoo! Telugu: News | 19 Feb 2010 | 5:49 am "కళాతపస్వి" విశ్వనాథ్ పుట్టినరోజు శుభాకాంక్షలువెండితెరపై జీవితాలను అందించి ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న 'కళాతపస్వి' విశ్వనాథ్ పుట్టినరోజు ఫిబ్రవరి 19, 1930. 1960లో సినీ దర్శకులుగా తన కెరీర్‌ను ప్రారంభించిన విశ్వనాథ్ తెలుగు ప్రేక్షకులకు ఆణిముత్యాల్లాంటి ఎన్నో చిత్రాలను అందించారు.తొలి చిత్రాలు అంతగా పేరు తీసుకురాకపోయనప్పటికీ ఆ తర్వాత దృశ్యరూప కావ్యాల్లాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించి మురిపించారు. అందులో జీవన జ్యోతి, శంకరాభరణం, సప్తపది, శుభలేఖ, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శృతి లయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, స్వాతి కిరణం, ఆపద్భాందవుడు, శుభ సంకల్పం, స్వరాభిషేకం వంటి చిత్రాలను అందించారు. కళాతపస్వి ఇంకా మరిన్ని దృశ్యకావ్యాలను అందించాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెపుదాం...Source: Yahoo! Telugu: Entertainment | 19 Feb 2010 | 5:17 am నృత్య దర్శకుడుగా దర్శకరత్న డాక్టర్ దాసరికథా రచయితగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన డాక్టర్ దాసరి నారాయణరావు స్క్రీన్ ప్లే రచయితగా, గీత రచయితగా, సంభాషణల రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఇలా అంచెలంచెలుగా ఎదిగి సినిమా పరిశ్రమలోని అందరివాడయ్యారు. ఎన్నో ఎన్నెన్నో మంచి పనులు చేస్తూ అందరి అభినందనలు అందుకున్నారు. నాడు అంతా కొత్త వారితో "స్వర్గం నరకం" చిత్రం చేసి ఎందరినో పరిచయం చేసిన ఆయన ఇప్పుడు మళ్లీ 81మంది అంతా కొత్తవారిని పరిచయం చేస్తూ 'యంగ్ ఇండియా'ను రూపొందిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 19 Feb 2010 | 4:50 am విధి విధానాలు మార్చే ప్రసక్తే లేదు: మంత్రి మొయిలీఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులపై అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపేందుకు ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలను మార్చే ప్రసక్తే లేదని కేంద్ర న్యాయ శాఖామంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. దీనిపై ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. విధి విధానాలను వ్యతిరేకిస్తూ తమ పదవులకు రాజీనామా చేసిన వారికి ఒక్కటే చెప్పామన్నారు. తక్షణం రాజీనామాలు వెనక్కి తీసుకుని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి సహకరించాలని కోరినట్టు చెప్పారు.Source: జాతీయ | 19 Feb 2010 | 2:45 am అసెంబ్లీని కుదిపేసిన కడప ఎరువుల కుంభకోణం!రాష్ట్ర అసెంబ్లీలో కడప జిల్లాలో చోటు చేసుకున్న ఎరువుల కుంభకోణంపై తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. దీనిపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. అయితే స్పీకర్ చర్చకు నిరాకరించడంతో తెలుగుదేశం, ప్రజారాజ్యం, వామపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.Source: ఏపీ న్యూస్ | 19 Feb 2010 | 1:26 am శివసేన రాజనీతి అర్థకావడం లేదు: నటుడు షారూక్శివసేన పార్టీ రాజనీతి తనకేమాత్రం అర్థం కావడం లేదని బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ అభిప్రాయపడ్డారు. తన తాజా చిత్రం "మై నేమ్ ఈజ్ ఖాన్" చిత్రంలో ఏదైనా సన్నివేశం వారికి అభ్యంతరకరంగా ఉంటే మాత్రం వారికి క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు షారూక్ వెల్లడించారు.Source: జాతీయ | 19 Feb 2010 | 1:10 am నక్సలైట్ల అడ్డాగా మారిన ఉస్మానియా: ప్రభుత్వంరాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నక్సలైట్లకు ఉడ్డాగా మారిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు.. ఉస్మానియా ఘటనపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. అంతేకాకుండా, ఉస్మానియా వర్శిటీ వ్యవహారంపై విచారణ జరపాలని కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది.Source: ఏపీ న్యూస్ | 19 Feb 2010 | 12:45 am హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కక్రూ ప్రమాణం!రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ నిస్సార్ అహ్మద్ కక్రూ శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో కక్రూ చేత రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు.Source: ఏపీ న్యూస్ | 19 Feb 2010 | 12:02 am మీ అందరి మనోభావాలకు అనుగుణంగానే లేఖ: సీఎంరైతు శ్రేయస్సు దృష్ట్యా యూరియా ఎరువుల ధరల పెంపుదలపై ప్రతపక్ష సభ్యుల మనోభావాలకు అద్దంపట్టేలా కేంద్రానికి లేఖ రాయనున్నట్టు ముఖ్యమంత్రి కె.రోశయ్య తెలిపారు. పెంచిన ధరలపై పునరాలోచన చేయాలని అందులో కోరనున్నట్టు సీఎం చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 18 Feb 2010 | 11:52 pm తెలంగాణ ఉద్యమం.. 245 విద్యార్థులపై కేసు: సబితతెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల్లో ఇప్పటి వరకు 245 మందిపై కేసు నమోదు చేసిన రాష్ట్ర హోం శాఖ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గత యేడాది నవంబరు నుంచి ఇప్పటి వరకు ఈ కేసులు నమోదైనట్టు ఆమె తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 18 Feb 2010 | 11:04 pm రాజీనామాలపై తొందరపడ్డామా: కేసీఆర్ అంతర్మథనం!తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతల్లో అంతర్మథనం ప్రారంభమైంది. రాష్ట్ర ఏర్పాటు సాధనలో భాగంగా తమ పదవులకు రాజీనామా చేశారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వాడివేడీగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ వాణీని వినిపించలేక పోయామనే బాధ వారిని పట్టిపీడిస్తోంది.Source: ఏపీ న్యూస్ | 18 Feb 2010 | 11:04 pm మార్చి 31న హర్యానా హైకోర్టు జస్టీస్ ఆస్తుల వెల్లడిపంజాబ్, హర్యానా హైకోర్టులకు చెందిన న్యాయమూర్తులు కూడా మార్చి 31వ తేదీన హైకోర్టు వెబ్‌సైటులో ఉంచనున్నారు. ఈ మేరకు హైకోర్టు పూర్తిస్థాయి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.Source: జాతీయ | 18 Feb 2010 | 9:49 pm పుదువై మంత్రికి హత్యా బెదిరింపు: ఇద్దరి అరెస్టుపుదుచ్చేరి మంత్రి ఎం.కందస్వామికి హత్యా బెదిరింపు వచ్చింది. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఆ రాష్ట్ర పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పుదుచ్చేరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి.Source: జాతీయ | 18 Feb 2010 | 9:42 pm రేపు జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ బహిరంగ ప్రకటన!ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు, వివిధ వర్గాలతో సంప్రదింపులు జరిపేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ బహిరంగ ప్రకటన శనివారం విడుదల కానుంది. స్థానిక పత్రికలతో పాటు జాతీయ స్థాయి మీడియాలోనూ ఈ ప్రకటనను వెల్లడించనున్నారు.Source: జాతీయ | 18 Feb 2010 | 9:41 pm రాజకీయాలు వద్దు బాబోయ్: జూనియర్ ఎన్టీఆర్గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పాలనా పగ్గాలు కట్టబెట్టేందుకు ఊరూరా తిరిగిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తనకు రాజకీయాల వాసనే సరిపడటం లేదని అంటున్నాడట. అయినా రాజకీయాల గురించి కాస్త వయసు మళ్లిన తర్వాత ఆలోచిస్తానంటున్నాడట. స్వర్గీయ ఎన్టీఆర్ మనవడిగా ఆయన నట వారసత్వాన్ని అందుకున్నందుకు తొలుత నటనలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించి తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్న తర్వాత రాజకీయాల వైపు తొంగి చూస్తానని చెపుతున్నాడట. సడెన్‌గా జూనియర్ ఎన్టీఆర్‌లో ఈ మార్పు రావడానికి కారణం ఏమిటోనని ఫిలిమ్ నగర్ వర్గాలు ఆరా తీయగా వారికి ఓ విషయం బోధపడిందట. అదేమంటే... ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నవారు ఒకవైపు తెలంగాణా... మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమాల సెగతో వేడెక్కిపోతున్నారు. "ఎందుకొచ్చిన రాజకీయాలు బాబోయ్..." అని తలలు పట్టుకుని ఇంట్లో కూచుంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 18 Feb 2010 | 9:04 am తెలంగాణ నిజమైన ద్రోహి కేసీఆర్: మంత్రి నాగేందర్!తెలంగాణ నిజమైన ద్రోహి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ ఆరోపించారు. ఆయన గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి పదే పదే విమర్శించడాన్ని ఆయన ఆక్షేపించారు.Source: ఏపీ న్యూస్ | 18 Feb 2010 | 6:46 am ఓయూ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం చీవాట్లు!ఉస్మానియా విశ్వవిద్యాలయ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. విశ్వవిద్యాలయంలో పోలీసు బలగాలను మొహరించడాన్ని తప్పుబట్టింది. ఈ బలగాలను ఎవరిని అడిగి మొహరించారంటూ ప్రశ్నించింది. దీనిపై శుక్రవారంలోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది.Source: ఏపీ న్యూస్ | 18 Feb 2010 | 6:46 am మరోసారి పీకల్లోతు ప్రేమలో ఆర్తీ అగర్వాల్సినిమాలపైన ఉన్న మోజుకొద్దీ భర్తను వదిలేసి టాలీవుడ్‌కు చేరిన ఆర్తీ అగర్వాల్ తాజాగా విలన్ పాత్రల్లో నటించే ముకుల్ ఆనంద్‌తో రొమాన్స్ సాగిస్తోందని టాలీవుడ్ కోడై కూస్తోంది. అంతేకాదు ముకుల్ ఆనంద్ నివాసముంటున్న ముంబయికు తన మకాన్ని మార్చేసిందని కూడా అంటున్నారు. ముంబయిలో అయితే తమ ప్రేమకు అడ్డూఆపు ఉండదన్న యోచనలో ఆర్తీ బాలీవుడ్ చెక్కేయడానికి సిద్ధమైందని చెపుతున్నారు. ముకుల్ ఆనంద్- ఆర్తీల మధ్య చిగురించిన ప్రేమ ఫలితమే నీలవేణి చిత్రంలో లిప్ టు లిప్ కిస్ అని టాలీవుడ్ సినీజనం అంటున్నారు. దీనికి బలాన్ని చేకూర్చే విధంగా ఆర్తీ అగర్వాల్ ముకుల్ ఆనంద్‌తో కలిసి లేట్‌నైట్ పార్టీలకు వెళ్లి వస్తోందట. ఈ విషయం ఆర్తీ తండ్రికి తెలియడంతో ఇంట్లో పెద్ద గొడవ కూడా జరిగిందట.Source: Yahoo! Telugu: Entertainment | 18 Feb 2010 | 5:19 am రామమందిర నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం: గడ్కారీభారతీయ జనతా పార్టీ లక్ష్యాల్లో ఒకటైన రామమందిర నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నట్టు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ స్పష్టం చేశారు. దేశంలోని హిందు ముస్లింల మధ్య సఖ్యత నెలకొనాలంటే రామమందిర నిర్మాణంతోనే సాధ్యమవుతుందని అందువల్ల ముస్లిం సమాజం ఇందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.Source: జాతీయ | 18 Feb 2010 | 4:19 am తొమ్మిది మంది గాయకులు పాల్గొనే రెహ్మానియాఆస్కార్, గ్రామీ అవార్డుల గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్‌కు భారీ సన్మానం జరుగుంది. ఆయన స్థాపంచిన ఏఆర్.రెహ్మాన్ ఫౌండేషన్‌కు నిధుల సేకరణ నిమిత్తం సంగీత విభావరి నిర్వహించనున్నారు. ఇందులో తొమ్మిది మంది గాయనీ గాయకులు కలిసి రెహ్మానియా అనే సంగీత కచ్చేరి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రెహ్మాన్‌ను కూడా సన్మానిస్తారు.Source: Yahoo! Telugu: Entertainment | 18 Feb 2010 | 3:34 am రాజీనామాలు చేయంగాక... చేయం: కె.జానారెడ్డితమ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామా చేసే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కె.జానారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి సొంతగా తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ జేఏసీకి ఆపాదించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 18 Feb 2010 | 3:07 am మిస్టర్ కోదండరామ్.. నోరు జాగ్రత్త: మహిళా మంత్రులుతెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళా మంత్రులకు కోపం వచ్చింది. తెలంగాణ లక్ష్య సాధనలో భాగంగా రాజీనామా చేయని మంత్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు చేయాలని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస) కన్వీనర్ ఆచార్య కోదండరామ్ పిలుపునివ్వడంపై వారు మండిపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 18 Feb 2010 | 3:00 am ఆసీస్ క్రికెటర్ల వ్యవహారంపై వెనక్కి తగ్గిన శివసేనఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొనే ఆస్ట్రేలియా క్రికెటర్లను భారత గడ్డపై ఆడనివ్వబోమని శివసేన చేసిన హెచ్చరికలపై ఆ పార్టీ చీఫ్ బాల్‌థాక్రే వెనక్కి తగ్గారు. భారత గడ్డపైకి ఎవరు వచ్చినా తాము ఆపబోమని ఆయన తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.Source: జాతీయ | 18 Feb 2010 | 1:42 am
|