చిరు ఒక్కసారి నమ్మితే... జీవితాంతం నమ్మినట్లు లెఖ్ఖ!!

మెగాస్టార్‌గా ఇండస్ట్రీలో వెలిగిన చిరంజీవి ఎవరైనా సమస్యల్లో ఉన్నవారిని చూస్తే కరిగిపోవడం ఎక్కువే. అంతేకాదు ఆయనను ఎవరైనా బుట్టలో ఈజీగా వేసేయవచ్చని ఆయన సన్నిహితులు చెపుతారు. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే... చిరంజీవి రక్త సంబంధీకులకు మాత్రం చేయి చూపిస్తారని ఇండస్ట్రీ టాక్.
Source: Yahoo! Telugu: News | 17 Feb 2010 | 12:48 pm

విడుదలకు సిద్ధమవుతున్న జాయ్, గ్లామర్

శంకర్ దాదా ఫేమ్ కరిష్మాకొటక్ ప్రధాన పాత్రధారిగా పి. సత్యారెడ్డి నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గ్లామర్. ఇందులో పి. సత్యారెడ్డి ప్రత్యేక పాత్రను పోషించారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. కాగా సినిమా రంగంపై సరైన అవగాహన లేకుండా వచ్చేవారికి ఈ చిత్రం డిక్షనరీగా ఉపయోగపడుతుందన్న అభిప్రాయాన్ని చిత్ర సమర్పకుడు ఎస్ఎన్ రెడ్డి వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Feb 2010 | 11:33 am

లాభాలతో ముగిసిన బాంబే స్టాక్ మార్కెట్

బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభాలతో ఆరంభమైన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 254 పాయింట్లు పుంజుకుని 16,481 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 58 పాయింట్లు బలపడి, 4,914 పాయింట్ల వద్ద ముగిసింది.
Source: Yahoo! Telugu: News | 17 Feb 2010 | 11:05 am

"సత్యం" రాజును విచారించేందుకు ప్రత్యేక కోర్టు

నిరుడు జనవరిలో తన సంస్థ దివాళా తీసిందని ప్రకటించిన సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగరాజు తదితరుల కేసును త్వరతిగతిన విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు
Source: Yahoo! Telugu: News | 17 Feb 2010 | 11:02 am

ఫిబ్రవరి 26న జగపతి బాబు, ప్రియమణిల "సాధ్యం"

జగపతిబాబు, ప్రియమణి జంటగా రూపొందుతోన్న చిత్రం సాధ్యం. ఈ చిత్రాన్ని కుమార్ బ్రదర్స్ సినిమా పతాకంపై కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిర్మాణానంతర పనులను తుదిదశలో ఉన్న ఈ చిత్రం ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... "వైవిద్యమైన కథ, కథనాలతో రూపొందుతోన్న చిత్రమిది. 'ఆది' చిత్రం ఫేమ్ కీర్తిచావ్లా కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఇప్పటివరకూ జగపతిబాబు, ప్రియమణిలు తమ కెరీర్‌లో పోషించనటువంటి భిన్నమైన పాత్రలను ఇందులో చేస్తున్నారు. చిన్న చరణ్ సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలకు మంచి స్పందన వస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Feb 2010 | 10:49 am

ఒబామా, దలైలామా సమావేశం బహిరంగంగా జరగదు

టిబెట్ మతప్రబోధకుడు దలైలామా, అమెరికా అధ్యక్షుడు ఒబామా బహిరంగంగా సమావేశమయ్యే సూచనలు లేవని అమెరికా అభిప్రాయపడుతోంది.
Source: Yahoo! Telugu: News | 17 Feb 2010 | 10:39 am

శోభారాణి ఇంటిపై దాడులు చేసిన తెలంగాణ వాదులు

ప్రజారాజ్యం పార్టీ మహిళానేత శోభారాణి ఇంటిపై బుధవారం మధ్యాహ్నం తెలంగాణ వాదులు దాడులు చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఆమె పని చేస్తున్నారని తెలంగాణ వాదులు ఆరోపిస్తూ ఈ దాడులకు పాల్పడ్డారు.
Source: Yahoo! Telugu: News | 17 Feb 2010 | 10:19 am

ఉద్యోగులను తొలగించనున్న ఫోర్డ్

నిరుడు తమ సంస్థకు చెందిన వాహన అమ్మకాలలో తగ్గుదల కనపడటంతో ఈ ఏడాది తమ సంస్థలోని ఉద్యోగులను తొలగించనున్నట్లు కార్ల నిర్మాణ కంపెనీ అయిన ఫోర్డ్ కంపెనీ ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 17 Feb 2010 | 9:57 am

టెర్రరిస్టులు ప్రభుత్వాన్ని శాసించలేరు: చిదంబరం

దేశంలో జరగబోయే ప్రపంచ హాకీ కప్ పోటీలకు తమ ప్రభుత్వం గట్టి భద్రతా ఏర్పాట్లను చేసిందని, ప్రభుత్వ చట్టాలను శాసించలేరని కేంద్ర హోం శాఖామంత్రి పి చిదంబరం బుధవారం న్యూ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు
Source: Yahoo! Telugu: News | 17 Feb 2010 | 8:59 am

తమన్నా ఛాన్సును తన్నుకెళ్లిన బిందాస్ బేబీ

"వెళ్లవయ్యా వెళ్లూ..." అంటూ సదా తన తొలిచిత్రంలో తెలుగు ప్రేక్షకుల చూపును తనవైపు తిప్పుకుంది. ఇపుడేమో "సచ్చినోడా... నా ఇమేజ్ అంతా డ్యామేజ్ చేశావు కదరా.." అంటూ బిందాస్‌లో తిట్ల పురాణం ఎత్తుకున్న అందమైన పిల్ల షీనా షహాబది టాలీవుడ్ స్పెషల్ ఎట్రాక్షన్ అవుతోంది. ఈ అమ్మడిలో హావభావాలతోపాటు అందంకూడా కావవల్సినంత ఉండటంతో దర్శక నిర్మాతలు తమ తదుపరి చిత్రాల్లో బుక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.అయితే ఈ తార ముఖంలో అంత ఎట్రాక్షన్ లేకపోయినా ముఖానికి కిందనున్న శరీర సౌష్టవాలతో టీనేజ్ కుర్రకారును కట్టిపడేసిందని టాలీవుడ్ సినీ విశ్లేషకులు అంటున్నారు. ఒకవిధంగా ఇలియానా గ్లామర్ కూడా ఇలాంటిదేనని ఉదాహరణలు కూడా చెప్పేస్తున్నారు. ఇదిలావుంటే రాకరాక తమన్నాకు అల్లు అర్జున్ సరసన అవకాశం వస్తే.. దాన్ని కాస్తా ఈ పిల్ల గద్దలా తన్నుకుపోయిందని టాలీవుడ్‌లో అనుకుంటున్నారు. అంతేకాదండోయ్ ఈ అమ్మడు రేటు కూడా చాలా తక్కువట. అందరికంటే చాలా తక్కువ మొత్తాన్ని డిమాండ్ చేస్తోందట. దీంతో నిర్మాతలు షీనాకు అవకాశమిద్దామంటూ సిఫార్సులు చేస్తున్నారట. టాలీవుడ్ తారలు.. మీ అవకాశాలను కూడా తన్నుకెళ్తుందేమో... బిందాస్ బేబీతో జాగ్రత్త.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Feb 2010 | 8:49 am

భారీ లాభాల దిశగా బాంబే స్టాక్ మార్కెట్

బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాల దిశగా పయనిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే వృద్ధి బాటలో కొనసాగుతోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో వృద్ధి బాటలో పయనిస్తూ.. 16వేల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా ఐదు వేల మార్కును దరిదాపుల్లో ర్యాలీని కొనసాగిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 17 Feb 2010 | 8:22 am

మాంద్యం నుంచి బయటపడ్డ జౌళి పరిశ్రమ: మారన్

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం నుంచి దేశీయ జౌళి పరిశ్రమ బయటపడిందని కేంద్ర జౌళి పరిశ్రమ శాఖామంత్రి దయానిధి మారన్ బుధవారం న్యూ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 17 Feb 2010 | 8:21 am

స్పందించని రాజకీయ పార్టీలు: ఉనికి కోల్పోయిన టీజేఏసీ?!!

తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) తన ఉనికిని కోల్పోయిందా? రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తెలంగాణ ప్రాంతంలోని అన్ని రాజకీయ పార్టీలు ఐక్యమై ఏర్పాటు చేసిన సంస్థ ఐక్య కార్యాచరణ సమితి. ఈ కమిటీ మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంలో పడింది.
Source: Yahoo! Telugu: News | 17 Feb 2010 | 8:18 am

నాగార్జున "కేడి" సినిమా ట్రైలర్‌ మీ కోసం..

కింగ్ నాగార్జున, మమతా మోహన్ దాస్ కాంబినేషన్లో నూతన దర్శకుడు కిరణ్ రూపొందించిన చిత్రం "కేడి". ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి కామాక్షి కళామూవీస్ పతాకంపై నిర్మించిన ఈ భారీ సినిమా "కేడి" ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రంపై ఫిలిమ్ నగర్ వర్గాల్లో ఏమనుకుంటున్నారంటే..? మొత్తానికి ఫైనల్‌గా ఫ్లాఫ్ టాక్‌తో సెటిలయ్యిందని చెవులు కొరుక్కుంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Feb 2010 | 7:20 am

చిరు ఒక్కసారి నమ్మితే... జీవితాంతం నమ్మినట్లు లెఖ్ఖ!!

మెగాస్టార్‌గా ఇండస్ట్రీలో వెలిగిన చిరంజీవి ఎవరైనా సమస్యల్లో ఉన్నవారిని చూస్తే కరిగిపోవడం ఎక్కువే. అంతేకాదు ఆయనను ఎవరైనా బుట్టలో ఈజీగా వేసేయవచ్చని ఆయన సన్నిహితులు చెపుతారు. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే... చిరంజీవి రక్త సంబంధీకులకు మాత్రం చేయి చూపిస్తారని ఇండస్ట్రీ టాక్.
Source: ఏపీ న్యూస్ | 17 Feb 2010 | 7:19 am

"ఆకాశరామన్న"ను ట్రైలర్లో తిలకించండి.

అల్లరినరేష్, శివాజీ, రాజీవ్ కనకాల హీరోలుగా, మీరాజాస్మిన్, గౌరిపండిట్ హీరోయిన్లుగా నటించిన చిత్రం "ఆకాశరామన్న". "ఫ్లాష్‌న్యూస్" ఫేం అశోక్ దర్శకత్వం వహించగా, మన్యం సూర్యనారాయణ సమర్పణలో.. మన్యం రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి మన్యం రమేష్ మాట్లాడుతూ.. పూర్తి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Feb 2010 | 6:52 am

"సత్యం" రాజును విచారించేందుకు ప్రత్యేక కోర్టు

నిరుడు జనవరిలో తన సంస్థ దివాళా తీసిందని ప్రకటించిన సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగరాజు తదితరుల కేసును త్వరతిగతిన విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు
Source: ఏపీ న్యూస్ | 17 Feb 2010 | 5:33 am

శోభారాణి ఇంటిపై దాడులు చేసిన తెలంగాణ వాదులు

ప్రజారాజ్యం పార్టీ మహిళానేత శోభారాణి ఇంటిపై బుధవారం మధ్యాహ్నం తెలంగాణ వాదులు దాడులు చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఆమె పని చేస్తున్నారని తెలంగాణ వాదులు ఆరోపిస్తూ ఈ దాడులకు పాల్పడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 17 Feb 2010 | 5:06 am

టెర్రరిస్టులు ప్రభుత్వాన్ని శాసించలేరు: చిదంబరం

దేశంలో జరగబోయే ప్రపంచ హాకీ కప్ పోటీలకు తమ ప్రభుత్వం గట్టి భద్రతా ఏర్పాట్లను చేసిందని, ప్రభుత్వ చట్టాలను శాసించలేరని కేంద్ర హోం శాఖామంత్రి పి చిదంబరం బుధవారం న్యూ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు
Source: జాతీయ | 17 Feb 2010 | 3:30 am

తమన్నా ఛాన్సును తన్నుకెళ్లిన బిందాస్ బేబీ

"వెళ్లవయ్యా వెళ్లూ..." అంటూ సదా తన తొలిచిత్రంలో తెలుగు ప్రేక్షకుల చూపును తనవైపు తిప్పుకుంది. ఇపుడేమో "సచ్చినోడా... నా ఇమేజ్ అంతా డ్యామేజ్ చేశావు కదరా.." అంటూ బిందాస్‌లో తిట్ల పురాణం ఎత్తుకున్న అందమైన పిల్ల షీనా షహాబది టాలీవుడ్ స్పెషల్ ఎట్రాక్షన్ అవుతోంది. ఈ అమ్మడిలో హావభావాలతోపాటు అందంకూడా కావవల్సినంత ఉండటంతో దర్శక నిర్మాతలు తమ తదుపరి చిత్రాల్లో బుక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Source: వినోదం | 17 Feb 2010 | 3:20 am

ఉస్మానియా క్యాంపస్‌ను పోలీస్ క్యాంపస్‌గా మార్చారు

రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా క్యాంపస్‌ను పోలీస్ క్యాంపస్‌గా మార్చేసిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉస్మానియా ఘటనపై హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన వివరణపై నాగం అసంతృప్తి వ్యక్తం చేస్తూ... దాడి సంఘటన ఎందుకు జరిగిందన్న వివరాలను ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 17 Feb 2010 | 1:52 am

కోర్టులు సీబీఐకి ఆదేశాలివ్వవచ్చు: సుప్రీం కోర్టు

రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఏదైనా సమస్యపై పరిశోధించేందుకు సీబీఐని స్థానిక రాష్ట్ర హై కోర్టులు ఆదేశించవచ్చని సుప్రీం కోర్టు బుధవారం సంచలనాత్మకమైన తీర్పు చెప్పింది
Source: జాతీయ | 17 Feb 2010 | 1:35 am

రెచ్చగొడుతున్నది రాజకీయ పార్టీలే: జయప్రకాష్

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ఆయా రాజకీయ పార్టీలే కారణమని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ... కేవలం చేతలతోనే ఉద్రిక్త పరిస్థితులు వస్తాయని అనుకుంటో పొరపాటనీ, మాటలతో కూడా రెచ్చగొట్టే పరిస్థితి ఉన్నదని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 17 Feb 2010 | 1:34 am

విద్యార్థుల రాళ్ల దాడివల్లే లాఠీ చార్జి: సబిత ఇంద్రారెడ్డి

ఉస్మానియా యూనివర్శిటీ ఘటనలో విద్యార్థులు సహనం కోల్పోయి పోలీసులపై రాళ్లదాడి చేయడం వల్లనే లాఠీచార్జి చేయాల్సి వచ్చిందని రాష్ట్ర హోం శాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జరిగిన ఘటనలో విద్యార్థులతోపాటు పోలీసులు కూడా గాయపడ్డారని తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 17 Feb 2010 | 1:10 am

తెలంగాణా తెచ్చేది మనమేనని చెప్పండి: డీఎస్

ప్రత్యేక తెలంగాణాను తీసుకురాగల సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉన్నదన్న విషయాన్ని తెలంగాణా ప్రాంత ప్రజలలోకి సమర్థవంతంగా తీసుకుని వెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 17 Feb 2010 | 12:10 am

కనీసం దోమలను కూడా అరికట్టలేకపోతున్నారు: బాబు

రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో కనీస వైద్య సౌకర్యాలు మృగ్యమయ్యాయని, గిరిజన ప్రాంత ప్రజల గోడును పట్టించుకునే వారే కరవయ్యారని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ... గిరిజన ప్రాంతాల్లో డెంగ్యూ వంటి భయంకర వ్యాధులతో ఎందరో మృత్యువాత పడుతున్నారని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 16 Feb 2010 | 11:50 pm

సభ వాయిదా పడటానికి ప్రభుత్వ వైఫల్యమే: తెదేపా

శాసనసభలో ప్రజా సమస్యలు చర్చించాల్సిన సభ్యులు శాసనసభ సజావుగా సాగకపోవడానికి కారణం ప్రభుత్వం వైఫల్యాలే ప్రధాన కారణమని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.
Source: ఏపీ న్యూస్ | 16 Feb 2010 | 11:02 pm

రాష్ట్రంలో ముస్లింలకు రక్షణ కల్పించండి: ఎంఐఎం

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయని, దీంతో ఈ ఉద్యమాల నుంచి అమాయకులైన ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ బుధవారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు
Source: ఏపీ న్యూస్ | 16 Feb 2010 | 10:44 pm

నదిలో పడ్డ బస్సు: ఏడుగురి మృతి, పలువురి గల్లంతు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జలౌన్‌ జిల్లా మహారాజ్‌పూర్‌ వద్ద పెళ్లి బృందాన్ని తీసుకుని వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి నదిలో పడిపోవడంతో ఏడుగురు ప్రయాణీకులు మృతి చెందారు. మరో 25మంది పైగా గల్లంతయ్యారు.
Source: జాతీయ | 16 Feb 2010 | 9:58 pm

బోఫోర్సు కేసులో సవరణ పిటిషన్‌ వేయండి: సుప్రీం

బోఫోర్సు కుంభకోణం కేసులో సవరణ పిటిషన్‌ దాఖలు చేయాలంటూ పిటిషన్‌దారుకు సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది
Source: జాతీయ | 16 Feb 2010 | 9:40 pm

పుణె, ముంబై పేలుళ్ళు ఒకటిగానే ఉన్నాయి: ఐజీ

గత శనివారం పుణెలో జరిగిన పేలుళ్ళు, 26/11న ముంబైలో జరిగిన పేలుళ్ళు ఒకేవిధంగానే ఉన్నాయని మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.
Source: జాతీయ | 16 Feb 2010 | 9:02 pm