|
నక్సల్స్‌తో చర్చలకు సిద్ధం: జార్ఖండ్ సీఎం సోరేన్రాష్ట్రంలో శాంతి స్థాపన కోసం నక్సలైట్లతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శిబూ సోరేన్ తెలిపారు. ఇందుకోసం నక్సలైట్లు కూడా చొరవ చూపాలని ఆయన పిలుపునిచ్చారు.Source: Yahoo! Telugu: News | 15 Feb 2010 | 8:39 am నష్టాల బాటలో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్సోమవారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల బాటలో పయనిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులతో కొనసాగిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 16,086 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 18 పాయింట్ల స్వల్ప నష్టంతో 4,808 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 15 Feb 2010 | 8:25 am 8.56 శాతానికి చేరుకున్న జనవరి ద్రవ్యోల్బణంచక్కెర, బంగాళా దుంపల టోకు ధరల్లో నిరంతరం పెరుగుల కనపడటంతో టోకు ద్రవ్యోల్బణం జనవరి నెలలో 8.56 శాతానికి చేరుకుంది. అదే సాధారణ ధరలలో మార్పులు సంభవించి స్వల్పంగా ధరలు పెరుగుతాయని, ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి వరకుంటుందని భారీతీయ రిజర్వ్ బ్యాంకు ఇటీవలే అభిప్రాయపడింది. అదే నిరుడు డిసెంబరులో ద్రవ్యోల్బణం 7.31 శాతంగా ఉండింది.Source: Yahoo! Telugu: News | 15 Feb 2010 | 7:31 am తనకు తానుగా "వాత" పెట్టుకున్న తెరాస?!!ఇప్పటి వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో తామే హీరోలమని తెలంగాణా రాష్ట్ర సమితి నేతలూ ప్రగల్భాలు పలుకుతూ వచ్చారు. ఈ విషయంతో ప్రజల అభీష్టాన్ని అసెంబ్లీలో వినిపించేందుకు తమ వద్ద ఉన్న ఏకైక ఆయుధాన్ని కోల్పోయారు. ఈ అనాలోచిత చర్య వల్ల సోమవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తెరాస వాణిని వినిపించే సభ్యుడే లేకుండా పోయారు.Source: Yahoo! Telugu: News | 15 Feb 2010 | 7:26 am అమ్మకాల ఒత్తిడి: నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీబ్యాంక్, రియాల్టీ, ఎఫ్ఎమ్‌సీజీ, ఆయిల్, గ్యాస్, పవర్ వంటి దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయింది. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 115 పాయింట్లు క్షీణించి, 16,037 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 31 పాయింట్లు పతనమై, 4,795 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 15 Feb 2010 | 7:21 am ప్రొఫెసర్లూ.. ఇవేనా మీరు బోధించిన పాఠాలు: లగడపాటితెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్లు జయశంకర్, కోదండరామ్‌లు విద్యార్థులను రెచ్చగొడుతున్నారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆరోపించారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన వీరు.. వారిని మరోలా తయారు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.Source: Yahoo! Telugu: News | 15 Feb 2010 | 7:08 am "మెగాస్టార్" జూ. ఎన్టీఆర్: పగలబడి నవ్వుతున్న చిరు ఫ్యాన్స్మెగాస్టార్ అంటే చటుక్కున గుర్తుకు వచ్చేది ఎవరూ... అంటే చిన్న పిల్లాడి దగ్గర్నుంచి వృద్ధుల వరకూ చెప్పే మాట చిరంజీవి అనే. కానీ ఆయనకున్న ఆ మెగాస్టార్ ఇమేజ్ ట్యాగ్ లైన్‌ను ఓ దినపత్రిక జూనియర్ ఎన్టీఆర్‌కు తగిలిస్తూ వార్త రాసింది. ఈ వార్తను చూసిన మెగాస్టార్ చిరంజీవి అభిమానులు విరగబడి నవ్వుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌తో జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్‌ను పోల్చి చెప్పడాన్ని అత్యంత హాస్యాస్పదమైన అంశంగా కొట్టిపారేస్తున్నారు. అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం మా జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్‌ను మించిపోయి చాన్నాళ్లయిందనీ వాదిస్తున్నారు. ఇదిలావుంటే ఫ్యాన్స్ మధ్య లేనిపోని ఇమేజ్ గొడవలు సృష్టించటం తగదని సినీ విశ్లేషకులు అంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 15 Feb 2010 | 6:40 am పూణే పేలుళ్ళకు సమాచార లోపమే కారణమా!గత శనివారం రాత్రి పూణేలో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ళకు కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థల మధ్య సమాచారం లోపించిందనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. అయితే, దీనిపై కేంద్ర నిఘా వర్గాలు మాత్రం పెదవి విప్పడం లేదు.Source: Yahoo! Telugu: News | 15 Feb 2010 | 6:23 am గ్లోబల్ వార్మింగ్‌తో తగ్గనున్న వరి ఉత్పత్తులుప్రపంచవ్యాప్తంగా నెలకొన్న గ్లోబల్ వార్మింగ్‌తో రానున్న రోజుల్లో వరి ఉత్పత్తులు విపరీతంగా తగ్గే అవకాశాలున్నాయని అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం (ఐఆర్‌ఆర్‌ఐ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అబిమ్ డాబర్‌మాన్ అన్నారు.Source: Yahoo! Telugu: News | 15 Feb 2010 | 6:13 am విదేశీ మార్కెట్ల ప్రభావం: నష్టాల్లో స్టాక్ మార్కెట్అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి క్షీణించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 96 పాయింట్లు పడిపోయి, 16,056 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 30 పాయింట్లు కోల్పోయి, 4,796 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 15 Feb 2010 | 6:04 am నాటో దళాల క్షిపణి దాడులు: 12 మంది పౌరుల మృతి!ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ల ప్రాబల్య ప్రాంతంలో నాటో దళాలు దాడులను ముమ్మరం చేశాయి. ఈ దళాలు ఆదివారం నిర్వహించిన క్షిపణి దాడులు గురి తప్పి, జనావాస ప్రాంతాల్లో పడ్డాయి. దీంతో 12 మంది ఆఫ్ఘన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.Source: Yahoo! Telugu: News | 15 Feb 2010 | 6:00 am మార్చిలో ఉపేంద్ర, దీపికా పడుకునేల "కంత్రీ మొగుడు"ఉపేంద్ర కన్నడంలో నటించిన "ఐశ్వర్య" చిత్రాన్ని తెలుగులో "కంత్రీ మొగుడు"గా అనువదిస్తున్నారు. ఇంద్రజిత్ వెంకటేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శ్రీ ఉమామహేశ్వర ఫిలింస్‌పై రూపకుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ కథానాయిక దీపికా పడుకునే హీరోయిన్‌గా నటించింది.శరవణా మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదలైంది. భారతీబాబు ఐదు పాటలు రచించగా, కుంచెరఘు, రవివర్మ, శ్రీలేఖలు ఈ పాటలను ఆలపించారు. క్లాస్, మాస్‌ను ఆకట్టుకునే చిత్రమిదని, కన్నడం తరహాలా తెలుగులో మంచి విజయాన్ని సాధిస్తుందని నిర్మాత రూపకుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 15 Feb 2010 | 5:32 am నక్సల్స్‌తో చర్చలకు సిద్ధం: జార్ఖండ్ సీఎం సోరేన్రాష్ట్రంలో శాంతి స్థాపన కోసం నక్సలైట్లతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శిబూ సోరేన్ తెలిపారు. ఇందుకోసం నక్సలైట్లు కూడా చొరవ చూపాలని ఆయన పిలుపునిచ్చారు.Source: జాతీయ | 15 Feb 2010 | 3:10 am ప్రొఫెసర్లూ.. ఇవేనా మీరు బోధించిన పాఠాలు: లగడపాటితెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్లు జయశంకర్, కోదండరామ్‌లు విద్యార్థులను రెచ్చగొడుతున్నారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆరోపించారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన వీరు.. వారిని మరోలా తయారు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.Source: ఏపీ న్యూస్ | 15 Feb 2010 | 1:39 am పూణే పేలుళ్ళకు సమాచార లోపమే కారణమా!గత శనివారం రాత్రి పూణేలో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ళకు కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థల మధ్య సమాచారం లోపించిందనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. అయితే, దీనిపై కేంద్ర నిఘా వర్గాలు మాత్రం పెదవి విప్పడం లేదు.Source: జాతీయ | 15 Feb 2010 | 12:54 am కాశ్మీర్‌లో తుపాకీ కాల్పులు: ఇద్దరు తీవ్రవాదుల హతం!జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న గుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలకు, తీవ్రవాదులకు మధ్య సోమవారం తీవ్రస్థాయిలో తుపాకీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరు హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థకు చెందిన వారుగా గుర్తించారు.Source: జాతీయ | 15 Feb 2010 | 12:05 am రాజీనామాపై వెనక్కి తగ్గిన సమైక్యాంధ్ర "హీరో"!సమైక్యాంధ్ర హీరో లగడపాటి రాజగోపాల్ అధిష్టానం ఆదేశాలను శిరసావహించారు. తన లోక్‌సభ సభ్యత్వానికి చేసిన రాజీనామాపై వెనక్కి తగ్గారు. రాజీనామాను ఉపసంహరించుకోనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్ మీరా కుమార్ కార్యాలయానికి ఆయన సమాచారం పంపినట్టు వినికిడి. అయితే, లగడపాటి రాజీనామాపై తుది నిర్ణయం స్పీకర్ తీసుకుంటారు.Source: ఏపీ న్యూస్ | 14 Feb 2010 | 11:29 pm వైఎస్ పథకాలు యధావిధిగా కొనసాగింపు: గవర్నర్ప్రజానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను యధావిధిగా కొనసాగిస్తామని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ పునరుద్ఘాటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంగం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దంపట్టేలా సాగింది.Source: ఏపీ న్యూస్ | 14 Feb 2010 | 11:10 pm స్పీకర్ అల్పాహార విందుకు టి ఎమ్మెల్యేలు డుమ్మా!అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను సందర్భంగా సభాపతి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన అల్పాహార విందుకు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సోమవారం ఉదయం జూబ్లీహాల్‌లో ఆయన మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను విందుకు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రోశయ్య, మండలి ఛైర్మన్ చక్రపాణి, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తదితరులు ఈ విందుకు హాజరయ్యారు.Source: ఏపీ న్యూస్ | 14 Feb 2010 | 10:45 pm "మీ అందరికీ.. వందనాలు" అంటూ సాగిన గవర్నర్ ప్రసంగంగౌరవనీయులైన స్పీకర్‌గారికి, గౌరవనీయులైన ఛైర్మన్‌గారు, గౌరవనీయులైన శాసనసభ్యులైన మీ అందరికీ వందనాలు అంటూ.. రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ తన ప్రసంగాన్ని తెలుగులో కొనసాగించారు. ఆ తర్వాత ఆయన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.Source: ఏపీ న్యూస్ | 14 Feb 2010 | 10:41 pm ఆందోళనలు గాంధేయ మార్గంలో ఉండాలి: గవర్నర్ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసే ఆందోళనలు గాంధేయ మార్గంలో శాంతియుతంగా సాగాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహాన్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన సోమవారం ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు.Source: ఏపీ న్యూస్ | 14 Feb 2010 | 10:24 pm 11 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం: స్పీకర్జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలు తెలంగాణకు అనుకూలంగా లేవని పేర్కొంటూ.. సమర్పించిన 15 రాజీనామా లేఖల్లో పదింటిపై స్పీకర్ ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదముద్ర వేశారు. మిగిలిన వాటిపై సంబంధిత సభ్యులతో వ్యక్తిగతంగా మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారుSource: ఏపీ న్యూస్ | 14 Feb 2010 | 8:59 pm పూణే పేలుళ్ళలో విదేశీయులు మరణించలేదు: జీకేపిళ్లైపూణేలో జరిగిన బాంబు పేలుడులో విదేశీయులు ఎవరూ మరణించలేదని కేంద్ర హోం శాఖ కార్యదర్శి జీకే.పిళ్లై స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఏ ఒక్కరినీ ఇంతవరకు గుర్తించలేదని ఆయన ఆదివారం వెల్లడించారు. పూణేలోని కోరేగాన్ పార్క్ సమీపంలో ఉన్న ఒక బేకరీ షాపులో పేలుడు జరుగగా 9 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 14 Feb 2010 | 8:54 pm ఇండో-పాక్ చర్చల అడ్డుకట్టకు తీవ్రవాదుల కుట్ర: కృష్ణభారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఈనెలలో జరుగనున్న విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలకు అడ్డుకట్ట వేసేందుకు తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నారని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ఎం.కృష్ణ అన్నారు. అయితే, పూణే పేలుళ్ల ప్రభావం ఈ చర్చలపై ఉంటుందనే అంశంపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.Source: జాతీయ | 14 Feb 2010 | 8:54 pm సమస్యలను ప్రస్తావించాల్సింది ప్రతిపక్షాలే: స్పీకర్అసెంబ్లీలో ప్రజాసమస్యలను ప్రస్తావించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదేనని రాష్ట్ర శాసనసభాపతి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అసెంబ్లీ కవరేజి విషయంలో మీడియా సంయమనం పాటిస్తే కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.Source: ఏపీ న్యూస్ | 14 Feb 2010 | 7:10 am రాజీనామాలు సమర్పించిన తెలంగాణ ఎమ్మెల్యేలుజస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రాంతానికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు ఆదివారం రాజీనామాలు చేసి రాష్ట్ర శాసనసభాపతికి సమర్పించారు.Source: ఏపీ న్యూస్ | 14 Feb 2010 | 7:08 am ఓయూ విద్యార్థులపై లాఠీఛార్జి జరిపిన పోలీసులుతెలంగాణ ఎమ్మెల్యేలు ఆదివారం చేసిన రాజీనామాలకు మద్దతుగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు విద్యార్థులు కలిసి ర్యాలీ నిర్వహించారు. ఓయూ నుంచి తార్నాకా వైపుకు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకుని లాఠీ చార్జి చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.Source: ఏపీ న్యూస్ | 14 Feb 2010 | 7:07 am ఢిల్లీ, ఇండోర్, కాన్పుర్‌లలో రెడ్ అలర్ట్ : కేంద్రంపుణెలో శనివారంనాడు చోటుచేసుకున్న పేలుళ్ల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీతో సహా ఇండోర్, కాన్పూర్‌లలో కేంద్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది.Source: జాతీయ | 14 Feb 2010 | 6:02 am పుణెలో జరిగిన పేలుళ్ళు దారుణం: అమెరికాపుణెలో శనివారం జరిగిన పేలుళ్ళు హృదయవిదారకమైన ఘటన అని, ఇది చాలా దారుణమని, దీనికి తమ దేశం తరపున సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు భారత్‌లోనున్న అమెరికా దౌత్యాధికారి తిమోతి జె. రోమర్ న్యూ ఢిల్లీలో తెలిపారు.Source: జాతీయ | 14 Feb 2010 | 6:00 am గుజరాత్‌లో కుట్రను భగ్నం చేసిన పోలీసులుగుజరాత్ రాష్ట్రంలోని వాల్సాద్ జిల్లాలో భారీ కుట్రను ఆ రాష్ట్ర పోలీసులు భగ్నం చేశారు. ఆదివారం రాష్ట్రంలోని వాల్సాద్ జిల్లాలోని వాపిలో ఓ ఆటో, ఓ కారులో పోలీసులు భారీగా పేలుడు పదార్ధాలను కనుగొన్నారు.Source: జాతీయ | 14 Feb 2010 | 2:57 am హ్యాకింగ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: రాజుప్రపంచంలో ఇటీవల పలు వెబ్‌సైట్ల హ్యాంకింగ్ జరగడం పరిపాటిగా మారిపోయిందని, కాని తమ ప్రభుత్వం ఇంటర్నెట్ ద్వారా జరిగే హ్యాంకింగ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి ఎంఎం పళ్ళం రాజు విలేకరులకు తెలిపారు.Source: జాతీయ | 14 Feb 2010 | 2:57 am బాంబుపేలుడు ఘటన దురదృష్టకరం: చిదంబరంకేంద్ర హోం మంత్రి చిదంబరం పుణెలోని బాంబుపేలుడు ఘటనా స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. ఘటనపై తీవ్రవాద నిరోధక దళం దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.Source: జాతీయ | 14 Feb 2010 | 2:57 am
|