అలబామా వర్శిటీలో కాల్పులు: ఆంధ్ర ప్రొఫెసర్ మృతి!

అమెరికాలోని అలబామా విశ్వవిద్యాలయం శుక్రవారం తుపాకీ కాల్పుల మోతతో మార్మోగి పోయింది. ఇదే వర్సిటీకి చెందిన మహిళా ప్రొఫెసర్ విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో మన రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్‌తో పాటు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఇండో-అమెరికా సంతతికి చెందిన గోపి పొదిళ్ళగా గుర్తించినట్టు హంట్స్ విల్లే పోలీసు అధిపతి హెన్రీ రియాజ్ తెలిపారు. ఈయన జీవశాస్త్ర ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 13 Feb 2010 | 8:58 am

అందరి మనోభావాలకు అనుగుణంగానే..: శ్రీకృష్ణ కమిటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల మనోభావాలకు అనుగుణంగానే కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ పని చేస్తుందని ఆ కమిటీ ఛైర్మన్ జస్టీస్ శ్రీకృష్ణ తెలిపారు. ఈ కమిటీ తొలి సమావేశం శనివారం ఉదయం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగింది. ఈ సమావేశానికి ఛైర్మన్‌తో సహా ఐదుగురు సభ్యులు హాజరయ్యారు.
Source: Yahoo! Telugu: News | 13 Feb 2010 | 8:41 am

యువతి హత్య కేసులో బీఎస్ఎఫ్ అధికారి సస్పెండ్!

కాశ్మీర్ యువతి హత్య కేసులో భారత సరిహద్దు దళాని (బీఎస్ఎఫ్)కి చెందిన అధికారిని సంబంధిత అధికారులు సస్పెండ్ చేశారు. 68వ బెటాలియన్‌కు చెందిన కమాండింగ్ ఆఫీసర్ (సీఓ)గా పని చేస్తున్న ఆర్కే.బిర్దీపై చర్య చేపట్టినట్టు బీఎస్ఎఫ్ అధికార వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 13 Feb 2010 | 8:20 am

25 వేల మందిని నియమించనున్న ఎస్‌బీఐ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తమ బ్యాంకు వివిధ హోదాలలో ఉద్యోగులను నియమించనున్నట్లు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) ఛైర్మెన్ ఓపి భట్ట్ శనివారం మీడియాకు వివరించారు.
Source: Yahoo! Telugu: News | 13 Feb 2010 | 6:50 am

కోర్ కమిటీ సభ్యులు ఏ పార్టీ వారు?.. రాష్ట్రంలో చర్చ!

రాష్ట్రంలో వింత చర్చకు నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు మధుయాష్కీ తెరలేపారు. కోర్ కమిటీ సభ్యులు సీమాంధ్ర నేతలకు అమ్ముడు పోయారంటూ చేసిన ఆరోపణలపై వింత చర్చ సాగుతోంది. కోర్ కమిటీలో సభ్యుల్లో తమ పార్టీ అధినేత్రి సోనియా గాధీ మినహా మిగిలిన సభ్యులంతా అమ్ముడు పోయారంటూ విమర్శించారు. అంటే.. కోర్ కమిటీ ఏ పార్టీకి చెందిన కమిటీ అనే ప్రశ్న ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో ఉత్పన్నమైంది.
Source: Yahoo! Telugu: News | 13 Feb 2010 | 6:12 am

తెలంగాణాకు నేనే మొదటి ముఖ్యమంత్రిని: జానా

కేంద్రం శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను ప్రకటించిన తదుపరి కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అది ఓ దిక్కుమాలిన కమిటీ అంటూ కోపంతో పాత సామెతలను సైతం తిరగదోడి ఊగిపోయారు. తెలంగాణాకోసం తమ పార్టీ ఆవిర్భవించింది కనుక మొట్టమొదటగా తాము రాజీనామా చేస్తున్నామని, తమ వెంట మిగిలిన పార్టీలు చేయాలనీ, లేదంటే ప్రజలే చూసుకుంటారని చెప్పేశారు.
Source: Yahoo! Telugu: News | 13 Feb 2010 | 5:55 am

జనవరిలో పెరిగిన విమాన ప్రయాణీకుల సంఖ్య

దేశీయ విమానయాన రంగానికి ఈ ఏడాది ప్రారంభంలోనే ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ఈ ఏడాది జనవరి నెలలో విమానయానాల ద్వారా ప్రయాణించిన ప్రయాణీకుల సంఖ్య దాదాపు 23 శాతం పెరిగింది.
Source: Yahoo! Telugu: News | 13 Feb 2010 | 5:53 am

9/11 దాడి సూత్రధారిని శిక్షించాల్సిందే: వైట్‌హౌస్

ప్రపంచ ట్రేడ్ సెంటర్స్‌‌పై 2001 సంవత్సరం సెప్టెంబరు తొమ్మిదో తేదీ (9/11)న జరిగిన దాడులకు సూత్రధారిగా భావిస్తున్న ఖలీద్ షేక్ మొహ్మద్‌ను శిక్షించాల్సిందేనని వైట్‌హౌస్ ప్రతినిధి రాబర్ట్ గిబ్స్ పేర్కొన్నారు. దీనికి మించిన పెద్దపని మరొకటి ఉండబోదని ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 13 Feb 2010 | 5:50 am

చవాన్ "మహా" ముఖ్యమంత్రా లేక బాడీగార్డా: థాక్రే ప్రశ్న

శివసేన చీఫ్ బాల్‌థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌పై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. తాజాగా తీవ్రస్థాయిలో మైన ఆరోపణలు చేశారు. అశోక్ చవాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారా లేక బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌కు బాడీగార్డుగా ఉన్నారా అంటూ థాక్రే ఘాటు వ్యాఖ్యలు చేశారు. షారూక్ కొత్త చిత్రం ప్రదర్శితమయ్యే సినిమా థియేటర్ల వద్ద రాష్ట్ర పోలీసు బలగాలను మొహరించడాన్ని థాక్రే తప్పుబట్టారు.
Source: Yahoo! Telugu: News | 13 Feb 2010 | 5:39 am

ఆమె పెక్యులర్‌గా కనిపించింది.. అందుకే...: నాగార్జున

అక్కినేని నాగార్జున తాజా చిత్రం 'కేడి' శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఆయనతో ఇంటర్య్యూ...బాస్‌, మాస్‌, డాన్‌, కేడి... రెండక్షరాల సెంటిమెంటా?సెంటిమెంట్‌ అనేదికాదు. సింపుల్‌గా అందరూ పలకడానికి ఈజీగా ఉంటున్నాయని అలా పెట్టాం. సెంటిమెంట్‌ అయితే బాస్‌ సరిగ్గా ఆడలేదు. అయినా డాన్‌ అని పెట్టాను. అలాగే డిసెంబర్‌ నెల నాకు సెంటిమెంట్‌ అనేవారు. డిసెంబర్‌లో విడుదలచేయడంలేదుకదా... ఏదో ఒక చోట సెంటిమెంట్‌ ఉంటుంది. కానీ అది అన్నింటికీ వర్తించదు.మమతామోహన్‌దాస్‌ను ఎంపికచేసుకోవడానికి విశేషమైనా ఉందా?ఆమెతో నేను 3వ సినిమా చేస్తున్నాను. వర్క్‌లో సిన్సియర్‌. ఏ ప్రాబ్లమ్‌ ఉండదు. 'కింగ్‌'లో 12 మంది హీరోయిన్లతో చేస్తుంటే.. ఆమె పెక్యులర్‌గా అనిపించింది. అందులో పెద్దగా పాత్ర ఇవ్వలేకపోయాను. అందుకే ఈ చిత్రంలో ఆమెను ఎంపికచేయడం జరిగింది.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Feb 2010 | 5:26 am

రాజీనామాలపై తెరాసలోనే కుదరని ఏకాభిప్రాయం!

జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు తెలంగాణ రాష్ట్ర సమితి నేతల్లో అభిప్రాయభేదాలు పొడచూపాయి. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాల్లో ఏ ఒక్కటీ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేవని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావు ఆరోపించారు. అందువల్ల తమ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయనున్నట్టు తొలుత ప్రకటించారు. ఈ ప్రకటన శుక్రవారం చేయగా, శనివారం ఉదయానికి ఆయన మనస్సు మార్చుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 13 Feb 2010 | 5:10 am

నీలి చిత్రంలో కత్రినా కైఫ్ "కేడీ" సోదరి

అక్కినేని నాగార్జున చిత్రం "కేడీ" శుక్రవారం విడుదలైంది. ఆ చిత్రంతోపాటు అదే రోజున మరొకటి కూడా ఇంటర్నెట్‌లో విడుదలైంది. అదేమిటా... అనుకుంటున్నారా..? అక్కినేని నాగార్జున సరసన నటించిన కత్రినా కైఫ్ సోదరి ఇస్బెల్లా ఖాన్ నీలి చిత్రమట. ఈ నీలిచిత్రంలో ఇస్బెల్లా ఒక యువకుడితో కలిసి రాసలీలల్లో మహా మస్తుగా విహరిస్తున్నట్లు కనిపించిందని ఇంటర్నెట్ హాట్ రాయుళ్లు వార్తలు దంచేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె తాలూకు హాట్ వీడియోలు చూడవచ్చని వీరు పుంఖానుపుంఖాలుగా వార్తలు రాసి పారేస్తున్నారు. అయితే ఇది వట్టి అబద్ధమని, పనిలేనివారు ఇటువంటి పనికిమాలిన పనికి పూనుకున్నారని కత్రినా కైఫ్ మండిపడింది. అసలు నెట్‌లో కనిపిస్తున్న అమ్మాయి తన సోదరి కాదని గొంతు చించుక అరుస్తోంది. మార్ఫింగ్ మాయాజాలంతో ఎవరో పనిగట్టుకుని ఇటువంటి బుద్ధితక్కువ పని చేశారని కేకలు వేస్తోంది. కాగా గోవాలో ఒక వేశ్యగృహంలో ఇద్దరు విదేశీ యువతులను రక్షించే సన్నివేశం ఒకటి అక్కినేని నాగార్జున కేడీ చిత్రంలో ఉన్నది. చిత్రంగా వాళ్లిద్దరిలో ఒక యువతి నదియా ప్రస్తుతం నీలి చిత్రంలో కనిపిస్తున్న యువతిగా కొందరు చెప్పుకుంటున్నారు
Source: Yahoo! Telugu: Entertainment | 13 Feb 2010 | 4:54 am

యువతి హత్య కేసులో బీఎస్ఎఫ్ అధికారి సస్పెండ్!

కాశ్మీర్ యువతి హత్య కేసులో భారత సరిహద్దు దళాని (బీఎస్ఎఫ్)కి చెందిన అధికారిని సంబంధిత అధికారులు సస్పెండ్ చేశారు. 68వ బెటాలియన్‌కు చెందిన కమాండింగ్ ఆఫీసర్ (సీఓ)గా పని చేస్తున్న ఆర్కే.బిర్దీపై చర్య చేపట్టినట్టు బీఎస్ఎఫ్ అధికార వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 13 Feb 2010 | 2:51 am

కోర్ కమిటీ సభ్యులు ఏ పార్టీ వారు?.. రాష్ట్రంలో చర్చ!

రాష్ట్రంలో వింత చర్చకు నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు మధుయాష్కీ తెరలేపారు. కోర్ కమిటీ సభ్యులు సీమాంధ్ర నేతలకు అమ్ముడు పోయారంటూ చేసిన ఆరోపణలపై వింత చర్చ సాగుతోంది. కోర్ కమిటీలో సభ్యుల్లో తమ పార్టీ అధినేత్రి సోనియా గాధీ మినహా మిగిలిన సభ్యులంతా అమ్ముడు పోయారంటూ విమర్శించారు. అంటే.. కోర్ కమిటీ ఏ పార్టీకి చెందిన కమిటీ అనే ప్రశ్న ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో ఉత్పన్నమైంది.
Source: ఏపీ న్యూస్ | 13 Feb 2010 | 12:44 am

తెలంగాణాకు నేనే మొదటి ముఖ్యమంత్రిని: జానా

కేంద్రం శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను ప్రకటించిన తదుపరి కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అది ఓ దిక్కుమాలిన కమిటీ అంటూ కోపంతో పాత సామెతలను సైతం తిరగదోడి ఊగిపోయారు. తెలంగాణాకోసం తమ పార్టీ ఆవిర్భవించింది కనుక మొట్టమొదటగా తాము రాజీనామా చేస్తున్నామని, తమ వెంట మిగిలిన పార్టీలు చేయాలనీ, లేదంటే ప్రజలే చూసుకుంటారని చెప్పేశారు.
Source: ఏపీ న్యూస్ | 13 Feb 2010 | 12:26 am

చవాన్ "మహా" ముఖ్యమంత్రా లేక బాడీగార్డా: థాక్రే ప్రశ్న

శివసేన చీఫ్ బాల్‌థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌పై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. తాజాగా తీవ్రస్థాయిలో మైన ఆరోపణలు చేశారు. అశోక్ చవాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారా లేక బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌కు బాడీగార్డుగా ఉన్నారా అంటూ థాక్రే ఘాటు వ్యాఖ్యలు చేశారు. షారూక్ కొత్త చిత్రం ప్రదర్శితమయ్యే సినిమా థియేటర్ల వద్ద రాష్ట్ర పోలీసు బలగాలను మొహరించడాన్ని థాక్రే తప్పుబట్టారు.
Source: జాతీయ | 13 Feb 2010 | 12:10 am

రాజీనామాలపై తెరాసలోనే కుదరని ఏకాభిప్రాయం!

జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు తెలంగాణ రాష్ట్ర సమితి నేతల్లో అభిప్రాయభేదాలు పొడచూపాయి. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాల్లో ఏ ఒక్కటీ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేవని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావు ఆరోపించారు. అందువల్ల తమ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయనున్నట్టు తొలుత ప్రకటించారు. ఈ ప్రకటన శుక్రవారం చేయగా, శనివారం ఉదయానికి ఆయన మనస్సు మార్చుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Feb 2010 | 11:41 pm

పాకిస్థాన్ ప్రేమికులే షారూక్ సినిమా చూస్తారు: థాక్రే

బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ నటించి తాజాగా విడుదలైన "మై నేమ్ ఈజ్ ఖాన్" చిత్రాన్ని తిలకించే వారంతా పాకిస్థాన్‌ను ప్రేమించే వారుగా శివసేన చీఫ్ బాల్‌థాక్రే అభివర్ణించారు. బాలీవుడ్ నటుడు ఇప్పటికే పాకిస్థాన్ క్రికెటర్లకు గౌరవించే వ్యక్తిగా నిరూపించుకున్నారని ఆరోపించారు. అందువల్ల ఆయన నటించిన చిత్రాన్ని తిలకించే వారు కూడా ఆ కోవకు చెందిన వారేనని థాక్రే పేర్కొన్నారు.
Source: జాతీయ | 12 Feb 2010 | 11:20 pm

ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో దళాల మొహరింపు: సీఎస్

రాష్ట్రంలో మొహరించి ఉన్న పారామిలిటరీ బలగాలను ఈనెలఖరు వరకు పొడగించాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ కేంద్రానికి లేఖ రాశారు. గణతంత్ర వేడుకల సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాలకు తరలించిన ఆరు కంపెనీల బలగాలను కూడా తిరిగి రాష్ట్రానికి పంపాలని ఆయన తన లేఖలో కోరారు.
Source: ఏపీ న్యూస్ | 12 Feb 2010 | 11:11 pm

తెలంగాణ ప్రాంతాల్లో పాక్షికంగా కొనసాగుతున్న బంద్!

శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలను వ్యతిరేకిస్తూ ఉస్మానియా విద్యార్థి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ప్రాంతాల్లో బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 144 సెక్షన్‌ను అమలులో ఉంచింది. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఉస్మానియా వర్శిటీతో పాటు.. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మొహరించారు.
Source: ఏపీ న్యూస్ | 12 Feb 2010 | 10:43 pm

ఈనెల 17న కాంగ్రెస్ సమన్వయ కమిటీ తొలి భేటీ!

పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం కలిగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ ఈనెల 17వ తేదీన తొలి సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి కమిటీ ఛైర్మన్‌గా ఉన్న కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ అధ్యక్షత వహించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Feb 2010 | 10:34 pm

ముస్లింలకు రిజర్వేషన్లు: వీహెచ్‌పీ దేశ వ్యాప్త ఉద్యమం

ముస్లిం ప్రజలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని పశ్చిమబెంగాల్‌లోని బుద్ధదేవ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్టు ప్రకటించింది.
Source: జాతీయ | 12 Feb 2010 | 9:36 pm

పాకిస్థాన్‌తో చర్చలు వద్దంటే వినరే: ఆంటోనీ ఆగ్రహం

ముంబై మారణహోమానికి సూత్రధారులకు ఆశ్రయం ఇస్తున్న దాయాది దేశం పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు జరుపరాదని కేంద్ర రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ తేల్చి చెప్పారు. ముంబై నిందితులను అరెస్టు చేసి చట్టం ముందు ఉంచేంత వరకు ఆ దేశంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోరాదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.
Source: జాతీయ | 12 Feb 2010 | 9:25 pm

మై నేమ్ ఈజ్ ఖాన్ "పులి"- శివసేన "పిల్లి"

పులిగా చెప్పుకునే శివసేన చివరికి పిల్లిగా మారిపోయిన వైనమిది. షారుక్ ఖాన్ "మై నేమ్ ఈజ్ ఖాన్" చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామంటూ చిత్ర దర్శకనిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన సేన, చివరికి తానే ఓడిపోయింది. మహారాష్ట్రలోని అన్ని థియేటర్లలో షారుక్ చిత్రం "మై నేమ్ ఈజ్ ఖాన్"ను ప్రేక్షకులు ఎగబడి చూశారు. దీంతో చిత్ర దర్శకనిర్మాతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ దశలో కోపం పట్టలేని కొందరు సేన కార్యకర్తలు షారుక్ కార్యాలయంపై దాడికి దిగారు. సోడా బాటిళ్లు, రాళ్లను భవనంపైకి విసిరారు. అయితే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. మార్నింగ్ షో సమయంలో ముంబయి, అహ్మదాబాదులలో కొన్ని థియేటర్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనబడటంతో పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులను చెదరగొట్టారు. ముందుజాగ్రత్త చర్యగా కొంతమందిని అదుపులోకి తీసుకోవడంతో చిత్ర ప్రదర్శనకు పెద్ద అడ్డంకులు ఎదురు కాలేదు. దీంతో మధ్యాహ్నం నుంచి థియేటర్లు ప్రేక్షకులతో కిటకిటలాడాయి. ఇదిలావుంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మహారాష్ట్రలో పరిస్థితిని అడిగి తెలుసుకుంది. పోలీసుల పనితీరును మెచ్చుకున్నది.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Feb 2010 | 12:27 pm

ప్రేమకంటే డబ్బే ప్రధానమంటోన్న "కేడి"

కథంతా కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. నాగార్జున చిత్రమని వెళ్ళేవారికి నిరుత్సాహపరుస్తుంది. స్క్రీన్‌ప్లే వైవిధ్యమని మొదటినుంచి చెబుతున్న నాగార్జున నిజంగా స్క్రీన్‌ప్లే కొత్తగా ఉన్నా.. మూలకథలో బలం లేకపోవడంతో ప్రేక్షకుడికి పెద్దగా నప్పదు. ఆర్‌డిఎక్స్ బాంబుల్ని హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్, ఓల్డ్‌సిటీలో పెట్టి జీహాద్ చేసే పనిని హీరో అడ్డుకోవడమనేది స్థూలంగా, దానికి రకరకాల జిమ్మిక్కులు చేసి మసిపూసి మారేడుకాయ చేసి తయారైన పండే ఈ "కేడి".నటునిగా నాగార్జున పెద్ద కష్టపడిందీ, నటించిందీ ఏమీలేదు. రొటీన్ పాత్ర. డాన్స్ బాగానే చేశాడు. మమతామోహన్‌దాస్ పాత్రకూడా షరామామూలే. ఇక "స్లమ్‌డాగ్‌ మిలియనీర్" చిత్రంలో నటించిన అంకుర్‌తో పాటు మరో ఇద్దరు నటులను సినిమాకోసం ప్రత్యేక ఆకర్షణ కోసం పెట్టినట్లుంది. మొత్తానికి ఈ సినిమాలో ప్రత్యేకంగా తెలిసింది ఏమంటే..? గోవాలో విదేశీయులైన మహిళలు మిస్సింగ్ కేసులుగా నమోదు అయినా పోలీసులు చేతులెత్తేయడం, వారిని మాఫియా తమ సరదాలకు ఏవిధంగా ఉపయోగించుకుంటున్నాయో కళ్లకుకట్టినట్లు చూపాడు. ఒకప్పుడు నాగార్జున "అంతం" సినిమా తీసి అందరికీ షాక్ ఇచ్చాడు. కేడి కూడా ఆ కోవలోనిదే..!
Source: Yahoo! Telugu: Entertainment | 12 Feb 2010 | 9:14 am

సీమాంధ్ర లాబీయింగ్‌కు కేంద్రం తలొగ్గింది: నాగం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను తెలంగాణాకు వ్యతిరేకంగా చొప్పించి తెలంగాణా ప్రజలను మోసం చేసిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 12 Feb 2010 | 9:08 am

కేసీఆర్‌కు సంఘ బహిష్కరణ విధిస్తాం: నాయీ బ్రాహ్మణ సంఘం

నాయీ బ్రాహ్మణులను కించపరుస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంఘ బహిష్కరణ విధిస్తామని నాయీ బ్రాహ్మణ సంఘం హెచ్చరిక చేసింది. శ్రీకృష్ణ కమిటీని విమర్శించే సమయంలో కేసీఆర్ తమ కులాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కేసీఆర్‌కు క్షవరం చేయకూడదని పిలుపునిచ్చింది.
Source: ఏపీ న్యూస్ | 12 Feb 2010 | 5:05 am

అందాన్ని అతిగా చూపిస్తే వెగటు పుడుతుంది: హన్సిక

సినిమా రంగంలో అందంగా ఉన్నవారే నిలబడగలరని హన్సిక మోత్వాని అంటోంది. అయితే ఈ అందాన్ని కూడా అందంగా చూపిస్తేనే ప్రేక్షకులను ఆకట్టుకోగలమనీ, అందంగా ఉండి కూడా ఆ అందాన్ని ప్రదర్శించటంలో విఫలమైతే ఎవరూ చూడరని తనదైన ఫార్ములా చెపుతోంది. కొన్ని చిత్రాలకు అందం కాస్త ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే అందాన్ని పరిమితికి మించి చూపిస్తే వెగటు పుడుతుందని కూడా చెపుతోందీ భామ. ఈ విషయాన్ని ఎప్పుడో గ్రహించానని కూడా అంటోంది. అందుకే నా పాత్రల పట్ల నిర్లక్ష్యం వహించనని చెపుతోంది. "సీతారాముల కల్యాణం లంకలో" కూడా తన నటన బాగుంది కనుకనే ఆ చిత్రం కొత్త ఏడాదిలో అనుకున్న విజయాన్ని సాధించిందని అంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Feb 2010 | 4:30 am

కమిటీ ఏం చేస్తుంది...? పిల్లి తల గొరుగుతుందా...?: కేసీఆర్

శ్రీకృష్ణ కమిటీ ఎందుకు కొరగాని కమిటీ అనీ, తెలంగాణా తెచ్చే కమిటీ కాదని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇప్పటికే ప్రజల అభిప్రాయాలేమిటో తేలిపోయాయనీ, ఈ సమయంలో పనిలేనివారు పిల్లి తల గొరిగినట్లు తెలంగాణాలో శ్రీకృష్ణ కమిటీ పది నెలలపాటు ఏం చేస్తుందీ...? అని కమిటీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 12 Feb 2010 | 3:35 am

సోనియాగాంధీపై నమ్మకం ఉంది: సబిత ఇంద్రారెడ్డి

ప్రత్యేక తెలంగాణపై కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ మీద తమకు పూర్తి నమ్మకం ఉందని రాష్ట్ర హోం మంత్రి సబిత ఇంద్రారెడ్డి చెప్పారు. తెలంగాణపై శ్రీ కృష్ణ కమిటీ విధివిధానాలను స్వాగతిస్తున్నామని మంత్రి అన్నారు. తెలంగాణకు ఎప్పటికీ అన్యాయం జరగదని సబిత తెలిపారు. తెలంగామ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కల్లాకపటం లేకుండా వ్యవహరిస్తోందని హోం మంత్రి వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 12 Feb 2010 | 2:30 am