ఇక దేశీయ రోడ్లపై కనపడని మారుతి 800 కార్లు

దేశీయ కార్ల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న మారుతి సుజుకి ఇండియాకు చెందిన మారుతి 800 కారు అమ్మకాలను దేశంలోని 13 నగరాలలో నిలిపివేసింది.
Source: Yahoo! Telugu: News | 12 Feb 2010 | 8:48 am

సీమాంధ్ర లాబీయింగ్‌తో కేంద్రం తలొగ్గింది: నాగం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను తెలంగాణాకు వ్యతిరేకంగా చొప్పించి తెలంగాణా ప్రజలను మోసం చేసిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి విమర్శించారు.
Source: Yahoo! Telugu: News | 12 Feb 2010 | 8:44 am

సోనియాగాంధీపై నమ్మకం ఉంది: సబిత ఇంద్రారెడ్డి

ప్రత్యేక తెలంగాణపై కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ మీద తమకు పూర్తి నమ్మకం ఉందని రాష్ట్ర హోం మంత్రి సబిత ఇంద్రారెడ్డి చెప్పారు. తెలంగాణపై శ్రీ కృష్ణ కమిటీ విధివిధానాలను స్వాగతిస్తున్నామని మంత్రి అన్నారు. తెలంగాణకు ఎప్పటికీ అన్యాయం జరగదని సబిత తెలిపారు. తెలంగామ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కల్లాకపటం లేకుండా వ్యవహరిస్తోందని హోం మంత్రి వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 12 Feb 2010 | 8:00 am

మొబైల్ అప్లికేషన్ స్టోర్లను ప్రారంభించనున్న రిలయన్స్

ఆర్ వరల్డ్ ద్వారా 2.0 డేటా పోర్టల్‌లో 3జి డేటా లభ్యమవుతుందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ ప్రకటించింది. మొబైల్ సెట్లలో ఉండే అన్ని ఫీచర్లకు సపోర్ట్ చేసే విధంగా ఇక్కడ అన్ని రకాల సేవలు లభిస్తాయని ఆ సంస్థ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 12 Feb 2010 | 7:43 am

అల్జీరియాలో నియామకాలు చేపట్టిన అల్‌ఖైదా

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అల్‌ఖైదా తీవ్రవాద సంస్థ అల్జీరియాలో తాజాగా పలు విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు, శాస్త్రజ్ఞులు, ఐటీ రంగంలో నిష్ణాతులైన వారిని నియమించుకుంటోందని ఓ వెబ్‌సైట్ వెల్లడించింది
Source: Yahoo! Telugu: News | 12 Feb 2010 | 7:09 am

కమిటీ ఏం చేస్తుంది...? పిల్లి తల గొరుగుతుందా...?: కేసీఆర్

శ్రీకృష్ణ కమిటీ ఎందుకు కొరగాని కమిటీ అనీ, తెలంగాణా తెచ్చే కమిటీ కాదని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇప్పటికే ప్రజల అభిప్రాయాలేమిటో తేలిపోయాయనీ, ఈ సమయంలో పనిలేనివారు పిల్లి తల గొరిగినట్లు తెలంగాణాలో శ్రీకృష్ణ కమిటీ పది నెలలపాటు ఏం చేస్తుందీ...? అని కమిటీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
Source: Yahoo! Telugu: News | 12 Feb 2010 | 6:40 am

"మై నేమ్ ఈజ్ ఖాన్"‌ తొలి షోను వీక్షించిన అశోక్ చవాన్!

ఐపీఎల్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లకు మద్దతుగా వ్యాఖ్యానించి బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తప్పు చేశాడని, ఈ వ్యవహారంపై షారూఖ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పేంతవరకు ఆయన సినిమా "మై నేమ్ ఈజ్ ఖాన్"ను ముంబైలో ప్రదర్శించబోమని శివసేన పార్టీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో.. షారూఖ్ ఖాన్ "మై నేమ్ ఈజ్ ఖాన్" సినిమా తొలి రోజు తొలి షోను మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ వీక్షించారు.
Source: Yahoo! Telugu: News | 12 Feb 2010 | 6:37 am

12 శాతానికి చేరుకోనున్న ద్రవ్యోల్బణం : నిపుణులు.

రానున్న రోజుల్లో దేశంలో ఆహారోత్పత్తులు పెరిగి ఆహార ద్రవ్యోల్బణం రేటు తగ్గుముఖంపట్టి 12 శాతానికి చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు
Source: Yahoo! Telugu: News | 12 Feb 2010 | 6:32 am

"మై నేమ్ ఈజ్ ఖాన్" ప్రదర్శనను అడ్డుకున్న వీహెచ్‌పీ

ముంబయి నగరంలో "మై నేమ్ ఈజ్ ఖాన్" చిత్ర ప్రదర్శనను శివసేన అడ్డుకునేందుకు యత్నాలు చేస్తుంటే, అహ్మదాబాద్‌లో వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ సంయుక్తంగా షారుక్ చిత్ర ప్రదర్శనకు గండి కొడుతున్నాయి.
Source: Yahoo! Telugu: News | 12 Feb 2010 | 5:58 am

మార్చి చివరి నాటికి 3జి వేలం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 31 లోపల మూడవ జనరేషన్ (3జి)కు చెందిన మొబైల్ స్పెక్ట్రమ్‌ను వేలం వేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రాథమిక సమాచారం.
Source: Yahoo! Telugu: News | 12 Feb 2010 | 5:55 am

అందాన్ని అతిగా చూపిస్తే వెగటు పుడుతుంది: హన్సిక

సినిమా రంగంలో అందంగా ఉన్నవారే నిలబడగలరని హన్సిక మోత్వాని అంటోంది. అయితే ఈ అందాన్ని కూడా అందంగా చూపిస్తేనే ప్రేక్షకులను ఆకట్టుకోగలమనీ, అందంగా ఉండి కూడా ఆ అందాన్ని ప్రదర్శించటంలో విఫలమైతే ఎవరూ చూడరని తనదైన ఫార్ములా చెపుతోంది. కొన్ని చిత్రాలకు అందం కాస్త ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే అందాన్ని పరిమితికి మించి చూపిస్తే వెగటు పుడుతుందని కూడా చెపుతోందీ భామ. ఈ విషయాన్ని ఎప్పుడో గ్రహించానని కూడా అంటోంది. అందుకే నా పాత్రల పట్ల నిర్లక్ష్యం వహించనని చెపుతోంది. "సీతారాముల కల్యాణం లంకలో" కూడా తన నటన బాగుంది కనుకనే ఆ చిత్రం కొత్త ఏడాదిలో అనుకున్న విజయాన్ని సాధించిందని అంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Feb 2010 | 4:30 am

సీమాంధ్ర లాబీయింగ్‌తో కేంద్రం తలొగ్గింది: నాగం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను తెలంగాణాకు వ్యతిరేకంగా చొప్పించి తెలంగాణా ప్రజలను మోసం చేసిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 12 Feb 2010 | 3:15 am

సోనియాగాంధీపై నమ్మకం ఉంది: సబిత ఇంద్రారెడ్డి

ప్రత్యేక తెలంగాణపై కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ మీద తమకు పూర్తి నమ్మకం ఉందని రాష్ట్ర హోం మంత్రి సబిత ఇంద్రారెడ్డి చెప్పారు. తెలంగాణపై శ్రీ కృష్ణ కమిటీ విధివిధానాలను స్వాగతిస్తున్నామని మంత్రి అన్నారు. తెలంగాణకు ఎప్పటికీ అన్యాయం జరగదని సబిత తెలిపారు. తెలంగామ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కల్లాకపటం లేకుండా వ్యవహరిస్తోందని హోం మంత్రి వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 12 Feb 2010 | 2:30 am

కమిటీ ఏం చేస్తుంది...? పిల్లి తల గొరుగుతుందా...?: కేసీఆర్

శ్రీకృష్ణ కమిటీ ఎందుకు కొరగాని కమిటీ అనీ, తెలంగాణా తెచ్చే కమిటీ కాదని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇప్పటికే ప్రజల అభిప్రాయాలేమిటో తేలిపోయాయనీ, ఈ సమయంలో పనిలేనివారు పిల్లి తల గొరిగినట్లు తెలంగాణాలో శ్రీకృష్ణ కమిటీ పది నెలలపాటు ఏం చేస్తుందీ...? అని కమిటీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 12 Feb 2010 | 1:11 am

"మై నేమ్ ఈజ్ ఖాన్"‌ తొలి షోను వీక్షించిన అశోక్ చవాన్!

ఐపీఎల్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లకు మద్దతుగా వ్యాఖ్యానించి బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తప్పు చేశాడని, ఈ వ్యవహారంపై షారూఖ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పేంతవరకు ఆయన సినిమా "మై నేమ్ ఈజ్ ఖాన్"ను ముంబైలో ప్రదర్శించబోమని శివసేన పార్టీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో.. షారూఖ్ ఖాన్ "మై నేమ్ ఈజ్ ఖాన్" సినిమా తొలి రోజు తొలి షోను మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ వీక్షించారు.
Source: జాతీయ | 12 Feb 2010 | 1:08 am

"మై నేమ్ ఈజ్ ఖాన్" ప్రదర్శనను అడ్డుకున్న వీహెచ్‌పీ

ముంబయి నగరంలో "మై నేమ్ ఈజ్ ఖాన్" చిత్ర ప్రదర్శనను శివసేన అడ్డుకునేందుకు యత్నాలు చేస్తుంటే, అహ్మదాబాద్‌లో వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ సంయుక్తంగా షారుక్ చిత్ర ప్రదర్శనకు గండి కొడుతున్నాయి.
Source: జాతీయ | 12 Feb 2010 | 12:28 am

తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ

శ్రీ కృష్ణ కమిటీ విధి విధానాలను వ్యతిరేకిస్తూ రేపు (శనివారం) తెలంగాణ బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపు నిచ్చింది. తెలంగాణపై శ్రీ కృష్ణ కమిటీ విధి విధానాలు ఏ మాత్రం అనుకూలంగా లేవని ఉస్మానియా విశ్వవిద్యాలయం జాయింట్ యాక్షన్ కమిటి అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇంకా తెలంగాణ రాష్ట్ర సాధనకు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాలని ఓయూ జేఏసీ పిలుపు నిచ్చింది.
Source: ఏపీ న్యూస్ | 12 Feb 2010 | 12:01 am

తెలంగాణ కోసం మళ్లీ ఉద్యమించండి: వేణుగోపాలాచారి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మళ్లీ ఉద్యమించాలని తెలుగుదేశం పార్టీ నేత వేణుగోపాలాచారి పిలుపు నిచ్చారు. శుక్రవారం విడుదలైన శ్రీ కృష్ణ విధి విధానాలు తెలంగాణకు అనుకూలంగా లేవని వేణుగోపాలాచారి అన్నారు. కేంద్ర ప్రభుత్వం శ్రీ కృష్ణ కమిటీ విధివిధానాలు తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేలా ఉన్నాయని ఆయన తెలిపారు. అందుచేత శ్రీ కృష్ణ కమిటీని వ్యతిరేకిస్తూ.. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒక్కటై మళ్లీ ఐక్యంగా ఉద్యమించాలని వేణుగోపాలాచారి పిలుపు నిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 11 Feb 2010 | 11:09 pm

శ్రీ కృష్ణ కమిటీపై విశ్వాసం లేదు: ఎర్రబెల్లి

తెలంగాణ ఏర్పాటుకు శుక్రవారం ఏడు అంశాలతో కూడిన విధి విధానాలను ప్రకటించిన శ్రీ కృష్ణ కమిటీపై విశ్వాసం లేదని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలు కలిసి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చారని ఎర్రబెల్లి చెప్పారు.అలాగే శ్రీ కృష్ణ విధివిధానాలపై తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 Feb 2010 | 10:48 pm

శ్రీ కృష్ణ కమిటీ విధి విధానాలను ప్రకటించిన హోం శాఖ

గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ విధి విధానాలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ శుక్రవారం ఉదయం ప్రకటించింది. ఈ కమిటీ కాలపరిమతిని ఈ ఏడాది డిసెంబరు 31గా నిర్ణయించింది. ఈ కమిటీ తన విధులను నిర్వర్తించేందుకు ఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోను కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.
Source: ఏపీ న్యూస్ | 11 Feb 2010 | 10:45 pm

తెలంగాణ ప్రజలను కేంద్రం వంచించింది: కేసీఆర్

తెలంగాణపై ఏర్పాటైన శ్రీ కృష్ణ కమిటీ విధివిధానాల ద్వారా కేంద్ర ప్రభుత్వం మరోసారి తెలంగాణ ప్రజలను వంచించిందని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావు అన్నారు. శ్రీ కృష్ణ కమిటీ శుక్రవారం ప్రకటించిన విధి విధానాలు ఏ మాత్రం ఆమోద యోగ్యంగా లేవని కేసీఆర్ చెప్పారు. ఇంకా శ్రీ కృష్ణ కమిటీ విధివిధానాలు తెలంగాణకు అనుకూలించలేవని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాబట్టి కమిటీ విధివిధానాలకు తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని కేసీఆర్ తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 11 Feb 2010 | 10:36 pm

కాశ్మీరీ మిలిటెంట్ల క్షమాభిక్షపై కేంద్రం ఆమోదం!

పాకిస్థాన్‌లోని కాశ్మీరీ మిలిటెంట్లకు క్షమాభిక్ష ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించారు. జమ్మూకాశ్మీర్ సమస్యలపై ప్రధాని మన్మోహన్ సింగ్ నియమించిన వర్కింగ్ కమిటీ సూచనలలో ఒకటైన ఈ క్షమాభిక్ష ప్రతిపాదనపై కేంద్రం ఆమోద ముద్ర వేసిందని మంత్రి తెలియజేశారు.
Source: జాతీయ | 11 Feb 2010 | 10:04 pm

ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టయిన అమెరికావాసి

దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో విన్‌స్టన్‌ మార్షల్‌ (60) అనే అమెరికా వాసిని గురువారం పోలీసులు నిర్బంధించారు.
Source: జాతీయ | 11 Feb 2010 | 9:25 pm

హర హర శంభో అంటూ మారుమ్రోగుతున్న శైవక్షేత్రాలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా గల శైవ క్షేత్రాల్లో సర్వేశ్వరుడ్ని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు.
Source: జాతీయ | 11 Feb 2010 | 8:35 pm

నా స్టార్‌డమ్‌లో తేడాలుంటాయ్.. కానీ జాతీయతలో కాదు

షారుక్ ఖాన్ చిత్రం "మై నేమ్ ఈజ్ ఖాన్" కట్టుదిట్టమైన భద్రత నడుమ శుక్రవారం ముంబయిలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే శివసేన హెచ్చరికల నేపధ్యంలో మహారాష్ట్ర మొత్తమ్మీద సుమారు 47 నగరాల్లోని ప్రధాన థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం లేదని ఆయా యాజమాన్యాలు తెలిపాయి.
Source: జాతీయ | 11 Feb 2010 | 8:42 am

జగపతి బాబుపై ప్రియమణికి ఎందుకంత ఇది...?!!

మొన్న "పెళ్లయిన కొత్తలో"... నిన్న "ప్రవరాఖ్యుడు"... నేడు "సాధ్యం". ఈ చిత్రాల్లో జగపతి బాబు సరసన నటించిన హీరోయిన్ ప్రియమణి. వీళ్లద్దరి జోడీ లక్కీ పెయిర్ అని కొందరు దర్శకనిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. అందుకే వీరిద్దరి జోడీగా చిత్రాలను రూపొందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సంగతి అలా ఉంచితే... బాబు- ప్రియమణిల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ మరింత ముదిరి పాకాన పడిందని టాలీవుడ్ ఫిలిమ్ జనం గుసగుసలు పోతున్నారు.తనను సెట్స్‌లో జగపతి బాబు ఎంతగానో ప్రోత్సహిస్తారనీ, ఆయన మంచి స్నేహితుడని ప్రియమణి వయ్యారాలు ఒలకబోస్తూ చెపుతోంది. తమ జంటను లక్కీ పెయిర్ అంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సంబరపడిపోతోంది. ఇక నుంచి సాధ్యమైనన్న ఎక్కువ సినిమాలు జగపతిబాబుతో చేస్తానని చెపుతోందట. జగపతి బాబు ప్రోత్సాహం అంత బాగా ఉన్నదన్నమాట.అదలావుంటే... జగపతి బాబు సరసన "సాధ్యం"లో మహా వేడెక్కించే బెడ్రూం సన్నివేశాలలో ప్రియమణి జీవించిందని ఫిలిమ్ నగర్ సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మొత్తమ్మీద ద్రోణ చిత్రంలో బికినీలో కనబడి కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన ప్రియమణి, తాజాగా బెడ్రూం సన్నివేశాలతో మరోసారి కిక్కెంచబోతోందన్నమాట.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Feb 2010 | 6:36 am

రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రయోజనం శూన్యం: సోమిరెడ్డి

తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు సీమాంధ్ర నేతలను, ప్రజలను కించ పరిచేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మాకూ తెలుసన్నారు. తాము మిన్నకుండి పోవడాన్ని ఒక అవకాశంగా తీసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 11 Feb 2010 | 4:55 am

తెరపై చూసుకోవాలంటే సిగ్గు బాబూ: ఆండ్రియా

యుగానికి ఒక్కడులో నటించిన నటి ఆండ్రియాకు సిగ్గెక్కువంట. కెమేరా ముందు నటించడం వరకైతే బాగానే ఉంటుందనీ, దాన్ని తెరపై చూసుకోవాలంటే.. సిగ్గనిపిస్తుందని చెబుతోంది. కార్తి, ఆండ్రియా, రీమాసేన్ నటించిన చిత్రం యుగానికి ఒక్కడు ఇటీవలే తెలుగు, తమిళాల్లో విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆమె తన చిత్రం గురించి చెపుతూ ఆడియన్స్ రెస్పాన్స్ బాగుందని చెప్పింది. తెరపై చూసుకున్నప్పుడు ఎలా అనిపించిందనేదానికి కాస్త సిగ్గుపడుతూ తెరపై తనను తాను చూసుకోవాలంటే నిజంగా సిగ్గని చెప్పింది. నటిగా మీ తప్పొప్పులు తెలుసుకోవాలి కదా... అని అడిగితే ప్రతి ఫిమేల్ ఆర్టిస్ట్ సిగ్గుపడతారనీ, కానీ వారు చెప్పలేరు.. నేను చెపుతున్నాని అంటోంది. అందులో హాట్ సీన్స్ ఉన్నాయా...? అని అడిగితే... హాట్ సీన్స్ చేయాలంటే కథ నచ్చాలని అంటోంది. ఆల్రెడీ హీరో కార్తి ఇద్దరు హీరోయిన్లతో చాలా ఎంజాయ్ చేశానని చెప్పాడు. మరి ఆండ్రియాకు ఆ ఎంజాయ్‌మెంట్ గుర్తుకు వచ్చి సిగ్గుపడుతుందేమోమరి...
Source: Yahoo! Telugu: Entertainment | 11 Feb 2010 | 4:46 am

హాస్టల్‌లో అగ్నిప్రమాదం: 12 మంది విద్యార్థుల మృతి!

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో 12 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. మరో ఎనిమిది గాయపడ్డారు. డాన్ బాస్కో విద్యా సంస్థల గ్రూపునకు చెందిన ప్రైవేట్ హాస్టల్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ఆ రాష్ట్ర అధికారులు గరువారం వెల్లడించారు.
Source: జాతీయ | 11 Feb 2010 | 4:34 am

విజయలక్ష్మికి మంత్రి పదవి ఇవ్వండి: కొండా సురేఖ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి సతీమణి, పులివెందుల శాసన సభ్యురాలు వైఎస్.విజయలక్ష్మికి మంత్రిపదవి ఇవ్వాలని మాజీ మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. వైఎస్ లేని కొరతను ఆమె తీర్చగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 11 Feb 2010 | 4:34 am

ఫైనల్లో యంగ్ ఇండియా

దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందుతున్న "యంగ్ ఇండియా" చివరి షెడ్యూల్‌ లోనికి ప్రవేశించింది. ఇందులో 81మంది కొత్తవారిని పరిచయం చేస్తున్నట్లు దాసరి వెల్లడించారు. దాసరి పద్మ సమర్పణలో సిరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రామకృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... సంచలనాత్మక కథ. అంతా తెలుగువారినే పరిచయం చేస్తున్నాం. కథకు సరియైన టైటిల్. ఈ చిత్రం చలనచిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుందనే నమ్మకముంది. రామోజీ ఫిలిమ్ సిటీలో 85శాతం షూటింగ్ జరుపుకుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Feb 2010 | 4:33 am