ఇక నుంచి ఇరాన్ అణ్వస్త్ర దేశం: అహ్మదినేజాద్

ఇస్లామిక్ రిపబ్లిక్ దేశమైన ఇరాన్ అణ్వస్త్ర దేశంగా మారిందని ఆ దేశ అధ్యక్షుడు అహ్మదినేజాద్ ప్రకటించారు. యురేనియం శద్ధీకరణ పనులు చేపట్టిన రెండు రోజులకే ఆయన ఈ తరహా ప్రకటన చేయడం గమనార్హం.
Source: Yahoo! Telugu: News | 11 Feb 2010 | 8:29 am

హెలికాఫ్టర్ ప్రమాదానికి ఇతర కారణాలు ఉండొచ్చు?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూలిపోవడానికి వాతావరణమే కారణం కాదని, ఇతర కారణాలు కూడా ఉండొచ్చని ద్విసభ్య కమిటీ అభిప్రాయపడింది. అయితే, హెలికాఫ్టర్ ప్రమాదంలో కుట్ర తాలూకు ఆధారాలు కాక్‌పీట్ వాయిస్ రికార్డర్‌లో నమోదు కాలేదని కమిటీ సభ్యులు ఎంఆర్.రెడ్డి, హెచ్ఎస్.కోలాలు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 11 Feb 2010 | 8:12 am

షాపింగ్ మాల్‌కన్నా గృహాలను నిర్మించండి: సౌగత్‌

రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ప్రస్తుతం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నిర్మించే పనిలో నిమగ్నమైవున్నారు. అలాంటి డెవలపర్స్ తక్కువ ధరలకు గృహనిర్మాణాలు చేపట్టి ప్రజలకు అందించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి సౌగత్ రాయ్ పిలుపునిచ్చారు
Source: Yahoo! Telugu: News | 11 Feb 2010 | 7:52 am

భారీ లాభాల దిశగా స్టాక్ మార్కెట్ పయనం

గురువారం బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాల దిశగా ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి వృద్ధిబాటలో కొనసాగుతోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, గురువారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 229 పాయింట్లు భారీగా లాభపడి, 16,151 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 64 పాయింట్లు పడిపోయి, 4,821 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 11 Feb 2010 | 7:32 am

4జి సేవలకు రంగం సిద్ధం చేసుకుంటున్న ట్రాయ్

దేశీయ మొబైల్ మార్కెట్‌ రంగంలో 3జి టెక్నాలజీ సరిగా అందుబాటులోకి రాకమునుపే 4జి టెక్నాలజీ రంగ ప్రవేశం చేసింది. అత్యాధునికమైన ఈ టెక్నాలజీపై పరిశ్రమ వర్గాల అభిప్రాయాలను స్వీకరించడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కసరత్తు చేస్తోంది. గత సంవత్సరమే 3జి సేవలు అందుబాటులోకి రావాల్సివుండగా 3జి స్పెక్ట్రమ్ వేలం వాయిదా పడుతూ వస్తోంది.
Source: Yahoo! Telugu: News | 11 Feb 2010 | 7:15 am

బాలీవుడ్ నటుడు 'కింగ్ ఖాన్‌'కు బాసటగా ఎంఎన్ఎస్!

బాలీవుడ్ సినీ నటుడు షారూక్ ఖాన్‌కు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అండగా నిలిచింది. ఆయన తాజాగా నటించి శుక్రవారం విడుదల కానున్న "మై నేమ్ ఈజ్ ఖాన్" చిత్రం విడుదలను ఎంఎన్ఎస్ కార్యకర్తలు అడ్డుకోబోరని ఆ పార్టీ చీఫ్ రాజ్‌థాక్రే ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 11 Feb 2010 | 6:59 am

క్షిపణుల ప్రయోగంలో చైనా కంటే భారత్ ముందంజ!

దేశ భద్రత అవసరాల నిమిత్తం ప్రయోగిస్తున్న క్షిపణి ప్రయోగాల్లో సరిహద్దు దేశం చైనా కంటే భారత్ ముందజంలోనే ఉందని డీఆర్‌డీఓ డైరక్టర్ వీకే.సరస్వత్ తెలిపారు. ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ క్షిపణి ప్రయోగాల్లో చైనా కంటే ముందంజలోనే ఉన్నామని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
Source: Yahoo! Telugu: News | 11 Feb 2010 | 6:50 am

జగపతి బాబుపై ప్రియమణికి ఎందుకంత ఇది...?!!

మొన్న "పెళ్లయిన కొత్తలో"... నిన్న "ప్రవరాఖ్యుడు"... నేడు "సాధ్యం". ఈ చిత్రాల్లో జగపతి బాబు సరసన నటించిన హీరోయిన్ ప్రియమణి. వీళ్లద్దరి జోడీ లక్కీ పెయిర్ అని కొందరు దర్శకనిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. అందుకే వీరిద్దరి జోడీగా చిత్రాలను రూపొందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సంగతి అలా ఉంచితే... బాబు- ప్రియమణిల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ మరింత ముదిరి పాకాన పడిందని టాలీవుడ్ ఫిలిమ్ జనం గుసగుసలు పోతున్నారు.తనను సెట్స్‌లో జగపతి బాబు ఎంతగానో ప్రోత్సహిస్తారనీ, ఆయన మంచి స్నేహితుడని ప్రియమణి వయ్యారాలు ఒలకబోస్తూ చెపుతోంది. తమ జంటను లక్కీ పెయిర్ అంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సంబరపడిపోతోంది. ఇక నుంచి సాధ్యమైనన్న ఎక్కువ సినిమాలు జగపతిబాబుతో చేస్తానని చెపుతోందట. జగపతి బాబు ప్రోత్సాహం అంత బాగా ఉన్నదన్నమాట.అదలావుంటే... జగపతి బాబు సరసన "సాధ్యం"లో మహా వేడెక్కించే బెడ్రూం సన్నివేశాలలో ప్రియమణి జీవించిందని ఫిలిమ్ నగర్ సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మొత్తమ్మీద ద్రోణ చిత్రంలో బికినీలో కనబడి కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన ప్రియమణి, తాజాగా బెడ్రూం సన్నివేశాలతో మరోసారి కిక్కెంచబోతోందన్నమాట.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Feb 2010 | 6:36 am

ఆశాజనకంగా ట్రేడింగ్: లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

బ్యాంక్, రియాల్టీ, మెటల్ వాటాల ట్రేడింగ్ పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో పయనిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి భారీ లాభాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 224 పాయింట్లు బలపడి, 16,146 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 73 పాయింట్లు వృద్ధి చెంది, 4,831 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 11 Feb 2010 | 6:30 am

మరికాస్త పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం

జనవరి 30తో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం మరికాస్త పెరిగి 17.94 శాతానికి చేరుకుంది. అదే అంతకు మునుపటి వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం 17.56 శాతంగా ఉండింది.
Source: Yahoo! Telugu: News | 11 Feb 2010 | 6:11 am

భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య జల యుద్ధం రాదు!

దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య భవిష్యత్‌లో జల యుద్ధం రావొచ్చని వస్తున్న ఊహాగానాలను భారత్‌కు చెందిన ఇండస్ వాటర్స్ కమిషనర్ జి.రంగనాథన్ తోసిపుచ్చారు. ఇరు దేశాల మధ్య జలాల పంపిణీలో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ.. అవి యుద్ధానికి దారితీయవని స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 11 Feb 2010 | 5:51 am

తెరపై చూసుకోవాలంటే సిగ్గు బాబూ: ఆండ్రియా

యుగానికి ఒక్కడులో నటించిన నటి ఆండ్రియాకు సిగ్గెక్కువంట. కెమేరా ముందు నటించడం వరకైతే బాగానే ఉంటుందనీ, దాన్ని తెరపై చూసుకోవాలంటే.. సిగ్గనిపిస్తుందని చెబుతోంది. కార్తి, ఆండ్రియా, రీమాసేన్ నటించిన చిత్రం యుగానికి ఒక్కడు ఇటీవలే తెలుగు, తమిళాల్లో విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆమె తన చిత్రం గురించి చెపుతూ ఆడియన్స్ రెస్పాన్స్ బాగుందని చెప్పింది. తెరపై చూసుకున్నప్పుడు ఎలా అనిపించిందనేదానికి కాస్త సిగ్గుపడుతూ తెరపై తనను తాను చూసుకోవాలంటే నిజంగా సిగ్గని చెప్పింది. నటిగా మీ తప్పొప్పులు తెలుసుకోవాలి కదా... అని అడిగితే ప్రతి ఫిమేల్ ఆర్టిస్ట్ సిగ్గుపడతారనీ, కానీ వారు చెప్పలేరు.. నేను చెపుతున్నాని అంటోంది. అందులో హాట్ సీన్స్ ఉన్నాయా...? అని అడిగితే... హాట్ సీన్స్ చేయాలంటే కథ నచ్చాలని అంటోంది. ఆల్రెడీ హీరో కార్తి ఇద్దరు హీరోయిన్లతో చాలా ఎంజాయ్ చేశానని చెప్పాడు. మరి ఆండ్రియాకు ఆ ఎంజాయ్‌మెంట్ గుర్తుకు వచ్చి సిగ్గుపడుతుందేమోమరి...
Source: Yahoo! Telugu: Entertainment | 11 Feb 2010 | 4:46 am

ఫైనల్లో యంగ్ ఇండియా

దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందుతున్న "యంగ్ ఇండియా" చివరి షెడ్యూల్‌ లోనికి ప్రవేశించింది. ఇందులో 81మంది కొత్తవారిని పరిచయం చేస్తున్నట్లు దాసరి వెల్లడించారు. దాసరి పద్మ సమర్పణలో సిరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రామకృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... సంచలనాత్మక కథ. అంతా తెలుగువారినే పరిచయం చేస్తున్నాం. కథకు సరియైన టైటిల్. ఈ చిత్రం చలనచిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుందనే నమ్మకముంది. రామోజీ ఫిలిమ్ సిటీలో 85శాతం షూటింగ్ జరుపుకుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Feb 2010 | 4:33 am

హెలికాఫ్టర్ ప్రమాదానికి ఇతర కారణాలు ఉండొచ్చు?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూలిపోవడానికి వాతావరణమే కారణం కాదని, ఇతర కారణాలు కూడా ఉండొచ్చని ద్విసభ్య కమిటీ అభిప్రాయపడింది. అయితే, హెలికాఫ్టర్ ప్రమాదంలో కుట్ర తాలూకు ఆధారాలు కాక్‌పీట్ వాయిస్ రికార్డర్‌లో నమోదు కాలేదని కమిటీ సభ్యులు ఎంఆర్.రెడ్డి, హెచ్ఎస్.కోలాలు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 11 Feb 2010 | 2:43 am

బాలీవుడ్ నటుడు 'కింగ్ ఖాన్‌'కు బాసటగా ఎంఎన్ఎస్!

బాలీవుడ్ సినీ నటుడు షారూక్ ఖాన్‌కు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అండగా నిలిచింది. ఆయన తాజాగా నటించి శుక్రవారం విడుదల కానున్న "మై నేమ్ ఈజ్ ఖాన్" చిత్రం విడుదలను ఎంఎన్ఎస్ కార్యకర్తలు అడ్డుకోబోరని ఆ పార్టీ చీఫ్ రాజ్‌థాక్రే ప్రకటించారు.
Source: జాతీయ | 11 Feb 2010 | 1:30 am

క్షిపణుల ప్రయోగంలో చైనా కంటే భారత్ ముందంజ!

దేశ భద్రత అవసరాల నిమిత్తం ప్రయోగిస్తున్న క్షిపణి ప్రయోగాల్లో సరిహద్దు దేశం చైనా కంటే భారత్ ముందజంలోనే ఉందని డీఆర్‌డీఓ డైరక్టర్ వీకే.సరస్వత్ తెలిపారు. ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ క్షిపణి ప్రయోగాల్లో చైనా కంటే ముందంజలోనే ఉన్నామని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
Source: జాతీయ | 11 Feb 2010 | 1:21 am

జగపతి బాబుపై ప్రియమణికి ఎందుకంత ఇది...?!!

మొన్న "పెళ్లయిన కొత్తలో"... నిన్న "ప్రవరాఖ్యుడు"... నేడు "సాధ్యం". ఈ చిత్రాల్లో జగపతి బాబు సరసన నటించిన హీరోయిన్ ప్రియమణి. వీళ్లద్దరి జోడీ లక్కీ పెయిర్ అని కొందరు దర్శకనిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. అందుకే వీరిద్దరి జోడీగా చిత్రాలను రూపొందించేందుకు ముందుకు వస్తున్నారు.
Source: వినోదం | 11 Feb 2010 | 1:07 am

రోశయ్యకు భంగపాటు తప్పదేమో: టి.జీవన్ రెడ్డి

ముఖ్యమంత్రి కె.రోశయ్య ఇంటికి పోయే కాలం దగ్గర పడిందని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి జోస్యం చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలను ఈనెల 20వ తేదీ వరకు ప్రకటించరాదని పార్టీ హైకమాండ్‌ను రోశయ్య కోరినట్టు పత్రికల్లో వచ్చిన వార్తలపై జీవన్ రెడ్డి మండిపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 11 Feb 2010 | 12:29 am

నేటి నుంచి తెలంగాణ జన జాతర: సర్వం సిద్ధం

తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలు, చారిత్రక నేపథ్యాన్ని కళ్లకు కట్టేలా చూపించే తెలంగాణ జన జాతర గురువారం నుంచి మూడు రోజుల పాటు సాగనుంది. ఇందుకోసం రాజధానిలోని నిజాం కళాశాల మైదానం వేదికకానుంది. తెలంగాణాలోని విభిన్న కళారూపాలను.. ఆటపాటలను... ఆహార అలవాట్లను ఒక్కచోట చేర్చి ప్రపంచానికి చూపేందుకు తెలంగాణ యువ జేఏసీ దీన్ని నిర్వహిస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 11 Feb 2010 | 12:11 am

చిరంజీవికి పెరిగిన కొలెస్ట్రాల్: కరగదీస్తున్న వైద్యులు!

ప్రజారాజ్యం పార్టీ స్థాపనతో రాజకీయ నేతగా మారిన సినీ నటుడు చిరంజీవికి కొవ్వెక్కువైంది. పనీపాట లేకపోవడంతో ఆయన మరింతగా లావెక్కిపోతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగిపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్టు వైద్యులు అంటున్నారు.
Source: ఏపీ న్యూస్ | 10 Feb 2010 | 11:46 pm

దేశ రాజధానిలో అమెరికా జాతీయుడి అరెస్టు!

దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికా జాతీయుడిని సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది గురువారం అరెస్టు చేసింది. ఈయనకు లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉండివుండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరికొందరు మాత్రం.. లష్కర్ తీవ్రవాది, అమెరికా జాతీయుడు డేవిడ్ హెడ్లీ అనుచరునిగా పేర్కొంటున్నారు.
Source: జాతీయ | 10 Feb 2010 | 11:10 pm

తెలంగాణపై రెండుగా చీలిన కాంగ్రెస్ కోర్ కమిటీ?

తెలంగాణ అంశంపై కాంగ్రెస్ కోర్ కమిటీ (సీసీసీ) సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో కమిటీ రెండుగా చీలిపోయినట్టు సమాచారం. ఫలితంగా కేంద్ర హోంశాఖ సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలపై ప్రకటన నాన్చుడి ధోరణి అవలంభిస్తున్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 10 Feb 2010 | 10:54 pm

నా వంటపై నమ్మకం లేదా..?

"అత్తగారింటికి వెళ్తున్న కూతురితో తల్లి ఇలా అంటోంది.""చూడమ్మా.. లలిత ముందు భోజనం నీ భర్తకు వడ్డించి అతను తిన్న తర్వాత నువ్వు తినాలి సరేనా..?" చెప్పింది తల్లి"ఓహో..
Source: వినోదం | 10 Feb 2010 | 10:46 pm

బాబుకు ముఖ్యమంత్రి యోగం లేనట్టే: జ్యోతిష్యులు

జ్యోతిష్యం.. దేశ ప్రజల్లోనే కాకుండా రాజకీయ నేతల దిన చర్యల్లో కీలక పాత్ర పోషిస్తున్న భవిష్యశాస్త్రం. జ్యోతిష్యులు చెప్పిన దానిని మన రాజకీయ నేతలు తు.చ తప్పకుండా పాటిస్తుంటారు. ఇలాంటి జ్యోతిష్యులు ఇపుడు సరికొత్త విషయం చెపుతున్నారు. అదేమంటే.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఇక ముఖ్యమంత్రి యోగం లేదని ఘంటాపథంగా చెపుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 10 Feb 2010 | 10:38 pm

భార్యను లొంగదీసుకోవడానికి...

"భార్యను లొంగదీసుకోవడానికి ఎన్నో మార్గాలు అనే పుస్తకం రాసి చివరకు భార్య కాళ్లు పట్టుకుంటున్నావ్ కదరా..""ఏం గతి పట్టిందిరా నీకు..?" వాపోయాడు వినోద్ "భార్యను లొంగదీసుకునే మార్గాల్లో...
Source: వినోదం | 10 Feb 2010 | 10:36 pm

'ప్రతిభ'కు మచ్చతెచ్చిన భాగస్వామి: నిర్ధారించిన ఓఎస్డీ!

దేశ తొలి మహిళ, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు ఆమె భర్త దేవీలాల్ సింగ్ షెకావత్ మచ్చ తెచ్చారు. ఆయన స్వగ్రామంలోని ఒక పేద రైతు భూమిని ఆక్రమించారనే అవవాదును మూటగట్టుకున్నారు.
Source: జాతీయ | 10 Feb 2010 | 9:43 pm

ముంబై మల్టీప్లెక్స్‌లలో 'ఎంఎన్ఐకె' బుకింగ్స్ ప్రారంభం!

బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ నటించిన "మై నేమ్ ఈజ్ ఖాన్" (ఎంఎన్ఐకే) చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి గట్టి హామీ లభించడంతో ముంబై మల్టీప్లెక్ థియేటర్ యజమానులు ఈ చిత్రానికి బుకింగ్స్‌ను ప్రారంభించారు. అలాగే, ముందు జాగ్రత్త చర్యగా ముంబై పోలీసులు వెయ్యి మంది శివసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
Source: జాతీయ | 10 Feb 2010 | 9:17 pm

నా వెడ్డింగ్ కార్డ్స్ ప్రింటయ్యాయా...?! ఎక్కడ..?!!

గత కొన్ని రోజులుగా తన వివాహం గురించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని, ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అందాల నటి ఛార్మి తెలిపారు. పంజాబ్‌కు చెందిన ఓ యువకుడితో తనకు నిశ్చితార్థం జరిగిందనీ, వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ అయ్యాయని మీడియాలో వచ్చిన వార్తలను చూసి ఆశ్చర్యపోయానని ఛార్మి చెప్పింది. ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్‌పైనే ఉందని, పెళ్లికి ఇంకా టైమ్ ఉందని, తన పెళ్లి విషయం ముందుగా మీడియాకే చెపుతానని అంటోంది ఛార్మి. అలాంటి రూమర్స్‌ని సృష్టించేవారు తమ విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. తన తాజా చిత్రం "సై ఆట" త్వరలో విడుదల కానుందనీ, ఆ సినిమా తనను సరికొత్తగా చూపిస్తుందని ఛార్మింగ్ గాళ్ ఛార్మి చెబుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Feb 2010 | 11:31 am

"బన్నీ"తో నటించడం చాలా హ్యాపీగా ఉంది: తమన్నా

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న "హ్యాపీడేస్" చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అందాల ముద్దుగుమ్మ "తమన్నా". "కాళిదాసు" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ తెల్లపిల్ల తర్వాత లవ్‌బాయ్ సిద్ధార్థతో "కొంచెం-ఇష్టం కొంచెం-కష్టం"లో నటించింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో చేతినిండా ఆఫర్లతో బిజీబిజీగా ఉన్న తమన్నా.. తాజాగా బన్నీతో జతకట్టనుందని స్వయంగా చెప్పుకుంది. కోలీవుడ్‌లోనూ మంచి ఆఫర్లు వస్తున్నాయని, తాజాగా బన్నీ హీరో క్రేజీ హీరో అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్స్ బద్రీనాథ్ సినిమా ద్వారా తనకు దక్కిందని చెప్పింది. ఆర్య సినిమాలో ఆయన నటన చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యాయని, అర్జున్ సరసన నటించడం చాలా సంతోషంగా ఉందని ఈ హ్యాపీడేస్ మధుబాల చెప్పుకొచ్చింది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Feb 2010 | 7:47 am

ముగిసిన కోర్ కమిటీ భేటీ: ప్రకటనపై మీన మేషాలు!

న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం బుధవారం సాయంత్రం జరిగింది. ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ అంశంతో పాటు.. పెట్రో ధరల అంశంపై చర్చలు జరిపారు.
Source: జాతీయ | 10 Feb 2010 | 7:23 am

మీ నాన్నకు.. మీకు అన్యాయం జరిగితే..: మందకృష్ణ

మీ నాన్నకు, మీ బావకు, మీ అక్కకు, మీపై ఎవరైనా విమర్శలు చేస్తే.. అది తెలంగాణ ప్రాంత ప్రజలను విమర్శించినట్టా అని తెరాస అధినేత కేసీఆర్ తనయుడు కె.తారకరామారావును ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్నది మీ ఒక్క కుటుంబం... మీ కుటుంబ సభ్యులేనా అని అడిగారు. మీ కుటుంబ సభ్యులను ఎవరైనా కించపరిచేలా మాట్లాడితే తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజానీకాన్ని కించపరిచినట్టా అని ఆయన ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 10 Feb 2010 | 7:11 am

సీఎంపై విమర్శలా.. అయితే పార్టీని వీడండి: రఘువీరా

ముఖ్యమంత్రి రోశయ్య కేవలం సీమాంధ్రకు మాత్రమే ముఖ్యమంత్రి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తానికి సీఎం అని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి అన్నారు. ఆయనపై విమర్శలు చేసే పార్టీ నేతలంతా ముందు పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళితే మంచిదన్నారు. ఆతర్వాతే వారు ఎలాంటి ఆరోపణలైనా చేసుకోవచ్చన్నారు.
Source: ఏపీ న్యూస్ | 10 Feb 2010 | 6:33 am

నచ్చి ఎదపై పొడిపించుకున్నా: త్రిష

నా పేరు త్రిష. ఆ పేరులోనే ప్రత్యేకత ఉంది. అదొక వరంగా భావిస్తా. కొన్ని వేల మందిని పరిశీలించినా ఆ పేరు వినిపించలేదు. అందుకే నాకు నచ్చి గుండెపై పొడిపించుకున్న నీమో ఫిష్ టాటూ నాలో చాలా ప్రత్యేకమైనది. దానివల్ల ఎవరైనా నావైపు తిరిగి చూస్తారు. అది దిష్టి అని కొందరు అనుకుంటున్నారు. బహుశా అదికూడా బాగానే ఉంది. అలాగే నా ఎడమచేతిపై ఉన్న టారస్ టాటూ నేను మే 4న పుట్టాను అనడానికి సూచిక. నీమో, టారస్ అంటే నాకు చాలా ఇష్టం. వాటిని నా నుంచి విడదీయలేరు. కారణం... అవి పచ్చబొట్లు కదా...!
Source: Yahoo! Telugu: Entertainment | 10 Feb 2010 | 6:27 am

పరస్పర అవగాహనే వారి సమస్యకు పరిష్కారం: చవాన్

శివసేన ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు బాల్‌థాక్రేపై మండిపడిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ బుధవారానికి కాస్త చల్లబడ్డారు. బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్, శివసేన మధ్య ఉన్న సమస్యకు పరస్పర అవగాహనతోనే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. దీనిపై ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. ఇరు పక్షాలు ఒక అంగీకారానికి వచ్చినపుడే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.
Source: జాతీయ | 10 Feb 2010 | 5:51 am

ఏసీబీ వలలో చిక్కిన చీరాల డిప్యూటీ కలెక్టర్ శ్రీలత!

అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో మరో డిప్యూటీ కలెక్టర్ చిక్కారు. ప్రకాశం జిల్లా చీరాల భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్న శ్రీలత ఆదాయానికి మంచి ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో సంబంధిత అధికారులు ఆమె నివాసంపై బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.
Source: ఏపీ న్యూస్ | 10 Feb 2010 | 5:50 am

లంక ఆర్మీ మాజీ చీఫ్ విడుదలకు భాజపా డిమాండ్!

శ్రీలంక ప్రభుత్వం అరెస్టు చేసిన ఆ దేశ ఆర్మీ మాజీ చీఫ్ శరత్ ఫోన్సెకాను తక్షణం విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఇలాంటి చర్యలను అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని ఆ పార్టీ లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు.
Source: జాతీయ | 10 Feb 2010 | 3:18 am

మంత్రులూ.. జర జాగ్రత్తగా ఉండండి: సీఎం హెచ్చరిక!

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో మంత్రులందరూ జర జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య హెచ్చరించారు. పెరిగిన నిత్యావసర వస్తు ధరలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకు పడే అవకాశం ఉందని అందువల్ల మంత్రులు పూర్తి స్థాయి గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 10 Feb 2010 | 2:46 am