|
లంక ఆర్మీ మాజీ చీఫ్ విడుదలకు భాజపా డిమాండ్!శ్రీలంక ప్రభుత్వం అరెస్టు చేసిన ఆ దేశ ఆర్మీ మాజీ చీఫ్ శరత్ ఫోన్సెకాను తక్షణం విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఇలాంటి చర్యలను అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని ఆ పార్టీ లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 10 Feb 2010 | 8:48 am సత్యం కుంభకోణం: బెయిలుపై విడుదలైన శ్రీనివాస్కోట్ల రూపాయల సత్యం కుంభోకోణం కేసులో అరెస్టైన ప్రైజ్ వాటర్‌హౌజ్ కూపర్‌కు చెందిన ఆడిటర్ తాళ్లూరి శ్రీనివాస్ బుధవారం బెయిలుపై విడుదలయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని చెంచల్ గూడ జైలులో ఉన్న విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 10 Feb 2010 | 8:37 am మంత్రులూ.. జర జాగ్రత్తగా ఉండండి: సీఎం హెచ్చరిక!అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో మంత్రులందరూ జర జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య హెచ్చరించారు. పెరిగిన నిత్యావసర వస్తు ధరలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకు పడే అవకాశం ఉందని అందువల్ల మంత్రులు పూర్తి స్థాయి గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.Source: Yahoo! Telugu: News | 10 Feb 2010 | 8:15 am పరిష్కారం లభించరాదనే రెచ్చగొడుతున్నారు: జేసీతెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించకూడదని లక్ష్యంగా పెట్టుకున్న వారే సీమాంధ్ర ప్రజానీకాన్ని, నేతలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జె.సి.దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఎవరూ మాట్లాడరాదని కేంద్రం ఆదేశించినా నేతలు శిరసావహించక పోవడానికి కారణం ఏమిటని ఆయన ప్రశ్నించారు.Source: Yahoo! Telugu: News | 10 Feb 2010 | 7:59 am లాభాలతో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో పయనిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 35 పాయింట్లు బలపడి, 16,077 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 11 పాయింట్లు వృద్ధి చెంది, 4,804 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 10 Feb 2010 | 7:54 am "బన్నీ"తో నటించడం చాలా హ్యాపీగా ఉంది: తమన్నాశేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న "హ్యాపీడేస్" చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అందాల ముద్దుగుమ్మ "తమన్నా". "కాళిదాసు" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ తెల్లపిల్ల తర్వాత లవ్‌బాయ్ సిద్ధార్థతో "కొంచెం-ఇష్టం కొంచెం-కష్టం"లో నటించింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో చేతినిండా ఆఫర్లతో బిజీబిజీగా ఉన్న తమన్నా.. తాజాగా బన్నీతో జతకట్టనుందని స్వయంగా చెప్పుకుంది. కోలీవుడ్‌లోనూ మంచి ఆఫర్లు వస్తున్నాయని, తాజాగా బన్నీ హీరో క్రేజీ హీరో అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్స్ బద్రీనాథ్ సినిమా ద్వారా తనకు దక్కిందని చెప్పింది. ఆర్య సినిమాలో ఆయన నటన చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యాయని, అర్జున్ సరసన నటించడం చాలా సంతోషంగా ఉందని ఈ హ్యాపీడేస్ మధుబాల చెప్పుకొచ్చింది.Source: Yahoo! Telugu: Entertainment | 10 Feb 2010 | 7:47 am లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీల ర్యాలీబుధవారం బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. దీంతో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 39 పాయింట్లు లాభపడి, 16,080 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 15 పాయింట్లు పుంజుకుని, 4,808 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 10 Feb 2010 | 7:31 am అమెరికాలో రెండో అతిపెద్ద హిమపాతం: భారీ నష్టం!అమెరికాను హిమపాతం ముంచెత్తుతోంది. ఆ దేశ చరిత్రలోనే రెండో అతిపెద్ద మంచు తుఫానుగా నమోదైంది. దీంతో యూఎస్ ఈస్ట్ కోస్ట్ ప్రాంతాన్ని పూర్తిగా మంచు దుప్పటి కప్పేసింది. ఈ మంచు ఏకంగా 14 అంగుళాలు (36 సెంమీ) మేరకు పేరుకుని పోయినట్టు స్థానిక వాతావరణ అధికారులు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 10 Feb 2010 | 7:10 am ఉత్తరాదిలో కొనసాగుతున్న మావోల విధ్వంసం!నక్సలైట్ల ఏరివేతలో భాగంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు ఐదు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇప్పటికే... మూడురోజుల బంద్‌ను పాటిస్తున్న మావోలు రైల్వే ఆస్తుల ధ్వంసరచనే లక్ష్యంగా చేసుకున్నారు.Source: Yahoo! Telugu: News | 10 Feb 2010 | 6:42 am నచ్చి ఎదపై పొడిపించుకున్నా: త్రిషనా పేరు త్రిష. ఆ పేరులోనే ప్రత్యేకత ఉంది. అదొక వరంగా భావిస్తా. కొన్ని వేల మందిని పరిశీలించినా ఆ పేరు వినిపించలేదు. అందుకే నాకు నచ్చి గుండెపై పొడిపించుకున్న నీమో ఫిష్ టాటూ నాలో చాలా ప్రత్యేకమైనది. దానివల్ల ఎవరైనా నావైపు తిరిగి చూస్తారు. అది దిష్టి అని కొందరు అనుకుంటున్నారు. బహుశా అదికూడా బాగానే ఉంది. అలాగే నా ఎడమచేతిపై ఉన్న టారస్ టాటూ నేను మే 4న పుట్టాను అనడానికి సూచిక. నీమో, టారస్ అంటే నాకు చాలా ఇష్టం. వాటిని నా నుంచి విడదీయలేరు. కారణం... అవి పచ్చబొట్లు కదా...!Source: Yahoo! Telugu: Entertainment | 10 Feb 2010 | 6:27 am స్వల్ప నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ తేలికపాటి ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభ, నష్టాలతో ర్యాలీని కొనసాగిస్తోన్నబాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో స్వల్ప నష్టాల్లో కూరుకుపోయింది. ఫలితంగా సెన్సెక్స్.. కేవలం ఒక పాయింట్ నష్టంతో, 16,040 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా కేవలం మూడు పాయింట్ల వృద్ధితో, 4,789 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 10 Feb 2010 | 6:21 am భారత్-పాక్ చర్చల్లో మధ్యవర్తిత్వానికి సిద్ధం: ఇరాన్దాయాది దేశాలైన భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య జరిగే చర్చల్లో మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. అలాగే, ఈ రెండు దేశాలు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి విదేశాంగ స్థాయి చర్చలకు మొగ్గు చూపడాన్ని ఇరాన్ స్వాగతించింది.Source: Yahoo! Telugu: News | 10 Feb 2010 | 6:09 am లంక ఆర్మీ మాజీ చీఫ్ విడుదలకు భాజపా డిమాండ్!శ్రీలంక ప్రభుత్వం అరెస్టు చేసిన ఆ దేశ ఆర్మీ మాజీ చీఫ్ శరత్ ఫోన్సెకాను తక్షణం విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఇలాంటి చర్యలను అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని ఆ పార్టీ లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు.Source: జాతీయ | 10 Feb 2010 | 3:18 am మంత్రులూ.. జర జాగ్రత్తగా ఉండండి: సీఎం హెచ్చరిక!అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో మంత్రులందరూ జర జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య హెచ్చరించారు. పెరిగిన నిత్యావసర వస్తు ధరలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకు పడే అవకాశం ఉందని అందువల్ల మంత్రులు పూర్తి స్థాయి గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 10 Feb 2010 | 2:46 am పరిష్కారం లభించరాదనే రెచ్చగొడుతున్నారు: జేసీతెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించకూడదని లక్ష్యంగా పెట్టుకున్న వారే సీమాంధ్ర ప్రజానీకాన్ని, నేతలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జె.సి.దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఎవరూ మాట్లాడరాదని కేంద్రం ఆదేశించినా నేతలు శిరసావహించక పోవడానికి కారణం ఏమిటని ఆయన ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 10 Feb 2010 | 2:30 am ఉత్తరాదిలో కొనసాగుతున్న మావోల విధ్వంసం!నక్సలైట్ల ఏరివేతలో భాగంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు ఐదు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇప్పటికే... మూడురోజుల బంద్‌ను పాటిస్తున్న మావోలు రైల్వే ఆస్తుల ధ్వంసరచనే లక్ష్యంగా చేసుకున్నారు.Source: జాతీయ | 10 Feb 2010 | 1:12 am పిచ్చి వేషాలు వేస్తే భద్రత ఉపసంహరిస్తాం: మహా సీఎంశివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్‌థాక్రే పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే ఆయనకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను ఉపసంహరిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ హెచ్చరించారు. ఇప్పటికే పలువురు శివసేన ఎమ్మెల్యేలకు కల్పిస్తున్న భద్రతను తొలగించినట్టు ఆయన గుర్తు చేశారు.Source: జాతీయ | 10 Feb 2010 | 12:00 am నేడు కోర్ కమిటీ భేటీ: విధి విధానాలపై ప్రకటన!కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం బుధవారం సాయంత్రం ఐదు గంటలకు భేటీ కానుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కేంద్ర హోం మంత్రి చిదంబరం, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ, న్యాయశాఖామంత్రి వీరప్ప మొయిలీలు హాజరుకానున్నారు.Source: ఏపీ న్యూస్ | 9 Feb 2010 | 11:23 pm దినదిన గండంగా రోశయ్య సర్కారు మనుగడ: హరీష్ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్రభుత్వం మనుగడ దినదిన గండంగా మారిందని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు జోస్యం చెప్పారు. అందువల్ల ఈ ప్రభుత్వం ఏ క్షణమైన కూలిపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 9 Feb 2010 | 11:13 pm అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చుతాం: దామోదర్ రెడ్డితమ లక్ష్యం నెరవేరని పక్షంలో రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చుతామని కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత సీనియర్ నేత ఆర్.దామోదర్ రెడ్డి హెచ్చరించారు. అందువల్ల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బాయ్‌కట్ చేయడం అనేది తమకు పెద్ద సమస్య కాబోదని ఆయన ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 9 Feb 2010 | 11:06 pm త్రిపుర రాష్ట్ర వ్యవసాయానికి బంగ్లాదేశ్ నదీజలాలుభారత్-బంగ్లాదేశ్ దేశాల మద్య దౌత్య సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి. బంగ్లా సరిహద్దు రాష్ట్రమైన త్రిపురలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందించేందుకు ఆ దేశ ప్రభుత్వం ముందుకు వచ్చింది. బంగ్లాలోని ఫెనీ నదీ జలాలను త్రిపురలోని సబ్రూమ్ సబ్ డివిజన్ ప్రాంతానికి సాగు, తాగు నీటి అవసరాలకు సరఫరా చేసేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.Source: జాతీయ | 9 Feb 2010 | 10:48 pm బాయ్‌కట్ చేస్తే.. వారి గోతి వారు తవ్వుకున్నట్టే: మొయిలీజస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాల వెల్లడిలో జాప్యం జరగడాన్ని సహించేది లేదని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర న్యాయ శాఖామంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీ విధి విధానాలు త్వరగా ప్రకటించకుంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బాయ్‌కట్ చేస్తామని ఆ ప్రాంత ఎమ్మెల్యేలు చేసిన హెచ్చరికలను అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోందన్నారు.Source: జాతీయ | 9 Feb 2010 | 9:13 pm పొరుగు దేశాలపై డేగ కన్ను: ఎలక్ట్రానికి నిఘా వ్యవస్థ!శత్రు దేశాల నుంచి ఎదురయ్యే ముప్పును ముందుగానే పసిగట్టేందుకు వీలుగా భారత్ తన గూఢచార నిఘా వ్యవస్థను మెరుగుపరుస్తోంది. ఇందులోభాగంగా.. పొరుగు దేశాల కదలికలపై నిరంతరం డేగకన్ను వేసి ఉంచడానికి అవసరమైన నిఘా పెట్టి ఉంచగల ఎలక్ట్రానికి గూఢచార వ్యవస్థను రూపొందించింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.Source: జాతీయ | 9 Feb 2010 | 8:55 pm విక్టరీ వెంకటేష్ "గంగ"కోసం వేటవిక్టరీ వెంకటేష్ తదుపరి చిత్రం గంగ. ఈ చిత్రంలో వెంకీ సరసన నటింపజేసేందుకు కొత్త హీరోయిన్ కోసం వేటలో పడ్డారు. ఇటీవలే ఆయన నటించిన "నమో వెంకటేశ" చిత్రం విడుదలైంది. ప్రస్తుతం వెంకీ విదేశాలలో రెస్ట్ తీసుకుంటున్నారు. కొద్ది రోజుల్లో ఆయన రాగానే తాజా చిత్రం షూటింగ్‌కు వెళ్లనుంది. అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నల్లమలుపు శ్రీనివాస్ నిర్మాత. ప్రస్తుతం ముంబయి, కేరళ నుంచి హీరోయిన్లను ఎంపిక చేసేందుకు వేటలో ఉన్నారు. కొద్ది రోజుల్లో ఎవరనే విషయం ఫైనల్ కానుంది. ఈ చిత్రానికి "గంగ" అనే పేరు పరిశీలనలో ఉన్నది.Source: Yahoo! Telugu: Entertainment | 9 Feb 2010 | 12:13 pm జూనియర్ ఎన్టీఆర్ "బృందావనం"- గోవిందుడు అందరివాడెఎన్టీఆర్తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం "బృందావనం"- గోవిందుడు అందరివాడే అనే టాగ్ లైన్ కూడా పెట్టారు. తాజా షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లోని వివిధ లొకేషన్లను పరిశీలించారు. వైజాగ్‌లోనూ చేయనున్నారు. ఈనెల 20 నుంచి కంటెన్యూగా షూటింగ్ సాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ తారాగణం ఇందులో ఉన్నారు. ఈ చిత్రాన్ని జూన్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 9 Feb 2010 | 12:02 pm ఫిబ్రవరి మూడో వారంలో వస్తోన్న "కిలాడి"పందెం కోడి, పొగరు, భరణి మొదలైన సూపర్ హిట్ చిత్రాల ద్వారా హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న యాక్షన్ హీరో విశాల్ ఇప్పుడు మరో భారీ చిత్రాన్ని చేశారు. జీకే ఫిలిమ్ కార్పొరేషన్ పతాకంపైన కిలాడి అనే క్రేజీ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు.Source: Yahoo! Telugu: Entertainment | 9 Feb 2010 | 11:37 am అక్కడ షారుక్ ఖాన్... ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్సుమారు నెలన్నర క్రితం జూనియర్ ఎన్టీఆర్ "అదుర్స్" చిత్రం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆంధ్ర రాష్ట్రంలో విడుదలైంది. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో "అదుర్స్" చిత్రానికి అప్పట్లో వ్యతిరేకత ఎదురైనప్పటికీ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ జోక్యంతో అది సద్దుమణిగింది. ప్రస్తుతం మరోసారి కొడాలి నాని వ్యాఖ్యలతో "అదుర్స్" చిత్రాన్ని "బెదర్" కొడుతున్నారు తెలంగాణావాదులు. ఇటువంటి పరిస్థితే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ విషయంలోనూ జరుగుతోంది. పాకిస్తాన్ క్రికెటర్లకు ఐపీఎల్‌లో చోటు కల్పించి ఉండాల్సిందని పాక్ క్రికెటర్లకు అనుకూలంగా మాట్లాడిన షారుక్ ఖాన్ దేశద్రోహి అనీ, కనుక అతని సినిమా "మై నేమ్ ఈజ్ ఖాన్" చిత్రాన్ని అడ్డుకోవాలని శివసేన అధినేత బాల్ థాకరే కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ నేపధ్యంలో బాలీవుడ్‌లో షారుక్ సినిమా విడుదల సందర్భంగా ప్రధాన థియేటర్ల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి మన టాలీవుడ్‌లో ఆంధ్రా హీరోల సినిమాలు పోలీసుల బందోబస్తు మధ్య ఎలా విడుదల అవుతున్నాయో... అదేవిధంగా షారుక్ ఖాన్ చిత్రం కూడా ఫిబ్రవరి 12న విడుదల కానుంది.Source: Yahoo! Telugu: Entertainment | 9 Feb 2010 | 8:56 am నాని అగ్నికి ఆజ్యం పోశాడు: చంద్రబాబు నాయుడుతెలంగాణా- సమైక్యాంధ్ర ఉద్యమాలతో ఒకపక్క రాష్ట్రం రగిలిపోతుంటే వాటికి మరింత ఆజ్యం పోసేటట్లు కొడాలి నాని వ్యాఖ్యలు చేశాడని, అవి సరికాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లాలో రెండోరోజు పర్యటిస్తున్న చంద్రబాబు నాని వ్యాఖ్యలపై స్పందించారు.Source: ఏపీ న్యూస్ | 9 Feb 2010 | 8:53 am ఎంత పని చేశావన్నా...? నానిపై ఎన్టీఆర్ గరం గరం..?!!కొడాలి నాని- జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ స్వయానా అన్నదమ్ములు కాకపోయినప్పటికీ... అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉంటారు. అటువంటిది తెలంగాణా ఉద్యమం వాళ్లిద్దర్నీ తలోదిక్కున విడదీసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమైక్యాంధ్ర ధ్యేయంగా విద్యార్థులు చేస్తున్న పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవడమే కాక వారిని అరెస్టు చేయడాన్ని కొడాలి నాని తీవ్రంగా ఖండించారు. తెరాస నాయకులపై నిప్పులు చెరిగారు. అదుర్స్ సినిమాను అడ్డుకుంటామని సవాల్ విసిరినవారు ఎంతవరకు సఫలమయ్యారని విమర్శించారు. హైదరాబాదు గురించి మాట్లాడితే నాలుకలు కోస్తామన్న కేసీఆర్.. ఎంతమంది నాలుకలు కోశారని ప్రశ్నించారు...?Source: Yahoo! Telugu: Entertainment | 9 Feb 2010 | 5:52 am వైఎస్-సోనియా ఫోటోలకు మొక్కండి: శైలజానాథ్ప్రజలకు మంచి చేయాలనే మంచి బుద్ధి, తపన రావాలంటే తెలుగుదేశం పార్టీ నేతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీల ఫోటోలకు పూజలు చేసి, మొక్కాలని ప్రభుత్వ విఫ్ విప్ శైలజనాథ్ సూచన చేశారు. ఇలా చేయడం వల్ల వారికి జ్ఞానోదయం కలుగుతుందని తాము భావిస్తున్నట్టు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 9 Feb 2010 | 5:31 am 'మైనేమ్ ఈజ్ ఖాన్'కు పూర్తి భద్రత: ముంబై కాప్స్బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ నటించి, ఈనెల 12వ తేదీన విడుదల కానున్న "మైనేమ్ ఈజ్ ఖాన్" అనే చిత్రానికి పూర్తి భద్రత కల్పించనున్నట్టు ముంబై పోలీసు కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఆయనను కలిసిన ఆ చిత్ర ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహార్‌కు ఆయన హామీ ఇచ్చారు.Source: జాతీయ | 9 Feb 2010 | 5:05 am బీటీ వంకాయ సాగుకు అనుమతి నిరాకరణ: కేంద్రంబీటీ వంకాయ వాణిజ్య సాగు అనుమతులను కేంద్రం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ వంకాయలపై జరుగుతున్న పరిశోధనలు పూర్తయ్యాకే అనుమతులు మంజూరు చేస్తామని కేంద్రం మంగళవారం ప్రకటించింది.Source: జాతీయ | 9 Feb 2010 | 4:32 am గాసిప్స్ కోసం వెతుకుతాను: విమలా రామన్తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటిస్తున్న విమలారామన్ తాజాగా తరుణ్‌తో "చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి"లో నటిస్తోంది. ఈ చిత్రానికి ముగ్గురు దర్శకులు మారారు. ఆ విషయం అలా ఉంచితే... ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఫారిన్‌లో చిన్నపాటి తగాదా అయింది. ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్నది సారాంశం. ఆ విషయాన్ని రెండవ దర్శకుడు వి.ఎన్. ఆదిత్య కూడా ధృవీకరించారు. అయితే విమలా రామన్ మాత్రం "గాసిప్స్ నిజమని నేననుకోను. నిజమయితే గాసిప్స్ ఎందుకవుతాయ"ని ప్రశ్నిస్తోంది. కాకపోతే విశేషం ఏమిటంటే... కొంతమంది తమ అమూల్యమైన సమయాన్ని తన గురించి కేటాయిస్తున్నారంటే తానెంతో ఎత్తుకు ఎదిగోనని గాసిప్స్ కూడా ఒక ఎసెట్‌గా ఫీలవుతూ చెబుతోంది. ఒకరకంగా గాసిప్స్‌ను బట్టి తనను తాను తెలుసుకోగలుగుతాననీ, అవన్నీ చదివితే ఎలా ఉండాలో గైడ్‌లైన్స్‌గా ఉంటాయని అంటోంది. అందుకే అవన్నీ జాగ్రత్తగా నెట్ ముందు కూర్చుని చూస్తుంటానని గర్వంగా చెపుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 9 Feb 2010 | 4:31 am మమ్మేల రావయ్యా.. శ్రీశైల మల్లయ్యా..!!కేదారంలో స్నానం చేసినా, కాశీలో మరణించినా పునర్జన్మ ఉండదంటారు. అలాంటిది శ్రీశైల శిఖర దర్శన యాత్రతోనే ముక్తి కలుగుతుందని ప్రతీతి. అందుకే "స్పర్శవేదుల రాశి ప్రత్యక్ష రాశి" అని పేరు పొందిన శ్రీశైల యాత్రకు, శిఖర దర్శనానికి భక్తులు రెక్కలు కట్టుకుని వాలిపోతుంటారు. ఎన్నిసార్లు చూసినా తనివితీరని ఈ దివ్య పుణ్యక్షేత్రాన్ని దర్శించి భక్తిభావంతో పులకించి పోతుంటారు.Source: వినోదం | 9 Feb 2010 | 4:19 am వైఎస్ దుర్మరణం తర్వాత టార్గెట్ చేసిన బాబు: కేవీపీదివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి దుర్మరణం అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, ప్రజా భద్రతా కమిటీ ఛైర్మన్ డాక్టర్ కేవీపీ.రామచంద్రరావు ఆరోపించారు. ఈ అంశంపై ఆయన చంద్రబాబుకు మంగళవారం బహిరంగ లేఖ రాశారు.Source: ఏపీ న్యూస్ | 9 Feb 2010 | 4:03 am హన్మకొండలో దారుణం: బాలుడి గొంతు కోసిన టీచర్!నల్గొండ జిల్లాలోని హన్మకొండలో మరో దారుణం జరిగింది. చిన్నారుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన ఓ ఉపాధ్యాయుడే యముడిగా మారాడు. సభ్య సమాజం తలదించుకునేలా పది సంవత్సరాల బాలుడి గొంతు కోసి పారిపోయాడు. స్థానికంగా ఒక తండాలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న నాగరాజు అనే టీచర్ ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.Source: ఏపీ న్యూస్ | 9 Feb 2010 | 3:54 am బడ్జెట్ ఎలా ఆమోదిస్తారో చూస్తాం: టి.జీవన్ రెడ్డితెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకుండా కొత్త బడ్జెట్‌ను ఎలా ఆమోదిస్తారో చూస్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలను ప్రకటించని పక్షంలో తమ ప్రాంతానికి చెందిన సభ్యులెవరూ బడ్జెట్ సమావేశాలకు హాజరుకారన్నారు.Source: ఏపీ న్యూస్ | 9 Feb 2010 | 3:33 am పాక్ తీవ్రవాదులకు ఏజెంట్‌గా షారూక్: వీహెచ్పీబాలీవుడ్ సినీ నటుడు షారూక్ ఖాన్ పాకిస్థాన్ తీవ్రవాదులకు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలకు పాకిస్థాన్ క్రికెట్ ఆటగాళ్లకు కూడా చోటు కల్పించి ఉంటే బాగుండు అని వ్యాఖ్యానించడంలో ఆంతర్యమేమిటని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తొగాడియా ప్రశ్నించారు.Source: జాతీయ | 9 Feb 2010 | 2:42 am
|