|
మళ్ళీ భారత్‌కు రానున్న ఈస్ట్ ఇండియా కంపెనీగతంలో వ్యాపారం పేరుతో భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరింపజేసి నిదానంగా దేశాన్నే తన హస్తగతం చేసుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రస్తుతం మళ్ళీ తన వ్యాపారాన్ని భారతదేశంలో మరోమారు విస్తరింపజేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంది. కాని సదరు కంపెనీని భారతీయుడు కొనుక్కోవడం విశేషం. అతనే ఇప్పుడు ఏకంగా తన మాతృదేశంలో ఆ కంపెనీ పేరుతోనే వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిచుకున్నట్లు భారత సంతతికి చెందిన కంపెనీ యజమాని సంజీవ్ మెహతా తెలిపారు.Source: Yahoo! Telugu: News | 9 Feb 2010 | 8:50 am చిరంజీవికి కొవ్వెక్కువైంది: కరగదీస్తున్న వైద్యులు!ప్రజారాజ్యం పార్టీ స్థాపనతో రాజకీయ నేతగా మారిన సినీ నటుడు చిరంజీవికి కొవ్వెక్కువైంది. పనీపాట లేకపోవడంతో ఆయన మరింతగా లావెక్కిపోతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగిపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్టు వైద్యులు అంటున్నారు.Source: Yahoo! Telugu: News | 9 Feb 2010 | 8:40 am పాక్ తీవ్రవాదులకు ఏజెంట్‌గా షారూక్: వీహెచ్పీబాలీవుడ్ సినీ నటుడు షారూక్ ఖాన్ పాకిస్థాన్ తీవ్రవాదులకు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలకు పాకిస్థాన్ క్రికెట్ ఆటగాళ్లకు కూడా చోటు కల్పించి ఉంటే బాగుండు అని వ్యాఖ్యానించడంలో ఆంతర్యమేమిటని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తొగాడియా ప్రశ్నించారు.Source: Yahoo! Telugu: News | 9 Feb 2010 | 8:12 am లాభాల్లో స్టాక్ మార్కెట్: ఆశాజనకంగా సెన్సెక్స్ ర్యాలీబాంబే స్టాక్ మార్కెట్ మంగళవారం ఆశాజనకంగా ర్యాలీని కొనసాగిస్తోంది. విదేశీ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మంగళవారం మధ్యాహ్నం 12.25 గంటల ప్రాంతంలో 59 పాయింట్లు వృద్ధి చెంది, 15,995 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 25 పాయింట్ల స్వల్ప లాభంతో, 4,787 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 9 Feb 2010 | 8:06 am తాలిబాన్ చీఫ్ హకీముల్లా మృతిని ధృవీకరించిన పాక్పాకిస్థాన్లోని తాలిబాన్ చీఫ్ హకీముల్లా మృతిని పాకిస్థాన్ ధృవీకరించింది. అమెరికాకు చెందిన మానవ రహిత విమానాలు (ద్రోన్) జరిగిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు పాకిస్థాన్ నిర్ధారించింది.Source: Yahoo! Telugu: News | 9 Feb 2010 | 7:20 am అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను అడ్డుకోవద్దు: కేకేశ్రీకృష్ణ కమిటీ విధి విధానాలతో బడ్జెట్ సమావేశాలకు లింకు పెడుతూ వాటిని అడ్డుకోవాలని ఆలోచన చేయవద్దని కే. కేశరావు ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. తెలంగాణా ఏర్పాటుకోసమై కేంద్ర ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించిందనీ, అందులో భాగంగానే శ్రీకృష్ణ కమటీని ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు.Source: Yahoo! Telugu: News | 9 Feb 2010 | 7:13 am ద్రవ్యోల్బణంతో పెరిగిన పాల ధరలు : సిటీ గ్రూప్ఆహార ద్రవ్యోల్బణంతోపాటు పాల ధరలు కూడా పెరిగాయి. ప్రభుత్వ నివేదికననుసరించి ఆహార ద్రవ్యోల్బణంతోపాటు పాలు, పాల ఉత్పత్తుల ధరల్లోను నిరుడు డిసెంబరు నాటికి 13.4 శాతం వృద్ధి చెందిందని వీటికంతటికీ ప్రధాన కారణం చమురు ద్రవ్యోల్బణమేనని సిటీ గ్రూప్ అభిప్రాయపడింది.Source: Yahoo! Telugu: News | 9 Feb 2010 | 7:13 am భారతీయులపై దాడులతో దేశ పరువు పోయింది: ఆసీస్స్వదేశంలోని వివిధ ప్రాంతాల్లో నివశిస్తున్న భారతీయులపై జరిగిన దాడుల వల్ల ప్రపంచంలో ఆస్ట్రేలియా పరువు పోయిందని ఆ దేశ విదేశాంగ మంత్రి స్టీఫెన్ స్మిత్ అన్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియా పార్లమెంట్‌కు ఆయన వెల్లడించారు. దేశంలో జరిగిన కొన్ని సంఘటనలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయన్నారు. ఈ దాడుల్లో కొన్ని జాతి వివక్షాపూరితమైనవిగా ఉన్నాయని తెలిపారు.Source: Yahoo! Telugu: News | 9 Feb 2010 | 7:06 am రాహుల్ గాంధీని వదలని శివసేన చీఫ్ బాల్ థాక్రేముంబయిలో పర్యటించిన సమయంలో రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ముంబయిని ముంబయి అని సంబోధించకుండా "బాంబే" అని పదే పదే అన్నారని, అది మహారాష్ట్రీయులను కించపరిచినట్లేనని కొత్త పల్లవి అందుకున్నారు.Source: Yahoo! Telugu: News | 9 Feb 2010 | 6:23 am ఎంత పని చేశావన్నా...? నానిపై ఎన్టీఆర్ గరం గరం..?!!కొడాలి నాని- జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ స్వయానా అన్నదమ్ములు కాకపోయినప్పటికీ... అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉంటారు. అటువంటిది తెలంగాణా ఉద్యమం వాళ్లిద్దర్నీ తలోదిక్కున విడదీసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమైక్యాంధ్ర ధ్యేయంగా విద్యార్థులు చేస్తున్న పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవడమే కాక వారిని అరెస్టు చేయడాన్ని కొడాలి నాని తీవ్రంగా ఖండించారు. తెరాస నాయకులపై నిప్పులు చెరిగారు. అదుర్స్ సినిమాను అడ్డుకుంటామని సవాల్ విసిరినవారు ఎంతవరకు సఫలమయ్యారని విమర్శించారు. హైదరాబాదు గురించి మాట్లాడితే నాలుకలు కోస్తామన్న కేసీఆర్.. ఎంతమంది నాలుకలు కోశారని ప్రశ్నించారు...?Source: Yahoo! Telugu: Entertainment | 9 Feb 2010 | 5:52 am 15 శాతం వృద్ధి చెందనున్న ప్రకటనల రంగంఈ ఏడాది దేశీయ యాడ్ల రంగంలో 15 శాతం వృద్ధి చెందనుందని, ప్రస్తుతం ఆర్థిక మాంద్యం తగ్గుముఖం పట్టనుండటంతో తమకు వ్యాపార పరంగా మంచి ప్రకటనలు వస్తున్నాయని బిబిడిఓ ఛైర్మెన్ శ్రీనివాసన్ కే. స్వామి మంగళవారం మీడియాకు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 9 Feb 2010 | 5:45 am గాసిప్స్ కోసం వెతుకుతాను: విమలా రామన్తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటిస్తున్న విమలారామన్ తాజాగా తరుణ్‌తో "చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి"లో నటిస్తోంది. ఈ చిత్రానికి ముగ్గురు దర్శకులు మారారు. ఆ విషయం అలా ఉంచితే... ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఫారిన్‌లో చిన్నపాటి తగాదా అయింది. ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్నది సారాంశం. ఆ విషయాన్ని రెండవ దర్శకుడు వి.ఎన్. ఆదిత్య కూడా ధృవీకరించారు. అయితే విమలా రామన్ మాత్రం "గాసిప్స్ నిజమని నేననుకోను. నిజమయితే గాసిప్స్ ఎందుకవుతాయ"ని ప్రశ్నిస్తోంది. కాకపోతే విశేషం ఏమిటంటే... కొంతమంది తమ అమూల్యమైన సమయాన్ని తన గురించి కేటాయిస్తున్నారంటే తానెంతో ఎత్తుకు ఎదిగోనని గాసిప్స్ కూడా ఒక ఎసెట్‌గా ఫీలవుతూ చెబుతోంది. ఒకరకంగా గాసిప్స్‌ను బట్టి తనను తాను తెలుసుకోగలుగుతాననీ, అవన్నీ చదివితే ఎలా ఉండాలో గైడ్‌లైన్స్‌గా ఉంటాయని అంటోంది. అందుకే అవన్నీ జాగ్రత్తగా నెట్ ముందు కూర్చుని చూస్తుంటానని గర్వంగా చెపుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 9 Feb 2010 | 4:31 am పాక్ తీవ్రవాదులకు ఏజెంట్‌గా షారూక్: వీహెచ్పీబాలీవుడ్ సినీ నటుడు షారూక్ ఖాన్ పాకిస్థాన్ తీవ్రవాదులకు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలకు పాకిస్థాన్ క్రికెట్ ఆటగాళ్లకు కూడా చోటు కల్పించి ఉంటే బాగుండు అని వ్యాఖ్యానించడంలో ఆంతర్యమేమిటని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తొగాడియా ప్రశ్నించారు.Source: జాతీయ | 9 Feb 2010 | 2:42 am అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను అడ్డుకోవద్దు: కేకేశ్రీకృష్ణ కమిటీ విధి విధానాలతో బడ్జెట్ సమావేశాలకు లింకు పెడుతూ వాటిని అడ్డుకోవాలని ఆలోచన చేయవద్దని కే. కేశరావు ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. తెలంగాణా ఏర్పాటుకోసమై కేంద్ర ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించిందనీ, అందులో భాగంగానే శ్రీకృష్ణ కమటీని ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు.Source: ఏపీ న్యూస్ | 9 Feb 2010 | 1:46 am రాహుల్ గాంధీని వదలని శివసేన చీఫ్ బాల్ థాక్రేముంబయిలో పర్యటించిన సమయంలో రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ముంబయిని ముంబయి అని సంబోధించకుండా "బాంబే" అని పదే పదే అన్నారని, అది మహారాష్ట్రీయులను కించపరిచినట్లేనని కొత్త పల్లవి అందుకున్నారు.Source: జాతీయ | 9 Feb 2010 | 1:36 am మధుయాష్కీ.. ఓ బచ్చాగాడు: మహ్మద్ జానీ!నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీపై సొంత పార్టీ నేతలు ఒక్కొక్కరుగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో అధిష్టానం ఆగ్రహానికి గురైన యాష్కీ.. తాజాగా శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ మహ్మద్ జానీ కోపం కూడా చవిచాశారు.Source: ఏపీ న్యూస్ | 8 Feb 2010 | 11:13 pm మార్చి 12న రామ్‌లీలా మైదానంలో లెఫ్ట్ భారీ సభ!దేశ ప్రజలను ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మార్చి 12వ తేదీ దేశ రాజధాని న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీస్థాయిలో బహిరంగ సభను నిర్వహించాలని లెఫ్ట్ పార్టీల నిర్ణయించాయి. సీపీఎం, సీపీఐ, ఫార్వర్డ్‌బ్లాక్, ఆరెస్పీ తదితర వామపక్షాలు ఇందులో భాగస్వాములు కానున్నాయి.Source: జాతీయ | 8 Feb 2010 | 10:48 pm నారాయణగూడ సంఘటనపై హెచ్ఆర్‌సీ ఆగ్రహం!రాష్ట్ర రాజధాని హైదరాబాద్, నారాయణగూడలోని ఐదు అంతస్తుల భవనం కూలిపోయిన సంఘటనపై రాష్ట్ర మానవహక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. 175 గజాల స్థంలో అక్రమ నిర్మాణం యధేచ్చగా జరుగుతుంటుంటే.. అధికారులు ఏం చేస్తున్నారంటూ హెచ్ఆర్‌సి ఛైర్మన్ జస్టీస్ సుభాషణ్ రెడ్డి ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 8 Feb 2010 | 10:47 pm జమ్మూలో మంచు తుఫాను: ఆంధ్ర సైనికుని మృతి!జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కురుస్తున్న మంచు తుఫాను కారణంగా ప్రాణాలు కోల్పోయిన సైనికుల సంఖ్య 17కు చేరుకుంది. వీరిలో మన రాష్ట్రానికి చెందిన ఒక సైనికుడు కూడా ఉన్నారు. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలంకు చెందిన శివ నాగేశ్రవరావు అనే ఆర్మీ సైనికుడు సోమవారం మృత్యువాత పడ్డాడు.Source: ఏపీ న్యూస్ | 8 Feb 2010 | 9:58 pm శ్రీకృష్ణ కమిటీని రద్దు చేయాలి: సుప్రీంలో రిట్ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రంలోని పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కమిటీని రద్దు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఒక పిటీషన్ దాఖలైంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పురుషోత్తమ్ యాదవ్ అనే వ్యక్తి ఈ పిటీషన్‌ను దాఖలు చేశారు.Source: ఏపీ న్యూస్ | 8 Feb 2010 | 9:45 pm చర్చల ప్రతిపాదన వెనుక అమెరికా ఒత్తిడి: అద్వానీదాయాది దేశం పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక చర్చల ప్రతిపాదనను భారత్ లేవనెత్తడం వెను అగ్రరాజ్యం అమెరికా ఒత్తిడి ఉన్నట్టు భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ ఛైర్మన్ ఎల్కే.అద్వానీ తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ పాకిస్థాన్ గడ్డపై ముంబై దాడుల దోషులు యధేచ్చగా సంచరిస్తుంటే.. భారత్ ఎలా చర్చలు జరుపుతుందని ప్రశ్నించారు.Source: జాతీయ | 8 Feb 2010 | 9:29 pm ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విభజనకు ఎస్పీ మోకాలడ్డు!ఉత్తప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి చేస్తున్న వాదనకు ప్రతిపక్ష పార్టీల మోకాలడ్డాయి. ప్రధానంగా ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.Source: జాతీయ | 8 Feb 2010 | 9:19 pm రొమాంటిక్ పాత్రల్లో ఇంకా నన్ను చూస్తారా...?: నాగ్ఇక నుంచి వయసుకు తగిన పాత్రలే వేస్తానని అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. దిల్ రాజు, ప్రకాష్ రాజ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం శివరాత్రి తర్వాత ప్రారంభం కాబోతోంది. "ఆకాశమంత" చిత్ర దర్శకుడు రాధామోహన్ దర్శకత్వం వహించనున్నారు. తన కుటుంబంలో హీరోలు వస్తుంటే.. వారికి తనకూ పోటీ లేదనీ, వారికి వారికి మధ్య మాత్రమే పోటీ ఉంటుందని తెలిపారు. మీరు చేయబోయే చిత్రాల్లో లవ్, సెంటిమెంట్ ఉంటుందా...? అని అడిగితే.. ఇంకా లవ్ చిత్రాలు ఏం చేస్తాం... అవన్నీ టీనేజ్ అబ్బాయిలే చూసుకుంటారు. వయసుకు తగిన పాత్రలు వేస్తేనే మంచిదని స్పష్టం చేశారు. రేపు ప్రారంభం కాబోయే చిత్రం యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రమన్నారు. రొమాంటిక్ చిత్రాలు చేయాలని ఉన్నా... ప్రేక్షకులు చూడాలి కదా... అని వ్యాఖ్యానించారు. అమితాబ్ బచ్చన్ చూడండి.. వయసుకు తగిన పాత్రలు వేస్తున్నారని ఉదాహరణగా కూడా చెప్పారు. ప్రస్తుతం ఆయన నటించిన "కేడీ" ఈనెల 12న విడుదల కానుంది.Source: Yahoo! Telugu: Entertainment | 8 Feb 2010 | 10:36 am పోస్ట్‌పోన్ అయిన రాణా "లీడర్"రాణా హీరోగా ఏవీఎం సంస్థ నిర్మించిన చిత్రం లీడర్. ఈ చిత్రానికి శేఖర కమ్ముల దర్శకుడు. లీడర్‌ను ఈనెల 12న విడుదల చేస్తామని ఇటీవల దర్శకుడు వెల్లడించాడు. కానీ కొన్ని కారణాలవల్ల ఈ చిత్రాన్ని మరో వారం రోజులపాటు ముందుకు జరిగింది. అంటే ఈనెల 19న విడుదల కానుంది. ఠాగూర్ నిర్మాత మధు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ ద్వారా విడుదల కానుంది.Source: Yahoo! Telugu: Entertainment | 8 Feb 2010 | 10:17 am మేము కరవడం మొదలుపెడితే...: కేటీఆర్అదుర్స్ నిర్మాత కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను భేషరతుగా వెనక్కి తీసుకుని క్షమాపణలు చెపితే కొడాలి నానిలాంటి నాయకులు రాష్ట్ర రాజధానిలో స్వేచ్ఛగా ఉండగలుగుతారనీ, లేదంటే పర్యవసానం చవిచూస్తారని తెరాస నాయకుడు కె. రామారావు హెచ్చరించారు.Source: ఏపీ న్యూస్ | 8 Feb 2010 | 8:38 am నటసామ్రాట్ అక్కినేని సరసన అనుష్క నటిస్తుందా...?!!నటనకు కొంతకాలంగా దూరంగా ఉంటున్న అక్కినేని నాగేశ్వరరావుతో ఓ భారీ బడ్జెట్ సినిమా రూపొందే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని ఇటీవల టాలీవుడ్‌లో వార్తలు తిరుగాడుతున్నాయి. అంతేకాదు ఆ చిత్రంలో అక్కినేనిని గ్రాఫిక్స్ సహాయంతో కుర్రవాడిగా మార్చి చూపుతారనీ, ఆయన సరసన హాట్ నటి అనుష్క నటిస్తుందని కొన్ని పత్రికలు వార్తలు కూడా రాశాయి. ఈ "గాలి" వార్త ఆ నోటా.. ఈ నోటా.. తిన్నగా ఏఎన్నార్‌కు చేరింది. ఈ వార్తను విన్న అక్కినేని పకపకా నవ్వుతూ.... నన్ను కుర్రవాడిగా చూపుతూ భారీ బడ్జెట్ చిత్రమా...? పైగా నాతో అనుష్క నటిస్తుందా...? అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారట. అక్కినేని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి వదిలేస్తే.. అనుష్క మాత్రం కాసేపు ఏ మాట్లాడో తెలియక అలా చూస్తుండి పోయిందట. మరి "గాలి వార్త" అంటే అంతేమరి!!Source: Yahoo! Telugu: Entertainment | 8 Feb 2010 | 7:17 am కాశ్మీర్‌లో హిమపాతంతో 13మంది జవాన్ల మృతిజమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సోమవారంనాడు మంచు చరియలు విరిగిపడి ఒక మిలటరీ అధికారితోపాటు 13మంది జవాన్లు దుర్మరణం చెందారు. హిమశకలాల్లో చిక్కుకున్న మరో 350 మందిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంచు చరియల నుంచి వెలికితీసిన వారిని బారాముల్లా ఆసుపత్రికి తరలించగా, వారిలో 15మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సైనికవర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 8 Feb 2010 | 6:24 am అవినీతే తెలంగాణ సమస్యకు కారణం: బాబా రాందేవ్అవినీతి, పక్షపాత వైఖరి వంటి అంశాలే తెలంగాణ వంటి సమస్యలకు మూల కారణమని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అభిప్రాయపడ్డారు. వీటిని నిర్మూలించినపుడు భవిష్యత్‌లో ఇలాంటి డిమాండ్లు ఉత్పన్నం కాబోవని ఆయన జోస్యం చెప్పారు.Source: జాతీయ | 8 Feb 2010 | 5:33 am బిపాసను బండబూతులు తిట్టిన హోటల్ యజమానితన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి బిపాసా బసు రానందుకు ఢిల్లీలోని రమదా హోటల్ యజమాని అశోక్ బండబూతులు తిట్టినట్లు బిపాస సన్నిహితులు చెప్పుకొచ్చారు. రోజుకు 25 నిమిషాలు కష్టపడితే చాలు... శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చనీ, దానికోసం అనుసరించవలసిన ఆరోగ్య సూత్రాలతో కూడిన డీవీడీని విడుదల చేసేందుకు బిపాసా ఢిల్లీ వెళ్లింది.Source: Yahoo! Telugu: Entertainment | 8 Feb 2010 | 5:25 am రవితేజ శంభో శివశంభో ట్రెయిలర్తమిళంలో ఘనవిజయం సాధించిన "నానోడిగళ్" చిత్రాన్ని శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ సముద్రకణి దర్శకత్వంలో 'శంభో శివ శంభో' పేరుతో తెలుగులో విడుదలైంది. రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ, ప్రియమణి, అభినయ నటించిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండిSource: Yahoo! Telugu: Entertainment | 8 Feb 2010 | 4:33 am జూనియర్ ఎన్టీఆర్ "అదుర్స్" ట్రెయిలర్యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, సెక్సీతారలు నయనతార, షీలా కథానాయికలుగా నటించిన చిత్రం "అదుర్స్". సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో కొడాలి వెంకటేశ్వరరావు సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ నిర్మించిన ఈ భారీ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 8 Feb 2010 | 4:25 am భవిష్యత్ ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్...!?తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ కాలంలో తనకంటూ స్టార్‌డమ్‌ను కైవసం చేసుకున్న యువ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి నట వారసత్వంతో పాటు.. తన నటన, మాటల చాతుర్యంతో ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో చేసిన ప్రచారానికి కూడా జనం జేజేలు కొట్టారు. ప్రచారం చేసింది కొద్ది రోజులే అయినప్పటికీ.. ప్రచార కథన రంగంలో ఉన్నంత సేవు "అదుర్స్" అనిపించారు.Source: ఏపీ న్యూస్ | 8 Feb 2010 | 4:22 am వెంకటేష్ "నమో వెంకటేశ" ట్రెయిలర్విక్టరీ వెంకటేష్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ "నమో వెంకటేశ". సంక్రాంతికి విడుదలైన ‘నమో వెంకటేశ’ చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్‌తో, భారీ కలెక్షన్లు రాబట్టుకుంటోందని చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.Source: Yahoo! Telugu: Entertainment | 8 Feb 2010 | 4:18 am తీవ్రవాది కసబ్ భద్రత: కంచె నిర్మాణానికి రూ.44 కోట్లు!పాకిస్థాన్‌కు చెందిన తీవ్రవాది అజ్మల్ కసబ్ దేశ వాణిజ్య రాజధాని ముంబైపై దాడి చేసి కోట్లాది రూపాయల మేరకు నష్టం కలిగించారు. ఆ తర్వాత పోలీసులకు సజీవంగా పట్టుబడిన ఈ కసాయి తీవ్రవాది ప్రాణాలు కాపాడేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది.Source: జాతీయ | 8 Feb 2010 | 4:14 am 'కులకేక'గా మారిన.. కాకతీయ వర్శిటీ 'పొలికేక'!వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి ఆదివారం నిర్వహించిన 'పొలికేక.. కులకేక'గా మారింది. విద్యార్థి నేతల సమన్వయ లోపం, హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా రాజకీయ రంగు అలుము కోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది.Source: ఏపీ న్యూస్ | 8 Feb 2010 | 3:04 am
|