భారీ లాభాల దిశగా సెన్సెక్స్, నిఫ్టీల పయనం

బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాల దిశగా పయనిస్తోంది. సోమవారం పుంజుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 130 పాయింట్లు వృద్ధి చెంది, 16,046 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 25 పాయింట్లు బలపడి, 4,782 పాయింట్ల మార్కును తాకింది.
Source: Yahoo! Telugu: News | 8 Feb 2010 | 7:47 am

భారత్‌లో పెట్టుబడులు పెట్టనున్న జీసీసీ ఛాంబర్స్

సంపన్న దేశాల స్థానంలోనున్న భారతదేశంలోను తమ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని జీసీసీ ఛాంబర్స్ ప్రధాన కార్యదర్శి అబ్దుర్రహీమ్ నాకీ సోమవారం మీడియాకు తెలిపారు. ఇందులో భాగంగా తమ సంస్థ భారతదేశంలో రెండు వందల కోట్ల డాలర్లను పెట్టుబడులుగా పెట్టేందుకు నిర్ణయించిందని ఆయన తెలిపారు
Source: Yahoo! Telugu: News | 8 Feb 2010 | 7:35 am

లాభాలతో పుంజుకున్న బాంబే స్టాక్ మార్కెట్

సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాలతో ర్యాలీని కొనసాగించిన బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో పుంజుకుంది. యూరప్, అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తుండటం బాంబే స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చింది. దీంతో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 67 పాయింట్లు పుంజుకుని, 15,983 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 22 పాయింట్లు బలపడి, 4,779 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది.
Source: Yahoo! Telugu: News | 8 Feb 2010 | 7:21 am

అంతర్జాతీయ ఒత్తిడితో భారత్ మెడలు వంచాం: పాక్

భారతదేశంపై తాము అంతర్జాతీయంగా తీసుకొచ్చిన ఒత్తిడి ఫలించిందని, అందువల్ల ఆ దేశం చర్చల ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మొహ్మద్ ఖురేషీ తెలిపారు. దీనిపై ఆయన ముల్తాన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ద్వైపాక్షిక చర్చలను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రపంచ దేశాల ద్వారా తాము భారత్‌పై చేసిన ఒత్తిడి సత్‌ఫలితాన్ని ఇచ్చిందన్నారు.
Source: Yahoo! Telugu: News | 8 Feb 2010 | 7:19 am

నటసామ్రాట్ అక్కినేని సరసన అనుష్క నటిస్తుందా...?!!

నటనకు కొంతకాలంగా దూరంగా ఉంటున్న అక్కినేని నాగేశ్వరరావుతో ఓ భారీ బడ్జెట్ సినిమా రూపొందే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని ఇటీవల టాలీవుడ్‌లో వార్తలు తిరుగాడుతున్నాయి. అంతేకాదు ఆ చిత్రంలో అక్కినేనిని గ్రాఫిక్స్ సహాయంతో కుర్రవాడిగా మార్చి చూపుతారనీ, ఆయన సరసన హాట్ నటి అనుష్క నటిస్తుందని కొన్ని పత్రికలు వార్తలు కూడా రాశాయి. ఈ "గాలి" వార్త ఆ నోటా.. ఈ నోటా.. తిన్నగా ఏఎన్నార్‌కు చేరింది. ఈ వార్తను విన్న అక్కినేని పకపకా నవ్వుతూ.... నన్ను కుర్రవాడిగా చూపుతూ భారీ బడ్జెట్ చిత్రమా...? పైగా నాతో అనుష్క నటిస్తుందా...? అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారట. అక్కినేని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి వదిలేస్తే.. అనుష్క మాత్రం కాసేపు ఏ మాట్లాడో తెలియక అలా చూస్తుండి పోయిందట. మరి "గాలి వార్త" అంటే అంతేమరి!!
Source: Yahoo! Telugu: Entertainment | 8 Feb 2010 | 7:17 am

హర్యానా మాజీ డీజీపీ రాథోర్‌పై దుండగుడి దాడి!

లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన హర్యానా మాజీ డీజీపీ ఎస్పీఎస్.రాథోర్‌పై సోమవారం ఒక దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ఈ కేసు విచారణ నిమిత్తం రాథోర్ కోర్డుకు హాజరవుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. దాడి చేసిన యువకుడిని పోలీసులు తక్షణం అపుదులోకి తీసుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 8 Feb 2010 | 7:07 am

ఊపందుకుంటున్న రియల్ ఎస్టేట్ రంగం

గతంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా దేశీయ రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుదేలైంది. దీంతో పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు, చిన్నా చితకా బిల్డర్లు నష్టాలబారిన పడ్డారు. కాని ప్రస్తుతం ఆర్థిక మాంద్యం తగ్గుముఖం పట్టనుండటంతో దేశంలోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు, డెవలపర్లు, రియల్టర్లు పెద్ద-పెద్ద నగరాలు, పట్టణాలలో కొత్త ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు.
Source: Yahoo! Telugu: News | 8 Feb 2010 | 7:04 am

విక్టోరియా పోలీస్ చీఫ్ ప్రకటనపై భారత్‌ ఆగ్రహం!

ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లో నివశిస్తున్న భారతీయులు వీలైనంత మేరకు పేదవారిగా కనిపించాలని విక్టోరియా నగర పోలీసు కమిషనర్ సైమన్ ఓవర్లాండ్ చేసిన ఉచిత సలహాపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ ప్రకటనను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు చెందిన అధికార ప్రతినిధులు తీవ్రంగా మండిపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 8 Feb 2010 | 6:50 am

మేం తలచుకుంటే హైద్రాబాద్‌లో తిరగలేరు: హరీశ్

"అదుర్స్" చిత్ర నిర్మాత, తెలుగుదేశం పార్టీ నాయకుడు కొడాలి నాని తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని తెరాస నాయకుడు హరీశ్‌రావు డిమాండ్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో బతిమాలితేనే అదుర్స్ చిత్రాన్ని వదిలిపెట్టామనీ, అసలు తాము తలచుకుంటే ఆంధ్ర నాయకులు హైదరాబాదులో తిరగలేరని హరీశ్ హెచ్చరించారు.
Source: Yahoo! Telugu: News | 8 Feb 2010 | 6:42 am

కోర్‌ కమిటీలో చర్చించాకే విధాన ప్రకటన: కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సంప్రదింపులు జరిపేందుకు కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలపై తుది ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ఢిల్లీలోని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రకటనలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా విధి విధానాలతో పాటు.. కాలపరిమితి అంశం కూడా ఉంటుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
Source: Yahoo! Telugu: News | 8 Feb 2010 | 6:36 am

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటి: ముకేశ్ అంబానీ

రానున్న ఐదు దశాబ్దాలలో ప్రపంచంలోని ఐదు ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటిగా నిలుస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ముంబైలో సోమవారం మీడియాకు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 8 Feb 2010 | 6:28 am

బిపాసను బండబూతులు తిట్టిన హోటల్ యజమాని

తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి బిపాసా బసు రానందుకు ఢిల్లీలోని రమదా హోటల్ యజమాని అశోక్ బండబూతులు తిట్టినట్లు బిపాస సన్నిహితులు చెప్పుకొచ్చారు. రోజుకు 25 నిమిషాలు కష్టపడితే చాలు... శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చనీ, దానికోసం అనుసరించవలసిన ఆరోగ్య సూత్రాలతో కూడిన డీవీడీని విడుదల చేసేందుకు బిపాసా ఢిల్లీ వెళ్లింది.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Feb 2010 | 5:25 am

రవితేజ శంభో శివశంభో ట్రెయిలర్

తమిళంలో ఘనవిజయం సాధించిన "నానోడిగళ్‌" చిత్రాన్ని శ్రీ సాయి గణేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్‌ సముద్రకణి దర్శకత్వంలో 'శంభో శివ శంభో' పేరుతో తెలుగులో విడుదలైంది. రవితేజ, అల్లరి నరేష్‌, శివబాలాజీ, ప్రియమణి, అభినయ నటించిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి
Source: Yahoo! Telugu: Entertainment | 8 Feb 2010 | 4:33 am

జూనియర్ ఎన్టీఆర్ "అదుర్స్" ట్రెయిలర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, సెక్సీతారలు నయనతార, షీలా కథానాయికలుగా నటించిన చిత్రం "అదుర్స్". సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో కొడాలి వెంకటేశ్వరరావు సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ నిర్మించిన ఈ భారీ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Feb 2010 | 4:25 am

వెంకటేష్ "నమో వెంకటేశ" ట్రెయిలర్

విక్టరీ వెంకటేష్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ "నమో వెంకటేశ". సంక్రాంతికి విడుదలైన ‘నమో వెంకటేశ’ చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్‌తో, భారీ కలెక్షన్లు రాబట్టుకుంటోందని చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Feb 2010 | 4:18 am

'కులకేక'గా మారిన.. కాకతీయ వర్శిటీ 'పొలికేక'!

వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి ఆదివారం నిర్వహించిన 'పొలికేక.. కులకేక'గా మారింది. విద్యార్థి నేతల సమన్వయ లోపం, హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా రాజకీయ రంగు అలుము కోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది.
Source: ఏపీ న్యూస్ | 8 Feb 2010 | 3:04 am

హర్యానా మాజీ డీజీపీ రాథోర్‌పై దుండగుడి దాడి!

లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన హర్యానా మాజీ డీజీపీ ఎస్పీఎస్.రాథోర్‌పై సోమవారం ఒక దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ఈ కేసు విచారణ నిమిత్తం రాథోర్ కోర్డుకు హాజరవుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. దాడి చేసిన యువకుడిని పోలీసులు తక్షణం అపుదులోకి తీసుకున్నారు.
Source: జాతీయ | 8 Feb 2010 | 1:37 am

మేం తలచుకుంటే హైద్రాబాద్‌లో తిరగలేరు: హరీశ్

"అదుర్స్" చిత్ర నిర్మాత, తెలుగుదేశం పార్టీ నాయకుడు కొడాలి నాని తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని తెరాస నాయకుడు హరీశ్‌రావు డిమాండ్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో బతిమాలితేనే అదుర్స్ చిత్రాన్ని వదిలిపెట్టామనీ, అసలు తాము తలచుకుంటే ఆంధ్ర నాయకులు హైదరాబాదులో తిరగలేరని హరీశ్ హెచ్చరించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Feb 2010 | 1:25 am

కోర్‌ కమిటీలో చర్చించాకే విధాన ప్రకటన: కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సంప్రదింపులు జరిపేందుకు కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలపై తుది ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ఢిల్లీలోని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రకటనలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా విధి విధానాలతో పాటు.. కాలపరిమితి అంశం కూడా ఉంటుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
Source: జాతీయ | 8 Feb 2010 | 1:06 am

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు: షబ్బీర్ ఆలీ

ముస్లింలకు కేటాయించిన నాలుగు శాతం రిజర్వేషన్లు చెల్లవని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేయనున్నట్టు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 8 Feb 2010 | 12:33 am

సీమాంధ్రలో కొనసాగుతున్న విద్యా సంస్థల బంద్!

గుంటూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన 14 యూనివర్శిటీల విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేయడాన్ని సీమాంధ్ర నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనికి నిరసనగా సోమవారం సీమాంధ్ర ప్రాంతాల్లోని విద్యా సంస్థల బంద్‌ను శాంతియుతంగా పాటిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Feb 2010 | 12:18 am

వైష్ణవి హత్య కేసు: వెంకట్రావుకు 22 వరకు రిమాండ్!

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి కిడ్నాప్, హత్య కేసులో విజయవాడ పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు వెంకట్రావ్ గౌడ్‌ను సోమవారం స్థానిక మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు ఈనెల 22వ తేదీ వరకు రిమాండ్‌కు పంపుతూ మేజిస్ట్రేట్ ఆదేశించారు. దీంతో పోలీసులు ఆయనను జిల్లా జైలుకు తరలించారు
Source: ఏపీ న్యూస్ | 8 Feb 2010 | 12:08 am

ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు చెల్లవ్: హైకోర్టు

రాష్ట్రంలోని ముస్లింలకు నాలుగు శాతం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు జారీ అయిన ప్రభుత్వ జీవోను హైకోర్టు సోమవారం కొట్టిపారేసింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఏడుగురు సభ్యులు కలిగిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధంగా లేదని ధర్మాసనం పేర్కొంది.
Source: ఏపీ న్యూస్ | 8 Feb 2010 | 12:01 am

చీఫ్‌విఫ్‌ భట్టి విక్రమార్కకు తృటిలో తప్పిన ప్రమాదం!

ప్రభుత్వ చీఫ్‌విఫ్ మల్లు భట్టి విక్రమార్క తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. నల్గొండ జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న భట్టి విక్రమార్క మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 8 Feb 2010 | 12:01 am

ఉపకులపతుల గుండెల్లో "సింహం" మన గవర్నర్!

రాష్ట్రా తాత్కాలిక గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. రాజకీయ నేతలను హడలెత్తించిన గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్.. ఇపుడు విశ్వవిద్యాలయాల ఉప కులపతులపై దృష్టి సారించారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పుణ్యమానికి రాష్ట్రంలోని అన్ని వర్శిటీలు రాజకీయ వేదికలను తలపిస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 8 Feb 2010 | 12:00 am

హౌరా-ముంబై రైల్వే మార్గాన్ని పేల్చి వేసిన మావోలు

దేశంలో మావోయిస్టుల విధ్వంసకాండ కొనసాగుతోంది. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు ప్రకటించిన మావోయిస్టులు.. ఈ రాష్ట్రాలను తక్షణం ఏర్పాటు చేయాలని, మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కేంద్రం చేపట్టిన "ఆపరేషన్ గ్రీన్ హంట్"ను నిలిపి వేయాలని కోరుతూ 72 గంటల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 7 Feb 2010 | 10:48 pm

తెలంగాణ ఇవ్వకుంటే.. ఆసీస్ తరహాలో దాడులు

తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వని పక్షంలో ఆస్ట్రేలియా తరహాలో దాడులు చేస్తామని వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్) హెచ్చరించింది. తెలంగాణాలోని పది జిల్లాల్లో నివశిస్తున్న సీమాంధ్ర ప్రజలపై ఈ దాడులు కొనసాగుతాయని వారు సంచలన ప్రకటన చేశారు. దీనిపై తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏ రాజకీయ పార్టీ నేతలు కూడా నోరు మెదపక పోవడం గమనార్హం.
Source: ఏపీ న్యూస్ | 7 Feb 2010 | 10:01 pm

రాష్ట్రాలకు నిధుల విడుదలలో వివక్ష లేదు: సోనియా

రాష్ట్రాలకు నిధులను విడుదల చేయడంలో కేంద్రం ఎలాంటి వివక్ష చూపడం లేదని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఆ నిధులను వినియోగించుకోవడంలోనే కొన్ని రాష్ట్రాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆమె ఆరోపించారు.
Source: జాతీయ | 7 Feb 2010 | 9:21 pm

తెలంగాణ ఉద్యమంలో మావోల పాత్ర: మంత్రి చిదంబరం

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మావోయిస్టుల పాత్ర ఉన్నట్టు తమకు నివేదికలు అందాయని కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలిపారు. ఒక రకంగా చెప్పాలంటే.. తెలంగాణ ఉద్యమాన్ని తమకు అనుకూలంగా, విస్తరణకు వినియోగించుకున్నట్టు తమ వద్ద సమాచారం ఉందని ఆయన తెలిపారు.
Source: జాతీయ | 7 Feb 2010 | 9:14 pm

విడుదలకు సిద్ధమవుతున్న ఛార్మి "సై ఆట"

ఛార్మింగ్ గాళ్ ఛార్మి ప్రధాన పాత్రలో ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె.ఆర్ కె. పవన్ దర్శకత్వంలో నల్లూరి రాజశేఖర్ నిర్మిస్తున్న "సై ఆట" చిత్రం ఒక పాట మినహా నిర్మాణం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి రీ రికార్డింగ్ జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు నల్లూరి సుధారాణి, రాజశేఖర్ మాట్లాడుతూ.. సరికొత్త కథ కథనాలతో ఛార్మిని కొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇదన్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ అత్యద్భుతమైన సంగీతాన్ని అందించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Feb 2010 | 10:52 am

ప్లాటినం డిస్క్ వేడుకల్లో "నమో వెంకటేశ"

విక్టరీ వెంకటేష్, గ్లామరస్ స్టార్ త్రిష జంటగా డి. సురేష్‌బాబు సమర్పణలో విడుదలైన సినిమా "నమో వెంకటేశ". సురేష్ ప్రొడక్షన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో నూతన నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన "నమో వెంకటేశ" చిత్రం సంక్రాంతి పర్వదినాన విడుదలై రాష్ట్రమంతటా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. యువ సంచలన సంగీత కెరటం దేవీశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ చిత్రం ఆడియో ఘన విజయం సాధించి సినిమా సక్సెస్‌‌కి ఎంతగానో దోహదపడింది. ఈ సందర్భంగా ఫిబ్రవరి ఐదో తేదీన హైదరాబాద్ కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్‌ని ఘనంగా జరిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Feb 2010 | 10:14 am

తీవ్రవాదంపై సమిష్టి పోరు: ప్రధాని మన్మోహన్ సింగ్

దేశ అంతర్గత భద్రతకు పెను ముప్పుగా పరిణమించిన తీవ్రవాదం, నక్సలిజం వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు సమిష్టి పోరు అవసరమని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.
Source: జాతీయ | 7 Feb 2010 | 5:35 am

కొత్త రాష్ట్రంలో ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు: కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైతే ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు తెలిపారు. హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో ఆదివారం జరిగిన ముస్లిం గర్జనలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Source: ఏపీ న్యూస్ | 7 Feb 2010 | 5:28 am

అగ్ని-3 ప్రయోగం విజయవంతం: డీఆర్‌డీఓ

ఒరిస్సా సముద్ర తీరంలో ఆదివారం చేపట్టిన అగ్ని-3 క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్టు రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ప్రకటించింది. దమ్రా గ్రామంలో ఉన్న చిన్న వీలర్ దీవి నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. అగ్ని 3 క్షిపణిని ప్రయోగించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
Source: జాతీయ | 7 Feb 2010 | 3:40 am