సింగపూర్ ఎయిర్‌షోలో 860 మిలియన్ డాలర్ల ఒప్పందం

సింగపూర్‌లో జరిగిన అతిపెద్ద ఎయిర్‌షోలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 860 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై నేడో రేపో సంతకాలు చేసే అవకాశం ఉందని, ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తారని సింగపూర్ ఎయిర్ షో అండ్ ఈవెంట్స్ మేనేజింగ్ డైరక్టర్ జిమ్మీ లీ తెలిపినట్టు కొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
Source: Yahoo! Telugu: News | 7 Feb 2010 | 8:15 am

కువైట్‌లో రేపటి నుంచి బంగ్లాదేశ్ ప్రధాని పర్యటన!

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం నుంచి కువైట్‌ పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. మూడు రోజుల పాటు ఈ పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో అభివృద్ధి, పెట్టుబడులు, కార్మిక సమస్యల పరిష్కారంపైనే అధిక దృష్టి కేంద్రీకరించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కువైట్ ప్రధానమంత్రి షేక్ నస్సర్ అల్ మొహ్మద్ అల్ అహ్మద్ అల్ సబాహ్‌తో ఆమె సోమవారం తొలి అధికారిక సమావేశం నిర్వహించారు.
Source: Yahoo! Telugu: News | 7 Feb 2010 | 8:02 am

విధి విధానాలు నచ్చకుంటే... మళ్లీ ఆందోళన బాట!

రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలు నచ్చకుంటే మళ్లీ ఆందోళన బాట పడుతామని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు. గత డిసెంబరు తొమ్మిదో తేదీన కేంద్రం చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఈ కమిటీ విధి విధానాలు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
Source: Yahoo! Telugu: News | 7 Feb 2010 | 7:14 am

ఐకాసలో ఉంటే అధిష్టానంతో సమానమా: మంత్రి దానం

తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస)లో ఉన్నంత మాత్రాన ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు అంతా తామేనన్న భావనతో వ్యవహరిస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖామంత్రి దానం నాగేందర్ ఆరోపించారు. ఇది వారికి మాత్రమే కాకుండా, పార్టీకి కూడా మంచిది కాదని మంత్రి హితవు పలికారు.
Source: Yahoo! Telugu: News | 7 Feb 2010 | 6:22 am

ధరలపై భాజపా ఛలో రాజ్‌భవన్: నేతల అరెస్టు!

పెరిగిన నిత్యావస వస్తు ధరలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆందోళనలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ఛలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని చెపట్టింది. దీన్ని రాజధాని పోలీసులు ఆదిలోనే అడ్డుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 7 Feb 2010 | 6:13 am

మత ఉద్రిక్తతలే దేశానికి అతిపెద్ద సవాల్: ప్రధాని

దేశ అంతర్గత భద్రతకు సీమాంతర ఉగ్రవాదం, తీవ్రవాదం, మత ఉద్రిక్తలు అతి పెద్ద సవాల్‌గా మారాయని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. వీటిని సమూలంగా రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్న ముఖ్యమంత్రుల రెండు రోజుల సదస్సులో భాగంగా ఆదివారం అంతర్గత భద్రతపై సీఎంలతో భేటీ అయ్యారు.
Source: Yahoo! Telugu: News | 7 Feb 2010 | 6:00 am

సమైక్యాంధ్ర విద్యార్థుల పాదయాత్రకు పోలీసుల బ్రేక్!

గుంటూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన సీమాంధ్ర విద్యార్థుల పాదయాత్రకు కృష్ణా జిల్లా పోలీసులు బ్రేక్ వేశారు. శనివారం నందిగామకు చేరుకున్న విద్యార్థులు రాత్రికి అక్కడే బస చేశారు. అర్థరాత్రి పూట పోలీసులు రంగ ప్రవేశం చేసి అరెస్టు చేసి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు.
Source: Yahoo! Telugu: News | 7 Feb 2010 | 5:45 am

భారతీయ కంపెనీలకు నేపాల్ మావోల హెచ్చరికలు!

నేపాల్‌లోని భారతీయ కంపెనీలకు ఆ దేశంలోని మావోయిస్టుల హెచ్చరికలు ఎక్కువయ్యాయి. నేపాల్‌లో చేపట్టిన ప్రాజెక్టు పనులను తక్షణం ఆపి వేయాలని లేని పక్షంలో పేల్చి వేస్తామని హెచ్చరించాయి.
Source: Yahoo! Telugu: News | 7 Feb 2010 | 5:11 am

ఉగ్రవాదంపై ఒత్తిడి తెచ్చేందుకే పాక్‌తో చర్చలు: భారత్

సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టేలా పాకిస్థాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకే చర్చల ప్రతిపాదనకు చొరవ చూపించినట్టు భారత్ ప్రకటించింది. ముంబై దాడులకు నిరసనగా పాక్‌తో చర్చల ప్రక్రియలో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు కార్యదర్శుల స్థాయి చర్చలకు సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగిందనీ, ఇది వ్యూహాత్మక చొరవగా భారత్ అభివర్ణించింది.
Source: Yahoo! Telugu: News | 7 Feb 2010 | 4:59 am

పొగాకు బోర్డు తరహాలో కందిబోర్డుకు సన్నాహాలు!

మార్కెట్‌లో కందిపప్పు ధరలు చుక్కలు తాకున్నప్పటికీ... ఆ పప్పును పండించే రైతులకు మాత్రం సరైన గిట్టుబాటు ధర లభించడం లేదు. అందువల్ల ఈ రైతులను ఆదుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రబుత్వం కందిబోర్డును ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తోంది.
Source: Yahoo! Telugu: News | 7 Feb 2010 | 4:34 am

విధి విధానాలు నచ్చకుంటే... మళ్లీ ఆందోళన బాట!

రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలు నచ్చకుంటే మళ్లీ ఆందోళన బాట పడుతామని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు. గత డిసెంబరు తొమ్మిదో తేదీన కేంద్రం చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఈ కమిటీ విధి విధానాలు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 7 Feb 2010 | 1:44 am

ఐకాసలో ఉంటే అధిష్టానంతో సమానమా: మంత్రి దానం

తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస)లో ఉన్నంత మాత్రాన ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు అంతా తామేనన్న భావనతో వ్యవహరిస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖామంత్రి దానం నాగేందర్ ఆరోపించారు. ఇది వారికి మాత్రమే కాకుండా, పార్టీకి కూడా మంచిది కాదని మంత్రి హితవు పలికారు.
Source: ఏపీ న్యూస్ | 7 Feb 2010 | 12:53 am

ధరలపై భాజపా ఛలో రాజ్‌భవన్: నేతల అరెస్టు!

పెరిగిన నిత్యావస వస్తు ధరలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆందోళనలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ఛలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని చెపట్టింది. దీన్ని రాజధాని పోలీసులు ఆదిలోనే అడ్డుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 7 Feb 2010 | 12:43 am

మత ఉద్రిక్తతలే దేశానికి అతిపెద్ద సవాల్: ప్రధాని

దేశ అంతర్గత భద్రతకు సీమాంతర ఉగ్రవాదం, తీవ్రవాదం, మత ఉద్రిక్తలు అతి పెద్ద సవాల్‌గా మారాయని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. వీటిని సమూలంగా రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్న ముఖ్యమంత్రుల రెండు రోజుల సదస్సులో భాగంగా ఆదివారం అంతర్గత భద్రతపై సీఎంలతో భేటీ అయ్యారు.
Source: జాతీయ | 7 Feb 2010 | 12:30 am

సమైక్యాంధ్ర విద్యార్థుల పాదయాత్రకు పోలీసుల బ్రేక్!

గుంటూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన సీమాంధ్ర విద్యార్థుల పాదయాత్రకు కృష్ణా జిల్లా పోలీసులు బ్రేక్ వేశారు. శనివారం నందిగామకు చేరుకున్న విద్యార్థులు రాత్రికి అక్కడే బస చేశారు. అర్థరాత్రి పూట పోలీసులు రంగ ప్రవేశం చేసి అరెస్టు చేసి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు.
Source: ఏపీ న్యూస్ | 7 Feb 2010 | 12:16 am

నేనేమీ తప్పుగా మాట్లాడలేదు: షారూక్ ఖాన్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మ్యాచ్‌లలో పాకిస్థాన్ క్రికెట్‌ జట్టును అనుమతించాలని సూచించి శివసేన అధినేత బాల్‌థాకరే ఆగ్రహానికి గురైన బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తానేమీ తప్పుగా వ్యాఖ్యానించలేదని స్పష్టం చేశారు. ఇందులో ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన పనిలేదన్నారు.
Source: జాతీయ | 6 Feb 2010 | 10:44 pm

శివసేనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు: రాహుల్ గాంధీ

ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్న శివసేన పార్టీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ తెలిపారు. ముంబై పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని శనివారం కేరళకు వచ్చిన రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శివసేనపై రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతున్న శివసేన వర్గాలను ప్రజలు వ్యతిరేకిస్తూ, అహింసామార్గంలో తగిన బుద్ధి చెప్పాలని రాహుల్ పిలుపు నిచ్చారు.
Source: జాతీయ | 6 Feb 2010 | 9:19 pm

ముఖ్యమంత్రులతో భేటీ కానున్న ప్రధాని మన్మోహన్!

దేశ అంతర్గత భద్రతపై పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం భేటీ కానున్నారు. ప్రధాని నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో భాగంగా.. సరిహద్దు సమస్యలు, సరిహద్దు భద్రత వంటి అంశాలపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చలు జరుపుతారని ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలిపాయి.
Source: జాతీయ | 6 Feb 2010 | 8:58 pm

"డ్రింక్‌"కైతే ఓకే.! సారీ చెప్పమనేందుకైతే.. ఊహుఁ..!!

శివసేన చీఫ్ బాల్ థాకరేతో డ్రింక్ తాగడానికి వెళ్లమంటే వెళతాను.. కానీ క్షమించమని చెప్పేందుకు వెళ్లమంటే మాత్రం... ఊహుఁ అంటున్నాడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. ఐపీఎల్ క్రికెట్ వ్యవహారంలో పాకిస్తాన్ క్రికెటర్ల గురించి తాను చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పు లేదనీ, అటువంటప్పుడు దానిగురించి తను పునరాలోచించాల్సిన అవసరం లేదని షారుక్ తెగేసి చెప్పాడు. శివసేన హెచ్చరికల నేపధ్యంలో లండన్ నుంచి వచ్చిన షారుక్ ఖాన్‌కు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శివసేన వ్యాఖ్యలపై షారుక్ స్పందిస్తూ... తాను ప్రపంచంలోని దేశాలన్నిటితో మంచి సంబంధాలు కలిగి ఉండాలని ఆకాంక్షిస్తాననీ చెప్పుకొచ్చారు. తను మాత్రమే కాదు ప్రతి ఒక్క పౌరుడు ఇలాగే ఉంటాడని విశ్వసిస్తానన్నాడు.ఒకవేళ బాల్ థాకరే తనను తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే.. కలిసి డ్రింక్ తాగేందుకు వెళతాననీ, కానీ క్షమించమని అడిగేందుకంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని షారుక్ అన్నాడు. అసలు తప్పు చేయనప్పుడు క్షమించమని అడిగే అవకాశం ఎక్కడుందని ఎదురు ప్రశ్నించారు. మొత్తమ్మీద సేన- షారుక్ లడాయి ఇప్పట్లో తెగేదిలా కనబడటం లేదు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2010 | 9:02 am

"భాగ్యనగరం" కోసమే సమైక్య రాగం: కేసీఆర్

కమిటీల పేరుతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణా ఏర్పాటులో జాప్యం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రేవు అన్నారు. కేంద్రం తన తాత్సార ధోరణిని విడనాడి తక్షణమే తెలంగాణా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.
Source: ఏపీ న్యూస్ | 6 Feb 2010 | 8:29 am

గ్లామరస్ కనిపిస్తా.. కానీ బికినీలు వేయను: కాజల్

"లక్ష్మీ కల్యాణం"తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన పంచదార బొమ్మ "కాజల్ అగర్వాల్". "మగధీర" హిట్‌తో టోలీవుడ్ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న కాజల్ అగర్వాల్.. ఎక్స్‌పోజింగ్‌తో అవకాశాలు వస్తాయా..? అన్న ప్రశ్నకు సమాధానమిచ్చింది. ఎక్స్‌పోజింగ్ వల్ల అవకాశాలు రావని కాజల్ తేల్చి చెబుతోంది. అంతేకాదు.. మీరు బికినీలు వేస్తారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. గ్లామరస్‌గా కనిపిస్తానే గానీ, బికీనీలు మాత్రం వేయనని కాజల్ అగర్వాల్ స్పష్టం చేసింది. పూర్తి పేరు: కాజల్ అగర్వాల్,పుట్టిన తేదీ: జూన్ 19, 1985 (వయసు 24), జన్మస్థలం: ముంబై,నచ్చిన వస్త్రాలు: చీర,నచ్చిన స్పాట్: లండన్,నచ్చిన పానీయం: వైట్ టీ,ఫేవరేట్ నటుడు: అమీర్ ఖాన్ఫేవరేట్ నటి: శ్రీదేవి.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2010 | 6:53 am

దామోదర్‌కు చెక్ పెట్టేందుకేనా జానాకు చోటు?

రాష్ట్ర సమన్వయ కమిటీ ద్వారా తెలంగాణ నేతలకు చెక్ పెట్టాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగానే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న రాంరెడ్డి దామోదర్ రెడ్డికి చోటు కల్పించకుండా, మాజీమంత్రి జానారెడ్డికి స్థానం కల్పించారు.
Source: ఏపీ న్యూస్ | 6 Feb 2010 | 5:25 am

నాగ వైష్ణవి నిందితుల గుర్తింపు ప్రక్రియ పూర్తి!

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి హత్య కేసులో నిందితుల గుర్తింపు ప్రక్రియ శనివారం ముగిసింది. ఈ దారుణ హత్యలో పాల్గొన్న నిందితులను వైష్ణవి సోదరుడు సాయితేజ గుర్తించాడు. సాయితేజను పోలీసులు శనివారం మధ్యాహ్నం విజయవాడ సబ్ జైలుకు తీసుకు వచ్చి న్యాయమూర్తి సమక్షంలో హంతకుల గుర్తింపు పరేడ్ నిర్వహించారు.
Source: ఏపీ న్యూస్ | 6 Feb 2010 | 5:04 am

నన్ను కుక్కపిల్లలా తిప్పుకుంది: అమీషా ప్రియుడు

"బద్రి" చికిత్త అమీషా పటేల్ మళ్లీ ప్రియుడిని వదిలేసింది. తనతో జత కడుతుందేమోనని ఎన్నాళ్లగానో ఆశగా ఎదురు చూసిన బాయ్ ఫ్రెండ్ కనవ్ పురికి హ్యాండ్ ఇచ్చింది. దీంతో అతను అమీషా పేరు చెబితే మండి పడుతున్నాడు. ప్రేమ పేరుతో తనను తనవెంట కుక్కపిల్లలా తిప్పుకుందని తన సన్నిహితుల వద్ద వాపోతున్నాడట. అమీషా తనను వదిలిపెట్టినంత మాత్రాన మజ్ను అవతారం ఎత్తబోనని వ్యాఖ్యానిస్తున్నాడట. ఆమెది "టైమ్ పాస్" ప్రేమ అని గమనించలేకపోయానని తెగ బాధపడిపోతున్నాడట. ఇదిలావుంటే అమీషా పటేల్ మాత్రం కుటుంబ సభ్యుల ముందు ఎవరూ తనకు ఎక్కువ కాదనీ, వారికోసం ఎవరినైనా వదులుకుంటానని సెంటిమెంట్ డైలాగులు కొడుతోందట. కుటుంబ సభ్యులతో ఒకప్పుడు గెంటివేయబడ్డ అమీషా తిరిగి సొంత గూటికి చేరిన అనంతరం తనకు కొత్త శక్తి వచ్చినట్లయిందని ఎంతో సంబరపడిపోతోంది. ప్రస్తుతం తను ఒంటరిగా, ఫ్రీ బర్డ్ అయినందున ఇక కెరీర్‌పై దృష్టి సారిస్తాననీ, దక్షిణాది సినిమాల్లో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఉందని చెపుతోందట. మరి మన దర్శక నిర్మాతలు ఈ "చికిత్త"కు అవకాశం ఇస్తారో లేదో చూడాలి మరి!!
Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2010 | 5:03 am

రాజకీయ హత్య: 21 మంది గ్రామస్తులకు జీవిత శిక్ష

మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగ్‌పూర్ సమీపంలోని ఒక గ్రామంలో జరిగిన రాజకీయ హత్య కేసులో 21 మంది గ్రామస్తులకు స్థానిక కోర్టు జీవిత కారాగారశిక్షను ఖరారు చేసింది. మరో ఏడు మందిని నిర్ధోషులుగా విడుదల చేసింది. ఈ మేరకు నాగ్‌పూర్‌లోని ఏడవ అడిషినల్ జల్లా సెషన్స్ జడ్జి పీఎల్.ధలే తాజాగా తీర్పు ఇచ్చారు.
Source: జాతీయ | 6 Feb 2010 | 4:48 am

షారూక్ ఖాన్ ఒక ద్రోహి: శివసేన చీఫ్ బాల్ థాక్రే

బాలీవుడ్ సినీ నటుడు షారూక్ ఖాన్ ఒక ద్రోహిగా శివసేన పార్టీ అభివర్ణించింది. ఆ హీరో నటించి, త్వరలో విడుదల కానున్న "మై నేమ్ ఈజ్ ఖాన్" అనే చిత్రం విడుదలను తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకోబోరని ఆ పార్టీ చీఫ్ బాల్‌థాక్రే స్పష్టం చేశారు.
Source: జాతీయ | 6 Feb 2010 | 3:52 am

కుప్పంలో చంద్రబాబు పర్యటన: షెడ్యూల్ ఖరారు!

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల ఎనిమిదో తేదీ నుంచి తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు జరిపే ఈ పర్యటన వివరాలను తెదేపా ప్రధాన కార్యాలయం శుక్రవారం రాత్రి మీడియాకు వెల్లడించింది.
Source: ఏపీ న్యూస్ | 6 Feb 2010 | 3:18 am

నిద్రమత్తులో రోశయ్య సర్కారు: చంద్రబాబు ధ్వజం

రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కె.రోశయ్య సర్కారు నిద్రమత్తులో జోగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అలాగే, ముఖ్యమంత్రిగా రోశయ్య ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రాన్ని ఏదో శక్తి ఆవరించినట్టుగా ఉందన్నారు. అందువల్లే వారానికొకటి చొప్పున ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన జోస్యం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 6 Feb 2010 | 3:07 am

రోశయ్య కంటే చంద్రబాబు బెటర్..!: దామోదర్ రెడ్డి

ప్రత్యేక తెలంగాణ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య కంటే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బెటర్ అని తెలంగాణ సీనియర్ శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి అన్నారు. తెలంగాణ అంశంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన ప్రకటనపై దామోదర్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ వ్యవహారంపై నోరు మెదపక, దాటవేసే రోశయ్యపై దామోదర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 6 Feb 2010 | 2:42 am