"డ్రింక్‌"కైతే ఓకే.! సారీ చెప్పమనేందుకైతే.. ఊహుఁ..!!

శివసేన చీఫ్ బాల్ థాకరేతో డ్రింక్ తాగడానికి వెళ్లమంటే వెళతాను.. కానీ క్షమించమని చెప్పేందుకు వెళ్లమంటే మాత్రం... ఊహుఁ అంటున్నాడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. ఐపీఎల్ క్రికెట్ వ్యవహారంలో పాకిస్తాన్ క్రికెటర్ల గురించి తాను చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పు లేదనీ, అటువంటప్పుడు దానిగురించి తను పునరాలోచించాల్సిన అవసరం లేదని షారుక్ తెగేసి చెప్పాడు. శివసేన హెచ్చరికల నేపధ్యంలో లండన్ నుంచి వచ్చిన షారుక్ ఖాన్‌కు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శివసేన వ్యాఖ్యలపై షారుక్ స్పందిస్తూ... తాను ప్రపంచంలోని దేశాలన్నిటితో మంచి సంబంధాలు కలిగి ఉండాలని ఆకాంక్షిస్తాననీ చెప్పుకొచ్చారు. తను మాత్రమే కాదు ప్రతి ఒక్క పౌరుడు ఇలాగే ఉంటాడని విశ్వసిస్తానన్నాడు.ఒకవేళ బాల్ థాకరే తనను తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే.. కలిసి డ్రింక్ తాగేందుకు వెళతాననీ, కానీ క్షమించమని అడిగేందుకంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని షారుక్ అన్నాడు. అసలు తప్పు చేయనప్పుడు క్షమించమని అడిగే అవకాశం ఎక్కడుందని ఎదురు ప్రశ్నించారు. మొత్తమ్మీద సేన- షారుక్ లడాయి ఇప్పట్లో తెగేదిలా కనబడటం లేదు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2010 | 9:02 am

కుప్పంలో చంద్రబాబు పర్యటన: షెడ్యూల్ ఖరారు!

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల ఎనిమిదో తేదీ నుంచి తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు జరిపే ఈ పర్యటన వివరాలను తెదేపా ప్రధాన కార్యాలయం శుక్రవారం రాత్రి మీడియాకు వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 6 Feb 2010 | 8:48 am

నిద్రమత్తులో రోశయ్య సర్కారు: చంద్రబాబు ధ్వజం

రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కె.రోశయ్య సర్కారు నిద్రమత్తులో జోగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అలాగే, ముఖ్యమంత్రిగా రోశయ్య ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రాన్ని ఏదో శక్తి ఆవరించినట్టుగా ఉందన్నారు. అందువల్లే వారానికొకటి చొప్పున ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన జోస్యం చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 6 Feb 2010 | 8:36 am

రోశయ్య కంటే చంద్రబాబు బెటర్..!: దామోదర్ రెడ్డి

ప్రత్యేక తెలంగాణ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య కంటే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బెటర్ అని తెలంగాణ సీనియర్ శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి అన్నారు. తెలంగాణ అంశంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన ప్రకటనపై దామోదర్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ వ్యవహారంపై నోరు మెదపక, దాటవేసే రోశయ్యపై దామోదర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 6 Feb 2010 | 8:11 am

పెరిగిన ధరలకు కాలం చెల్లింది : ప్రధాని మన్మోహన్

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఆహార ద్రవ్యోల్బణాన్ని అధిగమిస్తామని, నిత్యావసర సరుకుల ధరలను స్థిరీకరిస్తామని, పెరిగిన ధరలకు ఇక కాలం చెల్లిందని ఆయన తెలిపారు. ధరల పెరుగుదల అంశంపై శనివారం న్యూ ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది.
Source: Yahoo! Telugu: News | 6 Feb 2010 | 8:04 am

"సమన్వయం"లో జగన్‌కు చోటు.. టి నేతల్లో గుబులు!

రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల మధ్య, పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం కుదిర్చేందుకు వీలుగా కాంగ్రెస్ హైకమాండ్ ఏర్పాటు చేసిన కో-ఆర్డినేషన్ (సమన్వయ) కమిటీతో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు హతాశులయ్యారు. ముఖ్యంగా, ఈ కమిటీలో తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన దివంగత వైఎస్సార్ వర్గీయులకు పెద్ద పీట వేయడం పట్ల వారు లోలోన ఆగ్రహంతో రగిలి పోతున్నారు.
Source: Yahoo! Telugu: News | 6 Feb 2010 | 7:41 am

రేపటితో ముగియనున్న 'టి'జాక్ డెడ్‌లైన్!

తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఆ ప్రాంత జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) పెట్టిన డెడ్‌లైన్ ఆదివారంతో ముగియనుంది. దీంతో అటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు జోరుగా మంతనాలు జరుపుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 6 Feb 2010 | 7:37 am

ఆర్థిక వృద్ధి 7.5 శాతానికి చేరుకుంటుంది: ప్రధాని

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2009-10)లో దేశీయ ఆర్థిక వృద్ధి 7.5 శాతానికి చేరుకుంటుందని, ఇదే గత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతంగా ఉండిందని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ శనివారం న్యూ ఢిల్లీలో తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 6 Feb 2010 | 7:16 am

చర్చల ప్రక్రియ ప్రారంభిస్తే భారత్‌పై దాడులు: జమాత్

పాకిస్థాన్‌తో తిరిగి శాంతి చర్చల ప్రక్రియను ప్రారంభిస్తే భారత్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని జమాత్ ఉద్ దవా తీవ్రవాద సంస్థ చీఫ్ హఫీస్ సయీద్ హెచ్చరించారు. తమ హెచ్చరికలను ఖాతరు చేయని పక్షంలో భారత్‌పై తీవ్రవాద దాడులకు పాల్పడుతామని ఆయన ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 6 Feb 2010 | 7:05 am

గ్లామరస్ కనిపిస్తా.. కానీ బికినీలు వేయను: కాజల్

"లక్ష్మీ కల్యాణం"తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన పంచదార బొమ్మ "కాజల్ అగర్వాల్". "మగధీర" హిట్‌తో టోలీవుడ్ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న కాజల్ అగర్వాల్.. ఎక్స్‌పోజింగ్‌తో అవకాశాలు వస్తాయా..? అన్న ప్రశ్నకు సమాధానమిచ్చింది. ఎక్స్‌పోజింగ్ వల్ల అవకాశాలు రావని కాజల్ తేల్చి చెబుతోంది. అంతేకాదు.. మీరు బికినీలు వేస్తారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. గ్లామరస్‌గా కనిపిస్తానే గానీ, బికీనీలు మాత్రం వేయనని కాజల్ అగర్వాల్ స్పష్టం చేసింది. పూర్తి పేరు: కాజల్ అగర్వాల్,పుట్టిన తేదీ: జూన్ 19, 1985 (వయసు 24), జన్మస్థలం: ముంబై,నచ్చిన వస్త్రాలు: చీర,నచ్చిన స్పాట్: లండన్,నచ్చిన పానీయం: వైట్ టీ,ఫేవరేట్ నటుడు: అమీర్ ఖాన్ఫేవరేట్ నటి: శ్రీదేవి.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2010 | 6:53 am

చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు: 72 గంటల బంద్!

తెలంగాణ, విదర్భ రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా తొమ్మిది చిన్నా రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని వస్తున్న డిమాండ్లకు మావోయిస్టులు మద్దతు ప్రకటించారు. ఇందులోభాగంగా 72 గంటల బంద్‌కు మావో అగ్రనేత కిషన్‌జీ పిలుపునిచ్చారు.
Source: Yahoo! Telugu: News | 6 Feb 2010 | 6:51 am

భారత్-పాక్ చర్చలకు అజెండానే సమస్య: యూఎస్

భారత్, పాకిస్థాన్ దేశాలు ముఖాముఖి చర్చలకు ముందుకు రావడం పట్ల అమెరికా హర్షం వ్యక్తం చేసినప్పటికీ.. ఈ చర్చలకు అజెండా ఖరారులోనే అసలు సమస్య నెలకొని ఉందని అమెరికా ఉందన్నారు. దీనిపై ఒబామా సర్కారులోని భద్రతా వ్యవహారాల ఇంటెలిజెన్స్‌, రాజకీయ వ్యవహారాల నిపుణుడు స్ట్రాట్‌ఫర్‌ మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనను పాక్‌ అంగీకరించే అవకాశం ఉందన్నారు.
Source: Yahoo! Telugu: News | 6 Feb 2010 | 6:42 am

నన్ను కుక్కపిల్లలా తిప్పుకుంది: అమీషా ప్రియుడు

"బద్రి" చికిత్త అమీషా పటేల్ మళ్లీ ప్రియుడిని వదిలేసింది. తనతో జత కడుతుందేమోనని ఎన్నాళ్లగానో ఆశగా ఎదురు చూసిన బాయ్ ఫ్రెండ్ కనవ్ పురికి హ్యాండ్ ఇచ్చింది. దీంతో అతను అమీషా పేరు చెబితే మండి పడుతున్నాడు. ప్రేమ పేరుతో తనను తనవెంట కుక్కపిల్లలా తిప్పుకుందని తన సన్నిహితుల వద్ద వాపోతున్నాడట. అమీషా తనను వదిలిపెట్టినంత మాత్రాన మజ్ను అవతారం ఎత్తబోనని వ్యాఖ్యానిస్తున్నాడట. ఆమెది "టైమ్ పాస్" ప్రేమ అని గమనించలేకపోయానని తెగ బాధపడిపోతున్నాడట. ఇదిలావుంటే అమీషా పటేల్ మాత్రం కుటుంబ సభ్యుల ముందు ఎవరూ తనకు ఎక్కువ కాదనీ, వారికోసం ఎవరినైనా వదులుకుంటానని సెంటిమెంట్ డైలాగులు కొడుతోందట. కుటుంబ సభ్యులతో ఒకప్పుడు గెంటివేయబడ్డ అమీషా తిరిగి సొంత గూటికి చేరిన అనంతరం తనకు కొత్త శక్తి వచ్చినట్లయిందని ఎంతో సంబరపడిపోతోంది. ప్రస్తుతం తను ఒంటరిగా, ఫ్రీ బర్డ్ అయినందున ఇక కెరీర్‌పై దృష్టి సారిస్తాననీ, దక్షిణాది సినిమాల్లో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఉందని చెపుతోందట. మరి మన దర్శక నిర్మాతలు ఈ "చికిత్త"కు అవకాశం ఇస్తారో లేదో చూడాలి మరి!!
Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2010 | 5:03 am

కుప్పంలో చంద్రబాబు పర్యటన: షెడ్యూల్ ఖరారు!

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల ఎనిమిదో తేదీ నుంచి తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు జరిపే ఈ పర్యటన వివరాలను తెదేపా ప్రధాన కార్యాలయం శుక్రవారం రాత్రి మీడియాకు వెల్లడించింది.
Source: ఏపీ న్యూస్ | 6 Feb 2010 | 3:18 am

నిద్రమత్తులో రోశయ్య సర్కారు: చంద్రబాబు ధ్వజం

రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కె.రోశయ్య సర్కారు నిద్రమత్తులో జోగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అలాగే, ముఖ్యమంత్రిగా రోశయ్య ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రాన్ని ఏదో శక్తి ఆవరించినట్టుగా ఉందన్నారు. అందువల్లే వారానికొకటి చొప్పున ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన జోస్యం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 6 Feb 2010 | 3:07 am

రోశయ్య కంటే చంద్రబాబు బెటర్..!: దామోదర్ రెడ్డి

ప్రత్యేక తెలంగాణ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య కంటే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బెటర్ అని తెలంగాణ సీనియర్ శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి అన్నారు. తెలంగాణ అంశంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన ప్రకటనపై దామోదర్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ వ్యవహారంపై నోరు మెదపక, దాటవేసే రోశయ్యపై దామోదర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 6 Feb 2010 | 2:42 am

రేపటితో ముగియనున్న 'టి'జాక్ డెడ్‌లైన్!

తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఆ ప్రాంత జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) పెట్టిన డెడ్‌లైన్ ఆదివారంతో ముగియనుంది. దీంతో అటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు జోరుగా మంతనాలు జరుపుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 6 Feb 2010 | 2:08 am

చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు: 72 గంటల బంద్!

తెలంగాణ, విదర్భ రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా తొమ్మిది చిన్నా రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని వస్తున్న డిమాండ్లకు మావోయిస్టులు మద్దతు ప్రకటించారు. ఇందులోభాగంగా 72 గంటల బంద్‌కు మావో అగ్రనేత కిషన్‌జీ పిలుపునిచ్చారు.
Source: జాతీయ | 6 Feb 2010 | 1:22 am

భవనం వాచ్‌మెన్ మల్లయ్య మృత్యుంజయుడు!

నారాయణగూడలోని శుక్రవారం మధ్యాహ్నం కూలిపోయిన భవనం శిథిలాల కింద చిక్కుకున్న వాచ్‌మెన్ మల్లయ్యను సహాయక సిబ్బంది సురక్షితంగా రక్షించింది. దాదుప 15 గంటల పాటు శిథిలాల కింద చిక్కుకుని మృత్యువుతో పోరాడిన మల్లయ్య ఎట్టకేలకు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 5 Feb 2010 | 11:26 pm

ధరల తగ్గుదలకు రాష్ట్రాలు సహకరించాలి: ప్రధాని

దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తు ధరలను తగ్గించేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు సహకారం అందించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. ధరల పెరుగదలపై ముఖ్యమంత్రుల సదస్సును ఆయన దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభించారు.
Source: జాతీయ | 5 Feb 2010 | 11:13 pm

బాధ్యులపై క్రిమినల్ చర్యలు చేపడుతాం: నవీన్ మిట్టల్

అక్రమ నిర్మాణానికి సంబంధించి బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు చేపడుతామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నవీన్ మిట్టల్ తెలిపారు. గురువారం నారాయణ గూడలో కూలిపోయిన భవనాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కుప్పకూలిన భవననం అక్రమ నిర్మాణమేనన్నారు.
Source: ఏపీ న్యూస్ | 5 Feb 2010 | 10:29 pm

జనతా పార్టీ అధినేతకు మద్రాసు హైకోర్టు చీవాట్లు!

జనతా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామికి మద్రాసు హైకోర్టు చీవాట్లు పెట్టింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత కారాగార శిక్షను అనుభవిస్తున్న నళిని కేసు వ్యవహారంలో ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని ఆదేశించింది. అలా చేయడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
Source: జాతీయ | 5 Feb 2010 | 9:40 pm

త్వరలో ఎస్పీ బహిష్కృత నేత అమర్ సింగ్ కొత్త పార్టీ!

సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నేత అమర్ సింగ్ ఈనెల 25వ తేదీ లోపు కొత్త పార్టీని స్థాపించనున్నారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు అరవింద్ సింగ్ వెల్లడించారు. ఈ కొత్త పార్టీలో ఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన రాంపూర్ ఎంపీ, సినీ నటి జయప్రద, బాలీవుడ్ స్టార్లు అమితాబ్‌ బచ్చన్, ఈయన సతీమణి జయా బచ్చన్, సంజయ్‌దత్‌లు కీలక పాత్ర పోషించవచ్చని ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు.
Source: జాతీయ | 5 Feb 2010 | 9:23 pm

జైపూర్‌లో ఎన్టీఆర్, ఇలియానాల "శక్తి" షూటింగ్!

యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో "కంత్రి" దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం "శక్తి". ఈ సినిమా షెడ్యూల్ ఫిబ్రవరి ఆరు నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌లో 300 మంది యూనిట్ సభ్యులతో భారీ ఎత్తున జరుగుతోంది. 15 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో ఓ పాట, కొన్ని ముఖ్య సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు.ఈ చిత్రం గురించి హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. "అశ్వనీదత్ బ్యానర్‌లో మెహర్ రమేష్ దర్శకత్వంలో "శక్తి" చిత్రం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కథలో చాలా పవర్ ఉంది. నా కెరీర్‌లో ఇది ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవుతుంది" అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Feb 2010 | 12:10 pm

ఫ్యాక్షనిజాన్ని తరిమికొట్టి మరదల్ని వరించే "బిందాస్"

"బిందాస్" అంటే.. చాలా జోష్‌గా, హుషారుగా ఉన్నాడని అంటారు. ఈ చిత్రం అలా ఉంటుందని దర్శకనిర్మాతలు ఊహించి ఆ పేరు పెట్టేశారు. అసలు ట్యాగ్‌లైనే చిత్రానికి టైటిల్. షూటింగ్‌‌ జరుగుతుండగా, ఏదో ఒక సందర్భంలో "బిందాస్" అనేమాట యూనిట్‌ నుంచి రావడంతో దాన్ని టైటిల్‌గా పెట్టారు. సినిమా చూస్తుంటే.. విక్టరీ వెంకటేష్ నటించిన కలిసుందాంరా..ను మళ్లీ కొత్తవారితో చూసినట్లుంది. ఫ్యాక్షనిజానికి కామెడీ జోడింపే ఈ చిత్రం. మంచుమనోజ్ చాలా ఎనర్జిటిక్‌గా నటించాడు. అంతకుముందు నేను మీకు తెలుసా?, ప్రయాణం చిత్రాల్లో కొత్తపోకడలు చూపించినా, ఇందులో హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. హావభావాల్లో కొన్ని షేడ్స్ మోహన్‌బాబును ఇమిటేట్‌చేసినట్లు కన్పిస్తాడు. అజయ్ ఊరికి వచ్చినప్పటినుంచి సీరియస్‌గా ఉన్న కుటుంబంలో నవ్వులు పంచడానికి చేసిన ప్రయత్నాలకు బ్రహ్మానందం, ఎం.ఎఎస్. రఘుబాబు, సునీల్, మాస్టర్ భరత్ బాగా ఉపయోగపడ్డారు. మనోజ్ టైమింగ్ ఈ చిత్రంలో చాలా బాగుంది. పాటలు, ఫైట్స్‌పరంగా బాగానే చేశాడు. షీనా పాత్ర పరంగా బాగానే ఉన్నా.. ఆమె మంచు పక్కన మైనర్‌లా కన్పించింది. జయప్రకాష్‌రెడ్డి పాత్ర ఫ్యాక్షనిస్టుగా కొట్టిన పిండే.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Feb 2010 | 10:14 am

నారాయణగూడలో కుప్పకూలిన భవనం: 13మంది మృతి

హైదరాబాదులోని నారయణగూడ ఫ్లై ఓవర్ వద్ద నిర్మాణంలోనున్న ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 13మంది కార్మికులు మృతి చెందారు. 108 సిబ్బంది, స్థానిక ప్రజలు శిథిలాలను తొలగించే పనిలో ఉన్నారు.
Source: ఏపీ న్యూస్ | 5 Feb 2010 | 7:45 am

తెలుగులో త్రీ (పవన్ కల్యాణ్-సిద్ధార్థ్-అల్లరి నరేష్) ఇడియట్స్

బాలీవుడ్ రికార్డులను షేక్ చేస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న చిత్రం త్రీ ఇడియట్స్. ఇపుడీ చిత్రాన్ని తెలుగులో నిర్మించేందుకు కసరత్తు జరుగుతోంది. పవన్ కల్యాణ్, సిద్దార్థ్, అల్లరి నరేష్ కాంబినేషన్‌‍లో తెలుగు త్రీ ఇడియట్స్ తీసేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇకపోతే... పవన్ కల్యాణ్, సిద్దార్థ్, అల్లరి నరేష్‌లకు జోడీలుగా నటించే హీరోయిన్ల ఎంపిక కూడా జరుగుతున్నట్లు సమాచారం. మొత్తమ్మీద బాలీవుడ్ బాక్సాఫీసులను బద్ధలుకొడుతున్న హిందీ త్రీ ఇడియట్స్ రేంజ్‌లో తెలుగు త్రీ ఇడియట్స్ తెరకెక్కించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.కాగా ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించనున్నట్లు టాలీవుడ్ సినీ టాక్.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Feb 2010 | 7:30 am

శ్రీకృష్ణ కమిటీపై నేనేమీ మాట్లాడలేదు: రోశయ్య

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ గురుంచి తను ఏమీ మాట్లాడలేదని ముఖ్యమంత్రి రోశయ్య వెల్లడించారు.
Source: జాతీయ | 5 Feb 2010 | 7:24 am

పది రోజుల్లో తెలంగాణ ఛానల్: తెలంగాణా "పల్స్" బీట్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న "తెలంగాణా ఛానల్"ను జనవరి 28వ తేదీన లాంఛనంగా ఆరంభించారు. జూబ్లీహిల్స్‌లోని తెరాస కార్యాలయంలోని 2వ ఫ్లోర్‌‌లో ఉన్న ఛానల్ కార్యాలయాన్ని టెస్ట్‌సిగ్నల్ నిర్వహించారు. ఇది ఫుల్‌ఫ్లెజ్డ్‌గా రావడానికి ఇంకా పదిరోజులు పడుతుందని విశ్వసనీయ సమాచారం. అన్ని ఛానల్స్ లాగానే సమర్థవంతంగా నిర్వహిస్తూ.. తెలంగాణా సత్తాను చాటేవిధంగా వైవిధ్యంగా ప్రోగ్రామ్‌లు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 5 Feb 2010 | 6:19 am

అర్జెంటుగా ప్రేమించేయాలి... తప్పదు: రీమాసేన్

రెండేళ్లపాటు ఏ సినిమాను ఒప్పుకోక కేవలం "యుగానికి ఒక్కడు" అనే తమిళ చిత్రంలో నటించిన రీమాసేన్... కథలు నచ్చకే ఎన్ని అవకాశాలు వచ్చినా రిజెక్ట్ చేశానని చెపుతోంది. అయితే ఆ చిత్రంలో ఎక్స్‌పోజింగ్ పరిమితి మించిపోయిందన్న విమర్శలను కొట్టి పారేస్తూ గ్లామర్‌గా కనిపించానని అంటోంది. పెళ్లెప్పుడు అని అడిగితే... ఈ ఏడాది నా డైరీలో ఆ పదానికి చోటు లేదని నిర్మొహమాటంగా వెల్లడించింది. కొన్ని విషయాలు మనం వద్దనుకున్నా జరిగిపోతాయనీ, అలాగే పెళ్లి కూడా జరిగిపోతుందని వేదాంతం మాట్లాడుతోంది. అసలు విషయం ఏమిటంటే... చూస్తే ప్రేమించేయాలి అనేంతగా తనకెవరూ తారస పడలేదట. పెళ్లి విషయంలోనూ ఇదే మాట అంటోంది. మరి సినిమాలో అంటే... అది దర్శకుడు చెబితే అర్జెంటుగా ప్రేమించేయాలి.. తప్పదు అంటూ ముసిముసి నవ్వులు వలకపోస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Feb 2010 | 6:08 am

కొత్త పార్టీని ప్రారంభించనున్న అమర్ సింగ్

సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ ఫిబ్రవరి నెల చివర్లో కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు ఆయన సోదరుడు మీడియాకు తెలిపారు.
Source: జాతీయ | 5 Feb 2010 | 5:47 am

ఫ్యాక్షనిజాన్ని తరిమికొట్టి మరదల్ని వరించే "బిందాస్"

"బిందాస్" అంటే.. చాలా జోష్‌గా, హుషారుగా ఉన్నాడని అంటారు. ఈ చిత్రం అలా ఉంటుందని దర్శకనిర్మాతలు ఊహించి ఆ పేరు పెట్టేశారు. అసలు ట్యాగ్‌లైనే చిత్రానికి టైటిల్. షూటింగ్‌‌ జరుగుతుండగా, ఏదో ఒక సందర్భంలో "బిందాస్" అనేమాట యూనిట్‌ నుంచి రావడంతో దాన్ని టైటిల్‌గా పెట్టారు. సినిమా చూస్తుంటే..
Source: వినోదం | 5 Feb 2010 | 5:13 am

కేంద్ర మంత్రులపై ధ్వజమెత్తిన బాల్ థాకరే

గత కొద్ది రోజులుగా వార్తలలోకెక్కుతున్న థాకరే తాజాగా మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శివసేన పార్టీకి చెందిన ' సామ్నా ' పత్రిక సంపాదకీయంలో శరద్ పవార్, విలాస్ రావ్ దేశ్ ముఖ్, సుషీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చౌహాన్, మురళీ దేవరా, ప్రఫుల్ పటేల్‌లకు ఆత్మగౌరవం లేదని ఆయన మండిపడ్డారు.
Source: జాతీయ | 5 Feb 2010 | 4:16 am

ఐపీసీసీ చీఫ్ పచోరికి మన్మోహన్ సింగ్ మద్దతు!

ఐక్యరాజ్యసమితికి చెందిన ఐపీసీసీ (ఇంటర్‌-గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లయిమేట్‌ ఛేంజ్‌) అధ్యక్షుడు, వాతావరణ నిపుణుడు డాక్టర్. రాజేంద్ర కుమార్ పచోరికి, దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ పూర్తి మద్దతు తెలిపారు. భారతదేశం ఐపీసీసీపై పూర్తి నమ్మకం కలిగి ఉందని ప్రధాని మన్మోహన్ వెల్లడించారు. భూభాగంపై గల వేడితో హిమాలయ పర్వతాల్లోని హిమనీనదాలు 2035 సంవత్సరంలో మాయమవుతాయని ఐపీసీసీ ప్రకటించడం వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఐపీసీసీ ప్రకటనపై మన్మోహన్ సింగ్ శుక్రవారం పూర్తి మద్దతు తెలియజేశారు.
Source: జాతీయ | 5 Feb 2010 | 2:58 am

పేద ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్మరణీయుడు: పితాని

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్జి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని ఆరోగ్య శ్రీ మంత్రి పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ వంటి సంక్షేమ పథకాలు ఉన్నంతవరకు వైఎస్సార్‌ను ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉంటారని పితాని అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆరోగ్య శ్రీ క్యాంపు కార్యాలయాన్ని పితాని ప్రారంభించారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ.. పేదప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమే వైఎస్సార్ ఆరోగ్య శ్రీని ప్రవేశపెట్టారని చెప్పారు. పేద ప్రజలను ఆదుకునేందుకే వైఎస్సార్ ఇలాంటి ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేశారని పితాని వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 5 Feb 2010 | 1:58 am