|
పెట్రో ధరల నియంత్రణ ఎత్తివేస్తే ధరలు తగ్గుతాయి: మాంటెక్ఇంధన ధరల నియంత్రణను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేస్తే దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని, అలాగే ధరలలోను తగ్గుదల కనబడుతుందని కేంద్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా తెలిపారు.Source: Yahoo! Telugu: News | 5 Feb 2010 | 8:34 am హైదరాబాద్ నారాయణగూడలో కుప్పకూలిన భవనంహైదరాబాదులోని నారయణగూడ ఫ్లై ఓవర్ వద్ద నిర్మాణంలోనున్న ఓ భవనం కుప్పకూలింది. కూలిన భవనంలో పలువురు కార్మికులు ఉన్నారు. ప్రమాద స్థలికి 108 సిబ్బంది హుటాహుటిన చేరుకుని సహాయక కార్యక్రమాలను చేపట్టారు. శిథిలాలను తొలగించే పని ప్రారంభించారు.Source: Yahoo! Telugu: News | 5 Feb 2010 | 8:27 am ఐపీసీసీ చీఫ్ పచోరికి మన్మోహన్ సింగ్ మద్దతు!ఐక్యరాజ్యసమితికి చెందిన ఐపీసీసీ (ఇంటర్-గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లయిమేట్ ఛేంజ్) అధ్యక్షుడు, వాతావరణ నిపుణుడు డాక్టర్. రాజేంద్ర కుమార్ పచోరికి, దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ పూర్తి మద్దతు తెలిపారు. భారతదేశం ఐపీసీసీపై పూర్తి నమ్మకం కలిగి ఉందని ప్రధాని మన్మోహన్ వెల్లడించారు. భూభాగంపై గల వేడితో హిమాలయ పర్వతాల్లోని హిమనీనదాలు 2035 సంవత్సరంలో మాయమవుతాయని ఐపీసీసీ ప్రకటించడం వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఐపీసీసీ ప్రకటనపై మన్మోహన్ సింగ్ శుక్రవారం పూర్తి మద్దతు తెలియజేశారు.Source: Yahoo! Telugu: News | 5 Feb 2010 | 8:26 am 20 సంవత్సరాల స్వేచ్ఛను పండుగలా జరుపుకున్న మండేలాగతంలో తమ దేశానికి స్వాతంత్ర్యం కోసం శాంతియుతంగా పోరాడిన వ్యక్తి నెల్సన్ మండేలా ఇరవై ఏడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఫిబ్రవరి 11, 1990న విడుదలైన మండేలా తన కుటుంబ సభ్యులతో కలిసి ఇరవై సంవత్సరాల స్వేచ్ఛను పండుగలా జరుపుకున్నట్లు జింక్ మీడియా తెలిపింది.Source: Yahoo! Telugu: News | 5 Feb 2010 | 8:05 am నష్టాలతో కూరుకుపోయిన విదేశీ మార్కెట్లుదేశీయ బాంబే స్టాక్ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు శుక్రవారం ఏ మాత్రం కలిసిరాలేదు. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే విదేశీ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి. దీంతో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో యూరప్, ఆసియా మార్కెట్లు తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ఇందులో బాంబే స్టాక్ మార్కెట్ సూచీల్లో సెన్సెక్స్ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 451 పాయింట్లు భారీగా క్షీణించి, 15,773 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 126 పాయింట్లు పతనమై, 4,719 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 5 Feb 2010 | 7:34 am తెలుగులో త్రీ (పవన్ కల్యాణ్-సిద్ధార్థ్-అల్లరి నరేష్) ఇడియట్స్బాలీవుడ్ రికార్డులను షేక్ చేస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న చిత్రం త్రీ ఇడియట్స్. ఇపుడీ చిత్రాన్ని తెలుగులో నిర్మించేందుకు కసరత్తు జరుగుతోంది. పవన్ కల్యాణ్, సిద్దార్థ్, అల్లరి నరేష్ కాంబినేషన్‌లో తెలుగు త్రీ ఇడియట్స్ తీసేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇకపోతే... పవన్ కల్యాణ్, సిద్దార్థ్, అల్లరి నరేష్‌లకు జోడీలుగా నటించే హీరోయిన్ల ఎంపిక కూడా జరుగుతున్నట్లు సమాచారం. మొత్తమ్మీద బాలీవుడ్ బాక్సాఫీసులను బద్ధలుకొడుతున్న హిందీ త్రీ ఇడియట్స్ రేంజ్‌లో తెలుగు త్రీ ఇడియట్స్ తెరకెక్కించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.కాగా ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించనున్నట్లు టాలీవుడ్ సినీ టాక్.Source: Yahoo! Telugu: Entertainment | 5 Feb 2010 | 7:30 am పేద ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్మరణీయుడు: పితానిదివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్జి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని ఆరోగ్య శ్రీ మంత్రి పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ వంటి సంక్షేమ పథకాలు ఉన్నంతవరకు వైఎస్సార్‌ను ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉంటారని పితాని అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆరోగ్య శ్రీ క్యాంపు కార్యాలయాన్ని పితాని ప్రారంభించారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ.. పేదప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమే వైఎస్సార్ ఆరోగ్య శ్రీని ప్రవేశపెట్టారని చెప్పారు. పేద ప్రజలను ఆదుకునేందుకే వైఎస్సార్ ఇలాంటి ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేశారని పితాని వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 5 Feb 2010 | 7:27 am నష్టాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ భారీ పతనంబాంబే స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, 453 పాయింట్లు భారీగా క్షీణించి, 15,771 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 145 పాయింట్లు భారీగా పడిపోయి, 4,700 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 5 Feb 2010 | 7:13 am ముంబై లోకల్ రైల్లో రాహుల్ గాంధీ ప్రయాణంమహారాష్ట్రలోని ముంబయి నగరంలో రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకుంటామని శివసేన హెచ్చరించినప్పటికీ రాహుల్ తన పర్యటనను దిగ్విజయంగా సాగించారు. శుక్రవారం ముంబయికి చేరుకున్న రాహుల్, విద్యార్థులూ యువతతో ముచ్చటించారు.Source: Yahoo! Telugu: News | 5 Feb 2010 | 6:40 am భారీగా క్షీణించిన బాంబే స్టాక్ మార్కెట్శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ భారీగా క్షీణించింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి భారీ నష్టాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 380 పాయింట్లు భారీగా పతనమై 15,844 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 122 పాయింట్లు భారీగా కోల్పోయి, 4,722 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది.Source: Yahoo! Telugu: News | 5 Feb 2010 | 6:13 am తగ్గనున్న దేశీయ ఎగుమతులు : సర్వేప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తయ్యే వస్తువుల ఎగుమతుల్లో 5.2 శాతం తగ్గుదల నమోదు చేసుకోనుందని సర్వే తెలుపుతోంది. అదే వచ్చే ఆర్థిక సంవత్సరం (2010-11)లో ఎగుమతుల్లో వృద్ధి కపడవచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంకు ద్వారా నిర్వహించిన ఓ సర్వేలో తెలిసింది.Source: Yahoo! Telugu: News | 5 Feb 2010 | 6:08 am అర్జెంటుగా ప్రేమించేయాలి... తప్పదు: రీమాసేన్రెండేళ్లపాటు ఏ సినిమాను ఒప్పుకోక కేవలం "యుగానికి ఒక్కడు" అనే తమిళ చిత్రంలో నటించిన రీమాసేన్... కథలు నచ్చకే ఎన్ని అవకాశాలు వచ్చినా రిజెక్ట్ చేశానని చెపుతోంది. అయితే ఆ చిత్రంలో ఎక్స్‌పోజింగ్ పరిమితి మించిపోయిందన్న విమర్శలను కొట్టి పారేస్తూ గ్లామర్‌గా కనిపించానని అంటోంది. పెళ్లెప్పుడు అని అడిగితే... ఈ ఏడాది నా డైరీలో ఆ పదానికి చోటు లేదని నిర్మొహమాటంగా వెల్లడించింది. కొన్ని విషయాలు మనం వద్దనుకున్నా జరిగిపోతాయనీ, అలాగే పెళ్లి కూడా జరిగిపోతుందని వేదాంతం మాట్లాడుతోంది. అసలు విషయం ఏమిటంటే... చూస్తే ప్రేమించేయాలి అనేంతగా తనకెవరూ తారస పడలేదట. పెళ్లి విషయంలోనూ ఇదే మాట అంటోంది. మరి సినిమాలో అంటే... అది దర్శకుడు చెబితే అర్జెంటుగా ప్రేమించేయాలి.. తప్పదు అంటూ ముసిముసి నవ్వులు వలకపోస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 5 Feb 2010 | 6:08 am నారాయణగూడలో కుప్పకూలిన భవనం: ఇద్దరు మృతిహైదరాబాదులోని నారయణగూడ ఫ్లై ఓవర్ వద్ద నిర్మాణంలోనున్న ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ ఇద్దరు కార్మికులు మృతి చెందారు. 108 సిబ్బంది, స్థానిక ప్రజలు శిథిలాలను తొలగించే పనిలో ఉన్నారు.Source: ఏపీ న్యూస్ | 5 Feb 2010 | 3:35 am ఐపీసీసీ చీఫ్ పచోరికి మన్మోహన్ సింగ్ మద్దతు!ఐక్యరాజ్యసమితికి చెందిన ఐపీసీసీ (ఇంటర్-గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లయిమేట్ ఛేంజ్) అధ్యక్షుడు, వాతావరణ నిపుణుడు డాక్టర్. రాజేంద్ర కుమార్ పచోరికి, దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ పూర్తి మద్దతు తెలిపారు. భారతదేశం ఐపీసీసీపై పూర్తి నమ్మకం కలిగి ఉందని ప్రధాని మన్మోహన్ వెల్లడించారు. భూభాగంపై గల వేడితో హిమాలయ పర్వతాల్లోని హిమనీనదాలు 2035 సంవత్సరంలో మాయమవుతాయని ఐపీసీసీ ప్రకటించడం వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఐపీసీసీ ప్రకటనపై మన్మోహన్ సింగ్ శుక్రవారం పూర్తి మద్దతు తెలియజేశారు.Source: జాతీయ | 5 Feb 2010 | 2:58 am పేద ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్మరణీయుడు: పితానిదివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్జి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని ఆరోగ్య శ్రీ మంత్రి పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ వంటి సంక్షేమ పథకాలు ఉన్నంతవరకు వైఎస్సార్‌ను ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉంటారని పితాని అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆరోగ్య శ్రీ క్యాంపు కార్యాలయాన్ని పితాని ప్రారంభించారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ.. పేదప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమే వైఎస్సార్ ఆరోగ్య శ్రీని ప్రవేశపెట్టారని చెప్పారు. పేద ప్రజలను ఆదుకునేందుకే వైఎస్సార్ ఇలాంటి ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేశారని పితాని వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 5 Feb 2010 | 1:58 am ముంబై లోకల్ రైల్లో రాహుల్ గాంధీ ప్రయాణంమహారాష్ట్రలోని ముంబయి నగరంలో రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకుంటామని శివసేన హెచ్చరించినప్పటికీ రాహుల్ తన పర్యటనను దిగ్విజయంగా సాగించారు. శుక్రవారం ముంబయికి చేరుకున్న రాహుల్, విద్యార్థులూ యువతతో ముచ్చటించారు.Source: జాతీయ | 5 Feb 2010 | 1:11 am సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి రోశయ్యదేశ రాజధాని నగరం ఢిల్లీలో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య హాజరయ్యారు. ముఖ్యమంత్రితో కేకే, వెంకటస్వామిలతో పాటు పలు రాష్ట్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీడబ్ల్యూసీలో పాల్గొనేందుకు శుక్రవారం హస్తినకు చేరుకున్న ముఖ్యమంత్రి రోశయ్య.. ముందుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీపై చర్చలు జరిపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.Source: ఏపీ న్యూస్ | 5 Feb 2010 | 12:32 am కేవీపీ బండారం బయటపెట్టాల్సిందే: పాల్వాయి, ఆమోస్రాష్ట్ర ప్రజా భద్రతా సలహా సంఘం ఛైర్మెన్ కేవీపీ రామచంద్రరావు అవినీతి వ్యవహారంపై విచారణ కమిటీచే దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధన రెడ్డి, ఎమ్మెల్సీ ఆమోస్‌లు న్యూ ఢిల్లీలో శుక్రవారం డిమాండ్ చేశారు.Source: ఏపీ న్యూస్ | 5 Feb 2010 | 12:19 am నేడు ముంబైలో పర్యటించనున్న రాహుల్ గాంధీఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ నేడు ముంబైలో పర్యటించనున్నారు. శివసేన హెచ్చరికల నేపథ్యంలో ఈ పర్యటనకు మాహారాష్ట్ర ప్రభుత్వం పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది.Source: జాతీయ | 4 Feb 2010 | 10:59 pm తెలంగాణపై ఆచితూచి అడుగేయండి: సీమాంధ్ర నేతలుకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీతో సీమాంధ్ర నేతలు గురువారం రాత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం విషయంలో ఆచితూచి అడుగువేయాలని మంత్రి ప్రణబ్‌ను కోరినట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రంనాయుడు చెప్పారు. ఇంకా తెలంగాణ ఏర్పాటైన శ్రీకృష్ణ కమిషన్ సిఫార్సులు మన రాష్ట్రానికి కాకుండా దేశంలోని ఇతర చిన్న రాష్ట్రాల డిమాండ్ ఉన్న ప్రాంతాలకు కూడా విస్తరించాలని ప్రణబ్ ఈ సమావేశంలో పేర్కొన్నట్లు తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ ఎర్రంనాయుడు మీడియాతో అన్నారు.Source: ఏపీ న్యూస్ | 4 Feb 2010 | 10:54 pm నేడు సమావేశం కానున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీసీడబ్ల్యూసీ నేడు తొలిసారిగా సమావేశం కానుంది. ఈ ఏడాదిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కావడం ఇదే ప్రథమం. సమావేశపు అజెండా ఏమిటన్నది మాత్రం బయటకి తెలియనప్పటికీ... ధరల పెరుగుదల అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగవచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.Source: జాతీయ | 4 Feb 2010 | 10:35 pm ముంబైకి పయనమైన వినోద్ కుమార్ దుగ్గల్కేంద్ర ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాల్ని త్వరగా ఖరారు చేసేందుకు కమిటీ సభ్య కార్యదర్శి వినోద్ కుమార్ దుగ్గల్‌ను గురువారం ముంబైకి పంపించింది.Source: జాతీయ | 4 Feb 2010 | 10:20 pm రంభకు "మెగా"లాంటి భర్త దొరికాడట...!!థండర్ థైస్... వండర్ బాడీ అని టాలీవుడ్ ఒకనాడు కీర్తించిన సినీనటి రంభ నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగిపోయింది. కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రన్‌తో వివాహం నిశ్చయమైంది. ఇదంతా పాత చింతకాయ పచ్చడి కబురు. మరి తాజా సంగతేంటి...? అంటారా...? అప్పుడెప్పుడో వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్నప్పుడు రంభను మీ ఆయన ఎలా ఉండాలని కోరుకుంటావ్ అనడిగితే... మెగాస్టార్ చిరంజీవి రేంజ్‌లో ఉండాలని చెప్పిందట. ఆ తర్వాత గత పదేళ్లుగా "మెగా"లాంటి పురుషునికోసం మహా వేట జరిగింది. తగిన వరునికోసం రంభ దాదాపు దశాబ్దకాలం వేచి చూడాల్సి వచ్చింది. చివరికి ఇంద్రన్ జత కుదరడంతో వివాహానికి సిద్ధమైంది. పెళ్లి కూడా తిరుపతిలో జరుగనుంది. మొత్తానికి ఇంద్రన్‌ను ఏరికోరి పెళ్లి చేసుకుంటుందంటే... ఇంద్రన్‌లో "ఇంద్ర" క్వాలిటీస్ ఉన్నట్లేనని టాలీవుడ్ సినీజనం అనుకుంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Feb 2010 | 1:07 pm రామ్ చరణ్ నాతో బంతాట ఆడుతున్నాడు: పద్మాసీటాలీవుడ్ బాక్సాఫీసులను షేక్ చేసిన "మగధీరుడు" రామ చరణ్ తేజపై పొగడ్తల వర్షం కురిపిస్తోంది బాలీవుడ్ "రాకెట్ సింగ్" పద్మాసీ. రామ్ చరణ్ సహనటులను ప్రోత్సహించడంలో ముందుంటారని తన అందమైన పెదవులను సాగదీస్తూ చెప్పింది. అంతేకాదు ఒక్కసారి "మగధీర"తో చేసినవారు మళ్లీ మళ్లీ నటించాలని ఉవ్విళ్లూరుతారని కళ్లు చికిలిస్తూ వగలు పోతోంది. అదిసరే... రామ్ చరణ్ సరసన నటిస్తున్నారు కదా... ప్రస్తుతం ఆయనతో చేసిన ఓ షూటింగ్ ముచ్చట చెప్పమని అడిగితే, "బంతాట ఆడుకుంటున్నాం" అని టక్కున చెప్పేసింది. అర్థం కాలేదు.. మరోసారి చెప్తావా? అని ప్రశ్నిస్తే... "అదేనండీ రామ్ చరణ్ నాతో బంతాట ఆడే సన్నివేశాన్ని ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు. ఇద్దరం కలిసి ఎంచక్కా బాల్ ఆట ఆడుకున్నాం. అలా ఆడినంత సేపు ఎంతో ఆనందంగా ఉంది. మళ్లీ మళ్లీ ఆడాలనిపిస్తోంది" అని సంతోషాన్ని వ్యక్తపరిచింది.రామ్ చరణ్‌కు గుఱ్ఱపు స్వారీయే కాదు... బంతులాట కూడా బాగా వచ్చన్నమాట!!Source: Yahoo! Telugu: Entertainment | 4 Feb 2010 | 8:51 am రాహుల్ గాంధీకి నల్ల జెండాలు చూపండి: థాకరేశుక్రవారం ముంబయి పర్యటనకు వస్తున్న కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకి నల్ల జెండాలు చూపాలని శివసేన చీఫ్ బాల్ థాకరే పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నాయకులు తమ నిరసనను నల్ల జెండాలను చూపించడం ద్వారా తెలపాలని థాకరే తనకు చెప్పినట్లు సీనియర్ నేత సంజయ్ రావత్ వెల్లడించారు.Source: జాతీయ | 4 Feb 2010 | 8:14 am విధి విధానాలపై ఊహాగానాలు వద్దు: మొయిలీజస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలపై తమకు తోసిన రీతిలో ఊహించరాదని కేంద్ర న్యాయ శాఖామంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ అన్నారు. ఆయనతో కొంతమంది తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు బుధవారం రాత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం వేసిన కమిటీలో ప్రతి ఒక్క సభ్యుడూ అత్యంత సమర్థులన్నారు. వీరంతా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాదనలను శ్రద్ధగా వింటారని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 4 Feb 2010 | 6:31 am రేపు ముంబై పర్యటనకు వెళ్లనున్న రాహుల్ గాంధీ!కాంగ్రెస్ - శివసేన పార్టీల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ముంబై అందరిదీ అని వ్యాఖ్యానించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీపై శివసేన చీఫ్ బాల్‌థాక్రేతో పాటు.. ఆయన కుమారుడు ఉద్ధవ్ థాక్రే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముంబై ధర్మసత్రం కాదని, ముఖ్యంగా ఇటలీ మమ్మీలకు సొంతం కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీనిపై అంతకంటే ఎక్కువ స్థాయిలో మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు బాల్‌థాక్రేపై విమర్శలు ఎక్కుపెట్టారు.Source: జాతీయ | 4 Feb 2010 | 5:54 am కలలు కనకండి... టీవీ షోలు జూదాల్లాంటివి: రాజశేఖర్డాక్టర్ నుంచి నటుడిగా మారిన డాక్టర్ రాజశేఖర్ చిత్రాలు ఈమధ్య తగ్గు ముఖం పట్టాయి. దానికి ఓ కారణముందంటున్నారు రాజశేఖర్. రాజకీయాల్లో ఉండటం, ఎన్నికలు రావడం వల్ల సినిమాలపై శ్రద్ధ పెట్టలేదని చెబుతున్నారు. తాజాగా ఆయన కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆయన పుట్టినరోజు గురువారం( 4-2-2010)నాడు అన్నపూర్ణలో ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్య్వూ...నటునిగా గ్యాప్ రావడానికి కారణం..?"ఎవడైతే నాకేంటి" తర్వాత చాలా కథలు విన్నాను. అందులో రెండు చిత్రాలు సిద్ధం అయ్యాక షూటింగ్‌కు వెళదాం అనుకుంటుండగా మళ్లీ ఏవో లోపాలు కన్పించి ఆగాల్సి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, కొన్ని గొడవలు సంఘటనలతో గ్యాప్ వచ్చింది.Source: Yahoo! Telugu: Entertainment | 4 Feb 2010 | 5:35 am చంద్రబాబు కూడా ఓ మనిషేనా: నటి జయప్రద!తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఓ మనిషేనా అంటూ సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నాయకురాలు, సినీ నటి, రాంపూర్ ఎంపీ జయప్రద విమర్శించారు. తాను తెలుగుదేశం పార్టీలో ఉండగా పలు మార్లు అవమానించారంటూ ఆమె ఆరోపించారు. ఆ అవమానభారాలు భరించలేకే తాను ఉత్తరాదికి వచ్చి ఎస్పీలో చేరినట్టు జయప్రద గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో వెల్లడించారు.Source: జాతీయ | 4 Feb 2010 | 5:11 am అర్థరాత్రి వరకు వెలిగిన కొలిమి: వాచ్‌మెన్ భార్య!అత్యంత క్రూరంగా హత్యకు గురైన నాగ వైష్ణవి కేసులో తాజాగా మరికొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. షెడ్ వాచ్‌మెన్ భార్య జయమ్మ వద్ద పోలీసులు జరిపిన విచారణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. షెడ్ యజమాని శ్రీనివాస రావు శనివారం రాత్రి తొమ్మిది గంటలకు కారులో షెడ్‌కు వచ్చారని చెప్పింది.Source: ఏపీ న్యూస్ | 4 Feb 2010 | 4:42 am నాగచైతన్య "ఏ మాయ చేసావె" ఆడియో విడుదల!యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా "ఘర్షణ" ఫేం గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ కృష్ణ సమర్పణలో ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ స్వరూప్ నిర్మిస్తున్న భారీ చిత్రం "ఏ మాయ చేసావె". ఈ సినిమాకు గ్రేట్ మ్యూజిక్ డైరక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో సోని మ్యూజిక్ ద్వారా ఫిబ్రవరి మూడో తేదీన విడుదలైంది. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ మాట్లాడుతూ.. "గౌతమ్ చెప్పిన కథ విని ఎంతో ఇన్‌స్పైర్ అయి, సంగీతం సమాకూర్చాను. లవ్‌స్టోరీస్ చాలా వచ్చినా ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా రూపొందుతోంది. స్టోరీలోనే మ్యూజిక్ మిక్స్ అయి ఉంటుంది. ఓ అందమైన అనుభూతిని కలిగించే మంచి సినిమా ఇది. ఇందులో చైతన్య క్యూట్‌గా ఉన్నాడు" అని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Feb 2010 | 4:30 am రవితేజ "శంభో శివ శంభో" ట్రెయిలర్తమిళంలో ఘనవిజయం సాధించిన "నానోడిగళ్" చిత్రాన్ని శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ సముద్రకణి దర్శకత్వంలో 'శంభో శివ శంభో' పేరుతో తెలుగులో విడుదలైంది. రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ, ప్రియమణి, అభినయ నటించిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండిSource: Yahoo! Telugu: Entertainment | 4 Feb 2010 | 4:18 am ముగ్గురిపై ఎఫ్ఐఆర్.. ఇద్దరి అరెస్టు: హోం మంత్రిరాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి హత్య కేసులో ఇప్పటి వరకు ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ఇద్దరిని అరెస్టు చేసినట్టు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వైష్ణవి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆమె గురువారం విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... వైష్ణవి కిడ్నాప్, హత్య కేసుల్లో నిందితులుగా వైష్ణవికి వరుసకు మేనమామ అయిన వెంకట్రావు గౌడ్, శ్రీనివాస్, జగదీష్‌లపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 4 Feb 2010 | 4:06 am
|