|
బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్‌గా ఫజ్లుల్ కరీం!బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా మహమ్మద్ ఫజ్లుల్ కరీం నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం ఈనెల ఏడో తేదీతో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో కొత్త చీఫ్ జస్టీస్‌గా కీరంను నియమిస్తూ ఆ దేశ అధ్యక్ష భవనం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.Source: Yahoo! Telugu: News | 4 Feb 2010 | 8:51 am రామ్ చరణ్ నాతో బంతాట ఆడుతున్నాడు: పద్మాసీటాలీవుడ్ బాక్సాఫీసులను షేక్ చేసిన "మగధీరుడు" రామ చరణ్ తేజపై పొగడ్తల వర్షం కురిపిస్తోంది బాలీవుడ్ "రాకెట్ సింగ్" పద్మాసీ. రామ్ చరణ్ సహనటులను ప్రోత్సహించడంలో ముందుంటారని తన అందమైన పెదవులను సాగదీస్తూ చెప్పింది. అంతేకాదు ఒక్కసారి "మగధీర"తో చేసినవారు మళ్లీ మళ్లీ నటించాలని ఉవ్విళ్లూరుతారని కళ్లు చికిలిస్తూ వగలు పోతోంది. అదిసరే... రామ్ చరణ్ సరసన నటిస్తున్నారు కదా... ప్రస్తుతం ఆయనతో చేసిన ఓ షూటింగ్ ముచ్చట చెప్పమని అడిగితే, "బంతాట ఆడుకుంటున్నాం" అని టక్కున చెప్పేసింది. అర్థం కాలేదు.. మరోసారి చెప్తావా? అని ప్రశ్నిస్తే... "అదేనండీ రామ్ చరణ్ నాతో బంతాట ఆడే సన్నివేశాన్ని ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు. ఇద్దరం కలిసి ఎంచక్కా బాల్ ఆట ఆడుకున్నాం. అలా ఆడినంత సేపు ఎంతో ఆనందంగా ఉంది. మళ్లీ మళ్లీ ఆడాలనిపిస్తోంది" అని సంతోషాన్ని వ్యక్తపరిచింది.రామ్ చరణ్‌కు గుఱ్ఱపు స్వారీయే కాదు... బంతులాట కూడా బాగా వచ్చన్నమాట!!Source: Yahoo! Telugu: Entertainment | 4 Feb 2010 | 8:51 am రానున్న రోజుల్లో జోరందుకోనున్న ఐటీ రంగంరానున్న ఆర్ధిక సంవత్సరం (2010-11)లో దేశీయ సాఫ్ట్‌వేర్, బీపీఓ ఎగుమతుల్లో వృద్ధి జరగనుందని ఇండస్ట్రీ అసోసియేషన్ నాస్‌కామ్ అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ బీపీఓ సేవల వ్యాపార ఎగుమతుల్లో 50 బిలియన్ల డాలర్ల మేరకు వ్యాపార కార్యకలాపాలు జరిగాయని, ఇది గతంలోకన్నా 5.5 శాతం పెరిగిందని నాస్‌కామ్ అధ్యక్షుడు సోమ్ మిట్టల్ తెలిపారుSource: Yahoo! Telugu: News | 4 Feb 2010 | 8:30 am 17.56 శాతానికి చేరుకున్న ఆహార ద్రవ్యోల్బణందేశంలో బంగాళా దుంపలు, పప్పు దినుసుల ధరలు పెరగడంతో జనవరి 23తో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం రేటు 17.56 శాతానికి చేరుకుంది. అదే టోకు ధరల ఆధారంగా ఆహార ద్రవ్యోల్బణం అంతకు మునుపు వారంలో 17.40 శాతంగా ఉండింది.Source: Yahoo! Telugu: News | 4 Feb 2010 | 8:06 am ద్రవ్యోల్బణ ప్రభావం: భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీద్రవ్యోల్బణ ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కూరుకుపోయాయి. దేశంలో బంగాళా దుంపలు, పప్పు దినుసుల ధరలు పెరగడంతో జనవరి 23తో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం రేటు 17.56 శాతానికి చేరుకుంది. ఈ ప్రభావంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 216 పాయింట్లు భారీగా క్షీణించి, 16,279 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 58 పాయింట్లు పతనమై, 4,873 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 4 Feb 2010 | 7:52 am విదేశీ మార్కెట్ల ప్రభావం: నష్టాల్లో స్టాక్ మార్కెట్అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కొనసాగుతోంది. గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 133 పాయింట్ల మేర క్షీణించి, 16,362 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 52 పాయింట్లు పతనమై, 4,879 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 4 Feb 2010 | 7:41 am అమ్మకాల్లో వృద్ధి సాధించిన అశోక్ లేలాండ్తమ సంస్థకు చెందిన వాహనాల అమ్మకాలలో ప్రస్తుత సంవత్సరం జనవరి నెలలో మూడింతలు వృద్ధి చెంది 7,871 వాహనాలు అమ్ముడైనట్లు అశోక్ లేలాండ్ సంస్థ గురువారం బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపింది. అదే నిరుడు జనవరి నెలలో జరిగిన వాహనాల అమ్మకాలు కేవలం 2,444 వాహనాలు మాత్రమే అమ్ముడైనట్లు కంపెనీ ప్రకటించింది.Source: Yahoo! Telugu: News | 4 Feb 2010 | 6:48 am నష్టాల్లోనే బాంబే స్టాక్ మార్కెట్బాంబే స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల్లో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనంవైపు పయనిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 74 పాయింట్లు పతనమై, 16,422 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 30 పాయింట్లు కోల్పోయి, 4,901 పాయింట్ల వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది.Source: Yahoo! Telugu: News | 4 Feb 2010 | 6:40 am సారీ చెప్పను..! ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి: షారుక్"మై నేమ్ ఈజ్ ఖాన్" చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామనీ శివసేన హెచ్చరించిన నేపధ్యంలో షారుక్ స్పందించాడు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనతో మాట్లాడవచ్చనీ, సినిమాను అడ్డుకోవడం సమంజసం కాదని సేనకు పిలుపునిచ్చాడు. మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రం ప్రమోషన్లో భాగంగా న్యూయార్క్‌కి వెళ్లిన షారుక్ అక్కడి నుంచే సేనకు విజ్ఞప్తి చేశాడు.Source: Yahoo! Telugu: News | 4 Feb 2010 | 6:38 am పెరగనున్న గ్యాస్, కిరోసిన్ ధరలుపారిఖ్ కమిటీ నివేదికననుసరించి ఒక వేళ ప్రభుత్వం పెట్రో ధరలను పెంచాలనుకుంటే కిరోసిన్ ధర ప్రతి లీటరుకు రూ. 6లు, వంటగ్యాస్ ధర ప్రతి సిలిండరుకు రూ.100లు పెంచాల్సివస్తుంది. అదే పెట్రోలు ధరలు సైతం ప్రతి లీటరు పెట్రోలుకు రూ. 5లు, ప్రతి లీటరు డీజిలు ధర రూ. 3లకు పెంచాల్సివస్తుంది.Source: Yahoo! Telugu: News | 4 Feb 2010 | 6:28 am వైజాగ్-సికింద్రాబాద్‌ల మధ్య గరీబ్ రథ్ సేవలు!సికింద్రాబాద్-విశాఖపట్నంల మధ్య గరీబ్ రథ్ రోజువారి రైలు సేవలకు ముఖ్యమంత్రి రోశయ్య పచ్చజెండా ఊపారు. గురువారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన గరీబ్ రథ్ రైలు సేవలను జెండా ఊపి ప్రారంభించారు.Source: Yahoo! Telugu: News | 4 Feb 2010 | 6:20 am కలలు కనకండి... టీవీ షోలు జూదాల్లాంటివి: రాజశేఖర్డాక్టర్ నుంచి నటుడిగా మారిన డాక్టర్ రాజశేఖర్ చిత్రాలు ఈమధ్య తగ్గు ముఖం పట్టాయి. దానికి ఓ కారణముందంటున్నారు రాజశేఖర్. రాజకీయాల్లో ఉండటం, ఎన్నికలు రావడం వల్ల సినిమాలపై శ్రద్ధ పెట్టలేదని చెబుతున్నారు. తాజాగా ఆయన కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆయన పుట్టినరోజు గురువారం( 4-2-2010)నాడు అన్నపూర్ణలో ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్య్వూ...నటునిగా గ్యాప్ రావడానికి కారణం..?"ఎవడైతే నాకేంటి" తర్వాత చాలా కథలు విన్నాను. అందులో రెండు చిత్రాలు సిద్ధం అయ్యాక షూటింగ్‌కు వెళదాం అనుకుంటుండగా మళ్లీ ఏవో లోపాలు కన్పించి ఆగాల్సి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, కొన్ని గొడవలు సంఘటనలతో గ్యాప్ వచ్చింది.Source: Yahoo! Telugu: Entertainment | 4 Feb 2010 | 5:35 am నాగచైతన్య "ఏ మాయ చేసావె" ఆడియో విడుదల!యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా "ఘర్షణ" ఫేం గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ కృష్ణ సమర్పణలో ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ స్వరూప్ నిర్మిస్తున్న భారీ చిత్రం "ఏ మాయ చేసావె". ఈ సినిమాకు గ్రేట్ మ్యూజిక్ డైరక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో సోని మ్యూజిక్ ద్వారా ఫిబ్రవరి మూడో తేదీన విడుదలైంది. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ మాట్లాడుతూ.. "గౌతమ్ చెప్పిన కథ విని ఎంతో ఇన్‌స్పైర్ అయి, సంగీతం సమాకూర్చాను. లవ్‌స్టోరీస్ చాలా వచ్చినా ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా రూపొందుతోంది. స్టోరీలోనే మ్యూజిక్ మిక్స్ అయి ఉంటుంది. ఓ అందమైన అనుభూతిని కలిగించే మంచి సినిమా ఇది. ఇందులో చైతన్య క్యూట్‌గా ఉన్నాడు" అని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Feb 2010 | 4:30 am రవితేజ "శంభో శివ శంభో" ట్రెయిలర్తమిళంలో ఘనవిజయం సాధించిన "నానోడిగళ్" చిత్రాన్ని శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ సముద్రకణి దర్శకత్వంలో 'శంభో శివ శంభో' పేరుతో తెలుగులో విడుదలైంది. రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ, ప్రియమణి, అభినయ నటించిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండిSource: Yahoo! Telugu: Entertainment | 4 Feb 2010 | 4:18 am సారీ చెప్పను..! ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి: షారుక్"మై నేమ్ ఈజ్ ఖాన్" చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామనీ శివసేన హెచ్చరించిన నేపధ్యంలో షారుక్ స్పందించాడు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనతో మాట్లాడవచ్చనీ, సినిమాను అడ్డుకోవడం సమంజసం కాదని సేనకు పిలుపునిచ్చాడు. మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రం ప్రమోషన్లో భాగంగా న్యూయార్క్‌కి వెళ్లిన షారుక్ అక్కడి నుంచే సేనకు విజ్ఞప్తి చేశాడు.Source: జాతీయ | 4 Feb 2010 | 1:29 am వైజాగ్-సికింద్రాబాద్‌ల మధ్య గరీబ్ రథ్ సేవలు!సికింద్రాబాద్-విశాఖపట్నంల మధ్య గరీబ్ రథ్ రోజువారి రైలు సేవలకు ముఖ్యమంత్రి రోశయ్య పచ్చజెండా ఊపారు. గురువారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన గరీబ్ రథ్ రైలు సేవలను జెండా ఊపి ప్రారంభించారు.Source: ఏపీ న్యూస్ | 4 Feb 2010 | 12:51 am విధి విధానాలు ఖరారు తర్వాతే భేటీ: వీకే దుగ్గల్జస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈనెల ఎనిమిదో తేదీన భేటీ కావడం లేదని ఆ కమిటీ సభ్య కార్యదర్శి, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి వీకె.దగ్గల్ స్పష్టం చేశారు. కమిటీ విధి విధానాలు ఖరారైన తర్వాతే కమిటీ తొలి సమావేశం జరుగుతుందని ఆయన గురువారం వెల్లడించారు.Source: జాతీయ | 4 Feb 2010 | 12:05 am సత్యం కుంభకోణం: 'తాళ్లూరి'కు బెయిల్ మంజూరుసత్యం కుంభోకోణంలో నిందితులుగా పేర్కొంటున్న తాళ్లూరు శ్రీనివాస్‌కు సర్వోన్నత న్యాయస్థానం గురువారం బెయిల్ మంజూరు చేసింది. 20 లక్షల రూపాయల సొంత పూచీ కత్తుతో పాటు కొన్ని షరతులు విధిస్తూ బెయిల్ మంజూరు చేస్తున్నట్టు సుప్రీం కోర్టు పేర్కొందిSource: ఏపీ న్యూస్ | 3 Feb 2010 | 11:47 pm మంత్రి వర్గ విస్తరణే అజెండాగా సీఎం ఢిల్లీ టూర్!రాష్ట్ర పరిస్థితులు చక్కబడుతుండటంతో ముఖ్యమంత్రి కె.రోశయ్య ఇక పాలనపై దృష్టి కేంద్రీకరించారు. ఇందులోభాగంగా ఆయన మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారు. ఇదే ప్రధాన అజెండాగా ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే తిష్టవేసే ముఖ్యమంత్రి.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీతో కలిసి మంత్రివర్గ మార్పు చేర్పులపై చర్చిస్తారు.Source: ఏపీ న్యూస్ | 3 Feb 2010 | 11:29 pm మానసిక స్థితిని కోల్పోయిన బాల్‌థాక్రే: కాంగ్రెస్శివసేన అధ్యక్షుడు బాల్‌థాక్రే మానసిక స్థితిని కోల్పోయారని కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర శాఖ నేతలు ఆరోపించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీపై థాక్రే విమర్శలు చేయడాన్ని వారు తిప్పికొట్టారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేనే థాక్రే వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నారు. దీనికి ప్రధాన కారణం ఆయన మానసిక స్థితిలో మార్పు రావడమేనని ఆ పార్టీ సీఎల్పీ నేతలు ఆరోపించారు.Source: జాతీయ | 3 Feb 2010 | 11:02 pm విధి విధానాలపై ఊహాగానాలు వద్దు: వీరప్ప మొయిలీజస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలపై తమకు తోసిన రీతిలో ఊహించరాదని కేంద్ర న్యాయ శాఖామంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ అన్నారు. ఆయనతో కొంతమంది తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు బుధవారం రాత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం వేసిన కమిటీలో ప్రతి ఒక్క సభ్యుడూ అత్యంత సమర్థులన్నారు. వీరంతా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాదనలను శ్రద్ధగా వింటారని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 3 Feb 2010 | 10:46 pm అర్థరాత్రి వరకు వెలిగిన కొలిమి: వాచ్‌మెన్ భార్య!అత్యంత క్రూరంగా హత్యకు గురైన నాగ వైష్ణవి కేసులో తాజాగా మరికొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. షెడ్ వాచ్‌మెన్ భార్య జయమ్మ వద్ద పోలీసులు జరిపిన విచారణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. షెడ్ యజమాని శ్రీనివాస రావు శనివారం రాత్రి తొమ్మిది గంటలకు కారులో షెడ్‌కు వచ్చారని చెప్పింది.Source: ఏపీ న్యూస్ | 3 Feb 2010 | 10:37 pm సమస్యను కాంగ్రెస్ పార్టీయే పరిష్కరించాలి: చంద్రబాబురాష్ట్రంలో నెలకొన్న సమస్యను కాంగ్రెస్ పార్టీయే పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆయన గురువారం కాకినాడలో మాట్లాడుతూ... రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు కాంగ్రెస్ పార్టీయే పూర్తి కారణమన్నారు. అందువల్ల ఆపార్టీయే సమస్యకు పరిష్కార మార్గం కనుగొనాలన్నారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పన్నిన కుట్రలో ఆ పార్టీయే చిక్కుకుందన్నారు.Source: ఏపీ న్యూస్ | 3 Feb 2010 | 10:24 pm వైష్ణోదేవి ఆలయానికి తీవ్రవాదుల ముప్పు: గట్టి భద్రత!జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని వైష్ణోదేవి ఆలయానికి తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆలయంతో పాటు.. పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దేశంలో ఉన్న పేరొందిన పుణ్యస్థలాల్లో ఈ ఆలయం ఒకటిగా గుర్తింపు పొందిన విషయం తెల్సిందే. ఇక్కడకు ప్రతి యేడాది ఎనిమిది లక్షల మంది భక్తులు వచ్చిన తమ ఇష్టదైవాన్ని దర్శనం చేసుకుని వెళుతుంటారని ప్రభుత్వ లెక్కలు చెపుతున్నాయి.Source: జాతీయ | 3 Feb 2010 | 9:26 pm నళిని విడుదలపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి: కరుణదివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత కారాగారశిక్షను అనుభవిస్తున్న ఎల్టీటీఈ సభ్యురాలు నళిని విడుదల చేసే అంశంలో కేంద్రమే తగు నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి స్పష్టం చేశారు. ఈ అంశంలో కేంద్రాన్ని సంప్రదించకుండా తాము ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఆయన తేల్చి చెప్పారు.Source: జాతీయ | 3 Feb 2010 | 9:25 pm "లీడర్" కథ నాదేనంటూ ఓ యువకుడు పేచీసినిమా కథలు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నామంటూ హీరోలు, దర్శకులు చెబుతున్న మాటే. కానీ హిట్ అయిన తర్వాత ఆ చిత్ర కథ తనదంటూ రకరకాలుగా వార్తల్లోకి వస్తుంటారు కొందరు రచయితలు. ప్రస్తుతం అటువంటి పేచీ లీడర్ సినిమా కథపైనా పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఆనంద్, హ్యాపీడేస్ చిత్రాలను తన బ్రైన్ చైల్డ్‌గా చెప్పుకుంటారు శేఖర్ కమ్ముల. అదలా వుంచితే తాజా ఏవీఎం నిర్మిస్తోన్న లీడర్ కథ తను వైఎస్ బతికి ఉన్నప్పుడు ఎలక్షన్ల టైమ్‌లో జరిగిన సంఘటనల నేపథ్యంలో రాసుకున్నాననీ ప్రతి ప్రెస్ మీట్‌లోనూ చెబుతుండేవాడు. అయితే... ఈ కథ తను రాసుకున్న లీడర్ అనే కథలోనుంచి తీసుకున్నదేననీ, తనకు నష్టపరిహారం చెల్లించాలని శివ అనే వ్యక్తి రైటర్స్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఇది సమకాలీన పరిస్థితుల నేపథ్యంలోనే తను రాసుకున్నాననీ, కాపీ కొట్టే అవసరం తనకు లేదనీ అసోసియేషన్ ముందు శేఖర్ కమ్ముల స్పష్టం చేశారని తెలిసింది.Source: Yahoo! Telugu: Entertainment | 3 Feb 2010 | 9:32 am బాల్ థాక్రేకు బిగ్ బి "జై": బాలీవుడ్ క్రాక్ క్రాక్బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన బ్లాగులో శివసేన సుప్రీమ్ బాల్ థాకరేను పొగడ్తలతో ముంచెత్తారు. షారుక్‌పై థాక్రే చేసిన ఘాటు విమర్శల నేపధ్యంలో షారుక్‌కు మద్దతు పలికినవారు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఈ పరిస్థితుల్లో అమితాబ్ థాక్రేను వెనకేసుకురావడం చూస్తుంటే బాలీవుడ్ నిట్టనిలువునా రెండు ముక్కలయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.Source: జాతీయ | 3 Feb 2010 | 8:14 am ప్చ్... కిస్ ఇవ్వలేక పోయాను: అమృతా రావుమహేష్ బాబు సరసన "అతిథి"లో నటించిన అమృతారావు హీరోయిన్లు చేయగల ఏ సీనుకైనా తను సిద్ధమేనని అంటోంది. ఇలా బహిరంగంగా చెప్పినప్పటికీ... బేబీకి చేతిలో ఒకే ఒక్క బాలీవుడ్ చిత్రం మాత్రమే ఉంది. ఇన్నాళ్లు హోమ్లీ హీరోయిన్ అనుకుని కిస్ సీన్స్ చేయలేక పోయానని వెంటనే నాలుక కరచుకుంది. అయితే కళాత్మక చిత్రాల పేరిట న్యూడ్ దృశ్యాలు చూపిస్తున్నారనే మాటకు స్పందిస్తూ.... అది కూడా కళేనని చెప్పింది. అసలు అందులో తప్పేమీ లేదని ఎదిరిస్తోంది. అంతర్జాతీయ టీవీ ఛానల్స్‌లో ఇటువంటివాటిని చూస్తున్న ప్రేక్షకులు అటువంటి సన్నివేశాలను చూస్తూ అలవాటుపడ్డారని కూడా ధైర్యంగా చెపుతోంది. అవార్డుకోసం తీసే కళాత్మక చిత్రాల్లో నాచురల్‌గా చూపిస్తే తప్పులేదని అంటోంది. దాంతోపాటు... అంతగా అసభ్యంగా ఉంటే సెన్సార్ ఉందిగా వారు చూసుకుంటారని చెబుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 3 Feb 2010 | 5:59 am కమిటీ వేశాం.. కేంద్రానికి సహకరించండి: మొయిలీఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు, అందరి అభిప్రాయాలను తెలుసుకునేందుకు జస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశామని, అందువల్ల ప్రతి ఒక్కరూ కేంద్రానికి సహకరించాలని కేంద్ర న్యాయశాఖా మంత్రి వీరప్ప మొయిలీ బుధవారం విజ్ఞప్తి చేశారు. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేసిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు.Source: జాతీయ | 3 Feb 2010 | 5:26 am కమిటీని స్వాగతించిన ఏలూరు ఎంపీ కావూరిరాష్ట్రంలోని పరిస్థితులను అధ్యయనం చేసేందుకు, అన్ని వర్గాల అభిప్రాయాల సేకరణ కోసం కేంద్రం వేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీని స్వాగతిస్తున్నట్టు సీమాంధ్ర ప్రాంత ప్రతినిధి, ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు ప్రకటించారు. దీనిపై ఆయన బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర హోం శాఖ ప్రకటించిన కమిటి తమకు ఆమోదయోగ్యంగా ఉందన్నారు.Source: ఏపీ న్యూస్ | 3 Feb 2010 | 4:32 am జస్టీస్ శ్రీకృష్ణ కమిటీని వ్యతిరేకిస్తున్నాం: కోడెలజస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. దీనిపై ఆయన బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రెండు కమిటీలు ఉన్నాయన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ముఖ్యమంత్రి కె.రోశయ్యలతో వేసిన కమిటీలను పక్కనబెట్టి ఇప్పుడు కొత్తగా మరో కమిటీ వేయడమేమిటని ప్రశ్నించారుSource: ఏపీ న్యూస్ | 3 Feb 2010 | 4:26 am ఇచ్చిన మాటకు కట్టుబడిన కాంగ్రెస్: ధర్మపురిఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు, సంప్రదింపులు జరిపేందుకు జస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 3 Feb 2010 | 3:17 am మహారాష్ట్రలో 1135 మందికి నకిలీ సర్టిఫికేట్లుమహారాష్ట్రలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 1135 మంది విద్యార్థులు నకిలీ సర్టిఫికేట్లను సమర్పించి ఉద్యోగాలు పొందినట్టు సీబీఐ ఒక నివేదిక సమర్పించింది. ఈ నకిలీ సర్టిఫికేట్లన్నీ వివిధ విశ్వవిద్యాలయాల నుంచి మజూరు చేసినవిగా సీబీఐ గుర్తించింది.Source: జాతీయ | 3 Feb 2010 | 3:05 am శ్రీకృష్ణ కమిటీ చిదంబరం కుట్రలో భాగం: ఎర్రం నాయుడుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు, స్థితిగతులపై అంచనా వేసేందుకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేయడం కేంద్ర హోం మంత్రి చిదంబరం కుట్రలో భాగమని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కె.ఎర్రన్నాయుడు, ఎంవీ.మైసూరా రెడ్డి ఆరోపించారు. జస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసిన వెంటనే వారిద్దరు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.Source: ఏపీ న్యూస్ | 3 Feb 2010 | 1:45 am
|