|
ఇచ్చిన మాటకు కట్టుబడిన కాంగ్రెస్: ధర్మపురిఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు, సంప్రదింపులు జరిపేందుకు జస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 3 Feb 2010 | 8:47 am మహారాష్ట్రలో 1135 మందికి నకిలీ సర్టిఫికేట్లుమహారాష్ట్రలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 1135 మంది విద్యార్థులు నకిలీ సర్టిఫికేట్లను సమర్పించి ఉద్యోగాలు పొందినట్టు సీబీఐ ఒక నివేదిక సమర్పించింది. ఈ నకిలీ సర్టిఫికేట్లన్నీ వివిధ విశ్వవిద్యాలయాల నుంచి మజూరు చేసినవిగా సీబీఐ గుర్తించింది.Source: Yahoo! Telugu: News | 3 Feb 2010 | 8:35 am సరిహద్దు గ్రామ వాసులకు మెట్రో సేవలు: మంత్రి పైలట్సరిహద్దు ప్రాంతాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మెట్రో నగరాల్లో అందుబాటులో ఉన్న సేవలను అందుబాటులోకి తీసుకుని రానున్నట్టు కేంద్ర ఐటీ, సమాచార శాఖామంత్రి సచిన్ పైలట్ తెలిపారు. దీనిపై ఆయన అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్‌లో ప్రధాన తపాలా కార్యాలయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.Source: Yahoo! Telugu: News | 3 Feb 2010 | 7:28 am శ్రీకృష్ణ కమిటీ చిదంబరం కుట్రలో భాగం: ఎర్రం నాయుడుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు, స్థితిగతులపై అంచనా వేసేందుకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేయడం కేంద్ర హోం మంత్రి చిదంబరం కుట్రలో భాగమని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కె.ఎర్రన్నాయుడు, ఎంవీ.మైసూరా రెడ్డి ఆరోపించారు. జస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసిన వెంటనే వారిద్దరు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.Source: Yahoo! Telugu: News | 3 Feb 2010 | 7:14 am పుంజుకున్న ట్రేడింగ్: భారీ లాభాల్లో సెన్సెక్స్బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే భారీ లాభాల దిశగా పయనిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 309 పాయింట్లు భారీగా వృద్ధి చెంది, 16,472 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 104 పాయింట్లు బలపడి, 4,934 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 3 Feb 2010 | 7:13 am ఆస్ట్రేలియాలోనే బాల మేధావి భారతీయ చిన్నారిఆస్ట్రేలియాలో అత్యంత తెలివిమంతురాలైన విద్యార్థిగా భారతీయ చిన్నారి ఎంపికైంది. ఆ దేశంలో నిశవిస్తున్న భారతీయులపై కొందరు దుండగులు వరుస దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో భారతీయ చిన్నారి ఎంపిక కావడం గమనార్హం.Source: Yahoo! Telugu: News | 3 Feb 2010 | 7:02 am ఇరాన్ ఎన్నికల్లో హింస: 11 మందికి ఉరిశిక్షఇరాన్ అధ్యక్ష ఎన్నికల సమయంలో చెలరేగిన హింసాకాండకు సంబంధించి 11 మందికి ఆ దేశ కోర్టు ఉరిశిక్ష విధించింది. వీరికి త్వరలోనే మరణ దండనను అమలు చేస్తామని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.Source: Yahoo! Telugu: News | 3 Feb 2010 | 6:29 am భారీగా వృద్ధి చెందిన బాంబే స్టాక్ మార్కెట్బాంబే స్టాక్ మార్కెట్ బుధవారం భారీ వృద్ధి చెందుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే గణనీయంగా పెరిగిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 359 పాయింట్లు బలపడి, 16,523 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 114 పాయింట్లు వృద్ధి చెంది, 4,944 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 3 Feb 2010 | 6:28 am ముంబై ధర్మశాల కాదు.. రాహుల్‌కు శివసేన జవాబు!ముంబై భారతీయులందరిదీ అని కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై శివసేన మండిపడింది. ముంబై ధర్మశాల కాదని అభిప్రాయపడింది. ముఖ్యంగా, ముంబై నగరం భారతీయులందరికీ చెందవచ్చు. కానీ.. ఇటలీ మమ్మీకి మాత్రం చెందదు అని ఆ పార్టీ పత్రిక సామ్నాలో చీఫ్ శివసేన బాల్‌థాక్రే రాసిన సంపాదకీయంలో ఘాటుగా విమర్శలు గుప్పించారు.Source: Yahoo! Telugu: News | 3 Feb 2010 | 6:21 am 2011-12లో భారత్ వృద్దిరేటు 8 శాతం: ప్రపంచ బ్యాంకు2011-12 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వృద్ధి రేటు ఎనిమిది శాతంగా ఉండవచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ బ్యాంకు డెవలప్‌మెంట్ ప్రాస్పెక్ట్ గ్రూపు డైరక్టర్ హాన్స్ టిమ్మెర్ మాట్లాడుతూ... 2009-10 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం వృద్ధి రేటును ప్రమాణికంగా తీసుకుని 2011-12 ఆర్థిక వృద్ధి రేటును అంచనా వేసినట్టు చెప్పారు.Source: Yahoo! Telugu: News | 3 Feb 2010 | 6:08 am ప్చ్... కిస్ ఇవ్వలేక పోయాను: అమృతా రావుమహేష్ బాబు సరసన "అతిథి"లో నటించిన అమృతారావు హీరోయిన్లు చేయగల ఏ సీనుకైనా తను సిద్ధమేనని అంటోంది. ఇలా బహిరంగంగా చెప్పినప్పటికీ... బేబీకి చేతిలో ఒకే ఒక్క బాలీవుడ్ చిత్రం మాత్రమే ఉంది. ఇన్నాళ్లు హోమ్లీ హీరోయిన్ అనుకుని కిస్ సీన్స్ చేయలేక పోయానని వెంటనే నాలుక కరచుకుంది. అయితే కళాత్మక చిత్రాల పేరిట న్యూడ్ దృశ్యాలు చూపిస్తున్నారనే మాటకు స్పందిస్తూ.... అది కూడా కళేనని చెప్పింది. అసలు అందులో తప్పేమీ లేదని ఎదిరిస్తోంది. అంతర్జాతీయ టీవీ ఛానల్స్‌లో ఇటువంటివాటిని చూస్తున్న ప్రేక్షకులు అటువంటి సన్నివేశాలను చూస్తూ అలవాటుపడ్డారని కూడా ధైర్యంగా చెపుతోంది. అవార్డుకోసం తీసే కళాత్మక చిత్రాల్లో నాచురల్‌గా చూపిస్తే తప్పులేదని అంటోంది. దాంతోపాటు... అంతగా అసభ్యంగా ఉంటే సెన్సార్ ఉందిగా వారు చూసుకుంటారని చెబుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 3 Feb 2010 | 5:59 am ఇచ్చిన మాటకు కట్టుబడిన కాంగ్రెస్: ధర్మపురిఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు, సంప్రదింపులు జరిపేందుకు జస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 3 Feb 2010 | 3:17 am మహారాష్ట్రలో 1135 మందికి నకిలీ సర్టిఫికేట్లుమహారాష్ట్రలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 1135 మంది విద్యార్థులు నకిలీ సర్టిఫికేట్లను సమర్పించి ఉద్యోగాలు పొందినట్టు సీబీఐ ఒక నివేదిక సమర్పించింది. ఈ నకిలీ సర్టిఫికేట్లన్నీ వివిధ విశ్వవిద్యాలయాల నుంచి మజూరు చేసినవిగా సీబీఐ గుర్తించింది.Source: జాతీయ | 3 Feb 2010 | 3:05 am శ్రీకృష్ణ కమిటీ చిదంబరం కుట్రలో భాగం: ఎర్రం నాయుడుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు, స్థితిగతులపై అంచనా వేసేందుకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేయడం కేంద్ర హోం మంత్రి చిదంబరం కుట్రలో భాగమని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కె.ఎర్రన్నాయుడు, ఎంవీ.మైసూరా రెడ్డి ఆరోపించారు. జస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసిన వెంటనే వారిద్దరు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.Source: ఏపీ న్యూస్ | 3 Feb 2010 | 1:45 am ముంబై ధర్మశాల కాదు.. రాహుల్‌కు శివసేన జవాబు!ముంబై భారతీయులందరిదీ అని కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై శివసేన మండిపడింది. ముంబై ధర్మశాల కాదని అభిప్రాయపడింది. ముఖ్యంగా, ముంబై నగరం భారతీయులందరికీ చెందవచ్చు. కానీ.. ఇటలీ మమ్మీకి మాత్రం చెందదు అని ఆ పార్టీ పత్రిక సామ్నాలో చీఫ్ శివసేన బాల్‌థాక్రే రాసిన సంపాదకీయంలో ఘాటుగా విమర్శలు గుప్పించారు.Source: జాతీయ | 3 Feb 2010 | 12:52 am సీమాంధ్ర.. తెలంగాణలు నా రెండు నేత్రాలు: బాబుసీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలు తనకు రెండు కళ్లులాంటివని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు జోరుగా సాగిన తర్వాత ఆయన తొలిసారి రాష్ట్ర పర్యటకు బుధవారం నుంచి శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు.Source: ఏపీ న్యూస్ | 3 Feb 2010 | 12:21 am విధి విధానాలు వెల్లడి తర్వాతే స్పందిస్తాం: టి జాక్జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలు వెల్లడైన తర్వాతే తాము పూర్తి స్థాయిలో స్పందిస్తామని తెలంగాణ రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు కేంద్ర హోం శాఖ ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 3 Feb 2010 | 12:00 am కేవలం సంప్రదింపులకు మాత్రమే శ్రీకృష్ణ కమిటీ!జస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ కేవలం సంప్రదింపులకు మాత్రమే అని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని ప్రజలు, వివిధ వర్గాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఈ కమిటీ సేకరిస్తుంది. అయితే, ఈ కమిటీలో వివిధ రంగాలకు చెందిన నిపుణులకు స్థానం కల్పించినట్టు ఆయన తెలిపారు. కాగా, ఈ కమిటీలో చోటు కల్పించిన ఐదుగురు సభ్యుల్లో ఒక్కొక్కరు ఒక్కో రంగానికి చెందిన వారు కావడం గమనార్హం.Source: జాతీయ | 2 Feb 2010 | 11:27 pm శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీ!తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమం నేతృత్వంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి జస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వం వహిస్తారు. మిగిలిన నలుగురు సభ్యుల్లో ఆర్థిక, న్యాయ నిపుణులు ఉన్నారు. వీరిలో ప్రొఫెసర్ రణబీర్ సింగ్, అబూసలే షరీఫ్, రవీందర్ కౌర్, వినోద్ దుగ్గల్‌లు ఉన్నారు.Source: జాతీయ | 2 Feb 2010 | 10:30 pm అసలు.. చిదంబరం మనస్సులో ఏముంది!కేంద్ర హోం మంత్రి చిదంబరం మనస్సులో ఏముంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని భావన ఆయనకు ఎందుకు కలిగింది. దీనివల్ల ఆయనకు, ఆయన సొంత రాష్ట్రం తమిళనాడుకు ఒనగూరే ప్రయోజనం ఏమిటి? దేశ వ్యాప్తంగా ఎన్నో కొత్త రాష్ట్రాల డిమాండ్‌లు ఉత్పన్నమైనప్పటికీ.. వాటినన్నింటిని పక్కన పెట్టి.. కేవలం ఆంధ్రప్రదేశ్‌పైనే ఎందుకు దృష్టి కేంద్రీకరించారు.Source: ఏపీ న్యూస్ | 2 Feb 2010 | 10:20 pm పాక్‌తో చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయి: కృష్ణపాకిస్థాన్తో చర్చలకు జరిపేందుకు తలపులు మూసి వేయలేదని కేంద్ర విదేశాంగమంత్రి ఎస్ఎం.కృష్ణ తెలిపారు. అయితే, ఇస్లామాబాద్ వెళ్లే కేంద్ర మంత్రి చిదంబరం చర్చలు జరిపే విషయాన్ని ఆయన నిర్ధారించలేదు. అలాగే, పాకిస్థాన్ తీవ్రవాదంపై దృఢమైన వైఖరిని అవలంభించనంత వరకు తమ వైఖరిలో మార్పు ఉండబోదని ఆయన తేల్చి చెప్పారు.Source: జాతీయ | 2 Feb 2010 | 9:43 pm సంక్షేమాన్ని గాలికొదిలేసిన నితీష్ సర్కారు: రాహుల్బీహార్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సర్కారు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన చేపట్టిన రెండు రోజుల రాష్ట్ర పర్యటన మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం ఇకపై జరిగే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.Source: జాతీయ | 2 Feb 2010 | 8:58 pm మా "మగధీర" - "అదుర్స్" దొంగలించారంటున్న రచయితలుసినిమాల కథల విషయంలో మరోసారి వివాదం నెలకొంది. గతంలో చాలా హిట్ చిత్రాలు తమ కథలే అంటూ విడుదల తర్వాత రచయితలు ముందుకు వచ్చారు. అప్పట్లో దాసరి నారాయణరావు కథలన్నీ కాపీయేననే పేరు వచ్చింది. మేఘసందేశం, ప్రేమాభిషేకం, నుంచి బొబ్బిలిపులి వరకూ ఆయనను ఆ వివాదాలు వెంటాడాయి. తాజాగా మరో రెండు ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి.న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్న రచయిత చారితన రచనను అనుమతి లేకుండా మగధీర చిత్రంగా నిర్మించారని నవలా రచయిత ఎస్పీ చారి ఆరోపించారు. ఈ చిత్రం విడుదలకుముందే "చందేరి" అనే నవల ఆధారంగా తీశారనే విమర్శలు వచ్చినా దాన్ని తొక్కిపెట్టి ఉంచారు. 1998లో అది ఒక మాసపత్రికలో సీరియల్‌గా వచ్చిందనీ 2008లో దాన్ని నవలగా ముద్రించాననీ చారి హైదరాబాదులో చెప్పాడు. ఈ విషయాన్ని అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్‌ను సంప్రదిస్తే... రేపు, మాపు చూద్దామని వాయిదా వేస్తూ వచ్చాడనీ, ఆ తర్వాత ఎస్ఎంఎస్‌లు కూడా పంపాడనీ వాటిని చూపిస్తున్నాడు.Source: Yahoo! Telugu: Entertainment | 2 Feb 2010 | 11:45 am ఫిబ్రవరి 5న "కేడీ" ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్కింగ్ నాగార్జున హీరోగా కిరణ్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి కామాక్షి కళామూవీస్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం "కేడీ" షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుగుతోంది. ఈ చిత్రం ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ ఫిబ్రవరి 5న హైదరాబాదులో జరుగనుంది.ఈ సందర్భంగా నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... నాగార్జునగారితో మా బ్యానర్లో తీసిన స్టైలిష్ కమర్షియల్ ఫిలిమ్ కేడి. సందీప్ చౌతా సంగీతం వహించిన ఈ చిత్రం ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. ఫిబ్రవరి 5న ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేస్తున్నాం. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 12న కేడీని విడుదల చేయడానికి ప్లాన్ చేశాం. మా బ్యానర్లో మరో సూపర్ హిట్ చిత్రంగా కేడీ నిలుస్తుందని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 2 Feb 2010 | 10:54 am ఫిబ్రవరి 11న వస్తోన్న రాణా "లీడర్"ఏవీఎం ప్రొడక్షన్స్ పతాకంపై రామానాయుడు మనవడు, డి.సురేష్ బాబు కుమారుడు రాణా నటించిన చిత్రం లీడర్. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకుడు. ఈ చిత్రాన్ని ఈనెల 11న విడుదల చేస్తున్నట్లు శేఖర్ కమ్ముల ప్రకటించారు. సినిమా గురించి చెపుతూ... "సెన్సార్ ఎప్పుడో పూర్తయింది. రైట్ టైమ్ కోసం ఎదురు చూస్తున్నాం. అది ఇప్పుడు సాధ్యపడింది. రాజకీయ పరిస్థితులు కూడా చక్కబడ్డాయి. కథాపరంగా ఏడాదిన్నరపాటు శ్రమించాను. వైఎస్ ఉన్నప్పుడు రాసుకున్న కథ. ఆ తర్వాత పరిస్థితుల రీత్యా స్క్రిప్ట్‌లో కొంత మార్చాను. హానెస్ట్‌గా తీసిన సినిమా. లీడర్ ఎలా ఉండాలి అనేది చెబుతున్నాం. ఇందుకోసం కొన్ని కాలేజీలు, ఐటీ కంపెనీలలో క్యాంపెయిన్ కూడా చేయాలనుకుంటున్నాం. అది నెలరోజులపాటు జరుగుతుంది. ఈ సినిమా అన్ని రకాలుగా సంతోషాన్నిచ్చింద"ని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 2 Feb 2010 | 9:16 am తండ్రీ- కూతుళ్లకు అశ్రు నివాళులుకన్నకూతురిని కంటికి రెప్పలా చూసుకున్న ఆ తండ్రి హృదయం... కుమార్తె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలిసి ముక్కలై ఆగిపోయింది. కానరాని లోకాల్లోనూ కనుపాపలా చూసుకుంటానని కూతురుని వెతుక్కుంటూ వెళ్లిపోయింది. ఈ సంఘటనతో రాష్ట్రం విషాదంలో మునిగిపోయింది. శోక సముద్రంలో మునిగిపోయింది.Source: ఏపీ న్యూస్ | 2 Feb 2010 | 7:01 am తెలంగాణ కమిటీ ఆషామాషీది కాదు: బాపిరాజుతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అంశంపై కేంద్ర హోం మంత్రి చిదంబరం వేయనున్న కమిటీ అంత ఆషామాషీది కాదని నర్సాపురం ఎంపీ, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన మంగళవారం ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ.. ఈ కమిటీని తక్కువ అంచనా వేయరాదని హెచ్చరించారు.Source: ఏపీ న్యూస్ | 2 Feb 2010 | 6:32 am రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయను: అమర్రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నేత అమర్ సింగ్ స్పష్టం చేశారు. అలాగే, కాంగ్రెస్ లేదా బహుజన్ సమాజ్‌వాదీ లేదా ఎన్సీపీ పార్టీల్లో చేరనున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందించలేదు.Source: జాతీయ | 2 Feb 2010 | 6:07 am బంటి... ద బ్యాడ్ బోయ్: ట్రెయిలర్బాలల అల్లరి చేష్టలను ఆధారంగా చేసుకుని ఇంతకుముందు ఎన్నో చిత్రాలు వచ్చాయి. తాజాగా మాస్టర్ శ్రీహరి దత్తా టైటిల్ పాత్రాధారిగా వైష్ణవి ఫిల్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కె.రవిప్రకాష్ నిర్మించిన 'బంటి..ద బ్యాడ్ బోయ్' వచ్చింది.'బంటి' దర్శక నిర్మాత రవిప్రకాష్ మాట్లాడుతూ, 'ఇది కేవలం బాలల కోసమే తీసిన సినిమా కాదు. సకుటుంబంగా చూడాల్సిన సినిమా. నిజ జీవితంలో పిల్లలు ఎలా ఉంటారు, ఏం చేస్తే వారు సరైన మార్గంలో పయనిస్తారనేది ఈ చిత్ర కథాంశం. చూసినవాళ్లంతా అభినందించడం సంతోషంగా అనిపిస్తోంది.'అని చెప్పారు. బేబి వైష్ణవి, సత్యకృష్ణ, కృష్ణవేణి, రాగిణి, జాన్ బాప్టిస్ట్, వి.నాగివీడు, రొణ్ణంకి, జయలక్ష్మి తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం:లలిత్ సురేశ్, కూర్పు: వెంకటేశ్వర్లు కామేపల్లి, సినిమాటోగ్రఫీ: ఆర్.పి. పినిశెట్టి, కథ మాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాణం, దర్శకత్వం: కె.రవిప్రకాశ్. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్‌ను వీక్షించండి.Source: Yahoo! Telugu: Entertainment | 2 Feb 2010 | 5:51 am గడచిన వారమంతా విషాదకర సంఘటనలే: ముఖ్యమంత్రిగడచిన వారమంతా అన్ని విషాదకర సంఘటనలు చోటు చేసుకున్నాయని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. జనవరి 23వ తేదీ నుంచి మంగళవారం వరకు అన్నీ విషాద వార్తలేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైష్ణవి హత్య కేసు అత్యంత బాధాకరమన్నారు.Source: ఏపీ న్యూస్ | 2 Feb 2010 | 5:10 am రెండేళ్లపాటు "యుగానికి ఒక్కడు" కోసమే!!: రీమాసేన్కార్తి కథానాయకుడిగా రీమాసేన్ కథానాయికగా శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్ వాలి కార్పొరేషన్ స్టూడియో గ్రీన్ నిర్మించిన తమిళ చిత్రాన్ని "యుగానికి ఒక్కడు"గా తెలుగులో అనువదించారు. ఈ చిత్రం ఈనెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.కార్తి మాట్లాడుతూ.. "ఇటీవలే ఈ చిత్రం తమిళలో విడుదలైంది. మంచి కలెక్షన్లతో ప్రదర్శించబడుతోంది. తెలుగు ప్రేక్షకులకోసం ఈ చిత్రాన్ని కొంత ట్రిమ్ చేశాము. వైవిధ్యమైన కథాంశంతో దాదాపు రెండున్నర ఏండ్లపాటు రూపొందించాం. ఎంతో కష్టపడ్డాము. ఇందులో డీగ్లామరైజ్డ్ పాత్ర పోషించాను. సూర్య కూడా చూసి మెచ్చుకున్నారు. తెలుగువారు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అన్నారు.దర్శకుడు శ్రీరాఘవ మాట్లాడుతూ... "రెండున్నరేళ్లుగా పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కన్పించింది. చూసినవారంతా బాగుందని ప్రశంసిస్తున్నారు. సినిమాకోసం చోళుల కాలంనాటి విషయాలను రీసెర్చ్ చేశాము. అప్పటికి తగినట్లు సంగీతం కూడా చేయడం జరిగింది. ఈ సినిమాకు అంతా దక్షిణాదివారే పనిచేశారు. ప్రపంచ సినిమాకు ఈ సినిమా ఏమాత్రం తీసిపోద"న్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 2 Feb 2010 | 4:38 am 'గాంధేయ వాదం' వ్యాప్తే అంతిమ లక్ష్యం: 'గజల్' శ్రీనివాస్డాక్టర్ 'గజల్' శ్రీనివాస్ మరో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. గాంధీ అహింసోద్యమంపై రచించిన పాటను 125 ప్రపంచ భాషల్లో పాడిన ఆయన మరో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆయన ఆలపించిన 125 భాషల్లో 65 విదేశీ భాషలు ఉండగా, 60 భారతీయ భాషలు ఉన్నాయి.Source: ఏపీ న్యూస్ | 2 Feb 2010 | 3:55 am దేశంలోని ప్రతి ప్రాంతం.. భారతీయులందరిదీ: రాహుల్సువిశాల దేశంలోని ప్రతి ప్రాంతం ప్రతి ఒక్క భారతీయునికి సొంతమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గత 2008 సంవత్సరంలో ముంబైపై జరిగిన దాడుల్లో మహారాష్ట్ర వారితో పాటు ఎన్ఎస్‌జి కమెండోలు ప్రాణాలు కోల్పోయారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.Source: జాతీయ | 2 Feb 2010 | 3:35 am
|