అమ్మకాల్లో వృద్ధి సాధించిన హోండా బైకులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలోని తొలి నెల జనవరిలో తమ సంస్థకు చెందిన ద్విచక్ర వాహనాల అమ్మకాలలో 24.84 శాతం వృద్ధి చెంది 1,18,571 వాహనాలు అమ్ముడైనట్లు హెచ్ఎంఎస్ఐ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అదే గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో 94,982 ద్విచక్ర వాహనాలు అమ్ముడైనాయి.
Source: Yahoo! Telugu: News | 2 Feb 2010 | 8:34 am

నష్టాలతో కూరుకుపోయిన స్టాక్ మార్కెట్

బాంబే స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాలతో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో 80 పాయింట్లు క్షీణించి, 16,275 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 34 పాయింట్లు పడిపోయి, 4,865 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 2 Feb 2010 | 7:14 am

' బుల్లెట్ ' ధర పెంచనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్

బుల్లెట్ మోటారు వాహనాన్ని తయారు చేసే తమ సంస్థ రానున్న రోజుల్లో కొత్త మోడల్ బుల్లెట్ వాహనం బీఎస్-3కి అనుగుణంగా ఉంటుందని, దీంతో ధరలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుందని ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రధాన కార్యనిర్వహణాధికారి సిద్ధార్థ్ లాల్ మంగళవారం మీడియాకు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 2 Feb 2010 | 7:10 am

అమర్ సింగ్-జయప్రదలపై ఎస్పీ బహిష్కరణ వేటు!

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీలో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్, రాంపూర్ ఎంపీ జయప్రదలపై బహిష్కరణవేటు వేసింది. అలాగే, అమర్ సింగ్‌కు మద్దతు ప్రకటించిన మరో నలుగురు ఎమ్మెల్యేలపై కూడా ఎస్పీ వేటు వేసింది.
Source: Yahoo! Telugu: News | 2 Feb 2010 | 6:46 am

అమాయక ముస్లింలను చంపేస్తున్న అల్‌ఖైదా: ఒబామా

అమాయక ముస్లింలను చంపుతున్న అతిపెద్ద పైశాచిక సంస్థ అల్‌ఖైదా అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆరోపించారు. ఇలాంటి సంస్థతో పాటు దాని అనుబంధ సంస్థలపైనే తాము పోరు సాగిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని విజ్ఞప్తి చేశారు.
Source: Yahoo! Telugu: News | 2 Feb 2010 | 6:30 am

ఈనెల ఐదో తేదీ నుంచి నేషనల్ ఆడిట్ సమ్మిట్!

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లో నేషనల్ ఆడిట్ సమ్మిట్ జరుగనుంది. ఇనిస్టిట్యూట్ ఆప్ ఇంటర్నల్ ఆడిటర్స్, ఇండియా (ఐఐఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సు ఈనెల ఐదు, ఆరు తేదీల్లో జరుగుతుంది. వచ్చే దశాబ్దంలో ఎదురయ్యే సవాళ్లు, ఎదుర్కొనే తీరుతెన్నులు అనే అంశంపై ఈ సదస్సు సాగనుంది.
Source: Yahoo! Telugu: News | 2 Feb 2010 | 6:24 am

స్వల్ప నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్

బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాల్లో కూరుకుపోయింది. మంగళవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే స్వల్ప ఒడిదుడుకులను ఎదుర్కొన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఐదు పాయింట్లు స్వల్పంగా క్షీణించి, 16,350 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 8 పాయింట్లు పతనమై, 4,891 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 2 Feb 2010 | 6:17 am

స్వల్ప లాభనష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీల పయనం

బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి హెచ్చుతగ్గులను నమోదు చేసుకుంటోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 13 పాయింట్లు పుంజుకుని, 16,369 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అయితే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ 12 పాయింట్లు పతనమై, 4,887 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 2 Feb 2010 | 6:11 am

తగ్గిన చక్కెర ఉత్పత్తులు : ఇస్మా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి వరకు దేశంలో 78.4 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తయ్యింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఉత్పత్తైన చక్కెరతో పోలిస్తే రెండు లక్షల టన్నులు తక్కువగా ఉందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) మేనేజింగ్ డైరెక్టర్ ఎమ్ ఎన్ రావ్ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 2 Feb 2010 | 6:03 am

బంటి... ద బ్యాడ్ బోయ్: ట్రెయిలర్

బాలల అల్లరి చేష్టలను ఆధారంగా చేసుకుని ఇంతకుముందు ఎన్నో చిత్రాలు వచ్చాయి. తాజాగా మాస్టర్‌ శ్రీహరి దత్తా టైటిల్‌ పాత్రాధారిగా వైష్ణవి ఫిల్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కె.రవిప్రకాష్‌ నిర్మించిన 'బంటి..ద బ్యాడ్‌ బోయ్‌' వచ్చింది.'బంటి' దర్శక నిర్మాత రవిప్రకాష్‌ మాట్లాడుతూ, 'ఇది కేవలం బాలల కోసమే తీసిన సినిమా కాదు. సకుటుంబంగా చూడాల్సిన సినిమా. నిజ జీవితంలో పిల్లలు ఎలా ఉంటారు, ఏం చేస్తే వారు సరైన మార్గంలో పయనిస్తారనేది ఈ చిత్ర కథాంశం. చూసినవాళ్లంతా అభినందించడం సంతోషంగా అనిపిస్తోంది.'అని చెప్పారు. బేబి వైష్ణవి, సత్యకృష్ణ, కృష్ణవేణి, రాగిణి, జాన్‌ బాప్టిస్ట్‌, వి.నాగివీడు, రొణ్ణంకి, జయలక్ష్మి తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం:లలిత్‌ సురేశ్‌, కూర్పు: వెంకటేశ్వర్లు కామేపల్లి, సినిమాటోగ్రఫీ: ఆర్‌.పి. పినిశెట్టి, కథ మాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాణం, దర్శకత్వం: కె.రవిప్రకాశ్‌. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్‌ను వీక్షించండి.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Feb 2010 | 5:51 am

నిందితులను కఠినంగా శిక్షిస్తాం: సీఎం రోశయ్య

విద్యార్థి నాగ వైష్ణవి కిడ్నాప్ చేసి, హత్య చేసిన కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తామని ముఖ్యంత్రి కె.రోశయ్య స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైష్ణవి కిడ్నాప్, హత్యపై, ఆమె తండ్రి పలగాని ప్రభాకర్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.రోశయ్య తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 2 Feb 2010 | 5:46 am

రెండేళ్లపాటు "యుగానికి ఒక్కడు" కోసమే!!: రీమాసేన్

కార్తి కథానాయకుడిగా రీమాసేన్ కథానాయికగా శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్ వాలి కార్పొరేషన్ స్టూడియో గ్రీన్ నిర్మించిన తమిళ చిత్రాన్ని "యుగానికి ఒక్కడు"గా తెలుగులో అనువదించారు. ఈ చిత్రం ఈనెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.కార్తి మాట్లాడుతూ.. "ఇటీవలే ఈ చిత్రం తమిళలో విడుదలైంది. మంచి కలెక్షన్లతో ప్రదర్శించబడుతోంది. తెలుగు ప్రేక్షకులకోసం ఈ చిత్రాన్ని కొంత ట్రిమ్ చేశాము. వైవిధ్యమైన కథాంశంతో దాదాపు రెండున్నర ఏండ్లపాటు రూపొందించాం. ఎంతో కష్టపడ్డాము. ఇందులో డీగ్లామరైజ్డ్ పాత్ర పోషించాను. సూర్య కూడా చూసి మెచ్చుకున్నారు. తెలుగువారు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అన్నారు.దర్శకుడు శ్రీరాఘవ మాట్లాడుతూ... "రెండున్నరేళ్లుగా పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కన్పించింది. చూసినవారంతా బాగుందని ప్రశంసిస్తున్నారు. సినిమాకోసం చోళుల కాలంనాటి విషయాలను రీసెర్చ్ చేశాము. అప్పటికి తగినట్లు సంగీతం కూడా చేయడం జరిగింది. ఈ సినిమాకు అంతా దక్షిణాదివారే పనిచేశారు. ప్రపంచ సినిమాకు ఈ సినిమా ఏమాత్రం తీసిపోద"న్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Feb 2010 | 4:38 am

అమర్ సింగ్-జయప్రదలపై ఎస్పీ బహిష్కరణ వేటు!

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీలో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్, రాంపూర్ ఎంపీ జయప్రదలపై బహిష్కరణవేటు వేసింది. అలాగే, అమర్ సింగ్‌కు మద్దతు ప్రకటించిన మరో నలుగురు ఎమ్మెల్యేలపై కూడా ఎస్పీ వేటు వేసింది.
Source: జాతీయ | 2 Feb 2010 | 1:17 am

నిందితులను కఠినంగా శిక్షిస్తాం: సీఎం రోశయ్య

విద్యార్థి నాగ వైష్ణవి కిడ్నాప్ చేసి, హత్య చేసిన కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తామని ముఖ్యంత్రి కె.రోశయ్య స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైష్ణవి కిడ్నాప్, హత్యపై, ఆమె తండ్రి పలగాని ప్రభాకర్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.రోశయ్య తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 2 Feb 2010 | 12:16 am

తెలంగాణ రాష్ట్రాన్ని తక్షణం ఇవ్వాల్సిందే: హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తక్షణం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు చెందిన సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఒక్క సీపీఎం మినహా తెలుగుదేశం, కాంగ్రెస్, ప్రజారాజ్యంలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని చేర్చాయన్నారు.
Source: ఏపీ న్యూస్ | 1 Feb 2010 | 11:48 pm

పార్క్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: నర్సులకు గాయాలు!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌, సోమాజిగూడలోని పార్క్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలో పని చేసే పలువురు నర్సులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు పోలీసులు చెపుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 1 Feb 2010 | 11:20 pm

విజయవాడకు రానున్న చంద్రబాబు-చిరంజీవి!

అత్యంత కిరాతకంగా హత్యకు గురైన నాగ వైష్ణవి కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిలు మంగళవారం విజయవాడకు రానున్నారు. వైష్ణవి మరణ వార్త తెలుసుకున్న ఆమె తండ్రి పనగాల ప్రభాకర్ గుండెపోటుతో మంగళవారం ఉదయం ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 1 Feb 2010 | 11:11 pm

బీహార్‌లో కాంగ్రెస్ ఒంటరి పోరు: రాహుల్ గాంధీ

బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయనున్నట్టు అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దీనిపై ఆయన దర్భాంగలో మాట్లాడుతూ గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఒంటరిగా పోటీ చేసిందన్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తుదని చెప్పారు.
Source: జాతీయ | 1 Feb 2010 | 10:43 pm

కుమార్తె వైష్ణవికోసం ఘోషించిన ఆ గుండె... ఆగిపోయింది!!

కిడ్నాప్‌కు గురై శవమై తేలిన విజయవాడ చిన్నారి నాగ వైష్ణవి కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. తన ముద్దుల గారాలపట్టి బూడిదైందని తెలుసుకున్న తండ్రి పలగాని ప్రభాకర్ గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూనే మంగళవారం ఉదయం కన్నుమూశారు.
Source: ఏపీ న్యూస్ | 1 Feb 2010 | 10:30 pm

సార్క్ సదస్సుకు వెళితే పాక్ నేతలతో చర్చలు: చిదంబరం

సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కో ఆపరేషన్ (సార్క్ సదస్సు) శిఖరాగ్ర సదస్సుకు తాను హాజరైతే తప్పకుండా పాకిస్థాన్ నేతలతో చర్చలు జరుపుతానని కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ సదస్సుకు ఆయన హాజరుకావచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై మీడియా అడిగిన ఒక ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానం ఇచ్చారు.
Source: జాతీయ | 1 Feb 2010 | 9:12 pm

ముంబై ప్రకంపనలు: పరివార్ నేతల మధ్య విభేదాలు!

దేశ వాణిజ్య రాజధాని ముంబై భారతీయులందరిదీ అనే అంశంపై సంఘ్ పరివార్ సంస్థల మధ్య విభేదాలు పొడచూపాయి. మహారాష్ట్రలో ప్రధాన ప్రాంతీయ పార్టీగా ఉన్న శివసేన ముంబై కేవలం మరాఠీయులకే సొంతమని వాదిస్తోంది. అయితే, ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ మాత్రం శివసేన వాదనతో విభేదించింది. అలాగే, ఆర్ఎస్ఎస్ కూడా శివసేన నేతన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. దీంతో ఆర్ఎస్ఎస్, భాజపా, శివసేన పార్టీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి.
Source: జాతీయ | 1 Feb 2010 | 9:09 pm

బ్రహ్మ+ ఆనందం= బ్రహ్మానందం

ఈ ఈక్వేషన్ ఏమిటీ అనుకుంటున్నారా...? ఆ బ్రహ్మదేవుడు మనిషికి ప్రాణం పోస్తాడనీ, వారి జీవితాలను నిర్దేశిస్తాడని అంటారు. వెండితెరపై కనబడుతున్న ఈ బ్రహ్మ(ఆనందం) మాత్రం తెలుగు ప్రజలకు కడుపుబ్బ నవ్విస్తూ సంతోషాలను వెదజల్లుతున్నాడు. ఆయనకు ఎటువంటి పాత్రను కట్టబెట్టినా తనదైన బాడీ లాంగ్వేజ్‌తో నవ్వులను ప్రేక్షకులపై విసిరేందుకు యత్నిస్తారు. ప్రారంభ చిత్రం నుంచీ నవ్వు నవ్వుకూ తేడాలను చూపిస్తూ... నవ్వులకు పదునుపెడుతూ నవ్వు+ నవ్వు+ ... అంటూ నవ్వుకే పొట్టచెక్కలయ్యేలా నవ్వును తెప్పిస్తూ తన నటన ద్వారా తెలుగు ప్రేక్షకులకు హాస్యపు విందు చేస్తున్నారు. అన్ని రసాలలోకెల్లా హాస్య రసాన్ని పలికించడం ఎంతో కష్టమని చెపుతారు. ఈ హాస్య రసాన్ని గుళికలు చేసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న హాస్యరసబ్రహ్మ బ్రహ్మానందానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెపుదాం. ఎందుకంటే ఇవ్వాళ... అదే ఫిబ్రవరి 1 ఆయన పుట్టిన రోజు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Feb 2010 | 9:41 am

చిన్నారి నాగ వైష్ణవి అత్యంత దారుణ హత్య

అభం శుభం ఎరుగని పసిమొగ్గ నాగ వైష్ణవిని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. రెండు రోజుల క్రితం విజయవాడలో కిడ్నాప్‌కు గురైన వైష్ణవి గుంటూరు శివార్లలోని ఆటోనగర్‌లో దారుణ హత్యకు గురై శవమై కన్పించింది. ఆటో నగర్‌లో ప్లాట్ నెంబరు 445లో బాలిక శవం లభ్యమైంది.
Source: ఏపీ న్యూస్ | 1 Feb 2010 | 8:22 am

వెంకటేష్ "నమో వెంకటేశ" ట్రెయిలర్

విక్టరీ వెంకటేష్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ "నమో వెంకటేశ". సంక్రాంతికి విడుదలైన ‘నమో వెంకటేశ’ చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్‌తో, భారీ కలెక్షన్లు రాబట్టుకుంటోందని చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Feb 2010 | 7:14 am

లతా మంగేష్కర్‌కు ప్రపంచరత్న అవార్డు ఇవ్వాలి: అక్కినేని

ప్రముఖ హిందీ నేపధ్య గాయనీమణి, భారతరత్న లతా మంగేష్కర్‌కు సోమవారం అక్కినేని అవార్డును ప్రదానం చేశారు. హైదరాబాదులోని తాజ్ కృష్ణలో జరిగిన ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య, అక్కినేని నాగేశ్వరరావుతోపాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Feb 2010 | 6:47 am

డీఎస్‌ను ఘెరావ్ చేయడమే సమైక్యమా: కేసీఆర్ ప్రశ్న!

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌‍ను ముఖ్యమంత్రి రోశయ్య సమక్షంలో ఘెరావ్ చేయడమే సమైక్యవాదమా అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు ప్రశ్నించారు. తమ ప్రాంత ప్రజలు శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే.. సీమాంధ్ర ప్రజలు మాత్రం రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. డీఎస్‌కు జరిగిన పరాభవం తెలంగాణ ప్రజలకు ఒక పరీక్షలాంటిదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 1 Feb 2010 | 5:40 am

సీనియర్ ఎన్టీఆర్ పెళ్లిరోజునాడే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి

జూనియర్ ఎన్టీఆర్ 17 ఏళ్ల ప్రణీతను వివాహమాడబోతున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఆ వివాహం ఎప్పుడూ..? అనే ప్రశ్నకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒక తేదీని చెప్పినట్లు తెలిసింది. ఆ తేదీ 2010 ప్రథమార్థంలో... తన తాత స్వర్గీయ ఎన్టీఆర్ పెళ్లిరోజు అయిన మే 21వ తేదీనాడు పెళ్లి చేసుకోబోతున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు సమాచారం. వివాహం గురించి మరిన్న వివరాలు చెప్పమని జూనియర్ ఎన్టీఆర్ ను ప్రశ్నిస్తే... తను సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాననీ, తను చెప్పకముందే మీడియా తన పెళ్లి గురించి చాలా చెప్పేసిందనీ వ్యాఖ్యానించారు.తాత పెళ్లిరోజే వివాహం చేసుకోబోతున్నారని వస్తున్న వార్తలు నిజమేనా..? అని అడుగగా... అన్ని వివరాలు త్వరలో తెలియజేస్తానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Feb 2010 | 5:26 am

లతా మంగేష్కర్ నా అభిమాని: అక్కినేని

గానకోకిల లతా మంగేష్కర్‌కు అక్కినేని నాగేశ్వరరావు అవార్డును సోమవారం ప్రదానం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఇచ్చే ఏఎన్నార్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అవార్డును అక్కినేని చేతుల మీదుగా గానకోకిల మంగేష్కర్ అందుకున్నారు. సోమవారం జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవంలో అక్కినేని నాగేశ్వరరావు గానకోకిలపై ప్రశంసల వర్షం కురిపించారు. గానకోకిల అయిన లతా మంగేష్కర్‌ను మన దేశం భారతరత్న పురస్కారంతో సత్కరించిందని నాగేశ్వరరావు గుర్తు చేశారు. కానీ ఈ అవార్డు లతా మంగేష్కర్‌ నైపుణ్యతకు ఏ మాత్రం సరిపోదని, ఆమెకు ప్రపంచ రత్న అవార్డును ప్రదానం చేసి ఉండాల్సిందని అక్కినేని పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Feb 2010 | 5:16 am

విగ్రహాల పరిరక్షణకు యూపీలో ప్రత్యేక కమెండో ఫోర్స్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రతిష్టించిన బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌, అంబేద్కర్‌తో పాటు.. మాయావతి విగ్రహాలను పరిరక్షించేందుకు 14 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు యూపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Source: జాతీయ | 1 Feb 2010 | 4:48 am

విశాఖ 'పుట్టి' బాధితులకు చిరంజీవి పరామర్శ!

విశాఖపట్నం జిల్లా తాండవ రిజర్వాయర్‌లో పుట్టి మునిగి ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆర్థిక సాయం ప్రకటించారు. ఇందుకోసం ప్రమాద స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఆయన 25 వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 1 Feb 2010 | 4:26 am

చంద్రబాబు ఇంకా నిద్రమేల్కోలేదు: మంత్రి బొత్స

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంకా నిద్రమేల్కోలేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రం తగులబడి పోతున్నా ఆయన మాత్రం నోరు మెదపరన్నారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్నారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 1 Feb 2010 | 4:01 am

ఏకపక్షంగా తిరస్కరించిన స్పీకర్: హరీష్ రావు

ప్రజా ప్రతినిధులు చేసిన రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా తిరస్కరించారని తెలంగాణ రాష్ట్ర సమితి నేత హరీష్ రావు అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ తాము మనస్పూర్తిగానే రాజీనామాలు చేశామని, కానీ వాటిని స్పీకర్ ఏకపక్షంగా తిరస్కరించారని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 1 Feb 2010 | 3:44 am

ముంబై అందరిదీ: శివసేనపై మండిపడిన భాజపా

ముంబై అంశంపై భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీల మధ్య విభేదాలు పొడచూపాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబై కేవలం మరాఠీలకే సొంతమని శివసేన వాదిస్తోంది. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరాదని ఆ పార్టీ నేతలు తెగేసి చెపుతున్నారు. శివసేన నేతల వాదనను భారతీయ జనతా పార్టీతో సహా ఆర్ఎస్ఎస్ కూడా కొట్టిపారేసింది. ముంబై భారతీయులందరికీ సొంతమని తేల్చి చెప్పాయి.
Source: జాతీయ | 1 Feb 2010 | 3:12 am