రంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి: టీజాక్ నేతల అరెస్టు!

తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సోమవారం నుంచి చేపట్టింది. ఇందులోభాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ వద్ద పికెటింగ్ నిర్వహించారు. దీంతో తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్ కోదండరామ్‌తో సహా తెదేపా నేతలు దేవేందర్ గౌడ్, ఏ. చంద్రశేఖర్, తెరాస నేత డాక్టర్ శ్రావణ్ తదితరులను అరెస్టు చేశారు.
Source: Yahoo! Telugu: News | 1 Feb 2010 | 8:54 am

ముంబై అందరిదీ: శివసేనపై మండిపడిన భాజపా

ముంబై అంశంపై భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీల మధ్య విభేదాలు పొడచూపాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబై కేవలం మరాఠీలకే సొంతమని శివసేన వాదిస్తోంది. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరాదని ఆ పార్టీ నేతలు తెగేసి చెపుతున్నారు. శివసేన నేతల వాదనను భారతీయ జనతా పార్టీతో సహా ఆర్ఎస్ఎస్ కూడా కొట్టిపారేసింది. ముంబై భారతీయులందరికీ సొంతమని తేల్చి చెప్పాయి.
Source: Yahoo! Telugu: News | 1 Feb 2010 | 8:42 am

వెయ్యి మందిని నియమించనున్న సిస్టెమా శ్యామ్

రష్యాకు చెందిన సిస్టెమా, భారతదేశానికి చెందిన శ్యామ్ సంస్థలు సంయుక్తంగా ఏర్పడ్డ సిస్టెమా టెలికాం సర్వీసెస్ సంస్థ రానున్న రోజుల్లో వెయ్యిమందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు ఆ సంస్థ మానవ వనరుల శాఖాధికారి మనీష్ ఖరబందా మీడియాకు తెలిపారు
Source: Yahoo! Telugu: News | 1 Feb 2010 | 8:40 am

టాక్సీ డ్రైవర్‌ను కత్తితో పొడిచి చంపారు: న్యూజిలాండ్

న్యూజిలాండ్‌లో అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయిన టాక్సీ డ్రైవర్‌ను హత్య చేసినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. కత్తితో కడుపులో పొడవటం వల్లే భారతీయ టాక్సీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు ధృవీకరించారు.
Source: Yahoo! Telugu: News | 1 Feb 2010 | 8:30 am

అమ్మకాల్లో 34 శాతం వృద్ధి సాధించిన టీవీఎస్

ప్రస్తుత ఏడాది జనవరి నెలలో తమ సంస్థకు చెందిన ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో 34 శాతం వృద్ధి సాధించి 1,25,578 బైకులు అమ్ముడైనట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ సోమవారం తెలిపింది. అదే గత సంవత్సరం ఇదే కాలానికి అమ్ముడైన వాహనాలు 93,729 బైకులని ఆ కంపెనీ పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 1 Feb 2010 | 8:22 am

వెంకటేష్ "నమో వెంకటేశ" ట్రెయిలర్

విక్టరీ వెంకటేష్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ "నమో వెంకటేశ". సంక్రాంతికి విడుదలైన ‘నమో వెంకటేశ’ చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్‌తో, భారీ కలెక్షన్లు రాబట్టుకుంటోందని చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Feb 2010 | 7:14 am

స్వల్ప ఒడిదుడుకుల్లో బాంబే స్టాక్ మార్కెట్

బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభనష్టాలతో హెచ్చుతగ్గులను నమోదు చేసుకుంటోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఏడు పాయింట్లు స్వల్పంగా పతనమై, 16,350 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అయితే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం 14 పాయింట్ల స్వల్ప లాభంతో, 4,896 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 1 Feb 2010 | 6:55 am

42 శాతం వృద్ధి సాధించిన హుండాయ్ కార్ల అమ్మకాలు

ప్రస్తుత ఏడాది జనవరి నెలలో తమ సంస్థకు చెందిన వాహనాల అమ్మకాలలో 41.60 శాతం వృద్ధి చెంది 52,635 కార్లు అమ్ముడైనాయని హుండాయ్ మోటార్ ఇండియా డైరెక్టర్ అరవింద్ సక్సేనా సోమవారం మీడియాకు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 1 Feb 2010 | 6:55 am

లతా మంగేష్కర్‌కు ప్రపంచరత్న అవార్డు ఇవ్వాలి: అక్కినేని

ప్రముఖ హిందీ నేపధ్య గాయనీమణి, భారతరత్న లతా మంగేష్కర్‌కు సోమవారం అక్కినేని అవార్డును ప్రదానం చేశారు. హైదరాబాదులోని తాజ్ కృష్ణలో జరిగిన ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య, అక్కినేని నాగేశ్వరరావుతోపాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Feb 2010 | 6:47 am

కరాచీలో జీహాదీలకు శిక్షణ ఇస్తున్న పాక్ ఐఎస్ఐ!

భారత్‌లో ముంబై తరహా దాడులను నిర్వహించేలా పాకిస్థాన్ ఐఎస్ఐ జీహాదీలను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం కొంతమంది జీహాదీలను ఎంపిక చేసి వారికి కరాచీలో తీవ్రవాద శిక్షణ ఇస్తున్నట్టు కొన్ని మీడియా సంస్థలు సోమవారం కథనాలను ప్రసారం చేశాయి.
Source: Yahoo! Telugu: News | 1 Feb 2010 | 6:46 am

మిశ్రమ ఫలితాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 35 పాయింట్లు క్షీణించి, 16,322 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అయితే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం కేవలం ఒక పాయింట్ వృద్ధితో 4,883, పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 1 Feb 2010 | 6:44 am

తెలంగాణాపై చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నా: చిదంబరం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై అందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని గత నెల ఐదో తేదీన ప్రకటించినట్టు, ఆ ప్రకటనకు కట్టుబడి ఉన్నట్టు కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలిపారు. ఇందుకోసం కమిటీనా లేదా యంత్రాంగమా అనేది ఈ వారంతంలో వెల్లడిస్తామని, అంతవరకు వేచి చూడాలని ఆయన కోరారు.
Source: Yahoo! Telugu: News | 1 Feb 2010 | 6:30 am

సీనియర్ ఎన్టీఆర్ పెళ్లిరోజునాడే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి

జూనియర్ ఎన్టీఆర్ 17 ఏళ్ల ప్రణీతను వివాహమాడబోతున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఆ వివాహం ఎప్పుడూ..? అనే ప్రశ్నకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒక తేదీని చెప్పినట్లు తెలిసింది. ఆ తేదీ 2010 ప్రథమార్థంలో... తన తాత స్వర్గీయ ఎన్టీఆర్ పెళ్లిరోజు అయిన మే 21వ తేదీనాడు పెళ్లి చేసుకోబోతున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు సమాచారం. వివాహం గురించి మరిన్న వివరాలు చెప్పమని జూనియర్ ఎన్టీఆర్ ను ప్రశ్నిస్తే... తను సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాననీ, తను చెప్పకముందే మీడియా తన పెళ్లి గురించి చాలా చెప్పేసిందనీ వ్యాఖ్యానించారు.తాత పెళ్లిరోజే వివాహం చేసుకోబోతున్నారని వస్తున్న వార్తలు నిజమేనా..? అని అడుగగా... అన్ని వివరాలు త్వరలో తెలియజేస్తానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Feb 2010 | 5:26 am

లతా మంగేష్కర్ నా అభిమాని: అక్కినేని

గానకోకిల లతా మంగేష్కర్‌కు అక్కినేని నాగేశ్వరరావు అవార్డును సోమవారం ప్రదానం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఇచ్చే ఏఎన్నార్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అవార్డును అక్కినేని చేతుల మీదుగా గానకోకిల మంగేష్కర్ అందుకున్నారు. సోమవారం జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవంలో అక్కినేని నాగేశ్వరరావు గానకోకిలపై ప్రశంసల వర్షం కురిపించారు. గానకోకిల అయిన లతా మంగేష్కర్‌ను మన దేశం భారతరత్న పురస్కారంతో సత్కరించిందని నాగేశ్వరరావు గుర్తు చేశారు. కానీ ఈ అవార్డు లతా మంగేష్కర్‌ నైపుణ్యతకు ఏ మాత్రం సరిపోదని, ఆమెకు ప్రపంచ రత్న అవార్డును ప్రదానం చేసి ఉండాల్సిందని అక్కినేని పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Feb 2010 | 5:16 am

రంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి: టీజాక్ నేతల అరెస్టు!

తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సోమవారం నుంచి చేపట్టింది. ఇందులోభాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ వద్ద పికెటింగ్ నిర్వహించారు. దీంతో తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్ కోదండరామ్‌తో సహా తెదేపా నేతలు దేవేందర్ గౌడ్, ఏ. చంద్రశేఖర్, తెరాస నేత డాక్టర్ శ్రావణ్ తదితరులను అరెస్టు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 1 Feb 2010 | 3:24 am

ముంబై అందరిదీ: శివసేనపై మండిపడిన భాజపా

ముంబై అంశంపై భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీల మధ్య విభేదాలు పొడచూపాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబై కేవలం మరాఠీలకే సొంతమని శివసేన వాదిస్తోంది. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరాదని ఆ పార్టీ నేతలు తెగేసి చెపుతున్నారు. శివసేన నేతల వాదనను భారతీయ జనతా పార్టీతో సహా ఆర్ఎస్ఎస్ కూడా కొట్టిపారేసింది. ముంబై భారతీయులందరికీ సొంతమని తేల్చి చెప్పాయి.
Source: జాతీయ | 1 Feb 2010 | 3:12 am

తెలంగాణాపై చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నా: చిదంబరం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై అందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని గత నెల ఐదో తేదీన ప్రకటించినట్టు, ఆ ప్రకటనకు కట్టుబడి ఉన్నట్టు కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలిపారు. ఇందుకోసం కమిటీనా లేదా యంత్రాంగమా అనేది ఈ వారంతంలో వెల్లడిస్తామని, అంతవరకు వేచి చూడాలని ఆయన కోరారు.
Source: జాతీయ | 1 Feb 2010 | 1:25 am

ధరల పెరుగుదలకు యూపీఏదే బాధ్యత: గడ్కారీ

దేశంలో నిత్యావసర వస్తు ధరలు ఆకాశానికి తాకడానికి ప్రధాన కారణం కేంద్రంలోని యూపీఏ సర్కారు అనుసరిస్తున్న విధానాలేనని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ఆరోపించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు ఆర్థిక విధానాల ఫలితంగా దేశంలో పేదరికం 12 శాతం పెరిగిందని ఆయన ఆరోపించారు.
Source: జాతీయ | 1 Feb 2010 | 12:17 am

మళ్లీ రాజీనామా చేస్తే.. ఉప ఎన్నికలే శరణ్యం!

తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ఆ పార్టీ హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై రాజీనామా చేస్తే ఆమోదించాల్సిందిగా స్పీకర్ ఎన్.కిరణ్ కుమార్ రెడ్డికి మౌఖిక ఆదేశాలు అందినట్టు సమాచారం. అందుకే ఆయన ఒక్క రాజీనామా మినహా మిగిలిన అన్ని రాజీనామాలను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 31 Jan 2010 | 11:16 pm

బొందిలో ప్రాణమున్నంత వరకు పోరాడుతా: కేసీఆర్

ప్రత్యేక రాష్ట్రం కోసం బొందిలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతానని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల మనోభీష్టాన్ని గౌరవించి ప్రత్యేక రాష్ట్రాన్ని కేంద్రం ప్రకటించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 31 Jan 2010 | 10:51 pm

వైఎస్ మార్గదర్శకాలతో కేంద్ర కమిటీ ఏర్పాటు!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి గతంలో సూచించిన మార్గదర్శకాలతో కేంద్రం తెలంగాణపై కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపైనే కేంద్ర హోంమంత్రి చిదంబరం, కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరిపి ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 31 Jan 2010 | 10:42 pm

లోక్‌సభ సభ్యుడే ప్రధానమంత్రి కావాలి: పీఏ.సంగ్మా

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన మన దేశంలో ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన (లోక్‌సభ) అభ్యర్థే ప్రధానమంత్రి పదవిని చేపట్టాలని లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా తెలిపారు. గోవాలో జరిగిన ఎన్సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Source: జాతీయ | 31 Jan 2010 | 9:52 pm

తెలంగాణ కమిటీ ఏర్పాటుపై నేడు చిదంబరం ప్రకటన?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కమిటీ వేసే అంశంపై కేంద్ర హోం మంత్రి చిదంబరం సోమవారం మధ్యాహ్నం ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. తన మంత్రిత్వ శాఖ నెలవారి ప్రగతిని వివరించేందుకు ఆయన సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
Source: జాతీయ | 31 Jan 2010 | 9:36 pm

సమస్య జేఏసీ కాదు.. తెలంగాణ ఏర్పాటే: జీవన్ రెడ్డి

కేంద్ర న్యాయ శాఖామంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ ఆదివారం ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీశాయి. మొయిలీ చేసిన వ్యాఖ్యలు తమకు వర్తింవవంటే తమకు వర్తించవని సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తాము ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం లేదని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి అంటున్నారు.
Source: ఏపీ న్యూస్ | 31 Jan 2010 | 9:15 pm

కోబాడ్ గాంధీకి నేపాల్ మావోలతో సంబంధాలు!

పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు అగ్రనేత కోబాడ్ గాంధీకి నేపాల్ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్టు అధికారులు జరిపిన విచారణలో వెల్లడైంది. నేపాల్‌లోని మావోయిస్టు పార్టీ అగ్రనేతలతో గాంధీకి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 31 Jan 2010 | 9:14 pm

జేఏసీ నుంచి బయటకు రండి: అధిష్టానం ఆదేశం

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. తక్షణం రాజకీయ ఏజేసీ నుంచి బయటకు రావాలని కోరింది. తమ అదేశాలను ధిక్కరించని నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Source: ఏపీ న్యూస్ | 31 Jan 2010 | 3:21 am

ప్రొటోకాల్ సమస్యను పెద్దది చేయొద్దు: చిరంజీవి

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించక పోవడం పట్ల ప్రజారాజ్యం పార్టీ అధినేత, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. దీనిపై పెద్ద వివాదం చేయవద్దనది ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 31 Jan 2010 | 3:08 am