|
మహా కుంభమేళాలో పుణ్యస్నానాలాచరించిన భక్తులుమాఘ పౌర్ణమి సందర్భంగా హరిద్వార్‌లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా వేలాదిమంది భక్తులతో కిక్కిరిసిపోయింది.మహాకుంభమేళా సందర్భంగా హరిద్వార్‌లోని గంగా నదిలో భక్తులు ''హర హర గంగే'' '' జై జై గంగే'' అంటూ పుణ్యస్నానాలాచరించారు. ముఖ్యంగా శనివారం నాడు పౌర్ణమి కావడంతో భక్తులు మరింతమంది ఎక్కువగా తరలిరావడం కనిపించిందిSource: Yahoo! Telugu: News | 30 Jan 2010 | 8:38 am వరుణ్ సందేశ్ "మరోచరిత్ర" షూటింగ్ పూర్తి!అలనాటి సెన్సేషనల్ హిట్ చిత్రం "మరోచరిత్ర". కమల్‌హాసన్, సరిత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బాలచందర్ అద్భుతంగా రూపొందించారు. అటువంటి చిత్ర కథను ఈనాటి ట్రెండ్‌లో తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో దిల్‌రాజు "మరోచరిత్ర"ను మళ్లీ నిర్మిస్తున్నారు. పలు హిందీ చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేసిన రవియాదవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హ్యాపీడేస్ ఫేమ్ వరుణ్ సందేశ్, అనిత, శ్రద్ధాదాస్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jan 2010 | 8:23 am ఫిబ్రవరిలో మన్మోహన్ సింగ్ సౌదీ అరేబియా పర్యటన!దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ వచ్చే నెల ఫిబ్రవరిలో సౌదీ అరేబియా పర్యటన చేపట్టనున్నారు. ఫిబ్రవరి, లేదా మార్చి నెలల్లో మన్మోహన్ సింగ్ సౌదీ అరేబియాలో పర్యటిస్తారని సౌదీ రాయబారి ఫైజల్ హెచ్. ట్రాడ్ విలేకరులతో తెలియజేశారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇరు దేశాల సంబంధాలను పటిష్టం చేసే దిశగా మన్మోహన్ సింగ్ సౌదీ అరేబియాలో పర్యటించే అవకాశం ఉందని చెప్పారు.Source: Yahoo! Telugu: News | 30 Jan 2010 | 7:55 am డ్రోన్ దాడుల్లో పాక్ మిలిటెంట్ల మృతిఅమెరికాకు చెందిన డ్రోన్ విమాన దాడుల్లో పాకిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంలోనున్న మిలిటెంట్లు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 30 Jan 2010 | 7:30 am జూనియర్ ఎన్టీఆర్ నిశ్చితార్థంపై దాఖలైన పిటిషన్ కొట్టివేత!నందమూరి యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నిశ్చితార్థంపై అడ్డు తొలిగింది. జూనియర్ ఎన్టీఆర్ నిశ్చితార్థంపై దాఖలైన పిటిషన్‌ను లీగల్ సర్వీసెస్ అథారిటీ శనివారం తోసిపుచ్చింది. మైనర్ బాలికతో జూనియర్ ఎన్టీఆర్ వివాహం తలపెట్టడం సబబు కాదంటూ కృష్ణాజిల్లా న్యాయసేవాధికార సంస్థ (లీగల్ సర్వీసెస్ అథారిటీ)లో మచిలీపట్నానికి చెందిన న్యాయవాది శింగలూరి శాంతిప్రసాద్ శుక్రవారం ఫిర్యాదు చేసిన సంగతి విదితమే.Source: Yahoo! Telugu: News | 30 Jan 2010 | 7:21 am పశ్చిమగోదావరి పడవ ప్రమాదం: మృతులకు ఎక్స్గ్రేషియాపశ్చిమగోదావరి జిల్లా పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం తెలిపింది.ఆపద్భంధు పథకం కింద రూ.50 వేలు, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.50 వేలను బాధిత కుటుంబాలకు అందజేస్తామని మంత్రి రఘువీరా రెడ్డి శనివారం ప్రకటించారు.Source: Yahoo! Telugu: News | 30 Jan 2010 | 6:57 am యూఎస్ అణ్వాయుధాల అమ్మకాలు ఆపాలి: చైనా హెచ్చరికఅమెరికా 6.4 బిలియన్ డాలర్ల విలువైన అణ్వాయుధాలను తైవాన్‌కు అమ్మాలని నిర్ణయం తీసుకోవడంపై చైనా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అమెరికా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే చైనా- అమెరికాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించింది.Source: Yahoo! Telugu: News | 30 Jan 2010 | 6:54 am తప్పతాగి కారు నడిపిన మహిళ: ఇద్దరు మృతివాణిజ్య రాజధాని ముంబయిలో ఓ మహిళ తప్పతాగి కారు నడుపుతూ ఏకంగా పోలీసు వాహనంతోపాటు మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో జీపులో ఉన్న అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్, ద్విచక్ర వాహన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 30 Jan 2010 | 6:09 am ఫిబ్రవరి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలురాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20వ తేదీన శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర మంత్రి వర్గం శనివారం ప్రకటించనుంది. శనివారం ఉదయం రాష్ట్ర మంత్రి వర్గం సచివాలయంలో సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలపై కేబినేట్ ఆమోద ముద్ర వేసింది.Source: Yahoo! Telugu: News | 30 Jan 2010 | 5:56 am జీతాలు పెంచిన విప్రో: ఆనందంలో ఉద్యోగులువిప్రో సంస్థ తమ ఉద్యోగులకు ఈ ఏడాది 8 నుంచి 12 శాతం మేర జీతాలను పెంచాలని నిర్ణయించింది. అంతేకాదు మెరుగైన పనితీరును కనబరిచినవారికి 15 శాతం వరకూ జీతం పెంపుదల ఉంటుందని విప్రో యాజమాన్యం తెలిపింది.Source: Yahoo! Telugu: News | 30 Jan 2010 | 5:56 am విస్తరణ దిశగా అపోలో హాస్పిటల్స్దేశీయ ప్రైవేట్ ఆసుపత్రుల రంగంలో అగ్రగామిగానున్న అపోలో అసుపత్రి యాజమాన్యం దేశ విదేశాల్లోనున్న తమ ఆసుపత్రులను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి మీడియాకు వెల్లడించారుSource: Yahoo! Telugu: News | 30 Jan 2010 | 5:36 am "చందమామ" కథను చదివిన అనుభూతినిచ్చే రంగుల "మాయాబజార్""మాయాబజార్" పేరు వినగానే కె.వి.రెడ్డి దర్శకత్వంలో, విజయావారి నిర్మాణ సారథ్యంలో 1957 మార్చి 27న విడుదలైన "మాయాబజార్" గుర్తుకు వస్తుంది. ఈ చిత్రానికి సంగీతం: ఘంటసాల, కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు, డైరక్టర్ ఆఫ్ ఆటోగ్రఫీ: మార్కస్ భార్క్‌లే. ఎన్టీఆర్, అక్కినేని, గుమ్మడి, ఎస్.వి. రంగారావు, సూర్యకాంతం, సావిత్రి, నాగభూషణం, రమణారెడ్డి, రేలంగి.. ఇలా ఒక్కరేమిటి.. ఎందరో మహానటులు నటించిన చక్కని చిత్రం అలనాటి "మాయాబజార్". తాజాగా బ్లాక్ అండ్ వైట్‌గా ఉన్న ఈ చిత్రాన్ని కలర్ "మాయాబజార్"గా సూపర్‌గుడ్ ఫిలింస్ పంపిణీ చేసింది. ఈ చిత్రం నెల తెరపైకి రానుంది. బలరామకృష్ణులుగా గుమ్మడి, ఎన్టీఆర్ నటించారు. శశిరేఖగా సావిత్రి, అభిమన్యుడిగా అక్కినేని, ఘటోత్కచునిగా ఎస్వీరంగారావు నటించారు. తన అల్లుడిని చేసుకుంటానని సోదరి సుభద్రకు మాట ఇచ్చిన బలరాముడు, తన శిష్యుడు దుర్యోధనుని ఆతిథ్యం చూసి శశిరేఖను వారి కోడలు చేస్తానని కూడా మాట ఇస్తాడు. శకుని తంత్రంతో పడిన దుర్యోధనాదులను కృష్ణుడు ఏవిధంగా మాయచేసి శశిరేఖా పరిణయం చేశాడన్నడే మాయాబజార్ కథా సారాంశం.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jan 2010 | 5:16 am మహాశివరాత్రికి వస్తోన్న నాగార్జున "కేడీ""కింగ్" నాగార్జున హీరోగా కిరణ్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న క్రేజీ చిత్రం "కేడి". కామాక్షి కళా మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తి చేసుకుని, రీ-రికార్డింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత డి. శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. "నాగార్జునతో తమ పతాకంపై తీసిన స్టైలిష్ కమర్షియల్ ఫిలిమ్ కేడీ. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 12వ తేదీన కేడీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తమ బ్యానర్‌లో మరో సూపర్‌హిట్ చిత్రంగా "కేడి" నిలుస్తుంది" అని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jan 2010 | 4:48 am నాగచైతన్య, కాజల్ అగర్వాల్ జోడీగా భారీ చిత్రం!యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కామాక్షి కళామూవీస్ పతాకంపై అగ్రనిర్మాత డి. శివప్రసాదరెడ్డి నిర్మిస్తున్న భారీ చిత్రం మార్చిలో ప్రారంభమవుతోంది. ఈ చిత్రం గురించి నిర్మాత డి. శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. కామాక్షి బేనర్ సిల్వర్ జూబ్లీ ఇయర్‌లో నాగచైతన్య హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా అజయ్ భుయాన్ అనే దర్శకుడిని పరిచయం చేస్తున్నాం. వి.ఎస్. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణాన్ని నిర్వహిస్తున్నారు. భారీ తారాగణంతో హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. అద్భుతమైన సబ్జెక్ట్ రెడీ అయ్యింది" అని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jan 2010 | 4:32 am మహా కుంభమేళాలో పుణ్యస్నానాలాచరించిన భక్తులుమాఘ పౌర్ణమి సందర్భంగా హరిద్వార్‌లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా వేలాదిమంది భక్తులతో కిక్కిరిసిపోయింది.మహాకుంభమేళా సందర్భంగా హరిద్వార్‌లోని గంగా నదిలో భక్తులు ''హర హర గంగే'' '' జై జై గంగే'' అంటూ పుణ్యస్నానాలాచరించారు. ముఖ్యంగా శనివారం నాడు పౌర్ణమి కావడంతో భక్తులు మరింతమంది ఎక్కువగా తరలిరావడం కనిపించిందిSource: జాతీయ | 30 Jan 2010 | 3:08 am జూనియర్ ఎన్టీఆర్ నిశ్చితార్థంపై దాఖలైన పిటిషన్ కొట్టివేత!నందమూరి యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నిశ్చితార్థంపై అడ్డు తొలిగింది. జూనియర్ ఎన్టీఆర్ నిశ్చితార్థంపై దాఖలైన పిటిషన్‌ను లీగల్ సర్వీసెస్ అథారిటీ శనివారం తోసిపుచ్చింది. మైనర్ బాలికతో జూనియర్ ఎన్టీఆర్ వివాహం తలపెట్టడం సబబు కాదంటూ కృష్ణాజిల్లా న్యాయసేవాధికార సంస్థ (లీగల్ సర్వీసెస్ అథారిటీ)లో మచిలీపట్నానికి చెందిన న్యాయవాది శింగలూరి శాంతిప్రసాద్ శుక్రవారం ఫిర్యాదు చేసిన సంగతి విదితమే.Source: ఏపీ న్యూస్ | 30 Jan 2010 | 3:07 am ఫిబ్రవరిలో మన్మోహన్ సింగ్ సౌదీ అరేబియా పర్యటన!దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ వచ్చే నెల ఫిబ్రవరిలో సౌదీ అరేబియా పర్యటన చేపట్టనున్నారు. ఫిబ్రవరి, లేదా మార్చి నెలల్లో మన్మోహన్ సింగ్ సౌదీ అరేబియాలో పర్యటిస్తారని సౌదీ రాయబారి ఫైజల్ హెచ్. ట్రాడ్ విలేకరులతో తెలియజేశారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇరు దేశాల సంబంధాలను పటిష్టం చేసే దిశగా మన్మోహన్ సింగ్ సౌదీ అరేబియాలో పర్యటించే అవకాశం ఉందని చెప్పారు.Source: జాతీయ | 30 Jan 2010 | 2:25 am పశ్చిమగోదావరి పడవ ప్రమాదం: మృతులకు ఎక్స్గ్రేషియాపశ్చిమగోదావరి జిల్లా పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం తెలిపింది.ఆపద్భంధు పథకం కింద రూ.50 వేలు, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.50 వేలను బాధిత కుటుంబాలకు అందజేస్తామని మంత్రి రఘువీరా రెడ్డి శనివారం ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 30 Jan 2010 | 1:28 am తప్పతాగి కారు నడిపిన మహిళ: ఇద్దరు మృతివాణిజ్య రాజధాని ముంబయిలో ఓ మహిళ తప్పతాగి కారు నడుపుతూ ఏకంగా పోలీసు వాహనంతోపాటు మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో జీపులో ఉన్న అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్, ద్విచక్ర వాహన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.Source: జాతీయ | 30 Jan 2010 | 12:39 am ఫిబ్రవరి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలురాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20వ తేదీన శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర మంత్రి వర్గం శనివారం ప్రకటించనుంది. శనివారం ఉదయం రాష్ట్ర మంత్రి వర్గం సచివాలయంలో సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలపై కేబినేట్ ఆమోద ముద్ర వేసింది.Source: ఏపీ న్యూస్ | 30 Jan 2010 | 12:28 am మహాత్మా గాంధీకి నివాళులర్పించిన జాతిశనివారం (30.1.10) జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా న్యూ ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్దనున్న ఆయన సమాధి వద్ద వివిధ మతాలకు సంబంధించిన వారు భక్తి పూర్వకమైన గేయాలను ఆలపించారుSource: జాతీయ | 29 Jan 2010 | 11:31 pm ప్రధాని అనుమతికోసం తెలంగాణా రోడ్ మ్యాప్తెలంగాణాపై కేంద్రం పూర్తిస్థాయి కసరత్తు ఆరంభించింది. శుక్రవారం సమావేశమైన కోర్ కమిటీ తెలంగాణా ఏర్పాటుకోసం అనుసరించవలసిన విధివిధానాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపింది. మొత్తం ఆరు అంశాలను ప్రధానంగా చేసుకుని కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్రం నిర్ణయించింది.Source: జాతీయ | 29 Jan 2010 | 11:22 pm గోదావరి నదిలో పడవ బోల్తా: 12మంది మృతిపశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం, బియ్యపుతిప్ప- ఉప్పుటూరు వద్ద వశిష్ట గోదావరిలో పడవ బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న 30 మంది గల్లంతయ్యారు. కాగా 12 మంది మృత దేహాలను వెలికి తీశారు. మిగిలినవారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.Source: ఏపీ న్యూస్ | 29 Jan 2010 | 10:54 pm దేశం చిన్నారుల వ్యభిచార కేంద్రంగా మారుతోంది: సుప్రీంభారతదేశం రాను రాను చిన్నారుల వ్యభిచార కేంద్రంగా మారుతోందని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తంచేసింది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించిందిSource: జాతీయ | 29 Jan 2010 | 10:31 pm రంగుల "మాయాబజార్" ట్రెయిలర్ మీకోసం...హాయ్ హాయ్ నాయకా! మొత్తానికి రేపే రంగుల్లో వచ్చేస్తున్నాడు. నలుపు తెలుపు "మాయాబజార్" రంగుల మాయలో. ఘటోత్కచుడు ఆరగించిన వివాహ భోజన వంటకాలు, అందాల శశిరేఖ ఆభరణాలు, ప్రతాపాలను నమ్ముకున్న తమ్ముడు అభిమన్యుడి కోసం లోకాలను కకావికలు చేసే ఘటోత్కచుడు అంతా రంగుల్లో కన్పించనున్నారు.కె.వి.రెడ్డి సృష్టించిన ఈ నలుపు తెలుపు కళా ఖండానికి గోల్డెన్‌స్టోన్ సంస్థ రంగులు అద్దింది. అద్భుతమైన ఈ సినిమాను రంగుల్లో చూసే అందమైన అవకాశం ఈ నెల 30వ తేదీన రానుంది. వెండితెరపై శ్రీకృష్ణుడి గెటప్‌లో ఎన్టీఆర్ పంచవర్ణ శోభితంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సూపర్‌గుడ్ సంస్థ విడుదల చేస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jan 2010 | 1:18 pm రామ్ గోపాల్ వర్మ "రణ్" ఏం చెప్పాలనుకుందీ...?ముందునుంచీ రామ్ గోపాల్ వర్మ తన చిత్రాలకు పబ్లిసిటీ క్రియేట్ చేసుకుంటూనే ఉంటాడు. అలాగే ఇందులో "జనగణమన రణ్ అధినాయక జయహే..." అంటూ జాతీయగీతంలో రణ్‌ను జొప్పించి జాతీయస్థాయిలో పెద్ద చర్చలేవదీశాడు. కోర్టు కేసులకు వెళ్లాక.. వెనక్కి తగ్గి దాన్ని మార్చేసి వందేమాతరం... అంటూ బ్యాక్‌గ్రౌండ్ పాటను పెట్టారు. స్థూలంగా ఈ చిత్రాన్ని పరిశీలిస్తే... ఒకప్పుడు ప్రింట్ మీడియా పోటీ ఎలా ఉందో తెలియజెప్పే న్యూఢిల్లీ టైమ్స్ తెలుగులో కృష్ణంరాజు నటించిన అంతిమతీర్పు గుర్తుకువస్తుంది. అలాగే అమితాబ్ బచ్చన్ పాత్ర ఆయన ఆలోచనలు "భారతీయుడు" కమల్ హాసన్ గుర్తుకు వస్తాడు. కథలోకి వెళితే... విజయ్ మాలిక్ ( అమితాబ్) తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడినవాడు. ప్రజలకు ఆసక్తికరమైన వార్తలు, కథనాలు రాసి పేరు తెచ్చుకుని ఇండియా 24X7 టీవీ ఛానల్ ప్రారంభించే స్థాయికి ఎదుగుతాడు. ఇతని కుమారుడు జైమాలిక్(సందీప్). నేటి తరానికి ప్రతీకగా రాత్రికిరాత్రే ఛానల్‌ను ఎక్కడికో తీసుకెళ్లాలని ఆరాటపడుతుంటాడు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jan 2010 | 1:03 pm "జూనియర్" కళాశాల విద్యార్థినితో జూనియర్ ఎన్టీఆర్ పెళ్లిసీనియర్ ఎన్టీఆర్ మనవడు, నందమూరి హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మేనకోడలు కుమార్తె లక్ష్మీ ప్రణీతను వివాహమాడాలని జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ వివాహమాడబోయే లక్ష్మీ ప్రణీత ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఓ న్యూస్ ఛానల్ అధినేత నార్నే శ్రీనివాసరావు కుమార్తె. ఈమె ప్రస్తుతం ఖైరతాబాద్‌లోని నాసర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కాగా జూనియర్ ఎన్టీఆర్‌తో లక్ష్మీప్రణీత వివాహాన్ని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ధృవీకరించారు. వచ్చే మే నెలలో ఓ శుభ ముహుర్తాన ఎన్టీఆర్, ప్రణీతల వివాహం చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించినట్లు సమాచారం.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jan 2010 | 6:01 am గోవాలో రష్యా బాలికపై అత్యాచారం: ఒకరి అరెస్టు!గోవా బీచ్‌లో రష్యా బాలికపై జరిగిన అత్యాచారం కేసులో స్థానిక పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టు చేసిన వ్యక్తిని రఘువంశ్‌గా గుర్తించారు. బాధితురాలి తల్లిని మాటల్లో దించిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు.Source: జాతీయ | 29 Jan 2010 | 5:47 am ముద్దు పెట్టాలని నాకు ముందే తెలుసు: నేహాశర్మచిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ తొలి చిత్రం "చిరుత" ద్వారా తెలుగులో పరిచయమైన నటి నేహా శర్మ. ఆ చిత్రం తర్వాత ఇద్దరికీ మంచి అండర్‌స్టాండింగ్ వచ్చిందనే వార్తలు వచ్చాయి. కానీ అవేవీ ఆమె కెరీర్‌కు హెల్ప్ కాలేదు. ఆ తర్వాత కుర్రాడులో నటించింది. అదీ ఫ్లాప్ కావడంతో ఇక లాభం లేదని రూటుమార్చి హిందీలోకి వెళ్లింది.అక్కడ "క్రూక్" అనే చిత్రంలో నటించింది. ఇమ్రాన్ హష్మీతో చేస్తోంది. మరి ఆయనతో చేయాలంటే పెదాలు ఎంగిలిచేయాలి కదా మేడమ్ అంటే... అవునని తలూపుతోంది. దర్శకుడు మోహిత్ సూరి ముందే ముద్దు సన్నివేశాలుంటాయని చెప్పాడని నిర్భయంగా చెపుతోంది. ఆస్ట్రేలియా నేపథ్యంలో సాగే ఈ కథలో... ఆస్ట్రేలియన్ ముద్దులు చాలానే ఉన్నాయని అంటోంది. మరి ఈ దెబ్బతో నేహా శర్మకు ఆఫర్లు తెగ వచ్చిపడతాయేమో చూడాలి.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jan 2010 | 4:10 am ఫంక్షన్లకొస్తే "గాలి" కబుర్లు రాస్తారు: నయనతారసీనియర్ నటులకంటే కొత్తవారైతే తనకు అనుకూలంగా ఉంటుందని సెక్సీ చూపుల ఒయ్యారి నయనతార చెబుతోంది. నయనతారను హీరోయిన్‌గా బుక్ చేయాలంటే.. ముందుగా అగ్రిమెంట్లో ఆమె పెట్టే కండిషన్లకు ఒప్పుకుని తీరాలి. అవేంటంటే... "సినిమా చేయడం వరకే నా బాధ్యత. ప్రమోషన్‌కి రాను..." ఇత్యాది కండిషన్లు ఎన్నింటినో పెడుతుంది. ఆమధ్య శరత్ కుమార్ నటించిన చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసే సందర్భంలో ప్రమోషన్ కోసం ఆమెకు పారితోషికం ఇచ్చి రప్పించారంటే నయనతార ఎంత ఖచ్చితంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక "అదుర్స్"లో నటించినా పబ్లిసిటీకి దూరమని తెలియడంతో నిర్మాతలు ఆమెను అప్రోచ్ కాలేదు. ముఖ్యంగా మీడియా సమావేశాలకు రానని చెపుతుంది. వచ్చిన దగ్గర్నుంచి వారేదో ఊహించుకుని రకరకాలుగా గాసిప్పులు తనపై రుద్దుతారని చెపుతోంది. కాస్త డల్‌గా ఉన్నా, మేకప్ సరిగా వేసుకోకపోయినా వారి ఊహల్లో విహరించి రాసుకుంటారని ఆమె అభిప్రాయమట.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jan 2010 | 4:03 am డెడ్‌లైన్లు పెడితే తెలంగాణ వస్తుందా: వీహెచ్ ప్రశ్న!డెడ్‌లైన్లు, షరతులకు తెలంగాణ వస్తుందా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఈ రోజు వస్తుంది, రేపు వస్తుందంటూ తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ప్రజలకు చెబుతూ మభ్యపెట్టి మోసం చేస్తూ వచ్చారన్నారు.Source: ఏపీ న్యూస్ | 29 Jan 2010 | 3:23 am ఆస్ట్రేలియా పర్యటనకు దూరంగా ఉండండి: ప్రణీత్ కౌర్ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత విద్యార్థులు దూరంగా ఉండాలని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ప్రణీత్ కౌర్ విజ్ఞప్తి చేశారు. ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లో నివశిస్తున్న భారతీయులపై జరుగుతున్న దాడులకు ఆ దేశ పాలకులు అడ్డుకట్ట వేయలేక పోయారు. గురువారం కూడా మరో నలుగురిపై దాడులు జరిగాయి.Source: జాతీయ | 29 Jan 2010 | 2:56 am సమైక్యాంధ్రకు విఘాతం కలిగితే రాష్ట్రం అల్లకల్లోలమే!సమైక్యాంధ్రకు ఏమాత్రం విఘాతం కలిగిన రాష్ట్రం అల్లకల్లోలం కావడం తథ్యమని సీమాంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీ శుక్రవారం హెచ్చరించింది. తెలంగాణ జేఏసీ డెడ్‌లైన్లకు కేంద్ర హోంమంత్రి పూటకొకటి చొప్పున ప్రకటన చేయడాన్ని జేఏసీ తప్పుబట్టింది.Source: ఏపీ న్యూస్ | 29 Jan 2010 | 2:56 am
|