|
ఆస్ట్రేలియా పర్యటనకు దూరంగా ఉండండి: ప్రణీత్ కౌర్ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత విద్యార్థులు దూరంగా ఉండాలని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ప్రణీత్ కౌర్ విజ్ఞప్తి చేశారు. ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లో నివశిస్తున్న భారతీయులపై జరుగుతున్న దాడులకు ఆ దేశ పాలకులు అడ్డుకట్ట వేయలేక పోయారు. గురువారం కూడా మరో నలుగురిపై దాడులు జరిగాయి.Source: Yahoo! Telugu: News | 29 Jan 2010 | 8:25 am ఒబామా వ్యాఖ్యలు బీపీఓ కంపెనీలను అస్థిరపరచలేవుఅమెరికాలో నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించేందుకుగాను అమెరికాలోని దేశీయ కంపెనీలకు ప్రస్తుతం విధిస్తున్న పన్ను మినహాయింపు తీసేస్తామని, దీనికిగాను అమెరికాలోని పలు కంపెనీలు దేశంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సివుంటుందని ఆయన అన్నారుSource: Yahoo! Telugu: News | 29 Jan 2010 | 8:21 am సమైక్యాంధ్రకు విఘాతం కలిగితే రాష్ట్రం అల్లకల్లోలమే!సమైక్యాంధ్రకు ఏమాత్రం విఘాతం కలిగిన రాష్ట్రం అల్లకల్లోలం కావడం తథ్యమని సీమాంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీ శుక్రవారం హెచ్చరించింది. తెలంగాణ జేఏసీ డెడ్‌లైన్లకు కేంద్ర హోంమంత్రి పూటకొకటి చొప్పున ప్రకటన చేయడాన్ని జేఏసీ తప్పుబట్టింది.Source: Yahoo! Telugu: News | 29 Jan 2010 | 8:13 am కోలుకుంటున్న సెన్సెక్స్.. రికవరీ దిశగా నిఫ్టీ..!బాంబే స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాల నుంచి మెల్లిగా కోలుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో సెన్సెక్స్ 16.286 పాయింట్ల వద్ద నిలిచింది. అలాగే నిఫ్టీ రికవరీ దిశగా సాగుతూ 9.95 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నాస్‌డాక్ సైతం నష్టాలనుంచి కోలుకునే ప్రయత్నంలో 10120.46 పాయింట్ల వద్ద నిలిచింది.Source: Yahoo! Telugu: News | 29 Jan 2010 | 7:09 am బీఎన్.శ్రీకృష్ణ నేతృత్వంలో తెలంగాణ త్రిసభ్య కమిటీ!తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేయనున్న కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీఎన్.శ్రీకృష్ణ నేతృత్వం వహించేందుకు సమ్మతించినట్టు కేంద్ర ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. మిగిలిన ఇద్దరు సభ్యులను జస్టీస్ శ్రీకృష్ణ ఎంపిక చేసుకుంటారు. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి రోడ్‌మ్యాప్‌తో సహా ఆరు సూత్రాల ప్రణాళికను ప్రధాని మన్మోహన్ సింగ్ ఖరారు చేసినట్టు సమాచారం.Source: Yahoo! Telugu: News | 29 Jan 2010 | 7:01 am జానా రెడ్డికి డిప్యూటీ సీఎం..?! "లొల్లి"కి గొళ్లెమేనా...?!!కేంద్రానికి పెద్ద తలనొప్పిగా మారిన ఆంధ్రప్రదేశ్ సంక్షోభానికి ఏదో విధంగా చరమ గీతం పాడాలని కాంగ్రెస్ హైకమాండ్ శతవిధాలా యత్నిస్తున్నట్లు కనబడుతోంది. తెలంగాణా "గండం" నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని గట్టెక్కించడమే కాక... పార్టీ పరువును కాపాడుకునేందుకు వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగా సాధ్యమైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణను చేయాలని సంకల్పిస్తోంది.Source: Yahoo! Telugu: News | 29 Jan 2010 | 6:51 am 16 వేల పాయింట్లకు దిగువన సెన్సెక్స్బాంబే స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాల బాటలో పయనిస్తోంది. దీంతో సెన్సెక్స్ 16వేల పాయింట్లకు దిగువకు చూస్తోంది. ప్రస్తుతం 96 పాయింట్ల మేర కోల్పోయి నష్టాలను చవిచూస్తోంది. 80 పాయింట్ల నష్టం నుంచి 32 పాయింట్లకు చేరుకుని కోలుకుంటోంది.Source: Yahoo! Telugu: News | 29 Jan 2010 | 6:20 am సీఆర్‌ఆర్‌ను పెంచిన భారతీయ రిజర్వు బ్యాంకుశుక్రవారం ముంబైలోని ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయంలో ఆర్థిక పరపతి విధాన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 75 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ పెంపు రెండు విడతలుగా అమల్లోకి రానుంది. ప్రస్తుతం నగదు నిల్వ నిష్పత్తి (సీఆర్‌ఆర్) 5 శాతం నుంచి 5.75 శాతానికి పెరిగిందిSource: Yahoo! Telugu: News | 29 Jan 2010 | 6:13 am మధుకోడాపై సీబీఐ విచారణ వద్దు: జార్ఖండ్ ప్రభుత్వం!వేల కోట్ల రూపాయల కుంభకోణంలో చిక్కుకున్న జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధుకోడాపై సీబీఐ విచారణ అవసరం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం జార్ఖండ్ హైకోర్టుకు తెలిపింది. చీఫ్ జస్టీస్ జ్ఞాన్ సుధా మిశ్రా నేతృత్వంలోని ధర్మాసంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒక అఫిడవిట్‌ను సమర్పించింది.Source: Yahoo! Telugu: News | 29 Jan 2010 | 6:07 am "జూనియర్" కళాశాల విద్యార్థినితో జూనియర్ ఎన్టీఆర్ పెళ్లిసీనియర్ ఎన్టీఆర్ మనవడు, నందమూరి హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మేనకోడలు కుమార్తె లక్ష్మీ ప్రణీతను వివాహమాడాలని జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ వివాహమాడబోయే లక్ష్మీ ప్రణీత ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఓ న్యూస్ ఛానల్ అధినేత నార్నే శ్రీనివాసరావు కుమార్తె. ఈమె ప్రస్తుతం ఖైరతాబాద్‌లోని నాసర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కాగా జూనియర్ ఎన్టీఆర్‌తో లక్ష్మీప్రణీత వివాహాన్ని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ధృవీకరించారు. వచ్చే మే నెలలో ఓ శుభ ముహుర్తాన ఎన్టీఆర్, ప్రణీతల వివాహం చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించినట్లు సమాచారం.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jan 2010 | 6:01 am పరిశోధక విద్యార్థులకు పెరగనున్న పారితోషికంప్రస్తుతం దేశంలోని శాస్త్ర, సాంకేతిక విద్యలో పలు మౌలికాంశాలపై పరిశోధన చేస్తున్న విద్యార్థులకిస్తున్న పారితోషికాన్ని నలభై శాతం మేరకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని శాస్త్ర, సాంకేతిక విభాగం కార్యదర్శి తిరుమలాచారి రామస్వామి తెలిపారు.Source: Yahoo! Telugu: News | 29 Jan 2010 | 5:50 am ముద్దు పెట్టాలని నాకు ముందే తెలుసు: నేహాశర్మచిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ తొలి చిత్రం "చిరుత" ద్వారా తెలుగులో పరిచయమైన నటి నేహా శర్మ. ఆ చిత్రం తర్వాత ఇద్దరికీ మంచి అండర్‌స్టాండింగ్ వచ్చిందనే వార్తలు వచ్చాయి. కానీ అవేవీ ఆమె కెరీర్‌కు హెల్ప్ కాలేదు. ఆ తర్వాత కుర్రాడులో నటించింది. అదీ ఫ్లాప్ కావడంతో ఇక లాభం లేదని రూటుమార్చి హిందీలోకి వెళ్లింది.అక్కడ "క్రూక్" అనే చిత్రంలో నటించింది. ఇమ్రాన్ హష్మీతో చేస్తోంది. మరి ఆయనతో చేయాలంటే పెదాలు ఎంగిలిచేయాలి కదా మేడమ్ అంటే... అవునని తలూపుతోంది. దర్శకుడు మోహిత్ సూరి ముందే ముద్దు సన్నివేశాలుంటాయని చెప్పాడని నిర్భయంగా చెపుతోంది. ఆస్ట్రేలియా నేపథ్యంలో సాగే ఈ కథలో... ఆస్ట్రేలియన్ ముద్దులు చాలానే ఉన్నాయని అంటోంది. మరి ఈ దెబ్బతో నేహా శర్మకు ఆఫర్లు తెగ వచ్చిపడతాయేమో చూడాలి.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jan 2010 | 4:10 am ఫంక్షన్లకొస్తే "గాలి" కబుర్లు రాస్తారు: నయనతారసీనియర్ నటులకంటే కొత్తవారైతే తనకు అనుకూలంగా ఉంటుందని సెక్సీ చూపుల ఒయ్యారి నయనతార చెబుతోంది. నయనతారను హీరోయిన్‌గా బుక్ చేయాలంటే.. ముందుగా అగ్రిమెంట్లో ఆమె పెట్టే కండిషన్లకు ఒప్పుకుని తీరాలి. అవేంటంటే... "సినిమా చేయడం వరకే నా బాధ్యత. ప్రమోషన్‌కి రాను..." ఇత్యాది కండిషన్లు ఎన్నింటినో పెడుతుంది. ఆమధ్య శరత్ కుమార్ నటించిన చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసే సందర్భంలో ప్రమోషన్ కోసం ఆమెకు పారితోషికం ఇచ్చి రప్పించారంటే నయనతార ఎంత ఖచ్చితంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక "అదుర్స్"లో నటించినా పబ్లిసిటీకి దూరమని తెలియడంతో నిర్మాతలు ఆమెను అప్రోచ్ కాలేదు. ముఖ్యంగా మీడియా సమావేశాలకు రానని చెపుతుంది. వచ్చిన దగ్గర్నుంచి వారేదో ఊహించుకుని రకరకాలుగా గాసిప్పులు తనపై రుద్దుతారని చెపుతోంది. కాస్త డల్‌గా ఉన్నా, మేకప్ సరిగా వేసుకోకపోయినా వారి ఊహల్లో విహరించి రాసుకుంటారని ఆమె అభిప్రాయమట.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jan 2010 | 4:03 am డెడ్‌లైన్లు పెడితే తెలంగాణ వస్తుందా: వీహెచ్ ప్రశ్న!డెడ్‌లైన్లు, షరతులకు తెలంగాణ వస్తుందా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఈ రోజు వస్తుంది, రేపు వస్తుందంటూ తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ప్రజలకు చెబుతూ మభ్యపెట్టి మోసం చేస్తూ వచ్చారన్నారు.Source: ఏపీ న్యూస్ | 29 Jan 2010 | 3:23 am ఆస్ట్రేలియా పర్యటనకు దూరంగా ఉండండి: ప్రణీత్ కౌర్ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత విద్యార్థులు దూరంగా ఉండాలని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ప్రణీత్ కౌర్ విజ్ఞప్తి చేశారు. ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లో నివశిస్తున్న భారతీయులపై జరుగుతున్న దాడులకు ఆ దేశ పాలకులు అడ్డుకట్ట వేయలేక పోయారు. గురువారం కూడా మరో నలుగురిపై దాడులు జరిగాయి.Source: జాతీయ | 29 Jan 2010 | 2:56 am సమైక్యాంధ్రకు విఘాతం కలిగితే రాష్ట్రం అల్లకల్లోలమే!సమైక్యాంధ్రకు ఏమాత్రం విఘాతం కలిగిన రాష్ట్రం అల్లకల్లోలం కావడం తథ్యమని సీమాంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీ శుక్రవారం హెచ్చరించింది. తెలంగాణ జేఏసీ డెడ్‌లైన్లకు కేంద్ర హోంమంత్రి పూటకొకటి చొప్పున ప్రకటన చేయడాన్ని జేఏసీ తప్పుబట్టింది.Source: ఏపీ న్యూస్ | 29 Jan 2010 | 2:56 am బీఎన్.శ్రీకృష్ణ నేతృత్వంలో తెలంగాణ త్రిసభ్య కమిటీ!తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేయనున్న కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీఎన్.శ్రీకృష్ణ నేతృత్వం వహించేందుకు సమ్మతించినట్టు కేంద్ర ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. మిగిలిన ఇద్దరు సభ్యులను జస్టీస్ శ్రీకృష్ణ ఎంపిక చేసుకుంటారు. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి రోడ్‌మ్యాప్‌తో సహా ఆరు సూత్రాల ప్రణాళికను ప్రధాని మన్మోహన్ సింగ్ ఖరారు చేసినట్టు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 29 Jan 2010 | 1:32 am మధుకోడాపై సీబీఐ విచారణ వద్దు: జార్ఖండ్ ప్రభుత్వం!వేల కోట్ల రూపాయల కుంభకోణంలో చిక్కుకున్న జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధుకోడాపై సీబీఐ విచారణ అవసరం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం జార్ఖండ్ హైకోర్టుకు తెలిపింది. చీఫ్ జస్టీస్ జ్ఞాన్ సుధా మిశ్రా నేతృత్వంలోని ధర్మాసంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒక అఫిడవిట్‌ను సమర్పించింది.Source: జాతీయ | 29 Jan 2010 | 12:37 am ముఖేష్ అంబానీపై నిప్పులు చెరిగిన శివసేన చీఫ్ థాక్రే!దేశ వాణిజ్య రాజధాని ముంబైతో పాటు చెన్నయ్, కోల్‌కతా, హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ తదితర నగరాలు భారతీయులందరికీ సొంతమని పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చేసిన వ్యాఖ్యలపై శివసేన అధినేత బాల్‌థాక్రే నిప్పులు చెరిగారు.Source: జాతీయ | 29 Jan 2010 | 12:03 am ఫిబ్రవరి 7 లోపు కమిటీ ఏర్పాటు చేయాలి: కోదండరామ్వచ్చే నెల ఏడో తేదీ లోపు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. అలా కానీ పక్షంలో ఎనిమిదో తేదీన స్పీకర్‌ను కలిసి తమ ప్రాంత ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించాలని కోరుతూ ఒత్తిడి తెస్తామని ఆయన గురువారం రాత్రి ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 28 Jan 2010 | 10:49 pm ఇక విద్యార్థులే ప్రత్యక్ష పోరాటం చేయాలి: కోదండరామ్తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మరింత జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ ప్రాంత రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. అందువల్ల విద్యార్థులు ఆత్మహత్యలను పక్కన పెట్టి ప్రత్యక్ష పోరాటానికి శ్రీకారం చుట్టాలని ఆయన పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 28 Jan 2010 | 10:33 pm డీజీపీ-సీఎంల భేటీ: మహంతికే మళ్లీ డీజీపీ కిరీటం!రాష్ట్ర డీజీపీ నియామకం చెల్లదంటూ కేంద్ర అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ (క్యాట్) వేసి మొట్టిక్కాయతో రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. చేసిన తప్పును సరిదిద్దుకునే పనుల్లో నిమగ్నమైంది. సీనియారిటినీ పక్కన పెట్టి తమకు అడుగులు మడుగులొత్తే వారిని పోలీసు బాస్‌గా నియమించడాన్ని మాజీ డీజీపీ ఎస్ఎస్పీ.యాదవ్, మరో మాజీ డీజీపీ ఏకే.మహంతిలు క్యాట్‌ను ఆశ్రయించారు.Source: ఏపీ న్యూస్ | 28 Jan 2010 | 10:33 pm ప్రజాప్రతినిధులారా.. ఇబ్బంది పెట్టొద్దు: డీఎస్ విజ్ఞప్తి!రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయవద్దని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు విజ్ఞతతో నడుచుకోవాలని ఆయన హితవు పలికారు.Source: ఏపీ న్యూస్ | 28 Jan 2010 | 10:32 pm రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయను: అమర్ సింగ్సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసినప్పటికీ.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోనని ఆ పార్టీ సీనియర్ నేత అమర్ సింగ్ తేల్చి చెప్పారు. తాను రాజ్యసభ సభ సభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేయాలని ఆయన ప్రశ్నించారు.Source: జాతీయ | 28 Jan 2010 | 10:30 pm పాక్ ఆతిథ్యం ఇచ్చే సార్క్ శిఖరాగ్ర సదస్సుకు చిదంబరం!పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనునన సార్క్ దేశాల శిఖరాగ్ర సదస్సుకు కేంద్ర హోం మంత్రి చిదంబరం హాజరుకానున్నారు. ఈ సదస్సు ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగననుంది. వచ్చే నెలలో జరిగే ఈ సదస్సుకు దక్షిణాసియా దేశాలకు చెందిన హోంమంత్రులందరూ హాజరవుతారు. దీంతో మంత్రి చిదంబరం హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు ఆ శాఖ ఉన్నతస్థాయి వర్గాల సమాచారం.Source: జాతీయ | 28 Jan 2010 | 10:30 pm ఎన్టీఆర్, ఇలియానా జంటగా అశ్వనీదత్ కొత్త చిత్రం!వి.వి.వినాయక్ కాంబినేషన్‌లో "అదుర్స్" సినిమా ద్వారా బిగ్‌హిట్ కొట్టిన నందమూరి హీరో, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ అశ్వనీదత్‌తో మరో బంపర్ హిట్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. అగ్రహీరోలతో సినిమాలు చేస్తూ, తెలివిగా సినిమా మార్కెటింగ్ చేసుకునే అశ్వనీదత్.. ఎన్టీఆర్‌తో కొత్త సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి "కంత్రి" దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వ పగ్గాలు చేపట్టనున్నారు. ఈ సినిమా షూటింగ్ గురువారం గచ్చిబౌలికి సుదూరంలో ఉన్న గోల్ఫ్‌కోర్ట్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఆరంభమైంది. అశ్వనీదత్-మెహర్ రమేష్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో గతంలో ఎన్టీఆర్-హన్సికలు జంటగా నటించిన "కంత్రి" సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: Entertainment | 28 Jan 2010 | 9:08 am ఎన్టీఆర్, ఇలియానా జంటగా అశ్వనీదత్ కొత్త చిత్రం!వి.వి.వినాయక్ కాంబినేషన్‌లో "అదుర్స్" సినిమా ద్వారా బిగ్‌హిట్ కొట్టిన నందమూరి హీరో, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ అశ్వనీదత్‌తో మరో బంపర్ హిట్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. అగ్రహీరోలతో సినిమాలు చేస్తూ, తెలివిగా సినిమా మార్కెటింగ్ చేసుకునే అశ్వనీదత్.. ఎన్టీఆర్‌తో కొత్త సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి "కంత్రి" దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వ పగ్గాలు చేపట్టనున్నారు.Source: వినోదం | 28 Jan 2010 | 6:09 am ఫిబ్రవరి ఒకటి వరకు భాగ్యనగరంలో 144 సెక్షన్రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వచ్చే నెల ఒకటో తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని నగర పోలీసు కమిషనర్ ఏకే.ఖాన్ తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు అంశంపై తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ విధించిన గడువు గురువారం సాయంత్రంతో ముగియనుంది.Source: ఏపీ న్యూస్ | 28 Jan 2010 | 6:04 am కనుచూపు మేరలోనే తెలంగాణ: ఆర్.దామోదర్ రెడ్డిప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కనుచూపు మేరలో ఉందని ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత ఆర్.దామోదర్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈ అంశంపై గురువారం కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటన పూర్తి సంతృప్తినిచ్చిందన్నారు.Source: ఏపీ న్యూస్ | 28 Jan 2010 | 5:52 am కైపెక్కించే "లుక్"కోసం రీమాసేన్ తహ తహ"యుగానికి ఒక్కడు" చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రీమాసేన్ నటనపై ప్రేక్షకులు రకరకాలుగా స్పందిస్తున్నారు. రీమా నటనకంటే బాడీ లాంగ్వేజ్ సూపర్‌గా ఉన్నదనీ, ఆకృతికి మరికాస్త పదును పెడితే మత్తెక్కిపోయే శరీర సౌష్టవం తన సొంతమవుతుందని చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు థియేటర్లో మాట్లాడుకోవడం కనిపించింది. ఈ మాటలు ఎవరో చెప్పినవి కాదు... స్వయంగా రీమాసేన్ విన్నదట. తన చిత్రం "యుగానికి ఒక్కడు" విడుదలైన రోజున హైదరాబాదులోని ఓ సినిమా హాల్‌కి వెళ్లి( మేకప్ లేకుండా) కూచుని చూసిందట. హాల్‌లో తనను ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నదట. చిత్రాన్ని చూస్తున్న ప్రేక్షకులు తన నటన సంగతి అటుంచి ఎక్కువగా తన శరీర ఆకృతిపై మాట్లాడుకోవడం విన్నదట. దీంతో తన ఆకృతిని మరింత ఆకర్షంచేలా తయారు చేసుకోవాలని కసరత్తు చేస్తోందట. మొత్తానికి బాడీ గెటప్‌తో ప్రేక్షకులను కట్టిపడేద్దామనుకుంటుందన్నమాట రీమా.Source: Yahoo! Telugu: Entertainment | 28 Jan 2010 | 5:23 am చిదంబరం ప్రకటన సంతృప్తినివ్వలేదు: ప్రొ.కోదండరామ్కేంద్ర హోం మంత్రి చిదంబరం గురువారం చేసిన ప్రకటన ఏమాత్రం సంతృప్తిని ఇవ్వలేదని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. ఈ ప్రకటన తమను పూర్తిగా నిరాశపరించిందన్నారు. ఎందుకంటే.. ఇందులో నిర్ధిష్టమైన కాలపరిమితి లేదన్నారు.Source: ఏపీ న్యూస్ | 28 Jan 2010 | 3:25 am తెలంగాణ సమస్య పరిష్కారానికి కమిటి: చిదంబరంతెలంగాణ సమస్య పరిష్కారికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోం మంత్రి చిదంబరం గురువారం ఢిల్లీలో ప్రకటించారు. ఇందుకోసం ఫిబ్రవరి మొదటి వారంలో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కమిటీలో ఉండే సభ్యుల పేర్లను ఈ వారంతంలో ఖరారు చేస్తామని తెలిపారు. ఈ అంశంపై ఆయన గురువారం ఢిల్లీలో స్పందించారు.Source: జాతీయ | 28 Jan 2010 | 3:12 am
|