|
50 శాతం పెరిగిన కెనరా బ్యాంకు లాభాలుప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు 31తో ముగిసిన తృతీయ త్రైమాసికాంతానికి తమ బ్యాంకుకు వచ్చిన లాభాలలో 50 శాతం వృద్ధి చెంది రూ. 1,052.58 కోట్లను ఆర్జించినట్లు కెనరా బ్యాంకు గురువారం బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపిందిSource: Yahoo! Telugu: News | 28 Jan 2010 | 8:31 am స్వల్పంగా పెరిగిన ద్రవ్యోల్బణంజనవరి 16తో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్బణం కాస్త పెరిగి 17.40 శాతానికి చేరుకుంది. బంగాళా దుంపలు, పప్పు దినుసుల ధరల్లో మాత్రం తగ్గుదల కనపడలేదు.Source: Yahoo! Telugu: News | 28 Jan 2010 | 7:45 am మిశ్రమ ఫలితాల్లోనే నిఫ్టీ, సెన్సెక్స్‌ల పయనంబాంబే స్టాక్ మార్కెట్ గురువారం మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 24 పాయింట్లు పతనమై, 16,265 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. కానీ నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ 14 పాయింట్ల వృద్ధితో 4,867 పాయింట్ల వృద్ధితో, 4,867 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 28 Jan 2010 | 7:41 am మిశ్రమ ఫలితాల్లో బాంబే స్టాక్ మార్కెట్బాంబే స్టాక్ మార్కెట్ గురువారం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ ప్రారంభంలో లాభాలతో పయనించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, గురువారం మధ్యాహ్నానికి మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. దీంతో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 25 పాయింట్లు పతనమై, 16,264 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. కానీ నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ 14 పాయింట్లు పుంజుకుని 4,867 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 28 Jan 2010 | 6:54 am గిరీష్ కుమార్‌ను తాత్కాలికంగా కొనసాగించండి: క్యాట్ప్రస్తుత డీజీపీ గిరీష్ కుమార్‌ను తాత్కాలిక డీజీపీగా కొనసాగించాలని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ సూచించింది. అలాగే, కొత్త డీజీపీ నియామకానికి అర్హులైన ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లతో జాబితాను పంపాలని క్యాట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత డీజీపీ ఎంపిక నిష్పక్షపాతంగా, సహజ న్యాయబద్ధంగా లేదని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది.Source: Yahoo! Telugu: News | 28 Jan 2010 | 6:21 am దక్షిణాసియాలో తగ్గనున్న నిరుద్యోగ సమస్యప్రస్తుత సంవత్సరం దక్షిణాసియాలో నిరుద్యోగ సమస్య తగ్గనుందని అంతర్జాతీయ కార్మిక సమాఖ్య (ఐఎల్ఓ) తెలిపింది. గత సంవత్సరం నిరుద్యోగ సమస్య 5.1 శాతంగా ఉండిందని, అదే ఈ సంవత్సరంలో 4.9 శాతానికి చేరుకుని నిరుద్యోగ సమస్య కాస్త తగ్గుముఖం పడుతుందని ఐఎల్ఓ ఆశాభావం వ్యక్తం చేసిందిSource: Yahoo! Telugu: News | 28 Jan 2010 | 6:21 am విద్యార్థి కుటుంబాలను వేధిస్తున్న ఖాకీలు: కోదండరామ్ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులను పోలీసులు వేధిస్తున్నారని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. దీనిపై ఆయన హైదరాబాద్‌లో గురువారం మాట్లాడుతూ.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న ఎంసీఏ విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు పోలీసులు బెదిరింపు ఫోన్‌కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు.Source: Yahoo! Telugu: News | 28 Jan 2010 | 6:20 am సెడాన్‌ను ప్రవేశపెట్టనున్న ఫోక్స్వ్యాగన్దేశీయ కార్ల మార్కెట్లోకి మరో విదేశీ కార్ల కంపెనీ అయిన ఫోక్స్‌వ్యాగన్ ఇండియా సెడాన్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుందిSource: Yahoo! Telugu: News | 28 Jan 2010 | 6:02 am రష్యా బాలికపై అత్యాచారం: అదుపులో ఇద్దరు వ్యక్తులు!గోవాలో ఎనిమిది సంవత్సరాల బాలికపై జరిగిన అత్యాచారానికి సంబంధించి స్థానిక పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. గోవా సముద్ర తీర అందాలను తిలకించేందుకు వచ్చే విదేశీ యువతులపై అత్యాచారాలు జరుగుతున్న విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 28 Jan 2010 | 5:56 am చర్చలపై చొరవ చూపని భారత్: పాక్ మంత్రి ఖురేషీభారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ కోసం భారత్ ఏమాత్రం చొరవ చూపడం లేదని పాక్ విదేశాంగ మంత్రి మొహ్మద్ ఖురేషీ ఆరోపించారు. దీనిపై ఆయన శుక్రవారం లండన్‌లో మాట్లాడుతూ సంబంధాల పునరుద్ధరణ కోసం తమతో చర్చలు జరిపేందుకు భారత్ ఏమాత్రం చొరవ చూపడం లేదన్నారు.Source: Yahoo! Telugu: News | 28 Jan 2010 | 5:42 am కైపెక్కించే "లుక్"కోసం రీమాసేన్ తహ తహ"యుగానికి ఒక్కడు" చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రీమాసేన్ నటనపై ప్రేక్షకులు రకరకాలుగా స్పందిస్తున్నారు. రీమా నటనకంటే బాడీ లాంగ్వేజ్ సూపర్‌గా ఉన్నదనీ, ఆకృతికి మరికాస్త పదును పెడితే మత్తెక్కిపోయే శరీర సౌష్టవం తన సొంతమవుతుందని చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు థియేటర్లో మాట్లాడుకోవడం కనిపించింది. ఈ మాటలు ఎవరో చెప్పినవి కాదు... స్వయంగా రీమాసేన్ విన్నదట. తన చిత్రం "యుగానికి ఒక్కడు" విడుదలైన రోజున హైదరాబాదులోని ఓ సినిమా హాల్‌కి వెళ్లి( మేకప్ లేకుండా) కూచుని చూసిందట. హాల్‌లో తనను ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నదట. చిత్రాన్ని చూస్తున్న ప్రేక్షకులు తన నటన సంగతి అటుంచి ఎక్కువగా తన శరీర ఆకృతిపై మాట్లాడుకోవడం విన్నదట. దీంతో తన ఆకృతిని మరింత ఆకర్షంచేలా తయారు చేసుకోవాలని కసరత్తు చేస్తోందట. మొత్తానికి బాడీ గెటప్‌తో ప్రేక్షకులను కట్టిపడేద్దామనుకుంటుందన్నమాట రీమా.Source: Yahoo! Telugu: Entertainment | 28 Jan 2010 | 5:23 am చిదంబరం ప్రకటన సంతృప్తినివ్వలేదు: ప్రొ.కోదండరామ్కేంద్ర హోం మంత్రి చిదంబరం గురువారం చేసిన ప్రకటన ఏమాత్రం సంతృప్తిని ఇవ్వలేదని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. ఈ ప్రకటన తమను పూర్తిగా నిరాశపరించిందన్నారు. ఎందుకంటే.. ఇందులో నిర్ధిష్టమైన కాలపరిమితి లేదన్నారు.Source: ఏపీ న్యూస్ | 28 Jan 2010 | 3:25 am తెలంగాణ సమస్య పరిష్కారానికి కమిటి: చిదంబరంతెలంగాణ సమస్య పరిష్కారికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోం మంత్రి చిదంబరం గురువారం ఢిల్లీలో ప్రకటించారు. ఇందుకోసం ఫిబ్రవరి మొదటి వారంలో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కమిటీలో ఉండే సభ్యుల పేర్లను ఈ వారంతంలో ఖరారు చేస్తామని తెలిపారు. ఈ అంశంపై ఆయన గురువారం ఢిల్లీలో స్పందించారు.Source: జాతీయ | 28 Jan 2010 | 3:12 am గిరీష్ కుమార్‌ను తాత్కాలికంగా కొనసాగించండి: క్యాట్ప్రస్తుత డీజీపీ గిరీష్ కుమార్‌ను తాత్కాలిక డీజీపీగా కొనసాగించాలని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ సూచించింది. అలాగే, కొత్త డీజీపీ నియామకానికి అర్హులైన ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లతో జాబితాను పంపాలని క్యాట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత డీజీపీ ఎంపిక నిష్పక్షపాతంగా, సహజ న్యాయబద్ధంగా లేదని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది.Source: ఏపీ న్యూస్ | 28 Jan 2010 | 1:43 am విద్యార్థి కుటుంబాలను వేధిస్తున్న ఖాకీలు: కోదండరామ్ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులను పోలీసులు వేధిస్తున్నారని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. దీనిపై ఆయన హైదరాబాద్‌లో గురువారం మాట్లాడుతూ.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న ఎంసీఏ విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు పోలీసులు బెదిరింపు ఫోన్‌కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 28 Jan 2010 | 12:51 am రష్యా బాలికపై అత్యాచారం: అదుపులో ఇద్దరు వ్యక్తులు!గోవాలో ఎనిమిది సంవత్సరాల బాలికపై జరిగిన అత్యాచారానికి సంబంధించి స్థానిక పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. గోవా సముద్ర తీర అందాలను తిలకించేందుకు వచ్చే విదేశీ యువతులపై అత్యాచారాలు జరుగుతున్న విషయం తెల్సిందే.Source: జాతీయ | 28 Jan 2010 | 12:26 am కల్తీసారా కేసులో ఐదుగురి అరెస్టు: మంత్రి బొత్సాతూర్పుగోదావరి జిల్లాలో జరిగిన కల్తీసారా కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్టు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అలాగే, ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వివరించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. గత ఆదివారం కల్తీ సారా సేవించిన అనేకమంది అస్వస్థతకు గురికాగా, వీరిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 27 Jan 2010 | 11:46 pm ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా బీహార్ బంద్!దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తు ధరలకు నిరసనగా రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇచ్చిన పిలుపు మేరకు బీహార్‌లో బంద్ సాగుతోంది. ఈ బంద్‌కు కేంద్ర మాజీ మంత్రి రాం విలాస్ ప్రాంతంలోని లోక్‌జనశక్తితో పాటు వామపక్షాలు కూడా మద్దతు ప్రకటించాయి.Source: జాతీయ | 27 Jan 2010 | 11:19 pm తరిమికొట్టే ధైర్యం మీకుందా: సీమాంధ్రుల ప్రశ్న!తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నివశిస్తున్న సీమాంధ్ర వాసులను పొలిమేర మేరకు తరిమి కొడతామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సీహెచ్.విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలపై సీమాంధ్ర నేతలతో పాటు.. ప్రజలు తీవ్రంగా స్పందించారు. అంత దమ్ముధైర్యం మీకుందా అంటూ ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 27 Jan 2010 | 11:04 pm నేటితో ముగియనున్న తెలంగాణ జేఏసీ తుది గడువు!తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) విధించిన గడువు నేటితో ముగియనుంది. 29వ తేదీ నుంచి రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయన్న అంశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైఉంది. 28వ తేదీ సాయంత్రంలోగా రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన రాకుంటే తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలంతా రాజీనామాలకు కట్టుబడి ఉండాలని జేఏసీ షరతు విధించింది.Source: ఏపీ న్యూస్ | 27 Jan 2010 | 10:53 pm దేశంలో చిన్న నేరాల కేసులు 1.74 లక్షలు: మొయిలీదేశ వ్యాప్తంగా చిన్న నేరాలకు సంబంధించి 1.74 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర న్యాయశాఖామంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. అతి చిన్నపాటి నేరాలకు పాల్పడిన నిందితుల విడుదలపై ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టులో విచారణ జరుగుతోంది. దొంగతనం, పిట్‌ప్యాకెట్, చైన్ స్నాచింగ్, దోపిడీ, చోరీలు తదితర కేసులకు సంబంధించి విచారణ కొనసాగుతోంది.Source: జాతీయ | 27 Jan 2010 | 9:56 pm అంగార గ్రహంపైకి ఉపగ్రహం పంపేందుకు ఇస్రో కృషి!మానవునికి అత్యంత నివాసయోగ్యవంతమైన అంగార గ్రహంపైకి ఉపగ్రహాన్ని పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఉపగ్రహాన్ని తయారు చేస్తోంది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ కె.రాధాకృష్ణన్ వెల్లడించారు.Source: జాతీయ | 27 Jan 2010 | 9:55 pm "గుమ్మడి"కి సినీ-రాజకీయ రంగం ఘన నివాళితెలుగు ప్రేక్షకుల మనసు దోచిన గుమ్మడి వెంకటేశ్వరరావు మంగళవారం అర్థరాత్రి 11.30 గంటలకు గుండెపోటుతో కేర్ ఆసుపత్రిలో మరణించారు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని జూబ్లిహిల్స్‌లోని పబ్లిక్ స్కూల్‌కు ఎదురుగాగల స్వగృహంలో ఉంచారు. బుధవారం రాత్రి 10 గంటలవరకూ ఇక్కడే ఉంచుతామనీ, గురువారంనాడు గుమ్మడి స్వగ్రామమైన గుంటూరు జిల్లా వేమూరు మండలం రావికంపాడు గ్రామంలో అంత్యక్రియలు జరుపనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 27 Jan 2010 | 11:56 am నేను హీరోయిన్‌గా మేకప్‌మేన్ సినిమా తీస్తానన్నాడు"నేను మొట్టమొదటి సినిమాలో నటించడంకోసంగాను మేకప్ వేసుకునేందుకు అన్నపూర్ణ స్టూడియోకు వచ్చాను. నాకు చంద్ర మేకప్ వేశారు. ఆయనను నేను బొమ్మి అని పిలుస్తాను. ( అసలు పేరు బొమ్మదేవర రామచంద్రరావు). చాలా మంచి వ్యక్తి. నటిగా ఎలా ఉండాలో చాలా జాగ్రత్తలు చెప్పారు. నాకు మేకప్ వేస్తూనే... నేను సినిమా తీస్తే మీరు హీరోయిన్‌గా నటిస్తారా... మేడమ్? అని అడిగారు. నాకు నవ్వు వచ్చింది. అసలే మొదటి సినిమా. ఆ సినిమా రిజల్ట్ తర్వాత అసలు హైదరాబాదులో ఉంటానో ఉండనో కూడా నాకు తెలీదు. అటువంటి టైమ్‌లో నన్ను పెట్టి సినిమా తీయడం అనేది ఊహించలేదు. జోక్ చేస్తున్నారనుకుని... అలాగే తప్పకుండా అని ముక్తసరిగా సమాధానం చెప్పాను. కానీ ఇన్నాళ్లకు మేకప్‌మేన్ చంద్ర నాతోనే సినిమా తీయాలనుకోవడం.. నిజంగా థ్రిల్‌గా ఉంది. ఇంకో విషయం.. చాలామంది అరుంధతి తర్వాత అనుష్క ఫేమ్‌ను క్యాష్ చేసుకుంటున్నారనే వార్తలు వినిపించాయి. అరుంథతి సినిమాకు ముందే ఈ చిత్రాన్ని చేసేదాన్ని. కానీ ఆ సమయంలో మిగిలిన సినిమాలతో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను" అని చెప్పింది అనుష్క.Source: Yahoo! Telugu: Entertainment | 27 Jan 2010 | 8:11 am శివరాత్రి కానుకగా వస్తున్న "జాయ్"అవితేజ్, త్రినాథ్‌లను హీరోలుగా... పార్వతి, వైనవిలను హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఇ.వి కుమార్ సమర్పణలో అరుణై పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ఇ.వి.వి కంభన్ నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ "జాయ్". ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని శివరాత్రి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బి.రాజా మాట్లాడుతూ... "స్నేహం, ప్రేమ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో సునీల్ క్యారెక్టర్ హైలెట్ అవుతుంది. హీరో, హీరోయిన్లు కొత్తవారైనప్పటికీ చాలా బాగా చేశారు. ఇటీవల విడుదలైన ఆడియో పెద్ద హిట్ అయింది. ఆడియో సాధించిన విజయం చిత్రంపై మా నమ్మకాన్ని మరింత పెంచింది. శివరాత్రి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న నమ్మకం నాకు ఉంది" అని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 27 Jan 2010 | 7:52 am తెలంగాణ ఉద్యమకారులు అమాయకులు : లగడపాటితెలంగాణ కోసం పోరాడుతున్న ఉద్యమకారులు నిజంగా రాజకీయ నాయకులు కాదని, వారు ఒట్టి అమాయకులని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ అన్నారు. బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో శాసనసభలో చేసిన తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 27 Jan 2010 | 7:31 am సారీ.. చిరంజీవి: గుంటూరు జిల్లా కలెక్టర్!ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి గుంటూరు జిల్లా కలెక్టర్ రామాంజనేయులు క్షమాపణ చెప్పారు. తాము వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు వస్తామని ముందుగా తెలియజేసినప్పటికీ.. కలెక్టర్ అందుబాటులో లేకుండా పోయారు. ఇది చిరంజీవికి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయనతో పాటు ప్రరాపా కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు.Source: ఏపీ న్యూస్ | 27 Jan 2010 | 5:02 am ఎమ్మెల్యేల రాజీనామాలపై ఫిబ్రవరి ఒకటిన విచారణ!ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు సంబంధించి ప్రజాప్రతినిధులు చేసిన రాజీనామాలను ఆమోదించేలా సభాపతికి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ పిటీషన్‌ను బుధవారం పరిశీలించిన సుప్రీం.. విచారణను మాత్రం వచ్చే నెల ఒకటో తేదీకి వాయిదా వేసింది.Source: జాతీయ | 27 Jan 2010 | 4:21 am ప్రభుత్వం-ఉద్యోగాల సంఘాల మధ్య "ఫిట్"మెంట్రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగాల సంఘాల మధ్య జరిగిన వేతన సవరణ (ఫిట్‌మెంట్)లు ఫలించాయి. వచ్చే ఫిబ్రవరి నెల నుంచి 39 శాతం ఫిట్‌మెంట్ అమలుకు ప్రభుత్వం సమ్మతించింది. ఫలితంగా పెరిగిన జీతంలో ఫిబ్రవరి నెల జీతాన్ని జీపీఎఫ్‌లో జమ చేస్తారు. మార్చి నెల నుంచి కొత్త జీతాన్ని చేతికి అందజేస్తారు.Source: ఏపీ న్యూస్ | 27 Jan 2010 | 4:13 am కల్తీ సారా కేసు: ఆరుగురు ఎక్సైజ్ అధికారుల సస్పెన్షన్తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన కల్తీసారా కేసులో ఆరుగురు ఎక్సైజ్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కల్తీ సారా మృతుల సంఖ్య 14కు చేరుకుంది. కల్తీ సారా తాగి అస్వస్థతకు గురైన 177 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వీరిలో మరో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.Source: ఏపీ న్యూస్ | 27 Jan 2010 | 4:07 am పాత్రలకు జీవం పోసిన 'గుమ్మడి' అంత్యక్రియలు రేపుసినిమాల్లో తనకు లభించిన పాత్రలకు జీవంపోసి ప్రత్యేకత చాటిన గుమ్మడి వెంకటేశ్వరావు (గుమ్మడి) శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ గుణచిత్ర నటుడిగా పేరు తెచ్చుకున్న గుమ్మడి మంగళవారం కన్నుమూశారు. మూత్రపిండ సంబంధింత సమస్యలతో గత ఆదివారం కేర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. ఆయనకు వైద్యులు ఎంతో మెరుగైన వైద్య సేవలు చేసినప్పటికీ.. ప్రాణాలు కపాడలేక పోయారు.Source: Yahoo! Telugu: Entertainment | 27 Jan 2010 | 3:09 am సంజయ్‌దత్ రాజీనామాను ఆమోదించిన ములాయం!పార్టీ కార్యదర్శి పదవికి బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ చేసిన రాజీనామాపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఆమోదముద్ర వేశారు. ఇప్పటికే సీనియర్ నేత అమర్ సింగ్ రాజీనామాను ఆమోదించిన ములాయం బుధవారం సంజయ్‌దత్ లేఖను కూడా ఆమోదించారు.Source: జాతీయ | 27 Jan 2010 | 2:42 am
|