తెలంగాణకు "విదర్భ" తరహా ప్రత్యేక ప్యాకేజీ!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే అంశం భవిష్యత్‌లో శాశ్వతంగా తలెత్తకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని గుర్తిస్తూనే ఆ ప్రాంతాన్ని ఇకపై అభివృద్ధిపథంలో నడిపించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 27 Jan 2010 | 8:49 am

లాభాలు పెంచుకున్న ఐడీఎఫ్‌సీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు 31తో ముగిసిన తృతీయ త్రైమాసికాంతానికి తమ సంస్థకు వచ్చిన లాభాల్లో 46 శాతం వృద్ధి చెంది 269.90 కోట్ల రూపాయలు నికర లాభాలు వచ్చినట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌మెంట్ ఫైనాన్స్ కంపెనీ (ఐడీఎఫ్‌సీ) బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపింది
Source: Yahoo! Telugu: News | 27 Jan 2010 | 8:44 am

సంజయ్‌దత్ రాజీనామాను ఆమోదించిన ములాయం!

పార్టీ కార్యదర్శి పదవికి బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ చేసిన రాజీనామాపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఆమోదముద్ర వేశారు. ఇప్పటికే సీనియర్ నేత అమర్ సింగ్ రాజీనామాను ఆమోదించిన ములాయం బుధవారం సంజయ్‌దత్‌ లేఖను కూడా ఆమోదించారు.
Source: Yahoo! Telugu: News | 27 Jan 2010 | 8:11 am

నేను హీరోయిన్‌గా మేకప్‌మేన్ సినిమా తీస్తానన్నాడు

"నేను మొట్టమొదటి సినిమాలో నటించడంకోసంగాను మేకప్ వేసుకునేందుకు అన్నపూర్ణ స్టూడియోకు వచ్చాను. నాకు చంద్ర మేకప్ వేశారు. ఆయనను నేను బొమ్మి అని పిలుస్తాను. ( అసలు పేరు బొమ్మదేవర రామచంద్రరావు). చాలా మంచి వ్యక్తి. నటిగా ఎలా ఉండాలో చాలా జాగ్రత్తలు చెప్పారు. నాకు మేకప్ వేస్తూనే... నేను సినిమా తీస్తే మీరు హీరోయిన్‌గా నటిస్తారా... మేడమ్? అని అడిగారు. నాకు నవ్వు వచ్చింది. అసలే మొదటి సినిమా. ఆ సినిమా రిజల్ట్ తర్వాత అసలు హైదరాబాదులో ఉంటానో ఉండనో కూడా నాకు తెలీదు. అటువంటి టైమ్‌లో నన్ను పెట్టి సినిమా తీయడం అనేది ఊహించలేదు. జోక్ చేస్తున్నారనుకుని... అలాగే తప్పకుండా అని ముక్తసరిగా సమాధానం చెప్పాను. కానీ ఇన్నాళ్లకు మేకప్‌మేన్ చంద్ర నాతోనే సినిమా తీయాలనుకోవడం.. నిజంగా థ్రిల్‌గా ఉంది. ఇంకో విషయం.. చాలామంది అరుంధతి తర్వాత అనుష్క ఫేమ్‌ను క్యాష్ చేసుకుంటున్నారనే వార్తలు వినిపించాయి. అరుంథతి సినిమాకు ముందే ఈ చిత్రాన్ని చేసేదాన్ని. కానీ ఆ సమయంలో మిగిలిన సినిమాలతో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను" అని చెప్పింది అనుష్క.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Jan 2010 | 8:11 am

17 శాతం లాభాలు పెంచుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు 31తో ముగిసిన తృతీయ త్రైమాసికాంతానికి తమ బ్యాంకుకు వచ్చిన లాభాలలో 17 శాతం వృద్ధి చెంది రూ. 832.49 కోట్లకు చేరుకున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా బుధవారం నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌‍కు తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 27 Jan 2010 | 8:04 am

శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు: రాజపక్సే ఘన విజయం

శ్రీలంక అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు మహీందా రాజపక్సే ఘన విజయం సాధించారు. దీంతో ఆయన వరుసగా రెండోసారి శ్రీలంక అధ్యక్ష స్థానంలో మరో ఐదు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. పోలైన మొత్తం ఓట్లలో రాజపక్సే దాదాపు 60 శాతం ఓట్లను కైవసం చేసుకోవడం గమనార్హం.
Source: Yahoo! Telugu: News | 27 Jan 2010 | 7:58 am

భారీ నష్టాల దిశగా బాంబే స్టాక్ మార్కెట్

బాంబే స్టాక్ మార్కెట్ భారీ నష్టాల దిశగా ర్యాలీని కొనసాగిస్తోంది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే భారీగా క్షీణించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో 438 పాయింట్లు పతనమైంది. దీంతో సెన్సెక్స్ సూచీ 16,341 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 145 పాయింట్లు భారీగా కోల్పోయి, 4,863 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 27 Jan 2010 | 7:52 am

రెండు వేల మందిని నియమించనున్న ఒరేకల్

తమ సంస్థకు చెందిన సేల్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో దాదాపు రెండు వేల మందిని కొత్తగా నియమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుందని సాఫ్ట్‌వేర్ నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న ఒరేకల్ కార్ప్ చీఫ్ ఎగ్జెక్యూటివ్ లార్రీ ఎల్లిసన్ ఓ ప్రకటనలో తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 27 Jan 2010 | 7:52 am

శివరాత్రి కానుకగా వస్తున్న "జాయ్"

అవితేజ్, త్రినాథ్‌లను హీరోలుగా... పార్వతి, వైనవిలను హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఇ.వి కుమార్ సమర్పణలో అరుణై పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ఇ.వి.వి కంభన్ నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ "జాయ్". ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని శివరాత్రి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బి.రాజా మాట్లాడుతూ... "స్నేహం, ప్రేమ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో సునీల్ క్యారెక్టర్ హైలెట్ అవుతుంది. హీరో, హీరోయిన్లు కొత్తవారైనప్పటికీ చాలా బాగా చేశారు. ఇటీవల విడుదలైన ఆడియో పెద్ద హిట్ అయింది. ఆడియో సాధించిన విజయం చిత్రంపై మా నమ్మకాన్ని మరింత పెంచింది. శివరాత్రి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న నమ్మకం నాకు ఉంది" అని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Jan 2010 | 7:52 am

మాంద్యం నుంచి గట్టెక్కాం : బ్రిటన్‌

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా పలు దేశాల్లోని వ్యాపార రంగాలు అతలాకుతలమైనాయి. ఇందులో భాగంగా బ్రిటన్‌లోను పలు ఆర్థిక సంస్థలు మాంద్యాన్ని చవిచూసాయి. రెండో ప్రపంచ యుద్ధం తరువాతి కాలంలో బ్రిటన్‌ చవిచూసిన అతి ఘోరమైన మాంద్యం నుంచి గట్టెక్కినట్లు అధికారికంగా ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 27 Jan 2010 | 7:35 am

అమ్మకపు ఒత్తిడి: భారీగా క్షీణించిన సెన్సెక్స్

దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ భారీగా క్షీణించింది. దీంతో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. 363 పాయింట్లు భారీగా పతనమై, 16,417 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 133 పాయింట్లు భారీగా కోల్పోయి, 4,874 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 27 Jan 2010 | 6:50 am

యూఏఈ కీలక నిర్ణయం: లింగ నిర్ధారణకు అనుమతి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది. లింగ నిర్ధారణ పరీక్షలకు అనుమతి ఇచ్చింది. భారత్, చైనా వంటి దేశాల్లో ఈ తరహా పరీక్షలపై నిషేధం ఉన్న విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 27 Jan 2010 | 6:49 am

పాత్రలకు జీవం పోసిన 'గుమ్మడి' అంత్యక్రియలు రేపు

సినిమాల్లో తనకు లభించిన పాత్రలకు జీవంపోసి ప్రత్యేకత చాటిన గుమ్మడి వెంకటేశ్వరావు (గుమ్మడి) శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ గుణచిత్ర నటుడిగా పేరు తెచ్చుకున్న గుమ్మడి మంగళవారం కన్నుమూశారు. మూత్రపిండ సంబంధింత సమస్యలతో గత ఆదివారం కేర్‌ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. ఆయనకు వైద్యులు ఎంతో మెరుగైన వైద్య సేవలు చేసినప్పటికీ.. ప్రాణాలు కపాడలేక పోయారు.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Jan 2010 | 3:09 am

సంజయ్‌దత్ రాజీనామాను ఆమోదించిన ములాయం!

పార్టీ కార్యదర్శి పదవికి బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ చేసిన రాజీనామాపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఆమోదముద్ర వేశారు. ఇప్పటికే సీనియర్ నేత అమర్ సింగ్ రాజీనామాను ఆమోదించిన ములాయం బుధవారం సంజయ్‌దత్‌ లేఖను కూడా ఆమోదించారు.
Source: జాతీయ | 27 Jan 2010 | 2:42 am

'గుమ్మడి'కి పలువురు నేతల నివాళులు!

అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచిన సినీ నటుడు గుమ్మడి వెంకటేశ్వర రావుకు ముఖ్యమంత్రి కె.రోశయ్యతో సహా పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు నివాళులు అర్పించారు. గుమ్మడి అంత్యక్రియలు గురువారం హైదరాబాద్‌లో జరుగనున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 27 Jan 2010 | 1:57 am

ఆ భేటీలో రాజకీయ పరమార్థం లేదు: మంత్రి వాసన్

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయరాం జయలలిత భేటీ కావడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని కేంద్ర షిప్పింగ్ శాఖామంత్రి జీకే.వాసన్ స్పష్టం చేశారు. ఇద్దరు రాజకీయ నేతల ఎలా భేటీ అవుతారో అలాగే వీరిద్దరు సమావేశమయ్యారని చెప్పారు.
Source: జాతీయ | 27 Jan 2010 | 1:01 am

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం కబురు!

తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు తక్షణం ఢిల్లీకి రావాల్సిందిగా అధిష్టానం కబురు పంపింది. దీంతో ఎమ్మెల్యేలు కె.జానారెడ్డి, ఆర్.దామోదర్ రెడ్డిలు బుధవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నాం ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 27 Jan 2010 | 12:23 am

కర్ణాటకలో కూలిన భవనం: నలుగురి దుర్మరణం!

కర్ణాటక రాష్ట్రంలో ఒక భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. నిర్మాణంలో ఐదు అంతస్తుల భవనం పక్కనే ఉన్న హాస్టల్‌పై కుప్పకూలి పోయిందని పోలీసులు తెలిపారు. బళ్ళారిలోని గాంధీనగర్ అనే ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు వారు తెలిపారు.
Source: జాతీయ | 26 Jan 2010 | 11:51 pm

'తెలంగాణ'లో పర్యటనపై వెనకడుగు లేదు: చిరంజీవి

సమైక్యాంధ్ర కోసం తెలంగాణ జిల్లాల్లో కూడా ఉద్యమాలు చేయనున్నట్టు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రకటించారు. ఇందుకోసం తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో పర్యటనకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన బుధవారం ప్రకటించారు. గుంటూరు జిల్లా పర్యటన కోసం ఆయన బుధవారం ఇక్కడకు వచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jan 2010 | 11:12 pm

కాంగ్రెస్ హుకుం: రాజీనామాలకు 'హస్తం' నేతల దూరం!

కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించింది. రాజీనామాలు తక్షణం ఉపసంహరించుకోవాలని హుకుం జారీ చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇదే జరిగితే మీ లక్ష్యం నెరవేరేందురు మరింత జాప్యం అవుతుందని స్పష్టం చేసింది.
Source: ఏపీ న్యూస్ | 26 Jan 2010 | 10:50 pm

"రాహుల్ గాంధీ"పై బిల్‌గేట్స్ ప్రశంసల వర్షం!

కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీపై మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బిల్‌గేట్స్ ప్రశంసల వర్షం కురిపించారు. కొత్త తరం రాజకీయాల్లో రాహుల్ గాంధీ ఒకరని బిల్‌గేట్స్ కొనియాడారు. మనసులో ఒకటుంచుకొని, పైకొకటి మాట్లాడకుండా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి రాహుల్‌గాంధీ అని బిల్‌గేట్స్‌ అన్నారు. భారత దేశానికి "గాంధీ" కుటుంబం చేస్తున్న కృషి ఎనలేనిదని ఆయన చెప్పారు.
Source: జాతీయ | 26 Jan 2010 | 9:04 pm

బళ్లారిలో కుప్పకూలిన భవనం: 30 మంది మృతి?

కర్ణాటకలోని బళ్లారిలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. బళ్లారిలో నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం కుప్పకూలడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటనలో మరో 30 మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు వార్తలొస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వీరిలో ఎక్కువ మంది మరణించి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Source: జాతీయ | 26 Jan 2010 | 8:54 pm

ధరల పెరుగుదలతో పేదల అవస్థలు: ఎల్కే.అద్వానీ

ద్రవ్యోల్బణ సూచీ పెరుగుదల కారణంగా నిత్యావసర వస్తు ధరలు రోజురోజుకూ ఆకాశానికి తాకుతున్నాయని, దీనివల్ల పేద ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని భారతీయ జనతా పార్లమెంటరీ పార్టీ ఛైర్మన్ ఎల్కే.అద్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. భారత 60వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఢిల్లోలోని తన నివాసంలో ఆయన మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.
Source: జాతీయ | 26 Jan 2010 | 5:20 am

'టి' ఉద్యమానికి మావోలు మద్దతిస్తే తప్పేంటి: కడియం

తెలంగాణ ఉద్యమానికి మావోయిస్టుల మద్దతు ఇస్తే తప్పేమిటని ఆ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఇప్పటికే ఈ ఉద్యమానికి న్యూ డెమొక్రసీతో పాటు పలు విప్లవ సంఘాలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jan 2010 | 4:52 am

ప్రకటన రాకుంటే సివిల్ వార్ తప్పదు: హరీష్ రావు

తెలంగాణకు అనుకూలంగా ఈనెల 29వ తేదీలోగా ప్రకటన చేయకుంటే సివిల్ వార్ తప్పదని తెలగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు జోస్యం చెప్పారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 28వ తేదీలోగా తెంలగాణ ప్రాంత ప్రజాప్రతినిధులందరూ రాజీనామా చేయాల్సిందేనని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jan 2010 | 4:29 am

ముంబై ఎయిర్‌పోర్టులో తృటిలో తప్పిన పెను ప్రమాదం!

దేశ వాణిజ్య రాజధాని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఇరాక్‌కు చెందిన విమానమొకటి ఎయిర్‌పోర్టు మంగళవారం రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా, టైర్ పేలిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన పైలట్ అప్రమత్తంగా, చాకచక్యంగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో విమానంలో వంద మంది ప్రయాణికులు ఉన్నారు.
Source: జాతీయ | 26 Jan 2010 | 3:03 am

తెలుగు జాతి ఐక్యంగా ఉండాలి: 'గజల్ మాస్ట్రో' శ్రీనివాస్

ఈ భూమి ఉన్నంత వరకు తెలుగుజాతి యావత్ ఐక్యంగా కలిసి మెలిసి ఉండాలన్నదే తన అభిమతమని గజల్ మాస్ట్రో డాక్టర్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినేనని చెప్పారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ అంశంపై లోతుగా మాట్లాడటం ఇష్టంలేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jan 2010 | 2:29 am