|
ఆస్ట్రేలియాలో ఘనంగా 60వ గణతంత్ర వేడుకలు!ఆస్ట్రేలియాలో భారత 60వ గణతంత్ర వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఆ దేశ రాజధాని కాన్‌బెర్రాలో జరిగిన ఈ వేడుకల్లో భారత హైకమిషనర్ సుజాతా సింగ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సందేశాన్ని ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులకు చదివి వినిపించారు.Source: Yahoo! Telugu: News | 26 Jan 2010 | 8:28 am ముంబై ఎయిర్‌పోర్టులో తృటిలో తప్పిన పెను ప్రమాదం!దేశ వాణిజ్య రాజధాని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఇరాక్‌కు చెందిన విమానమొకటి ఎయిర్‌పోర్టు మంగళవారం రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా, టైర్ పేలిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన పైలట్ అప్రమత్తంగా, చాకచక్యంగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో విమానంలో వంద మంది ప్రయాణికులు ఉన్నారు.Source: Yahoo! Telugu: News | 26 Jan 2010 | 8:15 am తెలుగు జాతి ఐక్యంగా ఉండాలి: 'గజల్ మాస్ట్రో' శ్రీనివాస్ఈ భూమి ఉన్నంత వరకు తెలుగుజాతి యావత్ ఐక్యంగా కలిసి మెలిసి ఉండాలన్నదే తన అభిమతమని గజల్ మాస్ట్రో డాక్టర్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినేనని చెప్పారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ అంశంపై లోతుగా మాట్లాడటం ఇష్టంలేదన్నారు.Source: Yahoo! Telugu: News | 26 Jan 2010 | 7:58 am ఇకపై.. కొత్త ఛానల్స్‌కు అనుమతి లేదు: కేంద్రంఈ యేడాది కొత్త టీవీ ఛానల్స్‌కు కేంద్రం అనుమతి నిరాకరించనుంది. ప్రస్తుతం దేశంలో ప్రైవేటు టీవీ ఛానల్స్ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. దీంతో కొత్త ఛానల్స్‌కు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పింది.Source: Yahoo! Telugu: News | 26 Jan 2010 | 6:31 am అధిష్టానం ఆదేశాలు.. టి కాంగ్రెస్ నేతల ఢిల్లీ యాత్ర రద్దు!రాష్ట్రానికి కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి ఎవరూ ఢిల్లీకి రావొద్దని కోరినట్టు సమాచారం. అందుకే తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు తమ ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు.Source: Yahoo! Telugu: News | 26 Jan 2010 | 6:23 am విభేదాలు వద్దు.. సోదరభావంతో మెలగండి: గవర్నర్రాష్ట్ర ప్రజలు ఎలాంటి విభేదాలు లేకుండా సోదరభావంతో మెలగాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ సూచించార. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం జరిగిన 60వ గణతంత్ర దినోత్సవ వేడులకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి రోశయ్య, మంత్రులు, ఇతర అధికారులు హాజరయ్యారు.Source: Yahoo! Telugu: News | 26 Jan 2010 | 6:09 am సరిహద్దుల్లో పాక్ సొరంగాలపై ఆరా: మంత్రి ఎస్ఎం.కృష్ణసరిహద్దులకు సమీపంలో పాకిస్థాన్ తవ్వుతున్న భారీ సొరంగాలపై కేంద్ర రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలు ఆరా తీస్తున్నాయని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ఎం.కృష్ణ తెలిపారు. వీటివల్ల భారత్‌కు ఏమైనా హాని కలుగుతుందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతామని చెప్పారు.Source: Yahoo! Telugu: News | 26 Jan 2010 | 5:55 am బంగ్లాదేశ్‌కు భూటాన్ ఆరంజ్ పండ్ల ఎగుమతి!బంగ్లాదేశ్‌కు భూటాన్ ఆరంజ్ పండ్లను ఎగుమతి చేయనుంది. మేఘాలయ మీదుగా ఈ పండ్లను ఎగుమతి చేసేలా కేంద్ర ప్రభుత్వంతో భూటాన్ అధికారులు ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్టు భూటాన్ అధికారులు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 26 Jan 2010 | 5:21 am మధ్యధరా సముద్రం నుంచి 34 మృతదేహాల వెలికితీతమధ్యధరా సముద్రంలో కూలిపోయిన ఇథియోపియా విమాన శకలాల నుంచి ఇప్పటి వరకు 34 మృతదేహాలను వెలికి తీసినట్టు బీరుట్ అధికారులు వెల్లడించారు. మిగిలిన శవాల కోసం సముద్రంలో గాలిస్తున్నట్టు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 26 Jan 2010 | 5:03 am మరో ఇద్దరు భారతీయ విద్యార్థులపై దాడులు!ఆస్ట్రేలియాలో మరో ఇద్దరు విద్యార్థులపై దాడులు జరిగాయి. ఈ ఇద్దరు విద్యార్థులపై ఒక ముఠా దాడులకు తెగబడినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. మెల్‌బోర్న్‌లోని యర్రావిల్లేలో నితిన్ గార్గ్ అనే విద్యార్థిపై మూడు వారాల క్రితం దాడి జరిగిన విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 26 Jan 2010 | 4:47 am ముంబై ఎయిర్‌పోర్టులో తృటిలో తప్పిన పెను ప్రమాదం!దేశ వాణిజ్య రాజధాని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఇరాక్‌కు చెందిన విమానమొకటి ఎయిర్‌పోర్టు మంగళవారం రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా, టైర్ పేలిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన పైలట్ అప్రమత్తంగా, చాకచక్యంగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో విమానంలో వంద మంది ప్రయాణికులు ఉన్నారు.Source: జాతీయ | 26 Jan 2010 | 3:03 am తెలుగు జాతి ఐక్యంగా ఉండాలి: 'గజల్ మాస్ట్రో' శ్రీనివాస్ఈ భూమి ఉన్నంత వరకు తెలుగుజాతి యావత్ ఐక్యంగా కలిసి మెలిసి ఉండాలన్నదే తన అభిమతమని గజల్ మాస్ట్రో డాక్టర్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినేనని చెప్పారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ అంశంపై లోతుగా మాట్లాడటం ఇష్టంలేదన్నారు.Source: ఏపీ న్యూస్ | 26 Jan 2010 | 2:29 am అధిష్టానం ఆదేశాలు.. టి కాంగ్రెస్ నేతల ఢిల్లీ యాత్ర రద్దు!రాష్ట్రానికి కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి ఎవరూ ఢిల్లీకి రావొద్దని కోరినట్టు సమాచారం. అందుకే తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు తమ ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 26 Jan 2010 | 12:54 am విభేదాలు వద్దు.. సోదరభావంతో మెలగండి: గవర్నర్రాష్ట్ర ప్రజలు ఎలాంటి విభేదాలు లేకుండా సోదరభావంతో మెలగాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ సూచించార. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం జరిగిన 60వ గణతంత్ర దినోత్సవ వేడులకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి రోశయ్య, మంత్రులు, ఇతర అధికారులు హాజరయ్యారు.Source: ఏపీ న్యూస్ | 26 Jan 2010 | 12:39 am సరిహద్దుల్లో పాక్ సొరంగాలపై ఆరా: మంత్రి ఎస్ఎం.కృష్ణసరిహద్దులకు సమీపంలో పాకిస్థాన్ తవ్వుతున్న భారీ సొరంగాలపై కేంద్ర రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలు ఆరా తీస్తున్నాయని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ఎం.కృష్ణ తెలిపారు. వీటివల్ల భారత్‌కు ఏమైనా హాని కలుగుతుందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతామని చెప్పారు.Source: జాతీయ | 26 Jan 2010 | 12:25 am భాగ్యనగరంలో ప్రరాపా అధినేత సమైక్యాంధ్ర యాత్ర!రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రజారాజ్యం పార్టీ అధ్వర్యంలో సమైక్యాంధ్ర యాత్ర సాగనుంది. ఈ యాత్రను ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి నాయకత్వం వహిస్తారని ఆ పార్టీ మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభారాణి తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 25 Jan 2010 | 10:29 pm తెలంగాణపై ఏకాభిప్రాయమే శరణ్యం: మంత్రి మొయిలీఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సున్నితమైన, జఠిలమైన తెలంగాణ సమస్య పరిష్కారానికి ఏకైక మార్గమే శరణ్యమని కేంద్ర న్యాయ శాఖామంత్రి, రాష్ట్ర వ్యవరాహాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. దీనిపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయ జేఏసీ విధించిన డెడ్‌లైన్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 25 Jan 2010 | 10:09 pm వివాదంలో చిక్కుకున్న కేంద్ర మంత్రి శరద్ పవార్!సౌమ్యుడిగా మంచి పేరున్న కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖామంత్రి ఎన్.శరద్ పవార్ వివాదంలో చిక్కుకున్నారు. యూపీఏ ప్రభుత్వంలో ఉంటూనే.. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌పై విమర్శలు చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆయనకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనికి తోడు నిత్యావసర వస్తు ధరల పెరుగుదలకు కళ్లెం వేయలేక పోయారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి.Source: జాతీయ | 25 Jan 2010 | 9:58 pm పటిష్ట బందోబస్తు నడుమ గణతంత్ర దినోత్సవ వేడుకలుదేశవ్యాప్తంగా 61వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో.. పటిష్ట బందోబస్తు నడుమ వేడుకలు జరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. నగరంలోని పలు ముఖ్య ప్రాంతాల్లో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. ఇకపోతే... ఎర్రకోటలో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. ఎర్రకోట, విజయ్ చౌక్ ప్రాంతాల్లో 15వేల భద్రతా సిబ్బంది, సైనికుల కనుసన్నల్లో రిపబ్లిక్ డే వేడుకలు ముగిశాయి.Source: జాతీయ | 25 Jan 2010 | 9:00 pm చెప్పటానికేముంది... మీరే ఏదో ఒకటి రాసుకోండి: రవితేజరేపు... అంటే జనవరి 26వ తేదీ విలక్షణ హీరో రవితేజ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనను ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగితే... నా గురించి ఇంకా చెప్పేదేముందండీ... ఏదో ఒకటి మీరే రాసుకోండి అని నవ్వుతూ చెప్పారు. ఇకపోతే రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో నిర్మించే చిత్రాలన్నీ అదే రోజున( జనవరి 26)షూటింగ్ మొదలెట్టేందుకు నిర్మాతలు పోటీపడ్డారు. ఈ క్రమంలో రవితేజ "డాన్ శీను" ప్రారంభమైంది. ఈ చిత్రంలో డాన్ శీనుగా రవితేజ నటిస్తున్నారు. ఈ చిత్రం సోమవారంనాడు రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. రవితేజ, శ్రీహరిలపై తొలి సన్నివేశం తీశారు. జూనియర్ ఎన్టీఆర్ క్లాప్ కొట్టగా, డి. రామానాయుడు కెమేరా స్విచ్చాన్ చేశారు. వినాయక్ ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు.Source: Yahoo! Telugu: Entertainment | 25 Jan 2010 | 11:03 am ఆసుపత్రిలో గుమ్మడి వెంకటేశ్వరరావుగత కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న సీనియర్ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే జూబ్లిహిల్స్‌లోని మోహన్ బాబు ఇంటి సమీపానగల కేర్ ఆసుపత్రికి తరలించారు. గతంలో ఆయన పక్షవాతానికి గురయ్యారు. అప్పుడు గొంతుకూడా పనిచేయలేదు. అప్పట్లో ఆయన నటించిన కొన్ని చిత్రాలకు డబ్బింగ్ చెప్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం గురించి కేర్ డాక్టర్లు భయపడాల్సింది ఏమీ లేదనీ, కోలుకుంటారని కుటుంబ సభ్యులకు చెప్పారు. కాగా ఈనెల 30న విడుదల కానున్న నాటి సూపర్ హిట్ చిత్రం "మాయాబజార్"లో గుమ్మడి ప్రధాన పాత్ర పోషించారు.Source: Yahoo! Telugu: Entertainment | 25 Jan 2010 | 9:43 am లతా మంగేష్కర్‌కు అక్కినేని అవార్డుఐదవ అక్కినేని నాగేశ్వరరావు ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అవార్డును ఈ ఏడాదికి గాను ప్రముఖ గాయని లతామంగేష్కర్‌కు ఇవ్వనున్నారు. ఫౌండేషన్ ఛైర్మన్ అక్కినేని నాగేశ్వరరావు సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన... "ఇప్పటికే ఆమెకు ఈ అవార్డు ఇవ్వాల్సి ఉండగా అనారోగ్యరీత్యా ఆమె బయటకు రాకపోవడంతో అప్పుడు ఇవ్వలేకపోయాం. ఈసారి కూడా ఈనెల 31న ఆమె తిరుపతి వస్తున్నారు. అటునుంచి హైదరాబాద్ వచ్చి తాజ్ కృష్ణలో బస చేయనున్నారు. అందుకే ఫిబ్రవరి 1న ఆమెకు అవార్డులు ప్రదానం చేయనున్నామ"ని చెప్పారు.ప్రతి రంగంలోని వారికి ఈ అవార్డు ఇవ్వాలన్నది తమ ఉద్దేశ్యమని అక్కినేని చెప్పారు. అవార్డు కమిటీ ఛైర్మన్ టి.సుబ్బరామిరెడ్డి, కమిటీ సభ్యులుగా డాక్టర్ డి. రామానాయుడు, బోనీకపూర్ ఉన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 25 Jan 2010 | 9:30 am విచ్చలవిడిగా నమిత భారీ అందాలు...అబ్బే నేను స్కిన్ షో చేయనంటూ ప్రకటించిన నమిత తాజాగా తన భారీ అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తూ ఓ చిత్రంలో నటించింది. "బ్లాక్ స్టాలిన్" పేరుతో రెడీ అవుతున్న ఈ మలయాళ చిత్రంలో ఆమె మాజీ సెక్స్ బాంబ్ షకీలాను మించిపోయిందనే వార్తలు వినబడుతున్నాయి. ఇందులో క్లబ్ డాన్సర్‌గా నమిత నటించింది. హీరో "బ్లాక్ స్టాలిన్"తో వేడి వేడి బెడ్‌రూమ్ సీన్స్, మరో హీరో కళాభవన్ మణితో స్విమ్ సూట్ సరదాలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. పబ్లిసిటీతో హోరెత్తిన ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగులో ఇద్దరు మొనగాళ్లు పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా పోసాని కృష్ణ మురళికి జోడీగా "మిస్ చింతామణి ఎంఏ"లో నటించేందుకు నమిత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆల్రెడీ ముమైత్‌ను ఆపరేషన్ దుర్యోధనలో విపరీతంగా ఎక్స్‌పోజింగ్ చేయించిన పోసాని ఈ చిత్రంలో అంతకంటే ఎక్కువ చేయించనున్నాడని సమాచారం. ఇకపోతే బాలయ్య చిత్రం సింహాలో గ్లామర్ పాత్ర పోషిస్తోంది నమిత.Source: Yahoo! Telugu: Entertainment | 25 Jan 2010 | 7:54 am పూలన్‌దేవి కంటే కేసీఆర్ ఓ నరహంతకుడు: వెంకటేష్తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఓ నరహంతకునితో సమానమని రాయలసీమ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ టి.జి.వెంకటేశ్ ఆరోపించారు. దీనిపై ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ తాను, తన కుటుంబ స్వార్థం కోసం అమాయుకులైన విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంటున్నాడని దుయ్యబట్టారు.Source: ఏపీ న్యూస్ | 25 Jan 2010 | 6:54 am బికినీ వేసుకోవడం పెద్ద డీల్ కాదు...: విమలా రామన్"ఎవరైనా ఎప్పుడైనా" అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బ్యూటీ విమలా రామన్ గరం గరంగా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని అంటోంది. తను నటిస్తున్న తాజా చిత్రంలో బికినీ వేసుకుని నటించడంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... విదేశాలలో పెరిగిన ఓ అమ్మాయి సంప్రదాయ దుస్తులు వేసుకుంటుందని ఎలా అనుకుంటున్నారూ...? అని ఎదురు ప్రశ్నిస్తోంది. మోడ్రన్ డ్రెస్సులే కాదు... తన దృష్టిలో బికినీ వేసుకోవడం కూడా పెద్ద డీల్ కాదని కొట్టి పారేస్తోంది. మరి ఎటువంటి దుస్తులు ధరించి నటిస్తే పెద్ద విషయమనుకుంటుందో ఈసారి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం తను దక్షిణాది భాషా చిత్రాలన్నిటిలో నటిస్తున్నానని సంబరంగా చెపుతోంది విమలా రామన్. ముఖ్యంగా కన్నడ భాషలో తను చేస్తున్న పాత్రకు ఖచ్చితంగా అవార్డు వస్తుందని చెపుతోంది. మరి తెలుగులో కూడా అవార్డు దక్కించే పాత్రలే చేయొచ్చు కదా... బికినీలతో నటించడం ఎందుకో...?!!Source: Yahoo! Telugu: Entertainment | 25 Jan 2010 | 6:28 am ఆరు పద్మ అవార్డులను కైవసం చేసుకున్న ఆంధ్రులు!గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని కేంద్రం సోమవారం ప్రకటించిన అవార్డుల్లో మన రాష్ట్రానికి చెందిన ప్రముఖుల హవా కొనసాగింది. ఏకంగా ఆరుగురు విశిష్ట ప్రముఖులు పద్మ అవార్డులను కైవసం చేసుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 25 Jan 2010 | 6:20 am ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్న నేతలుప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ కొందరు రాజకీయ నాయకులు అవలంభిస్తున్న తప్పుడు విధానాల వల్ల అపహాస్యం అవుతోందని దేశాధినేతలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం వజ్రోత్సవాలను గురువారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ప్రసంగించారు. ఇందులో రాజకీయ నేతలు అనుసరిస్తున్న విధానాలను పలువురు తప్పుబట్టారు.Source: జాతీయ | 25 Jan 2010 | 5:58 am దిగిపోండి.. మళ్లీ గెలిపించుకుంటాం: కోదండరామ్ప్రత్యేక తెలంగాణా సాధనకు తెలంగాణా ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులందరూ మూకుమ్మడిగా రాజీనామా చేయాలని తెలంగాణా జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. తెలంగాణాకోసం తమ పదవులను త్యాగం చేసిన నాయకులను తిరిగి ఏకగ్రీవంగా ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎన్నుకునేటట్లు చూస్తామని అన్నారు.Source: ఏపీ న్యూస్ | 25 Jan 2010 | 5:52 am "పద్మ" అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం!2010 సంవత్సరం బాలీవుడ్‌కు బాగా కలిసి వస్తోందనే చెప్పొచ్చు. బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా జాతీయ అవార్డును కైవసం చేసుకుని 24 గంటలు కూడా పూర్తికాకముందే మరో స్టార్ అమీర్‌ఖాన్ పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు.Source: జాతీయ | 25 Jan 2010 | 5:47 am తెలంగాణ ఉద్యమాన్ని తప్పుబట్టడం విచారకరం: జీవన్తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాలుగు కోట్ల ప్రజానీకం చేస్తున్న ఉద్యమాన్ని తప్పుబట్టడాన్ని ఆ ప్రాంత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి ఖండించారు. ముఖ్యంగా, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు చేపట్టిన ఉద్యమాన్ని మావోయిస్టులతో పోల్చడం దురదృష్టకరంగా అభివర్ణించారు.Source: ఏపీ న్యూస్ | 25 Jan 2010 | 3:43 am సురక్షిత స్థావరం కోసం గాలిస్తున్న శిబూ సోరేన్!జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శిబూ సోరేన్ పరిస్థితి "వింతొక రోత.. పాతొక కొత్త" అనే సామెతగా మారింది. ఒక స్థానంలో పోటీ చేస్తే ఓడిపోతామనే భయం.. రెండు స్థానాల్లో పోటీ చేస్తే పరువు పోతుందనే పరిస్థితుల మధ్య ఆయన కొట్టుమిట్టాడుతున్నాడు.Source: జాతీయ | 25 Jan 2010 | 3:42 am వేణుగోపాల్ రెడ్డి మృతిపై దర్యాప్తు పూర్తి: పోలీసులుఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆత్మహత్యకు పాల్పడిన ఎంసీఏ విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి మృతిపై సీసీఎస్ చేపట్టిన విచారణ పూర్తయింది. దీనిపై ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు హైదరాబాద్ నగర పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 25 Jan 2010 | 2:39 am
|