తెలంగాణ ఉద్యమాన్ని తప్పుబట్టండం విచారకరం: జీవన్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాలుగు కోట్ల ప్రజానీకం చేస్తున్న ఉద్యమాన్ని తప్పుబట్టడాన్ని ఆ ప్రాంత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి ఖండించారు. ముఖ్యంగా, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు చేపట్టిన ఉద్యమాన్ని మావోయిస్టులతో పోల్చడం దురదృష్టకరంగా అభివర్ణించారు.
Source: Yahoo! Telugu: News | 25 Jan 2010 | 8:52 am

లాభాల బాటలో మారుతీ సుజుకీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు 31తో ముగిసిన తృతీయ త్రైమాసికాంతానికి తమ సంస్థకు చెందిన కార్ల అమ్మకాలలో వృద్ధి జరిగి రూ. 687. 53 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్లు మారుతీ సుజుకీ సీఎఫ్ఓ అజయ్ సేథ్ మీడియాకు వివరించారు.
Source: Yahoo! Telugu: News | 25 Jan 2010 | 8:22 am

వేణుగోపాల్ రెడ్డి మృతిపై దర్యాప్తు పూర్తి: పోలీసులు

ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆత్మహత్యకు పాల్పడిన ఎంసీఏ విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి మృతిపై సీసీఎస్ చేపట్టిన విచారణ పూర్తయింది. దీనిపై ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు హైదరాబాద్ నగర పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 25 Jan 2010 | 8:08 am

పూలన్‌దేవి కంటే కేసీఆర్ ఓ నరహంతకుడు: వెంకటేష్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఓ నరహంతకునితో సమానమని రాయలసీమ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ టి.జి.వెంకటేశ్ ఆరోపించారు. దీనిపై ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ తాను, తన కుటుంబ స్వార్థం కోసం అమాయుకులైన విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంటున్నాడని దుయ్యబట్టారు.
Source: Yahoo! Telugu: News | 25 Jan 2010 | 8:01 am

నష్టాలతో కొనసాగుతోన్న విదేశీ మార్కెట్లు

సోమవారం బాంబే స్టాక్ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లు నష్టాలతో కూరుకుపోయాయి. అమెరికా మార్కెట్‌తో పాటు యూరప్, ఆసియా మార్కెట్లు తిరోగమనంలో ర్యాలీని కొనసాగిస్తున్నాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఆశాజనకంగా కొనసాగని అంతర్జాతీయ మార్కెట్లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.00 గంటల ప్రాంతంలో భారీ నష్టాలను నమోదు చేసుకున్నాయి.
Source: Yahoo! Telugu: News | 25 Jan 2010 | 7:58 am

విచ్చలవిడిగా నమిత భారీ అందాలు...

అబ్బే నేను స్కిన్ షో చేయనంటూ ప్రకటించిన నమిత తాజాగా తన భారీ అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తూ ఓ చిత్రంలో నటించింది. "బ్లాక్ స్టాలిన్" పేరుతో రెడీ అవుతున్న ఈ మలయాళ చిత్రంలో ఆమె మాజీ సెక్స్ బాంబ్ షకీలాను మించిపోయిందనే వార్తలు వినబడుతున్నాయి. ఇందులో క్లబ్ డాన్సర్‌గా నమిత నటించింది. హీరో "బ్లాక్ స్టాలిన్"తో వేడి వేడి బెడ్‌రూమ్ సీన్స్, మరో హీరో కళాభవన్ మణితో స్విమ్ సూట్ సరదాలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. పబ్లిసిటీతో హోరెత్తిన ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగులో ఇద్దరు మొనగాళ్లు పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా పోసాని కృష్ణ మురళికి జోడీగా "మిస్ చింతామణి ఎంఏ"లో నటించేందుకు నమిత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆల్రెడీ ముమైత్‌ను ఆపరేషన్ దుర్యోధనలో విపరీతంగా ఎక్స్‌పోజింగ్ చేయించిన పోసాని ఈ చిత్రంలో అంతకంటే ఎక్కువ చేయించనున్నాడని సమాచారం. ఇకపోతే బాలయ్య చిత్రం సింహాలో గ్లామర్ పాత్ర పోషిస్తోంది నమిత.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Jan 2010 | 7:54 am

తెలంగాణ ఏర్పాటయ్యేంత వరకు నిద్రపోనివ్వం: కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఏ ఒక్కరినీ నిద్రపోనివ్వమని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. తమ అంతిమ లక్ష్యం రాష్ట్ర ఏర్పాటేనని ఆయన ప్రకటించారు. నర్సాపూర్‌ కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Source: Yahoo! Telugu: News | 25 Jan 2010 | 7:49 am

క్యాడ్‌‌బరీలో మరిన్ని నియామకాలు

అమెరికాకు చెందిన క్రాఫ్ట్ ఫుడ్స్ సంస్థ బ్రిటన్‌కు చెందిన చాక్‌‌‌లెట్ కంపెనీ క్యాడ్‌బరీని ఇటీవల చేజిక్కించుకుంది. రానున్న రోజుల్లో భారీగా ఈ సంస్థలో తాము భారీగా పెట్టుబడులు పెడతామని, బ్రిటన్‌లో ఉపాధి అవకాశాలను సృష్టిస్తామని క్రాఫ్ట్ ఫుడ్స్ సంస్థ ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 25 Jan 2010 | 7:36 am

అమ్మకాల ఒత్తిడి: కోలుకుంటోన్న సెన్సెక్స్

దేశీయ ఐటీ, రియాల్టీ, బ్యాంక్, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్‌కు చెందిన వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. కానీ సోమవారం మధ్యాహ్నం వరకు భారీ నష్టాల దిశగా పయనించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కాస్త కోలుకుంది. దీంతో సెన్సెక్స్ 42 పాయింట్లు నష్టపోయి, 16,816 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 20 పాయింట్లు స్వల్పంగా క్షీణించి, 5,015 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 25 Jan 2010 | 7:18 am

నష్టాల్లోనే సెన్సెక్స్, నిఫ్టీల పయనం

బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలతో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి క్షీణించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 98 పాయింట్ల నష్టంతో, 16,760 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 29 పాయింట్లు కోల్పోయి, 5,007 పాయింట్ల వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది.
Source: Yahoo! Telugu: News | 25 Jan 2010 | 7:10 am

విదేశీ కరెన్సీ రేట్లు

విదేశీ కరెన్సీ రేట్లు ఈ విధంగా ఉన్నాయిఅమెరికా డాలరు కొనుగోలు రేటు (థామస్ కుక్) 43.55 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 48.65యూరో కరెన్సీ కొనుగోలు రేటు (థామస్ కుక్) 61.35 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 68.40జపాన్ యెన్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 48.05 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 53.50బ్రిటన్ పౌండ్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 70.85 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 78.60సింగపూర్ డాలర్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 30.15 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 35.30.
Source: Yahoo! Telugu: News | 25 Jan 2010 | 7:03 am

బికినీ వేసుకోవడం పెద్ద డీల్ కాదు...: విమలా రామన్

"ఎవరైనా ఎప్పుడైనా" అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బ్యూటీ విమలా రామన్ గరం గరంగా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని అంటోంది. తను నటిస్తున్న తాజా చిత్రంలో బికినీ వేసుకుని నటించడంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... విదేశాలలో పెరిగిన ఓ అమ్మాయి సంప్రదాయ దుస్తులు వేసుకుంటుందని ఎలా అనుకుంటున్నారూ...? అని ఎదురు ప్రశ్నిస్తోంది. మోడ్రన్ డ్రెస్సులే కాదు... తన దృష్టిలో బికినీ వేసుకోవడం కూడా పెద్ద డీల్ కాదని కొట్టి పారేస్తోంది. మరి ఎటువంటి దుస్తులు ధరించి నటిస్తే పెద్ద విషయమనుకుంటుందో ఈసారి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం తను దక్షిణాది భాషా చిత్రాలన్నిటిలో నటిస్తున్నానని సంబరంగా చెపుతోంది విమలా రామన్. ముఖ్యంగా కన్నడ భాషలో తను చేస్తున్న పాత్రకు ఖచ్చితంగా అవార్డు వస్తుందని చెపుతోంది. మరి తెలుగులో కూడా అవార్డు దక్కించే పాత్రలే చేయొచ్చు కదా... బికినీలతో నటించడం ఎందుకో...?!!
Source: Yahoo! Telugu: Entertainment | 25 Jan 2010 | 6:28 am

తెలంగాణ ఉద్యమాన్ని తప్పుబట్టండం విచారకరం: జీవన్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాలుగు కోట్ల ప్రజానీకం చేస్తున్న ఉద్యమాన్ని తప్పుబట్టడాన్ని ఆ ప్రాంత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి ఖండించారు. ముఖ్యంగా, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు చేపట్టిన ఉద్యమాన్ని మావోయిస్టులతో పోల్చడం దురదృష్టకరంగా అభివర్ణించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Jan 2010 | 3:23 am

వేణుగోపాల్ రెడ్డి మృతిపై దర్యాప్తు పూర్తి: పోలీసులు

ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆత్మహత్యకు పాల్పడిన ఎంసీఏ విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి మృతిపై సీసీఎస్ చేపట్టిన విచారణ పూర్తయింది. దీనిపై ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు హైదరాబాద్ నగర పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Jan 2010 | 2:39 am

పూలన్‌దేవి కంటే కేసీఆర్ ఓ నరహంతకుడు: వెంకటేష్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఓ నరహంతకునితో సమానమని రాయలసీమ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ టి.జి.వెంకటేశ్ ఆరోపించారు. దీనిపై ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ తాను, తన కుటుంబ స్వార్థం కోసం అమాయుకులైన విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంటున్నాడని దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 25 Jan 2010 | 2:32 am

తెలంగాణ ఏర్పాటయ్యేంత వరకు నిద్రపోనివ్వం: కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఏ ఒక్కరినీ నిద్రపోనివ్వమని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. తమ అంతిమ లక్ష్యం రాష్ట్ర ఏర్పాటేనని ఆయన ప్రకటించారు. నర్సాపూర్‌ కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Jan 2010 | 2:20 am

రాజస్థాన్ గవర్నర్‌గా ప్రభారావు ప్రమాణ స్వీకారం

రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్‌లో ప్రభారావు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ జగ్దీష్ భల్లా ప్రమాణం చేయించారు. 74 సంవత్సరాల ప్రభారావు ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పూర్తిస్థాయి గవర్నర్‌గా ప్రమాణం చేశారు.
Source: జాతీయ | 25 Jan 2010 | 12:46 am

జనవరి 30న కర్ణాటక భాజపా అధ్యక్ష ఎన్నికలు!

భారతీయ జనతా పార్టీ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్ష ఎన్నికలు ఈనెల 30వ తేదీన జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షడు డీఎస్.సదానంద గౌడ తెలపారు. దీనిపై ఆయన సోమవారం బెంగుళూరులో మాట్లాడుతూ.. అధ్యక్ష ఎన్నికల నిర్వహణపై భాజపా సమన్వయ కమిటీతో సుదీర్ఘ మంతనాలు జరిపినట్టు చెప్పారు.
Source: జాతీయ | 25 Jan 2010 | 12:08 am

నేటి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం వజ్రోత్సవాలు

కేంద్ర ఎన్నికల సంఘ వజ్రోత్సవాలు సోమవారం నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభంకానున్నాయి. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతులు మీదుగా ఆరంభమయ్యే ఈ వేడుకలు విజ్ఞాన్ భవన్‌లో జరుగుతాయి. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేతి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్, లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, భాజపా అగ్రనేత ఎల్కే.అద్వానీ, భాజపా అధ్యక్షుడు నితిన్ గడ్కారీ, వామపక్ష నేతలు ప్రకాష్ కారత్, ఏబీబర్ధన్‌లతో పాటు.. కేంద్ర మంత్రులు, ఆహ్వానం అందిన వివిధ రాజకీయ పార్టీ అధినేతులు హాజరవుతారు.
Source: జాతీయ | 24 Jan 2010 | 10:56 pm

విభజనకు కాదు.. సంక్షోభ నివారణకు కమిటి: చిరు

రాష్ట్ర విభజనకు ప్రత్యేక కమిటీ వేయడాన్ని తాము వ్యతిరేకిస్తామని, అదేసమయంలో సంక్షోభ నివారణ దిశగా కేంద్రం ఆలోచన చేసి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. ఎన్నికల సంఘం వజ్రోత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన హస్తినకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jan 2010 | 10:32 pm

గాంధీ భవన్‌ను రెండుగా విభజించాలి: కేఆర్.ఆమోస్

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయమైన గాంధీ భవన్‌ను రెండుగా విడగొట్టాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ సీనియర్ నేత కేఆర్.ఆమోస్ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలతో రాష్ట్రం రెండు ముక్కలైందన్నారు. అలాగే, నేతలు కూడా రెండుగా చీలిపోయారన్నారు. అందువల్ల పార్టీలో కూడా తెలంగాణ, సీమాంధ్ర కమిటీలను వేయాలని ఆయన కోరారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jan 2010 | 10:21 pm

అది 'టి' జేఏసీ కాదు.. మావోయిస్టుల జేఏసీ: ఆనం వివేకా

తెలంగాణ రాష్ట్ర సాధనం కోసం ఏర్పాటైన జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ కోసం ఏర్పాటైన జేఏసీ కాదని, మావోయిస్టులు, కేసీఆర్‌కు చెందిన ఒక వర్గం ఏర్పాటు చేసిన జేఏసీ అని సమైక్యాంధ్ర నేతలు ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రమైన నెల్లూరులో సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణ కోసం నిర్వహించిన సదస్సు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jan 2010 | 10:03 pm

తెలంగాణపై ఒత్తిళ్ళకు బెదరబోం: మంత్రి వీరప్ప మొయిలీ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ఆ ప్రాంత నేతలు చేస్తున్న ఒత్తిళ్ళకు అధిష్టానం లొంగబోదని కేంద్ర న్యాయ శాఖామంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. అసలు ఈ అంశంలో కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన ఆదివారం రాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో ఆయన వ్యాఖ్యానించారు. చర్చల ప్రక్రియ కోసం కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.
Source: జాతీయ | 24 Jan 2010 | 9:32 pm

బెంగాల్ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎంకే

పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్‌గా జాతీయ భద్రతా మాజీ సలహాదారు ఎంకే.నారాయణన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఎస్.షా ప్రమాణం చేయించారు. బెంగాల్ రాష్ట్ర రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య, బెంగాల్ మంత్రివర్గ సభ్యులు, స్పీకర్ హషీమ్ అబ్దుల్ హలీమ్, ప్రతిపక్ష నేత పార్థా ఛటోపాధ్యాయ తదితరులు పాల్గొన్నారు.
Source: జాతీయ | 24 Jan 2010 | 8:56 pm

30న ప్రేక్షకుల ముందుకు రంగుల "మాయాబజార్"!

హాయ్ హాయ్ నాయిక! మొత్తానికి రంగుల్లో వచ్చేస్తున్నాడు. నలుపు తెలుపు "మాయాబజార్" చిత్రానికి రంగులు అద్దిన వాళ్లకు వేద్దాం రండి రెండు వీరతాళ్లు. ఘటోత్కచుడు ఆరగించిన వివాహ భోజన వంటకాలు, అందాల శశిరేఖ ఆభరణాలు, ప్రతాపాలను నమ్ముకున్న తమ్ముడు అభిమన్యుడి కోసం లోకాలను కకావికలు చేసే ఘటోత్కచుడు అంతా రంగుల్లో కన్పించనున్నారు.కె.వి.రెడ్డి సృష్టించిన ఈ నలుపు తెలుపు కళా ఖండానికి గోల్డెన్‌స్టోన్ సంస్థ రంగులు అద్దింది. అద్భుతమైన ఈ సినిమాను రంగుల్లో చూసే అందమైన అవకాశం ఈ నెల 30వ తేదీన రానుంది. వెండితెరపై శ్రీకృష్ణుడి గెటప్‌లో ఎన్టీఆర్ పంచవర్ణ శోభితంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సూపర్‌గుడ్ సంస్థ విడుదల చేస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jan 2010 | 10:15 am

ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరికెరుక: డీఎస్

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ తన హస్తిన యాత్రను ముగించుకుని రాష్ట్ర రాజధాని భాగ్యనగరానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగీదిగగానే మీడియా చుట్టిముట్టి ఢిల్లీ యాత్రపై ప్రశ్నల వర్షం గుప్పించింది. 'కదలడు.. మెదలడు' అనే రీతిలో వ్యవహరించే డీఎస్.. మీడియా ప్రశ్నలకు ఎప్పటిలా నోరెళ్ళపెట్టి తాపీగా సమాధానం ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jan 2010 | 4:59 am

క్షమాపణలు చెప్పిన ప్రధానమంత్రి కార్యాలయం!

జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనపో పాకిస్థాన్ వాయుసేనకు చెందిన ఉన్నతాధికారి ఫోటో ప్రచురితం కావడం పట్ల ప్రధానమంత్రి కార్యాలయం విచారం వ్యక్తం చేస్తూ.. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పింది. ఈ ప్రకటనను తయారు చేసిన డీఏవీపీ చేసిన తప్పింద వల్ల ఈ పొరపాటు జరిగినట్టు ఆదివారం పీఎంఓ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.
Source: జాతీయ | 24 Jan 2010 | 2:44 am

ఆస్ట్రేలియా ఆటగాళ్లను అడుగుపెట్టనీయం: ఉద్ధవ్‌థాక్రే

ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్లను ముంబై గడ్డపై అడుగుపెట్టనీయబోమని శివసేన సేన ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఉద్ధవ్‌థాక్రే హెచ్చరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీల్లో పాల్గొనే క్రికెటర్లనే కాకుండా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆటగాళ్లను సైతం ముంబైలో ఆడనీయబోమని తాజాగా ప్రకటించారు.
Source: జాతీయ | 24 Jan 2010 | 2:05 am