|
గణనీయంగా పెరిగిన మారుతి సుజుకి నికరలాభం!ప్రముఖ కార్ల ఉత్పత్తి సంస్థ మారుతి సుజుకి నికరలాభం మూడింతలు పెరిగింది. గత ఏడాది డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో అమ్మకాల్లో వృద్ధి సాధించడంతో కంపెనీ నికరలాభం గణనీయంగా పెరిగిందని మారుతి శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్‌లో 54.2 శాతం వాటాలు కలిగివున్న మారుతి సంస్థ విడుదల చేసిన ప్రకటనలో భాగంగా... గత ఏడాది రూ. 2.14 బిలియన్లతో పోల్చితే రూ. 6.88 బిలియన్ డాలర్లు పెరిగినట్లు తెలుస్తోంది.Source: Yahoo! Telugu: News | 23 Jan 2010 | 8:51 am వైఎస్ పథకాలే నా శ్వాస: ముఖ్యమంత్రి రోశయ్య!దివంగత ముఖ్యమంత్రి, ప్రజానేత వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను సమర్థవతంగా అమలు చేయడమే తన ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి కె.రోశయ్య పునరుద్ఘాటించారు. ఏ కార్యక్రమాన్ని అయితే, ప్రారంభించాలని హెలికాఫ్టర్‌లో బయలుదేరి వైఎస్ దుర్మరణం పాలయ్యారో.. అదే రచ్చబండ కార్యక్రమాన్ని రోశయ్య శనివారం ప్రారంభించారు.Source: Yahoo! Telugu: News | 23 Jan 2010 | 8:48 am కావూరి - దామోదార్ రెడ్డిల మాటల యుద్ధం!తెలంగాణ అంశం కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య అంతరం పెంచుతోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావులు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు.Source: Yahoo! Telugu: News | 23 Jan 2010 | 8:27 am ఈనెల 28న తెలంగాణపై రెండో దశ కేంద్రం చర్చలుఈనెల 28వ తేదీన కేంద్రం రెండో దఫా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు హస్తిన వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర హోం శాఖ నుంచి ఫోన్ ద్వారా ఆహ్వానాలు రావొచ్చని తెలుస్తోంది.Source: Yahoo! Telugu: News | 23 Jan 2010 | 8:06 am మళ్లీ ఓ అమ్మాయిని "ప్రేమ"గా చూస్తున్న సుమంత్..?!!సత్యం సుమంత్ ఆ మధ్య కమిలినీ ముఖర్జీతో సన్నిహితంగా ఉన్నాడన్న వార్తలు టాలీవుడ్‌లో గుసగుసలు పోయాయి. వీళ్లద్దరూ పార్టీలకు, ఫంక్షన్లకు చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు కృష్ణ నగర్ ఫిలిమ్ వర్గాలు అప్పట్లో గోల చేశాయి. దీంతో బెంబేలెత్తిపోయిన సుమంత్, అందరూ అనుకుంటున్నట్లు తమ మధ్య ఏ లింకు లేదని తేల్చి చెప్పేశాడు. దాంతో ఆ గొడవ సద్దుమణిగింది. తాజాగా ఇటీవల విరానికా మంచు పార్టీకి వెళ్లిన సుమంత్, అదే పార్టీలో మెరుపు తీగలా ఉన్న ఓ అమ్మాయిని గుడ్లప్పగించి చూస్తుండిపోయాడట. అది గమనించిన సదరు బ్యూటీ గాళ్ మెల్లగా అక్కడ నుంచి మరోచోటకు తన మకాన్ని మార్చిందట. సుమంత్ అక్కడికి కూడా వెళ్లి ఆమెనే గుచ్చి గుచ్చి చూడటం మొదలుపెట్టాడట. దాంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ బ్యూటీ నేరుగా పార్టీ హాలులోకి వెళ్లి ఫ్రెండ్స్‌తో మాట్లాడటం ప్రారంభించిందట. సుమంత్ మాత్రం పార్టీ హాలులోకెళ్లి డ్యాన్స్ చేస్తూ అదే స్పీడుతో తనకు నచ్చిన అమ్మాయి వద్దకు వచ్చి లాఘవంగా నడుమున చేయివేసి తనతో నాట్యం చేయించాడట. ఆ అమ్మాయి కూడా తొలుత కాస్త సిగ్గుపడినా తర్వాత సుమంత్‌తో కలిసి ఆడిందట.Source: Yahoo! Telugu: Entertainment | 23 Jan 2010 | 7:47 am మలేషియా ప్రభుత్వంతో సామ్యా బయోటెక్ ఒప్పందంమలేషియా ప్రభుత్వంతో హైదరాబాద్‌కు చెందిన సామ్యా బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. మలేషియాలో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకుగానూ ఆ దేశ ప్రధాని మహ్మద్ బిన్ తున్ అబ్దుల్ రజాక్ సమక్షంలో సామ్యా జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ వై. సోనియా రెడ్డి, పరెఖ్ (మలేషియా) ముఖ్యమంత్రి జె. అబ్దుల్ ఖదీర్‌లు ఒప్పందాలపై సంతకాలు చేశారు.Source: Yahoo! Telugu: News | 23 Jan 2010 | 7:30 am ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం: పాల్వాయిప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తప్పకుండా ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధనరెడ్డి అన్నారు. యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని తప్పకుండా ఇచ్చి తీరుతుందని పాల్వాయి ధీమా వ్యక్తం చేశారు. ఇంకా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని జోస్యం చెప్పారు.Source: Yahoo! Telugu: News | 23 Jan 2010 | 6:11 am రాజకీయ విభేదాల మధ్య 'ముగ్గురు మొనగాళ్ళు'రాష్ట్ర చిత్ర పరిశ్రమలో "ముగ్గురు మొనగాళ్లు"గా చిరంజీవి బ్రదర్స్‌కు గుర్తింపు వుంది. నిన్నామొన్నటి వరకు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరో హీరో నాగేంద్రబాబులు తమ ఆధిపత్యాన్ని చాటుతూ వచ్చారు.Source: Yahoo! Telugu: News | 23 Jan 2010 | 6:08 am భారతీయులపై దాడులు: రెండేళ్ళకు ముందే తెలుసు!ఆస్ట్రేలియాలోని భారతీయులపై జరుగుతున్న దాడుల గురించి రెండు సంవత్సరాల క్రితమే ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే, ఆస్ట్రేలియా పాలకులతో పాటు.. అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు.Source: Yahoo! Telugu: News | 23 Jan 2010 | 5:46 am 2012లో మూడో ఆర్థిక సంపన్న దేశంగా భారత్!వచ్చే 2012 సంవత్సరం నాటికి భారతదేశం మూడో ఆర్థిక సంపన్న దేశంగా ఎదుగుతుంది అమెరికా సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా అన్ని రంగాల్లో అగ్రరాజ్యంగా ఉన్న విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 23 Jan 2010 | 5:30 am భారత్‌లో దుబాయ్ సంక్షోభమా? ఛాన్సే లేదు..!భారత్‌లో దుబాయ్ తరహా సంక్షోభం తలెత్తేందుకు అవకాశమే లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్పష్టం చేశారు. దుబాయ్ పరిణామాల నేపథ్యంలో మాంద్యం భయం ఇంకా తొలగిపోలేదని కొందరు ఆర్థిక వేత్తలు భావిస్తున్న నేపథ్యంలో.. భారత్ ఈ సంక్షోభంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేగని దువ్వూరి వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 23 Jan 2010 | 5:12 am తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో 'మగధీర'!ప్రముఖ తమిళ దర్శకుడు ధరణి తెలుగు చిత్ర పరిశ్రమలో మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన బంగారం (2006) చిత్రం ఆశించిన స్థాయిలో హిట్ సాధించలేదు. దీంతో ధరణి తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నాను.Source: Yahoo! Telugu: Entertainment | 23 Jan 2010 | 4:51 am వైఎస్ పథకాలే నా శ్వాస: ముఖ్యమంత్రి రోశయ్య!దివంగత ముఖ్యమంత్రి, ప్రజానేత వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను సమర్థవతంగా అమలు చేయడమే తన ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి కె.రోశయ్య పునరుద్ఘాటించారు. ఏ కార్యక్రమాన్ని అయితే, ప్రారంభించాలని హెలికాఫ్టర్‌లో బయలుదేరి వైఎస్ దుర్మరణం పాలయ్యారో.. అదే రచ్చబండ కార్యక్రమాన్ని రోశయ్య శనివారం ప్రారంభించారు.Source: ఏపీ న్యూస్ | 23 Jan 2010 | 3:18 am కావూరి - దామోదార్ రెడ్డిల మాటల యుద్ధం!తెలంగాణ అంశం కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య అంతరం పెంచుతోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావులు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 23 Jan 2010 | 2:58 am ఈనెల 28న తెలంగాణపై రెండో దశ కేంద్రం చర్చలుఈనెల 28వ తేదీన కేంద్రం రెండో దఫా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు హస్తిన వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర హోం శాఖ నుంచి ఫోన్ ద్వారా ఆహ్వానాలు రావొచ్చని తెలుస్తోంది.Source: జాతీయ | 23 Jan 2010 | 2:36 am హింసను వీడితేనే మావోలతో చర్చలు: చిదంబరంమావోయిస్టులు హింసను వీడితేనే చర్చలు జరుపుతామని కేంద్ర హోం మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. అప్పటి వరకు చర్చల ప్రతిపాదనకే తావులేదని ఆయన తేల్చి చెప్పారు. మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రాలైన జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.Source: జాతీయ | 23 Jan 2010 | 1:54 am ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం: పాల్వాయిప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తప్పకుండా ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధనరెడ్డి అన్నారు. యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని తప్పకుండా ఇచ్చి తీరుతుందని పాల్వాయి ధీమా వ్యక్తం చేశారు. ఇంకా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని జోస్యం చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 23 Jan 2010 | 12:42 am పన్నులు చెల్లించం.. ఏం చేస్తారు: కోదండరామ్తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేంత వరకు పన్నులు చెల్లించబోమని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలంతా సంఘటితంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 22 Jan 2010 | 11:34 pm మెరుగుపడుతున్న నేత అర్జున్ సింగ్ ఆరోగ్యంఅనారోగ్యం బారిన పడిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అర్జున్ సింగ్ కోలుకుంటున్నట్టు వైద్యులు వెల్లడించారు. గుండె నొప్పి, జ్వరం, ఇతర అనారోగ్య కారణాలతో అఖిల భారత వైద్య వైజ్ఞానిక సంస్థ (ఎయిమ్స్)లో చేరారు.Source: జాతీయ | 22 Jan 2010 | 10:53 pm శాంతి.. ఓం శాంతి: తెలంగాణాపై ఇదే నినాదం!రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడేంత వరకు ఏ ఒక్కరూ తెలంగాణ అంశం గురించి మాట్లాడవద్దని కాంగ్రెస్ హైకమాండ్ ఖరాకండిగా తేల్చి చెప్పింది. శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టం చేసినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.Source: ఏపీ న్యూస్ | 22 Jan 2010 | 10:04 pm పారా గ్లైడింగ్‌లతో దాడికి లష్కర్ కుట్ర: హై అలెర్ట్!భారత గణతంత్ర దినోత్సవ వేడుకులను లక్ష్యంగా చేసుకుని లష్కర్ తోబియా తీవ్రవాద సంస్థ పారా గ్లైడింగ్‌లతో దాడికి పాల్పడవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దేశ వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. వీటితో పాటు... దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.Source: జాతీయ | 22 Jan 2010 | 9:05 pm కోర్ కమిటీ భేటీ: రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీ..?తెలంగాణా సమస్యను ఓ కొలిక్కి తీసుక వచ్చేందుకు మరోసారి కోర్ కమిటీ శుక్రవారం ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో సమావేశమైంది. ఈ సమావేశంలో తెలంగాణా సమస్యను పరిష్కరించడానికి అనువైన మార్గాలపై సుదీర్ఘ చర్చ సాగింది.Source: జాతీయ | 22 Jan 2010 | 7:49 am భారత్‌లో స్వేచ్ఛ రిమోట్ కంట్రోల్డ్‌గా ఉంది: వర్మరామ్ గోపాల్ వర్మ ఏది మాట్లాడినా సంచలనమైన వ్యాఖ్యే అవుతుంది. తాజాగా మరో వ్యాఖ్య చేశారు వర్మ. భారత్‌లో స్వేచ్ఛ రిమోట్ కంట్రోల్డ్‌గా ఉందని అన్నారు. రణ్ చిత్రంలో ప్రజాస్వామ్యం రిమోట్ కంట్రోల్డ్‌గా ఉందని ఓ పాత్రతో చెప్పించాననీ, అయితే భారతదేశంలో స్వేచ్ఛ కూడా రిమోట్ కంట్రోల్డ్‌లోనే ఉన్నట్లు అనుకుంటున్నట్లు ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో మనం స్వేచ్ఛను ఎంతమేరకు అనుభవిస్తున్నామన్న దానిపై తనకు ఎన్నో సందేహాలున్నాయన్నారు. దేనిగురించైనా మాట్లాడితే... మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారంటూ కొంతమంది విమర్శిస్తుంటారనీ, మరలాంటప్పుడు ఇక స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. పరిటాల- సూరి ఫ్యాక్షనిజం నేపధ్యంలో తెరకెక్కించిన "రణ్" త్వరలో తెరపైకి రానున్న దశలో ఆ సినిమా నుంచి వివాదస్పద "జన గణ మన రణ్ హై" అనే పల్లవిని తీసేయమని సీబీఎఫ్‌సీ చెప్పడంపై రామ్ గోపాల్ వర్మ గత కొన్నాళ్లుగా గుర్రుగా ఉన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 22 Jan 2010 | 7:41 am అదొక పనికిమాలిన హెలికాప్టర్.. అందుకే సెప్టెంబర్ 2 ఘోరం!!దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రయాణించిన భెల్430 రకం విమానం ప్రయాణానికి ఏమాత్రం అనువైనది కాదని డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఐ) అభిప్రాయపడింది. ఇదే అంశాన్ని హెలికాఫ్టర్ ప్రమాదంపై దర్యాప్తు చేసిన త్యాగి నేతృత్వంలోని డీజీసీఏ కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 22 Jan 2010 | 7:23 am పంజాబ్ గవర్నర్‌గా శివరాజ్ పాటిల్ ప్రమాణంపంజాబ్ రాష్ట్ర గవర్నరుగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శివరాజ్ పాటిల్ శుక్రవారం ప్రమాణం చేశారు. ఆయనతో పంజాబ్ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రంలో పంజాప్ - హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ముకుల్ ముద్గల్ ప్రమాణ స్వీకారం చేయించారు.Source: జాతీయ | 22 Jan 2010 | 4:08 am ప్రియమణి.. లేడీజేమ్స్‌బాండ్..!: లగడపాటి శ్రీధర్జాతీయస్థాయి అవార్డును సొంతం చేసుకున్న గ్లామర్ తార ప్రియమణికి లేడిజేమ్స్‌బాండ్‌గా కితాబిచ్చేశారు. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ ఈ వ్యాఖ్యలు చేశారు. "సాధ్యం" ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా.. ప్రియమణిని పోస్టర్‌లో చూస్తుంటే.. లేడీబాండ్‌గాళ్‌గా కనిపిస్తోందని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 22 Jan 2010 | 3:31 am వేణుగోపాల్ ఆత్మహత్యను వక్రీకరిస్తే సహించం: నాగంతెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన ఎంసీఏ విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి మృతిని వక్రీకరిస్తే సహించబోమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు. దీనిపై ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసుకున్న వేణుగోపాల్ రెడ్డి మృతిపై సీసీఎస్ దర్యాప్తునకు ఆదేశించడాన్ని ఆయన తప్పుబట్టారు.Source: ఏపీ న్యూస్ | 22 Jan 2010 | 3:22 am ఎమ్మెల్యేల గెలుపు బాధ్యత జేఏసీదే: కోదండరామ్రాష్ట్ర సాధనలో భాగంగా తమ పదవులను త్యజించిన ప్రజాప్రతినిధులను తిరిగి ఏకగ్రీవంగా ఎంపిక చేసే బాధ్యత జేఏసీ స్వీకరిస్తుందని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా జేఏసీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 22 Jan 2010 | 3:07 am భారత ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ వీకే సింగ్భారత ఆర్మీ కొత్త చీఫ్‌గా వీకే సింగ్ పేరును కేంద్రం ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్, భారత ఆర్మీలో సీనియర్ మోస్ట్ అధికారిగా ఉన్న వీకె.సింగ్ మార్చి 31వ తేదీన ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.Source: జాతీయ | 22 Jan 2010 | 1:42 am
|