|
ఎమ్మెల్యేల గెలుపు బాధ్యత జేఏసీదే: కోదండరామ్రాష్ట్ర సాధనలో భాగంగా తమ పదవులను త్యజించిన ప్రజాప్రతినిధులను తిరిగి ఏకగ్రీవంగా ఎంపిక చేసే బాధ్యత జేఏసీ స్వీకరిస్తుందని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా జేఏసీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.Source: Yahoo! Telugu: News | 22 Jan 2010 | 8:37 am భారీ నష్టాల దిశగా సెన్సెక్స్, నిఫ్టీల పయనంగురువారం 432 పాయింట్ల మేర భారీగా నష్టపోయిన బాంబే స్టాక్ మార్కెట్, శుక్రవారం కూడా అదే బాటలో పయనిస్తోంది. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో 300 పాయింట్లు క్షీణించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 126 పాయింట్లు పతనమై, 16,924 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 46 పాయింట్లు కోల్పోయి, 5,048 పాయింట్ల మార్కును తాకింది.Source: Yahoo! Telugu: News | 22 Jan 2010 | 8:29 am 15.77 శాతం పెరిగిన రిలయన్స్ నికర ఆదాయంరిలయన్స్ ఇండస్ట్రీస్ (రిల్) నికర ఆదాయం ముగిసిన మూడో త్రైమాసికంలో 15.77 శాతం మేరకు పెరిగింది. ఇంత భారీ మొత్తంలో రిల్ ఆదాయం పెరగడం గత ఐదు త్రైమాసికాల్లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. డిసెంబరు 31వ తేదీతో ముగిసిన క్వార్టర్‌లో కంపెనీ నికర ఆదాయం 4008 కోట్ల రూపాయలుగా నమోదైనట్టు ఆ సంస్థ పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 22 Jan 2010 | 8:17 am అమ్మకాల ఒత్తిడి: తిరోగమనంలో స్టాక్ మార్కెట్ఎఫ్ఎమ్సీజీ, పవర్ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ తిరోగమనంలో పయనిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీగా నష్టపోయిన బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 148 పాయింట్ల మేర పతనమై, 16,909 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ నిఫ్టీ కూడా, 5,046 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని పయనింప జేస్తోంది.Source: Yahoo! Telugu: News | 22 Jan 2010 | 8:02 am నష్టాల్లో కొనసాగుతోన్న బాంబే స్టాక్ మార్కెట్వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్‌కు ఏ మాత్రం కలిసిరాలేదు. ట్రేడింగ్ ప్రారంభం నుంచే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోవడంతో మదుపుదారులు నిరాశకు గురైయ్యారు.Source: Yahoo! Telugu: News | 22 Jan 2010 | 7:58 am మేం భరోసా ఇవ్వలేం.. తేల్చి చెప్పి పాక్ ప్రధాని!26/11 తరహా దాడులు భారత్‌లో జరుగకుండా ఉండవని తాము భరోసా ఇవ్వలేమని పాకిస్థాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి దాడులు జరిగితే భారత్ సహనం కోల్పోవచ్చని అమెరికా చేసిన వ్యాఖ్యలపై గిలానీ పై విధంగా స్పందించారు.Source: Yahoo! Telugu: News | 22 Jan 2010 | 7:55 am షెడ్డుకు పరిమితం కానున్న కేసీఆర్ 'కారు'!ప్రత్యేక తెలంగాణా కోసం "తలనైనా నరుక్కుంటా..." అంటూ ఉద్వేగపూరితమైన వ్యాఖ్యలు చేసే కేసీఆర్, ఒకవేళ తెలంగాణా వస్తే... గిస్తే గోళ్లు గిల్లుకుంటూ ఖాళీగా కూచోవడమేనని చూచాయగా తెలిసిపోతోంది. తెలంగాణా ప్రాంతంలో జేఏసీ నుంచి కాంగ్రెస్ విడిపోయేందుకు సిద్ధమవడం దీనినే సూచిస్తోంది.Source: Yahoo! Telugu: News | 22 Jan 2010 | 7:46 am భారత్‌లో స్వేచ్ఛ రిమోట్ కంట్రోల్డ్‌గా ఉంది: వర్మరామ్ గోపాల్ వర్మ ఏది మాట్లాడినా సంచలనమైన వ్యాఖ్యే అవుతుంది. తాజాగా మరో వ్యాఖ్య చేశారు వర్మ. భారత్‌లో స్వేచ్ఛ రిమోట్ కంట్రోల్డ్‌గా ఉందని అన్నారు. రణ్ చిత్రంలో ప్రజాస్వామ్యం రిమోట్ కంట్రోల్డ్‌గా ఉందని ఓ పాత్రతో చెప్పించాననీ, అయితే భారతదేశంలో స్వేచ్ఛ కూడా రిమోట్ కంట్రోల్డ్‌లోనే ఉన్నట్లు అనుకుంటున్నట్లు ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో మనం స్వేచ్ఛను ఎంతమేరకు అనుభవిస్తున్నామన్న దానిపై తనకు ఎన్నో సందేహాలున్నాయన్నారు. దేనిగురించైనా మాట్లాడితే... మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారంటూ కొంతమంది విమర్శిస్తుంటారనీ, మరలాంటప్పుడు ఇక స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. పరిటాల- సూరి ఫ్యాక్షనిజం నేపధ్యంలో తెరకెక్కించిన "రణ్" త్వరలో తెరపైకి రానున్న దశలో ఆ సినిమా నుంచి వివాదస్పద "జన గణ మన రణ్ హై" అనే పల్లవిని తీసేయమని సీబీఎఫ్‌సీ చెప్పడంపై రామ్ గోపాల్ వర్మ గత కొన్నాళ్లుగా గుర్రుగా ఉన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 22 Jan 2010 | 7:41 am భారత ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ వీకే సింగ్భారత ఆర్మీ కొత్త చీఫ్‌గా వీకే సింగ్ పేరును కేంద్రం ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్, భారత ఆర్మీలో సీనియర్ మోస్ట్ అధికారిగా ఉన్న వీకె.సింగ్ మార్చి 31వ తేదీన ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.Source: Yahoo! Telugu: News | 22 Jan 2010 | 7:12 am వ్యక్తిగత అభిప్రాయాలు సరికాదు: ఆర్.దామోదర్లక్ష్య సాధన కోసం పోరాటం చేసే సమయంలో వ్యక్తిగత అభిప్రాయాలు పనికి రావని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాజకీయ జేఏసీలో కాంగ్రెస్ పార్టీ ఇంకా కొనసాగుతూనే ఉందని ఆయన శుక్రవారం స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 22 Jan 2010 | 6:54 am రాష్ట్రంలో సాగుతున్న తూపాకీ పాలన: ఈటెలరాష్ట్రంలో తుపాకీ పాలన సాగుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ సంఘటితంగానే ఉన్నాయన్నారు.Source: Yahoo! Telugu: News | 22 Jan 2010 | 6:45 am ప్రియమణి.. లేడీజేమ్స్‌బాండ్..!: లగడపాటి శ్రీధర్జాతీయస్థాయి అవార్డును సొంతం చేసుకున్న గ్లామర్ తార ప్రియమణికి లేడిజేమ్స్‌బాండ్‌గా కితాబిచ్చేశారు. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ ఈ వ్యాఖ్యలు చేశారు. "సాధ్యం" ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా.. ప్రియమణిని పోస్టర్‌లో చూస్తుంటే.. లేడీబాండ్‌గాళ్‌గా కనిపిస్తోందని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 22 Jan 2010 | 3:31 am ఎమ్మెల్యేల గెలుపు బాధ్యత జేఏసీదే: కోదండరామ్రాష్ట్ర సాధనలో భాగంగా తమ పదవులను త్యజించిన ప్రజాప్రతినిధులను తిరిగి ఏకగ్రీవంగా ఎంపిక చేసే బాధ్యత జేఏసీ స్వీకరిస్తుందని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా జేఏసీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 22 Jan 2010 | 3:07 am భారత ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ వీకే సింగ్భారత ఆర్మీ కొత్త చీఫ్‌గా వీకే సింగ్ పేరును కేంద్రం ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్, భారత ఆర్మీలో సీనియర్ మోస్ట్ అధికారిగా ఉన్న వీకె.సింగ్ మార్చి 31వ తేదీన ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.Source: జాతీయ | 22 Jan 2010 | 1:42 am వ్యక్తిగత అభిప్రాయాలు సరికాదు: ఆర్.దామోదర్లక్ష్య సాధన కోసం పోరాటం చేసే సమయంలో వ్యక్తిగత అభిప్రాయాలు పనికి రావని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాజకీయ జేఏసీలో కాంగ్రెస్ పార్టీ ఇంకా కొనసాగుతూనే ఉందని ఆయన శుక్రవారం స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 22 Jan 2010 | 1:24 am రాష్ట్రంలో సాగుతున్న తూపాకీ పాలన: ఈటెలరాష్ట్రంలో తుపాకీ పాలన సాగుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ సంఘటితంగానే ఉన్నాయన్నారు.Source: ఏపీ న్యూస్ | 22 Jan 2010 | 1:19 am ప్రభుత్వ నిర్ణయంపై పీఎం జోక్యం చేసుకోవాలి: లాలూటాక్సీ డ్రైవర్లకు లైసెన్సులు మంజూరు చేసే అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తక్షణం జోక్యం చేసుకోవాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ఆయన గురువారం రాత్రి ప్రధానికి ఫోన్ చేసి సమస్యను వివరించారు.Source: జాతీయ | 22 Jan 2010 | 12:01 am సాంకేతి లోపమే.. కానీ, ఎలాంటిదో తేల్చని డీజీసీఏదివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదానికి గురుకావడానికి సాంకేతిక లోపమేనని డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేసింది. అయితే, ఎలాంటి సాంకేతిక లోపమో స్పష్టంగా వెల్లడించక పోవడం గమనార్హం.Source: ఏపీ న్యూస్ | 21 Jan 2010 | 11:40 pm దేశ విమానాల్లో హై అలెర్టు: కేంద్ర ఆదేశాలు జారీ!దేశానికి చెందిన విమానాలను హైజాక్ చేసేందుకు అల్‌ఖైదా, లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థలు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దక్షిణాసియాలో తిరిగే అన్ని రకాల విమానానల్లో హై అలెర్ట్ ప్రకటించింది.Source: జాతీయ | 21 Jan 2010 | 11:20 pm వేణుగోపాల్ రెడ్డి మృతిలో నిజాలు తేల్చుతాం: ఏకేఖాన్ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్య చేసుకున్న ఎంసీఏ విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి మృతి కేసులో నిజాలను నిగ్గు తేల్చనున్నట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఏకే.ఖాన్ తెలిపారు. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేణుగోపాల్ ఆత్మహత్యపై పలు అనుమానాలు, ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు.Source: ఏపీ న్యూస్ | 21 Jan 2010 | 10:36 pm పూర్తి స్థాయి గవర్నర్‌గా నరసింహన్ ప్రమాణం!రాష్ట్ర పూర్తి స్థాయి గవర్నర్‌గా ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి రమేష్ దవే ప్రమాణం చేయించారు. ఉదయం 9.45 నిమిషాలకు రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.Source: ఏపీ న్యూస్ | 21 Jan 2010 | 10:27 pm మాట వినకుంటే సభ రద్దు చేస్తాం: మంత్రి మొయిలీసొంత పార్టీ సభ్యులు మాట వినకుంటే సభ (అసెంబ్లీ) రద్దయ్యే పరిస్థితులు ఉన్నాయని కేంద్ర న్యాయ శాఖామంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ హెచ్చరించారు. తదుపరి చర్యలు మొదలయ్యే వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు కాస్త ఓపికతో ఉండాలని లేని పక్షంలో పరిస్థితులు చేయిదాటి పోయే ప్రమాదం ఉందని మొయిలీ అన్నారు.Source: జాతీయ | 21 Jan 2010 | 9:25 pm జాతీయ భద్రతా సలహాదారుగా శివశంకర్ మీనన్జాతీయ భద్రతా సలహాదారుగా కేంద్ర విదేశాంగ కార్యదర్శి శివశంకర్ మీనన్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం గురువారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న ఎంకే.నారాయణన్ స్థానంలో మీనన్‌ను నియమించారు.Source: జాతీయ | 21 Jan 2010 | 8:39 pm బోర్లాపడ్డ "లండన్ డ్రీమ్స్": "సూప్"లో పడ్డ అసిన్అమీర్ ఖాన్ "గజినీ" హిట్‌తో సంతోషంతో చెలరేగిపోయిన అసిన్ బాలీవుడ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుని కోలీవుడ్ వదిలిపెట్టి ముంబయికి తుర్రుమంది. అంతేకాదు... "గజినీ" హిట్ టైంలో బాలీవుడ్ నుంచి ఎడాపెడా అవకాశాలు వచ్చినా అమ్మడు "సెలెక్టివ్... సెలెక్టివ్" అంటూ చేతిదాకా వచ్చిన సినిమాలు అంగీకరించకుండా మీనమేషాలు లెక్కబెట్టింది. సల్మాన్ ఖాన్‌తో "లండన్ డ్రీమ్స్" చేస్తూ బాలీవుడ్‌లో తనకు ఎదురు లేదని కలలు కన్నది. కానీ ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద మోకాళ్లు డోక్కుపోతూ బోర్లాపడి లేవలేకపోయింది. దీంతో అసిన్ డీలా పడింది. ఇప్పుడేమో ఛాన్సుల కోసం వెంపర్లాడుతోంది.చేతిలో సినిమాల్లేకుండా ఊరకనే గోళ్లు గిల్లుకుంటూ కూచువడంపై తను ఏమీ బాధపడటం లేదని చెపుతోందీ భామ. విజయాలొచ్చినప్పుడు ఎగిరి గంతులేయడం... అపజయాలొచ్చినప్పుడు మూలగటం వంటివి తన డిక్షనరీలో లేవని ధైర్య వచనాలు చెపుతోంది. భవిష్యత్‌లో ఏం చేయాలన్న దానిపై తను దృష్టి సారించినట్లు వెల్లడిస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2010 | 12:43 pm జగపతిబాబు ఎప్పటికీ 25 ఏళ్ల యువకుడే..!: శ్రీధర్జగపతిబాబును ఎప్పుడు చూసినా ఇంకా 25 సంవత్సరాల యువకుడిగా కన్పిస్తాడని నిర్మాత శ్రీధర్ ప్రశంసించారు. జగపతిబాబు, ప్రియమణి జంటగా నటిస్తోన్న "సాధ్యం" సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ.. "మిగతా హీరోలకు ఎంతగా కాస్మోటిక్ టెక్నాలజీ వాడినా ముఖంలో ఆ కళ తెలిసిపోతుంది. కానీ జగపతిబాబు మాత్రం అలాంటి కాస్మోటిక్స్‌ను ఏ మాత్రం వాడడనే విషయం నాకు తెలుసు. అందుకే ఆయన చిత్రాలంటే అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడుతుంటారు" అని శ్రీధర్ చెప్పుకొచ్చారు. దీంతో పక్కనే ఉన్న ప్రియమణి.. అందుకుని మీరిలా కితాబిస్తే రేపు టీనేజ్ అమ్మాయి తన సరసన హీరోయిన్‌గా కావాలంటాడని సరసమాడింది.Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2010 | 10:29 am బ్యాంకాక్‌లో ప్రభాస్, కాజల్‌ల సినిమా షూటింగ్!యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, తొలిప్రేమ కరుణాకరన్ దర్శకత్వంలో, 'ఛత్రపతి' ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం బ్యాంకాక్‌లో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ నెల 21 నుంచి స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ సారథ్యంలో ఓ భారీ ఫైట్‌ని పది రోజుల పాటు చిత్రీకరించనున్నారు. ఈ ఫైట్‌లో ప్రభాస్‌తో ఫారిన్ ఫైటర్స్ పాల్గొంటారు. ఈ చిత్రానికి ఫైట్ హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2010 | 10:06 am నేనెవరో మీకు తెలుసా...?: ఆర్తీ అగర్వాల్ ప్రశ్నహిమ శిఖరాలంత ఎత్తుకు ఎదిగి దభాల్న కిందపడిపోయింది ఆర్తీ అగర్వాల్ కెరీర్. ఇటీవల టాలీవుడ్ స్టార్ హోటల్ పార్టీలకెళ్లినప్పుడు బిగ్ ప్రొడ్యూసర్స వద్దకెళ్లి నేనెవరో మీకు తెలుసా...? అంటూ తనను తనే పరిచయం చేసుకుంటోందట ఆర్తీ. దీన్ని చూసిన ఆర్తి సన్నిహితులు "పూర్.. ఆర్తీ" అని నిట్టూర్పులు విడుస్తున్నారట. భర్త నుంచి విడాకులు తీసుకున్న అనంతరం నేరుగా టాలీవుడ్ చేరిన ఈ సొట్టబుగ్గల భామ పెళ్లైన తర్వాత కూడా హీరోయిన్‌గా రాణించాలని ఆశపడింది. ఇందులో భాగంగా తొలుత టాప్ స్టార్ల వెంటపడి, చివరకి ఛాన్సులు దక్కకపోవడంతో హాస్య నటులతో జత కట్టింది. సునీల్ "అందాల రాముడు" ఇచ్చిన హిట్‌తో ఆ తర్వాత ఇతర చిన్నచిన్న హాస్య నటులతో సైతం నటించడానికి "సై" అంది. చివరికి ఇటీవల ఓ ద్వితీయశ్రేణి హీరోతో లిప్ టు లిప్ ముద్దు సన్నివేశంలో నటించి హీటెక్కించే ప్రయత్నం చేసింది. బ్యాడ్ లక్... ప్రేక్షకులు మాత్రం దాన్ని అంత వేడిగా తీసుకోలేదు. దీంతో ఆర్తి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పుడేం చేయాలా...? అని ఆర్తీ ఆలోచనలో పడ్డట్లు టాలీవుడ్ సినీ టాక్.Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2010 | 8:58 am రాజీనామాలు ఆమోదించే దాకా రాజధానిని వదలం: నాగంప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తాము చేసిన రాజీనామాలను ఆమోదించాల్సిందేనని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. అప్పటి వరకు హైదరాబాద్‌ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని ఆయన గురువారం తేల్చి చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 21 Jan 2010 | 7:19 am ప్రభుత్వ ఆదాయం పెరిగితేనే సంక్షేమం: రోశయ్యరాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగితేనే ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించే అవకాశం ఉంటుందని లేని పక్షంలో కష్టసాధ్యమని ముఖ్యమంత్రి రోశయ్య అభిప్రాయపడ్డారు. అందువల్ల రెవెన్యూ వసూళ్ళపై కలెక్టర్లు దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.Source: ఏపీ న్యూస్ | 21 Jan 2010 | 5:45 am టాక్సీ పర్మిట్లు మరాఠీయులకే ఇవ్వాలి: రాజ్థాక్రేమహారాష్ట్రలో కొత్త టాక్సీ పర్మిట్లను కేవలం మరాఠీయులకు మాత్రమే కేటాయించాలని, మరాఠేతరులకు కేటాయిస్తే మాత్రం ప్రతిఘటిస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రే హెచ్చరించారు. దీనిపై ఆయన గురువారం మాట్లాడుతూ.. కొత్త టాక్సీ పర్మిట్లను మహారాష్ట్రేతరులకు ఇవ్వడాన్ని తాము సహించబోమన్నారు.Source: జాతీయ | 21 Jan 2010 | 5:21 am లడ్డూలు తినిపించిన విక్టరీ వెంకటేష్వెంకటేష్, త్రిష హీరోహీరోయిన్లుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన "నమో వెంకటేశ" చిత్రం సక్సెస్ మీట్ రామానాయుడు స్టూడియోలో వెరైటీగా జరిగింది. సంక్రాంతి పండుగ వాతావరణంతో భోగి మంటలను వేసి పిండివంటలు మరోపక్క అమర్చి వాటిని ఒక్కొక్కరూ తింటూ చిత్రం గురించి మాట్లాడుతూ చర్చావేదికలా సాగించారు.వెంకటేష్ అందరి టాలెంట్‌ను ప్రశంసిస్తూ.. వారి దగ్గరికి వెళ్లి లడ్డూలు, అరిసెలు తినిపించారు. చిత్ర విజయం అందరి సమిష్టి కృషి అనీ, సంక్రాంతి చిత్రాల్లో అన్నీ హిట్ అయ్యాయనీ, వాటిలో నా చిత్రం కూడా ఉండటం ఆనందంగా ఉందని అన్నారుదర్శకుడు మాట్లాడుతూ... గత డిసెంబర్‌లో ఈ సినిమాను చేద్దామనుకున్నప్పుడు గోపీమోహన్ చెప్పిన లైన్ ఎంతగానో నచ్చింది. అనుకున్నట్లుగానే చిత్రం హిట్ అయింది. వెంకటేష్‌తో మరో సినిమా చేయాలనే కోరిక కలిగింది. తప్పకుండా చేస్తాను. టెక్నీషియన్స్ బలంతో ఈ చిత్రం సక్సెస్ అయిందన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2010 | 4:47 am "ఇందు"గా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఛార్మి!గ్లామర్, లేడిఓరియెంటెడ్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల ముద్దుగుమ్మ ఛార్మి త్వరలో "ఇందు"గా వస్తోంది. మనోరమ, మంత్ర వంటి హిట్ సినిమాల తరహాలో "ఇందు" కూడా ఉంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. పబ్లిసిటీ రంగంలో 9 సంవత్సరాల అనుభవంగల బిబిఎస్ స్టూడియో తొలిసారిగా తమిళ చిత్రాన్ని తెలుగులో "ఇందు"గా అనువదించింది. ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2010 | 4:30 am జేకేలో ప్రీపెయిడ్ మొబైల్స్‌పై నిషేధం ఎత్తివేత: కేంద్రంజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్లపై ఉన్న నిషేధాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గురువారం ఎత్తివేసింది. అయితే, నిబంధనలను మాత్రం మరింత కఠినతరం చేసింది. ప్రధానంగా ప్రీపెయిడ్ కష్టమర్ల చిరునామాలను ఖచ్చితంగా పరిశీలించి ధృవీకరించాలని పేర్కొంది.Source: జాతీయ | 21 Jan 2010 | 4:00 am ఇకపై.. సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ ఉద్యమాలు!ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ ఉద్యమాలనే మనం చూస్తూ వచ్చాం. ఇక నుంచి సీమాంధ్ర రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమాలను కూడా చూడబోతున్నారు.Source: ఏపీ న్యూస్ | 21 Jan 2010 | 3:57 am డీఎస్ ఆదేశాలను ఖాతరు చేయని ఎమ్మెల్యేలు!రాజీనామాలు ఉపసంహరించుకోవాలని పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ చేసిన విజ్ఞప్తిని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు తిరస్కరించారు. దీంతో డీఎస్ చేసేదేమి లేక ఢిల్లీకి వెళ్లి పరిస్థితిని వివరించనున్నారు.Source: ఏపీ న్యూస్ | 21 Jan 2010 | 3:25 am ధరల నియంత్రణపై 27న ముఖ్యమంత్రుల సదస్సు!దేశంలో నానాటికీ పెరిగిపోతున్న నిత్యావసర వస్తు ధరలను అదుపు చేసే విషయంపై ఈనెల 27వ తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సును కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ సదస్సుకు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షత వహిస్తారు.Source: జాతీయ | 21 Jan 2010 | 2:20 am
|