రాష్ట్ర సమస్యలు గాలికి... సింగపూర్‌కు చంద్రబాబు!

తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలతో రాష్ట్రం అట్టుడికి పోతుంటే తొమ్మిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం తనకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 21 Jan 2010 | 8:42 am

పెరగనున్న విద్యుత్‌ వినియోగం...!

దేశంలో నానాటికీ విద్యుత్‌ వినియోగం పెరిగిపోతోంది. దీంతో రానున్న పది సంవత్సరాల కాలంలో ఇది మరింత రెట్టింపవుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో సంవత్సరానికి ప్రతి గంటకు 600 టెరావాట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. కాగా వచ్చే దశాబ్దంలో ఇది మరింత రెట్టింపవుతుందని, ఇది రష్యా వినియోగాన్ని మించిపోనుందని బెంగుళూరులోనున్న ప్రముఖ పరిశోధనాసంస్థ కెపిఎంజి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మనీష్‌ అగర్వాల్‌ తెలిపారు. బెంగుళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ...ప్రస్తుతం వినియోగిస్తున్న విద్యుత్‌కన్నా రానున్న మరో పది సంవత్సరాలలో ఇది మరింత రెట్టింపు కానుందన ఆయన వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 21 Jan 2010 | 8:39 am

2.7 శాతం పెరగనున్న ప్రపంచ ఆర్థిక వృద్ధి

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం తగ్గుముఖం పట్టనుండటంతో 2010వ సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వృద్ధి 2.7 శాతం వృద్ధి చెందవచ్చని ప్రపంచ బ్యాంకు ఆశాభావం వ్యక్తం చేసింది.
Source: Yahoo! Telugu: News | 21 Jan 2010 | 8:28 am

మిశ్రమ ఫలితాల్లో అంతర్జాతీయ మార్కెట్లు

గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. అమెరికా మార్కెట్ నష్టాల్లో కూరుకుపోగా యూరప్ మార్కెట్ లాభాలను ఆర్జిస్తోంది. కానీ ఆసియా మార్కెట్ మాత్రం మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. దీంతో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3.00 గంటల ప్రాంతంలో విదేశీ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటున్నాయి.
Source: Yahoo! Telugu: News | 21 Jan 2010 | 8:09 am

హైతీని ఆక్రమించుకోవాలనే ఉద్దేశం లేదు: ఒబామా

భారీ భూకంపం బారిన పడి అల్లాడుతున్న హైతీని ఆక్రమించుకోవాలనే దురుద్దేశం తమకు లేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితుల్లో హైతీలోని భూకంప బాధితులను ఆదుకోవడమే తమ ప్రథమ కర్తవ్యమని ఆయన పునరుద్ఘాటించారు.
Source: Yahoo! Telugu: News | 21 Jan 2010 | 8:01 am

ధరల నియంత్రణపై 27న ముఖ్యమంత్రుల సదస్సు!

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న నిత్యావసర వస్తు ధరలను అదుపు చేసే విషయంపై ఈనెల 27వ తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సును కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ సదస్సుకు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షత వహిస్తారు.
Source: Yahoo! Telugu: News | 21 Jan 2010 | 7:50 am

డెడ్‌లైన్ కేంద్రానికి కాదు ఎమ్మెల్యేలకే: ప్రొ.కోదండరామ్

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంపై తెలంగాణ రాజకీయ జేఏసీ కేంద్రానికి డెడ్‌లైన్ విధించినట్టు వచ్చిన వార్తలను జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ఖండించారు. కేంద్రానికి తామెలాంటి డెడ్‌లైన్ విధించలేదని కేవలం తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలకు మాత్రమే విధించామని ఆయన గురువారం వివరణ ఇచ్చారు.
Source: Yahoo! Telugu: News | 21 Jan 2010 | 7:36 am

భారీ నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్

గురువారం బాంబే స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను నమోదు చేసుకుంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి విదేశీ మార్కెట్ల ప్రభావంతో నష్టాలను చవిచూసిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 288 పాయింట్లు భారీగా క్షీణించి, 17,185 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 108 పాయింట్లు భారీగా పతనమై, 5,112 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 21 Jan 2010 | 7:21 am

ట్రేడింగ్ క్షీణత: నష్టాల్లో స్టాక్ మార్కెట్

దేశీయ, విదేశీ వాటాల ట్రేడింగ్ క్షీణించడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో పయనిస్తోంది. గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాలను చవిచూసిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 114 పాయింట్లు పతనమై, 17,359 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 34 పాయింట్లు పడిపోయి, 5,187 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 21 Jan 2010 | 7:14 am

భారత్‌లో పాక్ పార్లమెంట్ బృందం పర్యటన రద్దు!

పాకిస్తాన్ పార్లమెంట్ బృందం తమ భారత్ పర్యటనను రద్దు చేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా పాక్ పార్లమెంట్ బృందం పర్యటనను రద్దు చేసుకున్నట్లు ఆ దేశ జాతీయ అసెంబ్లీ స్పీకర్ ఫెహ్మిదా మీర్జా తెలిపారు. ఇంకా ఐపీఎల్-3 వేలంలో పాక్ క్రికెటర్లను కొనుగోలు చేయకపోవడంతోనే పాక్ పార్లమెంట్ బృందం భారత్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు మీర్జా ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 21 Jan 2010 | 7:06 am

లడ్డూలు తినిపించిన విక్టరీ వెంకటేష్

వెంకటేష్, త్రిష హీరోహీరోయిన్లుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన "నమో వెంకటేశ" చిత్రం సక్సెస్ మీట్ రామానాయుడు స్టూడియోలో వెరైటీగా జరిగింది. సంక్రాంతి పండుగ వాతావరణంతో భోగి మంటలను వేసి పిండివంటలు మరోపక్క అమర్చి వాటిని ఒక్కొక్కరూ తింటూ చిత్రం గురించి మాట్లాడుతూ చర్చావేదికలా సాగించారు.వెంకటేష్ అందరి టాలెంట్‌ను ప్రశంసిస్తూ.. వారి దగ్గరికి వెళ్లి లడ్డూలు, అరిసెలు తినిపించారు. చిత్ర విజయం అందరి సమిష్టి కృషి అనీ, సంక్రాంతి చిత్రాల్లో అన్నీ హిట్ అయ్యాయనీ, వాటిలో నా చిత్రం కూడా ఉండటం ఆనందంగా ఉందని అన్నారుదర్శకుడు మాట్లాడుతూ... గత డిసెంబర్‌లో ఈ సినిమాను చేద్దామనుకున్నప్పుడు గోపీమోహన్ చెప్పిన లైన్ ఎంతగానో నచ్చింది. అనుకున్నట్లుగానే చిత్రం హిట్ అయింది. వెంకటేష్‌తో మరో సినిమా చేయాలనే కోరిక కలిగింది. తప్పకుండా చేస్తాను. టెక్నీషియన్స్ బలంతో ఈ చిత్రం సక్సెస్ అయిందన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2010 | 4:47 am

"ఇందు"గా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఛార్మి!

గ్లామర్, లేడిఓరియెంటెడ్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల ముద్దుగుమ్మ ఛార్మి త్వరలో "ఇందు"గా వస్తోంది. మనోరమ, మంత్ర వంటి హిట్ సినిమాల తరహాలో "ఇందు" కూడా ఉంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. పబ్లిసిటీ రంగంలో 9 సంవత్సరాల అనుభవంగల బిబిఎస్ స్టూడియో తొలిసారిగా తమిళ చిత్రాన్ని తెలుగులో "ఇందు"గా అనువదించింది. ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2010 | 4:30 am

రాష్ట్ర సమస్యలు గాలికి... సింగపూర్‌కు చంద్రబాబు!

తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలతో రాష్ట్రం అట్టుడికి పోతుంటే తొమ్మిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం తనకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Jan 2010 | 3:13 am

కోదండరామ్ విద్యార్థులను ఆత్మాహుతి దళాలుగా చేస్తున్నారు

తెలంగాణా జేఏసీ కన్వీనర్, ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణా విద్యార్థులను ఆత్మాహుతి దళాలు మాదిరిగా మారుస్తున్నారంటూ రాష్ట్ర మంత్రి ఆనం వివేకానంద రెడ్డి విర్శించారు. ముక్కుపచ్చలారని విద్యార్థుల ఆత్మహత్యలను ఆపాల్సినవారు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.
Source: ఏపీ న్యూస్ | 21 Jan 2010 | 3:06 am

ధరల నియంత్రణపై 27న ముఖ్యమంత్రుల సదస్సు!

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న నిత్యావసర వస్తు ధరలను అదుపు చేసే విషయంపై ఈనెల 27వ తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సును కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ సదస్సుకు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షత వహిస్తారు.
Source: జాతీయ | 21 Jan 2010 | 2:20 am

డెడ్‌లైన్ కేంద్రానికి కాదు ఎమ్మెల్యేలకే: ప్రొ.కోదండరామ్

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంపై తెలంగాణ రాజకీయ జేఏసీ కేంద్రానికి డెడ్‌లైన్ విధించినట్టు వచ్చిన వార్తలను జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ఖండించారు. కేంద్రానికి తామెలాంటి డెడ్‌లైన్ విధించలేదని కేవలం తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలకు మాత్రమే విధించామని ఆయన గురువారం వివరణ ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 21 Jan 2010 | 2:07 am

రాజీవ్ హత్యలో కీలక నిందితురాలు నళిని విడుదల..?

రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక నిందితురాలు నళినీ శ్రీహరన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 19 సంవత్సరాలుగా కారాగారవాసం చేస్తున్న నళినీని గడువు తేదీ కంటే ముందుగానే విడుదల చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Source: జాతీయ | 21 Jan 2010 | 12:48 am

ఐపీఎల్ వ్యవహారంలో జోక్యం లేదు: ఎస్ఎం కృష్ణ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ స్పష్టం చేశారు. ఐపీఎల్ టోర్నమెంట్, దానికి సంబంధించిన ఆటగాళ్ల ఎంపిక వ్యవహారంలో తమకెలాంటి సంబంధం లేదని ఆయన బుధవారం స్పష్టం చేశారు.
Source: జాతీయ | 20 Jan 2010 | 11:25 pm

సమైక్యం వద్దు.. తెలంగాణయే ముద్దు: మంత్రి దానం

రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ ప్లేటు ఫిరాయించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డికి అత్యంత ప్రియ శిష్యుడిగా పేరుగాంచిన దానం... గ్రేటర్ హైదరాబాద్ నినాదాన్ని వదిలిపెట్టారు. సమైక్యాంధ్ర కంటే తెలంగాణాయే ముద్దు అని ప్రకటించారు. తెలంగాణ ఆత్మహత్యల కంటే సమైక్యాంధ్ర లేదా సీమాంధ్ర నేతల వ్యాపారాలు ముఖ్యమా అంటూ ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 20 Jan 2010 | 10:42 pm

రాష్ట్రంలో ఇక నుంచి అరెస్టుల పర్వం ఆరంభం!

తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో భాగంగా ప్రజలను రెచ్చగొట్ట ప్రసంగాలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా, స్పష్టమైన ఆధారాలు ఉన్న వారిని అరెస్టు చేసేలా ఆదేశాలు జారీ చేయనుంది.
Source: ఏపీ న్యూస్ | 20 Jan 2010 | 10:29 pm

26/11 విచారణ: మరాఠీలో కసబ్ సమాధానం

ముంబై దాడుల కేసు విచారణలో భాగంగా పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ మరాఠీలో సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇందులోభాగంగా బుధవారం జరిగిన కోర్టు విచారణలో కూడా మేజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నలకు మారాఠీలో సమాధానం చెప్పడం గమనార్హం.
Source: జాతీయ | 20 Jan 2010 | 9:42 pm

డెడ్‌లైన్లు, హింసతో సాధించేది శూన్యం: ఏఐసీసీ

లక్ష్య సాధన కోసం డెడ్‌లైన్ల విధిస్తూ, హింసను ప్రేరేపించడం వల్ల ఒనగూరే ప్రయోజనాలు శూన్యమేనని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అభిప్రాయపడ్డారు. సమస్య ఉత్పన్నమైనపుడు దానికి పరిష్కార మార్గాలేమిటి అనే అంశంపై ఆరా తీయాలని ఆయన సూచించారు.
Source: జాతీయ | 20 Jan 2010 | 9:00 pm

ఫిబ్రవరి 12న యువసామ్రాట్ నాగార్జున "కేడీ"

కింగ్ నాగార్జున హీరోగా కిరణ్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి కామాక్షి కళా మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం "కేడి" నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... నాగార్జునగారితో మా బ్యానర్లో తీసిన స్టైలిష్ కమర్షియల్ ఫిలిమ్ కేడి. ఈమధ్యనే రిలీజ్ చేసిన ఈ చిత్రం ఆడియోకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 12న కేడీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మా బ్యానర్లో మరో హిట్ చిత్రంగా కేడీ నిలుస్తుందని అన్నారు.కింగ్ నాగార్జున, మమతా మోహన్ దాస్, అమెరికా అమ్మాయి లిండా ఓ ముఖ్యపాత్ర చేస్తున్న కేడీ చిత్రంలో "స్లమ్ డాగ్ మిలయనీర్" ఫేం అంకుర్, "బాండిట్ క్వీన్" ఫేం నిర్మల్ పాండే, "లగాన్" ఫేం అఖిలేంద్ర మిశ్రా, "డాన్" విలన్ కెల్లీడార్జ్, షాయాజి షిండే, బ్రహ్మానందం, హర్షవర్థన్, తనికెళ్ల భరణి ముఖ్యపాత్రలు పోషించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Jan 2010 | 10:52 am

ఫిబ్రవరి మొదటివారంలో జింగానియా "తేజం"

బలరాం సమర్పణలో సన్‌రేస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై తొమ్మిదిమంది హీరోలను పరిచయం చేస్తూ, రాజ్ కెఎస్ గోపి దర్శకత్వంలో రాజశేఖర్ నిర్మిస్తున్న తేజం ఫిబ్రవరి మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ... తొమ్మిదిమంది హీరోలతో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది. మంచి టెక్నికల్ వ్యాల్యూస్‌తో నిర్మించిన ఈ చిత్రం యువత మనోభావాలకు, ప్రస్తుత వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉంటుంది. ప్రీతి జింగానియా స్పెషల్ సాంగ్ ఈ చిత్రానికి ఒక హైలెట్ కాగా ఛేజింగ్, బ్రహ్మానందం కామెడీ మరో హైలెట్‌గా నిలువనున్నాయి అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Jan 2010 | 10:38 am

ప్రతికూల వాతావరణమే వైఎస్సార్ ప్రాణం తీసింది: నివేదిక

వైఎస్ నిరుడు సెప్టెంబరు 2న ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడానికి పైలెట్ తప్పిదమేనని తమ దర్యాప్తులో వెల్లడైనట్లు డిజిసిఏ బుధవారం న్యూ ఢిల్లీలో నివేదిక వెలువరించింది.
Source: జాతీయ | 20 Jan 2010 | 9:07 am

రాహుల్ గాంధీకే యువత పట్టం: సర్వేలో వెల్లడి

దేశీయ రాజకీయ రంగంలో వెలుగొందుతున్న నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారసుడు రాహుల్ గాంధీ యువకుల హృదయాన్ని గెలుచుకున్నాడనడంలో సందేహం లేదు. బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్‌ను కూడా వెనక్కు నెట్టి ప్రజా హృదయ నేతగా రాహుల్ గాంధీ ముందు వరుసలో ఉన్నాడు.
Source: జాతీయ | 20 Jan 2010 | 6:22 am

జ్యోతిబసు బ్రెయిన్‌ను పరిశోధన చేయనున్న నిమ్‌హాన్స్

ఇటీవల కన్నుమూసిన కమ్యూనిస్టు వృద్ధనేత జ్యోతిబసు మెదడు (బ్రెయిన్)ను పరిశోధన చేయాలని బెంగుళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్‌హాన్స్) భావిస్తోంది. 95 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా వృద్ధనేత మెదడు అద్భుత పనితీరుకు గల కారణాలపై ఆరా తీయాలని భావిస్తోంది.
Source: జాతీయ | 20 Jan 2010 | 6:16 am

కరీనా చొట్ట బుగ్గలను వదల్లేని సైఫ్ అలీ ఖాన్

సినీ తారలు తమ అందాలకు మెరుగులు దిద్దుకునే వ్యవహారంలో మునుముందుకు వెళుతున్నారు. మొన్నటి వరకూ నడుము చుట్టు కొవ్వు కరిగించుకోవడం, వక్షోజాలను పెద్దవిగా చేసుకోవడంకోసం బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ వంటివాటికే పరిమితమైన తారలు తాజాగా బుగ్గలపై దృష్టి కేంద్రీకరించారు. కొవ్వెక్కిన బుగ్గలు మాకొద్దంటూ బుగ్గల్లోనున్న కొవ్వును తీయించుకుంటున్నారు. బుగ్గల్లో కొవ్వును తీయడమేంటి... అనుకుంటున్నారా...? ఇది నిజం. బాలీవుడ్‌లో ఉన్న హీరోయిన్లలో బూరె బుగ్గలు కలిగిన తారామణులు చాలామంది ఈ బుగ్గలు తగ్గించుకునే చికిత్సను చేయించుకుంటున్నారట. ముంబయిలో ఈ చికిత్సలను చేస్తున్న వైద్యులకు ఇప్పుడు తీరిక దొరకడం లేదట. గతంలో వక్షోజపు అందాలకోసం, నడుము నాజూకుదనంకోసం ఎగబడిన తారలు ఇప్పుడు బుగ్గల నాజూకుదనంకోసం తమ వద్దకు క్యూ కడుతున్నారని సదరు వైద్యులు చెపుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Jan 2010 | 5:18 am

ఫిబ్రవరి మొదటివారంలో జింగానియా "తేజం"

బలరాం సమర్పణలో సన్‌రేస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై తొమ్మిదిమంది హీరోలను పరిచయం చేస్తూ, రాజ్ కెఎస్ గోపి దర్శకత్వంలో రాజశేఖర్ నిర్మిస్తున్న తేజం ఫిబ్రవరి మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ... తొమ్మిదిమంది హీరోలతో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది.
Source: వినోదం | 20 Jan 2010 | 5:08 am

ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర: కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం విద్యార్థులు చేస్తున్న ఉద్యమాన్ని నీరు గార్చేందుకు ప్రభుత్వం కుట్రపన్నిందని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆరోపించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ క్యాంపస్‌ను పోలీసులకు అప్పగించి ముఖ్యమంత్రి రోశయ్య చోద్యం చూస్తూ కూర్చుకున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Source: ఏపీ న్యూస్ | 20 Jan 2010 | 5:07 am

27న గుంటూరు జిల్లాలో చిరంజీవి పర్యటన

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఈనెల 27వ తేదీ నుంచి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజున ప్రరాపా ఆధ్వర్యంలో చేపట్టే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ముఖ్యంగా, నిత్యావసరవస్తు ధరల పెరుగుదలను ఖండిస్తూ ప్రరాపా ఆధ్వర్యంలో చేపట్టే సత్యాగ్రహం కార్యక్రమంలో చిరంజీవి పాల్గొంటారని స్థానిక జిల్లా నేతలు వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 20 Jan 2010 | 4:29 am

భూగర్భ ఊహాతీత ప్రకృతి ప్రసాదం "బెలూం గుహలు"

బెలూం గుహలను సందర్శించాలనుకుంటే ప్రకృతిని ఆస్వాదించగల హృదయం, కాస్తంత గుండె ధైర్యం ఉండి తీరాల్సిందే. గుహల లోలోపలికి వెళుతుంటే అదో సరికొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. ఆ కొత్త ప్రపంచంలో మనమూ లీనమై, మమేకమై తన్మయత్వంతో ప్రతి అంగుళాన్ని కొత్తగా, వింతగా దర్శిస్తాం. అలాగే ముందుకెళ్తే ఆశ్చర్యం, ఆనందం, ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరైపోయే ఈ అద్భుత ప్రదేశంలో పర్యటించటమే ఓ గొప్ప అనుభూతిగా మదిలో మిగిలిపోతుంది.
Source: వినోదం | 20 Jan 2010 | 4:09 am

ఆసీస్ దాడులపై నివేదిక కోరిన మంత్రి ఎస్.ఎం.కృష్ణ!

ఆస్ట్రేలియాలో నివశించే భారతీయులపై కొనసాగుతున్న దాడులపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ తీవ్రంగా స్పందించారు. ఈ దాడులపై తక్షణం నివేదిక సమర్పించాలని ఆయన కాన్‌బెర్రాలోని భారత హై కమిషనర్‌ను కోరారు.
Source: జాతీయ | 20 Jan 2010 | 2:28 am