కామ్రేడ్ జ్యోతిబసుకు నేతల ఘన నివాళులు!

కమ్యూనిస్టు కురువృద్ధుడు జ్యోతిబసుకు పలువురు నేతలు ఘన నివాళులు అర్పించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ, భాజపా అధ్యక్షుడు నితిన్ గడ్కారీలతో పాటు... వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఉన్నారు.
Source: Yahoo! Telugu: News | 19 Jan 2010 | 8:48 am

చైనా పెట్టుబడీదారులను ఆహ్వానించిన కేంద్రం

దేశీయ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి తమ వ్యాపారాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి ఆనంద్ శర్మ మంగళవారం చైనా కంపెనీలకు షాంఘైలో ఆహ్వానం పలికారు.
Source: Yahoo! Telugu: News | 19 Jan 2010 | 8:26 am

వెనక్కి తీసుకుంటారా లేదా: అధిష్టానం అల్టిమేటం!

రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై కొరఢా ఝుళిపించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైంది. తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటీ విధించిన నిర్ణీత గడువు (ఈనెల 28వ తేదీ)లోపే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
Source: Yahoo! Telugu: News | 19 Jan 2010 | 7:44 am

నేడు భారత్‌కు రానున్న అమెరికా రక్షణ మంత్రి!

అగ్రదేశం అమెరికా రక్షణ శాఖామంత్రి రాబర్ట్ గేట్స్ మంగళవారం భారత్‌కు రానున్నారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆయన న్యూఢిల్లీకి వస్తున్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్-అమెరికా సంబంధాల్లో భాగంగా.. స్వదేశీ, విదేశీ వ్యవహారాలపై ఆయన భారత ప్రతినిధులతో చర్చలు జరుపుతారు.
Source: Yahoo! Telugu: News | 19 Jan 2010 | 7:30 am

అమ్మకాల ఒత్తిడి: నష్టాల్లో స్టాక్ మార్కెట్

సోమవారం లాభదాయకంగా ముగిసిన బాంబే స్టాక్ మార్కెట్.. మంగళవారం నష్టాల్లో కొనసాగుతోంది. మంగళవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనంవైపు బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు ర్యాలీని కొనసాగిస్తున్నాయి. దీంతో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, 59 పాయింట్లు పతనమై, 17,581 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 27 పాయింట్లు క్షీణించి, 5,246 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 19 Jan 2010 | 7:27 am

త్రిష నిజంగా "మందు" కొడుతుందా...?!!

టాలీవుడ్‌లో నెంబర్‌వన్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న త్రిష అప్పుడప్పుడూ తళుక్కున వార్తల్లో కనిపిస్తుంది. అది కూడా పీకల దాకా తాగేసి ఎవర్నో ఒకర్ని గోల చేస్తూ... "ఛ" ఇదంతా నిజమేనా...? అనంటే... నిజమేనంటున్నారు. పార్టీలంటే ఎగిరి గంతేసే ఈ తమిళ సుందరి ఆ మధ్య తాగి రోడ్డుమీద నానా గొడవ చేస్తే పోలీసులు బతిమాలి ఆమెను ఇంటికి పంపించి వేసినట్లు అప్పట్లో తమిళ పత్రికలు రాశాయి. ఆ తర్వాత ఓ పబ్బులో పీకల్దాక తాగేసి క్రికెటర్ హేమాంగ్ బదానీపై ఫైటింగ్ చేసినట్లు కూడా ఆ పత్రికలే మరోసారి చెప్పాయి. దీనిపై త్రిష గరంగరం అయినప్పటికీ అసలు ఈ అందాల సుందరి నిజంగా మందు కొడుతుందా...? అని ఆరా తీస్తే ఆశ్చర్యకర విషయాలు ఆమె సన్నిహితుల ద్వారా వెలికి వచ్చాయి. సాయంత్రమైతే చాలు... ఎక్కడున్నా త్రిష మందు పార్టీల్లో మునిగి తేలుతుందని ఆమెతో సినిమాలు తీసిన కొందరు దర్శక, నిర్మాతలు చెప్పారు. కనుక త్రిష... గొడవలు పెట్టుకోవడానికి తాగిన మైకమే కారణమన్నమాట. కనుక త్రిష... నిషా త్రిషా అన్నమాట!!
Source: Yahoo! Telugu: Entertainment | 19 Jan 2010 | 7:18 am

రాష్ట్ర గవర్నర్‌గా నరసింహన్ ఎందుకంటే...?!!

తివారీ రాసలీల వ్యవహారం... ఆ తదుపరి పరిస్థితుల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిక గవర్నర్‌గా నియమితులైన ఏక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్ (ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌) ఈ నెల 22 (శుక్రవారం) ఉదయం 9.45కి రాజ్‌భవన్‌లో పూర్తిస్థాయి గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేంద్రం ఆయనను పూర్తిస్థాయి గవర్నర్‌గా కొనసాగేందుకు ఉత్తర్వులిచ్చింది. గతంలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తానని ప్రమాణం చేసిన నరసింహన్‌ నిబంధనల మేరకు పూర్తిస్థాయి బాధ్యతల కోసం మరోసారి ప్రమాణం చేయాల్సి ఉంది.
Source: Yahoo! Telugu: News | 19 Jan 2010 | 7:13 am

స్వల్ప నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్

ట్రేడింగ్ బలహీనత కారణంగా మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ తిరోగమనం వైపు పయనిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాలను చవిచూస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో కేవలం 9 పాయింట్లు క్షీణించి, 17,631 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా కేవలం నాలుగు పాయింట్లు పతనమై, 5,270 పాయింట్ల వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది.
Source: Yahoo! Telugu: News | 19 Jan 2010 | 7:05 am

పుంజుకోని ట్రేడింగ్: నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

దేశీయ వాటాల ట్రేడింగ్ పుంజుకోకపోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో పయనిస్తోంది. ఆసియా, అమెరికా మార్కెట్లు సైతం నష్టాలను నమోదు చేసుకోవడం బాంబే స్టాక్ మార్కెట్‌కు ఏ మాత్రం కలిసిరాలేదు. దీంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. 45 పాయింట్లు క్షీణించి, 17,595 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 19 పాయింట్లు పడిపోయి, 5,255 పాయింట్ల వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది.
Source: Yahoo! Telugu: News | 19 Jan 2010 | 6:24 am

బసు మరణం జాతికి తీరని నష్టం: దేవె గౌడ

కమ్యూనిస్టు కురువృద్ధుడు జ్యోతిబసు మరణంతో జాతి ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని, ఆ నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరని మాజీ ప్రధానమంత్రి దేవె గౌడ అన్నారు. జ్యోతి బసు అంతిమ యాత్రలో పాల్గొనేందుకు కోలకతాకు వచ్చిన దేవె గౌడ విలేకరులతో మాట్లాడారు.
Source: Yahoo! Telugu: News | 19 Jan 2010 | 6:17 am

జీతాలు పెంచనున్న టీసీఎస్

దేశంలోని ఔట్ సోర్సింగ్ రంగంలో అగ్రగామిగానున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో తన ఉద్యోగులకు జీతభత్యాలు పెంచనుంది.
Source: Yahoo! Telugu: News | 19 Jan 2010 | 5:56 am

కామెడీ దర్శకులుగా మిగిలిపోతారా...? శ్రీను వైట్లకు ప్రశ్న

విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన "నమో వెంకటేశ" చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా వెబ్‌దునియా తెలుగు శ్రీనును పలుకరించింది. ఈ సందర్భంగా ఆయనతో మాటామంతీ... "నమో వెంకటేశ" ఏ రేంజ్‌లో సక్సెస్ అయిందని భావిస్తున్నారు? వెంకటేష్ సినిమాలు స్టాడింగ్ హైలో ఉంటాయి. క్రమబద్ధంగా నిదానంగా ఆయన చిత్రాలు పుంజుకుంటాయి. ఆ తర్వాత హై రేంజ్‌కు వెళతాయి. కానీ ఈ చిత్రం మొదట్లోనే బాగా హైక్ వచ్చింది. అన్నిచోట్లా బాగానే ఆడుతోంది. తూర్పు గోదావరిలో నాలుగు రోజులకు 78 లక్షల షేర్ వచ్చింది. వారమయితే కోటి 8 లక్షలు వస్తుంది. వైజాగ్, సీడెడ్, నైజాం అన్ని ఏరియాల్లోనూ సూపర్ హిట్ టాక్
Source: Yahoo! Telugu: Entertainment | 19 Jan 2010 | 4:51 am

కామ్రేడ్ జ్యోతిబసుకు నేతల ఘన నివాళులు!

కమ్యూనిస్టు కురువృద్ధుడు జ్యోతిబసుకు పలువురు నేతలు ఘన నివాళులు అర్పించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ, భాజపా అధ్యక్షుడు నితిన్ గడ్కారీలతో పాటు... వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఉన్నారు.
Source: జాతీయ | 19 Jan 2010 | 3:19 am

వెనక్కి తీసుకుంటారా లేదా: అధిష్టానం అల్టిమేటం!

రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై కొరఢా ఝుళిపించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైంది. తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటీ విధించిన నిర్ణీత గడువు (ఈనెల 28వ తేదీ)లోపే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
Source: ఏపీ న్యూస్ | 19 Jan 2010 | 2:15 am

బసు మరణం జాతికి తీరని నష్టం: దేవె గౌడ

కమ్యూనిస్టు కురువృద్ధుడు జ్యోతిబసు మరణంతో జాతి ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని, ఆ నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరని మాజీ ప్రధానమంత్రి దేవె గౌడ అన్నారు. జ్యోతి బసు అంతిమ యాత్రలో పాల్గొనేందుకు కోలకతాకు వచ్చిన దేవె గౌడ విలేకరులతో మాట్లాడారు.
Source: జాతీయ | 19 Jan 2010 | 12:47 am

తెలంగాణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది: షకీల్ అహ్మద్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ పునరుద్ఘాటించారు. ఈ విషయంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు ఏకాభిప్రాయానికి రావాల్సి వుందని ఆయన తెలిపారు.
Source: జాతీయ | 18 Jan 2010 | 11:30 pm

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు: ఎస్ఎస్పీ యాదవ్‌ బదిలీ!

ముఖ్యమంత్రి కె.రోశయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ఎస్ఎస్పీ యాదవ్‌పై రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ బదిలీ వేటు వేసింది. రాష్ట్ర డీజీపీ వంటి హోదాలో కొనసాగిన యాదవ్ తన మాటతీరుతో అందరినీ దూరం చేసుకుంటున్న విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 18 Jan 2010 | 11:24 pm

'ఆ నలుగురు' భారతీయులే: తీవ్రవాది కసబ్

దేశ వాణిజ్య రాజధాని ముంబై దాడుల్లో భాగంగా ఐదు నక్షత్రాల తాజ్ హోటల్‌లో మారణకాండ సృష్టించిన నలుగురు తీవ్రవాదులు భారతీయులేనని పాకిస్థాన్ తీవ్రవాది అజ్మల్ కసబ్ మరో సంచలన ప్రకటన చేశాడు. 26/11 కేసు విచారణలో భాగంగా సోమవారం జరిగిన కేసు విచారణ సమయంలో అజ్మల్ పై విధంగా వ్యాఖ్యానించడం గమనార్హం.
Source: జాతీయ | 18 Jan 2010 | 10:57 pm

సీమాంధ్రలో తెదేపా మనుగడ ఇక కష్టమేనా!

రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కానుందా? తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనానికి, వైఖరికి సీమాంధ్ర తెదేపా నేతలతో పాటు.. సామాన్య కార్యకర్తల్లో సైతం అసహనం పెరిగిపోతోంది.
Source: ఏపీ న్యూస్ | 18 Jan 2010 | 10:45 pm

సమైక్యాంధ్ర కోసం కలిసి నడుద్ధాం: సీమాంధ్ర కాంగ్రెస్

సమైక్యాంధ్ర కోసం పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరూ కలిసి నడుద్ధామని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రాంత ఎమ్మెల్యేలు సంయుక్తంగా పిలుపునిచ్చారు. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు కూడా కలిసి రావాలని ప్రభుత్వ విప్ శైలజానాథ్ విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 18 Jan 2010 | 10:26 pm

అపుడు.. ఇపుడు.. ఎపుడూ ఎస్పీ కార్యకర్తనే: అమర్

అపుడు.. ఇపుడు.. ఎపుడూ సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తగా కొనసాగుతానని ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ స్పష్టం చేశారు. అయితే, ఇప్పటి వరకు ములాయం వాదిగా పేరుతెచ్చుకున్నానని, ఇకపై పక్కా ఎస్పీ కార్యకర్తగా మెలుగుతానని చెప్పారు.
Source: జాతీయ | 18 Jan 2010 | 9:08 pm

నేడు కమ్యూనిస్టు యోధుని అంతిమయాత్ర!

కమ్యూనిస్టు యోధుడు, బెంగాల్ ప్రజల ఆశాజ్యోతి, మార్క్సిస్టు వృద్ధనేత దివంగత జ్యోతిబసు అంతిమయాత్ర మంగళవారం జరుగనుంది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి అతిరథమహారధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో పాటు.. 30 దేశాలకు చెందిన ప్రతినిధులు కోల్‌కతాకు ఇప్పటికే చేరుకున్నారు.
Source: జాతీయ | 18 Jan 2010 | 8:54 pm

రాజా- పదుకునె జంటగా జయకృష్ణ క్రియేషన్స్ చిత్రం

రాజా, సంచిత పదుకునె జంటగా శ్రీనివాస్ బళ్లాపురం దర్శకత్వంలో జయకృష్ణ క్రియేషన్స్ పతాకంపై సి.గోపాల కృష్ణ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాదులో ప్రారంభమైంది. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి పారిశ్రామికవేత్త రేబాల కిషోర్ కుమార్ రెడ్డి కెమేరా స్విచాన్ చేయగా జెవికె ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ కార్తీక్ క్లాప్ ఇచ్చారు. రంగారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ... "రెండేళ్ల కిందట హైదరాబాదులో జరిగిన ఒక ఎన్నారై యువకుని ప్రేమకథే ఈ చిత్ర కథాంశం. ప్రస్తుత రోజుల్లో నవలా పఠనం తగ్గిపోయింది. ఈ సినిమా చూస్తున్నంతసేపు చక్కటి నవల చదువుతున్న అనుభూతిని కలిగిస్తుంది. వెంగి విఠల్ చక్కటి సంగీతాన్ని అందించారు" అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 18 Jan 2010 | 11:49 am

" ఆ నలుగురు " భారతీయులే : కసబ్

ఆర్థిక రాజధాని ముంబైలో 2008లో జరిగిన తీవ్రవాదుల దాడి ఘటనలో పట్టుబడ్డ ఏకైక తీవ్రవాది అజ్మల్ అమీర్ కసబ్ పొంతన లేని ప్రకటనలతో పోలీసులను, న్యాయవాదులను ముప్పతిప్పలు పెడుతున్నాడు.తాజాగా ముంబై పేలుళ్ళలో నలుగురు తీవ్రవాదులు భారతీయులేనని చెప్పాడు. వీరిలో ఇద్దరు గుజరాతీయులు, ఒకరు కాశ్మీరీతోపాటు మరో మరాఠీ మాట్లాడే వ్యక్తి కూడా ఉన్నాడని కసబ్ సోమవారం ప్రత్యేక న్యాయమూర్తి ఎం ఎల్ తహలియానికి చెప్పాడు.
Source: జాతీయ | 18 Jan 2010 | 8:12 am

అధిష్టానం సీరియస్‌గా ఉంది... ఉపసంహరించుకోండి

రాజీనామాల ఆమోదానికి డెడ్ లైన్ జనవరి 28 తేదీ సమీపిస్తున్నకొద్దీ తెలంగాణా ప్రాంత ఎమ్మెల్యేల్లో గుబులు రేగుతోంది. తెలంగాణా ప్రక్రియకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ కాలపరిమితితో కూడిన ప్రకటన చేయకపోతే తెలంగాణా ప్రాంత ఎమ్మెల్యేలందరూ రాజీనామాల ఆమోదానికి స్పీకర్‌పై ఒత్తిడి తీసుకరావాలన్న జేఏసీ పిలుపు దృష్ట్యా సోమవారంనాడు తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీఎస్‌తో సమావేశమయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 18 Jan 2010 | 7:30 am

"మగధీర"ను మించిన "శక్తి"తో జూనియర్ ఎన్టీఆర్..?!!

"అదుర్స్" ఇచ్చిన విజయంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కేరింతలు కొడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం అదుర్స్ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ఇదిలావుంటే అదుర్స్ తెచ్చిన ఉత్సాహంతో మరో వండర్‌ఫుల్ సినిమా చేయాలని చిన్న ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటివరకూ కలెక్షన్లలో రికార్డు బద్దలుకొట్టిన చిత్రాన్ని మించిన సినిమాను తీయాలని జూనియర్ ఎన్టీఆర్ యోచిస్తున్నట్లు తెలిసింది. అంటే... రామ్ చరణ్ "మగధీర" సృష్టించిన రికార్డును చెరిపేసి దూసుకవెళ్లాలన్న పట్టుదలలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో సి.అశ్వనీదత్ 45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా "శక్తి" చిత్రాన్ని చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు భోగట్టా. "మగధీర" చిత్రానికి 40 కోట్ల రూపాయలు ఖర్చైనట్లు టాలీవుడ్ ట్రేడ్ టాక్. ఈ నేపధ్యంలో ఆ చిత్రానికి మించి మరో 5 కోట్ల రూపాయలను అధికంగా ఖర్చు చేయడమే కాక, కలెక్షన్లలోనూ "మగధీర"ను మించి పోవాలన్న ధ్యేయంతో "శక్తి"వంచన లేకుండా కృషి జరుగుతున్నట్లు టాలీవుడ్ టాక్.
Source: Yahoo! Telugu: Entertainment | 18 Jan 2010 | 7:23 am

బోరుబావిలో పడిన మహేష్‌ను వీడని మృత్యువు

బోరు బావిలో పడిన మహేష్ మృతి చెందాడు. ఏడేళ్ళ బాలుడిని సజీవంగా రక్షించేందుకు వరంగల్ జిల్లా అధికార యంత్రాంగంతో పాటు.. ప్రైవేటు సంస్థలు రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. బోరుబావిలో పడేటపుడే తలకిందులు పడటం వల్ల బాలుడు మృతి చెందినట్టు వైద్యులు చెపుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 18 Jan 2010 | 5:32 am

సల్మాన్ - కత్రినా చాటుమాటు ప్రేమాయణం...?!!

"వీర్" చిత్రం తాలూకు ప్రివ్యూను చూసిన సినీ ప్రముఖులు సల్మాన్ బాడీ లాంగ్వేజ్ సూపర్ అని తెగ పొగిడేసే సరికి సల్మాన్ విర్రవీగిపోతున్నాడట. ఆ ఆనందాన్ని పైకి చెప్పకపోయినా ఇంటికెళ్లి రాత్రిళ్లు పొద్దుపోయే వరకూ పార్టీలలో మునిగి తేలుతున్నాడట. ఇదిలావుంటే సల్మాన్‌కు ఎన్నో రోజులుగా దూరంగా ఉంటున్న ఓ గొంతు అకస్మాత్తుగా పలుకరించిందట. అంతేకాదు పాత పరిచయాన్ని మరోసారి గుర్తు చేసి గారాలు పోయిందట. ఆ గారాలను చూసి సల్మాన్ గాలిలో తేలిపోతున్నాడట.అన్నట్లు ఆ గొంతు ఎవరిదో చెప్పలేదు కదూ...!! ఆమె సల్మాన్ ఖాన్ ప్రియురాలు కత్రినా కైఫ్. గత కొన్ని నెలలుగా సల్మాన్ ఖాన్ పేరు చెబితేనే తప్పించుక తిరుగుతున్న కత్రినా తాజాగా సల్మాన్‌తో తిరిగి ప్రేమాయణం సాగిస్తోందని బాలీవుడ్ కోడై కూస్తోంది.సల్మాన్ వీర్ చిత్రం చూసిన తర్వాత అందరూ కండల వీరుడ్ని పొగడ్తలతో ముంచెత్తుతుండటంతో కత్రినా కూడా తనవంతు అభినందనలు తెలిపుతూనే పనిలోపనిగా పాత గురుతులను ఏకరవు పెట్టినట్లు బాలీవుడ్ సినీ వర్గాల భోగట్టా. కానీ కత్రినా కైఫ్ సన్నిహితులు మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. సల్మాన్ ఖాన్‌ను కలలో కూడా కత్రినా పలుకరించదని అంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 18 Jan 2010 | 5:09 am

మన దృష్టి అభివృద్ధిపై.. కేంద్రం చూపు తెలంగాణపై: సీఎం

రాష్ట్ర అభివృద్ధిపై మనం ప్రత్యేక దృష్టిసారిద్ధాం. తెలంగాణ అంశాన్ని కేంద్రం చూసుకుంటుంది.. అని ముఖ్యమంత్రి కె.రోశయ్య సహచర మంత్రువర్యులతో అన్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ అంశంపై కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకునేంత వరకు ప్రతి ఒక్కరం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారిద్ధామన్నారు. అప్పటి వరకు మంత్రులు తమ మనస్పర్ధలను పక్కన పెట్టి గురుతర బాధ్యతతో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 18 Jan 2010 | 4:40 am

హైదరాబాద్ జంట పేలుళ్లు: కీలక తీవ్రవాది అరెస్టు!

గత 2007 సంవత్సరంలో హైదరాబాద్‌లో జరిగిన జంట పేలుళ్ళ కేసుల్లో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న హర్కత్ అల్ జిహాద్ అల్ ఇస్లామీ సంస్థకు చెందిన టాప్ కమాండర్ అజ్మద్ అలియాస్ షేక్ అబ్దుల్ ఖవాజాను చెన్నయ్‌లో పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
Source: జాతీయ | 18 Jan 2010 | 4:01 am

ప్రభుత్వం కూల్చివేతకు ప్రతిపక్షాల కుట్ర: శైలజానాథ్

ముఖ్యమంత్రి రోశయ్య సర్కారును కూల్చి వేయాలన్న రహస్య అజెండాతో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు పని చేస్తున్నట్టుగా ఉన్నాయని సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేల కన్వీనర్ ఆరోపించారు. దీనిపై ఆయన సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు ప్రతిపక్ష పార్టీలు పని చేస్తున్నాయన్నారు.
Source: ఏపీ న్యూస్ | 18 Jan 2010 | 3:16 am

పరీక్షలు యధాతథం: ఉస్మానియా రిజిస్ట్రార్

ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని కళాశాలల్లో మంగళవారం నుంచి జరుగనున్న పరీక్షలు యధావిధిగా జరుగుతాయని ఓయూ రిజిస్ట్రార్ కార్యాలయం స్పష్టం చేసింది. అయితే, పరీక్షలను బహిష్కరించాలని విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటి (జాక్) పిలుపునిచ్చింది.
Source: ఏపీ న్యూస్ | 18 Jan 2010 | 2:05 am

"మగధీర"ను మించిన "శక్తి"తో జూనియర్ ఎన్టీఆర్..?!!

"అదుర్స్" ఇచ్చిన విజయంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కేరింతలు కొడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం అదుర్స్ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ఇదిలావుంటే అదుర్స్ తెచ్చిన ఉత్సాహంతో మరో వండర్‌ఫుల్ సినిమా చేయాలని చిన్న ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. విశ్వసనీయ సమాచారం...
Source: వినోదం | 18 Jan 2010 | 1:55 am