|
విమాన చార్జీల్లో స్పష్టత ఉండాలి: ప్రఫుల్ పటేల్విమానయాన టికెట్ చార్జీల్లో పలు తేడాలున్నాయని, వీటిలో పలు కంపెనీలు ప్రకటించే ప్రకటనల్లో ఉండే టికెట్ ధరకన్నా కొనేటప్పుడు ధర రెట్టింపుగా ఉంటోంది. దీనికి రకరకాల సర్చార్జీ, యూజర్ చార్జీల మోత కారణంగా ఉంది. ఈ పద్ధతికి స్వస్తి చెప్పాలని, అన్నీ కలుపుకున్న చార్జీనే టికెట్ ధరగా ప్రకటించాలని కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ విమానయాన సేవలందిస్తున్న సంస్థలకు సూచించారు.Source: Yahoo! Telugu: News | 18 Jan 2010 | 8:36 am పరీక్షలు యధాతథం: ఉస్మానియా రిజిస్ట్రార్ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని కళాశాలల్లో మంగళవారం నుంచి జరుగనున్న పరీక్షలు యధావిధిగా జరుగుతాయని ఓయూ రిజిస్ట్రార్ కార్యాలయం స్పష్టం చేసింది. అయితే, పరీక్షలను బహిష్కరించాలని విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటి (జాక్) పిలుపునిచ్చింది.Source: Yahoo! Telugu: News | 18 Jan 2010 | 7:34 am యూరప్ మార్కెట్ ప్రభావం: ఆశాజనకంగా సెన్సెక్స్బాంబే స్టాక్ మార్కెట్‌కు సోమవారం అన్ని విధాలా కలిసొచ్చింది. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ మార్కెట్, వెంటనే కోలుకుని లాభాల బాటలో ర్యాలీని కొనసాగిస్తోంది. దీంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 117 పాయింట్లు పుంజుకుని, 17,671 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 27 పాయింట్లు వృద్ధి చెంది, 5,279 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 18 Jan 2010 | 7:29 am "మగధీర"ను మించిన "శక్తి"తో జూనియర్ ఎన్టీఆర్..?!!"అదుర్స్" ఇచ్చిన విజయంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కేరింతలు కొడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం అదుర్స్ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ఇదిలావుంటే అదుర్స్ తెచ్చిన ఉత్సాహంతో మరో వండర్‌ఫుల్ సినిమా చేయాలని చిన్న ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటివరకూ కలెక్షన్లలో రికార్డు బద్దలుకొట్టిన చిత్రాన్ని మించిన సినిమాను తీయాలని జూనియర్ ఎన్టీఆర్ యోచిస్తున్నట్లు తెలిసింది. అంటే... రామ్ చరణ్ "మగధీర" సృష్టించిన రికార్డును చెరిపేసి దూసుకవెళ్లాలన్న పట్టుదలలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో సి.అశ్వనీదత్ 45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా "శక్తి" చిత్రాన్ని చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు భోగట్టా. "మగధీర" చిత్రానికి 40 కోట్ల రూపాయలు ఖర్చైనట్లు టాలీవుడ్ ట్రేడ్ టాక్. ఈ నేపధ్యంలో ఆ చిత్రానికి మించి మరో 5 కోట్ల రూపాయలను అధికంగా ఖర్చు చేయడమే కాక, కలెక్షన్లలోనూ "మగధీర"ను మించి పోవాలన్న ధ్యేయంతో "శక్తి"వంచన లేకుండా కృషి జరుగుతున్నట్లు టాలీవుడ్ టాక్.Source: Yahoo! Telugu: Entertainment | 18 Jan 2010 | 7:23 am జీడీపీ వృద్ధి 8.4 శాతానికి : సిటీ గ్రూప్ఫైనాన్షియల్ దిగ్గజం సిటీ గ్రూప్‌కు చెందిన ఆర్థిక శాస్త్రజ్ఞుడు రోహిణీ మల్కానీ జీడీపీపై న్యూ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని, అదే వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 8.4 శాతంగా ఉండొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 18 Jan 2010 | 7:17 am ఆశావహంలో ఐటీ రంగందేశీయ ఐటీ కంపెనీలు డిసెంబరు 31తో ముగిసిన తృతీయ త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలను సాధించడంతో ఐటీ రంగం ఆర్థిక మాంద్యం నుంచి బయట పడుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఓ వైపు పెరుగుతున్న డిమాండ్, మరోవైపు కొత్త కొత్త డీల్స్ వస్తున్న నేపథ్యంలో దేశీయ ఐటీ కంపెనీలు ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటిస్తున్నాయి. దీంతో ఐటీ రంగాలకు చెందిన పలు కంపెనీలు ఆర్థిక మాంద్యం నుంచి బయటపడినట్లేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.Source: Yahoo! Telugu: News | 18 Jan 2010 | 7:01 am బోరు బావిలో మహేష్: చురుగ్గా సహాయక పనులు!బోరుబావిలో పడిన ఏడేళ్ళ బాలుడు మహేష్‌ను ప్రాణాలతో సజీవంగా రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు 35 అడుగుల లోతులో ఉన్న బోరు బావిలో పడిన మహేష్ అపస్మారక స్థితిలో ఉన్నట్టు సీసీ కెమెరాలు తీసిన ఛాయా చిత్రాల ద్వారా తెలిసింది.Source: Yahoo! Telugu: News | 18 Jan 2010 | 6:57 am ఊపందుకున్న ట్రేడింగ్: వృద్ధిబాటలో సెన్సెక్స్దేశీయ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాల దిశగా పయనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు ఆశాజనకంగా లేకపోయినప్పటికీ.. బ్యాంకింగ్, ఆటో వాటాల ట్రేడింగ్ బాంబే స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చింది. ఇంకా మదుపుదారులు కొనుగోళ్లపై దృష్టిసారించడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది.Source: Yahoo! Telugu: News | 18 Jan 2010 | 6:50 am జమ్మూలో చొరబాట్లను అడ్డుకున్న భద్రతాబలగాలుజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మిలిటెంట్లు మరోమారు భారత భూభాగంలోని ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ చొరబాట్లను భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. సైనికులు జరిపిన కాల్పుల్లో ఒక మిలిటెంట్ కూడా హతమయ్యాడు.Source: Yahoo! Telugu: News | 18 Jan 2010 | 6:37 am లాభాలు తగ్గిన న్యూక్ల్యూస్ సాఫ్ట్‌వేర్ ఎక్స్పోర్ట్స్ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు 31తో ముగిసిన తృతీయ త్రైమాసికంలో తమ సంస్థకు లాభాలు తగ్గాయని న్యూక్ల్యూస్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ సంస్థ సోమవారం ప్రకటించింది.Source: Yahoo! Telugu: News | 18 Jan 2010 | 6:27 am క్షమాభిక్ష పిటీషన్లను తోసివేసిన బంగ్లా అధ్యక్షుడుబంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబర్ రెహ్మాన్ హత్య కేసులో దోషులుగా తేలిన ఐదుగురు మాజీ ఆర్మీ అధికార్లలో ముగ్గురు దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటీషన్లను ఆ దేశ అధ్యక్షుడు జిల్లూరు రెహ్మాన్ తోసివేశారు. ఈ విషయాన్ని అధ్యక్ష భవనం ప్రతినిధి బంగభాన్ వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 18 Jan 2010 | 6:27 am సల్మాన్ - కత్రినా చాటుమాటు ప్రేమాయణం...?!!"వీర్" చిత్రం తాలూకు ప్రివ్యూను చూసిన సినీ ప్రముఖులు సల్మాన్ బాడీ లాంగ్వేజ్ సూపర్ అని తెగ పొగిడేసే సరికి సల్మాన్ విర్రవీగిపోతున్నాడట. ఆ ఆనందాన్ని పైకి చెప్పకపోయినా ఇంటికెళ్లి రాత్రిళ్లు పొద్దుపోయే వరకూ పార్టీలలో మునిగి తేలుతున్నాడట. ఇదిలావుంటే సల్మాన్‌కు ఎన్నో రోజులుగా దూరంగా ఉంటున్న ఓ గొంతు అకస్మాత్తుగా పలుకరించిందట. అంతేకాదు పాత పరిచయాన్ని మరోసారి గుర్తు చేసి గారాలు పోయిందట. ఆ గారాలను చూసి సల్మాన్ గాలిలో తేలిపోతున్నాడట.అన్నట్లు ఆ గొంతు ఎవరిదో చెప్పలేదు కదూ...!! ఆమె సల్మాన్ ఖాన్ ప్రియురాలు కత్రినా కైఫ్. గత కొన్ని నెలలుగా సల్మాన్ ఖాన్ పేరు చెబితేనే తప్పించుక తిరుగుతున్న కత్రినా తాజాగా సల్మాన్‌తో తిరిగి ప్రేమాయణం సాగిస్తోందని బాలీవుడ్ కోడై కూస్తోంది.సల్మాన్ వీర్ చిత్రం చూసిన తర్వాత అందరూ కండల వీరుడ్ని పొగడ్తలతో ముంచెత్తుతుండటంతో కత్రినా కూడా తనవంతు అభినందనలు తెలిపుతూనే పనిలోపనిగా పాత గురుతులను ఏకరవు పెట్టినట్లు బాలీవుడ్ సినీ వర్గాల భోగట్టా. కానీ కత్రినా కైఫ్ సన్నిహితులు మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. సల్మాన్ ఖాన్‌ను కలలో కూడా కత్రినా పలుకరించదని అంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 18 Jan 2010 | 5:09 am ప్రభుత్వం కూల్చివేతకు ప్రతిపక్షాల కుట్ర: శైలజానాథ్ముఖ్యమంత్రి రోశయ్య సర్కారును కూల్చి వేయాలన్న రహస్య అజెండాతో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు పని చేస్తున్నట్టుగా ఉన్నాయని సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేల కన్వీనర్ ఆరోపించారు. దీనిపై ఆయన సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు ప్రతిపక్ష పార్టీలు పని చేస్తున్నాయన్నారు.Source: ఏపీ న్యూస్ | 18 Jan 2010 | 3:16 am పరీక్షలు యధాతథం: ఉస్మానియా రిజిస్ట్రార్ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని కళాశాలల్లో మంగళవారం నుంచి జరుగనున్న పరీక్షలు యధావిధిగా జరుగుతాయని ఓయూ రిజిస్ట్రార్ కార్యాలయం స్పష్టం చేసింది. అయితే, పరీక్షలను బహిష్కరించాలని విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటి (జాక్) పిలుపునిచ్చింది.Source: ఏపీ న్యూస్ | 18 Jan 2010 | 2:05 am బోరు బావిలో మహేష్: చురుగ్గా సహాయక పనులు!బోరుబావిలో పడిన ఏడేళ్ళ బాలుడు మహేష్‌ను ప్రాణాలతో సజీవంగా రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు 35 అడుగుల లోతులో ఉన్న బోరు బావిలో పడిన మహేష్ అపస్మారక స్థితిలో ఉన్నట్టు సీసీ కెమెరాలు తీసిన ఛాయా చిత్రాల ద్వారా తెలిసింది.Source: ఏపీ న్యూస్ | 18 Jan 2010 | 1:27 am జమ్మూలో చొరబాట్లను అడ్డుకున్న భద్రతాబలగాలుజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మిలిటెంట్లు మరోమారు భారత భూభాగంలోని ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ చొరబాట్లను భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. సైనికులు జరిపిన కాల్పుల్లో ఒక మిలిటెంట్ కూడా హతమయ్యాడు.Source: జాతీయ | 18 Jan 2010 | 1:07 am ఈనెల 29 నుంచి పాదయాత్రకు కేసీఆర్ శ్రీకారం!తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై కేంద్ర నుంచి ఎలాంటి సంకేతాలు రావడం లేదు. దీంతో ఏం చేయాలన్న అంశంపై తెలంగాణ ప్రాంత నేతలంతా మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.Source: ఏపీ న్యూస్ | 18 Jan 2010 | 12:27 am నితిన్ గడ్కారీకి సన్మానం: వాయిదా వేసిన భాజపాభారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికైన నితిన్ గడ్కారీకి మంగళవారం నిర్వించాల్సిన సన్మానాన్ని ఆ పార్టీ మహారాష్ట్ర రాష్ట్ర శాఖ వాయిదా వేసింది. కమ్యూనిస్టు యోధుడు జ్యోతిబసు మరణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.Source: జాతీయ | 18 Jan 2010 | 12:02 am కేసీఆర్‌కు చెక్ పెట్టేందుకు "టి" మంత్రుల ఢిల్లీ టూర్!తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మంత్రులు పావులు కదుపుతున్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండటం వల్ల తెలంగాణ ఇచ్చేదీ.. తెచ్చేదీ కాంగ్రెస్ పార్టీయే అనే సంకేతాలను ప్రజల్లో బలంగా పంపాలని నిర్ణయించుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 17 Jan 2010 | 11:37 pm ఇతర భాషలు వద్దు.. మరాఠే ముద్దు: రాజ్థాక్రేమహారాష్ట్రలో నివసించే ప్రజలు స్థానిక భాష మరాఠీనే అధికంగా ఉపయోగించాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్‌థాక్రే విన్నవించారు. ఇదే అంశంపై ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్టు ఆయన తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్రలో నివశించే ప్రజలంతా మరాఠీ భాషనే ఎక్కువగా ఉప యోగించాలని కోరారు.Source: జాతీయ | 17 Jan 2010 | 11:36 pm ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: మంత్రి పురంధేశ్వరిమాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డును ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి, ఆయన కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి కోరారు. ఈ మేరకు ఆమె, తన భర్త వెంకటేశ్వరావులు కలిసి కేంద్రానికి లేఖ రాశారు.Source: ఏపీ న్యూస్ | 17 Jan 2010 | 10:15 pm తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఎన్టీఆర్: చంద్రబాబుప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల నిలువెత్తు ఆత్మగౌరవం స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే ఆయన ఆయన వర్థంతిని తెలుగు వారి ఆత్మగౌరవ దినోత్సవంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 17 Jan 2010 | 10:02 pm 'గణ దర్పణ్'కు జ్యోతిబసు పార్థీవదేవం: బిమన్ బోస్వైద్య విద్యార్థుల పరిశోధన నిమిత్తం శవాలను సరఫరా చేసే గణ దర్పణ్ అనే స్వచ్ఛంద సంస్థకు కమ్యూనిస్టు యోధుడు జ్యోతిబసు పార్థీవదేవాన్ని అప్పగించనున్నారు. జ్యోతిబసు కోరిక మేరకు మంగళవారం ఎస్ఎస్‌కేఎం ప్రభుత్వ ఆస్పత్రికి అందజేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బిమన్ బోస్ ఆదివారం తెలిపారు.Source: జాతీయ | 17 Jan 2010 | 8:35 pm అమర్‌సింగ్ రాజీనామాకు ములాయం ఆమోదం!పార్టీ సీనియర్ నేత అమర్ సింగ్ చేసిన రాజీనామాకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ ఆమోదముద్ర వేశారు. అమర్‌ను బుజ్జగించేందుకు ములాయంతో పాటు.. మరికొంతమంది సీనియర్ నేతలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో ఆయన రాజీనామా లేఖను ములాయం ఆమోదించక తప్పలేదు.Source: జాతీయ | 17 Jan 2010 | 8:13 pm ప్రజలతో గడపడమే ఆయనకు ఇష్టం: గోకుల్ బైరాగిదివంగత నేత, కమ్యూనిస్టు యోధుడు, మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు ఓ రాజకీయ నాయకుడిగా కాకుండా, సాధారణ కార్యకర్తగా వ్యవహరించే వారని, ఎల్లప్పుడూ ప్రజలతో గడపడమే ఆయనకు చాలా ఇష్టంగా ఉండేదని ఆయన దగ్గర ఎలక్షన్ ఏజెంట్‌గా వ్యవహరించిన గోకుల్ బైరాగి అన్నారుSource: జాతీయ | 17 Jan 2010 | 5:24 am పరిశోధనల కోసం బసు అవయవాల దానంతన మరణానంతరం వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం తన అవయవాలను దానం చేస్తానని కమ్యూనిస్టు యోధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాన అవయవాలను ఏఎమ్ఆర్ఐ ఆసుపత్రికి ఆయన కుటుంబ సభ్యులు అప్పగించనున్నారు.Source: జాతీయ | 17 Jan 2010 | 5:12 am మంగళవారం జరగనున్న బసు అంత్యక్రియలుజ్యోతి బసు అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం కోలకతాలోని కియోరాట్ల శ్మశాన వాటికలో జరుగుతాయని కోలకతా మేయర్ బికాష్ భట్టా ఛటర్జీ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి బసు మృతికి సంతాప సూచకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది.Source: జాతీయ | 17 Jan 2010 | 3:30 am త్యాగశీలి బసు మృతి తీరని లోటు: పలువురి సంతాపంకమ్యూనిస్టు యోధుడు జ్యోతిబసు (95) 1914 జులై8న కోల్‌కతాలో హేమలతాబసు, నిశికాంత్ బసు దంపతులకు జన్మించారు. తండ్రి నిశికాంత్ బసు ఢాకా జిల్లాలోని బాద్రీ గ్రామం, (తూర్పు బంగ్లా) (ఇప్పుడు అది బంగ్లాదేశ్‌లోవుంది) గ్రామంలో వైద్యునిగా పని చేస్తుండేవారు. జ్యోతి బసు తల్లి గృహిణిగావుండేది. తన మొదటి భార్య విమలాఘోష్ మృతిచెందడంతో 1948 డిసెంబరు 5న కమలను జ్యోతిబసు ద్వితీయ వివాహం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనే విశిష్టనేతగా గుర్తింపు పొందారు. 1977 జూన్ 1వ తేదీ నుంచి 2000 నవంబరు 6 వరకూ 23 ఏళ్లపాటు బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసి దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించారు. 1996లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా పార్టీ విధాన నిర్ణయాల వలన ప్రధాని పదవిని త్యాగం చేశారు.Source: ఏపీ న్యూస్ | 17 Jan 2010 | 3:11 am బసు అస్తమయం : విషాద ఛాయల్లో ప.బెంగాల్కమ్యూనిస్టు పార్టీకి చెందిన కురువృద్ధుడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు మృతి చెందారన్న వార్త కోల్‌కతా నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం విషాద ఛాయలు అలముకున్నాయి.Source: జాతీయ | 17 Jan 2010 | 2:49 am
|