" శాంతిదూత " పురస్కారాన్ని పొందిన జస్వంత్ సింగ్

లండన్‌లోనున్న పీస్ ఇంటర్నేషనల్ సంస్థ దక్షిణ ఆసియా క్షేత్రంలో శాంతిని స్థాపించేందుకు కృషి చేసిన వారికి ఇచ్చే అత్యంత అరుదైన పురస్కారం "శాంతిదూత" పురస్కారాన్ని ఆ సంస్థ మాజీ విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్‌కు శుక్రవారం సాయంత్రం లండన్‌లోని హిల్టన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బహుకరించింది
Source: Yahoo! Telugu: News | 16 Jan 2010 | 8:37 am

భారతదేశ అవినీతి రూ 2.5 లక్షల కోట్లు...!!

భారతదేశంలో అవినీతి నానాటికీ పెచ్చరిల్లిపోతోందని సీకే ప్రహ్లాద్ వెల్లడించారు. ఈ అవినీతి ప్రస్తుతం రెండున్నర లక్షల కోట్ల రూపాయలను దాటిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు
Source: Yahoo! Telugu: News | 16 Jan 2010 | 7:11 am

మధ్యప్రదేశ్‌లో రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన!

కాంగ్రెస్ యువరాజు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఈ నెల 18వ తేదీన మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన రెండు రోజుల పాటు ఉంటుందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు జె.పి, ధనోపియా శనివారం విలేకరులతో తెలిపారు. రాహుల్ గాంధీ సోమవారం (18వతేదీ) న్యూఢిల్లీ నుంచి గ్వాలియర్ చేరుకుంటారు. ఆ రోజు సాగర్ జబల్‌పూర్ పర్యటిస్తారు. భోపాల్‌లో రాత్రి విశ్రాంతి తీసుకుని మంగళవారం జరిగే స్టేట్ కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ పాల్గొంటారని ధనోపియా అన్నారు.
Source: Yahoo! Telugu: News | 16 Jan 2010 | 7:08 am

రిలయన్స్‌పై దాడి: వంశీచంద్‌రెడ్డిపై బహిష్కరణ వేటు!

రిలయన్స్ సంస్థలపై దాడులకు సంబంధించి ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డిపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీరియస్ అయ్యింది. దీంతో వంశీచంద్‌రెడ్డిపై పీసీసీ ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించింది. అలాగే ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు శనివారం ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 16 Jan 2010 | 6:57 am

ద్రవ్యోల్బణం 8.5 శాతానికి చేరుకుంటుంది: జ్యోతిందర్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ద్రవ్యోల్బణం 8.5 శాతానికి చేరుకుంటుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆర్థిక నిపుణులు జ్యోతిందర్ కౌర్ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 16 Jan 2010 | 6:53 am

28లోపు తెలంగాణపై కేంద్రం ప్రకటన: దామోదర్ రెడ్డి

ప్రత్యేక తెలంగాణపై ఈ నెల 28వ తేదీలోపు కేంద్రం మంచి నిర్ణయం ప్రకటిస్తుందని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయకుంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని మంత్రి అన్నారు.తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన వారి పదవులు ఎక్కడకు పోవని ప్రజలు మళ్లీ గెలిపిస్తారని దామోదర్ రెడ్డి అన్నారు.
Source: Yahoo! Telugu: News | 16 Jan 2010 | 6:27 am

మాది తెలంగాణా.. మీది సీమాంధ్రా... విడిపోదాం: జానారెడ్డి

కేంద్రప్రభుత్వం ప్రజలు తెలంగాణ ప్రక్రియను పూర్తి చేయాలని మాజీ హోం మంత్రి జానారెడ్డి కోరారు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని జానారెడ్డి చెప్పారు. అంతవరకు ప్రశాంతంగా ఉద్యమం కొనసాగిస్తామని మాజీ హోం మంత్రి వెల్లడించారు. ఈ విషయాన్ని సీమ, కోస్తా నేతలు అర్థం చేసుకుని విడిపోవాలని జానారెడ్డి అన్నారు.
Source: Yahoo! Telugu: News | 16 Jan 2010 | 6:16 am

పెరిగిన విమాన ఇంధన ధరలు

గడచిన రెండు నెలలుగా విమాన ఇంధన ధరలను తగ్గించిన చమురు సంస్థలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి విమాన ఇంధన ధరల (ఏటీఎఫ్)ను 6.5 శాతం మేర పెంచాయి.
Source: Yahoo! Telugu: News | 16 Jan 2010 | 6:10 am

18న ఘనంగా ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు: తెదేపా

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నేత నందమూరి తారక రామారావు 14వ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని తెదేపా భావిస్తోంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన ఎన్టీఆర్ వర్థంతిని తెలుగుజాతి ఆత్మగౌరవ దినంగా జరపాలని టీడీపీ నిర్ణయించింది.
Source: Yahoo! Telugu: News | 16 Jan 2010 | 5:49 am

శబ్ద కాలుష్యాన్ని నివారించండి: కేంద్రం ఆదేశం

రాత్రి సమయాల్లో శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు శబ్ద కాలుష్యం నివారణపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.
Source: Yahoo! Telugu: News | 16 Jan 2010 | 5:29 am

నాగార్జున "కేడి" ఆడియో ఆవిష్కరణ

"కింగ్" నాగార్జున హీరోగా కిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ అగ్ర నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి కామాక్షి కళా మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం కేడి ఆడియో ఆవిష్కరణ సంక్రాంతినాడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. ఈ సందర్భంగా హీరో నాగార్జున మాట్లాడుతూ... "సందీప్ చౌతా ఇంతకుముందు నేను నటించిన నిన్నే పెళ్లాడుతూ, చంద్రలేఖ, సూపర్ చిత్రాలకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు కేడీలో అన్ని సాంగ్స్ చాలా బాగా చేశారు. ఈ మ్యూజిక్ నాకు బాగా నచ్చింది. ఈ రోజే మార్కెట్‌లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా కేడీ ఆడియో రిలీజ్ అయింది. ఇందులో ఓ ఐటమ్ సాంగ్ ఉంది. ఏ సాంగ్ పెట్టాలా అనుకుటంటుంటే 1969లో విడుదలైన నాన్నగారి అదృష్టవంతులు సినిమాలోని "ము.. ము... ముద్దంటే చేదా.." సాంగ్ పెడదాం అని శివప్రసాద్ రెడ్డి అన్నారు. అలా ఆ పాటను రీమిక్స్ చేయడం, ఆ పాటలో నేను నటించడం జరిగింది. ఈ సాంగ్ సినిమాకు హైలెట్. కేడీ సినిమా మంచి హిట్ అవుతుంది. రెడ్డిగారి బ్యానర్లో మరో ఘన విజయం సొంతమవుతుంద"ని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jan 2010 | 4:39 am

మధ్యప్రదేశ్‌లో రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన!

కాంగ్రెస్ యువరాజు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఈ నెల 18వ తేదీన మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన రెండు రోజుల పాటు ఉంటుందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు జె.పి, ధనోపియా శనివారం విలేకరులతో తెలిపారు. రాహుల్ గాంధీ సోమవారం (18వతేదీ) న్యూఢిల్లీ నుంచి గ్వాలియర్ చేరుకుంటారు. ఆ రోజు సాగర్ జబల్‌పూర్ పర్యటిస్తారు. భోపాల్‌లో రాత్రి విశ్రాంతి తీసుకుని మంగళవారం జరిగే స్టేట్ కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ పాల్గొంటారని ధనోపియా అన్నారు.
Source: జాతీయ | 16 Jan 2010 | 2:58 am

28లోపు తెలంగాణపై కేంద్రం ప్రకటన: దామోదర్ రెడ్డి

ప్రత్యేక తెలంగాణపై ఈ నెల 28వ తేదీలోపు కేంద్రం మంచి నిర్ణయం ప్రకటిస్తుందని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయకుంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని మంత్రి అన్నారు.తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన వారి పదవులు ఎక్కడకు పోవని ప్రజలు మళ్లీ గెలిపిస్తారని దామోదర్ రెడ్డి అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jan 2010 | 2:03 am

మాది తెలంగాణా.. మీది సీమాంధ్రా... విడిపోదాం: జానారెడ్డి

కేంద్రప్రభుత్వం ప్రజలు తెలంగాణ ప్రక్రియను పూర్తి చేయాలని మాజీ హోం మంత్రి జానారెడ్డి కోరారు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని జానారెడ్డి చెప్పారు. అంతవరకు ప్రశాంతంగా ఉద్యమం కొనసాగిస్తామని మాజీ హోం మంత్రి వెల్లడించారు. ఈ విషయాన్ని సీమ, కోస్తా నేతలు అర్థం చేసుకుని విడిపోవాలని జానారెడ్డి అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jan 2010 | 1:55 am

భారతదేశ అవినీతి రూ 2.5 లక్షల కోట్లు...!!

భారతదేశంలో అవినీతి నానాటికీ పెచ్చరిల్లిపోతోందని సీకే ప్రహ్లాద్ వెల్లడించారు. ఈ అవినీతి ప్రస్తుతం రెండున్నర లక్షల కోట్ల రూపాయలను దాటిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు
Source: జాతీయ | 16 Jan 2010 | 1:42 am

రిలయన్స్‌పై దాడి: వంశీచంద్‌రెడ్డిపై బహిష్కరణ వేటు!

రిలయన్స్ సంస్థలపై దాడులకు సంబంధించి ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డిపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీరియస్ అయ్యింది. దీంతో వంశీచంద్‌రెడ్డిపై పీసీసీ ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించింది. అలాగే ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు శనివారం ప్రకటించింది.
Source: ఏపీ న్యూస్ | 16 Jan 2010 | 1:29 am

18న ఘనంగా ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు: తెదేపా

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నేత నందమూరి తారక రామారావు 14వ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని తెదేపా భావిస్తోంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన ఎన్టీఆర్ వర్థంతిని తెలుగుజాతి ఆత్మగౌరవ దినంగా జరపాలని టీడీపీ నిర్ణయించింది.
Source: ఏపీ న్యూస్ | 16 Jan 2010 | 12:20 am

శబ్ద కాలుష్యాన్ని నివారించండి: కేంద్రం ఆదేశం

రాత్రి సమయాల్లో శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు శబ్ద కాలుష్యం నివారణపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.
Source: జాతీయ | 15 Jan 2010 | 11:59 pm

23న శ్రీకాకుళంలో ముఖ్యమంత్రి పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య ఈ నెల 23వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. 23వ తేదీన ఉదయం 10.30 గంటలకు పాలకొండ మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుంటారు. ఉదయం 10.45 గంటలకు మార్కెట్ యార్డుకు ఎదురుగా ఉన్న మైదానంలో 140 కోట్లతో చేపట్టనున్న తోటపల్లి ప్రాజెక్టు కాల్వల ఆధునీకరణకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే స్వయంశక్తి సంఘాల మహిళలకు, ఇతరులకు యూనిట్లను పంపిణీ చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.
Source: ఏపీ న్యూస్ | 15 Jan 2010 | 11:32 pm

ఎన్టీఆర్‌కు అసలు చిత్తశుద్ధి ఉందా..?: విమలక్క

జూనియన్ ఎన్టీఆర్‌పై అరుణోదయ సాంస్కృతిక కళామండలి బృందం వ్యవస్థాపకురాలు విమలక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌కు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే తన స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. తన సినిమా కెరీర్‌ కోసం తాను అందరివాడిని అంటూ.. తెలంగాణవైపు అస్పష్టత ప్రకటన చేసిన ఎన్టీఆర్.. తెలంగాణాపై కచ్చితమైన ప్రకటన ఇవ్వాలని విమలక్క చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 15 Jan 2010 | 11:31 pm

యూపీలో రైలు ప్రమాదం: ముగ్గురు మృతి!

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో శనివారం రైలు ప్రమాదం సంభవించింది. ఢిల్లీ నుంచి కాన్పూరు వెళుతున్న శ్రమశక్తి ఎక్స్‌ప్రెస్‌ను అలీగఢ్‌లో తుండాల స్టేషన్ వద్ద కాళిందీ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ఈ ప్రమాదం ఏర్పడింది. ఈ సంఘటనలో ధ్వంసమైన రెండు బోగీల్లో ప్రయాణికులు చిక్కుకున్నట్లు తెలిసింది. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, 10 మందికి పైగా గాయపడినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Source: జాతీయ | 15 Jan 2010 | 10:48 pm

క్షీణించిన జ్యోతిబసు ఆరోగ్యం: ఆందోళనలో కుటుంబీకులు!

సీపీఎం వృద్ధనేత జ్యోతిబసు ఆరోగ్యం మరింత క్షీణించింది. న్యూమోనియాతో ఆస్పత్రిలో చేరిన జ్యోతిబసుకు చికిత్స ఏమాత్రం ఫలించడం లేదని వైద్యులు చెబుతున్నారు. జ్యోతిబసు శరీరంలోని అవయవాలు చికిత్సకు సహకరించడం లేదని వారు తెలిపారు. గుండె, కాలేయం, మెదడు పనితీరు మందగించడంతో జ్యోతిబసు ఆరోగ్యం మరింత క్షీణించిందని వైద్యులు వెల్లడించారు.
Source: జాతీయ | 15 Jan 2010 | 10:31 pm

మూడవ రోజుకు చేరిన మహా కుంభమేళా

మహా కుంభమేళాలో మూడవ రోజు భక్తులు అధికసంఖ్యలో హరిద్వార్‌‌కు చేరుకున్నారు. హర్యానా, బీహార్‌, రాజస్థాన్‌, తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి గంగానదిలో స్నానం చేసి తమ పితృమూర్తులకు పిండ ప్రదానాలు చేస్తున్నారు.
Source: జాతీయ | 15 Jan 2010 | 10:29 pm

ఫిరోజాబాద్‌లో రైలు ప్రమాదం : పలువురికి గాయాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో శనివారం ఉదయం రైలు ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుంచి కాన్పూరు వెళుతున్న శ్రమశక్తి ఎక్స్‌ప్రెస్‌ను కాళిందీ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొంది. ఈ ఘటనలో రెండు బోగీలు ధ్వంసం అయ్యాయి. ప్రయాణికులు బోగీల్లో చిక్కుకున్నట్లు సమాచారం
Source: జాతీయ | 15 Jan 2010 | 9:13 pm

మీడియా దేశాభివృద్ధిలో భాగం కావాలి: అబ్దుల్ కలాం

దేశంలోని మీడియా సానుకూల దృక్పథంతో ఆలోచించే అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని, అలాగే దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మీడియాకు పిలుపునిచ్చారు.
Source: జాతీయ | 15 Jan 2010 | 8:34 pm

నమో వెంకటేశా..!! 40 ఏళ్ల యువకుడికి పెళ్లెందుకు కాలేదయా..?

కథ చెప్పాలంటే... వెంకటరమణ( వెంకటేష్) ఓ కాలనీలో అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. ఆయన మంచితనం వారిని కట్టడి చేస్తుంది. వెంట్రిలాక్విజమ్ అతని వృత్తి. రాజకీయనాయకుల మీటింగ్‌లో కాస్త ఎంటర్‌టైన్‌గా మాట్లాడే బొమ్మ పెట్టుకుని ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. కానీ అతనికి 40 ఏళ్లు వచ్చినా పెళ్లి కాదు. చిన్నాన్న చంద్రమోహన్ వెంకటరమణకు పెండ్లి సంబంధాలు చూసినా డ్రీమ్‌గాళ్ కోసం వెతుకుతుంటాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Jan 2010 | 1:10 pm

నేనిప్పటివరకూ ముసలాళ్లను కౌగలించుకోలేదు: ప్రియాంక

ప్రియాంకా చోప్రా... బాలీవుడ్ బ్యూటీ డాల్స్‌లో ఒకరు. అందమైన శరీరాన్ని కలిగి ఉండటం తనకు దేవుడిచ్చిన వరం అని చెప్పుకునే ప్రియాంక, ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఎంతమేరకు కావాలో అంతమేరకు తన శరీరాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నానని చెపుతోంది. అయితే అది తను నిర్ణయించుకున్న సరిహద్దులు దాటి ఉండదని చెపుతోంది. సినిమాల్లో కౌగిలింతలకు నిజజీవితంలో కౌగలింతలకు తేడాలున్నాయని అకస్మాత్తుగా రొమాంటిక్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. మనసునిండా ప్రేమ నిండినపుడే నిజజీవితంలో ఒక వ్యక్తిని కౌగలించుకోవడం జరుగుతుందని చెప్పుకొచ్చింది. నటనలో ప్రేమతో కూడిన కౌగిలింతలుండవనీ అంది. తనకు యుక్త వయస్సు వచ్చినప్పట్నుంచి వృద్ధులను కౌగలించుకున్నట్లు గుర్తు లేదని ముక్తాయింపు ఇచ్చింది. అంటే కుర్రవాళ్లను కౌగలించుకున్నాననా దీనర్థం...?
Source: Yahoo! Telugu: Entertainment | 15 Jan 2010 | 8:25 am

పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్‌గా ఎమ్‌కేనారాయణన్?

పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్‌గా జాతీయ భద్రతా సలహాదారు ఎంకే.నారాయణన్ నియమితులయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుత గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పదవీ కాలం ఈనెలలో ముగియనుంది. గాంధీ స్థానంలో నారాయణన్‌ను బెంగాల్ గవర్నర్‌గా నియమించేందుకు కేంద్ర హోంమంత్వి శాఖ సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు.
Source: జాతీయ | 15 Jan 2010 | 6:43 am

విధవరాలైనప్పటికీ సోనియా "ది గ్రేట్": ప్రీతి జింతా

విధవరాళ్లు, వారి పిల్లలను ఆదుకునేందుకు ఏర్పాటైన లూంబా ట్రస్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి ప్రీతి జింతా ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... "విధవారాళ్లైన స్త్రీలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పెద్ద ఉదాహరణ. ఆమె తన భర్తను కోల్పోయినప్పటికీ మొక్కవోని ఆత్మస్థైర్యంతో ముందుకు వెళుతూ ఎన్నో విజయాలను సాధిస్తున్నారు. తనకు వచ్చే అవకాశాలను వేటిని ఆమె చేజార్చుకోవడం లేదు. విధవరాలైనప్పటికీ ఎందరికో ధైర్యం చెపుతూ, ఎన్నో అద్భుత రికార్డులను నెలకొల్పుతున్నారు. కనుక విధవరాళ్లైన స్త్రీలకు సోనియా గాంధీ గొప్ప మార్గదర్శకులు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి" అని చెప్పింది.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Jan 2010 | 6:10 am

నింగిలో అరుదైన కంకణ సూర్యగ్రహణం

నింగిలో అరుదైన సుదీర్ఘ సూర్యగ్రహణం శుక్రవారం, జనవరి 15న చోటుచేసుకున్నది. మన రాష్ట్రానికి సంబంధించి ఈ సూర్యగ్రహణం నెల్లూరులో 82 శాతం మేర సంపూర్ణంగా కనిపించింది.
Source: జాతీయ | 15 Jan 2010 | 5:48 am

రాష్ట్ర ఏర్పాటుకు ఇంటి దొంగల మోకాలడ్డు: యాష్కీ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ వాదులే అడ్డుతగులుతున్నారని నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు మధు యాష్కీ ఆరోపించారు. ఆయన శుక్రవారం నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటుకు ఇంటి దొంగలే ప్రధాన అడ్డంకిగా ఉన్నారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 15 Jan 2010 | 2:56 am

డీజీపీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: దత్తన్న

తెలంగాణ ఉద్యమంపై రాష్ట్ర డీజీపీ గిరీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండించింది. దీనికి నిరసనగా ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ శుక్రవారం రాజధానిలోని గన్ పార్కు వద్ద ధర్నాకు దిగారు.
Source: ఏపీ న్యూస్ | 15 Jan 2010 | 2:47 am