భాగ్యనగరంలో ఏడు చోట్ల దోపిడీ దొంగల బీభత్సం!

భాగ్యనగరంలోని సైబరాబాద్ పరిధిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. శుక్రవారం తెల్లవారుజామున ఏకంగా ఏడు ఫ్లాట్లలో వరుస చోరీలకు పాల్పడ్డారు. లక్షలాది రూపాయల విలువ చేసే నగలు, నగదును దోచుకున్నారు. సైబరాబాద్ పరిధిలోని విశ్వప్రియ అపార్టుమెంట్స్‌లో ఈ చోరీలు చోటు చేసుకున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 14 Jan 2010 | 11:16 pm

ఆకాశంలో శుక్రవారం కనిపించనున్న కంకణ సూర్యగ్రహం

గత మూడువేల సంవత్సరాలనాడు చోటుచేసుకున్న సుదీర్ఘ సూర్యగ్రహణం వంటిదే శుక్రవారం, జనవరి 15న చోటుచేసుకోనున్నది. మన రాష్ట్రానికి సంబంధించి ఈ సూర్యగ్రహణం నెల్లూరులో 82 శాతం మేర సంపూర్ణంగా కనిపించనున్నది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఇది 66 శాతం కనిపించనున్నది. సూర్యగ్రహణం ఉదయం 11. 15 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3. 30 గంటల వరకూ సాగనుంది.
Source: జాతీయ | 14 Jan 2010 | 10:55 pm

మరింత విషమంగా మారిన జ్యోతిబసు ఆరోగ్యం!?

కమ్యూనిస్టు వృద్ధనేత జ్యోతిబసు ఆరోగ్యం మరింత విషమంగా మారింది. దీంతో ఆయనను పరామర్శించేందుకు రాజకీయ ప్రముఖులు ఏఎంఆర్ఐ ఆస్పత్రి వద్ద క్యూ కడుతున్నారు. జ్యోతిబసుకు వైద్యం చేస్తున్న ప్రత్యేక వైద్య బృందం డాక్టరు శుష్రూత్ బెనర్జీ శుక్రవారం మాట్లాడుతూ.. బసు ఆరోగ్యం చాలా విషమంగా మారిందన్నారు.
Source: జాతీయ | 14 Jan 2010 | 10:53 pm

రాష్ట్రపతి పాలన తెచ్చేందుకు కుట్ర: ఎంపీ రాజయ్య

రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తీసుకుని వచ్చి రాష్ట్రపతి పాలన విధించేలా కుట్ర జరుగుతోందని వరంగల్ పార్లమెంట్ సభ్యుడు టి.రాజయ్య అభిప్రాయపడ్డారు. అందువల్ల తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రతిపక్ష నేతల కుట్రలో భాగస్వాములు కావొద్దని ఆయన హితవు పలికారు.
Source: ఏపీ న్యూస్ | 14 Jan 2010 | 10:26 pm

రాజీనామాలపై కాంగ్రెస్ సభ్యుల మల్లగుల్లాలు!

ప్రత్యేక తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ సభ్యుల పరిస్థితి అమయోమయంగా ఉంది. చేసిన రాజీనామాలను తక్షణ ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటి మాత్రం రాజీనామాల ఆమోదానికి అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేలా కృషి చేయాలని కోరింది.
Source: ఏపీ న్యూస్ | 14 Jan 2010 | 9:57 pm

ఓఎంసీపై స్టేను పొడిగించిన సుప్రీం కోర్టు

గతంలో ఓబుళాపురం మైనింగ్‌లో తవ్వకాలను నిలిపివేస్తూ ఇచ్చిన స్టేను సుప్రీం కోర్టు పొడిగించింది. ఓఎంసీపై తెలుగు దేశం పార్టీ నేత నాగం జనార్ధన్ రెడ్డి‌, తపాల గణేష్‌లు వేసిన పీటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది
Source: జాతీయ | 14 Jan 2010 | 8:44 pm

పశ్చిమ బెంగాల్‌ వద్ద గంగానదిలో తొక్కిసలాట

పశ్చిమ బెంగాల్‌లోని గంగాసాగర్ వద్దనున్న గంగానదిలో గురువారం ఉదయం సంభవించిన తొక్కిసలాటలో ఏడుగురు యాత్రీకులు మృతి చెందగా మరో పదిమంది తీవ్ర గాయాల పాలైనారు.
Source: జాతీయ | 14 Jan 2010 | 8:30 pm

పెరిగిన ధరలకు కేంద్రానిదే బాధ్యత: మాయావతి

ప్రస్తుతం దేశంలో పెరిగిన ధరలకు కేంద్రప్రభుత్వానిదే బాధ్యత అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు.
Source: Yahoo! Telugu: News | 14 Jan 2010 | 8:22 am

మంత్రివర్గంలో చోటు దక్కించుకోనున్న టిజి వెంకటేష్‌

రాష్ట్రంలో జరుగనున్న మంత్రివర్గ విస్తరణలో భాగంగా కర్నూలు ఎమ్మెల్యే టిజి వెంకటేష్‌కు స్ధానం దక్కవచ్చన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. గత కొన్ని నెలలుగా మూలనపడిన మంత్రివర్గ విస్తరణ కసరత్తు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశలున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో కర్నూలు జిల్లానుంచి శిల్పామోహన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు
Source: Yahoo! Telugu: News | 14 Jan 2010 | 7:52 am

హరిద్వార్‌లో ప్రారంభమైన మహాకుంభమేళా

హరిద్వార్‌లో గురువారం తెల్లవారుఝామున మహా కుంభమేళా ప్రారంభమైంది. భారతదేశంలోని భక్తులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు బ్రహ్మకుండ్ వద్ద గంగానదిలో పవిత్ర స్నానాలు చేయడానికి వచ్చారు. హర్ కీ పౌరీ వద్ద శివాలయానికి దిగువన ఈ బ్రహ్మకుండ్ ఉంది.
Source: Yahoo! Telugu: News | 14 Jan 2010 | 6:39 am

మంత్రివర్గంలో చోటు దక్కించుకోనున్న టిజి వెంకటేష్‌

రాష్ట్రంలో జరుగనున్న మంత్రివర్గ విస్తరణలో భాగంగా కర్నూలు ఎమ్మెల్యే టిజి వెంకటేష్‌కు స్ధానం దక్కవచ్చన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. గత కొన్ని నెలలుగా మూలనపడిన మంత్రివర్గ విస్తరణ కసరత్తు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశలున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో కర్నూలు జిల్లానుంచి శిల్పామోహన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు
Source: ఏపీ న్యూస్ | 14 Jan 2010 | 6:28 am

గురుద్వారాపై దాడులకు పాల్పడ్డ దుండగులు

మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని గురుద్వారాపై కొందరు గుర్తు తెలియని దుండగులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో గురుద్వారా భవనానికి చెందిన కిటికీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Source: Yahoo! Telugu: News | 14 Jan 2010 | 6:04 am

రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి పండుగ అంటే అందరికి ఆనందమే. కొత్త అల్లుళ్ళతో, బావా మరదళ్ళతో రాష్ట్రంలోని ప్రజలు ఈ ఏడు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాల వెనుక సంప్రదాయంతోపాటుగా ఖగోళ, జ్యోతిష్య సంబంధమైన విషయాలు కూడా మిళితమై ఉండటం మరో విశేషం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడాన్నే సంక్రాంతిగా అభివర్ణిస్తున్నారు పెద్దలు.
Source: ఏపీ న్యూస్ | 14 Jan 2010 | 6:01 am

పంటల బీమా విడుదల చేసిన ప్రభుత్వం

రాష్ట్రంలోని రైతులకు సంక్రాంతి పండుగ కానుకగా తమ ప్రభుత్వం రైతులకు 2008 ఖరీఫ్ సీజన్ పంటల బీమాను విడుదల చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య గురువారం ఉదయం తెలిపారు. .
Source: ఏపీ న్యూస్ | 14 Jan 2010 | 5:40 am

హైతీలో భారతీయ సైనికులు క్షేమం: సిఐఎస్ఎఫ్

హైతీలో ఉన్న భారతీయ సైనికులందరూ క్షేమంగా ఉన్నారని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళంలో 141 మంది భారతీయులు ఉన్నారని, వారంతా సురక్షితంగానే ఉన్నారని సిఐఎస్ఎఫ్ అధికార ప్రతినిధి రోహిత్ కతియార్ వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 14 Jan 2010 | 5:31 am

శబరిమల భక్తుల మృతిపై దిగ్భ్రాంతి చెందిన సీఎం

రాష్ట్రానికి చెందిన పలువురు శబరిమలై యాత్రకు వెళ్ళారు. ఇందులో 11 మంది అయ్యప్ప భక్తులు ట్రక్కు ప్రమాదంలో మృతి చెందడంపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 14 Jan 2010 | 5:15 am

కంకణాకార సూర్య గ్రహణం రేపే

అత్యంత సుదీర్ఘమైన కంకణాకార సూర్య గ్రహణం శుక్రవారం ఆవిష్కృతమౌతోంది. ఈ సూర్యగ్రహణం కేవలం 11 నిమిషాల 8 సెకన్లపాటు రాష్ట్ర ప్రజలకు కనువిందు చేయనుందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 14 Jan 2010 | 5:02 am

పెట్రో ధరలపెంపు వాయిదా

దేశీయ చమురు ఉత్పత్తి కంపెనీ ప్రతినిధులు ప్రధాని మన్మోహన్‌తో బుధవారం సాయంత్రం సమావేశమై సుమారు రెండు గంటల పాటు చర్చించారు. ఈ చర్చలలో పెట్రో ఉత్పత్తుల ధరలపై నియంత్రణ ఎత్తివేత, ఇంధన పరిశ్రమలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. అయితే ధరల పెంపుపై ఎలాంటి నిర్ణయాన్ని తీలుకోలేదు.
Source: Yahoo! Telugu: News | 14 Jan 2010 | 4:41 am

తెలంగాణ అంశంపై అతిగా ప్రవర్తించకండి: మనీష్

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ అంశంపై తెలంగాణ జేఏసీ ఈ నెల 28 తేదీని డెడ్ లైన్‌గా ప్రకటించడంపై ఏఐసీసీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ తీవ్రంగా స్పందించారు.
Source: Yahoo! Telugu: News | 14 Jan 2010 | 4:24 am

ఇండోనేషియాలో తీవ్రమైన భూకంపం

ఇండోనేషియాలోని పాపువా ప్రాంతంలో బుధవారం అర్థరాత్రి భూమి తీవ్రంగా కంపించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైనట్లు భూ శాస్త్రవేత్తలు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 14 Jan 2010 | 4:09 am

పెరిగిన ధరలకు కేంద్రానిదే బాధ్యత: మాయావతి

ప్రస్తుతం దేశంలో పెరిగిన ధరలకు కేంద్రప్రభుత్వానిదే బాధ్యత అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు.
Source: జాతీయ | 14 Jan 2010 | 2:53 am