అధికారులపై ఆర్మీ చీఫ్ చర్యలు: మంత్రి ఆంటోనీ

భూకుంభకోణంలో సంబంధం ఉన్న నలుగురు అధికారులపై ఆరమ్ ఆర్మీ చీఫ్ దీపక్ కపూర్ చర్యలు తీసుకుంటారని కేంద్ర రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ తెలిపారు. దీనిపై ఆయన బుధవారం మాట్లాడుతూ.. ఈ వ్యవహారానికి సంబంధించి గత రాత్రి తమ శాఖకు నివేదిక అందిందన్నారు. అదేసమయంలో ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న జనరల్స్‌పై చర్య తీసుకునే అంశంపై మాట్లాడటం అనేది తొందరపాటేనన్నారు.
Source: Yahoo! Telugu: News | 13 Jan 2010 | 8:47 am

ఆసియా మార్కెట్లో తగ్గిన ఆయిల్ ధరలు

ఆసియా మార్కెట్లో ఫిబ్రవరి మాసానికి డెలివరీకి సిద్ధంగానున్న ముడి చమురు ధరలు బుధవారం నాడు తగ్గాయి. ఫిబ్రవరి నెలకు డెలివరీకి సిద్ధంగానున్న న్యూయార్క్‌కు చెందిన ముడి చమురు ధరలు బ్యారెల్ ధర 89 సెంట్లు తగ్గి 79.90 డాలర్లకు చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 13 Jan 2010 | 8:46 am

అమ్మకాల ఒత్తిడి: నష్టాల్లో స్టాక్ మార్కెట్

బాంబే స్టాక్ మార్కెట్‌కు బుధవారం ఏ మాత్రం కలిసిరాలేదు. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 90 పాయింట్లీ క్షీణించి, 17,331 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 29 పాయింట్ల పతనమై, 5,180 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 13 Jan 2010 | 8:13 am

పాజిటివ్‌గా ఆలోచించండి: వెంకటేష్

జీవితంలో అందరూ పాజిటివ్‌గా ఉండాలని విక్టరీ వెంకటేష్ చెబుతున్నాడు. తన తాజా చిత్రం "నమో వెంకటేశ" చిత్రం ఈనెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకటేష్‌తో ఇంటర్య్వూ...సంక్రాంతి మీ సినిమా రిలీజ్ ఎలా ఉంటుదనుకుంటున్నారు..? సంక్రాంతి మనకే కాదు. ప్రేక్షకులకు పండుగే. చాలామంది మంచి సినిమాలు వస్తాయని కోరుకుంటారు. ఆ క్రమంలోనే ఉంటుంది నమో వెంకటేశ. ఇది గుడ్ క్లీన్ మూవీ. అందరూ కలిసి చూసేట్లుగా ఉంటుంది.బి పాజిటివ్ అనే కాప్షన్‌కు అర్థం...? ఏముంది. అంతా పాజిటివ్‌గా ఆలోచిస్తే మనిషిలో దాగి ఉన్న శక్తి పైకి వస్తుంది. నెగెటివ్‌గా ఆలోచించి చాలామంది యువత నేడు తమ శక్తిని వృధా చేసుకుంటున్నారు. యువతే కాదు ప్రతి వ్యక్తి జీవితంలో పాజిటివ్ ఆలోచన అలవర్చుకోవాలి. అలా ప్రతిదీ పాజిటివ్‌గా ఆలోచించే వెంకటరమణ కథే ఈ చిత్రం. తనకు పెళ్లి కాకపోయినా ఇంకా టైమ్ వస్తుందని వేచి చూస్తుంటాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Jan 2010 | 7:38 am

వారిద్‌లో 70శాతం వాటా కొన్న ఎయిర్‌టెల్

దేశీయ ప్రైవేట్ టెలికాం రంగంలో అగ్రగామిగానున్న భారతి ఎయిర్‌టెల్ సంస్థ గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ విస్తరణకు ఉవ్విళ్ళూరుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన వారిద్ టెలికాంలో 70 శాతం వాటా కొనుగోలు ఒప్పందాలపై మంగళవారం సంతకాలు చేసింది.
Source: Yahoo! Telugu: News | 13 Jan 2010 | 6:14 am

స్వల్ప నష్టాలతో కొనసాగుతోన్న సెన్సెక్స్, నిఫ్టీ

బాంబే స్టాక్ మార్కెట్ బుధవారం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ నుంచి లాభ, నష్టాలను నమోదు చేసుకుంటోన్న సెన్సెక్స్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 64 పాయింట్లు క్షీణించి, 17,357 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 26 పాయింట్లు పతనమై, 5,183 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 13 Jan 2010 | 6:00 am

కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ భయపెడుతోంది: తలసాని

తెలంగాణా ఆకాంక్ష తెలంగాణా ప్రాంతంలోని 10 జిల్లాలలోని ప్రజలందరిదీ అనీ, అది ఏ ఒక్క కుటుంబానికి చెందినది కాదని తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని కృష్ణయాదవ్ పేర్కొన్నారు. అయితే కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణా రాష్ట్ర సమితి కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మారిపోయి రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు.
Source: Yahoo! Telugu: News | 13 Jan 2010 | 5:46 am

నేడు కేంద్ర కేబినెట్ భేటీ: ధరల పెరుగుదలపై చర్చ!

కేంద్ర కేబినెట్ బుధవారం సాయంత్రం భేటీ కానుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కేంద్ర మంత్రులందరూ హాజరుకానున్నారు. నిత్యావసర వస్తు ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ పెరుగుదలపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Source: Yahoo! Telugu: News | 13 Jan 2010 | 5:08 am

27 వేలమందిని నియమించనున్న ఎస్‌బీఐ

దేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగానున్న భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 27 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది.
Source: Yahoo! Telugu: News | 13 Jan 2010 | 5:05 am

తగ్గుతున్న అమెరికా అధినేత ఒబామా రేటింగ్!

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రేటింగ్ గణనీయంగా తగ్గిపోతున్నట్టు తాజాగా నిర్వహించిన ఒక సర్వే వెల్లడించింది. ముఖ్యంగా, అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వ్యవహారశైలిపై ప్రజలు పెదవి విరిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 13 Jan 2010 | 4:58 am

హైతీలో భారీ భూకంపం: రిక్టర్‌పై 7.3గా నమోదు

హైతీలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైంది. ఈ భూకంప తీవ్రత వల్ల హైతీలోని అనేక ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్తులు, గృహాలు నేలమట్టమయ్యాయి. గత రెండు వందల సంవత్సరాల కాలంలో ఎన్నడూ ఇలాంటి భూకంపం సంభవించలేదని స్థానికులు అంటున్నారు.
Source: Yahoo! Telugu: News | 13 Jan 2010 | 4:43 am

నమో వెంకటేశా ఆడియో సక్సెస్

14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా వెంకటేష్, త్రిష కాంబినేషన్లో నిర్మిస్తున్న "నమో వెకటేశ" ఆడియో సక్సెస్ సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. వినూత్నంగా ఈ కార్యక్రమం గంటపాటు నిర్వహించారు.ముందుగా రామానాయుడు మాట్లాడుతూ, ఈ సినిమా పాటలు విన్నాను. చాలా బాగున్నాయి. సినిమా కూడా చాలా బాగా వచ్చిందన్నారు. డి. సురేష్ బాబు మాట్లాడుతూ... సెన్సార్ పూర్తయింది. ఈనెల 14న చిత్రం విడుదల కానుంది. నిర్మాతలు కొత్తవారైనా బాగా తీశారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం హైలెట్‌గా ఉంది. అందుకే ఆడియో సక్సెస్ జరుపుతున్నాం అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Jan 2010 | 4:03 am

అధికారులపై ఆర్మీ చీఫ్ చర్యలు: మంత్రి ఆంటోనీ

భూకుంభకోణంలో సంబంధం ఉన్న నలుగురు అధికారులపై ఆరమ్ ఆర్మీ చీఫ్ దీపక్ కపూర్ చర్యలు తీసుకుంటారని కేంద్ర రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ తెలిపారు. దీనిపై ఆయన బుధవారం మాట్లాడుతూ.. ఈ వ్యవహారానికి సంబంధించి గత రాత్రి తమ శాఖకు నివేదిక అందిందన్నారు. అదేసమయంలో ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న జనరల్స్‌పై చర్య తీసుకునే అంశంపై మాట్లాడటం అనేది తొందరపాటేనన్నారు.
Source: జాతీయ | 13 Jan 2010 | 3:18 am

తెలంగాణాలో "అదుర్స్"కు క్యూ కట్టిన ప్రేక్షకులు

తెలుగుదేశం నాయకుడు హరికృష్ణ సమైక్యవాదాన్ని సమర్థించిన నేపధ్యంలో ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా "అదుర్స్‌"ను అడ్డుకుంటామని ప్రకటించిన తెలంగాణా జేఏసి మాటను తెలంగాణా ప్రేక్షకులు పట్టించుకోలేదు. కరీంనగర్, మెదక్ జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో అన్నిచోట్ల అదుర్స్ ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రదర్శించబడుతోంది.
Source: ఏపీ న్యూస్ | 13 Jan 2010 | 1:19 am

కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ భయపెడుతోంది: తలసాని

తెలంగాణా ఆకాంక్ష తెలంగాణా ప్రాంతంలోని 10 జిల్లాలలోని ప్రజలందరిదీ అనీ, అది ఏ ఒక్క కుటుంబానికి చెందినది కాదని తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని కృష్ణయాదవ్ పేర్కొన్నారు. అయితే కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణా రాష్ట్ర సమితి కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మారిపోయి రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 13 Jan 2010 | 12:18 am

నేడు కేంద్ర కేబినెట్ భేటీ: ధరల పెరుగుదలపై చర్చ!

కేంద్ర కేబినెట్ బుధవారం సాయంత్రం భేటీ కానుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కేంద్ర మంత్రులందరూ హాజరుకానున్నారు. నిత్యావసర వస్తు ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ పెరుగుదలపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Source: జాతీయ | 13 Jan 2010 | 12:13 am

మహారాష్ట్రలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు బ్రేక్: థాక్రే

ఆస్ట్రేలియాలో నివశిస్తున్న భారతీయులపై దాడుల పరంపర కొనసాగడం పట్ల శివసేన అధ్యక్షుడు బాల్‌థాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును మాహారాష్ట్రలో అడుగుపెట్టనీయబోమని హెచ్చరించారు. దీనిపై ఆయన బుధవారం తమ పార్టీ పత్రిక సామ్నాలో ఒక కథనాన్ని ప్రచురించారు.
Source: జాతీయ | 12 Jan 2010 | 10:59 pm

సహనం నశిస్తే.. మీ ఇళ్లు కూలిపోతాయ్: మంత్రి ముఖేష్

గ్రేటర్ హైదరాబాద్‌లో అన్నదమ్ముల్లా కలిసి జీవనం సాగిస్తున్న ప్రజలను రెచ్చగొట్టవద్దని రాష్ట్ర కార్మిక శాఖామంత్రి ముఖేష్ గౌడ్ హెచ్చరించారు. గ్రేటర్ ప్రజల సహనానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు కుటుంబ సభ్యులు అగ్ని పరీక్ష పెడుతున్నారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jan 2010 | 10:32 pm

రాష్ట్ర విభజనకు కేంద్ర హోం శాఖ విముఖత!?

రాష్ట్ర విభజనకు కేంద్ర హోం శాఖ విముఖత చూపుతున్నట్టు సమాచారం. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల వనరులు గణనీయంగా తగ్గిపోతాయని తద్వారా మావోయిస్టులు చెలరేగి పోయే అవకాశం ఉందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి జీకే.పిళ్లై నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో పలువురు డీజీపీలు అభిప్రాయపడ్డారు. దీనిపై కేంద్ర హోం శాఖ ఏకీభవించినట్టు వినికిడి.
Source: ఏపీ న్యూస్ | 12 Jan 2010 | 10:21 pm

ఎన్సీపీ కార్యవర్గం విస్తరణ: సుప్రియాకు స్థానం!

నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని విస్తరించారు. కొత్త కార్యవర్గంలో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ కుమార్తె, కేంద్ర మంత్రి సుప్రియా సూలెకు స్థానం కల్పించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ముఖ్య అధికార ప్రతినిధి డి.పి.త్రిపాఠి మీడియాకు వెల్లడించారు.
Source: జాతీయ | 12 Jan 2010 | 9:00 pm

ఏమాత్రం మెరుగుపడని జ్యోతిబసు ఆరోగ్యం: వైద్యులు

కమ్యూనిస్టు వృద్ధనేత, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదని కోల్‌కతాలోని ఏఎంఆర్ఐ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక వైద్య బులిటెన్‌లో తెలిపారు.
Source: జాతీయ | 12 Jan 2010 | 8:52 pm

తెలంగాణలో తెలుగు చిత్రాలను ఆదరిస్తారు: "అదుర్స్" నిర్మాత

తెలంగాణా ప్రజలు ఖచ్చితంగా తెలుగు చిత్రాలను ఆదరిస్తారని ఎన్టీఆర్ "అదుర్స్" సినిమా నిర్మాత వల్లభనేని వంశీమోహన్ అన్నారు. ముఖ్యంగా పరభాషా చిత్రాల్ని ఆదరిస్తున్నట్లే మన తెలుగు చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముందని ఆయన చెప్పారు. "కళాకారులకు భేధాభిప్రాయాలు లేవు. ఇప్పటికే ఎన్టీఆర్ తన అభిప్రాయమేమిటో? చెప్పేశారు. నేను ఇక్కడివాడినే. నాకు అందరూ కావాలి. ఇంకా కళాకారులకు భాషాభేదాలు లేవు" అని అదుర్స్ నిర్మాత అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Jan 2010 | 11:14 am

ఇండస్ట్రీ అంటే "ఆ నలుగురు" కాదు: మురళీ మోహన్

సినిమావాళ్లకు అందరూ కావాలని, మేము కూడా అందరికీ కావాల్సిన వాళ్లమేననీ మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ అన్నారు. ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమా విడుదల సందర్భంగా తెలంగాణా కార్యకర్తలు చిత్రాన్ని అడ్డుకోవాలని పార్టీ పిలుపునివ్వడంపై మంగళవారం ఛాంబర్‌లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. చలనచిత్ర పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉంది. భవిష్యత్‌లో రాజకీయంగా ఏమి జరిగినా ఫర్వాలేదు. పరిశ్రమ ఎక్కడికీ వెళ్లదు. హైదరాబాదులోనే ఉంటుంది. సినీ పరిశ్రమ అనేది ఎవరో నలుగురు వ్యక్తులకు సంబంధించినది కాదు. ఇదొక వ్యవస్థ. దీనికి నష్టం వాటిల్లితే వేలాది మంది రోడ్డున పడతారు. నిర్మాతలకు ఆత్మహత్యలే శరణ్యం అవుతుంది. దయచేసి అర్థం చేసుకుని ఇండస్ట్రీకి సహకరించండి అని కోరారు.తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. సినిమా వాళ్లలో కొంతమంది మాట్లాడిన దానికి ఇండస్ట్రీకి సంబంధం లేదనీ, దయచేసి సినిమా ప్రతిష్టను బజారుపాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Jan 2010 | 10:34 am

శబరిమల యాత్రలో విషాదం: 11 మంది మృతి

శబరిమల యాత్రకు వెళుతున్న లారీ పంబ సమీపంలో బోల్తా పడటంతో 11 మంది అయ్యప్ప స్వామి భక్తులు మృత్యువాత పడ్డారు. వీరందరూ కృష్ణా జిల్లాకు చెందినవారు. ఇంకా మరో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
Source: జాతీయ | 12 Jan 2010 | 8:48 am

ప్లీజ్... "అదుర్స్‌"పై మాట్లాడు మామయ్యా!!

తెలుగువారి పెద్ద పండుగకు విడుదలవుతున్న చిత్రం "అదుర్స్". ఈ చిత్రంతో ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులతో అదరహో అనిపించుకుందామనుకున్న తరుణంలో తెలంగాణా ప్రాంత నాయకుల పిలుపుకు అదుర్స్ బెదుర్స్ అంటూ బిక్కుబిక్కుమంటోంది.
Source: ఏపీ న్యూస్ | 12 Jan 2010 | 8:10 am

29 వరకూ గడువిస్తున్నాం... : తెలంగాణా జేఏసి

హైదరాబాదులో మంగళవారం జేఏసి సమావేశంలో సుదీర్ఘ చర్చల అనంతరం నాయకులు తెలంగాణా సాధనకు అవలంభించవలసిన వ్యూహాలను వెల్లడించారు. తెలంగాణా వచ్చేవరకూ తెలంగాణా ప్రాంతంలో నివశిస్తున్న ప్రతి కుటుంబం తమ ఇంటిపై జై తెలంగాణా జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఉద్యోగులు తమ విధులకు నల్ల బ్యాడ్జీలను ధరించి హాజరు కావాలన్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jan 2010 | 7:41 am

ఆడాళ్లు సెక్స్ గురించి మాట్లాడితే విచ్చలవిడితనమా...?

సెక్సీ చూపుల శ్రేయ చటుక్కున సెక్స్ గురించి మాటలందుకున్నది. ముఖ్యంగా సెక్స్ అంశాన్ని ఆడాళ్లు మాట్లాడితే అదేదో అపరాధం అని సమాజం తప్పుబట్టడంపై క్లాసు పీకింది. సెక్స్ జీవితంలో ఓ అంతర్భాగం, దాని గురించి కానీ, ఇద్దరి మధ్య మొలకెత్తిన రిలేషన్ గురించి కానీ బహిరంగంగా మాట్లాడే స్త్రీలను విచ్చలవిడితనంగా, దారితెన్ను లేనివారిగా విమర్శిస్తుండాన్ని తను సుతారము ఒప్పుకోను అంటోంది. సెక్స్ విషయాలను మాట్లాడే ఆడవారిపై ఒక రకమైన ముద్ర వేసేయడం అసంబద్ధమైన విషయం అంటోంది. ఇదే పని మగవారు చేస్తే మాత్రం ఏమీ అనకుండా వదిలేసి ఆడవారిని మాత్రం విచ్చలవిడితనమనే ట్యాగ్ తగిలించడం పాపమని కళ్లు పెద్దవి చేసి మరీ చెపుతోంది.రిలేషన్‌షిప్‌లో మోసాలుండకూడదనీ, ఇక్కడ సోల్‌మేట్ అనడం పెద్ద పదం అవుతుందనీ పెద్ద పెద్ద డైలాగులు చెప్పుకొచ్చింది. అయితే రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు కొంత క్రమశిక్షణను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందనీ, లేని పక్షంలో ఆ బంధం సజావుగా సాగదనీ అంటోంది. ఇంతకీ శ్రేయ అకాస్మాత్తుగా కొత్తగా రిలేషన్స్ గురించి మాట్లాడటం వెనుక ఆంతర్యమేమిటో...?
Source: Yahoo! Telugu: Entertainment | 12 Jan 2010 | 5:40 am

"అదుర్స్‌" చిత్రాన్ని అడ్డుకుని తీరుతాం: కవిత

"అదుర్స్" చిత్రాన్ని సమైక్యాంధ్ర పెట్టుబడిదారులు నిర్మించారని అందువల్ల ఈ చిత్ర ప్రదర్శనను తెలంగాణ ప్రాంతాల్లో అడ్డుకుని తీరుతామని తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు కుమార్తె కవిత హెచ్చరించారు. ఈ చిత్ర నిర్మాతలైన వల్లభనేని వంశీ, కొడాలి నానీలు సమైక్యాంధ్ర ఉద్యమంలో ముమ్మరంగా పాల్గొన్నారని అందువల్ల ఈ చిత్రాన్ని ప్రదర్శించనివ్వబోమన్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jan 2010 | 5:01 am

దక్షిణాసియా శాంతి స్థాపనకు భారత్-బంగ్లా కృషి

దక్షిణాసియాలో శాంతి స్థాపనకు భారత్, బంగ్లాదేశ్‌లు కృషి చేస్తాయని న్యూఢిల్లీలో పర్యటిస్తున్న బంగ్లా ప్రధాని షేక్ హసీనా హామీ ఇచ్చారు. దక్షిణాసియా దేశాలు పొరుగుదేశాలతో సత్ సంబంధాలు నెలకొల్పి శాంతి, సామరస్యాలకు తోడ్పాటును అందించాలని ఆమె ఆకాంక్షించారు.
Source: జాతీయ | 12 Jan 2010 | 4:42 am

నా సెక్సీనెస్ అక్కడే ఉందంటున్నారు: ఫరాఖాన్

హీరోయిన్‌గా కొన్ని చిత్రాల్లో నటించిన ఫరాఖాన్ తాజాగా కలువ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె ఇన్నోసెంట్ భార్యగా నటించింది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఆమె తన అందాలను ఆరబోస్తున్నట్లుగా వచ్చింది. ఎక్కువమంది హీరోయిన్లు ఎద భాగాన్ని ఎక్స్‌పోజింగ్ చేస్తుంటే తను మాత్రం తొడలు బాగా చూపించే ప్రయత్నం చేసింది. చిత్రంలోనూ ఇలేగే కనిపిస్తారా..? అని అడిగితే.. చిత్రంలో ఎలా కనిపించినా సెన్సార్ నిబంధనలుంటాయని ఛలోక్తి విసిరింది. అయితే తన సెక్సీ లుక్ మోకాళ్ల నుంచి పై భాగంలో ఉన్నదని చాలామంది అంటున్నారనీ, కనుక ఎలా చూడాలనుకుంటున్నారో, అలా కనిపించేందుకు సిద్ధంగా ఉన్నానని చెపుతోంది ఫరా. అయితే ఇప్పటి వరకూ నటించిన చిత్రాల్లో ఎందులోనూ ఎక్స్‌పోజింగ్ చేయలేదనీ, అవకాశమొస్తే చేయడానికైనా సిద్ధమేనని తెలిపింది. అలాఅని అవకాశాలకోసం దిగజారనని చెపుతోంది. నైట్ పార్టీలకు వెళ్లే అలవాటు లేదని చెపుతూ... తనకింకా సరైన బాయ్‌ఫ్రెండ్ దొరకలేదంటోంది. ఇంకేం... ప్రొసీడ్ అయితే పోలా...
Source: Yahoo! Telugu: Entertainment | 12 Jan 2010 | 4:40 am

తెలంగాణ జేఏసీలో భగ్గుమన్న నేతల విభేదాలు

అనుకున్నట్టుగానే తెలంగాణ జేఏసీలో విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు భిన్న ధృవాలుగా ఉంటాయి. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కోసం ఈ నాలుగు పార్టీల నేతలు ఏకమయ్యాయి.
Source: ఏపీ న్యూస్ | 12 Jan 2010 | 4:17 am

సంక్రాంతి తర్వాత తెలంగాణ పర్యటన: కేసీఆర్

సంక్రాంతి పండుగ తర్వాత అన్ని పార్టీల నేతలతో కలిసి తెలంగాణలోని పది జిల్లాల్లో పర్యటించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు తెలిపారు. అలాగే, రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న జాప్యాన్ని చూసి ఏ ఒక్కరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jan 2010 | 3:29 am

ఎన్ఆర్‌ఐలకు ఓటుహక్కుపై బాల్‌థాక్రే వ్యతిరేకం!

విదేశాల్లో నివశిస్తున్న భారతీయులకు (ఎన్ఆర్ఐ) ఓటు హక్కు కల్పించాలన్న ప్రధాని మన్మోహన్ సింగ్ ఆశయానికి అడ్డుకట్ట పడేలా కనిపిస్తోంది. ప్రవాస భారతీయులకు ఓటు హక్కు కల్పించే ప్రతిపాదనను శివసేన చీఫ్ బాల్‌థాక్రే వ్యతిరేకించారు. తమ పార్టీ పత్రిక సామ్నాలో థాక్రే రాసిన వ్యాసంలో ఆయన అభిప్రాయాలను వెల్లడించారు.
Source: జాతీయ | 12 Jan 2010 | 2:25 am

పేరుకే రాజీనామాలు: జీతభత్యాలు యధాతథం!

తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీపడి రాజీనామాలు సమర్పించారు. మొత్తం 294 మంది శాసనసభ్యులకు గాను 219 మంది సభ్యులు రాజీనామాలు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 12 Jan 2010 | 2:05 am