ప్రభాకరన్ తల్లి భారత్‌కు వెళ్లొచ్చు: మహిందా రాజపక్సే

దివంగత ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ తల్లి భారత్‌తో పాటు.. ఎక్కడికైనా వెళ్లవచ్చని శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్సే చెప్పారు. ఈ మేరకు అనుమతి ఇస్తున్నట్టు ఆయన తలిపారు. మంగళవారం కొంతమంది విదేశీ విలేకరులకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
Source: Yahoo! Telugu: News | 12 Jan 2010 | 8:05 am

ఎన్ఆర్‌ఐలకు ఓటుహక్కుపై బాల్‌థాక్రే వ్యతిరేకం!

విదేశాల్లో నివశిస్తున్న భారతీయులకు (ఎన్ఆర్ఐ) ఓటు హక్కు కల్పించాలన్న ప్రధాని మన్మోహన్ సింగ్ ఆశయానికి అడ్డుకట్ట పడేలా కనిపిస్తోంది. ప్రవాస భారతీయులకు ఓటు హక్కు కల్పించే ప్రతిపాదనను శివసేన చీఫ్ బాల్‌థాక్రే వ్యతిరేకించారు. తమ పార్టీ పత్రిక సామ్నాలో థాక్రే రాసిన వ్యాసంలో ఆయన అభిప్రాయాలను వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 12 Jan 2010 | 7:55 am

పేరుకే రాజీనామాలు: జీతభత్యాలు యధాతథం!

తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీపడి రాజీనామాలు సమర్పించారు. మొత్తం 294 మంది శాసనసభ్యులకు గాను 219 మంది సభ్యులు రాజీనామాలు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 12 Jan 2010 | 7:34 am

స్కోడా కార్లకు అవార్డులే అవార్డులు

వారం రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన ఆటో ఎక్స్‌పో షోలో ముగింపు రోజైన సోమవారం నిర్వాహకులు అవార్డులు ప్రకటించారు. ఇందులో భాగంగా స్కోడా ఆటో ఇండియా ప్రతిష్టాత్మకమైన ఆటో అవార్డులను పొందింది. స్కోడా సూపర్బ్‌ 5 అవార్డులను సొంతం చేసుకోగా, స్కోడా లూరా రెండు అవార్డులను పొందింది.
Source: Yahoo! Telugu: News | 12 Jan 2010 | 7:13 am

తిరిగి నష్టాల్లో కూరుకుపోయిన సెన్సెక్స్, నిఫ్టీ!

బాంబే స్టాక్ మార్కెట్ తిరిగి నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలు, ఆపై లాభాలు, మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో 50 పాయింట్లు క్షీణించి, 17,475 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 22 పాయింట్లో పడిపోయి, 5,226 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 12 Jan 2010 | 7:05 am

మిశ్రమ ఫలితాల్లో బాంబే స్టాక్ మార్కెట్

మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పాటు దేశీయ వాటాల ట్రేడింగ్ ఆశాజనకంగా కొనసాగకపోవడంతో మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంది. దీంతో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 34 పాయింట్లు వృద్ధి చెంది, 17,560 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. కానీ నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా కేవలం ఆరు పాయింట్ల నష్టంతో 5,242 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 12 Jan 2010 | 6:56 am

అలరించిన ఆటో ఎక్స్‌పో షో

దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలోని ప్రగతి మైదాన్‌లో ఏడు రోజుల పాటు జరిగిన ఆటోఎక్స్‌పో 2010 సోమవారం నాటితో ముగిసింది. ఈ ఆటో ఎక్స్‌పో షో దేశంలోని వాహన మార్కెట్‌కు నూతన జవజీవాలను అందించింది. ఎక్స్‌పోను సుమారు ఇరవై లక్షల మంది సందర్శించినట్లు అంచనా.
Source: Yahoo! Telugu: News | 12 Jan 2010 | 6:40 am

మంకుపట్టు వీడిన ఇద్దరు మంత్రులు: డీఎస్‌తో రాజీ!

తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రులు ఎట్టకేలకు మంకుపట్టు వీడారు. తమ రాజీనామాలను వెనక్కి తీసుకున్నారు. మంత్రిపదవుల్లో కొనసాగుతూనే తెలంగాణకు పోరాటం చేయనున్నట్టు ప్రకటించారు. వారిద్దరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. డి.శ్రీధర్ బాబులు. మంగళవారం ఉదయం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు (పిసిసి) చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ వారిద్దరిని తన నివాసానికి పిలిచి క్లాస్ పీకారు.
Source: Yahoo! Telugu: News | 12 Jan 2010 | 6:30 am

డేవిడ్ హెడ్లీ కేసు విచారణ ఫిబ్రవరి 23కు వాయిదా!

ముంబై దాడుల్లో సంబంధం ఉన్నట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న లష్కర్ తోయిబా తీవ్రవాది డేవిడ్ హెడ్లీ కేసు విచారణను వచ్చే నెల 23వ తేదీకి చికాగో కోర్టు వాయిదా వేసింది. హెడ్లీపై వచ్చిన పలు రకాల అభియోగాలపై అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ విచారణ చేస్తోంది. ఈ విచారణ ఇంకా పూర్తి కావాల్సివుంది. ఈ నేపథ్యంలో.. హెడ్లీ కేసు విచారణ చికాగో కోర్టులో వచ్చింది.
Source: Yahoo! Telugu: News | 12 Jan 2010 | 6:09 am

లాభాలతో పుంజుకున్న బాంబే స్టాక్ మార్కెట్

మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తిరిగి లాభాల బాటలో పయనిస్తోంది. దీంతో సెన్సెక్స్ 27 పాయింట్లు పుంజుకుని, 17,554 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 11 పాయింట్ల స్వల్ప లాభంతో 5,260 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 12 Jan 2010 | 6:01 am

ఆడాళ్లు సెక్స్ గురించి మాట్లాడితే విచ్చలవిడితనమా...?

సెక్సీ చూపుల శ్రేయ చటుక్కున సెక్స్ గురించి మాటలందుకున్నది. ముఖ్యంగా సెక్స్ అంశాన్ని ఆడాళ్లు మాట్లాడితే అదేదో అపరాధం అని సమాజం తప్పుబట్టడంపై క్లాసు పీకింది. సెక్స్ జీవితంలో ఓ అంతర్భాగం, దాని గురించి కానీ, ఇద్దరి మధ్య మొలకెత్తిన రిలేషన్ గురించి కానీ బహిరంగంగా మాట్లాడే స్త్రీలను విచ్చలవిడితనంగా, దారితెన్ను లేనివారిగా విమర్శిస్తుండాన్ని తను సుతారము ఒప్పుకోను అంటోంది. సెక్స్ విషయాలను మాట్లాడే ఆడవారిపై ఒక రకమైన ముద్ర వేసేయడం అసంబద్ధమైన విషయం అంటోంది. ఇదే పని మగవారు చేస్తే మాత్రం ఏమీ అనకుండా వదిలేసి ఆడవారిని మాత్రం విచ్చలవిడితనమనే ట్యాగ్ తగిలించడం పాపమని కళ్లు పెద్దవి చేసి మరీ చెపుతోంది.రిలేషన్‌షిప్‌లో మోసాలుండకూడదనీ, ఇక్కడ సోల్‌మేట్ అనడం పెద్ద పదం అవుతుందనీ పెద్ద పెద్ద డైలాగులు చెప్పుకొచ్చింది. అయితే రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు కొంత క్రమశిక్షణను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందనీ, లేని పక్షంలో ఆ బంధం సజావుగా సాగదనీ అంటోంది. ఇంతకీ శ్రేయ అకాస్మాత్తుగా కొత్తగా రిలేషన్స్ గురించి మాట్లాడటం వెనుక ఆంతర్యమేమిటో...?
Source: Yahoo! Telugu: Entertainment | 12 Jan 2010 | 5:40 am

నా సెక్సీనెస్ అక్కడే ఉందంటున్నారు: ఫరాఖాన్

హీరోయిన్‌గా కొన్ని చిత్రాల్లో నటించిన ఫరాఖాన్ తాజాగా కలువ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె ఇన్నోసెంట్ భార్యగా నటించింది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఆమె తన అందాలను ఆరబోస్తున్నట్లుగా వచ్చింది. ఎక్కువమంది హీరోయిన్లు ఎద భాగాన్ని ఎక్స్‌పోజింగ్ చేస్తుంటే తను మాత్రం తొడలు బాగా చూపించే ప్రయత్నం చేసింది. చిత్రంలోనూ ఇలేగే కనిపిస్తారా..? అని అడిగితే.. చిత్రంలో ఎలా కనిపించినా సెన్సార్ నిబంధనలుంటాయని ఛలోక్తి విసిరింది. అయితే తన సెక్సీ లుక్ మోకాళ్ల నుంచి పై భాగంలో ఉన్నదని చాలామంది అంటున్నారనీ, కనుక ఎలా చూడాలనుకుంటున్నారో, అలా కనిపించేందుకు సిద్ధంగా ఉన్నానని చెపుతోంది ఫరా. అయితే ఇప్పటి వరకూ నటించిన చిత్రాల్లో ఎందులోనూ ఎక్స్‌పోజింగ్ చేయలేదనీ, అవకాశమొస్తే చేయడానికైనా సిద్ధమేనని తెలిపింది. అలాఅని అవకాశాలకోసం దిగజారనని చెపుతోంది. నైట్ పార్టీలకు వెళ్లే అలవాటు లేదని చెపుతూ... తనకింకా సరైన బాయ్‌ఫ్రెండ్ దొరకలేదంటోంది. ఇంకేం... ప్రొసీడ్ అయితే పోలా...
Source: Yahoo! Telugu: Entertainment | 12 Jan 2010 | 4:40 am

ఎన్ఆర్‌ఐలకు ఓటుహక్కుపై బాల్‌థాక్రే వ్యతిరేకం!

విదేశాల్లో నివశిస్తున్న భారతీయులకు (ఎన్ఆర్ఐ) ఓటు హక్కు కల్పించాలన్న ప్రధాని మన్మోహన్ సింగ్ ఆశయానికి అడ్డుకట్ట పడేలా కనిపిస్తోంది. ప్రవాస భారతీయులకు ఓటు హక్కు కల్పించే ప్రతిపాదనను శివసేన చీఫ్ బాల్‌థాక్రే వ్యతిరేకించారు. తమ పార్టీ పత్రిక సామ్నాలో థాక్రే రాసిన వ్యాసంలో ఆయన అభిప్రాయాలను వెల్లడించారు.
Source: జాతీయ | 12 Jan 2010 | 2:25 am

పేరుకే రాజీనామాలు: జీతభత్యాలు యధాతథం!

తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీపడి రాజీనామాలు సమర్పించారు. మొత్తం 294 మంది శాసనసభ్యులకు గాను 219 మంది సభ్యులు రాజీనామాలు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 12 Jan 2010 | 2:05 am

మంకుపట్టు వీడిన ఇద్దరు మంత్రులు: డీఎస్‌తో రాజీ!

తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రులు ఎట్టకేలకు మంకుపట్టు వీడారు. తమ రాజీనామాలను వెనక్కి తీసుకున్నారు. మంత్రిపదవుల్లో కొనసాగుతూనే తెలంగాణకు పోరాటం చేయనున్నట్టు ప్రకటించారు. వారిద్దరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. డి.శ్రీధర్ బాబులు. మంగళవారం ఉదయం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు (పిసిసి) చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ వారిద్దరిని తన నివాసానికి పిలిచి క్లాస్ పీకారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jan 2010 | 1:00 am

ఆర్టీఐ పరిధిలోకి సుప్రీంకోర్టు చీఫ్: ఢిల్లీ హైకోర్టు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ఢిల్లీ హైకోర్టుకు మధ్య వివాదం చెలరేగింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి రాదని భారత ప్రధాన న్యాయమూర్తి కె.జి.బాలకృష్ణన్ ఇటీవల స్పష్టం చేశారు. అయితే, ఢిల్లీ హైకోర్టు మంగళవారం దీనికి విరుద్ధంగా మరో తీర్పు ఇచ్చింది. ఆర్టీఐ పరిధిలోకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్‌ కార్యాలయం కూడా వస్తుందని పేర్కొంది.
Source: జాతీయ | 12 Jan 2010 | 12:25 am

తీవ్రవాద కార్యకలాపాలకు చోటివ్వం: షేక్ హసీనా

తమ దేశ భూభాగాన్ని తీవ్రవాదులు కార్యకలాపాలు సాగించేందుకు ఏమాత్రం చోటు ఇవ్వబోమని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా స్పష్టం చేశారు. మూడు రోజుల అధికారిక పర్యటన కోసం ఆదివారం న్యూఢిల్లీకి విచ్చేసిన ఆమె.. సోమవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో వివిధ అంశాలపై విస్తృతస్థాయి చర్చలు జరిపారు.
Source: జాతీయ | 11 Jan 2010 | 10:39 pm

నేడు తెలంగాణ ప్రాంత రాజకీయ జేఏసీ సమావేశం!

తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు తెలంగాణ ప్రాంత రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని రావి నారాయణ రెడ్డి హాలులో సమావేశం కానుంది. ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ హాజరుకావాలని జాక్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jan 2010 | 10:29 pm

రాజీనామాలు వెనక్కి తీసుకోండి: వీహెచ్ విన్నపం

తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు తమ రాజీనామాలను తక్షణం వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో కష్టాలు తప్పవని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ.హనుమంతరావు హెచ్చరిక చేశారు. ఆయన మంగళవారం ముఖ్యమంత్రి రోశయ్యతో సమావేశమయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jan 2010 | 10:22 pm

'జూనియర్‌'కు సమైక్య కంటే.. తెలంగాణాయే ముద్దా?

"ఇక్కడే పుట్టాను.. ఇక్కడే పెరిగాను.. ఇక్కడే కలిసిపోతాను" అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల కొంతమంది సమైక్యవాదులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన పరోక్షంగా తెలంగాణకు జై కొడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. తన వ్యక్తిగత సినీ కెరీర్‌ను దృష్టిలో ఉంచుకునే జూనియర్ ఇలా వ్యాఖ్యానించారని మండిపడుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jan 2010 | 10:15 pm

భారతీయుల రక్షణే ఆసీస్ ప్రధాన కర్తవ్యం: రవి

వరుసగా దాడులు జరుగుతున్నా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా ప్రభుత్వానికి కేంద్ర ప్రవాసీ భారతీయ మంత్రిత్వ శాఖామంత్రి వాయలార్ రవి ఘాటైన హెచ్చరికలు చేశారు. ఆస్ట్రేలియాలో నివశిస్తున్న భారతీయులకు పూర్తి రక్షణ కల్పించాల్సిన కనీస బాధ్యత, ప్రధాన కర్తవ్యం ఆ దేశ పాలకులదే అని తేల్చి చెప్పారు.
Source: జాతీయ | 11 Jan 2010 | 9:27 pm

చక్కెర ధర పెరుగుదలకు యూపీనే కారణం: కేంద్రం

దేశ వ్యాప్తంగా చిల్లర మార్కెట్‌లో చక్కెర ధర విపరీతంగా పెరిగి పోవడానికి ప్రధాన కారణం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమేనని కేంద్రం ఆరోపించింది. ఈ ధరలు ఎప్పటి లోపు తగ్గుతాయో చెప్పేందుకు తానేమీ జ్యోతిష్కుడిని కాదని కేంద్ర ఆహార శాఖామంత్రి శరద్ పవార్ మండిపడ్డారు.
Source: జాతీయ | 11 Jan 2010 | 8:51 pm

లేడీ విలన్‌గా మంచు లక్ష్మీ ప్రసన్న

కథానాయకుల కుమారులు హీరోలుగా మారడం మామూలే. కానీ కుమార్తెలు నటీమణులుగా మారడం చాలా అరుదు. బాలీవుడ్‌లో చూసుకుంటే అనిల్ కపూర్, రిషీ కపూర్ కుటుంబాలకు చెందినవారు ఉన్నా టాలీవుడ్‌లో ఇంకా ఆ మార్పు రాలేదు. ఇటీవలే కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ హీరోయిన్‌గా ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆ కోవలోనే మోహన్ బాబు కుమార్తె రాబోతోంది. ఇప్పటికే ఆమె పలు టీవీ షోలలో తన టాలెంట్‌ను నిరూపించుకుంది. ఇటీవల తన షూటింగ్‌పై ఆందోళనకారులు దాడి చేస్తే వారికి ధీటుగా సమాధానం చెప్పి మోహన్ బాబు కుమార్తె అనిపించుకున్నది. ఇప్పుడు నటనను తన తండ్రి నుంచి పుణికి పచ్చుకుంటూ సినిమాల్లో నటించడానకి సిద్ధమవుతోంది. విదేశాల్లో సినిమాకు సంబంధించిన కోర్సును అభ్యసించింది కూడా. ఒక పక్క మోహన్ బాబు వారసులుగా మంచి విష్ణు, మనోజ్‌లు తమ సత్తా నిరూపించుకుంటున్నారు. కానీ వీరిద్దరికంటే ధీటుగా లక్ష్మీ ప్రసన్న కనిపించనున్నారు. లేడీ విలన్‌గా ఆమె నటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Jan 2010 | 9:58 am

సంక్రాంతి కానుకగా 320 ప్రింట్లతో "నమో వెంకటేశ"

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన "కలిసుందాం రా", "లక్ష్మీ" చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వెంకటేష్, హ్యాట్రిక్ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తోన్న నమో వెంకటేశా చిత్రం కూడా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. విక్టరీ వెంకటేష్ ఈ చిత్రం గురించి చెబుతూ... గతంలో సంక్రాంతి కానుకగా విడుదలై ఘనవిజయం సాధించిన "కలిసుందాం రా", "లక్ష్మీ" చిత్రాల స్థాయిలో ఈ సంక్రాంతికి వస్తున్న నమో వెంకటేశ సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం నాకు ఉంది. ఈ సబ్జెక్టులో ఎంటర్‌టైన్మెంట్‌తోపాటు రొమాన్స్, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ వున్నాయి. ఈ సంక్రాంతి సీజన్‌కు ఇది పర్ఫెక్ట్ సినిమా అవుతుంది. ప్రొడ్యూసర్ రాము, గోపి, అనిల్ కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే తర్వాత నాతో మరోసారి త్రిష నటిస్తోంది. అలాగే తులసి తర్వాత దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్. పాటలన్నీ బాగా చేశాడు. బ్రహ్మానందం క్యారెక్టర్ హైలెట్‌గా నిలుస్తుంది. టోటల్‌గా 'నమో వెంకటేశ' ఈ సంక్రాంతికి పూర్తిస్థాయి వినోదాన్నిచ్చే చిత్రంగా నిలుస్తుందన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Jan 2010 | 9:33 am

కల్తీ మందుల సమాచారంతో బహుమతి పొందండి : ఆజాద్

దేశంలో కల్తీ మందుల తయారీ రోజురోజుకు పెరిగిపోతోంది. దీనిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కల్తీ మందులు తయారు చేసే అసాంఘిక శక్తుల సమాచారం అందించేవారికి కేంద్ర ప్రభుత్వం రూ. 25 లక్షల బహుమతి ప్రకటించింది.
Source: జాతీయ | 11 Jan 2010 | 8:36 am

కేసీఆర్‌కు ముఖం చాటేసిన సోనియా గాంధీ

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుకు నంబర్ 10, జనపథ్ దర్శన భాగ్యం లభించలేదు. ఇందుకోసం ఆయన రెండు రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేశారు. అయితే, ఎంతకీ కబురు రాకపోవడంతో ఆయన పూర్తిగా నిరాశకు లోనయ్యారు. ఇకలాభం లేదని సోమవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రావాలని నిర్ణయించుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jan 2010 | 7:32 am

రాజీనామాలు ఉపసంహరించుకోండి: డీఎస్

తెలగాంణ, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో భాగంగా శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ రాజీనామా లేఖలను ఉపసంహరించుకోవాల్సిందేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jan 2010 | 7:20 am

సమైక్య సంక్రాంతి జరుపుకుందాం: సీమాంధ్ర జేఏసి

ఈ సంవత్సర సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రజలందరూ సమైక్యాంధ్ర సంక్రాంతి పండుగగా జరుపుకోవాలని సీమాంధ్ర జేఏసీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిపోయి సమైక్యాంధ్ర సంక్రాంతిని సంతోషంగా జరుపుకోవాలన్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jan 2010 | 7:12 am

గాసిప్పులొస్తే ఏడ్వను.. నవ్వుతా: నేహా శర్మ

"చిరుత" వెంట నటించిన నేహా శర్మ ఇటీవల "కుర్రాడు"తో స్టెప్పులేసింది. ఈ చలాకీ చిన్నది గాసిప్స్‌ను లెక్క చేయదట. పైపెచ్చు గాలి వార్తలంటే తనకు ఎంతో ఇష్టమని చెపుతోంది. కొంతమందిలా తను బాధపడననీ, సంతోషపడతానని అంటోంది. అసలు మన గురించి ఎవరైనా గాలి వార్తలు మాట్లాడుకుంటున్నట్లయితే మనకు గుర్తింపు వస్తున్నట్లు లెక్క వేసుకోవాలని చెపుతోంది. చిరుత విడుదలైన మొదట్లో తనకు మరో హీరోతో లింకులు పెడుతూ కొందరు పిచ్చి రాతలు రాయడాన్ని చూసినప్పుడు చాలా బాధపడ్డాననీ, అయితే ఆ తర్వాత నిదానంగా ఆలోచించి గాసిప్స్‌ వల్ల ఏం జరుగుతోందన్న విషయాన్ని తెలుసుకున్నానంటోంది. నిజానికి గాసిప్ కబుర్ల ద్వారా ముఖ్యంగా సినీ పరిశ్రమలోని వారికి గుర్తింపు వస్తుందని కొత్త సంగతులు చెప్పుకొచ్చింది. ఒక సినిమా చేసిన తర్వాత తనపై గాసిప్స్ రావడాన్ని చూసి ఎంజాయ్ చేస్తుంటానని చెప్పుకొస్తోంది ఈ ముద్దుగమ్మ. అన్నట్లు ఈ భామకు హైదరాబాద్ అంటే భలే క్రేజ్ అట. ఇక్కడి కరాచీ బిస్కెట్లు, హైదరాబాద్ బిర్యానీలను తన ఊరికి వెళ్లేటపుడు తప్పుకుండా ప్యాక్ చేయించుకుని వెళతానని చెపుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Jan 2010 | 7:10 am

చర్చల ద్వారానే తెలంగాణా సాధ్యం: సింఘ్వీ

అభిషేక్ సింగ్ సింఘ్వి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ నాయకుల్లో తెలంగాణాపై ఏకాభిప్రాయం లేదనీ, సగంమందికి పైగా సమైక్యాంధ్ర అంటుంటే మిగిలినవారు తెలంగాణా అని అంటున్నారన్నారు. ఏకాభిప్రాయ సాధనకోసమే కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలను చర్చలకు పిలుపునిచ్చిందని గుర్తు చేశారు.
Source: జాతీయ | 11 Jan 2010 | 7:02 am

శృతి హాసన్‌తో "బొమ్మరిల్లు" సిద్ధార్థ డేటింగ్..?

డేటింగ్ పేరు చెబితే మనకు బాలీవుడ్ హీరో, హీరోయిన్ల పేర్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ టాలీవుడ్, కోలీవుడ్ హీరోహీరోయిన్లు కూడా ఈ డేటింగ్ విషయంలో బాలీవుడ్ రేంజ్‌కు ఎదుగుతున్నట్లు కనబడుతున్నారు. తాజాగా కోలీవుడ్ అండ్ టాలీవుడ్ కంబైన్డ్ హీరో సిద్ధార్థ శృతిహాసన్‌తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నాడట. వాళ్లిద్దరి ఫ్రెండ్‌షిప్‌ను చూసిన జనం ఇద్దరి మధ్య లవ్వాట సాగుతోందని గుసగుసలు పోతున్నాయి. అన్నట్లు మన బొమ్మరిల్లు సిద్ధార్థ ఇంతకుముందే సోహా అలీఖాన్‌తో ప్రేమాయణం సాగించినట్లు ఆ మధ్య గుసగుసలు వినబడ్డాయి. అయితే ఆ తర్వాత సిద్ధార్థ, తనకు సోహా మంచి స్నేహితురాలనీ, అంతకుమించి తమిద్దరి మధ్య ఏమీ లేదని తెగేసి చెప్పాడు. కానీ అనుమానం వీడని జర్నలిస్టులు నేరుగా ఇదే విషయాన్ని సోహా అలీఖాన్‌ను కూడా అడిగారు. సోహా కూడా అదే రకమైన జవాబు చెప్పడంతో పట్టుదొరక్క మిన్నకున్నారు. కానీ శృతిహాసన్‌తో సిద్ధార్థ ఫ్రెండ్‌షిప్ మాత్రం నూటికి నూరుపాళ్లు నిజమేననీ, ఆ స్నేహం ప్రేమగా మారిందనీ, ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారని వారు వాదిస్తున్నారు. ఈ విషయాన్ని డైరెక్టుగా వాళ్లను అడిగితే ఏం చెపుతారో మరి!!
Source: Yahoo! Telugu: Entertainment | 11 Jan 2010 | 5:17 am

జైలు సర్టిఫికేట్ ఉన్నవారికే పార్టీ టిక్కెట్: లాలూ

ఎవరైతే జైలు శిక్ష అనుభవించినట్టు సర్టిఫికేట్‌ను చూపిస్తారో వారికే పార్టీ టిక్కెట్ ఇస్తామని రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. గతంలో టిక్కెట్ల కేటాయింపులో జైలుశిక్షను ప్రమాణికంగా తీసుకునేవారని లాలూ గుర్తు చేశారు.
Source: జాతీయ | 11 Jan 2010 | 5:14 am

ముగ్ధ మనోహర బాలగోపాలుడి ఆలయం "గురువాయూర్"

నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి.. తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం "గురువాయూర్". కేరళలోని త్రిసూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్ (బాలకృష్ణుడు), ఉనికన్నన్, గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారు.
Source: వినోదం | 11 Jan 2010 | 4:22 am

సంక్రాంతి కానుకగా 320 ప్రింట్లతో "నమో వెంకటేశ"

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన "కలిసుందాం రా", "లక్ష్మీ" చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వెంకటేష్, హ్యాట్రిక్ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తోన్న నమో వెంకటేశా చిత్రం కూడా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. విక్టరీ వెంకటేష్ ఈ చిత్రం గురించి చెబుతూ... గతంలో సంక్రాంతి కానుకగా విడుదలై...
Source: వినోదం | 11 Jan 2010 | 4:04 am

సంక్రాంతి చేసుకోండి... సంతోషంగా.. హ.. హ్హ...హ్హ్హ

తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ నాయకుడు దామోదర్ రెడ్డి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... ఢిల్లీలో సమైక్యాంధ్ర గురించి ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదనీ, ఎవరి నోట విన్నా తెలంగాణా రాగం వినిపిస్తోందని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jan 2010 | 3:55 am

ఆ చిత్రాల ప్రదర్శనను అడ్డుకుంటాం: విద్యార్థులు

జూనియర్ ఎన్టీఆర్ నటించిన "అదుర్స్‌"తో పాటు.. రవితేజ నటించిన "శంభో శివ శంభో" చిత్రాల ప్రదర్శనను అడ్డుకుంటామని తెలంగాణ ప్రాంత యూనివర్శిటీల విద్యార్థి సంయుక్త కార్యాచరణ కమిటీ నాయకుడు ఎం.అజయ్ ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jan 2010 | 3:06 am

నా రాజీనామాను రాజకీయం చేయొద్దు: అమర్

తన రాజీనామా వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అమర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో పార్టీ ఉపాధ్యక్షుడు జానేశ్వర్ మిశ్రాపై అమర్ సింగ్ ఎదురుదాడికి దిగారు. తన ఆరోగ్య కారణాల రీత్యా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనమా చేశానని, దీన్ని రాజకీయం చేయవద్దని ఆయన సూచించారు.
Source: జాతీయ | 11 Jan 2010 | 2:43 am

గాసిప్పులొస్తే ఏడ్వను.. నవ్వుతా: నేహా శర్మ

"చిరుత" వెంట నటించిన నేహా శర్మ ఇటీవల "కుర్రాడు"తో స్టెప్పులేసింది. ఈ చలాకీ చిన్నది గాసిప్స్‌ను లెక్క చేయదట. పైపెచ్చు గాలి వార్తలంటే తనకు ఎంతో ఇష్టమని చెపుతోంది. కొంతమందిలా తను బాధపడననీ, సంతోషపడతానని అంటోంది. అసలు మన గురించి ఎవరైనా గాలి వార్తలు మాట్లాడుకుంటున్నట్లయితే మనకు గుర్తింపు వస్తున్నట్లు లెక్క వేసుకోవాలని చెపుతోంది. చిరుత విడుదలైన మొదట్లో తనకు మరో హీరోతో లింకులు పెడుతూ కొందరు పిచ్చి రాతలు రాయడాన్ని చూసినప్పుడు చాలా బాధపడ్డాననీ, అయితే ఆ తర్వాత నిదానంగా ఆలోచించి గాసిప్స్‌ వల్ల ఏం జరుగుతోందన్న విషయాన్ని తెలుసుకున్నానంటోంది. నిజానికి గాసిప్ కబుర్ల ద్వారా ముఖ్యంగా సినీ పరిశ్రమలోని వారికి గుర్తింపు వస్తుందని కొత్త సంగతులు చెప్పుకొచ్చింది. ఒక సినిమా చేసిన తర్వాత తనపై గాసిప్స్ రావడాన్ని చూసి ఎంజాయ్ చేస్తుంటానని చెప్పుకొస్తోంది ఈ ముద్దుగమ్మ. అన్నట్లు ఈ భామకు హైదరాబాద్ అంటే భలే క్రేజ్ అట. ఇక్కడి కరాచీ బిస్కెట్లు, హైదరాబాద్ బిర్యానీలను తన ఊరికి వెళ్లేటపుడు తప్పుకుండా ప్యాక్ చేయించుకుని వెళతానని చెపుతోంది.
Source: వినోదం | 11 Jan 2010 | 1:42 am