2009లో 54,960 కోట్ల విదేశీమారకద్రవ్యం!

గత యేడాది దేశ పర్యాటక శాఖ నుంచి భారత్‌కు 54,960 కోట్ల రూపాయల విదేశీమారకద్రవ్యం రూపంలో ఆదాయం సమకూరింది. గత 2008 సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 8.3 శాతం అధికం. అలాగే డిసెంబరు నెలలో రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ముంబై దాడులు, ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా నవంబరు నెలలో పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిన్న విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 10 Jan 2010 | 8:34 am

తుదపరి బిల్‌గేట్స్‌ భారతీయుడే: వాషింగ్టన్ సర్వే

తదుపరి బిల్‌గేట్స్‌ భారతీయుడై ఉంటాడని ఒక అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో పాల్గొన్న అమెరికా ప్రజల్లో 40 శాతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 10 Jan 2010 | 8:24 am

కాస్త మెరుగుపడిన వృద్ధనేత జ్యోతిబసు ఆరోగ్యం!

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు కాస్త మెరుగుపడినట్టు కోల్‌కతాలోని ఏఎంఆర్ఐ ఆస్పత్రి వైద్యులు ఆదివారం వెల్లడించారు. డాక్టర్ల పిలుపుకి స్పందిస్తున్నారని వారు తెలిపారు. న్యూమోనియాతో బాధపడుతున్న 95 సంవత్సరాల జ్యోతిబసుకు కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌లో ఏఎంఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 10 Jan 2010 | 7:16 am

తెలంగాణ ఉద్యమాన్ని పక్కదోవ పట్టిస్తే.. అంతే సంగతులు!

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. తమకు తెలంగాణ సాధనే లక్ష్యమని, పదవులు ఏ మాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు. చర్చల పేరుతో తెలంగాణ ఉద్యమాన్ని పక్కదోవ పట్టిస్తే ఏ మాత్రం వూరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
Source: Yahoo! Telugu: News | 10 Jan 2010 | 6:36 am

పదవులతో మభ్యపెడితే సహించం: దామోదర్ రెడ్డి

తెలంగాణ సమస్యను మరుగున పెట్టేందుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది నేతలు పదవుల పందేరానికి దిగారని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆరోపించారు. పదవులతో తమ ప్రాంత నేతలను మభ్యపెట్టలేరని, అలాగే, ఉద్యమాన్ని కూడా బలహీన పరచలేరన్నారు.
Source: Yahoo! Telugu: News | 10 Jan 2010 | 6:31 am

తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి: కావూరి

తెలంగాణ సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టే దిశగా కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోంది. ఇందులోభాగంగా, ఆ ప్రాంతానికి చెందిన సమర్థవంతమైన నేతను ఉప ముఖ్యమంత్రి చేసే ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని ఏలూరు లోక్‌సభ సభ్యుడు కావూరి సాంబశివరావు సూచన ప్రాయంగా వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 10 Jan 2010 | 6:23 am

అంధుల కోసం ఎస్బీఐ ఆధ్వర్యంలో ఏటీఎం కేంద్రాలు

దేశంలోని అంధుల కోసం ప్రత్యేక ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేయాలని దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంకు నిర్ణయించింది. ఈ ఏటీఎంల ద్వారా ఇక నుంచి సాధారణ ప్రజలతో పాటు వికలాంగులు, అంధులు కూడా నగదు ఉపసంహరణలు చేసుకునేలా వీలు కల్పించనుంది.
Source: Yahoo! Telugu: News | 10 Jan 2010 | 5:33 am

సమస్యలు పరిష్కరించుకుంటాం: ములాయం సింగ్

తమ పార్టీలో నెలకొన్న సమస్యలను తామే పరిష్కరించుకుంటామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ అభిప్రాయపడ్డారు. పార్టీలోని తిరుగుబాటు నేతలతో తాను స్వయంగా ఫోనులో మాట్లాడుతానని, ఆ తర్వాత సమస్యలు అవే పరిష్కారం అవుతాయని చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 10 Jan 2010 | 5:21 am

తైవాన్‌కు అమెరికా ఆయుధాలు: చైనా ఖండన

తైవాన్‌కు అమెరికా ఆయుధాలను విక్రయిస్తోంది. దీని చైనా తీవ్రంగా ఖండించింది. ఈ చర్య చైనా అంతర్గత వ్యవహారాల్లోకి అమెరికా జోక్యం చేసుకోవడమేనని అభిప్రాయపడింది. ఈ వ్యవహారం వల్ల అమెరికాతో తమ సంబంధాలు దెబ్బతినే అవకాశం లేకపోలేదని హెచ్చరించింది.
Source: Yahoo! Telugu: News | 10 Jan 2010 | 5:09 am

ముందుగానే 2010-11 వార్షిక బడ్జెట్: ప్రణబ్ ముఖర్జీ

ఈ యేడాది 2010-11 వార్షిక బడ్జెట్‌ను ఆనవాయితీ కంటే ఒకటి రెండు రోజులు ముందుగానే ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సూచన ప్రాయంగా వెల్లడించారు. శనివారం పాత్రికేయులకు విత్తమంత్రి ఇచ్చిన ప్రత్యేక విందులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సాధారణంగా సాధారణ బడ్జెట్‌ను ప్రతియేడాది ఫిబ్రవరి 28వ తేదీన ప్రవేశపెట్టడం ఆనవాయితీ వస్తోంది.
Source: Yahoo! Telugu: News | 10 Jan 2010 | 4:56 am

కాస్త మెరుగుపడిన వృద్ధనేత జ్యోతిబసు ఆరోగ్యం!

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు కాస్త మెరుగుపడినట్టు కోల్‌కతాలోని ఏఎంఆర్ఐ ఆస్పత్రి వైద్యులు ఆదివారం వెల్లడించారు. డాక్టర్ల పిలుపుకి స్పందిస్తున్నారని వారు తెలిపారు. న్యూమోనియాతో బాధపడుతున్న 95 సంవత్సరాల జ్యోతిబసుకు కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌లో ఏఎంఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Source: జాతీయ | 10 Jan 2010 | 1:46 am

తెలంగాణ ఉద్యమాన్ని పక్కదోవ పట్టిస్తే.. అంతే సంగతులు!

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. తమకు తెలంగాణ సాధనే లక్ష్యమని, పదవులు ఏ మాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు. చర్చల పేరుతో తెలంగాణ ఉద్యమాన్ని పక్కదోవ పట్టిస్తే ఏ మాత్రం వూరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jan 2010 | 1:08 am

పదవులతో మభ్యపెడితే సహించం: దామోదర్ రెడ్డి

తెలంగాణ సమస్యను మరుగున పెట్టేందుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది నేతలు పదవుల పందేరానికి దిగారని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆరోపించారు. పదవులతో తమ ప్రాంత నేతలను మభ్యపెట్టలేరని, అలాగే, ఉద్యమాన్ని కూడా బలహీన పరచలేరన్నారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jan 2010 | 1:02 am

తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి: కావూరి

తెలంగాణ సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టే దిశగా కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోంది. ఇందులోభాగంగా, ఆ ప్రాంతానికి చెందిన సమర్థవంతమైన నేతను ఉప ముఖ్యమంత్రి చేసే ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని ఏలూరు లోక్‌సభ సభ్యుడు కావూరి సాంబశివరావు సూచన ప్రాయంగా వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jan 2010 | 12:54 am

సమస్యలు పరిష్కరించుకుంటాం: ములాయం సింగ్

తమ పార్టీలో నెలకొన్న సమస్యలను తామే పరిష్కరించుకుంటామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ అభిప్రాయపడ్డారు. పార్టీలోని తిరుగుబాటు నేతలతో తాను స్వయంగా ఫోనులో మాట్లాడుతానని, ఆ తర్వాత సమస్యలు అవే పరిష్కారం అవుతాయని చెప్పారు.
Source: జాతీయ | 9 Jan 2010 | 11:51 pm

చిరంజీవి నేతృత్వంలో "సేవ్ ఆంధ్రప్రదేశ్" యాత్ర!

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సరికొత్త యాత్రను చేపట్టనున్నారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల ఫలితంగా రాష్ట్రానికి అపార నష్టం వాటిల్లింది. పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం పొంచివుంది. ఈ నేపథ్యంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో రాష్ట్రయాత్రను చేపట్టాలని ఆయన భావించారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jan 2010 | 10:35 pm

పోలియో నిర్మూలనకు ఎంతో కృషి చేయాలి: ఆజాద్

దేశంలో పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. స్వచ్చంధ సంస్థలు ఎంతో కృషి చేయాల్సి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి గులాం నబీ ఆజాద్ అన్నారు. రాష్ట్రపతి భవన్‌లో జాతీయ టీకా దినోత్సవాన్ని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ స్వయంగా ప్రారంభించారు.
Source: జాతీయ | 9 Jan 2010 | 10:20 pm

ప్రధాని మన్మోహస్ సింగ్‌తో భేటీ కానున్న కేసీఆర్!

దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌తో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖరరావు ఆదివారం సమావేశం కానున్నారు. కేసీఆర్‌తో పాటు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌ కూడా ప్రధానితో భేటీ కానున్నారని తెరాస పార్టీ శ్రేణుల సమాచారం. ఆదివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ప్రధానితో కేసీఆర్, జయశంకర్‌లు భేటీ కానున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో భాగంగా తెలంగాణ అంశంపై కేసీఆర్ ప్రధానితో చర్చించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల సమాచారం.
Source: జాతీయ | 9 Jan 2010 | 9:11 pm

నాకు అమ్మాయిలతో ఉండటమే ఇష్టం: షారుక్

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు అమ్మాయిలతో ఫ్రెండ్‌షిప్ చేయడమంటే ఎంతో ఇష్టమట. ఇటీవల లండన్‌లో ఓ రెస్టారెంట్లో తన భార్యతోపాటు మరో పదిమంది మహిళల మధ్య షారుక్ ఒక్కడే కూచుని వారితో మహా సరదా చేస్తూ కాలక్షేపం చేశాడు. ఆడ స్నేహితుల గురించి షారుక్ మాట్లాడుతూ... నాకు మగ స్నేహితులు ఎక్కువగా లేరు. నాకు అమ్మాయిలతో కలసి ఉండటమంటే ఎంతో ఇష్టం. అయితే దీన్ని చూసిన కొందరు తనకు అమ్మాయిలకు మధ్య ఏదో ఉందని ఊహాగానాలు చేస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. అయితే నా మహిళా స్నేహితులతో మగాళ్లు పెట్టుకునే సంబంధాలు మాత్రం నాకు లేనే లేవు అని తెగేసి చెప్పాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2010 | 12:55 pm

సూర్య సోదరుడు "యుగానికి ఒక్కడు" పాటలు విడుదల

సూర్య సోదరుడు కార్తి హీరోగా శ్రీ రాఘవ దర్శకత్వంలో రూపొందిన యుగానికి ఒక్కడు చిత్రం ఆడియో విడుదల శుక్రవారం రాత్రి హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ముఖ్య అతిథి దర్శకుడు రాజమౌళి సీడీని ఆవిష్కరించగా మరో దర్శకుడు వినాయక్ అందుకున్నారు.ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ.. ఈ చిత్ర దర్శకుడి అభిమానిని నేను. సినిమా ట్రైలర్స్ చూస్తుంటే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఉత్సుకత కలుగుతోంది. కార్తీ ఒక సినిమా చేశాడు. ఆ సినిమాతోనే చాలామంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. భవిష్యత్‌లో రజనీకాంత్ అంత నటుడు అవుతాడు అని అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ... మగధీర సినిమా షూటింగ్ రాజస్థాన్‌లో జరుగుతుండగా అక్కడే ఈ సినిమా షూటింగ్ తీశారని చెప్పారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి అడ్వంచర్ చిత్రాలు రాలేదు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముందని చెప్పారు. చిత్ర సమర్పకుడు ఆర్ రవీంద్రన్ మాట్లాడుతూ... ఈ సినిమాను దర్శకుడితో సహా ఎంతోమంది కష్టపడి పనిచేశారు. కథరీత్యా రాత్రి వేళల్లో టెక్నీషియన్స్ పనిచేయాల్సి వచ్చింది. వారి శ్రమఫలితం ఈ చిత్ర విజయంతో చేకూరుతుందని ఆశిస్తున్నానని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2010 | 12:47 pm

శరవేగంతో "బురిడి" షూటింగ్

కామెడీ చిత్రాలను రూపొందించడంలో ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న సక్సెస్‌ఫుల్ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో కొత్త సంవత్సరం రోజు ప్రారంభమైన బురిడి చిత్రం శరవేగంతో షూటింగ్ జరుపుకుంటోంది. ఆర్యన్ రాజేష్, నూతన తార ఐశ్వర్య జంటగా బిగ్ బి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇప్పటి వరకూ రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, అలీ, జ్యోత్స్న, జయప్రకాష్ రెడ్డి, శకుంతల తదితరులపై కామెడీ దృశ్యాలను చిత్రీకరించినట్లు ఇవివి సత్యనారాయణ శనివారం తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2010 | 12:30 pm

సంక్రాంతి కానుకగా కాజల్ అగర్వాల్ ఓం శాంతి

ప్రతిష్టాత్మక వైజయంతి హౌస్ నుండి త్రీ ఏంజెల్స్ స్టూడియోస్ బ్యానర్‌పై సి. ధర్మరాజు సమర్పణలో శేషు ప్రియాంక చలసాని కొత్త దర్శకుడు ప్రకాష్ దర్శకత్వంలో నిర్మించిన ఓం శాంతి సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని క్లీన్ యు సర్టిఫికెట్ పొందింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత శేషు ప్రియాంక చలసాని చెప్పారు.నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్, బిందు మాధవి, అదితి శర్మ, మురళీ మోహన్, రవి కాలే, రఘు బాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: జయనన్ విన్సెంట్, సంగీతం: ఇళయరాజా, మాటలు: నాగరాజు గంధం, నిర్మాత: శేషు ప్రియాంక చలసాని, కథ, స్క్రీన్ ప్లే- దర్శకత్వం: ప్రకాష్
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2010 | 12:18 pm

"మగధీర" రామ్‌చరణ్‌తో "రాకెట్ సింగ్" గాళ్

దక్షిణాది దర్శకనిర్మాతలు ఉత్తరాది భామలకోసం చూస్తుంటారు. దానికి తగ్గట్లుగానే టాలీవుడ్‌కు వచ్చిన సెక్సీ భామలు సక్సెస్ అవుతున్నారు. ఇప్పటి వరకూ బాలీవుడ్ నుంచి అంజలా ఝవేరీ, నమ్రత, భూమిక, శ్రియ, ఆర్తీ అగర్వాల్, జెనీలియా, ఇలియానా, కామ్నా వంటి ఎందరో ఉత్తరాది తారలు టాలీవుడ్‌లో సక్సెస్ సాధించి తెలుగు ప్రేక్షకుల హృదయంలో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించుకున్నారు.తాజాగా హిందీ చిత్రం రాకెట్ సింగ్‌లో నటించిన కథానాయిక షాజాన్ రామ్ చరణ్ సరసన నటిస్తోంది. సుప్రసిద్ధ పాప్ గాయకుడు షరోన్ ప్రభాకర్ కుమార్తె అయిన షాజాన్ తొలిచిత్రం రాకెట్ సింగ్. ఈ హిందీ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా షాజాన్ నటన చక్కగా ఉందన్న ప్రశంసలు వచ్చాయి. అంజనా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ లవర్ బాయ్‌గా కనిపించనున్నాడు. కాగా ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన షాజాన్‌తోపాటు జెనీలియా కూడా నటిస్తోంది. ఈ చిత్రానికి బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2010 | 7:59 am

2010లోపు నాకు పెళ్లైపోతుందోచ్..!: పారిస్ హిల్టన్

అమెరికా సెలబ్రిటీ పారిస్ హిల్టన్ త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. 2010 చివరికల్లా తనకు వివాహం అయ్యే అవకాశాలు లేకపోలేదని హిల్టన్ చెప్పింది. తన బాయ్‌ఫ్రెండ్ డోగ్ రీన్‌హెర్డ్‌తో ఉన్న స్నేహబంధాన్ని, వివాహబంధంగా ముడివేసుకుని త్వరలో హిల్టన్ ఇల్లాలు కానుంది.తన జీవితంలో అత్యంత ముఖ్యమైన పెళ్లి వేడుక సమీపంలోనే ఉందని హిల్టన్ లైఫ్ అండ్ స్టైల్ మ్యాగజైన్‌తో వెల్లడించింది. రీన్ హెర్డ్ తనకు మంచి స్నేహితుడని, తనను మహారాణిలా చూసుకుంటాడని హిల్టన్ సంబరపడిపోతోంది. ఇంకా తనకు పెళ్లి గంటలు వినిపిస్తున్నాయని పారిస్ ఆ మ్యాగజైన్‌తో చెప్పుకొచ్చింది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2010 | 6:48 am

బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కొత్తింట్లోకి మేగన్‌ఫాక్స్!

తన బాయ్‌ఫ్రెండ్ బ్రెయిన్ ఆస్టిన్ గ్రీన్‌తో కలిసి హాలీవుడ్ అందాల తార మేగన్‌ఫాక్స్ కొత్తింట్లోకి అడుగుపెట్టనుంది. కొద్దికాలం పాటు నూతన గృహంకోసం వెతుకులాట ప్రారంభించిన మేగన్‌ఫాక్స్‌కు లాస్‌ఏంజెలెస్‌ శివార్లలో అద్భుతమైన ఇల్లు దొరికింది. ఈ ఇంటికి తన బాయ్‌ఫ్రెండ్ ఆస్టిన్‌తో కలిసి గృహప్రవేశం చేయనున్నట్లు రియల్ ఎస్టాక్లేర్ డాట్‌కామ్ తెలిపింది.కొంతకాలం కలిసి.. మరికొంత కాలం విడిపోతూ.. ఉండే ఈ ప్రేమ జంట ఇప్పుడు ఒక్కటై లాస్ఏంజెలెస్‌ శివార్లలో కొన్న కొత్త ఇంట్లోకి ప్రవేశించనున్నారని హాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ ఇంటిని 29 లక్షల డాలర్లతో మేగన్‌ఫాక్స్ కొనుగోలు చేసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2010 | 6:46 am

చర్చలకు ఉల్ఫా నుంచి సంకేతాలు: అస్సోం సీఎం

శాంతి చర్చలకు నిషేధిత తీవ్రవాద సంస్థ ఉల్ఫా నుంచి సంకేతాలు అందుతున్నట్టు అస్సోం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ తెలిపారు. అయితే, దీనిపై తమకు ఎలాంటి స్పష్టమైన సమాచారం అందలేదని, అయితే, సంకేతాలు మాత్రం అనుకూలంగానే వస్తున్నట్టు ఆయన తెలిపారు.
Source: జాతీయ | 9 Jan 2010 | 6:21 am

పీఆర్సీపై ముగ్గురు మంత్రులతో కమిటీ: రోశయ్య

పే రివిజన్ కమిటీ (పీఆర్సీ) నివేదికపై ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ లేవనెత్తున్న అభ్యంతరాలను పరిశీలించేందుకు ముగ్గురు మంత్రులతో ముఖ్యమంత్రి కె.రోశయ్య ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు, వ్యవసాయశాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డిలకు చోటు కల్పించారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jan 2010 | 5:51 am

పార్టీలకు సోదరితో మగధీర "బంగారు కోడిపెట్ట"

తన చెల్లెలికి డైరెక్టుగా సినిమా అవకాశం ఇవ్వమని అడిగితే ఎవరు ఎలా స్పందిస్తారోనన్న సందేహమో ఏమోగానీ మగధీర "బంగారు కోడిపెట్ట" ముమైత్ ఖాన్ తన సోదరిని వెరైటీగా ప్రొజెక్ట్ చేస్తోంది. టాలీవుడ్‌లో జరిగే ఆయా ఫంక్షన్లకు సోదరి జుబెన్‌ను వెంటబెట్టుకుని వెళుతోంది. పలుకరించనివారిని కూడా పలుకరిస్తూ తన చెల్లల్ని వారికి పరిచయం చేస్తోంది. తన చెల్లెలికి తనకంటే ఎక్కువ టాలెంట్ ఉందన్న భావనను ఎదుటివారికి కలిగే విధంగా ప్రవర్తిస్తోంది. జుబెన్ కూడా ఓ అడుగు ముందుకేసి సినిమావాళ్ల ప్రవర్తన ఎలా ఉండాలో అలా మెలగుతూ అందరి కళ్లల్లో పడేందుకు యత్నిస్తోంది. అవును... తమ్ముళ్లకోసం అన్నయ్యలు, చెల్లెళ్లకోసం అక్కలు కష్టపడుతూనే ఉంటారు. సినిమాల విషయానికి వస్తే... మెగాస్టార్ తన తమ్ముళ్లను సినీరంగంలో పరిచయం చేసి నిలదొక్కుకునేటట్లు చేశారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే... నగ్మా, ఆర్తీ అగర్వాల్ వంటి తారలు ఎందరో తమ చెల్లెళ్లను వెండితెరకు పరిచయం చేసేందుకు నానా తంటాలు పడ్డారు. హ్యాట్సాఫ్ అక్కలూ... అన్నయ్యలూ...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2010 | 5:45 am

మరో పది రోజుల్లో వైఎస్ దుర్మరణంపై నివేదిక!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి దుర్మరణ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక కమిటీ మరో వారం రోజుల్లో తన నివేదికను సమర్పించనుంది. ఇద్దరు సభ్యుల కమిటీకి సివిల్ ఏవియేషన్ మాజీ డైరక్టర్, వీఐపీ భద్రతా నిపుణుడిగా పేరొందిన మాజీ ఐపీఎస్ అధికారి ఎం.ఆర్.రెడ్డి నేతృత్వం వహిస్తుండగా, జనరల్ హెచ్.ఎస్.కోలా మరో సభ్యుడిగా ఉన్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jan 2010 | 5:44 am

కాంగ్రెస్‌లో అంతర్గతంగా అధికార పోరు: ప్రరాపా

రాష్ట్ర కాంగ్రెస్‌లో అధికారం కోసం అంతర్గతంగా పోరు సాగుతోందని ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. అందువల్లే అధికార కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు చోటు చేసుకుంటున్నాయని, ఫలితంగా ఈ రాష్ట్ర శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jan 2010 | 4:34 am

ప్రాంతీయ అసమానతలు తొలగాలి: బృందాకారత్

తెలంగాణ సమస్య పరిష్కారానికి ఇరు ప్రాంతాల నేతల మధ్య నెలకొన్న ప్రాంతీయ అసమానతలు తొలగి పోవాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అభిప్రాయపడ్డారు. గుంటూరులో జరుగుతున్న 32వ అఖిలభారత కిసాన్ సభలో ఆమె శనివారం పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ సమస్య కేవలం చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jan 2010 | 4:33 am

"బెట్టింగ్ బంగార్రాజు"గా వస్తోన్న అల్లరి నరేష్!

నరేష్‌తో ఉషాకిరణ్‌మూవీస్ నిర్మిస్తోన్న చిత్రానికి "బెట్టింగ్ బంగార్రాజు" పేరును ఖరారు చేశారు. రామోజీరావు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఇ. సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నిధి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ ముగింపులో ఉన్న ఈ చిత్రాన్ని నరేష్ బాడీలాంగ్వేజ్‌కు తగిన కథతో ఆద్యంతం హాస్యాభరితంగా రూపొందించామని దర్శకుడు తెలిపారు. పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే ప్రేమకథా చిత్రమిదని సత్తిబాబు అన్నారు. త్వరలో ఆడియోను, సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2010 | 4:24 am

బాబు-రిలయన్స్ సంబంధాలపై ఆరా: ఉండవల్లి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు రిలయన్స్ సంస్థలకు ఉన్న సంబంధాలపై ఆరా తీయాలని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. దీనిపై ఆయన శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రిలయన్స్ సంస్థపై ఎవరో కొందరు దాడులు చేస్తే చంద్రబాబు ఉలిక్కిపడటానికి గల కారణం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jan 2010 | 3:41 am

ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ: ఊసే లేని తెలంగాణ!

ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి చిదంబరం డుమ్మా కొట్టారు. తెలంగాణ అంశంపై చర్చించేందుకే కేబినెట్ భేటీ అవుతున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఈ సమావేశంలో తెలంగాణ అంశమే ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం.
Source: జాతీయ | 9 Jan 2010 | 3:23 am

"మగధీర" రామ్‌చరణ్‌తో "రాకెట్ సింగ్" గాళ్

దక్షిణాది దర్శకనిర్మాతలు ఉత్తరాది భామలకోసం చూస్తుంటారు. దానికి తగ్గట్లుగానే టాలీవుడ్‌కు వచ్చిన సెక్సీ భామలు సక్సెస్ అవుతున్నారు. ఇప్పటి వరకూ బాలీవుడ్ నుంచి అంజలా ఝవేరీ, నమ్రత, భూమిక, శ్రియ, ఆర్తీ అగర్వాల్, జెనీలియా, ఇలియానా, కామ్నా వంటి ఎందరో ఉత్తరాది తారలు టాలీవుడ్‌లో సక్సెస్ సాధించి తెలుగు ప్రేక్షకుల హృదయంలో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించుకున్నారు.
Source: వినోదం | 9 Jan 2010 | 2:30 am