ఉల్ఫా అగ్రనేతతో ముషారఫ్ భేటీ: మంత్రి వెల్లడి

బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ అధినేత్రి ఖలీదా జియా అధికారంలో ఉన్న సమయంలో ఢాకాలో పర్యటించిన పాకిస్థాన్ అధ్యక్షుడు ముషారఫ్ ఉల్ఫా అగ్రనేతతో సమావేశమైనట్టు ఆ దేశానికి చెందిన సీనియర్ మంత్రి ఒకరు శనివారం వెల్లడించారు. ఆ సమయంలో బంగ్లాదేశ్ జైళ్ళలో మగ్గుతున్న ఉల్ఫా అగ్రనేత అనూప్ ఛేతియాతో ముషారఫ్ సమావేశమై గంటపాటు వివిధ అంశాలపై చర్చించినట్టు ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 9 Jan 2010 | 8:27 am

వారాంతం స్టాక్ మార్కెట్లు ఎలా ముగిశాయంటే..?

వారాంతమైన శుక్రవారం దేశీయ, విదేశీ సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ట్రేడింగ్ క్షీణత, వాటాల అమ్మకాల ఒత్తిడి వంటి పలు కారణాలతో అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకున్నాయి. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 9.30 గంటల వద్ద అమెరికా సూచీలైన డోజోన్స్ 28 పాయింట్ల నష్టంతో 10, 578 పాయింట్లను నమోదు చేసుకుంది. అలాగే బ్రిటన్ స్టాక్ మార్కెట్ సూచీ అయిన ఎఫ్‌టీఎస్ఈ 100 0.35 పాయింట్లు క్షీణించి, 5,526 పాయింట్ల మార్కును తాకింది
Source: Yahoo! Telugu: News | 9 Jan 2010 | 8:15 am

పెట్టుబడులు పెట్టేందుకు పెప్సికోకు అనుమతి

పెప్సికో హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారతదేశంలోని తన శాఖలో మూడు సంవత్సరాలపాటు దాదాపు ఇరవై కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం అనుమతినిచ్చింది.
Source: Yahoo! Telugu: News | 9 Jan 2010 | 8:02 am

"మగధీర" రామ్‌చరణ్‌తో "రాకెట్ సింగ్" గాళ్

దక్షిణాది దర్శకనిర్మాతలు ఉత్తరాది భామలకోసం చూస్తుంటారు. దానికి తగ్గట్లుగానే టాలీవుడ్‌కు వచ్చిన సెక్సీ భామలు సక్సెస్ అవుతున్నారు. ఇప్పటి వరకూ బాలీవుడ్ నుంచి అంజలా ఝవేరీ, నమ్రత, భూమిక, శ్రియ, ఆర్తీ అగర్వాల్, జెనీలియా, ఇలియానా, కామ్నా వంటి ఎందరో ఉత్తరాది తారలు టాలీవుడ్‌లో సక్సెస్ సాధించి తెలుగు ప్రేక్షకుల హృదయంలో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించుకున్నారు.తాజాగా హిందీ చిత్రం రాకెట్ సింగ్‌లో నటించిన కథానాయిక షాజాన్ రామ్ చరణ్ సరసన నటిస్తోంది. సుప్రసిద్ధ పాప్ గాయకుడు షరోన్ ప్రభాకర్ కుమార్తె అయిన షాజాన్ తొలిచిత్రం రాకెట్ సింగ్. ఈ హిందీ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా షాజాన్ నటన చక్కగా ఉందన్న ప్రశంసలు వచ్చాయి. అంజనా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ లవర్ బాయ్‌గా కనిపించనున్నాడు. కాగా ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన షాజాన్‌తోపాటు జెనీలియా కూడా నటిస్తోంది. ఈ చిత్రానికి బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2010 | 7:59 am

సీనియర్లు.. సీనియర్లుగా మాట్లాడండి: మంత్రి దానం!

సొంత పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నేతలు.. తమ బాధ్యతను విస్మరించి ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం తగదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి దానం నాగేందర్ హితవు పలికారు. గౌరవ స్థానంలో ఉండే సీనియర్ సభ్యుడు సీనియర్‌గానే నడుచుకోవాలని ఆయన సూచించారు.
Source: Yahoo! Telugu: News | 9 Jan 2010 | 7:00 am

రిలయన్స్ ప్రతినిధిగా చంద్రబాబు: మంత్రి రఘువీరా

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నట్టుగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి ఆరోపించారు. ఆయన శనివారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత నెల రోజులకు పైగా రాష్ట్రం తగలబడి పోతుంటే కంటికి కూడా కనిపించని చంద్రబాబు.. రిలయన్స్ సంస్థపై దాడి జరిగిన వెంటనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చేరుకుని మీడియా సమావేశం ఏర్పాటు చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
Source: Yahoo! Telugu: News | 9 Jan 2010 | 6:50 am

2010లోపు నాకు పెళ్లైపోతుందోచ్..!: పారిస్ హిల్టన్

అమెరికా సెలబ్రిటీ పారిస్ హిల్టన్ త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. 2010 చివరికల్లా తనకు వివాహం అయ్యే అవకాశాలు లేకపోలేదని హిల్టన్ చెప్పింది. తన బాయ్‌ఫ్రెండ్ డోగ్ రీన్‌హెర్డ్‌తో ఉన్న స్నేహబంధాన్ని, వివాహబంధంగా ముడివేసుకుని త్వరలో హిల్టన్ ఇల్లాలు కానుంది.తన జీవితంలో అత్యంత ముఖ్యమైన పెళ్లి వేడుక సమీపంలోనే ఉందని హిల్టన్ లైఫ్ అండ్ స్టైల్ మ్యాగజైన్‌తో వెల్లడించింది. రీన్ హెర్డ్ తనకు మంచి స్నేహితుడని, తనను మహారాణిలా చూసుకుంటాడని హిల్టన్ సంబరపడిపోతోంది. ఇంకా తనకు పెళ్లి గంటలు వినిపిస్తున్నాయని పారిస్ ఆ మ్యాగజైన్‌తో చెప్పుకొచ్చింది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2010 | 6:48 am

బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కొత్తింట్లోకి మేగన్‌ఫాక్స్!

తన బాయ్‌ఫ్రెండ్ బ్రెయిన్ ఆస్టిన్ గ్రీన్‌తో కలిసి హాలీవుడ్ అందాల తార మేగన్‌ఫాక్స్ కొత్తింట్లోకి అడుగుపెట్టనుంది. కొద్దికాలం పాటు నూతన గృహంకోసం వెతుకులాట ప్రారంభించిన మేగన్‌ఫాక్స్‌కు లాస్‌ఏంజెలెస్‌ శివార్లలో అద్భుతమైన ఇల్లు దొరికింది. ఈ ఇంటికి తన బాయ్‌ఫ్రెండ్ ఆస్టిన్‌తో కలిసి గృహప్రవేశం చేయనున్నట్లు రియల్ ఎస్టాక్లేర్ డాట్‌కామ్ తెలిపింది.కొంతకాలం కలిసి.. మరికొంత కాలం విడిపోతూ.. ఉండే ఈ ప్రేమ జంట ఇప్పుడు ఒక్కటై లాస్ఏంజెలెస్‌ శివార్లలో కొన్న కొత్త ఇంట్లోకి ప్రవేశించనున్నారని హాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ ఇంటిని 29 లక్షల డాలర్లతో మేగన్‌ఫాక్స్ కొనుగోలు చేసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2010 | 6:46 am

అమెరికా నుంచి సీ-17 విమానాన్ని కొననున్న భారత్

భారతదేశం సీ-17 విమానాలను పదిదాకా కొననున్నట్లు అమెరికా భద్రతా రంగానికి చెందిన విమానాల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న కంపెనీ బోయింగ్ సంస్థ తెలిపింది. దీనికి సంబంధించి తమ ప్రభుత్వానికి ఆ దేశం నుంచి లేఖ అందిందని బోయింగ్ సంస్థ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 9 Jan 2010 | 6:38 am

కొత్త కంప్యూటర్‌ను ప్రవేశపెట్టనున్న ఎప్పల్

తమ సంస్థ వచ్చే మార్చి నెల నుంచి మార్కెట్లోకి కొత్త కంప్యూటర్‌ను ప్రవేశపెట్టనుందని ఎప్పల్ సంస్థ తెలిపినట్లు వాల్‌ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఎప్పల్ కొత్త మల్టీమీడియా టేబ్లేట్ డివైస్‌ని ప్రవేశపెట్టనుందని జర్నల్ పేర్కొంది. దీనిని ఈ నెల ద్వితీయార్థంలో మార్కెట్లోకి ప్రవేశపెట్టనుందని, కాని మార్చి నెల నుంచే అమ్మకాలను ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపిందదని జర్నల్ వివరించింది.
Source: Yahoo! Telugu: News | 9 Jan 2010 | 6:22 am

తమిళనాడు డీజీపీగా లతికా చరణ్ నియామకం!

తమిళనాడు రాష్ట్ర డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ)గా మహిళా ఐపీఎస్ అధికారి లతికా చరణ్ నియమితులయ్యారు. ఈ మేరకు, ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ విధులను నిర్వహిస్తున్న డీజీపీ కేపీ.జైన్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో లతికా చరణ్‌ను నియమించినట్టు ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
Source: Yahoo! Telugu: News | 9 Jan 2010 | 6:18 am

వాఘా సరిహద్దుల్లో పాక్ కవ్వింపులు: దాడి

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని వాఘా సరిహద్దుల్లో పాకిస్థాన్ మరోమారు కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని వాఘా సమీపంలో ఉన్న అటారీ ప్రాంతంపై శనివారం ఉదయం పాక్ దళాలు రాకెట్ల లాంఛర్లతో దాడి చేశారు.
Source: Yahoo! Telugu: News | 9 Jan 2010 | 5:57 am

పార్టీలకు సోదరితో మగధీర "బంగారు కోడిపెట్ట"

తన చెల్లెలికి డైరెక్టుగా సినిమా అవకాశం ఇవ్వమని అడిగితే ఎవరు ఎలా స్పందిస్తారోనన్న సందేహమో ఏమోగానీ మగధీర "బంగారు కోడిపెట్ట" ముమైత్ ఖాన్ తన సోదరిని వెరైటీగా ప్రొజెక్ట్ చేస్తోంది. టాలీవుడ్‌లో జరిగే ఆయా ఫంక్షన్లకు సోదరి జుబెన్‌ను వెంటబెట్టుకుని వెళుతోంది. పలుకరించనివారిని కూడా పలుకరిస్తూ తన చెల్లల్ని వారికి పరిచయం చేస్తోంది. తన చెల్లెలికి తనకంటే ఎక్కువ టాలెంట్ ఉందన్న భావనను ఎదుటివారికి కలిగే విధంగా ప్రవర్తిస్తోంది. జుబెన్ కూడా ఓ అడుగు ముందుకేసి సినిమావాళ్ల ప్రవర్తన ఎలా ఉండాలో అలా మెలగుతూ అందరి కళ్లల్లో పడేందుకు యత్నిస్తోంది. అవును... తమ్ముళ్లకోసం అన్నయ్యలు, చెల్లెళ్లకోసం అక్కలు కష్టపడుతూనే ఉంటారు. సినిమాల విషయానికి వస్తే... మెగాస్టార్ తన తమ్ముళ్లను సినీరంగంలో పరిచయం చేసి నిలదొక్కుకునేటట్లు చేశారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే... నగ్మా, ఆర్తీ అగర్వాల్ వంటి తారలు ఎందరో తమ చెల్లెళ్లను వెండితెరకు పరిచయం చేసేందుకు నానా తంటాలు పడ్డారు. హ్యాట్సాఫ్ అక్కలూ... అన్నయ్యలూ...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2010 | 5:45 am

ముంబై దాడులకు బీమా ఐదు వందల కోట్లు

ముంబైలో ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా నష్టపోయిన సంస్థలకు బీమా కంపెనీలు భారీ స్థాయిలో క్లెయిములు చెల్లించాల్సి వస్తోంది. ఈ చెల్లింపులు దాదాపు రూ. 500 కోట్ల మేరకు ఉండవచ్చని బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ(ఐఆర్‌డీఏ) వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 9 Jan 2010 | 5:41 am

"బెట్టింగ్ బంగార్రాజు"గా వస్తోన్న అల్లరి నరేష్!

నరేష్‌తో ఉషాకిరణ్‌మూవీస్ నిర్మిస్తోన్న చిత్రానికి "బెట్టింగ్ బంగార్రాజు" పేరును ఖరారు చేశారు. రామోజీరావు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఇ. సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నిధి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ ముగింపులో ఉన్న ఈ చిత్రాన్ని నరేష్ బాడీలాంగ్వేజ్‌కు తగిన కథతో ఆద్యంతం హాస్యాభరితంగా రూపొందించామని దర్శకుడు తెలిపారు. పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే ప్రేమకథా చిత్రమిదని సత్తిబాబు అన్నారు. త్వరలో ఆడియోను, సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2010 | 4:24 am

ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ: ఊసే లేని తెలంగాణ!

ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి చిదంబరం డుమ్మా కొట్టారు. తెలంగాణ అంశంపై చర్చించేందుకే కేబినెట్ భేటీ అవుతున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఈ సమావేశంలో తెలంగాణ అంశమే ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం.
Source: జాతీయ | 9 Jan 2010 | 3:23 am

"మగధీర" రామ్‌చరణ్‌తో "రాకెట్ సింగ్" గాళ్

దక్షిణాది దర్శకనిర్మాతలు ఉత్తరాది భామలకోసం చూస్తుంటారు. దానికి తగ్గట్లుగానే టాలీవుడ్‌కు వచ్చిన సెక్సీ భామలు సక్సెస్ అవుతున్నారు. ఇప్పటి వరకూ బాలీవుడ్ నుంచి అంజలా ఝవేరీ, నమ్రత, భూమిక, శ్రియ, ఆర్తీ అగర్వాల్, జెనీలియా, ఇలియానా, కామ్నా వంటి ఎందరో ఉత్తరాది తారలు టాలీవుడ్‌లో సక్సెస్ సాధించి తెలుగు ప్రేక్షకుల హృదయంలో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించుకున్నారు.
Source: వినోదం | 9 Jan 2010 | 2:30 am

సీనియర్లు.. సీనియర్లుగా మాట్లాడండి: మంత్రి దానం!

సొంత పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నేతలు.. తమ బాధ్యతను విస్మరించి ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం తగదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి దానం నాగేందర్ హితవు పలికారు. గౌరవ స్థానంలో ఉండే సీనియర్ సభ్యుడు సీనియర్‌గానే నడుచుకోవాలని ఆయన సూచించారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jan 2010 | 1:31 am

రిలయన్స్ ప్రతినిధిగా చంద్రబాబు: మంత్రి రఘువీరా

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నట్టుగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి ఆరోపించారు. ఆయన శనివారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత నెల రోజులకు పైగా రాష్ట్రం తగలబడి పోతుంటే కంటికి కూడా కనిపించని చంద్రబాబు.. రిలయన్స్ సంస్థపై దాడి జరిగిన వెంటనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చేరుకుని మీడియా సమావేశం ఏర్పాటు చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jan 2010 | 1:21 am

తమిళనాడు డీజీపీగా లతికా చరణ్ నియామకం!

తమిళనాడు రాష్ట్ర డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ)గా మహిళా ఐపీఎస్ అధికారి లతికా చరణ్ నియమితులయ్యారు. ఈ మేరకు, ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ విధులను నిర్వహిస్తున్న డీజీపీ కేపీ.జైన్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో లతికా చరణ్‌ను నియమించినట్టు ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
Source: జాతీయ | 9 Jan 2010 | 12:48 am

ఏమాత్రం మెరుగు పడని జ్యోతిబసు ఆరోగ్యం!

న్యూమోనియా వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కమ్యూనిస్టు వృద్ధనేత, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టు కోల్‌కతాలోని ఏఎంఆర్ఐ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
Source: జాతీయ | 8 Jan 2010 | 11:53 pm

అసత్య వార్తా కథనం ప్రసారం: జర్నలిస్టుల అరెస్టు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ దుర్మరణంలో రిలయన్స్ సంస్థ అధినేత హస్తం ఉందంటూ అసత్య కథనాన్ని ప్రచారం చేసిన ప్రముఖ టీవీకి చెందిన ఇద్దరు ఎడిటర్లసహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రష్యన్ వెబ్‌సైట్ ప్రచురించిన కథనం ఆధారంగా చేసుకుని ఈ వార్తా కథనాన్ని ప్రసారం చేశారు. ఫలితంగా వైఎస్సార్ అభిమానులు రెచ్చిపోయి, రిలయన్స్ సంస్థకు చెందిన ఆస్తులను ధ్వంసం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jan 2010 | 11:28 pm

ఆర్టీసీ ఛార్జీల పెంపు : 11న వామపక్షాల నిరసనలు!

ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరశిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ అగ్రనేతలు తీర్మానించారు. ప్రజా శ్రేయస్సు కోసం తాము చేపట్టే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీవీ రాఘవులు (సీపీఎం), కె.నారాయణ (సీపీఐ)లు పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jan 2010 | 11:13 pm

వైఎస్ దుర్మరణంలో 'బాబు' కుట్ర ఉందేమో?: దానం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రయాణించిన హెలికాఫ్టర్ కూలిపోయిన దుర్ఘటనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హస్తం ఉండివుండవచ్చనే ధర్మసందేహం ప్రజల్లో నెలకొని ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే రాష్ట్రంలో రిలయన్స్ సంస్థలపై జరిగిన దాడుల అనంతరం చంద్రబాబు మీడియా ముందుకు ప్రసంగించిన తీరువల్ల వారికి ఈ సందేహం వచ్చినట్టుగా ఉందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jan 2010 | 11:05 pm

మళ్లీ మాట్లాడుకోలేదు

"నాకో మిత్రుడున్నాడు. మా ఇద్దరి మధ్యా అరమరికలు లేవు. మా మధ్య ఎలాంటి రహస్యాలూ ఉండగూడదని, ఒకరి పట్ల ఒకరు చేసిన తప్పులను మనసువిప్పి మాట్లాడుకున్నాం" చెప్పాడు...
Source: వినోదం | 8 Jan 2010 | 10:22 pm

చచ్చి స్వర్గం వెళ్లి...

"జీవితాంతం చావకుండా ఉండాలంటే ఏం చేయాలి..?" జ్యోతిష్యుడిని అడిగాడు సురేష్"చచ్చి స్వర్గం వెళ్లి.. అక్కడ ఉండే అమృతం తాగాలి" కోపంగా చెప్పాడు జ్యోతిష్యుడు.
Source: వినోదం | 8 Jan 2010 | 10:19 pm

వాఘా సరిహద్దుల్లో రాకెట్లతో దాడి చేసిన పాక్

భారత్-పాక్ సరిహద్దులుగానున్న వాఘా సమీపంలోని అటారీపై పాకిస్థాన్‌కు చెందిన దళాలు రాకెట్లతో దాడులకు పాల్పడ్డాయి. వాఘా సరిహద్దులకు సమీపంలోనున్న అటారీపై పాక్ దళాలు రాకెట్లతో దాడులు జరిపాయి. దేశీయ భద్రతా బలగాలు పాక్ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టాయి.
Source: జాతీయ | 8 Jan 2010 | 9:01 pm

మిలటరీ దళాలను అభినందించిన చిదంబరం

ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జమ్మూకాశ్మీర్‌లో జరిపిన ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తిచేసిన సందర్భంగా భద్రతా సిబ్బందిని కేంద్ర హోం శాఖామంత్రి పి.చిదంబరం అభినందించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
Source: జాతీయ | 8 Jan 2010 | 8:26 pm

సంక్రాంతికి కానుకగా వెంకీ, త్రిషల "నమో వెంకటేశ"

విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ చిత్రాల దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న భారీ బడ్జెట్ చిత్రం "నమో వెంకటేశ". సురేష్ ప్రొడక్షన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్, డి. సురేష్‌బాబు సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలకు సిద్ధమైంది. జనవరి 4, 5, 6, 7 తేదీల్లో బ్యాంకాక్‌లో వెంకటేష్, హీరోయిన్ త్రిషలపై 'నీ కళ్ళలో మెరిసింది ఓ నిజం.. భూమ్మీదెలా ఇక నిలవడం..' అన్న పల్లవిగల పాటను చిత్రీకరించడంతో ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని నిర్మాతలు రాము, గోపి, అనిల్ తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jan 2010 | 10:51 am

అప్పుడేమో వరదలు-ఇప్పుడేమో ఆందోళనలు.. ఇంకెక్కడ..?

బాల నటునిగా కెరీర్‌ను ప్రారంభించిన తరుణ్ కథానాయకుడిగా ఒక్కో మెట్టు ఎదిగినా ఇంకా తన సినీ కెరీర్‌లో పరిపూర్ణత సంపాదించలేకపోతున్నాడు. నటునిగా కొంతగ్యాప్ తీసుకున్నా.. వేరే వ్యాపారంలో కూడా ఉన్నానంటున్నాడు. గత ఏడాదే పబ్ వ్యాపారంలోకి దిగాడు. తాజాగా "చుక్కలాంటి అమ్మాయి - చక్కనైన అబ్బాయి" సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ నెల 8వ తేదీ (శుక్రవారం) తరుణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన చిట్‌చాట్ మీ కోసం..ప్రశ్న: ఈ ఏడాది ఎలా పుట్టినరోజు జరుపుకుంటున్నారు?జ: ఈసారి చేసుకోవాలని ఆలోచన రాలేదు. మొన్నటివరకు వరద బీభత్సాలతో రాష్ట్రం అస్తవ్యస్తమైంది. ఇప్పుడేమో ఆందోళనలు. వీటిమధ్య సామాన్యుడితో పాటు మాకూ మనశ్శాంతి కరువైంది. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలు ఏం జరుపుకుంటాం చెప్పండి? ఏదైనా చేస్తే.. దాన్ని రాజకీయం చేస్తారు. అందుకే ఈసారి పుట్టినరోజు నాడు తిరుపతిలో దేవుని సన్నిధిలో ఉంటాను. ప్రశ్న: మీరు ఎవరిని ఎక్కువగా అభిమానిస్తారు?జ: మంచి కుటుంబంలో ఆ దేవుడు నన్ను పుట్టించాడు. ముందుగా శ్రీ వేంకటేశ్వరస్వామిని. ఆ తర్వాతే తల్లిదండ్రుల్ని. నా ఇష్టదైవం ఆయనే. ఆ తర్వాతే అభిమానులు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jan 2010 | 10:30 am

సంక్రాంతి వస్తోన్న "అదుర్స్" ట్రైలర్ మీ కోసం..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, సెక్సీతారలు నయనతార, షీలా కథానాయికలుగా నటిస్తోన్న చిత్రం "అదుర్స్". సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో కొడాలి వెంకటేశ్వరరావు సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jan 2010 | 9:28 am

కాజల్ అగర్వాల్ "ఓం శాంతి" ట్రైలర్ మీ కోసం..

నవదీప్‌, నిఖిల్‌, కాజల్‌ అగర్వాల్‌, బిందు మాధవి, అదితి శర్మ ప్రధాన పాత్రల్లో వైజంతి హౌస్‌ నుండి త్రీ ఏంజిల్స్‌ స్టూడియో పతాకంపై శేషు ప్రియాంక చలసాని నిర్మిస్తున్న మల్టీ స్టారర్‌ చిత్రం 'ఓం శాంతి'.ప్రస్తుతం ఈ సినిమా రీరికార్డింగ్‌ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం.. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jan 2010 | 9:24 am

వరుణ్ సందేశ్ "మరో చరిత్ర" ట్రైలర్‌ను వీక్షించండి

మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వరుణ్ సందేశ్, అనిత హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "మరో చరిత్ర". గతంలో దశావతారం కమల్ హాసన్, స్వప్న జంటగా నటించగా, కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన "మరో చరిత్ర" క్లాసిక్ చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది.ఇదే తరహాలో వరుణ్ సందేశ్ హీరోగా రూపొందుతోన్న "మరో చరిత్ర" తెలుగు ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుందని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jan 2010 | 9:22 am

తెలంగాణా రోడ్ మ్యాప్‌పై కోర్ కమిటీ భేటీ

తెలంగాణా అంశంపై ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో మరోసారి కోర్ కమిటీ శుక్రవారం భేటీ అయింది. సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సుమారు గంటన్నరపాటు సాగింది. సమావేశంలో ప్రధానితోపాటు సోనియా గాంధీ, అహ్మద్ పటేల్, ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, మొయిలీ పాల్గొన్నారు.
Source: జాతీయ | 8 Jan 2010 | 7:15 am

తెలంగాణ వస్తేనే అసెంబ్లీలో అడుగు: హరీష్ రావు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతేనే తాను అసెంబ్లీలో అడుగుపెడతానని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, ఆ పార్టీ శాసనసభ ఉపనేత హరీష్ రావు ప్రకటించారు. ఆయన శుక్రవారం కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా నిర్మల్‌ పట్టణంలో విద్యార్థులు నిర్వహించిన తెలంగాణ అవగాహన సదస్సులో పాల్గొని ప్రసంగించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jan 2010 | 5:28 am

తీవ్రంగా నష్టపోతున్న యువత: ఎంపీ ఉండవల్లి

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల యువత తీవ్రంగా నష్టపోతోందని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అవేదన వ్యక్తం చేశారు. క్షణికావేశాలకు లోనై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jan 2010 | 5:19 am

దాడులు ఓ అనాగరిక చర్య: ధర్మపురి శ్రీనివాస్

ఏ చిన్న సంఘటన జరిగినా దాడులుకు పూనుకోవడం అనాగరిక చర్యగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రోశయ్య రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని అందువల్ల రాష్ట్రపతి పాలన అవసరం లేదని ఆయన పునరుద్ఘాటించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jan 2010 | 5:09 am

అప్పుడేమో వరదలు-ఇప్పుడేమో ఆందోళనలు.. ఇంకెక్కడ..?

బాల నటునిగా కెరీర్‌ను ప్రారంభించిన తరుణ్ కథానాయకుడిగా ఒక్కో మెట్టు ఎదిగినా ఇంకా తన సినీ కెరీర్‌లో పరిపూర్ణత సంపాదించలేకపోతున్నాడు. నటునిగా కొంతగ్యాప్ తీసుకున్నా.. వేరే వ్యాపారంలో కూడా ఉన్నానంటున్నాడు. గత ఏడాదే పబ్ వ్యాపారంలోకి దిగాడు. తాజాగా "చుక్కలాంటి అమ్మాయి - చక్కనైన అబ్బాయి" సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ నెల 8వ తేదీ (శుక్రవారం) తరుణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన చిట్‌చాట్ మీ కోసం..ప్రశ్న: ఈ ఏడాది ఎలా పుట్టినరోజు జరుపుకుంటున్నారు?జ: ఈసారి చేసుకోవాలని ఆలోచన రాలేదు. మొన్నటివరకు వరద బీభత్సాలతో రాష్ట్రం అస్తవ్యస్తమైంది. ఇప్పుడేమో ఆందోళనలు. వీటిమధ్య సామాన్యుడితో పాటు మాకూ మనశ్శాంతి కరువైంది. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలు ఏం జరుపుకుంటాం చెప్పండి? ఏదైనా చేస్తే.. దాన్ని రాజకీయం చేస్తారు. అందుకే ఈసారి పుట్టినరోజు నాడు తిరుపతిలో దేవుని సన్నిధిలో ఉంటాను. ప్రశ్న: మీరు ఎవరిని ఎక్కువగా అభిమానిస్తారు?జ: మంచి కుటుంబంలో ఆ దేవుడు నన్ను పుట్టించాడు. ముందుగా శ్రీ వేంకటేశ్వరస్వామిని. ఆ తర్వాతే తల్లిదండ్రుల్ని. నా ఇష్టదైవం ఆయనే. ఆ తర్వాతే అభిమానులు.
Source: వినోదం | 8 Jan 2010 | 5:01 am

గోడమీద పిల్లిలా పొన్నాల లక్ష్మయ్య: కొండా సురేఖ

రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ మహిళా ఫైర్‌బ్రాండ్ కొండా సురేఖ ఆరోపించారు. ఆమె శుక్రవారం వరంగల్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పదవిని కాపాడుకునేందుకు పొన్నాల లక్ష్మయ్య గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jan 2010 | 5:00 am

రిలయన్స్ అంశంపై జగన్‌కు క్లాసు పీకిన సోనియా

వాస్తవాస్తవాలను తెలుసుకోకుండా రిలయన్స్ సంస్థ అధినేత హస్తం ఉందంటూ సాక్షి టీవీలో అభూత కల్పనలను ఎందుకు ప్రసారం చేశారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి క్లాస్ పీకినట్లు సమాచారం. ఒక విషయాన్ని ప్రసారం చేసే ముందు నిజాలను తెలుసుకోకుండా ఎలా ప్రసారం చేస్తారని ప్రశ్నించినట్లు తెలిసింది.
Source: జాతీయ | 8 Jan 2010 | 4:12 am

సంక్రాంతి వస్తోన్న "అదుర్స్" ట్రైలర్ మీ కోసం..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, సెక్సీతారలు నయనతార, షీలా కథానాయికలుగా నటిస్తోన్న చిత్రం "అదుర్స్". సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో కొడాలి వెంకటేశ్వరరావు సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమైంది.
Source: వినోదం | 8 Jan 2010 | 3:59 am

కాజల్ అగర్వాల్ "ఓం శాంతి" ట్రైలర్ మీ కోసం..

నవదీప్‌, నిఖిల్‌, కాజల్‌ అగర్వాల్‌, బిందు మాధవి, అదితి శర్మ ప్రధాన పాత్రల్లో వైజంతి హౌస్‌ నుండి త్రీ ఏంజిల్స్‌ స్టూడియో పతాకంపై శేషు ప్రియాంక చలసాని నిర్మిస్తున్న మల్టీ స్టారర్‌ చిత్రం 'ఓం శాంతి'.ప్రస్తుతం ఈ సినిమా రీరికార్డింగ్‌ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం.. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Source: వినోదం | 8 Jan 2010 | 3:55 am

వరుణ్ సందేశ్ "మరో చరిత్ర" ట్రైలర్‌ను వీక్షించండి

మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వరుణ్ సందేశ్, అనిత హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "మరో చరిత్ర". గతంలో దశావతారం కమల్ హాసన్, స్వప్న జంటగా నటించగా, కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన "మరో చరిత్ర" క్లాసిక్ చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది.ఇదే తరహాలో వరుణ్ సందేశ్ హీరోగా రూపొందుతోన్న "మరో చరిత్ర" తెలుగు ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుందని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి.
Source: వినోదం | 8 Jan 2010 | 3:53 am

"యుగానికి ఒక్కడు" ట్రైలర్‌ను తిలకించండి

సూర్య సోదరుడు కార్తి హీరోగా, రీమాసేన్- ఆండ్రియా జెరోమియా హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "యుగానికి ఒక్కడు". పలు విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన సుప్రసిద్ధ దర్శకుడు శ్రీ రాఘవ 40 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు.
Source: వినోదం | 8 Jan 2010 | 3:52 am

రోడ్డు భద్రతా కమిటీ ఛైర్మన్‌గా ఎస్ఎస్‌పీ యాదవ్!

అనుకున్నట్టుగానే ఆర్టీసీ ఎండీగా ఉన్న మాజీ డీజీపీ ఎస్ఎస్‌పీ యాదవ్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. రాష్ట్ర రోడ్డు సేఫ్టీ అథారిటీకి ఆయనను శుక్రవారం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు వ్యహారంలో ఏకపక్షంగా వ్యవహించిన యాదవ్‌ వైఖరిని మంత్రులతో పాటు.. అధికార పార్టీ సభ్యులు తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 8 Jan 2010 | 2:50 am

నగ్నంగా దీపికా పదుకునే ఫోజు...?

బాలీవుడ్ "ఓం శాంతి ఓం" చిత్రంతో ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న దీపికా పదుకునే 2010 సంవత్సరం క్యాలెండర్‌కోసం అందరు మోడళ్లలాగే ఓ ఫోజిచ్చింది. ఆ ఫోజును చూస్తే దీపికా నగ్నంగా ఉన్నదేమోనన్న భ్రమ కలుగుతుంది. అయితే అది నగ్న ఫోజు కాదని అర్థనగ్నమేనని దీపికా సన్నిహితులు అంటున్నారు.దీపికా పదుకునేను తన కెమేరాలో బంధించిన ఫోటో‌గ్రాఫర్ దబ్బూ రతానీ మాట్లాడుతూ... " దీపికను కొంత వెరైటీగా చూపించాలనుకున్నా. గత ఏడాది నా క్యాలెండర్ కోసం ఆమెను సంప్రదాయ చీరకట్టులో ఫోటో తీశాను. చీరలో ఆమెను చూసినవారు దీపిక అప్సరసలా ఉందన్నారు. ఈసారి దానికి భిన్నంగా చూపించాలనుకున్నా. ఆ ఫోజును చూసినవారు రకరకాలుగా అనుకుంటున్నారు. అసలు నిజం ఏమిటో... నాకూ దీపికకు మాత్రమే తెలుసు. క్యాలెండర్‌ను పరీక్షగా చూస్తే మీకూ తెలుస్తుంది" అన్నాడు.
Source: వినోదం | 8 Jan 2010 | 2:41 am

నేను బికినీ వేసుకుంటే ప్రేక్షకులు చూడలేరు

తెలుగులో "ఒంటరి"తో ముందుకు వచ్చిన మలయాళీ నటి భావన ఆ తర్వాత మరో రెండు చిత్రాల్లో నటించి ప్రస్తుతం అజిత్ సరసన నటిస్తోంది. మళ్లీ త్వరలో తెలుగులోకి వస్తానని చెపుతూ... తాను సెక్సీ క్యాటగిరీలోకి రానని బల్లగుద్ది చెపుతోంది. తను బికినీలు వేసుకుని నటిస్తే ఎవరూ చూడలేరని అంటోంది. ఒకవేళ వేసుకున్నా ప్రేక్షకులు ఆదరిస్తారని కూడా కలలు లేవంటోంది. తనలో ఉన్న మంచి చెడులేమిటో తనకు బాగా తెలుసని చెపుతోంది. దక్షిణాదిలో తెలుగు పరిశ్రమ ముందంజలో ఉంటుందనీ, అయినా అటువంటి పాత్రను తను చేయలేదని అంటోంది. భవిష్యత్‌లో కూడా అటువంటి పాత్రలలో నటించమని తనను ఎవరూ అడగరని నమ్మకముందని చెపుతోంది. అదీ చూద్దాం...
Source: వినోదం | 8 Jan 2010 | 2:24 am

రాజ్‌థాక్రే కేసులను ఢిల్లీకోర్టుకు మార్చిన సుప్రీం!

మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రేపై నమోదైన ఏడు కేసుల విచారణను ఢిల్లీకి మార్చుతూ సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల విచారణ ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో సాగుతాయని సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
Source: జాతీయ | 8 Jan 2010 | 2:08 am