|
లాభాలతో కొనసాగుతోన్న విదేశీ మార్కెట్లుశుక్రవారం విదేశీ స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులను చవిచూసిన అంతర్జాతీయ మార్కెట్లు భారత కాలమానం ప్రకారం 3.30 గంటల ప్రాంతంలో లాభాలను నమోదు చేసుకున్నాయి. కానీ దేశీయ బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 81 పాయింట్లు క్షీణించి, 17,534 పాయింట్ల వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 16 పాయింట్లు పతనమై, 5,246 పాయింట్ల వద్ద ముగిసింది.Source: Yahoo! Telugu: News | 8 Jan 2010 | 8:34 am రోడ్డు భద్రతా కమిటీ ఛైర్మన్‌గా ఎస్ఎస్‌పీ యాదవ్!అనుకున్నట్టుగానే ఆర్టీసీ ఎండీగా ఉన్న మాజీ డీజీపీ ఎస్ఎస్‌పీ యాదవ్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. రాష్ట్ర రోడ్డు సేఫ్టీ అథారిటీకి ఆయనను శుక్రవారం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు వ్యహారంలో ఏకపక్షంగా వ్యవహించిన యాదవ్ వైఖరిని మంత్రులతో పాటు.. అధికార పార్టీ సభ్యులు తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 8 Jan 2010 | 8:19 am ఈ- మోటారు సైకిళ్ళను ప్రవేశపెట్టనున్న బీఎస్ఏద్విచక్ర వాహన నిర్మాణ రంగంలో ప్రముఖమైన కంపెనీ బీఎస్ఏ మోటార్స్ సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడు మోటారు సైకిళ్ళను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ తెలిపిందిSource: Yahoo! Telugu: News | 8 Jan 2010 | 8:16 am నగ్నంగా దీపికా పదుకునే ఫోజు...?బాలీవుడ్ "ఓం శాంతి ఓం" చిత్రంతో ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న దీపికా పదుకునే 2010 సంవత్సరం క్యాలెండర్‌కోసం అందరు మోడళ్లలాగే ఓ ఫోజిచ్చింది. ఆ ఫోజును చూస్తే దీపికా నగ్నంగా ఉన్నదేమోనన్న భ్రమ కలుగుతుంది. అయితే అది నగ్న ఫోజు కాదని అర్థనగ్నమేనని దీపికా సన్నిహితులు అంటున్నారు.దీపికా పదుకునేను తన కెమేరాలో బంధించిన ఫోటోగ్రాఫర్ దబ్బూ రతానీ మాట్లాడుతూ... " దీపికను కొంత వెరైటీగా చూపించాలనుకున్నా. గత ఏడాది నా క్యాలెండర్ కోసం ఆమెను సంప్రదాయ చీరకట్టులో ఫోటో తీశాను. చీరలో ఆమెను చూసినవారు దీపిక అప్సరసలా ఉందన్నారు. ఈసారి దానికి భిన్నంగా చూపించాలనుకున్నా. ఆ ఫోజును చూసినవారు రకరకాలుగా అనుకుంటున్నారు. అసలు నిజం ఏమిటో... నాకూ దీపికకు మాత్రమే తెలుసు. క్యాలెండర్‌ను పరీక్షగా చూస్తే మీకూ తెలుస్తుంది" అన్నాడు.Source: Yahoo! Telugu: Entertainment | 8 Jan 2010 | 8:08 am ధూమపానం చేస్తున్నారా: కోటి రూపాయల అపరాధంపొగ సేవించినా, పొగాకు సంబంధిత ఉత్పత్తులను విక్రయించినా కోటి నుంచి కోటిన్నర రూపాయల అపరాధం విధించనున్నట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించింది. ఈ మేరకు, కఠిన నిబంధనలతో రూపొందించిన కొత్త బిల్లుపై యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖాలిబా బిన్ సయీద్ తాజాగా సంతకం చేశారు.Source: Yahoo! Telugu: News | 8 Jan 2010 | 8:00 am తిరిగి నష్టాల్లో కూరుకుపోయిన సెన్సెక్స్, నిఫ్టీబాంబే స్టాక్ మార్కెట్ శుక్రవారం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలు, మధ్యాహ్నం తిరిగి లాభాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ మార్కెట్ మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో తిరిగి నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 54 పాయింట్లు క్షీణించి, 17,561 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా పది పాయింట్ల స్వల్ప నష్టంతో, 5,252 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 8 Jan 2010 | 7:55 am రాజ్‌థాక్రే కేసులను ఢిల్లీకోర్టుకు మార్చిన సుప్రీం!మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రేపై నమోదైన ఏడు కేసుల విచారణను ఢిల్లీకి మార్చుతూ సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల విచారణ ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో సాగుతాయని సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.Source: Yahoo! Telugu: News | 8 Jan 2010 | 7:38 am ఆర్థిక వృద్ధి 7.75 శాతానికి చేరుకుంటుంది: ముఖర్జీప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి దేశీయ ఆర్థిక వృద్ధి 7.75 శాతానికి చేరుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం మీడియాకు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 8 Jan 2010 | 7:09 am వ్యక్తి స్వార్థం కోసం ముక్కలు చేస్తే సహించం: బాబురాష్ట్రాన్ని ఒక వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించబోమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల ఈ నగరం గత వైభవాన్ని కోల్పోతుందన్నారు. దీనిపై తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు.Source: Yahoo! Telugu: News | 8 Jan 2010 | 6:49 am 40 శాతం వృద్ధి సాధించిన కార్ల అమ్మకాలుప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికాంతంలోని డిసెంబరు నెలలో దేశంలో జరిగిన కార్ల అమ్మకాలలో 40.27 శాతం వృద్ధి జరిగి 1,15,268 కార్లు అమ్ముడైనట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చురర్స్(ఎస్ఐఏఎమ్) న్యూఢిల్లీలో శుక్రవారం తెలిపిందిSource: Yahoo! Telugu: News | 8 Jan 2010 | 6:31 am ప్రపంచాభివృద్ధిలో భారత్ కీలక పాత్ర: హిల్లరీ క్లింటన్ప్రపంచ అభివృద్ధిలో భారత్ తన వంతు సహకారం అందిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అభిప్రాయపడ్డారు. 21వ శతాబ్దిలో అభివృద్ధి అనే అంశంపై ఆమె కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా హిల్లరీ క్లింటన్ భారత్ పాటిస్తున్న విధివిధానాల పట్ల ప్రశంసల వర్షం కురిపించారు.Source: Yahoo! Telugu: News | 8 Jan 2010 | 6:26 am నేను బికినీ వేసుకుంటే ప్రేక్షకులు చూడలేరుతెలుగులో "ఒంటరి"తో ముందుకు వచ్చిన మలయాళీ నటి భావన ఆ తర్వాత మరో రెండు చిత్రాల్లో నటించి ప్రస్తుతం అజిత్ సరసన నటిస్తోంది. మళ్లీ త్వరలో తెలుగులోకి వస్తానని చెపుతూ... తాను సెక్సీ క్యాటగిరీలోకి రానని బల్లగుద్ది చెపుతోంది. తను బికినీలు వేసుకుని నటిస్తే ఎవరూ చూడలేరని అంటోంది. ఒకవేళ వేసుకున్నా ప్రేక్షకులు ఆదరిస్తారని కూడా కలలు లేవంటోంది. తనలో ఉన్న మంచి చెడులేమిటో తనకు బాగా తెలుసని చెపుతోంది. దక్షిణాదిలో తెలుగు పరిశ్రమ ముందంజలో ఉంటుందనీ, అయినా అటువంటి పాత్రను తను చేయలేదని అంటోంది. భవిష్యత్‌లో కూడా అటువంటి పాత్రలలో నటించమని తనను ఎవరూ అడగరని నమ్మకముందని చెపుతోంది. అదీ చూద్దాం...Source: Yahoo! Telugu: Entertainment | 8 Jan 2010 | 5:08 am రోడ్డు భద్రతా కమిటీ ఛైర్మన్‌గా ఎస్ఎస్‌పీ యాదవ్!అనుకున్నట్టుగానే ఆర్టీసీ ఎండీగా ఉన్న మాజీ డీజీపీ ఎస్ఎస్‌పీ యాదవ్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. రాష్ట్ర రోడ్డు సేఫ్టీ అథారిటీకి ఆయనను శుక్రవారం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు వ్యహారంలో ఏకపక్షంగా వ్యవహించిన యాదవ్ వైఖరిని మంత్రులతో పాటు.. అధికార పార్టీ సభ్యులు తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 8 Jan 2010 | 2:50 am రాజ్‌థాక్రే కేసులను ఢిల్లీకోర్టుకు మార్చిన సుప్రీం!మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రేపై నమోదైన ఏడు కేసుల విచారణను ఢిల్లీకి మార్చుతూ సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల విచారణ ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో సాగుతాయని సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.Source: జాతీయ | 8 Jan 2010 | 2:08 am వ్యక్తి స్వార్థం కోసం ముక్కలు చేస్తే సహించం: బాబురాష్ట్రాన్ని ఒక వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించబోమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల ఈ నగరం గత వైభవాన్ని కోల్పోతుందన్నారు. దీనిపై తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 8 Jan 2010 | 1:29 am మన నేతలు... 'రాష్ట్రంలో పులులు... ఢిల్లీలో పిల్లులు'!రాష్ట్రంలో పులులు.. ఢిల్లీలో పిల్లులు అనే ఈ సామెత మన రాష్ట్ర రాజకీయ నాయకులకు ఇట్టే సరిపోతుంది. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అడ్డుపెట్టుని వివిధ పార్టీలకు చెందిన నేతలంతా మీడియా దృష్టిని బాగా ఆకర్షించారు. చేసిన... చేయించిన హడావుడి అంతా ఇంతాకాదు. కెమరా కంటికి కనపడితే ఆగ్రహావేశాలు వెళ్ళగక్కుతూ రెచ్చగొట్టే ప్రసంగంతో రెచ్చిపోయారు.Source: ఏపీ న్యూస్ | 8 Jan 2010 | 12:48 am త్వరలోనే ఎన్‌ఆర్ఐలకు ఓటు హక్కు: మన్మోహన్ సింగ్కొత్త సంవత్సరంలో ప్రవాస భారతీయులకు ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక శుభవార్త తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో దేశ విదేశాల్లో నిర్వహిస్తున్న భారతీయుల (ఎన్ఆర్ఐ)కు ఓటు కల్పించనున్నట్టు చెప్పారు. అందువల్ల వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌ఆర్ఐలు ఓటు వేయవచ్చన్నారు.Source: జాతీయ | 8 Jan 2010 | 12:43 am ప్రతిపక్షాల ఒత్తిడి: స్వల్పంగా తగ్గిన ఆర్టీసీ ఛార్జీలురాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బుధవారం అర్థరాత్రి నుంచి పెంచిన బస్సు ఛార్జీలను ప్రభుత్వం సవరించింది. ఫలితంగా ప్రజలకు కాస్త ఊరట లభించినట్లయింది. ముఖ్యమంత్రి రోశయ్యతో చర్చించిన తర్వాత రాష్ట్ర రవాణా శాఖామంత్రి విజయరామరాజు గురువారం రాత్రి తగ్గించిన ఛార్జీలను ప్రకటించారు. పల్లె వెలుగు బస్సులో కనీస ఛార్జీని నాలుగు రూపాయలుగా నిర్ణయించారు. పది కిలోమీటర్ల దూరానికి రూ. 5గా నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 8 Jan 2010 | 12:27 am విద్యా సంవత్సరం వృధా కానీయకండి : ఓయూ జేఏసీతెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులంతా విద్యా సంవత్సరం వృధా కానీయకుండా పరీక్షలకు హాజరు కావాలని ఓయు జేఏసీ పిలుపునిచ్చింది. జేఏసీ నాయకులు గురువారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ విద్యార్థులు భుజంపైన నల్లకండువా, మెడలో పూలదండ వేసుకుని మరీ పరీక్షలకు హాజరు కావాలని పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 8 Jan 2010 | 12:22 am నకిలీ ఎన్‌కౌంటర్‌లో పోలీసు అధికారి అరెస్టు!నకిలీ ఎన్‌కౌంటర్‌లో ముంబై నగర పోలీసు విభాగానికి చెందిన ఉన్నతాధికారిని అరెస్టు చేశారు. అలాగే మరో ఇద్దరు కానిస్టేబుల్స్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. గత 2006 సంవత్సరంలో సబర్బన్‌వెర్సోవా అనే ప్రాంతంలోని నానా నాని పార్కు వద్ద ఛాటా రాజన్ అనుచరునిగా భావించే గ్యాంగ్‌స్టర్ లఖాన్ భయ్యా ఎన్‌కౌంటర్ జరిగింది.Source: జాతీయ | 7 Jan 2010 | 11:20 pm ఛార్జీల భారం తగ్గిస్తాం: చిరంజీవికి సీఎం హామీ!రాష్ట్రంలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను మరింతగా తగ్గించేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి హామీ ఇచ్చారు. ఆయన శుక్రవారం ఉదయం రోశయ్యను కలిసి ఛార్జీల భారంపై చర్చించారు. అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. ఛార్జీల పెంపునకు సంబంధించి పేద ప్రజలపై భారం పడకుండా చూస్తామని హామీ ఇచ్చారు.Source: ఏపీ న్యూస్ | 7 Jan 2010 | 10:30 pm ఛానల్‌పై క్రిమినల్ కేసు పెడతాం: రిలయన్స్ సంస్థదివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి దుర్మరణం రిలయన్స్ సంస్థ కుట్ర ఉన్నట్టు వచ్చిన వార్తలను ఆ సంస్థ తీవ్రంగా ఖండించింది. తమ సంస్థ ప్రతిష్టను దిగజార్జాలని, వ్యాపారపరంగా దెబ్బతీయాలన్న ఏకైక లక్ష్యంతోనే ఇలాంటి కథనాన్ని ఆ టీవీ ఛానల్ ప్రసారం చేసిందని ఆ సంస్థ ప్రతినిధి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 7 Jan 2010 | 10:19 pm దేవుడైనా.. సీమాంధ్ర నేతలకు తలొగ్గాల్సిందే: వీహెచ్ముఖ్యమంత్రి రోశయ్యే కాదు.. సాక్షాత్ ఆ పరమాత్ముడు కూడా సీమాంధ్ర నేతల లాబీయింగ్ ముందు తలొగ్గాల్సిందేనని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి స్థానంలో తాను ఉన్నా... రోశయ్య పాత్రనే పోషించి ఉండాల్సిందేనని ఆయన చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 7 Jan 2010 | 9:45 pm దేశ వ్యాప్తంగా 1035కు చేరిన స్వైన్ ఫ్లూ మరణాలు!ప్రపంచాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి వల్ల మరణించిన వారి సంఖ్య దేశంలో 1035కు చేరుకుంది. అలాగే, గురువారం మరో 99 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో మహారాష్ట్ర, గుజరాత్‌లలో 20, దేశ రాజధాని ఢిల్లీలో 15 ఉన్నట్టు వారు వివరించారు.Source: జాతీయ | 7 Jan 2010 | 9:39 pm ఏమాత్రం మెరుగుపడని జ్యోతిబసు ఆరోగ్యం: వైద్యులుఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదని కోల్‌కతాలోని ఏఎంఆర్ఐ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పూలేదని ఆస్పత్రి వర్గాలు గురువారం సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేసిన ప్రత్యేక వైద్య బులిటెన్‌లో పేర్కొన్నాయి.Source: జాతీయ | 7 Jan 2010 | 8:46 pm చెన్నైకి చెక్కేస్తున్న ప్రిన్స్ మహేష్ బాబుఅవును... నిజమే!! ప్రిన్స్ మహేష్ బాబు తన షూటింగ్‌ను చెన్నైకి మార్చుకున్నాడు. కానీ తన మకాన్ని మాత్రం మార్చడం లేదు. తన కొత్త చిత్రం కిలాడి( పేరు అధికారికంగా ప్రకటించలేదు) షూటింగ్‌ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తెలంగాణావాదులు అడ్డుకోవడంతో చెన్నైకు ఉత్తరాన పెద్ద సెట్ వేయించారు. అంతకుముందు హైదరాబాద్‌లో రాజస్థాన్ తరహా కల్చర్‌తో కొన్ని వందల సంఖ్యలో ప్రజలు అక్కడ నివశించేటట్లుగా వేసిన ఆ సెట్‌కోసం వందలాదిమంది పడిన శ్రమ అంతా వృధా అయింది. దాదాపు కోటీ 70 లక్షల రూపాయల వరకూ దానికి ఖర్చయింది. ఎంతోమంది శ్రామికుల శ్రమ బూడిదలో పోసిన పన్నీరయింది. అందుకే నిర్మాతలు చెన్నైలో సెట్ వేస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 7 Jan 2010 | 10:46 am సంక్రాంతి కానుకగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ "అదుర్స్"యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా సన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో కొడాలి వెంకటేశ్వరరావు సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'అదుర్స్' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు కొడాలి నాని మాట్లాడుతూ... ఎన్టీఆర్, వినాయక్ కాంబినేషన్‌లో రూపొందిన మరో సెన్సేషనల్ మూవీ అదుర్స్, సాంబ తర్వాత మా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అన్నారు. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌తో ఆది, సాంబ చిత్రాల తర్వాత అదుర్స్ హ్యాట్రిక్ ఫిలిమ్ అవుతుంది. ఎన్టీఆర్ పెర్‌ఫార్మెన్స్ అదుర్స్ అనిపించేలా ఉంటుంది. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా బిగ్ హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 7 Jan 2010 | 9:01 am శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి రాజీనామాలు ఉపసంహరణ...?డిసెంబరు 23 తర్వాత రాజీనామాలు చేసిన తెలంగాణా మంత్రులు చేసి అటు పిమ్మట ఉపసంహరించుకున్నారు. సీఎంపై కోమటిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు విమర్శలు వచ్చాయి. జనవరి 5 వ తేదీన చిదంబరం చేపట్టిన చర్చలు వల్ల తమకు తెలంగాణా ఏర్పాటుపై నమ్మకం కుదిరిందని అందువల్లనే తాము తమ రాజీనామాలను వెనక్కి తీసుకుంటున్నామని తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 7 Jan 2010 | 7:26 am ఇంటికెళితే నా ఆరోగ్యం బాగుపడుతుంది: "సత్యం" రాజురాష్ట్రంలో ఒకనాడు ఐటీ దిగ్గజంగా పేరు ప్రఖ్యాతులు పొందిన సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఆయన హెపటైటిస్ బి కారక జబ్బుతోపాటు గ్యాస్ట్రిక్ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు నిమ్స్ వెద్యులు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 7 Jan 2010 | 7:17 am విశ్వాస పరీక్షలో నెగ్గిన జార్ఖండ్ ముఖ్యమంత్రి శిబు సోరేన్!మూడోసారి ముచ్చటగా జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధినేత శిబు సోరేన్ గురువారం నిర్వహించిన విశ్వాస పరీక్షల్లోనూ నెగ్గారు. జార్ఖండ్ శాసనసభలో శిబు సోరేన్‌కు అనుకూలంగా 45 ఓట్లు, వ్యతిరేకంగా 25 ఓట్లు వచ్చాయి. సోరెన్ సారథ్యంలోని జార్ఖండ్ ముక్తి మోర్చాకు 18 సభ్యుల బలముంది. ఇంకా సోరెన్ ప్రభుత్వానికి ఎన్డీయే, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌ల మద్దతు ఉండటంతో విజయానికి మార్గం సుగుమమైంది.Source: జాతీయ | 7 Jan 2010 | 7:03 am బ్యాంకాక్‌లో "నమో వెంకటేశ" ఆడియో ఆవిష్కరణవిక్టరీ వెంకటేష్, హ్యాట్రిక్ డైరక్టర్ శ్రీనువైట్ల తొలి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "నమో వెంకటేశ". సురేష్ ప్రొడక్షన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ జనవరి ఐదో తేదీన బ్యాంకాక్‌లో వైభవంగా జరిగింది. విక్టరీ వెంకటేష్ ఆడియోను ఆవిష్కరించి తొలి సీడీని హీరోయిన్ త్రిషకు అందించారు.Source: Yahoo! Telugu: Entertainment | 7 Jan 2010 | 6:55 am బెల్లంకొండ "శంభో శివశంభో"కు రోజా తలబొప్పా...?నటి రోజా చాన్నాళ్ల తర్వాత శంభో శివశంభో చిత్రంతో వెండితెరపై మరోసారి కనిపించబోతోంది. ప్రేక్షకులకు ఇది మంచి వార్తే అయినప్పటికీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌కు మాత్రం చేదు వార్త అవుతుందేమోనని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.రోజా ఎంట్రీ బెల్లంకొండకు చేదు వార్త ఎలా అవుతుందీ అని అనుకుంటున్నారా...? మరేం లేదు... రోజా ఆ మధ్య మైకులు పట్టుకుని సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించిది కదా. ఈ నేపథ్యంలో తెలంగాణా అనుకూల వాదులు రోజా నటించిన ఈ చిత్రానికి అడ్డంకులు ఏమైనా సృష్టిస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే తెలంగాణావాదులు ఇక నుంచి తాము తమ ఆందోళనలను శాంతియుతంగా నిర్వహిస్తామని చెప్పారు కనుక ఆ భయమేమీ లేదని తెలంగాణాకు చెందిన కొందరు నాయకులు చెపుతున్నారు. కానీ చిరంజీవి బంధువుల సినిమాలను మాత్రం అడ్డుకుంటామని అంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 7 Jan 2010 | 5:52 am చెన్నైకి చెక్కేస్తున్న ప్రిన్స్ మహేష్ బాబుఅవును... నిజమే!! ప్రిన్స్ మహేష్ బాబు తన షూటింగ్‌ను చెన్నైకి మార్చుకున్నాడు. కానీ తన మకాన్ని మాత్రం మార్చడం లేదు. తన కొత్త చిత్రం కిలాడి( పేరు అధికారికంగా ప్రకటించలేదు) షూటింగ్‌ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తెలంగాణావాదులు అడ్డుకోవడంతో చెన్నైకు ఉత్తరాన పెద్ద సెట్ వేయించారు. అంతకుముందు హైదరాబాద్‌లో రాజస్థాన్ తరహా కల్చర్‌తో కొన్ని వందల సంఖ్యలో ప్రజలు అక్కడ నివశించేటట్లుగా వేసిన ఆ సెట్‌కోసం వందలాదిమంది పడిన శ్రమ అంతా వృధా అయింది. దాదాపు కోటీ 70 లక్షల రూపాయల వరకూ దానికి ఖర్చయింది. ఎంతోమంది శ్రామికుల శ్రమ బూడిదలో పోసిన పన్నీరయింది. అందుకే నిర్మాతలు చెన్నైలో సెట్ వేస్తున్నారు.Source: వినోదం | 7 Jan 2010 | 5:17 am జ్యోతిబసును పరామర్శించిన మన్మోహన్ సింగ్సీపీఎం కురువృద్ధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు (96)ను ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం పరామర్శించారు. పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసును గురువారం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పరామర్శించారు. కోల్‌కతాలోని ఏఎంఆర్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యపరిస్థితిపై ప్రధాని వైద్యులను ఆరా తీశారు.Source: జాతీయ | 7 Jan 2010 | 3:48 am మెల్ల మెల్లగా కోలుకుంటోన్న జ్యోతిబసు: ఏచూరిసీపీఎం కురువృద్ధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు (96)కు వైద్యులు ఇచ్చే చికిత్స ఫలించి, మెల్ల మెల్లగా కోలుకుంటున్నారని సీపీఐ(ఎమ్) పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ తెలియజేశారు. న్యూమోనియాతో బాధపడుతూ కోల్‌కతాలోని ఏఎంఆర్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జ్యోతిబసు ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని ఏచూరీ అన్నారు.Source: జాతీయ | 7 Jan 2010 | 3:47 am సంక్రాంతి కానుకగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ "అదుర్స్"యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా సన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో కొడాలి వెంకటేశ్వరరావు సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'అదుర్స్' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు కొడాలి నాని మాట్లాడుతూ... ఎన్టీఆర్, వినాయక్ కాంబినేషన్‌లో...Source: వినోదం | 7 Jan 2010 | 3:32 am శ్రీనగర్ హోటళ్లో కాల్పులు: ఇద్దరు తీవ్రవాదుల మృతిముంబై తరహా కాల్పుల ఉదంతం జమ్మూ-కాశ్మీర్‌లో చోటుచేసుకుంది. జమ్మూ-కాశ్మీర్‌లోని లాల్ చౌక్ హోటళ్లో అక్రమంగా చొరబడిన లష్కరే-తోయిబా తీవ్రవాదులను సీఆర్పీఎఫ్ అధికారులు కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు తీవ్రవాదులు హతమైనట్లు సీఆర్పీఎఫ్ వర్గాలు తెలిపాయి. లాల్ చౌక్‌లోని ఓ హోటళ్లో ఉన్నట్టుండి ప్రవేశించిన లష్కరే-తోయిబా తీవ్రవాదులు స్థానిక ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ సమాచారంతో అందిన వెంటనే అక్కడకు చేరుకున్న సీఆర్పీఎఫ్ దళ అధికారులు ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులతో పాటు ఓ పోలీసు అధికారి, ఉస్మాన్ అనే పౌరుడు కూడా మరణించారు.Source: జాతీయ | 7 Jan 2010 | 1:48 am
|