|
ఇంటికెళితే నా ఆరోగ్యం బాగుపడుతుంది: "సత్యం" రాజురాష్ట్రంలో ఒకనాడు ఐటీ దిగ్గజంగా పేరు ప్రఖ్యాతులు పొందిన సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఆయన హెపటైటిస్ బి కారక జబ్బుతోపాటు గ్యాస్ట్రిక్ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు నిమ్స్ వెద్యులు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 7 Jan 2010 | 8:39 am గణిత, విజ్ఞాన శాస్త్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపండి : ఒబామాప్రపంచంలోని ఇతర దేశాల కన్నా తమ దేశం భవిష్యత్తులో వెనుకపడిపోయే ప్రమాదం ఉందని దేశంలోని ప్రజలు తమ పిల్లలకు గణితం, సైన్స్ సబ్జెక్టులలో ప్రత్యేక తర్ఫీదునివ్వాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన దేశ పౌరులకు సూచించారు.Source: Yahoo! Telugu: News | 7 Jan 2010 | 8:16 am డ్యూయెల్ సిమ్ మొబైల్ ప్రవేశపెట్టనున్న నోకియాదేశంలో మొబైల్ నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న నోకియా సంస్థ ప్రస్తుతం డ్యూయెల్ సిమ్ కలిగిన మొబైళ్ళను ప్రవేశపెట్టేందుకు తమ సంస్థ ప్రణాళికలు రూపొందించుకుందని నోకియా మీడియా ప్రతినిధి విరల్ ఓఝా గురువారం మీడియాకు తెలిపారుSource: Yahoo! Telugu: News | 7 Jan 2010 | 8:13 am ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ తండ్రి వేలుపిళ్లై మృతి!కొలంబొలోని ఓ తీవ్రవాద నిర్మూలన విభాగం కనుసన్నల్లో ఉన్న ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ తండ్రి వేలుపిళ్లై గురువారం ఉదయం మరణించాడు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడిన వేలుపిళ్లై.. పరిస్థితి విషమించి గురువారం మృతి చెందినట్లు సైనిక ఉన్నతాధికారిక వర్గం ఓ ప్రకటనలో తెలిపింది. కొంత కాలంగా అనారోగ్యంతో ఓ వ్యాధి బారిన పడిన వేలుపిళ్లై గురించి అదనపు వివరాలను తెలియజేసేందుకు సైనిక అధికారులు సుముఖత చూపలేదు.Source: Yahoo! Telugu: News | 7 Jan 2010 | 7:44 am నష్టాలతో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్గురువారం బాంబే స్టాక్ మార్కెట్‌కు ఏ మాత్రం కలిసిరాలేదు. ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో 91 పాయింట్ల పతనమై, 17,609 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 24 పాయింట్లు క్షీణించి, 5,257 పాయింట్ల వద్ద పయనిస్తోంది. ఆసియా, యూఎస్ మార్కెట్ల ట్రేడింగ్ ఆశాజనకంగా కొనసాగకపోవడం, దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడం వంటి కారణాలతో సెన్సెక్స్ పతనమైంది.Source: Yahoo! Telugu: News | 7 Jan 2010 | 7:27 am నేను ఆర్టీసీ ఎండీని.. ఎక్కడికైనా వెళతా: యాదవ్ప్రభుత్వానికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన ఎస్ఎస్పీ యాదవ్ తన వాగ్ధాటిని ఏమాత్రం తగ్గించుకోలేదు. పైపెచ్చు ముఖ్యమంత్రి రోశయ్యపై తను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. అవన్నీ అభూత కల్పనలని కొట్టి పారేశారు.Source: Yahoo! Telugu: News | 7 Jan 2010 | 7:18 am శ్రీనగర్ హోటళ్లో కాల్పులు: ఇద్దరు తీవ్రవాదుల మృతిముంబై తరహా కాల్పుల ఉదంతం జమ్మూ-కాశ్మీర్‌లో చోటుచేసుకుంది. జమ్మూ-కాశ్మీర్‌లోని లాల్ చౌక్ హోటళ్లో అక్రమంగా చొరబడిన లష్కరే-తోయిబా తీవ్రవాదులను సీఆర్పీఎఫ్ అధికారులు కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు తీవ్రవాదులు హతమైనట్లు సీఆర్పీఎఫ్ వర్గాలు తెలిపాయి. లాల్ చౌక్‌లోని ఓ హోటళ్లో ఉన్నట్టుండి ప్రవేశించిన లష్కరే-తోయిబా తీవ్రవాదులు స్థానిక ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ సమాచారంతో అందిన వెంటనే అక్కడకు చేరుకున్న సీఆర్పీఎఫ్ దళ అధికారులు ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులతో పాటు ఓ పోలీసు అధికారి, ఉస్మాన్ అనే పౌరుడు కూడా మరణించారు.Source: Yahoo! Telugu: News | 7 Jan 2010 | 7:15 am ఆర్టీసీ చార్జీల తగ్గింపు యోచనలో ప్రభుత్వంఅకస్మాత్తుగా... ప్రభుత్వానికి సమాచారం లేకుండా ఏకపక్షంగా ఆర్టీసీ ఎండీ యాదవ్ చార్జీలను పెంపును ప్రకటించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. చార్జీల వడ్డనపై సమీక్ష నిర్వహించి తగ్గించే దిశగా ఆలోచనలు చేస్తోంది. మరోవైపు ప్రభుత్వ అధీనంలో పని చేయాల్సిన ఓ సీనియర్ అధికారి బుధవారం ఎలా స్పందించారన్న దానిపై ఆరా తీస్తోంది.Source: Yahoo! Telugu: News | 7 Jan 2010 | 7:04 am రాజకీయ వ్యాపారోద్యమంలో బడుగు జీవి బలిప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఛార్జీలు పెంచడంతో... ప్రయాణికుడి నడ్డివిరిగింది. జేబు ఖాళీ అయింది. వరుసగా వీరబాదుడు. ప్రభుత్వం ప్రజల జేబును కత్తిరించింది.... వంటి కథనాలతో తెలుగు పదబంధాలతో ప్రజల్ని బెంబేలెత్తించాయి వార్తాసాధనాలు. అసలు ఇలా ఛార్జీలు పెరుగుతాయని ముందుగా ఊహించిందే. కాకపోతే నెలరోజులుగా సాగుతున్న ఉద్యమాల నేపథ్యంలో అది కాస్త వేడిగా ఉన్నట్లనిపించింది.Source: Yahoo! Telugu: News | 7 Jan 2010 | 6:56 am బ్యాంకాక్‌లో "నమో వెంకటేశ" ఆడియో ఆవిష్కరణవిక్టరీ వెంకటేష్, హ్యాట్రిక్ డైరక్టర్ శ్రీనువైట్ల తొలి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "నమో వెంకటేశ". సురేష్ ప్రొడక్షన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ జనవరి ఐదో తేదీన బ్యాంకాక్‌లో వైభవంగా జరిగింది. విక్టరీ వెంకటేష్ ఆడియోను ఆవిష్కరించి తొలి సీడీని హీరోయిన్ త్రిషకు అందించారు.Source: Yahoo! Telugu: Entertainment | 7 Jan 2010 | 6:55 am బీఎస్‌ఎన్ఎల్‌లో పదిశాతం వాటా తక్షణ విక్రయం..!భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)లో పదిశాతం వాటా తక్షణ ఉపసంహరణకు ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన అత్యున్నతస్థాయి కమిటీ అంగీకారం తెలిపింది. ప్రభుత్వరంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లు ఎదుర్కొంటున్న సమస్యలు, విస్తరణ ప్రణాళికలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.Source: Yahoo! Telugu: News | 7 Jan 2010 | 6:44 am బెల్లంకొండ "శంభో శివశంభో"కు రోజా తలబొప్పా...?నటి రోజా చాన్నాళ్ల తర్వాత శంభో శివశంభో చిత్రంతో వెండితెరపై మరోసారి కనిపించబోతోంది. ప్రేక్షకులకు ఇది మంచి వార్తే అయినప్పటికీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌కు మాత్రం చేదు వార్త అవుతుందేమోనని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.రోజా ఎంట్రీ బెల్లంకొండకు చేదు వార్త ఎలా అవుతుందీ అని అనుకుంటున్నారా...? మరేం లేదు... రోజా ఆ మధ్య మైకులు పట్టుకుని సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించిది కదా. ఈ నేపథ్యంలో తెలంగాణా అనుకూల వాదులు రోజా నటించిన ఈ చిత్రానికి అడ్డంకులు ఏమైనా సృష్టిస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే తెలంగాణావాదులు ఇక నుంచి తాము తమ ఆందోళనలను శాంతియుతంగా నిర్వహిస్తామని చెప్పారు కనుక ఆ భయమేమీ లేదని తెలంగాణాకు చెందిన కొందరు నాయకులు చెపుతున్నారు. కానీ చిరంజీవి బంధువుల సినిమాలను మాత్రం అడ్డుకుంటామని అంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 7 Jan 2010 | 5:52 am ఇంటికెళితే నా ఆరోగ్యం బాగుపడుతుంది: "సత్యం" రాజురాష్ట్రంలో ఒకనాడు ఐటీ దిగ్గజంగా పేరు ప్రఖ్యాతులు పొందిన సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఆయన హెపటైటిస్ బి కారక జబ్బుతోపాటు గ్యాస్ట్రిక్ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు నిమ్స్ వెద్యులు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 7 Jan 2010 | 3:10 am నేను ఆర్టీసీ ఎండీని.. ఎక్కడికైనా వెళతా: యాదవ్ప్రభుత్వానికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన ఎస్ఎస్పీ యాదవ్ తన వాగ్ధాటిని ఏమాత్రం తగ్గించుకోలేదు. పైపెచ్చు ముఖ్యమంత్రి రోశయ్యపై తను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. అవన్నీ అభూత కల్పనలని కొట్టి పారేశారు.Source: ఏపీ న్యూస్ | 7 Jan 2010 | 1:49 am శ్రీనగర్ హోటళ్లో కాల్పులు: ఇద్దరు తీవ్రవాదుల మృతిముంబై తరహా కాల్పుల ఉదంతం జమ్మూ-కాశ్మీర్‌లో చోటుచేసుకుంది. జమ్మూ-కాశ్మీర్‌లోని లాల్ చౌక్ హోటళ్లో అక్రమంగా చొరబడిన లష్కరే-తోయిబా తీవ్రవాదులను సీఆర్పీఎఫ్ అధికారులు కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు తీవ్రవాదులు హతమైనట్లు సీఆర్పీఎఫ్ వర్గాలు తెలిపాయి. లాల్ చౌక్‌లోని ఓ హోటళ్లో ఉన్నట్టుండి ప్రవేశించిన లష్కరే-తోయిబా తీవ్రవాదులు స్థానిక ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ సమాచారంతో అందిన వెంటనే అక్కడకు చేరుకున్న సీఆర్పీఎఫ్ దళ అధికారులు ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులతో పాటు ఓ పోలీసు అధికారి, ఉస్మాన్ అనే పౌరుడు కూడా మరణించారు.Source: జాతీయ | 7 Jan 2010 | 1:48 am ఆర్టీసీ చార్జీల తగ్గింపు యోచనలో ప్రభుత్వంఅకస్మాత్తుగా... ప్రభుత్వానికి సమాచారం లేకుండా ఏకపక్షంగా ఆర్టీసీ ఎండీ యాదవ్ చార్జీలను పెంపును ప్రకటించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. చార్జీల వడ్డనపై సమీక్ష నిర్వహించి తగ్గించే దిశగా ఆలోచనలు చేస్తోంది. మరోవైపు ప్రభుత్వ అధీనంలో పని చేయాల్సిన ఓ సీనియర్ అధికారి బుధవారం ఎలా స్పందించారన్న దానిపై ఆరా తీస్తోంది.Source: ఏపీ న్యూస్ | 7 Jan 2010 | 1:34 am జ్యోతిబసును పరామర్శించిన మన్మోహన్ సింగ్సీపీఎం కురువృద్ధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు (96)ను ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం పరామర్శించారు. పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసును గురువారం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పరామర్శించారు. కోల్‌కతాలోని ఏఎంఆర్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యపరిస్థితిపై ప్రధాని వైద్యులను ఆరా తీశారు.Source: జాతీయ | 7 Jan 2010 | 12:53 am చలి గుప్పెట్లో వణుకుతోన్న ఉత్తర భారతదేశం!శీతాకాలంతో ఉత్తరభారతదేశం చలికి వణికిపోతోంది. రోజురోజుకి పెరుగుతున్న చలితో ఉత్తర భారత దేశంలో జన జీవనానికి ఆటంకం కలుగుతోంది. ఉత్తరాదిలోని ఢిల్లీ, చంఢీగఢ్, శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచుతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇందులో భాగంగా ఉత్తరాదిలో జనవరి 31 వరకు 9 రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. కాగా చలి గాలులతో ఉత్తరాదిలో మరణించినవారి సంఖ్య ఇప్పటికే 190కు చేరుకుంది.Source: జాతీయ | 7 Jan 2010 | 12:04 am ముఖ్యమంత్రి సీరియస్... యాదవ్‌పై చర్య తథ్యం!!ఎస్ఎస్పీ యాదవ్ మరోసారి తన బుద్ధి ఎలాంటిదో చూపెట్టారు. ఆర్టీసీ ఛార్జీలను ఏకపక్షంగా పెంచేయడమే కాక స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. గతంలో వైఎస్సార్ హయాంలో సైతం పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కిన సంగతి తెలిసిందే.Source: ఏపీ న్యూస్ | 6 Jan 2010 | 11:50 pm బస్సులకు మంట పెడతారా.. చూసుకోండి నా తడఖా...గత నెల రోజులుగా రాష్ట్రంలో తెలంగాణా- సమైక్యాంధ్ర ఉద్యమాల ఫలితంగా ఆర్టీసీకి దాదాపు 3 వందల కోట్ల రూపాయలకు పైగానే నష్టం వాటిల్లినట్లు తేలింది. ఆందోళనకారులు ఎడాపెడా బస్సులను దగ్ధం చేసి ప్రభుత్వం నడ్డి విరిచామని ఆనందపడ్డారు. కానీ నెల రోజులు తిరక్కుండానే ముఖ్యమంత్రి రోశయ్య ఆర్టీసిని నష్టాల నుంచి బయటపడేయాలనే లక్ష్యంతో ప్రయాణికులపై చార్జీల వాత పెట్టారు.Source: ఏపీ న్యూస్ | 6 Jan 2010 | 10:09 pm ఉద్యమాలు ఆపేసి కలిసి మాట్లాడుకోండి: చిదంబరంతెలంగాణా బంతిని కేంద్రం తిరిగి రాష్ట్ర పార్టీల గ్రౌండులోకే విసిరేసింది. తెలంగాణా అంశంపై ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలన్నీ ఉద్యమాలను తక్షణమే ఆపేసి కలిసి కూర్చుని చర్చించుకోవాలని కేంద్ర మంత్రి పి. చిదంబరం సూచించారు. అప్పుడే సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుందని ఖరాఖండిగా తేల్చి చెప్పారు.Source: జాతీయ | 6 Jan 2010 | 9:29 pm విదేశీ పర్యాటకులపై కేరళ హోం శాఖ డేగ కన్నుపర్యాటకుల పేరుతో కేరళలో రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలు చక్కబెట్టుకునేందుకు లష్కరే తోయిబా కొందరిని నియమించిందని నిఘా వర్గాల సమాచారం అందడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశీయ పర్యాటకులకంటే విదేశాల నుంచి వస్తున్న పర్యాటకులపై ప్రత్యేకించి తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించింది.Source: జాతీయ | 6 Jan 2010 | 9:20 pm రజనీ- ఐశ్వర్యల రోబో దూసుకెళ్లడం ఖాయమట...టాలీవుడ్ పునర్జన్మల కథలవైపు పరుగులు తీస్తుంటే హాలీవుడ్ చిత్ర పరిశ్రమేమో భవిష్యత్‌పై సినిమాలు తీసుకుంటూ పోతోంది. తాజాగా తమిళ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న రోబో కూడా హాలీవుడ్ తరహాలోనే భవిష్యత్‌లో స్టార్ట్ అవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే శంకర్ మాత్రం ఈ సినిమా వర్తమానాన్ని కూడా తెలియనీయకుండా గోప్యంగా చిత్రీకరిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన థ్రిల్స్ ఒళ్ళు గగుర్పొడిచే విధంగా రజనీకాంత్, ఐశ్వర్యరాయ్‌లతో పాటు 300మంది ఫైటర్స్ పాల్గొన్న ఫైట్‌ను పీటర్ హెయిన్స్ నేతృత్వంలో రామోజీ ఫిలింసిటీలో ఇటీవల చిత్రీకరించారు. ఇటువంటి సన్నివేశాలు చిత్రంలో చాలా ఉంటాయని అంటున్నారు. అన్నిటికీ మించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తే సన్నివేశాలు మరెన్నో ఉన్నాయని తెలుస్తోంది.సహజంగా రజనీకాంత్ చిత్రమంటేనే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొని ఉంటాయి. రజనీ మార్క్‌ను అలా ఉంచితే... ఆయన సరసన అందాల సుందరి ఐశ్వర్యారాయ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక చెప్పేదేముంది. అంచనాలు ఆకాశాన్నంటేశాయి. త్వరలో వెండితెరను పలుకరించనున్న రజనీ రోబో ఎటువంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి మరి.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jan 2010 | 12:58 pm విలన్ పాత్ర నా డ్రీమ్ రోల్ : ప్రియమణిజాతీయ అవార్డులను అలవోకగా ఎగరేసుకపోయే మలయాళీ భామ ప్రియమణికి లేడీ విలన్‌గా నటించాలని ఎంతో కుతూహలంగా ఉన్నదట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. రజనీకాంత్ చిత్రం "నరసింహ"లో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి లాంటి ఛాలెంజింగ్ పాత్ర చేయాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం శంభో... శివశంభో ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో తను లంగా- ఓణీలో నటించానని చెపుతోంది. ఇంట్లో కూడా అదే డ్రెస్సులో ఉంటారా...? అని ప్రశ్నిస్తే, నవ్వుతూ... ఇంట్లో షార్ట్స్ వేసుకుంటాననీ, బయటకెళితే జీన్స్, టీ షర్ట్ వేసుకుంటాననీ చెప్పింది. ఇక పెళ్లిళ్లు- పేరంటాళ్లకైతే సందర్భానికి తగిన దుస్తులు వేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఇక తన అభిమానులు చాలామంది తన నవ్వు చాలా బావుంటుందని అంటారని సంబరపడిపోతూ చెప్పింది. నవ్వుతూ మాట్లాడటం తనకు చిన్నప్పట్నుంచీ అలవాటని అంటోంది ప్రియ. అన్నట్లు.. ఈ కేరళ కుట్టి తెలుగు భాషను కూడా అనర్గళంగా మాట్లాడేస్తుందండోయ్.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jan 2010 | 12:29 pm 7 నుంచి చెన్నయ్‌లో "దసవాణి" సంగీత ఉత్సవాలుతమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లో దసవాణి సంగీత ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. కర్ణాటక సంగీతంలో సంగీత పితామహాగా పేరుగాంచిన శ్రీ పురంధర దసర పేరుమీద శ్రీ లలితకళా అకాడెమీ ఫౌండేషన్ సహకారంతో శ్రీ పార్థసారథి స్వామి సంగీత సభ ఈ సంగీత ఉత్సవాన్ని నిర్వహిస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jan 2010 | 11:38 am 8న తెలుగు ప్రేక్షకుల ముందుకు "పారానార్మల్ యాక్టివిటీ"పారామౌంట్ పిక్చర్స్ నిర్మించిన "పారానార్మల్ యాక్టివిటీ" వసూళ్ళ పరంగా సినీ చరిత్రలోనే వంద మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి "ఆర్" రేటెడ్ థ్రిల్లర్‌గా నిలిచిన ఈ చిత్రం జనవరి 8వ తేదీన ఆంధ్ర ప్రేక్షకులకు వినూత్నమైన భయభ్రాంతిని కలిగించడానికి విడుదలవుతోంది. ఎస్వీఆర్ మీడియా ప్రై. లిమిటెడ్ ఈ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్‌ను సమర్పిస్తోంది. "ఒరెన్‌పెల్లి" డైరక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసిన ఈ ఇన్నోవేటివ్ థ్రిల్లర్ హాలీవుడ్‌లో చిన్న చిత్రంగా నిర్మించబడింది. కానీ విడుదలైన మొదటివారంలోనే వసూళ్ళపరంగా వంద మిలియన్ డాలర్స్ అత్యధిక కలెక్షన్స్ సాధించి బాక్సాఫీస్ బిగ్ హిట్ థ్రిల్లర్‌గా రికార్డు సృష్టించింది.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jan 2010 | 11:23 am రాములమ్మ "రుద్రమ దేవి" అవుతానంటోంది...వెండితెరపై లేడీ అమితాబ్‌గా బిరుదును కొట్టేసిన విజయశాంతి, సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. తల్లి తెలంగాణా పార్టీ పేరుతో ప్రజల ముందుకు వచ్చింది. తల్లి తెలంగాణా కలసి రాకపోవడంతో ఆ పార్టీని తెరాసలో విలీనం చేసి, అటు పిమ్మట ఆ పార్టీ తరపున ఎన్నికలలో పోటీ చేసి ఎంపీ అయింది. అయితే ఆ తర్వాత కేసీఆర్- తనను పట్టించుకోవడం లేదని వాపోయిన విజయశాంతి వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్‌లోకి జంప్ అవుదామని అన్నీ సర్దుకుంది. దురదృష్టవశాత్తూ వైఎస్సార్ మృతి చెందటంతో రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలిపోయింది. అయితే ఇటీవల తెరాస నేతృత్వంలో తెలంగాణా ఉద్యమం బలంగా ప్రజల ముందుకు రావడంతో తిరిగి తెరాస గూటికి చేరుకుంది. సొంత గూటికి వెళ్లినా... పార్టీలో ఆమెకు అంత ప్రాధాన్యం ఉన్నట్లు కనబడటం లేదని విశ్వసనీయ సమాచారం.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jan 2010 | 9:35 am వైఎస్ లాంటి మహానేత ఇకపై పుట్టరేమో: రోశయ్యదివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి వంటి ప్రజానేత ఇకపై ఈ భూమ్మీద పుట్టరేమోనని ముఖ్యమంత్రి కె.రోశయ్య అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని తొమ్మిదికోట్ల మంది గుండెచప్పుడుగా వైఎస్ మారారని అభివర్ణించారు. పేదలు, మహిళల జీవితాలకు భరోసా ఇచ్చే పలు సంక్షేమ పథకాలకు ఆయన రూపకల్పన చేసి అమలులోకి తీసుకు వచ్చిన ఘనత వైఎస్ ఒక్కరికే చెల్లిదంన్నారు.Source: ఏపీ న్యూస్ | 6 Jan 2010 | 7:20 am ఎవరికి లేని దురద చిరంజీవికి ఎందుకు: ధర్మపురిరాష్ట్ర చిత్రపరిశ్రమ గురించి ఎవరికీలేని దురద, ఆందోళన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి ఎందుకని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మండిపడ్డారు. అసలు హైదరాబాద్‌లో ఆయనకేంముందని ఇంత ఆందోళన చెందుతున్నారని డీఎస్ ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 6 Jan 2010 | 6:47 am ఎర్రబస్సుల్లో ఛార్జీల వాయింపుడు: సర్కారు నిర్ణయం!ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ ఆధ్వర్యంలో నడిచే బస్సులో ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. కనిష్టంగా కిలో మీటరుకు ఎనిమిది పైసల నుంచి గరిష్టంగా 25 పైసల వరకు పెంచింది. బుధవారం అర్థరాత్రి (తెల్లారితే గురువారం) నుంచి ఈ పెంపు అమలులోకి రానుంది. అయితే, దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటనను ఏక్షణమైనా విడుదల చేయనుంది.Source: ఏపీ న్యూస్ | 6 Jan 2010 | 6:22 am చూస్తుండండి... కేసీఆర్‌ను కూడా మారుస్తాం: లగడపాటిఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టడమో లేదో రద్దు చేయాలని చూసేందుకు ఏ ఒక్క రాజకీయ పార్టీకి హక్కు లేదని సమైక్య నేత లగడపాటి రాజగోపాల్ అన్నారు. న్యూ ఢిల్లీలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాలకోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 6 Jan 2010 | 6:09 am మగధీర చూసి ప్లాట్ అయ్యా: బాలీవుడ్ నిర్మాతరామ్చరణ్ తేజ చిత్రం మగధీరను చూసి తను రామ్‌చరణ్‌కు అభిమానినయ్యానని బాలీవుడ్ నిర్మాత ఫర్హాన్ అక్తర్ పేర్కొన్నారు. మగధీర చిత్రంలో రామ్‌చరణ్ బాడీ లాంగ్వేజ్, యాక్షన్ అత్యద్భుతంగా ఉన్నాయనీ, అందుకే రామ్‌చరణ్‌తో ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాననీ వెల్లడించారు. ఇప్పటికే రామ్‌చరణ్ అంగీకారాన్ని కూడా తీసుకున్నామని చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మొదలుపెట్టి డిసెంబరు నాటికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.కథలో రామ్‌చరణ్ ఓ నిరుపేద అబ్బాయిగా నటిస్తాడని, ఈ అబ్బాయిని ఓ కోటీశ్వరురాలైన అమ్మాయి ప్రేమిస్తుందని చెప్పారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే అమ్మాయి తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి నటించే అవకాశం ఉన్నదని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jan 2010 | 5:22 am 44వ ఏట అడుగుపెట్టిన రెహ్మాన్‌కు "జై హో"!"రోజా" నుంచి "జై హో" వరకు సంగీత సాగరంలో తేలిన ముత్యంలా యావత్తు ప్రపంచాన్ని ఆకట్టుకున్న సంగీత మాంత్రికుడు. ఎ.ఆర్. రెహ్మాన్. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన "స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రానికి సంగీతం సమకూర్చి అరుదైన రెండు ఆస్కార్ అవార్డులను తన ఖాతాలో వేసుకున్న రెహ్మాన్ నేటితో (జనవరి 6) 44 ఏట అడుగుపెట్టారు. "స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రంలోని " జై హో" పాటకు రెండు ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించి, బాప్టా, గోల్డెన్ గ్లోబ్ అవార్డులతో సొంత గడ్డకు గొప్ప పేరు సంపాదించిపెట్టారు. ఇంకా 1992 సంవత్సరంలో జై హో హీరో రెహ్మాన్.. సంగీత సముద్రంలో ఆరంగేట్రం చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jan 2010 | 5:15 am నెలాఖరున వస్తోన్న "గుడు గుడు గుంజం"గుప్పెట్లో నిజం దాచి "గుడు గుడు గుంజం" ఆడటమే సంసారం అనే ఫ్యామిలీ బేస్డ్ ఎంటర్‌టైనర్‌గా సోమ విజయ ప్రకాష్ సమర్పించే ఈ సినిమా ఈ నెలాఖరున విడుదల కానుంది. మూడో వారంలో సినిమాను, జనవరి పదో తేదీన ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో డా. రాజేంద్రప్రసాద్, కస్తూరి, సితార, మిడిల్ ఏజ్ జంటగా నటిస్తున్నారు. పార్థు (నవదీప్ బ్రదర్), చాహత్ ఖన్నా, ఫరాఖాన్, రిథిమ, ఆర్తిపూరిలు యువ జంటగా నటించగా, బ్రహ్మానందం బ్యాంకాక్ కామెడీ ట్రాక్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాత రవికుమార్ రెడ్డి తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jan 2010 | 4:49 am చందమామ కథలో చదివా.. పగడపు దీవులు ఉంటాయనీ..!!అందమైన సముద్రతీరాలు, రంగు రంగుల పక్షులు, అమాయకమైన జింకలు, ఆకుపచ్చని అడవులు, మైమరపించే ప్రకృతి అందాలు, ఎప్పుడూ చూడని జలచరాలు, పగడపు దీవులు.. ఇలా చెప్పుకుంటూ పోతే అండమాన్ అందాలకు అంతే ఉండదు. రెండువేల రకాలకు పైబడిన మొక్కలు, 250కంటే ఎక్కువగా ఉండే పక్షి జాతులతో అలరారే ఈ ప్రాంతాన్ని ఒక్కసారి సందర్శిస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించకమానదు.Source: వినోదం | 6 Jan 2010 | 4:31 am రాములమ్మ "రుద్రమ దేవి" అవుతానంటోంది...వెండితెరపై లేడీ అమితాబ్‌గా బిరుదును కొట్టేసిన విజయశాంతి, సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. తల్లి తెలంగాణా పార్టీ పేరుతో ప్రజల ముందుకు వచ్చింది. తల్లి తెలంగాణా కలసి రాకపోవడంతో ఆ పార్టీని తెరాసలో విలీనం చేసి, అటు పిమ్మట ఆ పార్టీ తరపున ఎన్నికలలో పోటీ చేసి ఎంపీ అయింది. అయితే ఆ తర్వాత కేసీఆర్- తనను పట్టించుకోవడం లేదని వాపోయిన విజయశాంతి వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్‌లోకి...Source: వినోదం | 6 Jan 2010 | 4:07 am శ్రీ నగర్‌లోని సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై దాడులు: ఇద్దరి మృతిశ్రీ నగర్‌లోని లాల్‌చౌక్ వద్ద ఉగ్రవాదులు బుధవారం సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై దాడులకు పాల్పడ్డారు. ఉగ్రవాదులు స్థానికంగానున్న ఓ భవంతిని తమ ఆధీనంలోకి తీసుకుని ఈ దాడులకు పాల్పడ్డట్టు భద్రతాధికారులు తెలిపారు. దీంతో వారున్న భవనాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టి కాల్పులు జరుపుతున్నట్లు సమాచారం.Source: జాతీయ | 6 Jan 2010 | 3:27 am
|