|
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు: ఆసీస్మెల్బోర్న్ తరహా సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడా జరుగుతుంటాయని ఆస్ట్రేలియా ఉప ప్రధానిజులియా గిల్లార్డ్ అన్నారు. అంతేకాకుండా, ఇతర దేశాలకు చెందిన పౌరులకు, విద్యార్థులకు అత్యంత సురక్షితమైన దేశంగా ఆమె చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియాలో ఇద్దరు భారతీయులు హత్యకు గురైన విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 6 Jan 2010 | 7:31 am లాభాల్లోనే బాంబే స్టాక్ ఎక్చేంజ్ ర్యాలీబుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ లాభాల్లోనే ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సెన్సెక్స్, బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 22 పాయింట్లు వృద్ధి చెంది, 17,708 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ 13 పాయింట్లు పుంజుకుని, 5,291 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 6 Jan 2010 | 6:55 am పార్టీ పదవికి-ఎంపీ పదవికి అమర్ సింగ్ గుడ్‌బై!సమాజ్‌వాదీ పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత సంక్షోభం బుధవారం బట్టబయలైంది. ఆ పార్టీలో అన్నీ తానై చక్రం తిప్పిన ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ పార్టీ పదవితో పాటు.. ఎంపీ పదవికి గుడ్‌బై చెప్పారు. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో విదేశాలలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన.. ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన రాజీనామా వ్యవహారాన్ని వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 6 Jan 2010 | 6:43 am తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కమిటీకి తెరాస మొగ్గు!తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్న కమిటీకి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు సానుకూలంగా స్పందించినట్టు ఢిల్లీవర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే అంశాన్ని బుధవారం సాయంత్రం మూడు గంటలకు కేంద్ర హోం మంత్ర చిదంబరంతో జరిగే భేటీ సమయంలో కేసీఆర్ వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.Source: Yahoo! Telugu: News | 6 Jan 2010 | 6:31 am స్వల్ప లాభాలతో పుంజుకున్న స్టాక్ మార్కెట్బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప ఒడిదుడుకులను ఎదుర్కోంటోంది. లాభ, నష్టాలతో హెచ్చు, తగ్గులతో సెన్సెక్స్ ర్యాలీ కొనసాగుతోంది. దీంతో బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 22 పాయింట్ల వృద్ధితో, 17,708 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా కేవలం రెండు పాయింట్లు పుంజుకుని, 5,280 మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 6 Jan 2010 | 6:16 am అమెరికా నిఘా అధికారులపై ఒబామా ఆగ్రహం!అమెరికా నిఘా సంస్థ అధికారులపై ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యామెన్ నుంచి డెట్రాయిట్‌కు వస్తున్న విమానాన్ని ఆకాశంలోనే పేల్చి వేసేందుకు కుట్ర పన్నినట్టు ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ, దాన్ని అరికట్టడంలో తమ నిఘా వర్గాలు విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 6 Jan 2010 | 6:12 am విపక్షాల వాదనలను గౌరవిస్తున్న సోనియా గాంధీ!సోనియా గాంధీ. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి. యూపీఏ కూటమికి ఛైర్‌పర్సన్. దేశ పాలనా పగ్గాలు ఆమె కనుసన్నల్లోనే సాగుతాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్ ఇలాంటి ఉన్నత పదవులకు అభ్యర్థుల ఎంపికలో ఆమె చెప్పిందే వేదం.Source: Yahoo! Telugu: News | 6 Jan 2010 | 5:49 am మూడు లగ్జరీ కార్లను ప్రవేశ పెట్టిన బీఎమ్డబ్ల్యూజర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ బీఎమ్‌డబ్ల్యూ మంగళవారం ప్రారంభమైన ఆటో ఎక్స్‌పో 2010లో మూడు లగ్జరీ కార్లను ప్రవేశపెట్టింది. వీటిలో బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్6ఎమ్, బీఎమ్‌డబ్ల్యూ గ్రాండ్ టూరిజ్మో, బీఎమ్‌డబ్ల్యూ 760 ఎల్ఐలున్నాయి.Source: Yahoo! Telugu: News | 6 Jan 2010 | 5:40 am స్వల్ప నష్టాల్లో కూరుకుపోయిన సెన్సెక్స్బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 11 గంటల ప్రాంతంలో 12 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,673 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 2 పాయింట్లు స్వల్పంగా క్షీణించి, 5,275 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 6 Jan 2010 | 5:23 am మగధీర చూసి ప్లాట్ అయ్యా: బాలీవుడ్ నిర్మాతరామ్చరణ్ తేజ చిత్రం మగధీరను చూసి తను రామ్‌చరణ్‌కు అభిమానినయ్యానని బాలీవుడ్ నిర్మాత ఫర్హాన్ అక్తర్ పేర్కొన్నారు. మగధీర చిత్రంలో రామ్‌చరణ్ బాడీ లాంగ్వేజ్, యాక్షన్ అత్యద్భుతంగా ఉన్నాయనీ, అందుకే రామ్‌చరణ్‌తో ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాననీ వెల్లడించారు. ఇప్పటికే రామ్‌చరణ్ అంగీకారాన్ని కూడా తీసుకున్నామని చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మొదలుపెట్టి డిసెంబరు నాటికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.కథలో రామ్‌చరణ్ ఓ నిరుపేద అబ్బాయిగా నటిస్తాడని, ఈ అబ్బాయిని ఓ కోటీశ్వరురాలైన అమ్మాయి ప్రేమిస్తుందని చెప్పారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే అమ్మాయి తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి నటించే అవకాశం ఉన్నదని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jan 2010 | 5:22 am తెలంగాణకు మరో వందేళ్ళ పోరాటం: ఓయూ జేఏసీతెలంగాణ రాష్ట్ర సాధనం కోసం మరో వందేళ్ళ పాటు పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఉస్మానియా విశ్వవిద్యాలయం జాయింట్ యాక్షన్ కమిటి (జాక్) ప్రతినిధులు ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలో చిదంబరం నేతృత్వంలో జరిగిన చర్చలు పూర్తిగా విఫలమయ్యాయని వారు ఆరోపించారు.Source: Yahoo! Telugu: News | 6 Jan 2010 | 5:20 am 44వ ఏట అడుగుపెట్టిన సంగీత యువకెరటం రెహ్మాన్!"రోజా" నుంచి "జై హో" వరకు సంగీత సాగరంలో తేలిన ముత్యంలా యావత్తు ప్రపంచాన్ని ఆకట్టుకున్న సంగీత యువ కెరటం. ఎ.ఆర్. రెహ్మాన్. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన "స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రానికి సంగీతం సమకూర్చి అరుదైన రెండు ఆస్కార్ అవార్డులను తన ఖాతాలో వేసుకున్న రెహ్మాన్ నేటితో (జనవరి 6) 44 ఏట అడుగుపెట్టారు. "స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రంలోని " జై హో" పాటకు రెండు ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించి, బాప్టా, గోల్డెన్ గ్లోబ్ అవార్డులతో సొంత గడ్డకు గొప్ప పేరు సంపాదించిపెట్టారు. ఇంకా 1992 సంవత్సరంలో జై హో హీరో రెహ్మాన్.. సంగీత సముద్రంలో ఆరంగేట్రం చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jan 2010 | 5:15 am నెలాఖరున వస్తోన్న "గుడు గుడు గుంజం"గుప్పెట్లో నిజం దాచి "గుడు గుడు గుంజం" ఆడటమే సంసారం అనే ఫ్యామిలీ బేస్డ్ ఎంటర్‌టైనర్‌గా సోమ విజయ ప్రకాష్ సమర్పించే ఈ సినిమా ఈ నెలాఖరున విడుదల కానుంది. మూడో వారంలో సినిమాను, జనవరి పదో తేదీన ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో డా. రాజేంద్రప్రసాద్, కస్తూరి, సితార, మిడిల్ ఏజ్ జంటగా నటిస్తున్నారు. పార్థు (నవదీప్ బ్రదర్), చాహత్ ఖన్నా, ఫరాఖాన్, రిథిమ, ఆర్తిపూరిలు యువ జంటగా నటించగా, బ్రహ్మానందం బ్యాంకాక్ కామెడీ ట్రాక్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాత రవికుమార్ రెడ్డి తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 6 Jan 2010 | 4:49 am శ్రీ నగర్‌లోని సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై దాడులు: ఇద్దరి మృతిశ్రీ నగర్‌లోని లాల్‌చౌక్ వద్ద ఉగ్రవాదులు బుధవారం సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై దాడులకు పాల్పడ్డారు. ఉగ్రవాదులు స్థానికంగానున్న ఓ భవంతిని తమ ఆధీనంలోకి తీసుకుని ఈ దాడులకు పాల్పడ్డట్టు భద్రతాధికారులు తెలిపారు. దీంతో వారున్న భవనాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టి కాల్పులు జరుపుతున్నట్లు సమాచారం.Source: జాతీయ | 6 Jan 2010 | 3:27 am పార్టీ పదవికి-ఎంపీ పదవికి అమర్ సింగ్ గుడ్‌బై!సమాజ్‌వాదీ పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత సంక్షోభం బుధవారం బట్టబయలైంది. ఆ పార్టీలో అన్నీ తానై చక్రం తిప్పిన ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ పార్టీ పదవితో పాటు.. ఎంపీ పదవికి గుడ్‌బై చెప్పారు. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో విదేశాలలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన.. ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన రాజీనామా వ్యవహారాన్ని వెల్లడించారు.Source: జాతీయ | 6 Jan 2010 | 1:13 am తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కమిటీకి తెరాస మొగ్గు!తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్న కమిటీకి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు సానుకూలంగా స్పందించినట్టు ఢిల్లీవర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే అంశాన్ని బుధవారం సాయంత్రం మూడు గంటలకు కేంద్ర హోం మంత్ర చిదంబరంతో జరిగే భేటీ సమయంలో కేసీఆర్ వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.Source: ఏపీ న్యూస్ | 6 Jan 2010 | 1:04 am విపక్షాల వాదనలను గౌరవిస్తున్న సోనియా గాంధీ!సోనియా గాంధీ. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి. యూపీఏ కూటమికి ఛైర్‌పర్సన్. దేశ పాలనా పగ్గాలు ఆమె కనుసన్నల్లోనే సాగుతాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్ ఇలాంటి ఉన్నత పదవులకు అభ్యర్థుల ఎంపికలో ఆమె చెప్పిందే వేదం.Source: జాతీయ | 6 Jan 2010 | 12:20 am తెలంగాణకు మరో వందేళ్ళ పోరాటం: ఓయూ జేఏసీతెలంగాణ రాష్ట్ర సాధనం కోసం మరో వందేళ్ళ పాటు పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఉస్మానియా విశ్వవిద్యాలయం జాయింట్ యాక్షన్ కమిటి (జాక్) ప్రతినిధులు ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలో చిదంబరం నేతృత్వంలో జరిగిన చర్చలు పూర్తిగా విఫలమయ్యాయని వారు ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 5 Jan 2010 | 11:50 pm రోశయ్యకు కేంద్రం అండ: ఇక పాలనపై దృష్టి!ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు కాంగ్రెస్ అధిష్టానంతో పాటు.. కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది. దీంతో ఆయన రాష్ట్రంలోని సమస్యల నుంచి దృష్టి మరల్చి, రాష్ట్ర పరిపాలనపై దృష్టి సారించారు. ఇందులోభాగంగా ఆయన ఢిల్లీ నుంచి మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన.. బుధవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు.Source: ఏపీ న్యూస్ | 5 Jan 2010 | 11:40 pm తెలంగాణపై కమిటీ ఏర్పాటుకు వ్యతిరేకం: యనమలరాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసేందుకు చేపట్టే ఎలాంటి చర్యకైనా తాము బద్ద వ్యతిరేకమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేయవచ్చని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో యనమల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.Source: ఏపీ న్యూస్ | 5 Jan 2010 | 11:31 pm జ్యోతిబసు ఆరోగ్యం విషమం: కృత్రిమశ్వాసే ఆధారంకమ్యూనిస్టు కురువృద్ధుడు, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు ఆరోగ్యం మరింత క్షీణించింది. కోల్‌కతాలోని ఏఎంఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ప్రస్తుతం కృత్రిమశ్వాస అందిస్తున్నట్టు వైద్యులు బుధవారం వెల్లడించారు. శ్వాస పీల్చడంలో ఇబ్బంది పడుతున్నారని అందువల్ల వెంటిలేటర్ల ద్వారా కృత్రిమశ్వాసను అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.Source: జాతీయ | 5 Jan 2010 | 11:14 pm అందరివాడిని.. అందుకే సమైక్యరాగం: చిరంజీవితాను అందిరివాడిని కాబట్టే సమైక్యరాగం ఆలపిస్తున్నానని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని తెలుగు ప్రజలంతా కలిసికట్టుగా ఉంటూ, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే తన ఏకైక లక్ష్యమని ఆయన స్పష్టంచేశారు.Source: ఏపీ న్యూస్ | 5 Jan 2010 | 10:48 pm మెజారిటీ ప్రజలమనోభీష్టం మేరకే విభజన: ప్రణబ్ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాత్రికి రాత్రి ఎలా సాధ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యుడు ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఛండీగఢ్ సమస్యను ఇప్పటికీ పరిష్కరించ గలిగామా అని ఆయన ప్రశ్నించారు. అందువల్ల ఏ సమస్య పరిష్కారానికైనా కొంత సమయం, సుదీర్ఘ చర్చలు అవసరమని ఆయన తేల్చి చెప్పారు.Source: జాతీయ | 5 Jan 2010 | 9:03 pm కొత్త పార్టీని స్థాపించిన యూపీ మాజీ సీఎం కళ్యాణ్!భారతీయ జనతా పార్టీ మాజీ సీనియర్ నేత కళ్యాణ్ సింగ్ కొత్త పార్టీని స్థాపించారు. దీనికి జన్‌క్రాంతి పార్టీ (జేకేపీ) అనే పేరును ఖరారు చేశారు. అయితే, పార్టీ బాధ్యతలను కుమారుడు రాజ్‌వీర్ సింగ్‌కు అప్పగించడం కొసమెరుపు.Source: జాతీయ | 5 Jan 2010 | 8:55 pm జనవరి 8న యుగానికి ఒక్కడు ఆడియోపలు విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన సుప్రసిద్ధ దర్శకుడు శ్రీ రాఘవ తాజాగా సూర్య సోదరుడైన కార్తి కథానాయకుడుగా 40 కోట్ల రూపాయల వ్యయంతో యుగానికి ఒక్కడు చిత్రాన్ని నిర్మించారు. తెలుగు- తమిళ భాషలలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆడియోను సోనీ కంపెనీ రైట్స్ తీసుకుని జనవరి 8న విడుదల చేయనుంది.Source: Yahoo! Telugu: Entertainment | 5 Jan 2010 | 2:09 pm జెనీలియా వేడి ముద్దును తట్టుకోలేని షాహిద్బక్కపిల్ల జెనీలియా కూడా లిప్-టు-లిప్ జాబితాలో చోటు దక్కించాలనుకున్నదో ఏమో గానీ, "ఛాన్స్ పే డ్యాన్స్" చిత్రంలో షాహిద్ కపూర్ పెదవులను తన పెదవులతో బిగించేసిందట. ఆ ముద్దు మత్తెక్కించి చిత్తు చేసేదిగా ఉన్నదట. దీంతో హీరో షాహిద్ కపూర్ ఆ వేడి ముద్దు సన్నివేశాన్ని చిత్రం నుంచి తొలగించాల్సిందిగా కోరాడట. చిత్రం ఏమిటంటే.. ఆ ఘాటు ముద్దుకు సెన్సార్ బోర్డు సభ్యులు అడ్డు చెప్పక పోవడం. హీరోయిన్‌కు లేని బాధ నీకెందుకని షాహిద్‌ను కదిలిస్తే... "ఈ ముద్దును చూస్తే నా ప్రేక్షకులను నన్ను నిందిస్తారు. అందుకే ఆ ముద్దు సన్నివేశాన్ని తొలగించమని చెప్పానంటున్నాడు. ఆ చిత్రానికి పనిచేసిన చిత్ర యూనిట్ సైతం షూటింగ్ సమయంలోనే ఆ ముద్దును చూసి తాము చిత్తయిపోయామని చెపుతున్నారట. మొత్తానికి జెనీలియా ఇటువంటి హాటు ముద్దులు కూడా ఇస్తుందన్నమాట.Source: Yahoo! Telugu: Entertainment | 5 Jan 2010 | 9:09 am కేంద్ర అధికారిక ప్రకటన తర్వాతే స్పందన: కేసీఆర్ప్రత్యేక తెలంగాణ అంశంపై కేంద్రం అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే తమ స్పందన తెలియజేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు వెల్లడించారు. మంగళవారం హోం మంత్రి చిదంబరం అధ్యక్షతన జరిగిన చర్చల అనంతరం ఆయన మీడియా ముందు పైవిధంగా స్పందించారు.Source: ఏపీ న్యూస్ | 5 Jan 2010 | 6:38 am ముగిసిన అఖిలపక్ష భేటీ: ఎవరి వాదన వారిదే!ఉత్కంఠతతో సాగిన ఢిల్లీ మీటింగ్ ముగిసింది. చర్చల సారాంశం బహిర్గతమైంది. పాల్గొన్న పార్టీల ప్రతినిధులు భిన్న వాదనలు వినిపించారు. హోం మంత్రి చిదంబరం శ్రద్ధగా ఆలకించారు. సమావేశం అనంతరం మౌనం దాల్చారు. భేటీలో పాల్గొన్న ముఖ్యమంత్రి రోశయ్య ప్రేక్షక పాత్ర పోషించారు.Source: ఏపీ న్యూస్ | 5 Jan 2010 | 6:35 am సల్మాన్ ఖాన్ నన్ను ఎత్తుకున్నాడు: సమీరా రెడ్డిబాలీవుడ్ సెక్సీ నటి సమీరా రెడ్డి తన చిన్ననాటి సంగతులను ఒక్కసారి గుర్తు చేసుకుంది. బాల్యంలో అల్లరి చేస్తే తన అమ్మానాన్నలు ఎక్కడ కొడతారోనని భయపడి అల్లరి చేష్టలను అస్సలు చేసేదానిని కాదని చెపుతోంది. అయితే అప్పుడప్పుడు స్కూలు ఎగ్గొట్టి సినిమాలను చూసేదాన్నని, ఇంట్లో ఆ విషయాన్ని చెప్పకుండా దాచేందుకు ఎన్నో తంటాలు పడేదాన్నని చెప్పింది.తన తల్లిదండ్రులు తన పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేవారిని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తనకు ఆరేళ్ల వయసులో తన బర్త్ డే సెలబ్రేషన్‌కు తన తండ్రి ఏకంగా సల్మాన్‌ఖాన్‌ను ఆహ్వానించారని గుర్తు చేసుకుంది. పార్టీకి వచ్చిన సల్మాన్ తనను అమాంతం ఎత్తుకుని ముద్దాడిన సంఘటన తలచుకుంటే వళ్లు పులకరించిపోతుందని అంటోంది సమీరా. అంటే... సల్మాన్ ఖాన్ ముసలాడయ్యాడని చెపుతున్నట్లా...?Source: Yahoo! Telugu: Entertainment | 5 Jan 2010 | 6:33 am చిన్నపార్టీల సంకుచిత ఆలోచనలతో హాని: పీఎందేశంలోని చిన్న పార్టీల భావనలు, సంకుచిత ఆలోచనా విధానాలు దేశ సమైగ్రతకు హాని కలిగించేలా ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో అంతర్జాతీయ సభాపతులు, శాసనమండలిల సదస్సును ఆయన ప్రారంభించారు.Source: జాతీయ | 5 Jan 2010 | 5:59 am అభిప్రాయం తర్వాత.. ప్రెజ్ రూల్ ఫస్ట్: అసదుద్దీన్రాష్ట్ర విభజన అంశంపై తమ అభిప్రాయం తర్వాత వెల్లడిస్తామని, రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనేందుకు రాష్ట్రపతి పాలన విధించాలని మస్జీల్ పార్టీ (ఎంఐఎం) విజ్ఞప్తి చేసింది. కేంద్ర హోం మంత్రి చిదంబరం అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.Source: ఏపీ న్యూస్ | 5 Jan 2010 | 4:14 am వెలమ రాజుల శత్రుదుర్భేద్య దుర్గం "దేవరకొండ"వచ్చిపోయే అతిథులతో కళకళలాడుతుండే అతిథి గృహాలు, వేదోచ్ఛారణలమధ్య వెలిగిపోతుండే గుళ్లు, గోపురాలు.. సిరిమువ్వల సవ్వడితో చేసే నాట్య విన్యాసాలు, సంగీత సాహిత్య సమ్మేళనాలు, రారాజుల తీర్పుకోసం వేచి ఉండే ప్రజలతో నిండిన రాజ ప్రసాదాలతో కళకళలాడుతూ దర్శనమిచ్చే చారిత్రక ప్రదేశం దేవరకొండ దుర్గం.Source: వినోదం | 5 Jan 2010 | 4:09 am తదుపరి చర్చలకు పార్టీల సానుకూలం: చిదంబరంతెలంగాణ అంశంపై మరింత విస్తృతంగా తదుపరి చర్చలు జరిపేందుకు అఖిలపక్ష పార్టీలన్నీ సానుకూలంగా స్పందించాయని కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలిపారు. రాష్ట్ర విభజన అంశంపై ఆయన తన ప్రధాన కార్యాలయంలో ఎనిమిది పార్టీలతో చర్చలు జరిపిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తదుపరి చర్చలకు ఎవరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు.Source: జాతీయ | 5 Jan 2010 | 3:38 am ఢిల్లీలో ముగిసిన అఖిలపక్ష పార్టీల సమావేశం!రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర హోం శాఖ చిదంబరం అధ్యక్షతన జరిగిన ఎనిమిది పార్టీలతో మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ చర్చల్లో ఎనిమిది పార్టీలకు చెందిన 16 మంది ప్రతినిధిలతో పాటు ముఖ్యమంత్రి కె.రోశయ్యలు పాల్గొన్నారు.Source: జాతీయ | 5 Jan 2010 | 2:33 am ఢిల్లీలో సమైక్య - తెలంగాణ వాదుల అరెస్టు!దేశ రాజధాని న్యూఢిల్లీలోని పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయం వద్ద సమైక్యాంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు ఘర్షణ పడ్డారు. తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో ఈ ప్రాంతాన్ని హోరెత్తించారు. దీంతో తెలంగాణ, సమైక్యాంధ్రకు చెందిన పలువురు నేతలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.Source: ఏపీ న్యూస్ | 5 Jan 2010 | 2:13 am
|