|
ఢిల్లీలో ముగిసిన అఖిలపక్ష పార్టీల సమావేశం!రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర హోం శాఖ చిదంబరం అధ్యక్షతన జరిగిన ఎనిమిది పార్టీలతో మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ చర్చల్లో ఎనిమిది పార్టీలకు చెందిన 16 మంది ప్రతినిధిలతో పాటు ముఖ్యమంత్రి కె.రోశయ్యలు పాల్గొన్నారు.Source: Yahoo! Telugu: News | 5 Jan 2010 | 8:02 am లాభాలతో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో కొనసాగుతోంది. విదేశీ మార్కెట్ల ప్రభావంతో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 112 పాయింట్లు వృద్ధి చెంది, 17,670 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 39 పాయింట్లు పుంజుకుని, 5,271 పాయింట్ల వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది.Source: Yahoo! Telugu: News | 5 Jan 2010 | 8:00 am పోలోను మార్కెట్లోకి విడుదల చేసిన వోక్స్వాగన్దేశీయ ఆటో మార్కెట్ రంగంలో తమ సంస్థకు చెందిన అతి చిన్న కారైన పోలోను నేడు మార్కెట్లోకి విడుదలచేసామని వోక్స్‌వాగన్ సంస్థకు చెందిన మేనేజ్‌మెంట్ సభ్యుడు జోచెమ్ హీజ్‌మాన్న్ న్యూ ఢిల్లీలో మీడియాకు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 5 Jan 2010 | 7:47 am ఢిల్లీలో సమైక్య - తెలంగాణ వాదుల అరెస్టు!దేశ రాజధాని న్యూఢిల్లీలోని పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయం వద్ద సమైక్యాంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు ఘర్షణ పడ్డారు. తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో ఈ ప్రాంతాన్ని హోరెత్తించారు. దీంతో తెలంగాణ, సమైక్యాంధ్రకు చెందిన పలువురు నేతలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.Source: Yahoo! Telugu: News | 5 Jan 2010 | 7:43 am తెలంగాణ ఏర్పాటుకు తెరాస అడ్డంకి: విక్రమార్కప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నేతలు కొంతమంది చేస్తున్న ప్రకటనలు ప్రధాన అడ్డంకిగా మారాయని ప్రభుత్వ చీఫ్ విప్ భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ పార్టీకి చెందిన నేతలు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వాడుతున్న భాష, పాల్పడుతున్న హింసాత్మక సంఘటనలు రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకం కలిగిస్తున్నాయన్నారు.Source: Yahoo! Telugu: News | 5 Jan 2010 | 7:01 am ఆర్థిక వృద్ధిరేటు ప్రకటన: సెన్సెక్స్ పై.. పైకి..దేశీయ ఆర్థిక వృద్ధిరేటు భవిష్యత్తులో పది శాతానికి పెరిగే అవకాశం ఉందని ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు చేసిన ప్రకటన బాంబే స్టాక్ మార్కెట్‌కు ఊతమిచ్చింది. కొన్నేళ్లలో దేశీయ ఆర్థిక వృద్ధిరేటు పెరిగే అవకాశం ఉందని కౌశిక్ పేర్కొనడంతో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో సెన్సెక్స్ 124 పాయింట్లు వృద్ధి చెంది, 17,682 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 40 పాయింట్లు బలపడి, 5,272 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 5 Jan 2010 | 6:45 am రాష్ట్రంలో అరాచకం నెలకొంది: యనమల రామకృష్ణుడుఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అరాచకం నెలకొందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం చేసిన ప్రకటన అనంతరం రాష్ట్రంలో కల్లోల పరిస్థితులు పెచ్చుమీరాయన్నారు. |