1.6 లక్షల మందికి డ్రైవింగ్ నేర్పిన మారుతి

దేశంలో సురక్షితమైన డ్రైవింగ్‌ను పెంపొందించేందుకుగాను తన జాతీయ రోడ్డు భద్రతా మిషన్ ద్వారా తొలి సంవత్సరంలో ఒక లక్ష అరవై వేల మందికి డ్రైవింగ్‌లో ప్రత్యేక శిక్షణనిచ్చినట్లు మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 4 Jan 2010 | 8:34 am

నకిలీ కరెన్సీ: బంగ్లా మాజీ మంత్రి కుమారుడి అరెస్టు

భారత్‌లో నకిలీ కరెన్సీని చెలామణి చేస్తున్న బంగ్లాదేశ్ మాజీ మంత్రి కుమారుడితో పాటు.. నలుగురుని ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజులకు ముందు మధ్యప్రదేశ్‌లో నకిలీ నోట్లు కలిగి ఉన్నందుకు గాను ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద జరిపిన విచారణలో బంగ్లాదేశ్‌కు చెందిన మాజీ మంత్రి కుమారుడు యూనస్ అన్సారీ నకిలీ నోట్ల ముఠా నేత అని తేలింది.
Source: Yahoo! Telugu: News | 4 Jan 2010 | 7:58 am

వెయ్యి రూపాయల కోసం ఎటిఎంలకు వెళ్ళక్కరలేదు

దేశంలోని ఐదు ప్రముఖ బ్యాంకులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా మూడు లక్షల పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్)ను ప్రారంభించనున్నాయి. దీంతో ఖాతాదారులకు వెయ్యి రూపాయలు డ్రా చేసుకునేందుకు ఎటిఎంల వద్దకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. దీనికి ఖాతాదారులు చేయాల్సిందల్లా ఒక్కటే... ఖాతాదారునికి వెయ్యి రూపాయలు అవసరమైనప్పుడు స్థానికంగానున్న ఏదైనా దుకాణంలో ఏర్పాటు చేసిన పీఓఎస్‌లో వారు ఈ సొమ్మును తీసుకోవచ్చంటున్నాయి బ్యాంక్ వర్గాలు
Source: Yahoo! Telugu: News | 4 Jan 2010 | 7:50 am

పుంజుకున్న కొనుగోళ్లు: సెన్సెక్స్ వృద్ధి

సోమవారం బాంబే స్టాక్ మార్కెట్‌కు అన్ని విధాల కలిసొచ్చింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 83 పాయింట్లు వృద్ధి చెంది, 17,548 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 29 పాయింట్లు బలపడి, 5,230 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 4 Jan 2010 | 7:44 am

ఆరుషీ హత్య కేసు: కోర్టులో సీబీఐ కొత్త పిటీషన్!

దేశంలో సంచలనం సృష్టించిన ఆరుషీ హత్య కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. ఆరుషీ తండ్రి డాక్టర్ రాజేష్ తల్వార్‌కు కొత్తగా నార్కో పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతి కోరింది. ఈ మేరకు ఈ కేసు విచారణను చేపట్టిన కొత్త సీబీఐ బృందం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ కోర్టులో సోమవారం పిటీషన్ దాఖలు చేసింది.
Source: Yahoo! Telugu: News | 4 Jan 2010 | 7:41 am

తెలంగాణకు కాలపరిమితి కోరుతాం: ఉత్తమ్‌కుమార్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి సంబంధించి కాలపరిమితిని విధించాలని కోరుతామని ఢిల్లీలో జరిగే చర్చల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధిగా హాజరుకానున్న ఉత్తమ్‌ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆయన సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లేముందు ఉస్మానియా విశ్వవిద్యాలయం జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులుతో సమావేశమయ్యారు.
Source: Yahoo! Telugu: News | 4 Jan 2010 | 7:24 am

కోట్లలో తరలివస్తాం.. అడ్డుకుంటారా: సీమాంధ్ర సవాల్!

హైదరాబాదులో తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన మహా గర్జనలో పలువురు జేఏసీ నేతలు చేసిన వ్యాఖ్యలపై సీమాంధ్రలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. సంక్రాంతి పండుగకు తమ సొంతూర్లకు వెళ్లిన 30 లక్షల మంది సీమాంధ్ర ప్రజలను తిరిగి భాగ్యనగరిలో అడుగుపెట్టనీయబోమని హెచ్చరించటంపై సీమాంధ్ర విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 4 Jan 2010 | 6:48 am

విదేశీ మార్కెట్ల ప్రభావం: లాభాల్లో సెన్సెక్స్

విదేశీ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి వృద్ధిబాటలో కొనసాగుతోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 50 పాయింట్లు వృద్ధిచెంది, 17,515 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 17 పాయింట్ల స్వల్ప లాభంతో 5,219 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 4 Jan 2010 | 6:46 am

చారిత్మాత్మక తప్పిదం చేసిన పార్టీలు: మంత్రి రఘువీరా

ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఈనెల ఏడో తేదీన చారిత్మాత్మక తప్పిదం చేశాయని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజనపై ఈనెల ఐదో తేదీన ఢిల్లీలో జరుగనున్న ఎనిమిది పార్టీల సమావేశంలో పాల్గొనే సీమాంధ్ర ప్రాంత ప్రతినిధికి సంఘీభావం తెలిపేందుకు ఆయన మరో మాజీ మంత్రి జేసీ.దివాకర్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లారు.
Source: Yahoo! Telugu: News | 4 Jan 2010 | 6:41 am

మరింత చేదు కానున్న చక్కెర

గడచిన కొద్ది వారాలుగా నిత్యావసర సరుకుల మార్కెట్లో చక్కెర ధరలు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో వచ్చే ఆరు నెలల కాలంలో చక్కెర ధరలు మరింత పెరిగి ప్రతి కిలో రూ. 50లకు చేరుకోగలదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Source: Yahoo! Telugu: News | 4 Jan 2010 | 6:30 am

కళాశాల ఉత్సవాల్లో కండోమ్ ప్యాకెట్లు విసిరేశా: ధూపియా

దాదాపు నగ్నంగా నటించినంత పనిచేసే తారల్లో నేహా ధూపియా అగ్రస్థానంలో నిలబడుతుందని చెప్పుకోవచ్చు. ఈ తార ఇటీవల తను ఓ కళాశాల ఉత్సవానికి హాజరైనప్పుడు విద్యార్థుల మధ్యలోకి కండోమ్ ప్యాకెట్లు విసిరేసి సంచలనం సృష్టించింది. నేహా విసిరిన కండోమ్ ప్యాకెట్లను చూసి విద్యార్థులు అవాక్కయిపోయారు. వివరాలలోకి వెళితే.... ఇటీవల ముంబయిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన మూడ్ ఇండిగో ఫెస్టివల్‌కు నేహా ధూపియా హాజరైంది. నేహాధూపియాతోపాటు "రాత్ గయి బాత్ గయి" చిత్రం నిర్మాత కూడా ఆ ఉత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతుండగా నిర్మాత ఓ పెద్ద సంచీలో కండోమ్‌లు, సిరంజిలు, డిస్పెన్సరీ సామగ్రిని తీసుక వచ్చి తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా వాటిని విద్యార్థుల మధ్యకు విసిరేయాల్సిందిగా నేహా ధూపియాను కోరాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jan 2010 | 6:15 am

బాక్సాఫీసులను షేక్ చేసిన పునర్జన్మల చిత్రాలు

పునర్జన్మల నేపధ్యంలో తెరకెక్కుతున్న చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడాన్ని చూసిన నిర్మాతలు ప్రస్తుతం ఆ దిశగా మరిన్ని చిత్రాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో నిర్మించిన అరుంధతి, మగధీర రికార్డు స్థాయి కలెక్షన్లు వసూలు చేసి తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. అదేవిధంగా హీందీలో తీసిన ఓం శాంతి ఓం ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపధ్యంలో అటువంటి ఇతివృత్తాలను ఆధారంగా చేసుకుని మరిన్ని చిత్రాలను తీసేందుకు ఆయా దర్శకులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఫార్ములాను తెలుగు దర్శకులు బాగా వర్కవుట్ చేస్తుండటంతో తమిళ నటులు తెలుగు దర్శకులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే తమిళ అగ్రశ్రేణి నటుడు విక్రమ్, సంచలన దర్శకుడు రాజమౌళిని ఆహ్వానించి తనకు ఓ చిత్రాన్ని చేసిపెట్టమన్నట్లు సమాచారం.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jan 2010 | 5:28 am

ఆరుషీ హత్య కేసు: కోర్టులో సీబీఐ కొత్త పిటీషన్!

దేశంలో సంచలనం సృష్టించిన ఆరుషీ హత్య కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. ఆరుషీ తండ్రి డాక్టర్ రాజేష్ తల్వార్‌కు కొత్తగా నార్కో పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతి కోరింది. ఈ మేరకు ఈ కేసు విచారణను చేపట్టిన కొత్త సీబీఐ బృందం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ కోర్టులో సోమవారం పిటీషన్ దాఖలు చేసింది.
Source: జాతీయ | 4 Jan 2010 | 2:12 am

తెలంగాణకు కాలపరిమితి కోరుతాం: ఉత్తమ్‌కుమార్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి సంబంధించి కాలపరిమితిని విధించాలని కోరుతామని ఢిల్లీలో జరిగే చర్చల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధిగా హాజరుకానున్న ఉత్తమ్‌ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆయన సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లేముందు ఉస్మానియా విశ్వవిద్యాలయం జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులుతో సమావేశమయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jan 2010 | 1:55 am

కోట్లలో తరలివస్తాం.. అడ్డుకుంటారా: సీమాంధ్ర సవాల్!

హైదరాబాదులో తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన మహా గర్జనలో పలువురు జేఏసీ నేతలు చేసిన వ్యాఖ్యలపై సీమాంధ్రలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. సంక్రాంతి పండుగకు తమ సొంతూర్లకు వెళ్లిన 30 లక్షల మంది సీమాంధ్ర ప్రజలను తిరిగి భాగ్యనగరిలో అడుగుపెట్టనీయబోమని హెచ్చరించటంపై సీమాంధ్ర విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 4 Jan 2010 | 1:19 am

చారిత్మాత్మక తప్పిదం చేసిన పార్టీలు: మంత్రి రఘువీరా

ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఈనెల ఏడో తేదీన చారిత్మాత్మక తప్పిదం చేశాయని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజనపై ఈనెల ఐదో తేదీన ఢిల్లీలో జరుగనున్న ఎనిమిది పార్టీల సమావేశంలో పాల్గొనే సీమాంధ్ర ప్రాంత ప్రతినిధికి సంఘీభావం తెలిపేందుకు ఆయన మరో మాజీ మంత్రి జేసీ.దివాకర్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jan 2010 | 1:11 am

10న ఇండో-బంగ్లాల మధ్య మూడు ఒప్పందాలు!

ఈనెల పదో తేదీన భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య మూడు కీలక ఒప్పందాలు జరుగనున్నాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ ఒప్పంద పత్రాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Source: జాతీయ | 4 Jan 2010 | 12:33 am

ఎవరివాణి వారిదే: ఢిల్లీకి క్యూ కడుతున్న నేతలు!

ఈనెల ఐదో తేదీన రాష్ట్ర విభజనపై జరుగనున్న చర్చల్లో పాల్గొంటున్న తమ ప్రాంత ప్రతినిధులకు సంఘీభావం తెలిపేందుకు గాను వివిధ పార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ మంత్రులు, ఇతర నేతలు న్యూఢిల్లీకి క్యూ కడుతున్నారు. చర్చల్లో పాల్గొనే వివిధ పార్టీల ప్రతినిధులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jan 2010 | 12:00 am

హస్తినలో విభజన చర్చలు: నేతల 'సందడే సందడి'

దేశ రాజధాని న్యూఢిల్లీలో రాష్ట్ర విభజన చర్చలు సోమవారం జరుగనున్నాయి. కేంద్ర హోం మంత్రి చిదంబరం నేతృత్వంలో ఇవి జరుగనున్నాయి. ఇందుకోసం కేంద్రం రాష్ట్రంలో గుర్తింపు పొందిన ఎనిమిది రాజకీయ పార్టీలకు ఇప్పటికే ఆహ్వానం అందిన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 3 Jan 2010 | 11:34 pm

ఈనెల 10న భాగ్యనగరంలో సమైక్యవాదుల సభ!

రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో ఈనెల 10వ తేదీన సమైక్యవాద సమావేశం నిర్వహించాలని సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయించారు. తెలంగాణ ప్రాంతంలోనూ సమైక్యవాదులు ఉన్నారని నిరూపించే ప్రయత్నంలో భాగంగానే దీన్ని నిర్వహించనున్నారు. పార్టీలకు అతీతంగా మేధావులు, సమైక్యవాదులు, కవులు, కళాకారులతో ఈ సమావేశం జరుగనుంది.
Source: ఏపీ న్యూస్ | 3 Jan 2010 | 11:20 pm

వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న యూపీఏ: భగవత్

కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దేశంలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఆరోపించారు. దీనికి ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసేందుకు పూనుకోవడమేనన్నారు. ప్రధానంగా తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు.
Source: జాతీయ | 3 Jan 2010 | 11:06 pm

'దారిన పోయే దానయ్య'లాంటి వాడిని: రోశయ్య

రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర హోంమంత్రి చిదంబరం మంగళవారం జరుపనున్న చర్చల ఉద్దేశ్యం తనకు తెలియదని ముఖ్యమంత్రి రోశయ్య స్పష్టం చేశారు. దారినపోయే దానయ్యలాంటి తనను అడిగితే మీకు ఎలాంటి సమాధానం రాదని, కేంద్ర హోంమంత్రిని ప్రశ్నిస్తే స్పష్టమైన జవాబు దొరుకుతుందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 3 Jan 2010 | 9:59 pm

విద్యారంగంలో సమూల మార్పులు అవసరం: ప్రధాని

దేశంలోని విశ్వవిద్యాలయాలు ప్రపంచ స్థాయి సంస్థలుగా ఎదగాలంటే విద్యారంగంలో సమూల మార్పులు చేయాల్సివుందని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. తిరువనంతపురంలో జరిగే 97వ అఖిల భారత సైన్స్ కాంగ్రెస్ మహాసభలను ఆయన ఆదివారం ప్రారంభించారు.
Source: జాతీయ | 3 Jan 2010 | 9:41 pm

ముగ్గురు తీవ్రవాదుల పరారీ: న్యాయ విచారణకు ఆదేశం!

ఎర్రకోట దాడిలో సంబంధం ఉన్న ముగ్గురు తీవ్రవాదులు ఢిల్లీ ఆస్పత్రి నుంచి పరారైన వ్యవహారంపై న్యాయ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ఆయన కోరారు.
Source: జాతీయ | 3 Jan 2010 | 9:25 pm

సీమాంధ్రలో సంపూర్ణ బంద్: కదలని ఆర్టీసీ చక్రాలు!

సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతాలలో సోమవారం సంపూర్ణ బంద్ కొనసాగుతోది. రాయలసీ, కోస్తా, ఉత్తర ఆంధ్రాలోని 13 జిల్లాల్లో ఈ బంద్ సాగుతోంది. ఈ బంద్ కారణంగా అన్ని జిల్లాల్లో వేలాది ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే నిలిచి పోయాయి.
Source: ఏపీ న్యూస్ | 3 Jan 2010 | 9:06 pm

కేసీఆర్‌తో తెలంగాణ ప్రరాపా ఎమ్మెల్యేల భేటీ

తెలంగాణ రాష్ట్ర సమితి కె.చంద్రశేఖర రావుతో ఆ ప్రాంతానికి చెందిన ప్రజారాజ్యం ఎమ్మెల్యేలు ఆదివారం భేటీ అయ్యారు. రాష్ట్ర విభజనతో పాటు.. పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ సంపూర్ణ మద్దతును వారు ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 3 Jan 2010 | 5:31 am

చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం: తెలంగాణ జేఏసీ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి అని ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టనున్నట్టు తెలంగాణ విద్యార్థి సంయుక్త కార్యాచరణ కమిటీ (జాక్) ప్రకటించింది. మహాగర్జన పేరుతో ఆదివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద జరిగిన భారీ బహిరంగ సభ జరిగింది. ఇందులో జేఏసీ పలు తీర్మానాలను చేసింది.
Source: ఏపీ న్యూస్ | 3 Jan 2010 | 5:19 am

మెరుగుపడుతున్న జ్యోతిబసు ఆరోగ్య పరిస్థితి!

పశ్చిమబెంగాల్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కమ్యూనిస్టు వృద్ధనేత జ్యోతిబసు ఆరోగ్యం మెల్లగా కుదుటపడుతున్నట్టు వైద్యులు వెల్లడించారు. అయినప్పటికీ ఆయనకు ప్రాణవాయువు అందించిస్తున్నట్టు కోల్‌కతా వైద్యులు తెలిపారు. న్యూమోనియాతో బాధపడుతున్న జ్యోతిబసు కోల్‌కతాలోని ఒక ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ.. శ్వాసపరికరాల ద్వారా ప్రాణవాయువు అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.
Source: జాతీయ | 3 Jan 2010 | 4:59 am

జార్ఖండ్‌ రాష్ట్రంలో చలికి 13 మంది మృతి

జార్ఖండ్ రాష్ట్రంలో చలికి 13 మంది మృత్యువాత పడ్డారు. ఆ రాష్ట్ర రాజధాని రాంచీతో పాటు.. వివిధ ప్రాంతాల్లో వీరంతా మరణించినట్టు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. రాంచీలో నలుగులు, బొకారో, గార్‌వాగ్, జమ్‌షెడ్‌పూర్‌లలో ఒక్కొక్కరు చొప్పున మరణించగా, హజీరాబాగ్, ధన్‌బాద్‌లలో ఆరుగురు ఆరుగురు ఉన్నారు. జార్ఖండ్‌ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి.
Source: జాతీయ | 3 Jan 2010 | 2:09 am