Loading...

సీమాంధ్ర బంద్‌కు సంపూర్ణ మద్దతు: శైలజానాథ్

సమైక్య ఉద్యమంలో భాగంగా సోమవారం రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో జరుపతలపెట్టిన బంద్‌కు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్ని సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫోరం కన్వీనర్ శైలాజానాథ్ తెలిపారు. దీనిపై సీమాంధ్రలోని విద్యార్థి సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జరిగే బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 3 Jan 2010 | 8:23 am

జార్ఖండ్‌ రాష్ట్రంలో చలికి 13 మంది మృతి

జార్ఖండ్ రాష్ట్రంలో చలికి 13 మంది మృత్యువాత పడ్డారు. ఆ రాష్ట్ర రాజధాని రాంచీతో పాటు.. వివిధ ప్రాంతాల్లో వీరంతా మరణించినట్టు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. రాంచీలో నలుగులు, బొకారో, గార్‌వాగ్, జమ్‌షెడ్‌పూర్‌లలో ఒక్కొక్కరు చొప్పున మరణించగా, హజీరాబాగ్, ధన్‌బాద్‌లలో ఆరుగురు ఆరుగురు ఉన్నారు. జార్ఖండ్‌ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి.
Source: Yahoo! Telugu: News | 3 Jan 2010 | 7:39 am

సమైక్యాంధ్ర ఉద్యమంపై ఎస్వీలో అఖిలపక్షం భేటీ!

సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలన్న అంశంపై తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అఖిలపక్ష సమావేశం అత్యవసరంగా భేటీ అయింది. ఈనెల ఐదో తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణపై ఎనిమిది పార్టీలతో చర్చలు జరపనున్న నేపథ్యంలో.. అఖిలపక్ష సమావేశం భేటీ కావడం గమనార్హం.
Source: Yahoo! Telugu: News | 3 Jan 2010 | 6:53 am

ఆస్ట్రేలియా భారతీయ యువకుడు దాడి.. మృతి!

ఆస్ట్రేలియాలో దాడికి గురైన భారతీయ యువకుడు కన్నుమూశాడు. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఈ యువకుడు ప్రాణాలు విడిచినట్టు ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాలోని భారతీయులపై గత కొంతకాలంగా జరుగుతున్న దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన తొలి యువకుడు ఇతనే కావడం గమనార్హం.
Source: Yahoo! Telugu: News | 3 Jan 2010 | 6:31 am

న్యూక్లియర్ ప్రమాదాలపై ఐఆర్‌డీఐ పరిశీలన!

దేశంలో న్యూక్లియర్ ప్రమాదాలకు బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఇన్సూరెసన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) సభ్యుడు ఆర్.కన్నన్ తెలిపారు. ఈ అంశంపై ఆయన న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. ప్రస్తుతం వివిధ ప్రమాదాలకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు చెప్పారు. అయితే, న్యూక్లియర్ ప్రమాదాలకు మాత్రం ఈ సౌకర్యం లేదన్నారు.
Source: Yahoo! Telugu: News | 3 Jan 2010 | 5:53 am

ముగ్గురు తీవ్రవాదుల పరారీ: ఢిల్లీలో హై అలెర్ట్!

ఎర్రకోట దాడిలో సంబంధం ఉన్న ముగ్గురు తీవ్రవాదులు ఢిల్లీ ఆస్పత్రి నుంచి పరారు కావడంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో హైఅలెర్ట్ ప్రకటించారు. అలాగే, పరారీలో ఉన్న ముగ్గురు తీవ్రవాదుల ఆచూకీ తెలిపిన వారికి యాభై వేల రూపాయల నగదు బహుమతిని అందజేయనున్నట్టు హస్తిన పోలీసులు ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 3 Jan 2010 | 5:37 am

ఎన్ఆర్‌ఐ డిపాజిట్లపై పీఎన్‌బీ వడ్డీరేట్లు సవరణ

దేశ బ్యాంకింగ్ సెక్టార్లలో ఒకటై పంజాబ్ నేషనల్ బ్యాంకు తన ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (ఎఫ్.సి.ఎన్.ఆర్.ఐ) వడ్డీ రేట్లను సవరించింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు తక్షణం అమలులోకి వస్తాయని పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 3 Jan 2010 | 5:07 am

హైదరాబాద్‌లోని ఐటీ పరిశ్రమలకు గట్టి భద్రత!

రాష్ట్రంలో వేర్పాటువాద ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు, కాల్ సెంటర్లు, ఫార్మా కంపెనీలకు ప్రభుత్వం గట్టి భద్రత కల్పించనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఐజీ కృష్ణప్రసాద్ ప్రత్యేక అధికారిగా ఈ టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేశారు.
Source: Yahoo! Telugu: News | 3 Jan 2010 | 4:51 am

చిత్ర పరిశ్రమపై రోశయ్య వ్యాఖ్యలు కరక్టే: చిరంజీవి

తెలుగు చిత్ర పరిశ్రమపై ముఖ్యమంత్రి కె.రోశయ్య చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం సరైనవేనని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆయన ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రానికి చేరుకున్న చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. గత నెల రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు ఒక్క పరిశ్రమలపైనే కాకుండా చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.
Source: Yahoo! Telugu: News | 3 Jan 2010 | 4:13 am

నేడు విద్యార్థి గర్జన.. ఉస్మానియాల గట్టి భద్రత!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ సంయుక్త కార్యాచరణ కమిటి (జాక్) ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం విద్యార్థి గర్జన జరుగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభను నిర్వహించుకునేందుకు హైకోర్టు సింగిల్ జడ్జి షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. దీంతో జేఏసీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 3 Jan 2010 | 4:00 am

సీమాంధ్ర బంద్‌కు సంపూర్ణ మద్దతు: శైలజానాథ్

సమైక్య ఉద్యమంలో భాగంగా సోమవారం రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో జరుపతలపెట్టిన బంద్‌కు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్ని సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫోరం కన్వీనర్ శైలాజానాథ్ తెలిపారు. దీనిపై సీమాంధ్రలోని విద్యార్థి సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జరిగే బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 3 Jan 2010 | 2:54 am

జార్ఖండ్‌ రాష్ట్రంలో చలికి 13 మంది మృతి

జార్ఖండ్ రాష్ట్రంలో చలికి 13 మంది మృత్యువాత పడ్డారు. ఆ రాష్ట్ర రాజధాని రాంచీతో పాటు.. వివిధ ప్రాంతాల్లో వీరంతా మరణించినట్టు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. రాంచీలో నలుగులు, బొకారో, గార్‌వాగ్, జమ్‌షెడ్‌పూర్‌లలో ఒక్కొక్కరు చొప్పున మరణించగా, హజీరాబాగ్, ధన్‌బాద్‌లలో ఆరుగురు ఆరుగురు ఉన్నారు. జార్ఖండ్‌ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి.
Source: జాతీయ | 3 Jan 2010 | 2:09 am

సమైక్యాంధ్ర ఉద్యమంపై ఎస్వీలో అఖిలపక్షం భేటీ!

సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలన్న అంశంపై తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అఖిలపక్ష సమావేశం అత్యవసరంగా భేటీ అయింది. ఈనెల ఐదో తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణపై ఎనిమిది పార్టీలతో చర్చలు జరపనున్న నేపథ్యంలో.. అఖిలపక్ష సమావేశం భేటీ కావడం గమనార్హం.
Source: ఏపీ న్యూస్ | 3 Jan 2010 | 1:23 am

ముగ్గురు తీవ్రవాదుల పరారీ: ఢిల్లీలో హై అలెర్ట్!

ఎర్రకోట దాడిలో సంబంధం ఉన్న ముగ్గురు తీవ్రవాదులు ఢిల్లీ ఆస్పత్రి నుంచి పరారు కావడంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో హైఅలెర్ట్ ప్రకటించారు. అలాగే, పరారీలో ఉన్న ముగ్గురు తీవ్రవాదుల ఆచూకీ తెలిపిన వారికి యాభై వేల రూపాయల నగదు బహుమతిని అందజేయనున్నట్టు హస్తిన పోలీసులు ప్రకటించారు.
Source: జాతీయ | 3 Jan 2010 | 12:07 am

చిత్ర పరిశ్రమపై రోశయ్య వ్యాఖ్యలు కరక్టే: చిరంజీవి

తెలుగు చిత్ర పరిశ్రమపై ముఖ్యమంత్రి కె.రోశయ్య చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం సరైనవేనని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆయన ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రానికి చేరుకున్న చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. గత నెల రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు ఒక్క పరిశ్రమలపైనే కాకుండా చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jan 2010 | 10:55 pm

నేడు విద్యార్థి గర్జన.. ఉస్మానియాల గట్టి భద్రత!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ సంయుక్త కార్యాచరణ కమిటి (జాక్) ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం విద్యార్థి గర్జన జరుగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభను నిర్వహించుకునేందుకు హైకోర్టు సింగిల్ జడ్జి షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. దీంతో జేఏసీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jan 2010 | 10:31 pm

కేసీఆర్ బ్లాక్‌మెయిలింగ్‌కు తలొగ్గిన పీసీ: ఆర్ఎస్ఎస్

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు బ్లాక్ మెయిలింగ్‌కు కేంద్ర హోం మంత్రి చిదంబరం తలొగ్గారని, ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అభిప్రాయపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర విభజన అంశంపై కేంద్రం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని పరివార్ తన అధికార పత్రికలో పేర్కొంది.
Source: జాతీయ | 2 Jan 2010 | 9:56 pm

నేటినుంచి తిరువనంతపురంలో 97వ సైన్స్ కాంగ్రెస్

97వ భారత సైన్స్ కాంగ్రెస్ ఆదివారం తిరువనంతపురంలో ప్రారంభం కానుంది. కేరళ విశ్వవిద్యాలయంలోని కారియవట్టోం క్యాంపస్‌లో జరుగనున్న ఈ సదస్సును దేశ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ భారీ భద్రత నడుమ ప్రారంభించనున్నారు. ఐదు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు దాదాపు ఏడువేల మంది శాస్త్రవేత్తలు హాజరు కానున్నారు.
Source: జాతీయ | 2 Jan 2010 | 8:57 pm

జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రవాడు కాదు.. మా తెలంగాణావాడే!!

జూనియర్ ఎన్టీఆర్ మావాడేనని కొత్తగా ఏర్పాటైన తెలంగాణా సినీ సంఘం అంటోంది. ఎన్టీఆర్ సినిమాలపై దాడులు జరిగి, దాదాపు మూడు కోట్ల రూపాయల మేర నిర్మాత చమురు వదుల్చుకున్నాక వారంతా మాట మార్చారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షులు సీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ... గత కొద్ది రోజులుగా చలనచిత్ర రంగంపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ... అవి ఏర్పడటానికి గల కారణాలను తెలియజేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jan 2010 | 1:22 pm

రవితేజ "శంభో శివశంభో" ఆడియో విడుదల

రవితేజ, శివబాలాజీ, అల్లరి నరేష్ నటిస్తున్న శంభో శివశంభో ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది. శనివారం జరిగిన కార్యక్రమంలో నటుడు గోపీచంద్ ఆడియో కేసెట్‌ను, సీడీని ఆవిష్కరించారు. పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయిగణేష్ ప్రొడక్షన్స్‌పై బెల్లంకొండ సురేష్, సాయిశ్రీనివాస్, గణేష్ బాబు నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jan 2010 | 11:48 am

వైఎస్ మరణం వెనుక తెలంగాణ శక్తులు: రఘువీరా!

ప్రజల మనిషి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి దుర్మరణం వెనుక తెలంగాణ శక్తుల హస్తం ఉందా అనే అనుమానం ఇపుడు కలుగుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర హోం మంత్రి పి.చిదంబరంతో భేటీ కానున్నట్టు ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jan 2010 | 6:32 am

మోహన్ బాబు మాటలకు ఎవరికైనా మండుతుంది: దాసరి

అనవసరంగా ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు భయపడిపోయి కోట్ల రూపాయల్లో చేతి చమురు వదులుకున్నారని దాసరి నారాయణరావు తన సన్నిహితులతో అన్నారు. గత కొద్దికాలంగా ఇండస్ట్రీపై జరుగుతున్న దాడుల గురించి పలువురు రకరకాలుగా స్పందిస్తున్నా ఇండస్ట్రీ పెద్దగా మీరు స్పందిస్తే బాగుండేది అని కొంతమంది అడిగినప్పుడు ఆయన సన్నిహితుల వద్ద ఇలా అన్నారు.ఏదైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాలి. వాస్తవం ఏమిటో తెలియకుండా ఎవరిష్టం వచ్చినట్లు వారు ఉద్యమకారులను నిందించడం సమంజసం కాదని పేర్కొన్నారు. అల్లు అరవింద్ కార్యాలయాన్ని ఆక్రమించి తెలంగాణా భవన్‌గా మార్చడం వెనుక వేరే కథ ఉందన్నారు. సదరు వ్యక్తి నుంచి అరవింద్ 5 కోట్ల రూపాయలు వసూలు చేసి అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందునే అది జరిగిందన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jan 2010 | 5:34 am

ఛోటా రాజన్ విందు పార్టీ: ముంబై ఏసీపీపై సస్పెన్షన్!

మాఫియా డాన్ ఛోటా రాజన్ గ్యాంగ్ ఇచ్చిన క్రిస్మస్ విందు పార్టీకి హాజరై చిందులు వేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబై మహానగర్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ప్రకాష్ వాణీపై ముంబై నగర పోలీసు యంత్రాగం వేటు వేసింది. అలాగే, మరో ఐపీఎస్ అధికారితో పాటు.. ముగ్గురు సీనియర్ ఇన్‌స్పెక్టర్లు కూడా సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.
Source: జాతీయ | 2 Jan 2010 | 5:27 am

"బురిడి" తెగ నవ్వించేస్తాడు

ఆర్యన్ రాజేష్, ఐశ్వర్య ( నూతన నటి) కాంబినేషన్‌లో ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహిస్తున్న బురిడి తెగ నవ్వించేస్తాడు చిత్రం నూతన సంవత్సరంనాడు ప్రారంభమైంది. బిగ్ బి ప్రొడక్షన్స్ పతాకంపై ఈదర శ్రీనివాస్, ఈడ్పుగంటి సుబ్రహ్మేణ్యేశ్వరరావు నిర్మిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని రాక్ కాజల్ హోటల్‌లో ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమం ప్రారంభమైంది. నిర్మాతలిద్దరూ క్లాప్, స్విచ్చాన్ చేశారు.దర్శకుడు మాట్లాడుతూ... మంచి సబ్జెక్ట్. రెండున్నర గంటలపాటు నాన్‌స్టాప్‌గా నవ్విస్తుంది. ఇంతకుముందు ఎమోషన్, సెంటిమెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడిని. కానీ ఈ సినిమా మాత్రం పూర్తిస్థాయి కామెడీగా రూపొందిస్తున్నాం. ఇది నా యాభవ సినిమా. ఐదు నెలలు కష్టపడి ఈ కథను తయారు చేశాము. ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయి. నెలాఖరుతో హైదరాబాద్, ఫిలింసిటీలో జరిగే షెడ్యూలుతో తొలి షెడ్యూల్ పూర్తవుతుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Jan 2010 | 5:07 am

యూపీలో మూడు ప్రమాదాలు: 10 మంది మృతులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రైళ్ల ప్రమాదాలకు కేంద్రంగా మారుతోంది. శనివారం ఒక్కరోజే మూడు రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య పదికి చేరుకుంది. మరో 15 మంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.
Source: జాతీయ | 2 Jan 2010 | 4:33 am

5వ తేదీన సీమాంధ్రలో బ్లాక్‌ డే: సీమాంధ్ర జేఏసీ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై చర్చలు జరుపతలపెట్టిన జనవరి ఐదో తేదీన రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో బ్లాక్‌డేను పాటించాలని సీమాంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్) తీర్మానించింది. విజయవాడ కేంద్రంగా బెజవాడ బెంజ్ సర్కిల్‌లో శనివారం 13 జిల్లాలకు చెందిన అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jan 2010 | 3:41 am

విభజన జరిగితే రాష్ట్రం అగ్నిగుండమే: యనమల

ప్రత్యేక తెలంగాణ అంశాన్ని అడ్డుపెట్టుకుని విభజన జరిగితే మాత్రం రాష్ట్రం అగ్నిగుండమవుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు హెచ్చరించారు. ఈనెల ఐదో తేదీన ఢిల్లీలో ఎనిమిది పార్టీల నుంచి అభిప్రాయసేకరణకు కేంద్ర మంత్రి చిదంబరం చేసిన ప్రకటన తెలంగాణకు అనుకూలంగా ఉందని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 2 Jan 2010 | 3:09 am

విజయవాడ పోలీసులపై సస్పెన్షన్ ఎత్తివేత!

విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అదృశ్యమైన వ్యవహారంలో సస్పెన్షన్ వేటుకు గురైన బెజవాడ పోలీసు కమిషనర్ రాజేంద్రనాథ్ రెడ్డి, నలుగురు పోలీసు అధికారులపై ఉన్న సస్పెన్షన్‌ను ప్రభుత్వం శనివారం ఎత్తివేసింది.
Source: ఏపీ న్యూస్ | 2 Jan 2010 | 2:55 am

ఛోటా రాజన్ విందు పార్టీ: హాజరైన ముంబై ఏసీపీ!

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఛోటా రాజన్ ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందు పార్టీకి ముంబై మహానగర పోలీసు కమిషనర్లు పలువురు హాజరైనట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆ రాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ స్పందించారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను సేకరించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.
Source: జాతీయ | 2 Jan 2010 | 2:25 am