|
పాక్ వాయువ్య ప్రాంతంలో పేలుళ్ళు : ఐదుగురి మృతిపాకిస్థాన్లోని వాయువ్యప్రాంతంలోని బజౌర్ గిరిజన ప్రాంతంలో శుక్రవారం రోడ్డుపక్కన బాంబు పేలడంతో అటుగా వెళుతున్న వాహనంలోని ప్రయాణీకులు ఐదుగురు మృతి చెందారు.Source: Yahoo! Telugu: News | 1 Jan 2010 | 8:35 am అందరికీ శుభం జరగాలి: ముఖ్యమంత్రి రోశయ్యనూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం ముఖ్యమంత్రి రోశయ్య రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గడచిన ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విపత్కర పరిణామాలు చోటుచేసుకున్నాయని, వాటిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ దుర్మణం చెందడం తనలాంటివారికి కలసివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 1 Jan 2010 | 8:05 am అమెరికాతో సత్సంబంధాలు కొనసాగిస్తాం: ఉత్తర కొరియానూతన సంవత్సరం సందర్భంగా అమెరికాతో తమ దేశం సత్సంబంధాలను కొనసాగించేందుకు చివరిదాకా ప్రయత్నిస్తుందని ఉత్తర కొరియా ప్రభుత్వం నూతన సంవత్సరం సందర్భంగా తన సందేశాన్ని తెలిపింది.Source: Yahoo! Telugu: News | 1 Jan 2010 | 6:29 am సమైక్యాంధ్ర కోసం యాత్ర చేపట్టనున్న చిరుసమైక్యాంధ్రకు పాటుపడాలని, సమైక్యాంధ్ర వలన కలిగే లాభాల గురించి రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి జిల్లాల యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. సమైక్యాంధ్ర నినాదంపై ఆయన తన వాణిని వినిపించడం, ప్రజల మద్దతు కూడగట్టుకునే నేపథ్యంలో భాగంగా ఈ యాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.Source: Yahoo! Telugu: News | 1 Jan 2010 | 6:14 am డిసెంబరులో అమ్మకాలు పెంచుకున్న మారుతిప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికాంతంలోని డిసెంబరు నెలలో తమ సంస్థకు చెందిన కార్ల అమ్మకాలు దాదాపు 50.6 శాతం వృద్ధి జరిగి 84,804 వాహనాలు అమ్ముడైనట్లు మారుతి సుజుకి సంస్థ శుక్రవారం వెల్లడించింది. అదే డిసెంబరు 2008లో జరిగిన కార్ల అమ్మకాలు 56,293 వాహనాలు అమ్ముడైనట్లు కంపెనీ తెలిపిందిSource: Yahoo! Telugu: News | 1 Jan 2010 | 5:59 am డార్జిలింగ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిప్రత్యేక గూర్ఖాల్యాండ్ కోరుతూ ఉద్యమం చేపట్టిన గూర్ఖా జనముక్తి మోర్చా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆందోళనను ముమ్మరం చేసింది. దీంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.Source: Yahoo! Telugu: News | 1 Jan 2010 | 5:34 am కోమటిరెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన సిఎంరాష్ట్ర సాంకేతిక వ్యవహారాల శాఖ(ఐటి) మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం తనపై చేసిన పలు ఆరోపణలకు స్పందించి ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.Source: Yahoo! Telugu: News | 1 Jan 2010 | 5:10 am హైబ్రీడ్ వాహనాన్ని ప్రవేశపెట్టనున్న టివిఎస్ద్విచక్ర వాహన నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న టివిఎస్ మోటార్స్ కంపెనీ ఢిల్లీ జనవరి 5న జరిగే ఆటో ఎక్స్‌పోలో ఆ సంస్థకు చెందిన పలు వాహనాలను ప్రదర్శనకు ఉంచనుంది. ఇందులో భాగంగా హైబ్రీడ్ వాహనాన్ని ప్రవేశపెట్టనుంది.Source: Yahoo! Telugu: News | 1 Jan 2010 | 4:49 am రూ. 175 కోట్ల ఆర్డరు పొందిన రాంకీతమ సంస్థకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలో రూ. 175 కోట్ల విలువైన పలు ఆర్డర్లు వచ్చాయని రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. తమకు అందిన కాంట్రాక్టులో భాగంగా మౌలిక సదుపాయాల నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు గాను పలు ఆర్డర్లు లభించాయని సంస్థ తెలిపింది.Source: Yahoo! Telugu: News | 1 Jan 2010 | 4:28 am ప్రత్యేక ఆంధ్రలో తెలంగాణ అంశం లేదు: వసంతమద్రాసు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు భాషా ప్రాతిపాదికన తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన అమరజీవి పొట్టి శ్రీరాములు కోరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ అంశం లేదని రాష్ట్ర ఆప్కాబ్ మాజీ ఛైర్మెన్ అభిప్రాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 1 Jan 2010 | 4:06 am అందరికీ శుభం జరగాలి: ముఖ్యమంత్రి రోశయ్యనూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం ముఖ్యమంత్రి రోశయ్య రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గడచిన ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విపత్కర పరిణామాలు చోటుచేసుకున్నాయని, వాటిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ దుర్మణం చెందడం తనలాంటివారికి కలసివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 1 Jan 2010 | 2:35 am సమైక్యాంధ్ర కోసం యాత్ర చేపట్టనున్న చిరుసమైక్యాంధ్రకు పాటుపడాలని, సమైక్యాంధ్ర వలన కలిగే లాభాల గురించి రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి జిల్లాల యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. సమైక్యాంధ్ర నినాదంపై ఆయన తన వాణిని వినిపించడం, ప్రజల మద్దతు కూడగట్టుకునే నేపథ్యంలో భాగంగా ఈ యాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.Source: ఏపీ న్యూస్ | 1 Jan 2010 | 12:45 am డార్జిలింగ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిప్రత్యేక గూర్ఖాల్యాండ్ కోరుతూ ఉద్యమం చేపట్టిన గూర్ఖా జనముక్తి మోర్చా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆందోళనను ముమ్మరం చేసింది. దీంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.Source: జాతీయ | 1 Jan 2010 | 12:05 am కోమటిరెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన సిఎంరాష్ట్ర సాంకేతిక వ్యవహారాల శాఖ(ఐటి) మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం తనపై చేసిన పలు ఆరోపణలకు స్పందించి ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.Source: ఏపీ న్యూస్ | 31 Dec 2009 | 11:41 pm ప్రత్యేక ఆంధ్రలో తెలంగాణ అంశం లేదు: వసంతమద్రాసు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు భాషా ప్రాతిపాదికన తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన అమరజీవి పొట్టి శ్రీరాములు కోరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ అంశం లేదని రాష్ట్ర ఆప్కాబ్ మాజీ ఛైర్మెన్ అభిప్రాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 31 Dec 2009 | 10:38 pm రుచికా కేసులో నిందితునికి బెయిలు నిరాకరించిన కోర్టురుచికా గిర్హోత్రా అత్యాచారం కేసులో నిందితుడు హర్యానా మాజీ డిజిపి ఎస్‌పిఎస్ రాథోడ్‌కు ముందస్తు బెయిల్‌కోసం ఆతని భార్య అభా రాథోడ్ దరఖాస్తు చేసిన అభ్యర్థనను జిల్లా, సెషన్స్ కోర్టు తిరస్కరించింది.Source: జాతీయ | 31 Dec 2009 | 10:14 pm దేశ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి: రాష్ట్రపతినూతన సంవత్సరం (2010)లో దేశంలోని ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రపతి ప్రతిభాదేవీ సింగ్ పాటిల్ దేశప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారుSource: జాతీయ | 31 Dec 2009 | 9:17 pm నక్సల్స్ చర్యలు పిరికిపందలు చేసే పని : మమతదేశంలో నక్సల్స్ ప్రభుత్వ ఆస్తులు, అమాయక ప్రజలపై దాడులు చేయడాన్ని పిరికి పందల చర్యగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అభివర్ణించారు.Source: జాతీయ | 31 Dec 2009 | 9:01 pm సిడ్నీలో రామ్‌చరణ్, జెనీలియాల కొత్త చిత్రం!ప్రతిష్టాత్మక అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.7గా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ హీరోగా, జెనీలియా, షాజన్ పదంసి హీరోయిన్లుగా రూపొందిస్తున్న మెగా మూవీ ఫిబ్రవరి మొదటి వారం నుంచి సిడ్నీలో షూటింగ్ జరుపుకోనుంది. కె. వెంకట్రావు సమర్పణలో మెగాబ్రదర్ నాగేంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి "బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర విశేషాలను నిర్మాత నాగేంద్రబాబు తెలియజేస్తూ.. "తొలి షెడ్యూల్ ముంబైలో డిసెంబర్ 11 నుంచి 20వరకు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించాం. ఫిబ్రవరి మొదటివారం నుంచి సిడ్నీలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోందన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 31 Dec 2009 | 11:59 am క్రేజీస్టార్ "రవితేజ" హీరోగా టాలీ టు హాలీ క్రేజీ చిత్రం!"కిక్" హీరో, క్రేజీ స్టార్ రవితేజ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ టాలీ టు హాలీ ఫిలింస్ ఓ భారీ క్రేజీ చిత్రాన్ని కొత్త సంవత్సరంలో నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం అద్భుతమైన సబ్జెక్ట్ రెడీ అయ్యింది. రవితేజ కెరీర్‌లో మరో డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా భారీ ఎత్తున నిర్మాణమయ్యే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 31 Dec 2009 | 11:39 am రాజా, సంచిత పడుకునే జోడీగా ప్రేమకథా చిత్రం!రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఎన్నారై యువకుని ప్రేమకథతో జయకృష్ణ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. రాజా, సంచిత పడుకునే (తొలి పరిచయం) జంటగా నటించే ఈ చిత్రానికి శ్రీనివాస బల్లపురం దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 18న హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత సి. గోపాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో టాకీ చిత్రీకరణ జరిపి పాటలను విదేశాల్లో చిత్రీకరిస్తామని ఆయన చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 31 Dec 2009 | 11:26 am ఎన్టీఆర్ చేతుల మీదుగా "అదుర్స్" క్యాలెండర్ ఆవిష్కరణనందమూరి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా, సెన్సేషనల్ డైరక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) సమర్పణలో వల్లభనేని నిర్మించిన భారీ చిత్రం "అదుర్స్" సంక్రాంతి కానుకగా జనవరి రెండో వారంలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. "అదుర్స్" విడుదల సందర్భంగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ అభిమానుల కోసం రూపొందించిన "అదుర్స్" న్యూ-ఇయర్ క్యాలెండర్ లాంఛనంగా విడుదలైంది.Source: Yahoo! Telugu: Entertainment | 31 Dec 2009 | 11:14 am సంక్రాంతి కానుకగా వెంకీ, త్రిషల "నమో వెంకటేశ"!విక్టరీ వెంకటేష్, హ్యాట్రిక్ డైరక్టర్ శ్రీనువైట్లల తొలి కాంబినేషన్‌లో వస్తోన్న "నమో వెంకటేశ" చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇంట్లో ఇల్లాలు-వంటిట్లో ప్రియురాలు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సూపర్ చిత్రాల్లో అద్భుతమైన కామెడీ చేసిన విక్టరీ వెంకటేష్ వెంకీ, ఢీ, రెడీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో సూపర్ కామెడీ పండించిన హ్యాట్రిక్ డైరక్టర్, శ్రీనువైట్లతో కలిసి చేస్తున్న "నమో వెంకటేశ" చిత్రం వెంకీ, శ్రీనువైట్ల కెరీర్‌ల్లోను బంపర్ హిట్ అవుతుందని యూనిట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి "నమో వెంకటేశ" విడుదలవుతున్న సందర్భంగా వెంకీ మాట్లాడుతూ.. "ఇంతకుముందు చేసిన చిత్రాల కంటే "నమో వెంకటేశ" చిత్రంలో చేసిన కామెడీ పీక్ లెవల్‌లో ఉంటుందన్నారు. శ్రీనువైట్లకు కామెడీలో మంచి నైపుణ్యం ఉంది. ఈ సబ్జెక్టులో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు రొమాన్స్, యాక్షన్, సెంటిమెంటి వంటి అన్ని అంశాలు ఉన్నాయి. ఈ సంక్రాంతి సీజన్‌కు ఇది పర్‌ఫెక్ట్ సినిమా అవుతుంది. ప్రొడ్యూసర్ రాము, గోపి, అనిల్ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తీస్తున్నారు. "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" తర్వాత త్రిష కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ప్Source: Yahoo! Telugu: Entertainment | 31 Dec 2009 | 11:08 am రాజధానిలో కనబడని నూతన వత్సర వెలుగులుప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు... భారతదేశంలోని అన్ని నగరాలు నూతన సంవత్సర వేడుకలతో వెలుగులు చిందిస్తున్నాయి. ప్రతి ఏటా ప్రపంచం చూపునే తనవైపు తిప్పుకునే రాష్ట్ర రాజధానిలో మాత్రం నూతన వత్సర శోభ కనబడటం లేదు. ఉత్సవాల సందడి, హంగామా లేనే లేదు.Source: ఏపీ న్యూస్ | 31 Dec 2009 | 7:36 am మీ బాంచన్ కాదు... మీ పీక నొక్కుతాంఆంధ్రకు చెందిన మీడియా తట్టాబుట్టా సర్దుకుని తక్షణమే వెళ్లిపోవాలని తెలంగాణాకు చెందిన నిర్మాత ఒకరు హెచ్చరించారు. ఆ పిదప కోపంతో ఊగిపోతూ.. ఐ న్యూస్ మీడియాకు చెందిన కెమేరాను ఎత్తి కిందపడేసి ముక్కలు చేశారు. ఈ పరిణామంతో సినీ పాత్రికేయులు నివ్వెరపోయారు. మీడియా సమావేశానికి పిలిచి ఇలా దాడి చేయడం భావ్యం కాదని నిరసన తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 31 Dec 2009 | 6:48 am విడుదలకు సిద్ధమైన సింధు మీనన్ "సుభద్ర"నూతన నిర్మాత శ్రీకాంత్‌గౌడ్, ప్రముఖ దర్శకుడు రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "సుభద్ర". శ్రీకాంత్ టాకీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని రీ-రికార్డింగ్ జరుపుకుంటోంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించి డీటీఎస్, మిక్సింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ గౌడ్ సినిమా గురించి చెబుతూ.. నవ్యతను కోరుకునే ఈతరం ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా అన్ని సంగతులు ఇందులో ఉన్నాయన్నారు. దర్శకుడు రాజావన్నెంరెడ్డి ఇంతవరకు తను తీర్దిదిద్దిన చిత్రాలకంటే దీనికోసం ఎంతగానో శ్రమించి యూత్ థ్రిల్లర్‌గా రూపొందించారని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 31 Dec 2009 | 6:15 am ఆంధ్ర అనే అబ్బాయితో తెలంగాణా అనే అమ్మాయి కలిసుండలేదుతెలంగాణా సాధనే ధ్యేయంగా ఆ ప్రాంతాల్లో పలు రకాలైన విధానాలను అవలంభిస్తున్నారు. తెలంగాణాను కాంక్షించే ఉద్యమకారులు కొందరు "ఆంధ్ర అనే అబ్బాయితో అమాయక తెలంగాణా అనే అమ్మాయి కలిసి కాపురం చేయలేదనే టైటిల్‌తో పుస్తకాలను ముద్రించి ప్రజలకు పంచుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 31 Dec 2009 | 5:44 am దయచేసి తెలుగు గడ్డను ముక్కలు చేయొద్దు: లగడపాటికేంద్ర మంత్రి చిదంబరం పార్టీలను చర్చలకు ఆహ్వానించడాన్ని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తప్పుపట్టారు. ఒకవేళ కొన్ని ఓడిపోయిన పార్టీలు చెప్పిన మాటను అనుసరించి కేంద్రం నిర్ణయం తీసుకుంటే అది ప్రజాస్వామ్యమైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 31 Dec 2009 | 5:38 am మాట మార్చం... ఐతే చర్చలతోనే సాధ్యం: చిదంబరంకేంద్ర ప్రభుత్వం తెలంగాణా అంశంపై తాను ఇచ్చిన హామీకే కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి చిదంబరం గురువారం విలేకరుల సమావేశంలో చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తడం వల్ల తాము రెండోసారి ప్రకటన చేయాల్సి వచ్చిందన్నారు.Source: జాతీయ | 31 Dec 2009 | 3:48 am బాబుకి దమ్ము, ధైర్యం ఉంటే ఇంట్లో దాక్కోడు: మంత్రి కన్నాతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి దమ్ము, ధైర్యం లేవని రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. దమ్ము, ధైర్యముంటే చంద్రబాబు ఇంట్లో దాక్కోడని కన్నా ధ్వజమెత్తారు. కేంద్ర హోంమంత్రి చిదంబరం జనవరి ఐదోతేదీన నిర్వహించనున్న అఖిలపక్షసమావేశంలో కాంగ్రెస్సే ముందుగా స్పందించాలన్న చంద్రబాబు వాదన "ఆడలేక మద్దెల ఓడు" అన్న చందంగా ఉందని కన్నా అన్నారు.Source: ఏపీ న్యూస్ | 31 Dec 2009 | 3:29 am రోశయ్య కేవలం ఆంధ్రప్రాంతానికే ముఖ్యమంత్రా: కోమటిరెడ్డిఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కొణజేటి రోశయ్య కేవలం ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే తాను ముఖ్యమంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోశయ్యపై మండిపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 31 Dec 2009 | 3:27 am మేం ఉపసంహరించుకోం: కోమటిరెడ్డి, శ్రీధర్తెలంగాణాపై చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం 8 పార్టీలకు ఆహ్వానం పంపిన దరిమిలా... తాము తమ మంత్రి పదవులకు ఇచ్చిన రాజీనామాలను ఉపసంహరించుకున్నట్లు తెలంగాణా మంత్రులు ప్రకటించారు. అయితే కోమటి రెడ్డి, శ్రీధర్ బాబులు మాత్రం తాము రాజీనామాలను ఉపసంహరించుకునేది లేదని భీష్మించుక కూచున్నారు.Source: ఏపీ న్యూస్ | 31 Dec 2009 | 2:43 am
|