|
రోశయ్య కేవలం ఆంధ్రప్రాంతానికే ముఖ్యమంత్రా: కోమటిరెడ్డిఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కొణజేటి రోశయ్య కేవలం ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే తాను ముఖ్యమంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోశయ్యపై మండిపడ్డారు.Source: Yahoo! Telugu: News | 31 Dec 2009 | 8:47 am 250 కోట్ల నష్టాలను చవిచూసిన నక్షత్ర హోటళ్ళురాష్టంలో గత నెల రోజులుగా ప్రత్యేక తెలంగాణ కోసం కొనసాగుతున్న పోరు కారణంగా రాష్ట్ర హోటళ్ళ పరిశ్రమ దాదాపు రూ.250 కోట్ల మేరకు నష్టాలను చవి చూసిందని ఆంధ్రప్రదేశ్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది.Source: Yahoo! Telugu: News | 31 Dec 2009 | 8:27 am భారీ లాభాల దిశగా బాంబే స్టాక్ ఎక్చేంజ్గురువారంతో ముగిసే ఈ వారాంతం బాంబే స్టాక్ ఎక్చేంజ్‌కు ఆశాజనకంగా మారింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాల్లో కొనసాగుతోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 109 పాయింట్లు బలపడి, 17,453 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 23 పాయింట్లు వృద్ధి చెంది, 5,192 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 31 Dec 2009 | 8:14 am మేం ఉపసంహరించుకోం: కోమటిరెడ్డి, శ్రీధర్తెలంగాణాపై చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం 8 పార్టీలకు ఆహ్వానం పంపిన దరిమిలా... తాము తమ మంత్రి పదవులకు ఇచ్చిన రాజీనామాలను ఉపసంహరించుకున్నట్లు తెలంగాణా మంత్రులు ప్రకటించారు. అయితే కోమటి రెడ్డి, శ్రీధర్ బాబులు మాత్రం తాము రాజీనామాలను ఉపసంహరించుకునేది లేదని భీష్మించుక కూచున్నారు.Source: Yahoo! Telugu: News | 31 Dec 2009 | 8:12 am తెలంగాణ ఉద్యమంతో నక్షత్ర హోటళ్ళు ఖాళీప్రతి ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు రాజధాని హైదరాబాద్‌లోని పలు నక్షత్ర హోటళ్ళతోపాటు పలు రిసార్ట్‌లలో, వివిధ ప్రాంతాలలో అత్యంత ఆర్భాటంగా వేడుకలు నిర్వహించుకుంటుంటారు. కానీ తాజాగా తలెత్తిన తెలంగాణ ఉద్యమంతో నగరంలోని చాలామంది కుటంబ సభ్యులు రేపు రానున్న నూతన సంవత్సరం 2010కి స్వాగతం పలకడం కోసం ఎక్కడా పార్టీలకు వెళ్ళడానికి ఇష్టపడటం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.Source: Yahoo! Telugu: News | 31 Dec 2009 | 8:07 am సోనియా మేడమ్.. థ్యాంక్స్..!: జూపల్లి కృష్ణారావుతెలంగాణ ప్రక్రియను ప్రారంభించే దిశగా యూపీఏ ప్రభుత్వం ముందడుగు వేసినందుకుగానూ కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీకి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై చర్చించేందుకు జనవరి ఐదో తేదీన హస్తినకు రావాల్సిందిగా ఎనిమిది పార్టీలకు కేంద్రం పిలుపు నివ్వడంపై జూపల్లి హర్షం వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 31 Dec 2009 | 7:55 am ఆసియా మార్కెట్ ప్రభావం: ఆశాజనకంగా సెన్సెక్స్ఆసియా, యూరప్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 148 పాయింట్లు వృద్ధి చెంది, 17,492 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 42 పాయింట్లు పతనమై, 5,212 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 31 Dec 2009 | 7:33 am పుంజుకున్న కొనుగోళ్లు: లాభాల్లో సెన్సెక్స్గురువారం బాంబే స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలను నమోదు చేసుకుంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 134 పాయింట్లు బలపడి, 17,478 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 37 పాయింట్లు వృద్ధి చెంది, 5,206 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 31 Dec 2009 | 7:18 am మీ బాంచన్ కాదు... మీ పీక నొక్కుతాంఆంధ్రకు చెందిన మీడియా తట్టాబుట్టా సర్దుకుని తక్షణమే వెళ్లిపోవాలని తెలంగాణాకు చెందిన నిర్మాత ఒకరు హెచ్చరించారు. ఆ పిదప కోపంతో ఊగిపోతూ.. ఐ న్యూస్ మీడియాకు చెందిన కెమేరాను ఎత్తి కిందపడేసి ముక్కలు చేశారు. ఈ పరిణామంతో సినీ పాత్రికేయులు నివ్వెరపోయారు. మీడియా సమావేశానికి పిలిచి ఇలా దాడి చేయడం భావ్యం కాదని నిరసన తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 31 Dec 2009 | 6:48 am 19.83 శాతానికి చేరుకున్న ద్రవ్యోల్బణండిసెంబరు 19తో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్బణం 19.83 శాతానికి చేరుకుంది. ఇందులో బంగాళా దుంపలు, పప్పు దినుసుల టోకు ధరలు మరింత పెరిగాయి.Source: Yahoo! Telugu: News | 31 Dec 2009 | 6:47 am ఆఫ్గనిస్థాన్‌లో దాడులు, పలువురి మృతిఆఫ్గనిస్థాన్లో విదేశీ సైనికులపై నానాటికీ దాడులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం జరిగిన వేర్వేరు సంఘటనల్లో భాగంగా అమెరికా గూఢచారి విభాగానికి చెందిన ఏజెన్సీ(సీఐఏ)లోని ఎనిమిది మంది ఏజెంట్లు, నలుగురు కెనడా సైనికులతోపాటు ఓ మహిళా పాత్రికేయురాలు మృతి చెందారు.Source: Yahoo! Telugu: News | 31 Dec 2009 | 6:35 am విడుదలకు సిద్ధమైన సింధు మీనన్ "సుభద్ర"నూతన నిర్మాత శ్రీకాంత్‌గౌడ్, ప్రముఖ దర్శకుడు రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "సుభద్ర". శ్రీకాంత్ టాకీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని రీ-రికార్డింగ్ జరుపుకుంటోంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించి డీటీఎస్, మిక్సింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ గౌడ్ సినిమా గురించి చెబుతూ.. నవ్యతను కోరుకునే ఈతరం ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా అన్ని సంగతులు ఇందులో ఉన్నాయన్నారు. దర్శకుడు రాజావన్నెంరెడ్డి ఇంతవరకు తను తీర్దిదిద్దిన చిత్రాలకంటే దీనికోసం ఎంతగానో శ్రమించి యూత్ థ్రిల్లర్‌గా రూపొందించారని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 31 Dec 2009 | 6:15 am రోశయ్య కేవలం ఆంధ్రప్రాంతానికే ముఖ్యమంత్రా: కోమటిరెడ్డిఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కొణజేటి రోశయ్య కేవలం ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే తాను ముఖ్యమంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోశయ్యపై మండిపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 31 Dec 2009 | 3:27 am మేం ఉపసంహరించుకోం: కోమటిరెడ్డి, శ్రీధర్తెలంగాణాపై చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం 8 పార్టీలకు ఆహ్వానం పంపిన దరిమిలా... తాము తమ మంత్రి పదవులకు ఇచ్చిన రాజీనామాలను ఉపసంహరించుకున్నట్లు తెలంగాణా మంత్రులు ప్రకటించారు. అయితే కోమటి రెడ్డి, శ్రీధర్ బాబులు మాత్రం తాము రాజీనామాలను ఉపసంహరించుకునేది లేదని భీష్మించుక కూచున్నారు.Source: ఏపీ న్యూస్ | 31 Dec 2009 | 2:43 am సోనియా మేడమ్.. థ్యాంక్స్..!: జూపల్లి కృష్ణారావుతెలంగాణ ప్రక్రియను ప్రారంభించే దిశగా యూపీఏ ప్రభుత్వం ముందడుగు వేసినందుకుగానూ కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీకి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై చర్చించేందుకు జనవరి ఐదో తేదీన హస్తినకు రావాల్సిందిగా ఎనిమిది పార్టీలకు కేంద్రం పిలుపు నివ్వడంపై జూపల్లి హర్షం వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 31 Dec 2009 | 2:25 am బీహార్‌లో పాఠశాలలను పేల్చివేసిన మావోయిస్టులుబీహార్ రాష్ట్రంలో ప్రభుత్వానికి చెందిన రెండు పాఠశాలలను గురువారం ఉదయాత్పూర్వం మావోయిస్టులు పేల్చివేశారని ఔరంగాబాద్ జిల్లా సూపరింటెండెంట్ ఎన్‌కే తివారీ మీడియాకు తెలిపారు. మావోయిస్టులు పేల్చేసిన పాఠశాల తమ జిల్లాలోని చాందౌర్ ప్రాంతంలో ఉందని, వారు డైనమైట్లతో పాఠశాల భవనాన్ని పేల్చేశారని ఆయన తెలిపారు.Source: జాతీయ | 31 Dec 2009 | 12:42 am రాజీనామాలు ఉపసంహరించుకున్నాం: గీతారెడ్డికేంద్రం బుధవారం తాజాగా చేసిన ప్రకటన తెలంగాణకు అనుకూలంగా ఉందని భావించి తామందరం తమ మంత్రి పదవులకు చేసిన రాజీనామాలను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి గీతారెడ్డి మీడియాకు వెల్లడించారు. కేంద్రం ఇంత త్వరగా స్పందిస్తుందని తాము అనుకోలేదని, ముఖ్యంగా మొయిలీ, పిసిసి అధ్యక్షులు డిఎస్ చేసిన విజ్ఞప్తి మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 31 Dec 2009 | 12:23 am బీజేపీ "జై ఆంధ్ర" సమావేశానికి సమైక్యవాదుల బ్రేక్!విశాఖపట్నంలో భారతీయ జనతాపార్టీ "జై ఆంధ్ర" సమావేశానికి చుక్కెదురైంది. బీజేపీ ఆధ్వర్యంలో గురువారం జరుగుతున్న "జై ఆంధ్ర" సమావేశానికి సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగి, గేట్లు విరిగిపోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 31 Dec 2009 | 12:14 am తెలంగాణ ఉద్యమాన్ని అవమానిస్తోన్న సీఎం: వెంకటరెడ్డితెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య అవమానిస్తున్నారని ఐటీ శాఖమంత్రి కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఐటీ, సినీ రంగాలు బాగానే ఉన్న సీఎం తీరు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వెంకటరెడ్డి ఆరోపించారు.గురువారం వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణపై ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలయ్యేంత వరకు తమ రాజీనామాలు వెనక్కి తీసుకునేది లేదని కోమటి రెడ్డి స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 30 Dec 2009 | 11:30 pm కేరళలో గ్యాస్ ట్యాంకు పేలి ఇరవైమందికి గాయాలుకేరళలోని కొళ్ళం వద్దనున్న పుత్తనతీరువు వద్ద ఓ గ్యాస్ ట్యాంకరు కారును ఢీకొట్టడంతో పేలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇరవై మందికి పైగా తీవ్ర గాయాలైనారు. వీరిలో ఐదుగురి పరిస్థితి ప్రమాదకరంగా మారింది.Source: జాతీయ | 30 Dec 2009 | 11:24 pm హైదరాబాద్‌లో గవర్నర్ న్యూ-ఇయర్ వేడుకలు!రాష్ట్ర గవర్నర్‌గా కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హైదరాబాద్‌లోనే నూతన సంవత్సర వేడుకలను జరుపుకోనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాజ్‌భవన్‌లో ఆయన ప్రజలు శుభకాంక్షలు తెలియజేయవచ్చునని గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.Source: ఏపీ న్యూస్ | 30 Dec 2009 | 11:19 pm నూతన సంవత్సరానికి పటిష్ట భద్రత: డీజీపీరాష్ట్రంలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేయనున్నట్లు రాష్ట్ర డీజీపీ గిరీష్ కుమార్ తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 30 Dec 2009 | 10:34 pm అరుదైన బ్రహ్మచారి రాహుల్ గాంధీదేశ రాజకీయాల్లో తనదైన ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, యువనేత రాహుల్ గాంధీ దేశంలోనే అత్యంత అర్హుడైన బ్రహ్మచారిగా నిలిచారు.Source: జాతీయ | 30 Dec 2009 | 9:33 pm తెలంగాణ ఇస్తే విదర్భ ఇవ్వండి: విలాస్ ముత్తెంవార్ప్రస్తుతం దేశంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై చర్చలు వాడిగా వేడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి విదర్భ ప్రాంతాన్ని విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి విలాస్ ముత్తెంవార్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు.Source: జాతీయ | 30 Dec 2009 | 8:32 pm నా బాయ్‌ఫ్రెండ్‌ను ముద్దులతో ముంచెత్తుతున్నా: కత్రినాఇటీవల ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఆరోగ్యవంతురాలైన కత్రినా కైఫ్ మానసికోల్లాసంకోసం న్యూయార్క్‌కు వెళ్లింది. అదేంటీ... కత్రినా వెళ్లాల్సింది లండన్ కదా... అనుకుంటున్నారా...? అవును.. నిజానికి సొంత ఊరు లండన్‌కే వెళ్లాల్సి ఉంది. కానీ తన సోదరి కుమారునితో ఆటలాడుకునేందుకు వెళ్లినట్లు చెప్పింది. అయితే ఇది విన్న బాలీవుడ్ జనం మాత్రం కత్రినావన్నీ కాకమ్మ కథలేనంటున్నారు. బాయ్‌ఫ్రెండ్ సల్మాన్‌ఖాన్‌ను పూర్తిగా వదిలేసి కొత్త కుర్రాడి ప్రేమలో పీకల్లోతు కూరుకుపోయిందని వాదిస్తున్నారు. ఇంతకీ ఆ కొత్త కుర్రాడు ఎవరో...? అని ప్రశ్నిస్తే- బాలీవుడ్ యువహీరో రణబీర్ కపూర్ అని చెపుతున్నారు.ఛ.. అటువంటిదేం అయివుండదులే అని అంటే- "ఊరుకోండి.. భలేవారే... ప్రస్తుతం రణబీర్ కపూర్ న్యూయార్క్‌లో సాజిద్ చిత్రం 'అంజానా అంజాని' షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఎలాగూ హీరో అక్కడే ఉన్నాడు కనుక హీరోయిన్ అక్కడకు వెళ్లింద"ని అదో రకమైన నవ్వులు చిందిస్తున్నారు. కత్రినాను ఇదే విషయంపై బాయ్‌ఫ్రెండ్‌తో కాలక్షేపం చేస్తున్నారటగా అని కదిలిస్తే... అవును. బాయ్ ఫ్రెండ్‌తో మహా జోరు చేస్తున్నా.Source: Yahoo! Telugu: Entertainment | 30 Dec 2009 | 11:53 am హీరోయిన్లు దర్శకులకు సహకరించాలి: ప్రియమణిఇటీవల బికినీలతో కుర్రకారుకి కిక్కెక్కించిన సెక్సిణి ప్రియమణి తను బికినీల్లో కనిపించడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది. ఈత కొట్టేందుకు ప్రత్యేకంగా తయారుచేసిన బికినీలో కనబడితే తప్పులేదనీ, ఈత కొట్టేవాళ్లందరూ బికినీలు వేసుకున్నప్పుడు సినిమాలో అటువంటి సన్నివేశాల్లో నటించేటపుడు తను బికినీ వేసుకోవడంలో తప్పేముందని ఎదురు ప్రశ్నలు వేస్తోంది.ఒక సినిమా కథను అనుకున్నప్పుడు దర్శకుడికి తనకంటూ కొన్ని ప్రత్యేకమైన కోణాలు ఉంటాయనీ, పాత్రలను ఎలా చూపెడితే రక్తి కడుతుందన్న దాన్నిబట్టి ఆయన రూపకల్పన చేస్తారనీ పాఠాలు చెపుతోంది.హీరోయిన్ ఈత కొట్టే సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి వచ్చినపుడు హీరోయిన్ బికినీతో ఈత కొట్టినట్లు చూపించాలనుకుంటారు కానీ చీరెలోనో లేదంటే చుడీదార్‌లోనో ఈత కొట్టినట్లు చూపించలేరు కదా అని అంటోంది ప్రియమణి. దర్శకులు ఎలా నటించమని చెప్పినా అలా నటించేదుకు తను సిద్ధంగా ఉంటాను అంటోంది. దర్శకుడు గ్లామర్ పండించాలని అనుకున్నప్పుడు దానికి అందరూ సహకరించాలని ప్రియమణి సలహాలిస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 30 Dec 2009 | 8:38 am తెలంగాణ ఇస్తే హరితప్రదేశ్ ఏర్పాటు చేయాలి: అజిత్ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఏర్పాటు చేస్తే ఉత్తరప్రదేశ్‌లోను హరితప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని అధికార పార్టీ అయిన బీఎస్‌పి, అజిత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై ప్రజామోదానికి కృషి చేస్తున్నాయి.Source: జాతీయ | 30 Dec 2009 | 8:21 am తెలంగాణ అంశంపై ఎనిమిది పార్టీలకు కేంద్రం పిలుపు!తెలంగాణ అంశానికి శాశ్వత పరిష్కార మార్గం కనుగొనే దిశగా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా వచ్చే నెల ఐదో తేదీన ఎనిమిది రాజకీయ పార్టీలతో చర్చలు జరుపనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం రాష్ట్రంలోని ఎనిమిది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను ఢిల్లీకి రావాలని కేంద్ర హోంశాఖ కబురు పంపింది.Source: జాతీయ | 30 Dec 2009 | 6:55 am రాష్ట్రంలో తగ్గిన నేరాలు: డిజిపి గిరీష్ కుమార్రాష్ట్రంలో నిరుడు జరిగిన నేరాలు, దాడులకన్నా ఈ ఏడాది రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ గిరీష్ కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా బంద్‌లు, హింసాత్మక చర్యల కారణంగా సామాన్య ప్రజలు, పెద్ద పెద్ద వ్యాపారస్తులతోపాటు సాధారణ వ్యాపారస్థులు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 30 Dec 2009 | 6:43 am నూతన వత్సర వేడుకలను జరుపవద్దనేందుకు మీరెవరు..?ప్రత్యేక తెలంగాణా సాధనకు శాంతియుత మార్గాలను అన్వేషించాలే తప్ప బంద్‌లతో వేడుకలను జరుపుకోరాదని చెప్పేందుకు మీరెవరని హైదరాబాదులోని అధిక సంఖ్యాకులు ప్రశ్నిస్తున్నారు. పిల్లాపాపలతో హాయిగా గడపాల్సిన ఆనందపు క్షణాలను భగ్నం చేసే హక్కు మీకు ఎవరిచ్చారని అంటున్నారు.Source: ఏపీ న్యూస్ | 30 Dec 2009 | 6:40 am జనవరిలో "యుగానికి ఒక్కడు" ఆడియో!గతంలో విక్టరీ వెంకటేష్ హీరోగా "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని, ఎం.యం. రత్నం తనయుడు రవికృష్ణని హీరోగా పరిచయం చేస్తూ "7/జి బృందావన్ కాలనీ" వంటి మరో సెన్సేషనల్ హిట్ ఫిల్మ్‌ని ప్రేక్షకులకు అందించిన ప్రముఖ దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వాన "యుగానికి ఒక్కడు" అనే మరో సూపర్ హిట్ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఆర్. రవీంద్రన్ సమర్పణలో, డ్రీమ్ వేలీ కార్పొరేషన్ పతాకంపైన ఈ భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ తమిళ కథానాయకుడు సూర్య సోదరుడైన కార్తీ శివకుమార్ ఇందులో హీరోగా నటించగా రీమాసేన్, ఆండ్రియా జెరోమియా కథానాయికలుగా నటించారు. షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకుగాను సర్వసన్నాహాల్ని జరుపుతున్నామని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Dec 2009 | 5:05 am సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్, నయనల "అదుర్స్"యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా సెన్సేషనల్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం "అదుర్స్". వైష్ణవి ఆర్ట్స్ (ప్రై) లిమిటెడ్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి రెండో వారంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ.. ఎన్టీఆర్, వినాయక్ కాంబినేషన్‌లో రూపొందిన మరో సెన్సేషనల్ మూవీ "అదుర్స్" అన్నారు. "సాంబ" తర్వాత తమ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం హై టెక్నికల్ వాల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించామని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Dec 2009 | 4:37 am కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా కేజీ.భూపయ్య ఎన్నిక!కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ సభాపతిగా అధికార భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన ఎమ్మెల్సీ కేజీ.భూపయ్య ఎన్నికయ్యారు. ప్రధాన ప్రతిపక్షం వ్యక్తం చేసిన అభ్యంతరాలను తోసిరాజని భూపయ్యను స్పీకర్‌గా ఎన్నికయ్యారు. కొత్త స్పీకర్ ఎన్నికల్లో కర్ణాటక అసెంబ్లీలో ఎన్నడూ చూడని దృశ్యాలను చూడాల్సి వచ్చింది.Source: జాతీయ | 30 Dec 2009 | 3:57 am
|