నష్టాలతో కొనసాగుతోన్న విదేశీ మార్కెట్లు

బుధవారం స్టాక్ మార్కెట్లకు బ్లాక్ డేగా పరిణమించింది. యూరప్, ఆసియా, అమెరికా మార్కెట్లు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలతో పయనించిన యూరప్ మార్కెట్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో తిరిగి నష్టాల్లో కూరుకుపోయింది.దేశీయ బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 58 పాయింట్ల నష్టంతో, 17,342 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 19 పాయింట్లు కోల్పోయి, 5,168 మార్కు వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది.
Source: Yahoo! Telugu: News | 30 Dec 2009 | 8:41 am

హీరోయిన్లు దర్శకులకు సహకరించాలి: ప్రియమణి

ఇటీవల బికినీలతో కుర్రకారుకి కిక్కెక్కించిన సెక్సిణి ప్రియమణి తను బికినీల్లో కనిపించడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది. ఈత కొట్టేందుకు ప్రత్యేకంగా తయారుచేసిన బికినీలో కనబడితే తప్పులేదనీ, ఈత కొట్టేవాళ్లందరూ బికినీలు వేసుకున్నప్పుడు సినిమాలో అటువంటి సన్నివేశాల్లో నటించేటపుడు తను బికినీ వేసుకోవడంలో తప్పేముందని ఎదురు ప్రశ్నలు వేస్తోంది.ఒక సినిమా కథను అనుకున్నప్పుడు దర్శకుడికి తనకంటూ కొన్ని ప్రత్యేకమైన కోణాలు ఉంటాయనీ, పాత్రలను ఎలా చూపెడితే రక్తి కడుతుందన్న దాన్నిబట్టి ఆయన రూపకల్పన చేస్తారనీ పాఠాలు చెపుతోంది.హీరోయిన్ ఈత కొట్టే సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి వచ్చినపుడు హీరోయిన్‌ బికినీతో ఈత కొట్టినట్లు చూపించాలనుకుంటారు కానీ చీరెలోనో లేదంటే చుడీదార్‌లోనో ఈత కొట్టినట్లు చూపించలేరు కదా అని అంటోంది ప్రియమణి. దర్శకులు ఎలా నటించమని చెప్పినా అలా నటించేదుకు తను సిద్ధంగా ఉంటాను అంటోంది. దర్శకుడు గ్లామర్ పండించాలని అనుకున్నప్పుడు దానికి అందరూ సహకరించాలని ప్రియమణి సలహాలిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Dec 2009 | 8:38 am

షూటింగ్‌లు అడ్డుకుంటే తెలంగాణాకే నష్టం: రోశయ్య

తెలుగు చిత్రాల షూటింగ్‌లను అడ్డుకుంటే ఎక్కువగా నష్టపోయేది తెలగాణ వాసులేనని ముఖ్యమంత్రి కె.రోశయ్య పరోక్షంగా హెచ్చరించారు. ఈ సినీ పరిశ్రమ ఏ ఒక్క నటుడికో, నటికో సొంతమైనది కాదన్నారు. ఈ పరిశ్రమ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. వీరిలో 70 నుంచి 80 శాతం మంది వరకు స్థానికులే (తెలంగాణ వాసులే) పని చేస్తున్నారని రోశయ్య గుర్తు చేశారు.
Source: Yahoo! Telugu: News | 30 Dec 2009 | 8:37 am

నష్టాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ పతనం

బాంబే స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాల్లో పయనిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 38 పాయింట్ల మేర నష్టపోయి, 17,362 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 5,174 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 30 Dec 2009 | 8:32 am

వచ్చే ఏడాది వృద్ధి చెందనున్న దేశీయ టైర్ల పరిశ్రమ

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక వ్యవస్థ మెలమెల్లగా కోలుకుంటున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని టైర్ల పరిశ్రమ మరింత వృద్ధి బాటలో పయనించనుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 30 Dec 2009 | 7:42 am

మిశ్రమ ఫలితాల్లో బాంబే స్టాక్ మార్కెట్

బాంబే స్టాక్ మార్కెట్ మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి హెచ్చుతగ్గులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆరు పాయింట్ల స్వల్ప నష్టంతో 17,395 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అయితే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ +0.45 పాయింట్ల కనిష్ట స్థాయిలో 5,178 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది.
Source: Yahoo! Telugu: News | 30 Dec 2009 | 7:21 am

బడ్జెట్‌పై ప్రభావం చూపనున్న 13వ ఆర్థిక నివేదిక: ప్రణబ్

మంగళవారం 13వ ఆర్థిక సంఘం రాష్ట్రపతికి సమర్పించిన నివేదిక ప్రభావం 2010-11 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌పై ప్రభావం చూపిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారం మీడియాకు తెలిపారు
Source: Yahoo! Telugu: News | 30 Dec 2009 | 6:57 am

అమ్మకాల ఒత్తిడి: స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్

అమ్మకాల ఒత్తిడి కారణంగా బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాలను నమోదు చేసుకుంటోంది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో కేవలం ఐదు పాయింట్లు పతనమై, 17,396 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా కేవలం 8 పాయింట్లు క్షీణించి, 5,186 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 30 Dec 2009 | 6:53 am

తెలంగాణ ఉద్యమంలో మావోలు: గవర్నర్ నివేదిక!?

గత నెలరోజులుగా సాగుతున్న ఉద్యమానికి మావోయిస్టుల మద్దతు ఉన్నట్టు కేంద్రం హోంశాఖ, అంతర్గతభద్రతా విభాగాలు అంచనావేశాయి. ఈ రెండు విభాగాల అంచనాలను బలపరిచే విధంగా మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు చేసిన బహిరంగ మద్దతు వ్యాఖ్యలు బలం చేకూర్చి పెట్టాయి.
Source: Yahoo! Telugu: News | 30 Dec 2009 | 6:52 am

"టప్" మంటున్న హైదరాబాద్ రియల్ రంగం

తెలంగాణా ఉద్యమం నేపధ్యంలో మూడు బంద్‌లు.. ఆరు ఆందోళనలతో రగిలిపోతున్న భాగ్యనగరం అభాగ్యనగరం కానుందా...? అసలు నగరం భవిష్యత్ ఎలా ఉండబోతోందీ...? ఒకవేళ విభజన జరిగితే ఎక్కడ కార్యాలయాలు అక్కడే ఉంటాయా...? లేదంటే చాపచుట్టేసుకుని మరో ప్రాంతానికి తరలివెళ్లిపోతాయా...? ఇత్యాది ప్రశ్నలు నేడు నగరంలో షికారు చేస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 30 Dec 2009 | 6:40 am

ఆటో ఎక్స్‌పోలో హైబ్రీడ్ కారును ప్రవేశపెట్టనున్న మారుతి

దేశీయ కార్ల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ రాజధానిలో వచ్చే ఏడాది జరగనున్న ఆటో ఎక్స్‌పోలో హైబ్రీడ్ కారును ప్రవేశపెట్టనుంది. ఈ మోడల్ కారుతోపాటు ఎలక్ట్రిక్ ఎకోను కూడా ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 30 Dec 2009 | 6:28 am

జనవరిలో "యుగానికి ఒక్కడు" ఆడియో!

గతంలో విక్టరీ వెంకటేష్ హీరోగా "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని, ఎం.యం. రత్నం తనయుడు రవికృష్ణని హీరోగా పరిచయం చేస్తూ "7/జి బృందావన్ కాలనీ" వంటి మరో సెన్సేషనల్ హిట్ ఫిల్మ్‌ని ప్రేక్షకులకు అందించిన ప్రముఖ దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వాన "యుగానికి ఒక్కడు" అనే మరో సూపర్ హిట్ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఆర్. రవీంద్రన్ సమర్పణలో, డ్రీమ్ వేలీ కార్పొరేషన్ పతాకంపైన ఈ భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ తమిళ కథానాయకుడు సూర్య సోదరుడైన కార్తీ శివకుమార్ ఇందులో హీరోగా నటించగా రీమాసేన్, ఆండ్రియా జెరోమియా కథానాయికలుగా నటించారు. షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకుగాను సర్వసన్నాహాల్ని జరుపుతున్నామని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Dec 2009 | 5:05 am

సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్, నయనల "అదుర్స్"

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా సెన్సేషనల్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం "అదుర్స్". వైష్ణవి ఆర్ట్స్ (ప్రై) లిమిటెడ్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి రెండో వారంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ.. ఎన్టీఆర్, వినాయక్ కాంబినేషన్‌లో రూపొందిన మరో సెన్సేషనల్ మూవీ "అదుర్స్" అన్నారు. "సాంబ" తర్వాత తమ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం హై టెక్నికల్ వాల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించామని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Dec 2009 | 4:37 am

షూటింగ్‌లు అడ్డుకుంటే తెలంగాణాకే నష్టం: రోశయ్య

తెలుగు చిత్రాల షూటింగ్‌లను అడ్డుకుంటే ఎక్కువగా నష్టపోయేది తెలగాణ వాసులేనని ముఖ్యమంత్రి కె.రోశయ్య పరోక్షంగా హెచ్చరించారు. ఈ సినీ పరిశ్రమ ఏ ఒక్క నటుడికో, నటికో సొంతమైనది కాదన్నారు. ఈ పరిశ్రమ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. వీరిలో 70 నుంచి 80 శాతం మంది వరకు స్థానికులే (తెలంగాణ వాసులే) పని చేస్తున్నారని రోశయ్య గుర్తు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 30 Dec 2009 | 3:08 am

తెలంగాణ ఉద్యమంలో మావోలు: గవర్నర్ నివేదిక!?

గత నెలరోజులుగా సాగుతున్న ఉద్యమానికి మావోయిస్టుల మద్దతు ఉన్నట్టు కేంద్రం హోంశాఖ, అంతర్గతభద్రతా విభాగాలు అంచనావేశాయి. ఈ రెండు విభాగాల అంచనాలను బలపరిచే విధంగా మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు చేసిన బహిరంగ మద్దతు వ్యాఖ్యలు బలం చేకూర్చి పెట్టాయి.
Source: ఏపీ న్యూస్ | 30 Dec 2009 | 1:23 am

రాజధానిలో 'సమైక్య శంఖారావం'కు కసరత్తు!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున సమైక్య శంఖారావం నిర్వహించేందుకు సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా, రాయలసీమ ప్రాంతానికి చెందిన సమైక్యవాది, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జె.సి.దివాకర్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిలు ఇందుకోసం పూర్తి బాధ్యతలను స్వీకరించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 30 Dec 2009 | 12:58 am

భాజపా వ్యవహారాల్లో వారి జోక్యం ఉండదు: సుష్మా

భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో మాసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జోక్యం ఉండదని భాజపా మహిళా సీనియర్ నేత, లోక్‌సభ ప్రతిపక్షనేత సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఆమె ఢిల్లీలో మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపాల ఆమోదం మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్‌ గడ్కారీని ఎన్నుకున్నట్టు తెలిపారు.
Source: జాతీయ | 30 Dec 2009 | 12:46 am

మసకబారుతున్న హైదరాబాద్ ఇమేజ్: సీఎం రోశయ్య

అంతర్జాతీయ ఖ్యాతి గడించిన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇమేజ్‌ మసకబారిపోతోంది. పరిశ్రమ వర్గాలు రాజధాని వైపు చూసేందుకు సైతం ఇష్టపడటం లేదు. కోట్లాది రూపాయల పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్లిపోతున్నాయి. భారత పరిశ్రమల సమాఖ్య వచ్చే నెలలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక సీఐఐ సదస్సు వేదికను తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌కు మార్చే యోచనలో ఉంది.
Source: ఏపీ న్యూస్ | 30 Dec 2009 | 12:01 am

నూతన వత్సర వేడుకలను జరుపవద్దనేందుకు మీరెవరు..?

ప్రత్యేక తెలంగాణా సాధనకు శాంతియుత మార్గాలను అన్వేషించాలే తప్ప బలవంతపు బంద్‌లు, వేడుకలను జరుపుకోరాదని చెప్పేందుకు మీరెవరని హైదరాబాదులోని అధిక సంఖ్యాకులు ప్రశ్నిస్తున్నారు. పిల్లాపాపలతో హాయిగా గడపాల్సిన ఆనందపు క్షణాలను భగ్నం చేసే హక్కు మీకు ఎవరిచ్చారని అంటున్నారు.
Source: ఏపీ న్యూస్ | 29 Dec 2009 | 11:33 pm

వైఎస్ సైతాన్ పోయింది.. తెలంగాణకు అడ్డేలేదు: కాకా

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న వైఎస్ సైతాన్ పోయిందని, ఇకపై మనకు అడ్డేలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.వెంకటస్వామి అన్నారు. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఐదుదశాబ్దాల చిరకాల స్వప్నం నెరవేరే రోజు దగ్గర పడిందని, ఇలాంటి తరుణంలో కొన్ని రాజకీయ పార్టీల చేతుల్లో బంధీలుగా మారరాదని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 29 Dec 2009 | 11:31 pm

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సొరేన్

జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తిమోర్ఛా అధినేత, కేంద్ర మాజీ మంత్రి శిబూ సొరేన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో ఆ రాష్ట్ర గవర్నర్ శంకరనారాయణ ప్రమాణం చేయించారు. కాగా, జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సొరేన్ బాధ్యతలు స్వీకరించడం ఇది ముచ్చటగా మూడోసారి కావడం గమనార్హం.
Source: జాతీయ | 29 Dec 2009 | 11:01 pm

ప్రభుత్వ కూల్చివేతకు తెదేపా కుట్ర: టి.జీవన్ రెడ్డి

రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును కూల్చి వేసేందుకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం ఒక ప్రైవేట్ టీవీ చానల్‌తో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కేంద్రం చేసిన ప్రకటన కారణంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాన్నారు.
Source: ఏపీ న్యూస్ | 29 Dec 2009 | 10:22 pm

తెలంగాణ జిల్లాల్లో కొనసాగుతున్న సంపూర్ణ బంద్!

తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల్లో బుధవారం సంపూర్ణ బంద్ జరుగుతోంది. తెలంగాణ సంయుక్త కార్యాచరణ సమితి (జాక్) ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ జిల్లాల్లో బంద్ పాటిస్తున్న విషయం తెల్సిందే. ఈ బంద్ కారణంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు.. పది తెలంగాణ జిల్లాల్లో పూర్తిగా ప్రజా జీవనం స్తంభించి పోయింది.
Source: ఏపీ న్యూస్ | 29 Dec 2009 | 10:17 pm

ఛత్తీస్‌ఘడ్‌లో ఎన్‌కౌంటర్: ఇద్దరు మావోల మృతి

ఛత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
Source: జాతీయ | 29 Dec 2009 | 8:57 pm

ప్రముఖ కన్నడ నటుడు విష్ణువర్ధన్ మృతి!

ప్రముఖ కన్నడ నటుడు విష్ణువర్ధన్ బుధవారం కన్నుమూశారు. 59 సంవత్సరాల విష్ణువర్ధన్ గుండెపోటుతో మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇప్పటిదాకా 198 సినిమాల్లో నటించిన విష్ణు గాయకుడిగానూ రాణించారు. 1950 సెప్టెంబర్ 18న కర్ణాటకోలని మైసూర్‌లో జన్మించిన విష్ణువర్ధన్.. పుట్టణ్ణ కణగాల్ దర్శకత్వం వహించిన "నాగరహావు" సినిమాతో అరంగేట్రం చేశారు.
Source: జాతీయ | 29 Dec 2009 | 8:49 pm

నర్రా నిబద్ధతగల కళాకారుడు

వ్యాపార లక్షణాలతో విరాజిల్లే సినీ పరిశ్రమలో నర్రా ఒక నిబద్దతగల కళాకారుడిగా తుదిశ్వాస వరకూ బతికారనీ, అటువంటి వ్యక్తిత్వాన్ని అలవర్చింది ప్రజానాట్యమండలేనని ప్రముఖ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి అగ్రజులు తమ్మారెడ్డి కృష్ణమూర్తి పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Dec 2009 | 12:04 pm

అర్ధనగ్నానికి మించిన అవతారంలో కనిపిస్తా: నమిత

నమిత వచ్చే కొత్త సంవత్సరం 2010 నుంచి కొత్త అవతారం ఎత్తుతానంటోంది. ఇప్పటివరకూ కొన్ని సినిమాల్లో అర్థనగ్నమైన సన్నివేశాలలో నటించి విసిగిపోయానని చెపుతోంది. ఈ స్థానంలో తను అర్థనగ్నానికి మించిన కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు ప్రకటించింది. అర్థనగ్నానికి మించిన అవతారం అంటే ఇంకేదో అనుకునేరు... మరేం లేదు.. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలోకి మళ్లబోతున్నట్లు నమిత చెపుతోంది. వీలుదొరికినపుడల్లా గుళ్లూ గోపురాలను సందర్శిస్తానంటోంది. పూర్తి సంప్రాదాయ మహిళగా కాలం గడుపుతానంటోంది. మరీ ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంటే అభిమానులు తట్టుకుంటారో లేదో నమితా... కాస్త ఆలోచించు. అన్నట్లు ఆ మధ్య యూ ట్యూబ్‌లో నమితకు సంబంధించిన ముప్పావు వంతు అర్థనగ్న దృశ్యాలు దర్శనమిచ్చాయనీ, దాంతో నెటిజన్లు ఒహటే ఎగబడ్డారని వార్తలు వచ్చాయి. ఆధ్యాత్మిక అవతారానికి ముందు ఇదేమైనా ఫినిషింగ్ టచ్ ఏమో...!!
Source: Yahoo! Telugu: Entertainment | 29 Dec 2009 | 9:12 am

పొగబెడుతూ శాంతి వచనాలు చెప్పకండి: కేసీఆర్

ముఖ్యమంత్రి రోశయ్య తీయటి మాటలు మాట్లాడుతూ పొగబెడితున్నారని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షడు కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఒకవైపు శాంతి జపం చేస్తూనే మరోవైపు విద్యార్థులపై కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. తక్షణమే విద్యార్థులపై ఉన్న కేసులన్నిటినీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 29 Dec 2009 | 8:04 am

నాలుకలు తెగ్గోసే ధైర్యం హరీష్‌కుందా: సోమిరెడ్డి

తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే సీమాంధ్ర నేతలు, ప్రజలు నాలుకలు తెగ్గోస్తామని తెరాస నేతలు చేస్తున్న రెచ్చగొట్టుడు ప్రకటనలపై తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా తెదేపా కన్వీనర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. తెరాస నేత హరీష్‌రావుకు నాలుకలు తెగ్గోసే దమ్ము, ధైర్యం ఉందా ఆయన ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 29 Dec 2009 | 6:16 am

తెలంగాణపై మరో రెండు రోజుల్లో మరో ప్రకటన

ప్రత్యేక తెలంగాణ అంశంపై మరో రెండు రోజుల్లో ప్రత్యేక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ కోర్ కమిటీ మంగళవారం అర్థగంట పాటు చర్చించారు. ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన ఈఎస్ఎల్.నరసింహన్ అందించిన సమాచారంపై ఇందులో చర్చించినట్టు వినికిడి.
Source: జాతీయ | 29 Dec 2009 | 6:01 am

పాపం తెలంగాణా ప్రేక్షకులు... ప్చ్!!!

అటు తెలంగాణా లొల్లి... ఇటు సమైక్యాంధ్ర గోల. వీటి మధ్య వినోదాన్ని ఆస్వాదించాలనుకుంటున్న ప్రేక్షకులకు... ప్రత్యేకించి తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రేక్షకులకు ఏం తోయడం లేదు. సినిమాకెళ్దామంటే బంద్‌లతో సినిమా హాళ్లు మూతపడి మూలుగుతున్నాయాయె. దాదాపు హీరోలందరూ సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారు కావడంతో తెలంగాణాలో వారి చిత్రాలను చూస్తే ఎక్కడ ఏ ఆకతాయి గడుగ్గాయిలా మారి నానా రభస చేస్తాడోనని తెలంగాణా ప్రేక్షకులు గత నెలరోజులుగా సినిమాలకు దూరమయ్యారంటే నమ్మండి. దీంతో ఏం చేయాలో పాలుపోని తెలంగాణా ప్రేక్షకుడు హాలీవుడ్ నుంచి దిగుమతి అవుతున్న సినిమాలను భారీ హీట్ చేసి పారేస్తున్నాడు. కొందరైతే మన తెలుగు హీరోలు... సారీ!!! సీమాంధ్ర హీరోలు హాలీవుడ్ చిత్రాల్లో తమ ఆనవాళ్లు కనిపించకుండా మాస్క్‌లవంటివి ధరించి చిత్రాలు చేసుకుంటే, కనీసం వాటిని చూసైనా తృప్తి చెందుతామని ఫన్నీ మాటలు చెప్పుకుంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Dec 2009 | 4:38 am

ఒయ్యారం ఒలకబోసే సుందర తీరం "కనపర్తి"

నిత్యం తీరికలేని పనులతో అలసిపోయేవారు వారాంతంలో కాస్తంత ప్రశాంతంగా గడపాలని కోరుకోవటం సహజమే. అలాంటివారు కుటుంబ సమేతంగా.. కాస్తంత విజ్ఞానం, మరికొంత ఆధ్యాత్మికం, బోలెడంత ఆహ్లాదం కలిగించే ప్రదేశానికి వెళ్లాలనే కోరిక కలవారు చూడదగ్గ ప్రదేశమే నాగులుప్పలపాడు మండలంలోని "కనపర్తి". వయ్యారాలు ఒలికించే సముద్ర తీరం.
Source: వినోదం | 29 Dec 2009 | 4:10 am

అర్ధనగ్నానికి మించిన అవతారంలో కనిపిస్తా: నమిత

నమిత వచ్చే కొత్త సంవత్సరం 2010 నుంచి కొత్త అవతారం ఎత్తుతానంటోంది. ఇప్పటివరకూ కొన్ని సినిమాల్లో అర్థనగ్నమైన సన్నివేశాలలో నటించి విసిగిపోయానని చెపుతోంది. ఈ స్థానంలో తను అర్థనగ్నానికి మించిన కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు ప్రకటించింది. అర్థనగ్నానికి మించిన అవతారం అంటే ఇంకేదో అనుకునేరు... మరేం లేదు.. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలోకి మళ్లబోతున్నట్లు నమిత చెపుతోంది.
Source: వినోదం | 29 Dec 2009 | 3:43 am

మరో వివాదంలో చిక్కుకున్న మంత్రి శశిథరూర్!

వీసా నిబంధనలను విదేశాంగ శాఖ మరింత కఠినతరం చేయడంపై విమర్శలు చేసిన కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి శశిథరూర్ మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. ఈ మంత్రి చేసిన వ్యాఖ్యలను స్వయంగా ఆ శాఖ మంత్రి ఎస్ఎం.కృష్ణ తప్పుబట్టారు.
Source: జాతీయ | 29 Dec 2009 | 3:40 am