ఊపందుకున్న ట్రేడింగ్: 17వేల మార్కు వద్ద సెన్సెక్స్ ర్యాలీ

దేశీయ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభదాయకంగా కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఆశాజనకంగా కొనసాగుతోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 17,400 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 5,200 మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 29 Dec 2009 | 7:02 am

గవర్నర్ నరసింహన్ ఓ నరహంతకుడు: మల్లోజుల

రాష్ట్రానికి ఇన్‌ఛార్జ్ గవర్నరుగా నియమితులైన ఐపీఎస్ అధికారి ఈఎస్ఎల్.నరసింహన్ నర హంతకుడని మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ ఆరోపించారు. ఆయన ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌తో ఫోనులో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ముఖ్యమంత్రి రోశయ్యే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు.
Source: Yahoo! Telugu: News | 29 Dec 2009 | 6:49 am

రాజధానిలో వారం రోజుల పాటు 144 సెక్షన్: కమిషనర్

ఈనెల 29వ తేదీ బుధవారం నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర రాజధానిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ప్రసాదరావు వెల్లడించారు. అలాగే, వచ్చే నెల మూడో తేదీన విద్యార్థులు తలపెట్టిన విద్యార్థి మహాగర్జనకు నగర పోలీసులు అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 29 Dec 2009 | 6:29 am

"జై ఆంధ్రా" అంటే పొలిమేరల వరకూ తరిమి కొడతాం

రాష్ట్ర ద్వితీయ రాజధాని నగరంగా పేరుపొందిన విజయవాడ నగరంలో భారతీయ జనతా పార్టీ జై ఆంధ్ర నినాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రజలలోకి తీసుకవెళతామని మీడియా సమావేశంలో చెపుతుండగా "జై సమైక్యాంధ్ర" అంటూ నినాదం చేస్తూ ఓ విద్యార్థిని లోపలికి ప్రవేశించింది. జై ఆంధ్ర అనడాన్ని భాజపా నాయకులు తక్షణం మానుకోవాలని డిమాండ్ చేసింది.
Source: Yahoo! Telugu: News | 29 Dec 2009 | 6:16 am

2010లో టైర్ల కంపెనీల భారీ పెట్టుబడులు

వచ్చే యేడాదిలో టైర్ల కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టే దిశగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. దేశంలో ఆటోమొబైల్ రంగం డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నాయి. ఫలితంగా 2010-11 ఆర్థిక సంవత్సరంలో టైర్ల రంగం 7-8 శాతం మేరకు వృద్ధి సాధించవచ్చని అంచనా వేస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 29 Dec 2009 | 6:14 am

మరికొన్ని మానవబాంబులు వస్తున్నాయి: తీవ్రవాది

అమెరికాపై దాడి చేయాలనే లక్ష్యంతో మరికొంతమంది మానవబాంబులు వస్తున్నారని అల్‌ఖైదా తీవ్రవాద సంస్థకు చెందిన నైజీరియా తీవ్రవాది అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకు వెల్లడించాడు. తనలాగే మరికొంతమంది యువకులు మానవబాంబులుగా మారి అమెరికాకు వస్తున్నారని అమెరికా భద్రతా బలగాలు అరెస్టు చేసిన ఉమర్ ఫరూక్ అబ్దుల్‌ముతాల్లాబ్‌ ఎఫ్‌బీఐ అధికారులతో మాట్లాడారు.
Source: Yahoo! Telugu: News | 29 Dec 2009 | 6:05 am

విదేశీ మార్కెట్ల ప్రభావం: ఆశాజనకంగా సెన్సెక్స్

విదేశీ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ ఆశాజనకంగా కొనసాగుతోంది. మంగళవారం ఆసియా, యూరప్ మార్కెట్లు లాభదాయకంగా కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ కూడా వృద్ధిబాటలో పయనిస్తుంది. దీంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 31 పాయింట్లు వృద్ధి చెంది, 17,391 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 9 పాయింట్ల స్వల్ప లాభంతో 5,187 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీ సాగిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 29 Dec 2009 | 6:01 am

స్వైన్ ఫ్లూ వ్యాధికి మాజీ ఎంపీ కన్నుమూత!

స్వైన్ ఫ్లూ వైరస్ మహమ్మారి బారిన పడిన లోక్‌సభ మాజీ సభ్యుడు కన్నుమూశారు. ఒస్మనాబాద్‌ అరవింద్ తుల్సీరామ్ కాంబ్లేకు స్వైన్ ఫ్లూ సోకడంతో ఆయన పూణెలోని ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ మరణంతో పూణెలో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య 150కు చేరినట్టు వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 29 Dec 2009 | 5:44 am

విజయవాడలో పెరుగుతున్న ఆస్తుల విలువ!

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పుణ్యమాని విజయవాడలో ఆస్తుల విలువ రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత నెల రోజుల కాలంలో ఈ ప్రాతంలో ఆస్తుల విలువ ఇరవై శాతానికి పైగా పెరిగినట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఆస్తుల విలువ దారుణంగా పడిపోతున్నాయి.
Source: Yahoo! Telugu: News | 29 Dec 2009 | 5:29 am

లాభాల్లో కొనసాగుతోన్న బాంబే స్టాక్ మార్కెట్

మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాల్లోనే కొనసాగుతోంది. దీంతో మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 17, 400 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 5,200 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 29 Dec 2009 | 4:54 am

పాపం తెలంగాణా ప్రేక్షకులు... ప్చ్!!!

అటు తెలంగాణా లొల్లి... ఇటు సమైక్యాంధ్ర గోల. వీటి మధ్య వినోదాన్ని ఆస్వాదించాలనుకుంటున్న ప్రేక్షకులకు... ప్రత్యేకించి తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రేక్షకులకు ఏం తోయడం లేదు. సినిమాకెళ్దామంటే బంద్‌లతో సినిమా హాళ్లు మూతపడి మూలుగుతున్నాయాయె. దాదాపు హీరోలందరూ సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారు కావడంతో తెలంగాణాలో వారి చిత్రాలను చూస్తే ఎక్కడ ఏ ఆకతాయి గడుగ్గాయిలా మారి నానా రభస చేస్తాడోనని తెలంగాణా ప్రేక్షకులు గత నెలరోజులుగా సినిమాలకు దూరమయ్యారంటే నమ్మండి. దీంతో ఏం చేయాలో పాలుపోని తెలంగాణా ప్రేక్షకుడు హాలీవుడ్ నుంచి దిగుమతి అవుతున్న సినిమాలను భారీ హీట్ చేసి పారేస్తున్నాడు. కొందరైతే మన తెలుగు హీరోలు... సారీ!!! సీమాంధ్ర హీరోలు హాలీవుడ్ చిత్రాల్లో తమ ఆనవాళ్లు కనిపించకుండా మాస్క్‌లవంటివి ధరించి చిత్రాలు చేసుకుంటే, కనీసం వాటిని చూసైనా తృప్తి చెందుతామని ఫన్నీ మాటలు చెప్పుకుంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Dec 2009 | 4:38 am

గవర్నర్ నరసింహన్ ఓ నరహంతకుడు: మల్లోజుల

రాష్ట్రానికి ఇన్‌ఛార్జ్ గవర్నరుగా నియమితులైన ఐపీఎస్ అధికారి ఈఎస్ఎల్.నరసింహన్ నర హంతకుడని మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ ఆరోపించారు. ఆయన ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌తో ఫోనులో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ముఖ్యమంత్రి రోశయ్యే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 29 Dec 2009 | 1:20 am

రాజధానిలో వారం రోజుల పాటు 144 సెక్షన్: కమిషనర్

ఈనెల 29వ తేదీ బుధవారం నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర రాజధానిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ప్రసాదరావు వెల్లడించారు. అలాగే, వచ్చే నెల మూడో తేదీన విద్యార్థులు తలపెట్టిన విద్యార్థి మహాగర్జనకు నగర పోలీసులు అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 29 Dec 2009 | 12:59 am

"జై ఆంధ్రా" అంటే పొలిమేరల వరకూ తరిమి కొడతాం

రాష్ట్ర ద్వితీయ రాజధాని నగరంగా పేరుపొందిన విజయవాడ నగరంలో భారతీయ జనతా పార్టీ జై ఆంధ్ర నినాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రజలలోకి తీసుకవెళతామని మీడియా సమావేశంలో చెపుతుండగా "జై సమైక్యాంధ్ర" అంటూ నినాదం చేస్తూ ఓ విద్యార్థిని లోపలికి ప్రవేశించింది. జై ఆంధ్ర అనడాన్ని భాజపా నాయకులు తక్షణం మానుకోవాలని డిమాండ్ చేసింది.
Source: ఏపీ న్యూస్ | 29 Dec 2009 | 12:47 am

స్వైన్ ఫ్లూ వ్యాధికి మాజీ ఎంపీ కన్నుమూత!

స్వైన్ ఫ్లూ వైరస్ మహమ్మారి బారిన పడిన లోక్‌సభ మాజీ సభ్యుడు కన్నుమూశారు. ఒస్మనాబాద్‌ అరవింద్ తుల్సీరామ్ కాంబ్లేకు స్వైన్ ఫ్లూ సోకడంతో ఆయన పూణెలోని ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ మరణంతో పూణెలో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య 150కు చేరినట్టు వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 29 Dec 2009 | 12:14 am

దమ్ముంటే నువ్వు ఏయూకి వచ్చి చూడు: హరీశ్‌కు హెచ్చరిక

ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థులు మాత్రం దమ్ముంటే తెరాస నాయకులు తమ యూనివర్శిటీలోకి వచ్చి చూడాలని అన్నారు. కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను చూస్తున్నప్పుడు తమ శరీరంలో రక్తం కుతకుతలాడుతోందనీ, అన్నదమ్ముల్లాంటి ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి వారంతా శతవిధాలా యత్నిస్తున్నారనీ దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 28 Dec 2009 | 11:16 pm

తెలంగాణకు కొమ్ముకాస్తున్న చంద్రబాబు: నన్నపనేని

తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పూర్తిగా తెలంగాణకు అనుకూలంగా కొమ్ముకాస్తున్నారని అందుకే పార్టీ కార్యాలయానికి, కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు తెలుగుదేశం పార్టీ మహిళా సీనియర్ నేత, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ వాదానికి ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 28 Dec 2009 | 11:11 pm

జార్ఖండ్‌లో జేఎంఎంకు మద్దతుపై భాజపాలో ముసలం!

జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా జార్కండ్ ముక్తిమోర్ఛా పార్టీ అధినేత శిబూ సొరేన్‌తో భారతీయ జనతా పార్టీ చేతులు కలపడం పట్ల పలువులు భారతీయ జనతా పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. ఇది భవిష్యత్‌లో పార్టీపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉందని వారు అంటున్నారు.
Source: జాతీయ | 28 Dec 2009 | 10:46 pm

తెలంగాణకు చంద్రబాబు పచ్చజెండా: తెదేపా ఎమ్మెల్యే

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పచ్చజెండా ఊపారని ఆ పార్టీకి చెందిన మక్తల్ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులను ఆయన మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు మనస్సులోని మాటను వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 28 Dec 2009 | 10:39 pm

బెజవాడలో భాజపా నేతలపై సమైక్య వాదుల దాడి!

సమైక్యవాదులు కూడా రణరంగానికి శ్రీకారం చుడుతున్నారు. జై ఆంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టిన భారతీయ జనతా పార్టీ నేతలను టార్గెట్ చేసుకుంటున్నారు. ఇందులోభాగంగా జై ఆంధ్ర ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు భాజపా నేతలు విజయవాడలో నిర్వహించిన సమావేశంపై సమైక్య వాదులు దాడి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 28 Dec 2009 | 10:21 pm

తక్కువ ఖర్చుకే న్యాయ సేవలు ఉండాలి: ప్రతిభా పాటిల్

దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ఖర్చుకే న్యాయ సేవలు అందుబాటులోకి రావాలని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా వెనుకబడిన, వికలాంగులకు ఉచితంగా న్యాయ సేవలు అందించాలని రాజ్యాంగంలోని 39ఏ అధికరణ నిర్ధేశిస్తోందని ఆమె గుర్తు చేశారు.
Source: జాతీయ | 28 Dec 2009 | 8:59 pm

సుస్థిర-సమర్థవంత పాలన అందిస్తాం: శిబూ సొరేన్

జార్ఖండ్ రాష్ట్రంలో సుస్థిర, సమర్థవంతమైన పాలన అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జార్ఖండ్ ముక్తిమోర్ఛా అధినేత శిబూ సొరేన్ వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. జార్ఖండ్‌లో జేఎంఎం-భాజపా కూటమి కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తుందన్నారు.
Source: జాతీయ | 28 Dec 2009 | 8:51 pm

తెలంగాణాపై మాట్లాడమంటారా...?: సమీరా రెడ్డి

ముంబయిలో సెటిలైన సమీరా రెడ్డి ఆనక హీరోయిన్‌గా మారి బాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ను సాధించుకున్నది. తాజాగా బుద్ధదేవ్ దాస్‌గుప్తా "కల్‌పురుష్" చిత్రంలో ఆమె నక్సలైట్ పాత్రను పోషిస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలోని నక్సలైట్‌గా దర్శకుడు ఆమె పాత్రను చిత్రీకరిస్తున్నాడు. ఈ నేపధ్యంలో సమీరాను తెలంగాణా అంశంపై మాట్లాడమని అడిగితే... ఒక్కసారి అదిరిపడింది. తనకు రాజకీయాల గురించి పరిజ్ఞానం లేదనీ, ఏది మాట్లాడినా దానికి ఏవేవో అర్థాలు తీస్తారని చెప్పింది. మరి ఆంధ్రలోని నక్సలైట్ పాత్ర చేస్తున్నారు కదా... దాని గురించైనా చెపుతారా...? అని ప్రశ్నిస్తే, అది కూడా దర్శకుడు ఏం చెపితే దానినే చేస్తున్నాననీ అంతకు మించి తనకు ఏమీ తెలియదనీ, మరిన్ని వివరాలు కావాలంటే దర్శకుడినే అడగమని చెప్పింది. ఆంధ్రరాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తాను ఎట్టి పరిస్థితిల్లోనూ వ్యాఖ్యానించనని ఒట్టు వేసి మరీ చెప్పింది సమీరా. అవును మరి... మహామహా నాయకులే తెలంగాణా అంశంపై మౌనముద్ర దాలుస్తుంటే సమీరా మాత్రం ఏం మాట్లాడుతుందీ...
Source: Yahoo! Telugu: Entertainment | 28 Dec 2009 | 11:34 am

"అదుర్స్" సినిమా ట్రైలర్‌ను తిలకించండి

నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, షీలా, నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన "అదుర్స్" చిత్రం విడుదల వాయిదా పడింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అదుర్స్ చిత్రం వాస్తవానికి డిసెంబర్ 25న విడుదల కావాల్సి ఉంది.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Dec 2009 | 10:37 am

వైభవ్, శ్వేతబసుల "కాస్కో" ట్రైలర్‌ను వీక్షించండి

వైభవ్, శ్వేతబసు ప్రసాద్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "కాస్కో". బ్రహ్మానందం, ప్రదీప్ రావత్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఎ. భారతి నిర్మించారు. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించారు.ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను అలరిస్తోన్న "కాస్కో" చిత్రాన్ని దర్శకుడు కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మలిచారని సినీ జనం అంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Dec 2009 | 10:32 am

"కళావర్ కింగ్"ను ట్రైలర్లో తిలకించండి

నిఖిల్‌, శ్వేతా బసుప్రసాద్‌ హీరో హీరోయిన్లుగా శ్రీ సాయికృష్ణ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం "కళావర్ కింగ్". ప్రస్తుతం చివరి పాట చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Dec 2009 | 10:28 am

"కాఫీబార్" ఎలా ఉంటుందో ట్రైలర్లో చూడండి

గీతాకృష్ణ స్వీయ దర్శకత్వంలో త్రిభాషా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం "కాఫీబార్". బ్లూఫాక్స్‌ సినిమా పతాకంపై రూపొందుతున్న 'కాఫీబార్‌' ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. శశాంక్‌, బియాంక దేశాయ్, అతుల్‌ కులకర్ణి, సుమన్‌, గిరీష్‌ కర్నాడ్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Dec 2009 | 10:11 am

ఆ సీన్లన్నీ శుద్ధ అబద్ధం: మాజీ గవర్నర్ తివారీ

ముగ్గురు యువతులతో శృంగారం జరిపినట్లు ఓ తెలుగు ఛానల్ ప్రదర్శించిన దృశ్యాలన్నీ ఒట్టి అభూత కల్పనలని మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కొట్టి పారేశారు. మరెందుకు రాజీనామా చేశారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... తన ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లనే తాను రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు.
Source: జాతీయ | 28 Dec 2009 | 7:56 am

రాజకీయాలలోకి మంచు లక్ష్మీ ప్రసన్న...?

ఇటీవల తెలంగాణా రాష్ట్ర సమితి కార్యకర్తలు మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మాతగా మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం షూటింగ్‌ను హైదరాబాదులో అడ్డుకోవడం, ఆ తర్వాత జరిగిన సంఘనటల నేపధ్యంలో మంచు లక్ష్మి రాజకీయాలలోకి ప్రవేశించాలని నిశ్చయించుకున్నట్లు టాలీవుడ్ గుసగుసలుపోతోంది. తండ్రి మోహన్ బాబు ఈసరికే రాజకీయాలలో ప్రవేశించి ఎన్టీఆర్ మరణం తర్వాత వాటికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ప్రజలలో బలం లేని నాయకులు సైతం రాజకీయాలలో ప్రవేశించి ఆగడాలకు పాల్పడంపై మంచు మోహన్ బాబు దృష్టి సారించినట్లు సమాచారం. తండ్రి ఆలోచనను తెలుసుకున్న కుమార్తె తాను రాజకీయాలలోకి ప్రవేశిస్తానని చెప్పినట్లు భోగట్టా.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Dec 2009 | 6:28 am

బెంగాల్ సీఎం వ్యాఖ్యలను తప్పుబట్టిన ప్రతిపక్షాలు!

మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీని అరెస్టు చేయడంలో సఫలీకృతం కాలేక పోతున్నామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తీవ్రంగా దుయ్యబట్టాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని హితవు పలికాయి.
Source: జాతీయ | 28 Dec 2009 | 5:00 am

"గే"లకు చట్టాలుంటే తప్పా..?: సెలీనా జైట్లీ

స్వలింగ సంపర్కుల తరపున ఉద్యమాలు చేసినవాళ్ళను వెనకేసుకొచ్చిన సెక్స్ సుందరి సెలీనా జైట్లీ. తనకు గాడ్ ఫాదర్స్ అంటూ ఎవరూలేరని చెబుతోంది. అందరితో ఎలా స్నేహసంబంధాలు పెంచుకోవాలని తన కుటుంబం నేర్పించిందని చెబుతోంది. అయితే తాను ఎవరిదగ్గరికెళ్లి అవకాశాలు అడగను. అందుకే తన కెరీర్ వేగంగా లేదని ఈ సెక్సీడాళ్ అంటోంది. ప్రతి మనిషికి పూర్తి స్వేచ్ఛా ఉన్నట్లైతే "గే"లకు చట్టాలుంటే తప్పా? అని సెలీనా ప్రశ్నించింది. అంతేకాదు.. వారు కూడా మనలాంటి మనషులేగా..? అంటూ సమర్థిస్తుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Dec 2009 | 4:23 am

అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: మంత్రి గాదె

తెలంగాణకు అన్యాయం చేశారని, తెలంగాణ వనరులను దోచుకుంటున్నారని పదేపదే ఆరోపణలు చేయడాన్ని సీమాంధ్ర మంత్రుల తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. వీరి వాదనను తిప్పికొట్టేందుకు గత 1956 సంవత్సరం నుంచి తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 28 Dec 2009 | 4:11 am

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ 125వ ఆవిర్భావ వేడుకలు

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 125వ ఆవిర్భావ వేడుకలు సోమవారం దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే, ఆయా రాష్ట్ర రాజధానుల్లో కూడా ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
Source: జాతీయ | 28 Dec 2009 | 3:17 am