|
ఆ సీన్లన్నీ శుద్ధ అబద్ధం: మాజీ గవర్నర్ తివారీముగ్గురు యువతులతో శృంగారం జరిపినట్లు ఓ తెలుగు ఛానల్ ప్రదర్శించిన దృశ్యాలన్నీ ఒట్టి అభూత కల్పనలని మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కొట్టి పారేశారు. మరెందుకు రాజీనామా చేశారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... తన ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లనే తాను రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు.Source: Yahoo! Telugu: News | 28 Dec 2009 | 1:26 pm తెలంగాణాపై మాట్లాడమంటారా...?: సమీరా రెడ్డిముంబయిలో సెటిలైన సమీరా రెడ్డి ఆనక హీరోయిన్‌గా మారి బాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ను సాధించుకున్నది. తాజాగా బుద్ధదేవ్ దాస్‌గుప్తా "కల్‌పురుష్" చిత్రంలో ఆమె నక్సలైట్ పాత్రను పోషిస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలోని నక్సలైట్‌గా దర్శకుడు ఆమె పాత్రను చిత్రీకరిస్తున్నాడు. ఈ నేపధ్యంలో సమీరాను తెలంగాణా అంశంపై మాట్లాడమని అడిగితే... ఒక్కసారి అదిరిపడింది. తనకు రాజకీయాల గురించి పరిజ్ఞానం లేదనీ, ఏది మాట్లాడినా దానికి ఏవేవో అర్థాలు తీస్తారని చెప్పింది. మరి ఆంధ్రలోని నక్సలైట్ పాత్ర చేస్తున్నారు కదా... దాని గురించైనా చెపుతారా...? అని ప్రశ్నిస్తే, అది కూడా దర్శకుడు ఏం చెపితే దానినే చేస్తున్నాననీ అంతకు మించి తనకు ఏమీ తెలియదనీ, మరిన్ని వివరాలు కావాలంటే దర్శకుడినే అడగమని చెప్పింది. ఆంధ్రరాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తాను ఎట్టి పరిస్థితిల్లోనూ వ్యాఖ్యానించనని ఒట్టు వేసి మరీ చెప్పింది సమీరా. అవును మరి... మహామహా నాయకులే తెలంగాణా అంశంపై మౌనముద్ర దాలుస్తుంటే సమీరా మాత్రం ఏం మాట్లాడుతుందీ...Source: Yahoo! Telugu: Entertainment | 28 Dec 2009 | 11:34 am మొహర్రం ర్యాలీలో ఆత్మాహుతి దాడి: 15 మంది మృతిముస్లిం పవిత్ర పండుగలలో ఒకటైన మొహర్రం సందర్భంగా పాకిస్థాన్‌లోని ఓడరేవు నగరం కరాచీతో పాటు ముజఫరాబాద్‌లు సోమవారం ఆత్మాహుతి దాడులతో దద్ధరిల్లాయి. మొహర్రం ర్యాలీపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 35 మంది గాయపడినట్టు పోలీసులు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 28 Dec 2009 | 10:44 am "అదుర్స్" సినిమా ట్రైలర్‌ను తిలకించండినందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, షీలా, నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన "అదుర్స్" చిత్రం విడుదల వాయిదా పడింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అదుర్స్ చిత్రం వాస్తవానికి డిసెంబర్ 25న విడుదల కావాల్సి ఉంది.Source: Yahoo! Telugu: Entertainment | 28 Dec 2009 | 10:37 am వైభవ్, శ్వేతబసుల "కాస్కో" ట్రైలర్‌ను వీక్షించండివైభవ్, శ్వేతబసు ప్రసాద్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "కాస్కో". బ్రహ్మానందం, ప్రదీప్ రావత్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఎ. భారతి నిర్మించారు. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించారు.ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను అలరిస్తోన్న "కాస్కో" చిత్రాన్ని దర్శకుడు కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మలిచారని సినీ జనం అంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 28 Dec 2009 | 10:32 am బెంగాల్ సీఎం వ్యాఖ్యలను తప్పుబట్టిన ప్రతిపక్షాలు!మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీని అరెస్టు చేయడంలో సఫలీకృతం కాలేక పోతున్నామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తీవ్రంగా దుయ్యబట్టాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని హితవు పలికాయి.Source: Yahoo! Telugu: News | 28 Dec 2009 | 10:30 am "కళావర్ కింగ్"ను ట్రైలర్లో తిలకించండినిఖిల్, శ్వేతా బసుప్రసాద్ హీరో హీరోయిన్లుగా శ్రీ సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం "కళావర్ కింగ్". ప్రస్తుతం చివరి పాట చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 28 Dec 2009 | 10:28 am రూ.250 కోట్లతో ఆస్పత్రి విస్తరణ పనులు: పోర్టీస్దేశంలోని హెల్త్ కేర్ రంగంలో ఒకటిగా పేరొందిన పోర్టీస్ హాస్పిటల్ మూడు మెట్రోపాలిటన్ నగరాల్లో తమ వైద్య సేవలను విస్తరించనుంది. ఇందుకోసం 250 కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. దీనిపై పోర్టీస్ ఆస్పత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విషాల్ బాలీ ముంబైలో మాట్లాడుతూ.. కోల్‌కతా, ముంబై, బెంగుళూరు నగరాల్లో రూ.250 కోట్ల మేరకు పెట్టుబడులతో తమ సేవలను విస్తరించనున్నట్టు చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది అమలు చేస్తామన్నారు.Source: Yahoo! Telugu: News | 28 Dec 2009 | 10:18 am తెలంగాణ ఏర్పడితే.. కుక్కలు చింపిన విస్తరేనా..?!!మొన్నటివరకూ తానే తెలంగాణా సాధనకోసం పోరాడుతున్న హీరో అనుకున్న కేసీఆర్‌కు క్రమంగా ఒక్కో పార్టీ తమదైన శైలిలో రాజకీయ గుణపాఠాలు చెప్పడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా తెరాస ప్రతిపాదించిన జేఏసీ... జాయింట్ యాక్షన్ కమిటీలోకి తలలు వంచుకుని వెళ్లిన కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీ అధిష్టానం నిప్పులు చెరిగినట్లు భోగట్టా.Source: Yahoo! Telugu: News | 28 Dec 2009 | 10:14 am "కాఫీబార్" ఎలా ఉంటుందో ట్రైలర్లో చూడండిగీతాకృష్ణ స్వీయ దర్శకత్వంలో త్రిభాషా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం "కాఫీబార్". బ్లూఫాక్స్ సినిమా పతాకంపై రూపొందుతున్న 'కాఫీబార్' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. శశాంక్, బియాంక దేశాయ్, అతుల్ కులకర్ణి, సుమన్, గిరీష్ కర్నాడ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 28 Dec 2009 | 10:11 am అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: మంత్రి గాదెతెలంగాణకు అన్యాయం చేశారని, తెలంగాణ వనరులను దోచుకుంటున్నారని పదేపదే ఆరోపణలు చేయడాన్ని సీమాంధ్ర మంత్రుల తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. వీరి వాదనను తిప్పికొట్టేందుకు గత 1956 సంవత్సరం నుంచి తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.Source: Yahoo! Telugu: News | 28 Dec 2009 | 9:40 am ముఖేష్ అంబానీతో సమావేశమైన జపాన్ ప్రధాని!భారత్‌లో పర్యటిస్తున్న జపాన్ ప్రధాని యూకియో హతోయామా సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, టాటా గ్రూపు ఛైర్మన్ రతన్ టాటాలతో సమావేశమయ్యారు. అలాగే, దేశానికి చెందిన పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో కూడా ఆయన భేటీ అయ్యారు.Source: Yahoo! Telugu: News | 28 Dec 2009 | 9:19 am నేపాల్‌లో తొలి స్వైన్ ఫ్లూ మరణం నమోదు!నేపాల్‌లో తొలి స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. మరో ఇద్దరికి హైచ్1ఎన్1 వైరస్ సోకినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రపంచ దేశాలను గడగడలాడించిన స్వైన్ ఫ్లూ మహమ్మారి నేపాల్‌లో కూడా ప్రవేశించింది. దీనిపై నేపాల్ స్టేట్ మీడియా సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.Source: Yahoo! Telugu: News | 28 Dec 2009 | 9:06 am దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ 125వ ఆవిర్భావ వేడుకలుఅఖిల భారత కాంగ్రెస్ పార్టీ 125వ ఆవిర్భావ వేడుకలు సోమవారం దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే, ఆయా రాష్ట్ర రాజధానుల్లో కూడా ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 28 Dec 2009 | 8:47 am ఆ సీన్లన్నీ శుద్ధ అబద్ధం: మాజీ గవర్నర్ తివారీముగ్గురు యువతులతో శృంగారం జరిపినట్లు ఓ తెలుగు ఛానల్ ప్రదర్శించిన దృశ్యాలన్నీ ఒట్టి అభూత కల్పనలని మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కొట్టి పారేశారు. మరెందుకు రాజీనామా చేశారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... తన ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లనే తాను రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు.Source: జాతీయ | 28 Dec 2009 | 7:56 am కాంగ్రెస్‌కు తీపి-చేదు కలయికగా 2009 సంవత్సరం!125వ వ్యవస్థాపక దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి 2009 సంవత్సరం తీపి, చేదు కలయికగా మిగిలిపోనుంది. ఈ యేడాది ఆగస్టు నెల వరకు ఆ పార్టీకి అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి దుర్మరణంతో చిక్కులు ఎదురయ్యాయని ఒకరకంగా చెప్పుకోవచ్చు.Source: Yahoo! Telugu: News | 28 Dec 2009 | 7:56 am రాజకీయాలలోకి మంచు లక్ష్మీ ప్రసన్న...?ఇటీవల తెలంగాణా రాష్ట్ర సమితి కార్యకర్తలు మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మాతగా మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం షూటింగ్‌ను హైదరాబాదులో అడ్డుకోవడం, ఆ తర్వాత జరిగిన సంఘనటల నేపధ్యంలో మంచు లక్ష్మి రాజకీయాలలోకి ప్రవేశించాలని నిశ్చయించుకున్నట్లు టాలీవుడ్ గుసగుసలుపోతోంది. తండ్రి మోహన్ బాబు ఈసరికే రాజకీయాలలో ప్రవేశించి ఎన్టీఆర్ మరణం తర్వాత వాటికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ప్రజలలో బలం లేని నాయకులు సైతం రాజకీయాలలో ప్రవేశించి ఆగడాలకు పాల్పడంపై మంచు మోహన్ బాబు దృష్టి సారించినట్లు సమాచారం. తండ్రి ఆలోచనను తెలుసుకున్న కుమార్తె తాను రాజకీయాలలోకి ప్రవేశిస్తానని చెప్పినట్లు భోగట్టా.Source: Yahoo! Telugu: Entertainment | 28 Dec 2009 | 6:28 am బెంగాల్ సీఎం వ్యాఖ్యలను తప్పుబట్టిన ప్రతిపక్షాలు!మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీని అరెస్టు చేయడంలో సఫలీకృతం కాలేక పోతున్నామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తీవ్రంగా దుయ్యబట్టాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని హితవు పలికాయి.Source: జాతీయ | 28 Dec 2009 | 5:00 am "గే"లకు చట్టాలుంటే తప్పా..?: సెలీనా జైట్లీస్వలింగ సంపర్కుల తరపున ఉద్యమాలు చేసినవాళ్ళను వెనకేసుకొచ్చిన సెక్స్ సుందరి సెలీనా జైట్లీ. తనకు గాడ్ ఫాదర్స్ అంటూ ఎవరూలేరని చెబుతోంది. అందరితో ఎలా స్నేహసంబంధాలు పెంచుకోవాలని తన కుటుంబం నేర్పించిందని చెబుతోంది. అయితే తాను ఎవరిదగ్గరికెళ్లి అవకాశాలు అడగను. అందుకే తన కెరీర్ వేగంగా లేదని ఈ సెక్సీడాళ్ అంటోంది. ప్రతి మనిషికి పూర్తి స్వేచ్ఛా ఉన్నట్లైతే "గే"లకు చట్టాలుంటే తప్పా? అని సెలీనా ప్రశ్నించింది. అంతేకాదు.. వారు కూడా మనలాంటి మనషులేగా..? అంటూ సమర్థిస్తుంది.Source: Yahoo! Telugu: Entertainment | 28 Dec 2009 | 4:23 am అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: మంత్రి గాదెతెలంగాణకు అన్యాయం చేశారని, తెలంగాణ వనరులను దోచుకుంటున్నారని పదేపదే ఆరోపణలు చేయడాన్ని సీమాంధ్ర మంత్రుల తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. వీరి వాదనను తిప్పికొట్టేందుకు గత 1956 సంవత్సరం నుంచి తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.Source: ఏపీ న్యూస్ | 28 Dec 2009 | 4:11 am దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ 125వ ఆవిర్భావ వేడుకలుఅఖిల భారత కాంగ్రెస్ పార్టీ 125వ ఆవిర్భావ వేడుకలు సోమవారం దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే, ఆయా రాష్ట్ర రాజధానుల్లో కూడా ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.Source: జాతీయ | 28 Dec 2009 | 3:17 am జమ్మూలో పది మంది బంగ్లాదేశీయుల అరెస్టు!జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని జమ్మూ జిల్లాలో పది మంది బంగ్లాదేశీయులను భారత సరిహద్దు దళం (బీఎస్ఎఫ్) అరెస్టు చేసింది. ఈ జిల్లాలోని అర్నియా సెక్టార్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు మీదుగా పాకిస్థాన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా వీరిని అరెస్టు చేసినట్టు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు.Source: జాతీయ | 28 Dec 2009 | 12:38 am విద్యార్థి మహాగర్జనపై జేఏసీ నేతల్లో తర్జన భర్జనలు!వచ్చే నెల మూడో తేదీన తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల విద్యార్థులతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తలపెట్టిన మహాగర్జనపై జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్) నేతల్లో తర్జనభర్జనలు నెలకొన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దీనికి హైదరాబాద్ పోలీసులు కూడా అనుమతి ఇవ్వలేదు.Source: ఏపీ న్యూస్ | 28 Dec 2009 | 12:30 am తెలుగువారి మధ్య రాగద్వేషాలు బాధాకరం: డీఎస్నిన్నమొన్నటి వరకు ఐక్యంగా ఉన్న తెలుగు ప్రజల మధ్య రాగద్వేషాలు నెలకొనడం చాలా బాధాకరంగా ఉందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 125వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.Source: ఏపీ న్యూస్ | 28 Dec 2009 | 12:10 am హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదు: ముఖేష్ గౌడ్!రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఏ ఒక్కరి అబ్బ సొత్తూ కాదని, ఇక్కడ నివశించే ప్రతి ఒక్కరి ఆస్తి అని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖామంత్రి ముఖేష్ గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌పై ఎవరూ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని ఆయన హితపు పలికారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమైతే, అపుడు అధిష్టానాన్ని హైదరాబాద్ ప్రజల మనోభావాలను వివరిస్తామని ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 27 Dec 2009 | 11:50 pm నేనూ, టీవీ వాళ్లు వస్తున్నారని దీక్ష చేస్తున్నారా...?: వీహెచ్తెలంగాణా రాష్ట్రంకోసం గత మూడురోజులుగా తెలంగాణాలోని ఆయా ప్రాంతాల్లో దీక్షలు చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపధ్యంలో హైదరాబాదులోని కొన్ని సభల్లో కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంతరావు దీక్షలపై సెటైర్లు వేస్తున్నారు. ఆదివారంనాడు ఆయన రామ్‌నగర్‌లోని క్రాస్‌రోడ్‌లో దీక్షా శిబిరానికి హాజరయ్యారు.Source: ఏపీ న్యూస్ | 27 Dec 2009 | 11:45 pm గవర్నరుతో సమావేశమైన రోశయ్య - సబితమ్మ!రాష్ట్ర కొత్త గవర్నరు ఈఎస్ఎల్.నరసింహన్‌తో ముఖ్యమంత్రి కె.రోశయ్య, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ గిరీష్ కుమార్‌లు సోమవారం సమావేశమయ్యారు. ఇందుకోసం వారు ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతలపై వీరంతా సమీక్ష జరిపారు.Source: ఏపీ న్యూస్ | 27 Dec 2009 | 11:40 pm రాజీనామాలు ఉపసంహరించుకోండి: ప్రణబ్ ఆదేశంతెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ధిష్ట కాలపరిమితి విధించాలని డిమాండ్ చేస్తూ హస్తినలో మకాం వేసిన తెలంగాణ ప్రాంత మంత్రులకు కేంద్ర ఆర్థిక మంత్రి, కోర్ కమిటీ సభ్యుడు ప్రణబ్ ముఖర్జీ క్లాస్ పీకారు. తొలుత రాజీనామాలు తక్షణం ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాతే తెలంగాణపై శుభవార్తను ప్రభుత్వం వెల్లడిస్తుందని ఆయన హామీ ఇచ్చినట్టు సమాచారం.Source: జాతీయ | 27 Dec 2009 | 11:16 pm "గే"లకు చట్టాలుంటే తప్పా..?: సెలీనా జైట్లీస్వలింగ సంపర్కుల తరపున ఉద్యమాలు చేసినవాళ్ళను వెనకేసుకొచ్చిన సెక్స్ సుందరి సెలీనా జైట్లీ. తనకు గాడ్ ఫాదర్స్ అంటూ ఎవరూలేరని చెబుతోంది. అందరితో ఎలా స్నేహసంబంధాలు పెంచుకోవాలని తన కుటుంబం నేర్పించిందని చెబుతోంది. అయితే తాను ఎవరిదగ్గరికెళ్లి అవకాశాలు అడగను. అందుకే తన కెరీర్ వేగంగా లేదని ఈ సెక్సీడాళ్ అంటోంది. ప్రతి మనిషికి పూర్తి స్వేచ్ఛా ఉన్నట్లైతే "గే"లకు చట్టాలుంటే తప్పా? అని సెలీనా ప్రశ్నించింది.Source: వినోదం | 27 Dec 2009 | 10:59 pm గవర్నరుగా బాధ్యతలు స్వీకరించిన నరసింహన్!రాష్ట్ర గవర్నరుగా ఈఎస్. లక్ష్మీ నరసింహన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర గవర్నరుగా విధులు నిర్వహిస్తున్న నరసింహన్‌కు అదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బాధ్యతలను అప్పగించారు.Source: ఏపీ న్యూస్ | 27 Dec 2009 | 10:30 pm రాష్ట్ర గవర్నరు లక్ష్మీ నరసింహన్ జీవిత విశేషాలు!రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు చేపట్టిన ఈ.శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్ 1968 ఐపీఎస్ ఏపీ క్యాడర్‌కు చెందిన వారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్ర మూడో గవర్నరుగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఎన్డీ.తివారీ రాజీనామాతో రాష్ట్ర గవర్నరుగా అదనపు బాధ్యతలు స్వీకరించారు.Source: ఏపీ న్యూస్ | 27 Dec 2009 | 10:30 pm ప్యాంటు జిప్పు వెనక్కు.."ఛీ.... ఛీ.... ఈ టైలర్ కసలు బుద్ధిలేదు. ప్యాంటు జిప్పు వెనక్కు పెట్టాడు" అన్నాడు భర్త."మీ మతిమరుపు మండినట్లే వుంది. మీరు ప్యాంటు వెనక్కి వేసుకున్నారు" గుర్తు చేసింది భార్య.Source: వినోదం | 27 Dec 2009 | 9:57 pm అణకువ కలిగిన అమ్మాయి"మా వాడికి మంచి అణకువ కలిగిన అమ్మాయి కావాలి"."ఎదురు మాట్లాడకూడదు. వంచిన తల ఎత్తకూడదు" చెప్పాడు జగన్ రావు."అలా అయితే ఓ మంచి అమ్మాయి వుంది" చెప్పాడు...Source: వినోదం | 27 Dec 2009 | 9:50 pm ఏకాభిప్రాయంతోనే తెలంగాణ సాధ్యం: బుద్ధదేవ్అన్ని పార్టీల అనుమతితోను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాని మన్మోహన్ సింగ్ మొగ్గు చూపవచ్చని పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య అభిప్రయాపడ్డారు. ఇందుకోసం అవసరమైన ఏకాభిప్రాయం కోసం ప్రధాని కృషి చేయవచ్చన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానితో తాను సమావేశమైనప్పుడు తెలంగాణ అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలిపారు.Source: జాతీయ | 27 Dec 2009 | 9:09 pm 30న జార్ఖండ్ సీఎంగా సొరేన్ ప్రమాణ స్వీకారం!జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శిబూ సొరేన్ ఈనెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన సీఎం పగ్గాలు చేపట్టనుండటం ఇది ముచ్చటగా మూడోసారి కావడం గమనార్హం. సొరేన్‌ను అందలమెక్కించేందుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఫలితంగా మరోమారు సీఎం పదవి చేపట్టాలన్న సొరేన్ స్వప్నం మరోమారు నిజం కానుంది.Source: జాతీయ | 27 Dec 2009 | 8:53 pm
|