|
లాభాలతో పయనిస్తోన్న విదేశీ స్టాక్ మార్కెట్లుగురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులకు గురైన స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో కొనసాగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్‌తో పాటు విదేశీ స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేసుకుంటున్నాయి.ఇందులో భాగంగా దేశీయ బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో 123 పాయింట్లు భారీగా లాభపడి, 17,354 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 27 పాయింట్ల భారీ వృద్ధితో, 5,171 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 24 Dec 2009 | 8:43 am బ్రాండ్ ఆంధ్రా.. బ్రాండ్ హైదరాబాద్ అంతా బూడిదతెలంగాణా- సమైక్యాంధ్ర ఉద్యమాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణ కాష్టాన్ని తలపిస్తోంది. ప్రజల భావోద్వోగాలను ఆయా ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టిన ఫలితం బ్రాండ్ ఆంధ్రా.. బ్రాండ్ హైదరాబాద్ నేడు బూడిద కానుంది. ప్రపంచ చిత్ర పటంలో హైదరాబాద్ నగరానికి ఓ ప్రత్యేక ఖ్యాతి ఉంది.Source: Yahoo! Telugu: News | 24 Dec 2009 | 8:36 am ట్రేడింగ్ బలహీనత: మిశ్రమ ఫలితాల్లో సెన్సెక్స్దేశీయ, విదేశీ మార్కెట్ల ట్రేడింగ్ బలహీనత కారణంగా బాంబే స్టాక్ మార్కెట్ మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కేవలం ఆరు పాయింట్ల స్వల్ప నష్టంతో, 17,224 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. కానీ నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం 3 పాయింట్ల స్వల్ప లాభంతో 5,147 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 24 Dec 2009 | 8:35 am కార్ల అమ్మకాలలో వృద్ధి జరుగుతుంది :మారుతిదేశీయ కార్ల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న మారుతి సుజుకీ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తన అమ్మకాలు 20 శాతం పెరిగే సూచనలున్నాయని సంస్థ పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 24 Dec 2009 | 7:55 am తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపిల రాజీనామాకేంద్రం బుధవారం సాయంత్రం దిద్దుబాటు ప్రకటనకు నిరసన తెలుపుతూ తెలంగాణకు చెందిన పలు పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. తెలంగాణ ప్రాంతంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలుండగా ఇప్పటి వరకు వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు 82 మంది రాజీనామా సమర్పించారు.Source: Yahoo! Telugu: News | 24 Dec 2009 | 7:29 am చావో రేవో తేల్చుకుంటాం: కేసీఆర్హైదరాబాదులోని కళింగ ఫంక్షన్ హాలులో తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ... పార్టీ జెండాలకు అతీతంగా తెలంగాణా సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణా ప్రాంతంలోని నాలుగుకోట్ల మంది ప్రజలు ఏకం కావాలన్నారు.Source: Yahoo! Telugu: News | 24 Dec 2009 | 7:24 am మళ్లీ మిశ్రమ ఫలితాల్లో బాంబే స్టాక్ మార్కెట్గురువారం బాంబే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ట్రేడింగ్ ప్రారంభంలో మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకున్న సెన్సెక్స్ మధ్యలో లాభాల్లో పయనించింది. తిరిగి విదేశీ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ రెండు గంటల ప్రాంతంలో 31 పాయింట్ల స్వల్ప లాభంతో 17,262 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా కేవలం ఒక పాయింట్ నష్టంతో 5,143 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 24 Dec 2009 | 7:12 am పేషావర్‌లో ఆత్మాహుతి దాడి: ముగ్గురి మృతిపాకిస్థాన్లోని వాయువ్య ప్రాంతమైన పేషావర్‌లో పోలీసు ఔట్ పోస్ట్ వద్ద ఆత్మాహుతి దళానికి చెందిన వ్యక్తి తనను తాను పేల్చేసుకోవడంతో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రగాయాలపాలైనారు.Source: Yahoo! Telugu: News | 24 Dec 2009 | 7:01 am కేంద్రీయ విశ్వవిద్యాలయంలో లాఠీచార్జితెలంగాణ అంశంపై కేంద్రం చేసిన దిద్దుబాటు ప్రకటనతో హైదరాబాద్ శివార్లలోని కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. విద్యార్థులు తమ క్యాంపస్‌లో విధ్వంసం సృష్టించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకు దిగిన విద్యార్థులను అదుపు చేసేందుకు లాఠీచార్జి చేశారు. లాఠీచార్జి చేస్తున్న పోలీసులపై విద్యార్థులు రాళ్ళతో దాడికి దిగారు. దీనితో పోలీసులు విద్యార్థులను క్యాంపస్‌లో తరిమి తరిమి కొట్టారు.Source: Yahoo! Telugu: News | 24 Dec 2009 | 6:43 am స్వల్ప లాభాల్లో బాంబే స్టాక్ మార్కెట్గురువారం బాంబే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు, ఆపై లాభాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. 17 పాయింట్ల స్వల్ప లాభంతో 17,248 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 8 పాయింట్ల స్వల్ప వృద్ధితో 5,152 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 24 Dec 2009 | 6:33 am తెరాస కార్యకర్తల దాడి: త్రివిక్రమ్ శ్రీనివాస్ పరుగులుతెలుగు సినీ పరిశ్రమలో సీమాంధ్రకు చెందిన నటులు, దర్శకులు, రచయితలను... ఇలా ఒక్కొక్కరిపై విడివిడిగా దాడి చేస్తున్నారు తెరాస కార్యకర్తలు. గురువారం ఉదయం దిల్‌షుక్‌నగర్‌లో రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రయాణిస్తున్న వాహనంపై తెరాస కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో శ్రీనివాస్ వాహనం దిగి పరుగు లంకించుకున్నారు. మొత్తమ్మీద హైదరాబాదులోని తెలుగు సినీపరిశ్రమపై తెరాస టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 24 Dec 2009 | 5:47 am మహేష్ సినిమా కిలాడి షూటింగ్‌పై దాడి: రూ. 2 కోట్ల నష్టంమొన్న మోహన్ బాబు కుమారుని సినిమా షూటింగ్‌పై దాడి, నిన్న అల్లు అరవింద్ కుమారుడు అర్జున్ సినీ షూటింగ్‌పై దాడి, నేడు ప్రిన్స్ మహేశ్ బాబు చిత్రం షూటింగ్‌పై తెరాస కార్యకర్తల దాడి. మహేశ్ బాబు చిత్రం గురువారం వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుండగా తెరాస కార్యకర్తలు షూటింగ్‌ను అడ్డుకున్నారు. అక్కడ సామగ్రిని ధ్వంసం చేసినట్లు సమాచారం. ఇదిలావుండగా హైదరాబాదులోని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్‌పై తెరాస కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేశారు. రాష్ట్రంలో రాజకీయాలకు సినిమాలకు లింకుపెట్టి దాడులకు తెగబడటం శోచనీయమని తెలుగు సినిమా ప్రముఖులు తమ ఆవేదనను వ్యక్తం చేసారు.Source: Yahoo! Telugu: Entertainment | 24 Dec 2009 | 4:54 am తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపిల రాజీనామాకేంద్రం బుధవారం సాయంత్రం దిద్దుబాటు ప్రకటనకు నిరసన తెలుపుతూ తెలంగాణకు చెందిన పలు పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. తెలంగాణ ప్రాంతంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలుండగా ఇప్పటి వరకు వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు 82 మంది రాజీనామా సమర్పించారు.Source: ఏపీ న్యూస్ | 24 Dec 2009 | 2:00 am చావో రేవో తేల్చుకుంటాం: కేసీఆర్హైదరాబాదులోని కళింగ ఫంక్షన్ హాలులో తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ... పార్టీ జెండాలకు అతీతంగా తెలంగాణా సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణా ప్రాంతంలోని నాలుగుకోట్ల మంది ప్రజలు ఏకం కావాలన్నారు.Source: ఏపీ న్యూస్ | 24 Dec 2009 | 1:54 am కేంద్రీయ విశ్వవిద్యాలయంలో లాఠీచార్జితెలంగాణ అంశంపై కేంద్రం చేసిన దిద్దుబాటు ప్రకటనతో హైదరాబాద్ శివార్లలోని కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. విద్యార్థులు తమ క్యాంపస్‌లో విధ్వంసం సృష్టించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకు దిగిన విద్యార్థులను అదుపు చేసేందుకు లాఠీచార్జి చేశారు. లాఠీచార్జి చేస్తున్న పోలీసులపై విద్యార్థులు రాళ్ళతో దాడికి దిగారు. దీనితో పోలీసులు విద్యార్థులను క్యాంపస్‌లో తరిమి తరిమి కొట్టారు.Source: ఏపీ న్యూస్ | 24 Dec 2009 | 1:15 am కేంద్రం ప్రకటన తెలంగాణకు వ్యతిరేకం కాదు: గీతారెడ్డిప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ నివాసంలో పలువురు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు గురువారం ఉదయం సమావేశమైనారు. సమావేశానంతరం మంత్రి గీతారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చిదంబరం చేసిన దిద్దుబాటు ప్రకటన తెలంగాణకు వ్యతిరేకం కాదని, అయితే కేంద్రం ప్రకటనపై ఓ స్పష్టత రావాల్సివుందని ఆమె అభిప్రాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 24 Dec 2009 | 1:00 am తెలంగాణా- ఆంధ్ర సరిహద్దుల్లో తెరాస గోడగత నెలరోజుల వరకూ సమైక్యంగా కలిసి ఉన్న ప్రజల మధ్య తెలంగాణా చిచ్చు రగిల్చింది. ఫలితంగా రాష్ట్రంలో పరిస్థితి అదుపుతప్పి ప్రాంతీయ విద్వేషాలు రేగుతున్నాయి. తెలంగాణా- ఆంధ్ర సరిహద్దు పరిధిలో ఉన్నటువంటి జాతీయ రహదారులపై తెరాస కార్యకర్తలు ఏకంగా గోడ కట్టి ప్రయాణికులకు తీవ్ర అంతరాయం కలిగించారు. దీంతో రోడ్లకు ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది.Source: ఏపీ న్యూస్ | 24 Dec 2009 | 12:46 am నాకు సిఎం పదవి, మా అబ్బాయికి డిప్యూటి సిఎం: శిబుజార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ లభించలేదు. మూడవ స్థానంలో నిలిచిన జేఎమ్ఎమ్ పార్టీకి 18 సీట్లు లభించడంతో ఆ పార్టీ అధినేత శిబూ సోరెన్ తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని కోరారు. అలాగే తన కుమారునికి ఉపముఖ్యమంత్రి పదవినివ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.Source: జాతీయ | 24 Dec 2009 | 12:15 am ప్రధాని, సోనియా గాంధీలకు గౌరవ డాక్టరేట్లుదేశ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీలకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయనున్నారు. వీరితో పాటు ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏఎం అహ్మదీ తదితరులకు ఈ సత్కారాన్ని అందజేయనున్నారు.Source: జాతీయ | 23 Dec 2009 | 11:49 pm సీమాంధ్రాల్లో ఇక దీక్షలు విరమించండి: శైలజానాధ్ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రజలు, రాజకీయ పక్షాల నేతలు, విద్యార్థులు, ఆందోళనలు, దీక్షలు విరమించాలని ప్రభుత్వ విప్ శైలజనాథ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్ర హోం మంత్రి చిదంబరం అందరికీ ఆమోదయోగ్యమైన ప్రకటన చేయడంతో గతంలో సీమాంధ్ర ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు శైలజనాథ్ చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 23 Dec 2009 | 11:44 pm మంత్రులు రాజీనామా చేయరు: దామోదర రెడ్డికేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటన అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యంగా ఉందని, దీనికి స్పందించి తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులెవ్వరూ రాజీనామా చేసే యోచనలో లేరని మంత్రి దామోదర రెడ్డి అన్నారుSource: ఏపీ న్యూస్ | 23 Dec 2009 | 11:25 pm సంక్షోభంలో రోశయ్య సర్కార్: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన..?తెలంగాణా ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణీత సమయాన్ని తెలియజేయాలని రాష్ట్రంలోని తెలంగాణా ఎంపీలు పట్టుబడుతున్నారు. కేంద్ర నిర్ణయానికి నిరసనగా తెలంగాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 11మంది ఎంపీలు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారుSource: ఏపీ న్యూస్ | 23 Dec 2009 | 11:09 pm అట్టుడుకుతున్న తెలంగాణ జిల్లాలుతెలంగాణ..సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో కేంద్ర మంత్రి చిదంబరం చేసిన తాజా ప్రకటనపై తెలంగాణ వాసులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. హైదరాబాద్, వరంగల్, నల్గొండ, నిజామబాద్, కరీంనగర్ తదితర జిల్లాలో విద్యార్థులు, తెలంగాణ రాష్ట్ర సమితి, ఇతర పార్టీల కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 23 Dec 2009 | 10:51 pm తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటా: కొండా సురేఖతెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని కాంగ్రెస్ పార్టీకి చెందిన పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. కేంద్ర హోం మంత్రి చిదంబరం బుధవారం చేసిన ప్రకటనతో తాను నిరాశ చెందానని సురేఖ చెప్పారు. రాజీనామాలతో తెలంగాణ సాధ్యమైతే తాను తన పదవికి రాజీనామా చేస్తానని ఆమె వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 23 Dec 2009 | 10:32 pm తమిళనాట ఉపఎన్నికల్లో విజయం సాధించిన డిఎంకేతమిళనాడులోని తిరుచెందూరు, వందవాసి అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో అధికారపార్టీ అయిన డిఎంకే విజయం సాదించింది.Source: జాతీయ | 23 Dec 2009 | 9:24 pm హోంశాఖను విభజించాలి : మంత్రి చిదంబరంఅంతర్గత భద్రత మినహా ఇతర బాధ్యతల నిర్వాహణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. హోంమంత్రిత్వ శాఖతో ప్రత్యక్ష సంబంధం లేని విషయాలను వేరుచేసి వాటికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 23 Dec 2009 | 8:30 pm కార్యకర్తల చిల్లరపనులను తెరాస అడ్డుకోవాలి: అల్లు అరవింద్నిన్న మోహన్‌బాబు సినిమా షూటింగ్‌పై తెరాస దాడి, నేడు అల్లు అర్జున్ సినిమా "వరుడు"పై తెరాస దాడి. ఏవో రెండు మూడు చిత్రాలవారికే దాడులు జరుగుతున్నాయనుకోవడం చాలా తప్పని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. నిన్న జరిగిన దాడికి వెంటనే కళాకారులంతా ఒక్కటై వెంటనే స్పందించి ఉంటే బాగుండేదని అల్లు అరవింద్ అన్నారు. దాడులు రెండు, మూడు సినిమా షూటింగ్‌లకు మాత్రమే అనుకుంటే పొరపాటని, ఇప్పటికైనా ఫిలిమ్ ఛాంబర్ పెద్దలు ముందుకువచ్చి తగిన విధంగా స్పందించాలని హితవు పలికారు. తమ పార్టీ కార్యకర్తలను చిల్లర పనులు చేయకుండా తెలంగాణ రాష్ట్ర సమితి అడ్డుకోవాలని అల్లు అరవింద్ సూచించారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Dec 2009 | 11:20 am సిపిఎం కార్యకర్తలను కాల్చి చంపిన మావోయిస్టులుసిపిఎంకు చెందిన ఇద్దరు కార్యకర్తలను మావోయిస్టులు వారి ఇండ్లనుంచి అపహరించి తీసుకువెళ్ళిన అనంతరం కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. రాష్ట్రంలోని మిడ్నాపుర్ జిల్లాలోనున్న జంగల్‌మాల్ ప్రాంతంలో వీరిరువురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని సూపరిండెంట్ ఆఫ్ పోలీసు వెల్లడించారుSource: జాతీయ | 23 Dec 2009 | 8:46 am విస్తృత స్థాయి చర్చల ద్వారానే తెలంగాణ: చిదంబరంతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసే అంశం విస్తృత స్థాయి చర్చల ద్వారానే సాధ్యమని కేంద్ర హోం మంత్రి చిదంబరం తేల్చి చెప్పారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, రాజకీయ పార్టీల నేతలు పూర్తిగా సహకరించాలని ఆయన తెలిపారు. ఈనెల ఏడో తేదీన ముఖ్యమంత్రి రోశయ్య నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అంశంపై సమ్మతించాయన్నారు.Source: జాతీయ | 23 Dec 2009 | 8:34 am ఫ్యూచర్ ఫిల్మ్‌ను నిర్మిస్తున్న మదురై మైక్రో ఫైనాన్స్!తమిళనాడుకు చెందిన మదురా మైక్రో ఫైనాన్స్ సంస్థ సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపు (స్వయం సహాయ బృందాలు)లకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా ఒక వినూత్న ప్రాజెక్టును చేపట్టింది. మదురైకు చెందిన ఒక మహిళా స్వయం వృద్ధి ఆధారంగా చేసుకుని 'శక్తి పిరక్కుదు' అనే ఫ్యూచర్ ఫిల్మ్ ప్రాజెక్టును నిర్మిస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 23 Dec 2009 | 7:56 am కేసీఆర్‌కు సరైన మొగుడు మోహన్ బాబేదేనికైనా ఢీ అంటే ఢీ అనేవాడుంటేనే పస తెలుస్తుంది. మంగళవారంనాడు తన కుమారుని షూటింగ్‌పై దాడిచేసిన తెరాస కార్యకర్తలపై- కేసీఆర్‌పైనా వాగ్భాణాలు సంధించిన మోహన్ బాబుపై ప్రశంసలు వర్షం కురుస్తోంది. నిన్నరాత్రి తెలంగాణా నాయకులు కూడా మోహన్ బాబు కుటుంబాన్ని పరామర్శించడం విశేషం. మధుయాష్కితోపాటు పలువురు నాయకులు ఆయనను పరామర్శించిన వారిలో ఉన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Dec 2009 | 7:09 am జగపతి బాబు, ప్రియమణిల "సాధ్యం"జగపతిబాబు, ప్రియమణి జంటగా రూపొందుతున్న చిత్రం సాధ్యం. కుమార్ బ్రదర్స్ సినీ పతాకంపై కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో చివరి షెడ్యూల్ జరుపుకుంటోన్న ఈ చిత్ర విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ... వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి సాధ్యం అనే టైటిల్ నూరుశాతం సరిపోతుంది.Source: Yahoo! Telugu: Entertainment | 23 Dec 2009 | 4:59 am ఏకాభిప్రాయమే ఏకైక మార్గం: కేంద్ర హోంశాఖ?రాష్ట్ర విభజనపై ఏకాభిప్రాయమే శరణ్యం, ఏకైక మార్గమని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఏకాభిప్రాయం కుదిరేవరకు రాష్ట్ర ప్రజలంతా సంయమనం పాటించాలని సూచించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజనపై కేంద్రం హోంశాఖ ప్రకటన తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు మాట మార్చాయని అందువల్ల అప్పటి వరకు వేచి చూడాలని కేంద్ర హోంశాఖ పేర్కొన్నట్టు సమాచారం.Source: జాతీయ | 23 Dec 2009 | 3:14 am ఫ్యూచర్ ఫిల్మ్‌ను నిర్మిస్తున్న మదురై మైక్రో ఫైనాన్స్!తమిళనాడుకు చెందిన మదురా మైక్రో ఫైనాన్స్ సంస్థ సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపు (స్వయం సహాయ బృందాలు)లకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా ఒక వినూత్న ప్రాజెక్టును చేపట్టింది. మదురైకు చెందిన ఒక మహిళా స్వయం వృద్ధి ఆధారంగా చేసుకుని 'శక్తి పిరక్కుదు' అనే ఫ్యూచర్ ఫిల్మ్ ప్రాజెక్టును నిర్మిస్తోంది.Source: వినోదం | 23 Dec 2009 | 2:27 am ముగిసిన కోర్ కమిటీ భేటీ: సాయంత్రంలోగా ప్రకటనసమైక్యాంధ్రా... తెలంగాణాపై చిక్కుముడి విప్పే ఘడియలు ముంచుకొస్తున్నాయి. కేంద్ర కోర్ కమిటీ బుధవారం సమావేశమై సమస్యపై సుమారు అరగంటపాటు చర్చించింది. దీనిపై ఒకపేజీ డ్రాఫ్ట్‌ను తయారు చేసి అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని ఆమోదానికి ప్రణబ్ ముఖర్జీ తీసుకుని వెళ్లారు.Source: జాతీయ | 23 Dec 2009 | 2:02 am
|