|
ఊతమిచ్చిన ప్రణబ్ ప్రకటన: సెన్సెక్స్ భారీ వృద్ధిప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆర్థిక వృద్ధి 7.5 శాతం నుంచి 8 శాతానికి చేరుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారం చేసిన ప్రకటన సెన్సెక్స్‌కు ఊతమిచ్చింది. దీంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 527 పాయింట్లు భారీగా వృద్ధి చెంది, 17,219 పాయింట్ల గరిష్ట స్థాయి వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 160 పాయింట్లు భారీగా పుంజుకుని, 5,145 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 23 Dec 2009 | 8:28 am అదనపు భత్యాలపై పన్ను విధించడం కొత్త కాదుప్రభుత్వోద్యోగులు తమకు అందే అదనపు భత్యాలపై పన్ను విధించడం, అదనపు ప్రయోజనాల పన్ను(ఎఫ్‌బిటి)కు ముందు కూడా ఇలాంటి ప్రోత్సాహకాలు పన్ను పరిధిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శి అశోక్ చావ్లా వివరించారు.Source: Yahoo! Telugu: News | 23 Dec 2009 | 8:12 am ఫ్యూచర్ ఫిల్మ్‌ను నిర్మిస్తున్న మదురై మైక్రో ఫైనాన్స్!తమిళనాడుకు చెందిన మదురా మైక్రో ఫైనాన్స్ సంస్థ సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపు (స్వయం సహాయ బృందాలు)లకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా ఒక వినూత్న ప్రాజెక్టును చేపట్టింది. మదురైకు చెందిన ఒక మహిళా స్వయం వృద్ధి ఆధారంగా చేసుకుని 'శక్తి పిరక్కుదు' అనే ఫ్యూచర్ ఫిల్మ్ ప్రాజెక్టును నిర్మిస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 23 Dec 2009 | 7:56 am పీకలు కోసి.. శవాలను పాలిస్తారా: తలసాని ప్రశ్న?హైదరాబాద్ మాటెత్తితే నాలుకలు, పీకలు కోస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ భాష, యాస మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.Source: Yahoo! Telugu: News | 23 Dec 2009 | 7:49 am విదేశీ మార్కెట్ల ప్రభావం: సెన్సెక్స్ పై.. పైకి..!విదేశీ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ పురోగమనం వైపు ఉరకలేస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభాలను ఆర్జిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. 496 పాయింట్లు భారీగా పుంజుకుని, 17,188 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 141 పాయింట్ల భారీ వృద్ధితో, 5,127 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 23 Dec 2009 | 7:36 am ముగిసిన కోర్ కమిటీ చర్చ: సాయంత్రంలోగా ప్రకటనసమైక్యాంధ్రా... తెలంగాణాపై చిక్కుముడి విప్పే ఘడియలు ముంచుకొస్తున్నాయి. కేంద్ర కోర్ కమిటీ బుధవారం సమావేశమై సమస్యపై సుమారు అరగంటపాటు చర్చించింది. దీనిపై ఒకపేజీ డ్రాఫ్ట్‌ను తయారు చేసి అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని ఆమోదానికి ప్రణబ్ ముఖర్జీ తీసుకుని వెళ్లారు.Source: Yahoo! Telugu: News | 23 Dec 2009 | 7:32 am కేసీఆర్‌కు సరైన మొగుడు మోహన్ బాబేదేనికైనా ఢీ అంటే ఢీ అనేవాడుంటేనే పస తెలుస్తుంది. మంగళవారంనాడు తన కుమారుని షూటింగ్‌పై దాడిచేసిన తెరాస కార్యకర్తలపై- కేసీఆర్‌పైనా వాగ్భాణాలు సంధించిన మోహన్ బాబుపై ప్రశంసలు వర్షం కురుస్తోంది. నిన్నరాత్రి తెలంగాణా నాయకులు కూడా మోహన్ బాబు కుటుంబాన్ని పరామర్శించడం విశేషం. మధుయాష్కితోపాటు పలువురు నాయకులు ఆయనను పరామర్శించిన వారిలో ఉన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Dec 2009 | 7:09 am ఆర్థిక వృద్ధి 8 శాతానికి చేరుకుంటుంది : ప్రణబ్ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆర్థిక వృద్ధి 7.5 శాతం నుంచి 8 శాతానికి చేరుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారం వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 23 Dec 2009 | 7:05 am భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్: గరిష్ట స్థాయికి సెన్సెక్స్బుధవారం బాంబే స్టాక్ మార్కెట్‌కు అన్ని విధాలా కలిసొచ్చింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభాలను నమోదు చేసుకుంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో 429 పాయింట్లు భారీగా లాభపడి, 17,121 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 130 పాయింట్లు భారీగా వృద్ధి చెంది, 5,115 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 23 Dec 2009 | 6:56 am కాశ్మీర్ సమస్యే దక్షిణాసియా సుస్థిరతకు మార్గం!భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య దశాబ్దాల కాలంగా నెలకొని ఉన్న వివాదాస్పద కాశ్మీర్ సమస్యకు పరిష్కారమార్గం కనుగొంటే దక్షిణాసియా సుస్థిరత సాధ్యం అవుతుందని అమెరికా మిలిటరీ కమాండర్ మైక్ ముల్లెన్ అన్నారు. ఈ ప్రాంతంలోనే అల్‌ఖైదా, తాలిబాన్, లష్కర్ తోయిబా, జైష్ మొహ్మద్ వంటి తీవ్రవాద సంస్థలు ఎక్కువగా పని చేస్తున్నాయన్నారు.Source: Yahoo! Telugu: News | 23 Dec 2009 | 6:13 am సోరేన్‌ను సీఎం చేస్తే ఎవరికైనా జేఎంఎం మద్దతు!జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తిమోర్ఛా అధినేత శిబూ సోరేన్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తే తాము ఎవరికైనా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు జేఎంఎం నేతలు బుధవారం ప్రకటించారు. జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడుతున్న విషయం తెల్సిందే. ఈ ఫలితాల ట్రెండ్‌లో ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ దక్కేలా కనిపించడం లేదు.Source: Yahoo! Telugu: News | 23 Dec 2009 | 6:12 am శీతాకాల విడిది కోసం రాజధానికి వస్తున్న రాష్ట్రపతిశీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈనెల 28వ తేదీన రాజధాని హైదరాబాద్‌లోని బొల్లారం అతిథి గృహానికి చేరుకోనున్నారు. రాజధానికి వచ్చే రాష్ట్రపతి క్రిస్మస్ పండగతో పాటు.. నూతన సంవత్సర వేడుకలను రాజధానిలోనే జరుపుకుంటారు. వచ్చే నెల ఆరో తేదీన తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.Source: Yahoo! Telugu: News | 23 Dec 2009 | 5:57 am జగపతి బాబు, ప్రియమణిల "సాధ్యం"జగపతిబాబు, ప్రియమణి జంటగా రూపొందుతున్న చిత్రం సాధ్యం. కుమార్ బ్రదర్స్ సినీ పతాకంపై కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో చివరి షెడ్యూల్ జరుపుకుంటోన్న ఈ చిత్ర విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ... వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి సాధ్యం అనే టైటిల్ నూరుశాతం సరిపోతుంది.Source: Yahoo! Telugu: Entertainment | 23 Dec 2009 | 4:59 am ఏకాభిప్రాయమే ఏకైక మార్గం: కేంద్ర హోంశాఖ?రాష్ట్ర విభజనపై ఏకాభిప్రాయమే శరణ్యం, ఏకైక మార్గమని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఏకాభిప్రాయం కుదిరేవరకు రాష్ట్ర ప్రజలంతా సంయమనం పాటించాలని సూచించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజనపై కేంద్రం హోంశాఖ ప్రకటన తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు మాట మార్చాయని అందువల్ల అప్పటి వరకు వేచి చూడాలని కేంద్ర హోంశాఖ పేర్కొన్నట్టు సమాచారం.Source: జాతీయ | 23 Dec 2009 | 3:14 am పీకలు కోసి.. శవాలను పాలిస్తారా: తలసాని ప్రశ్న?హైదరాబాద్ మాటెత్తితే నాలుకలు, పీకలు కోస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ భాష, యాస మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.Source: ఏపీ న్యూస్ | 23 Dec 2009 | 2:19 am ముగిసిన కోర్ కమిటీ భేటీ: సాయంత్రంలోగా ప్రకటనసమైక్యాంధ్రా... తెలంగాణాపై చిక్కుముడి విప్పే ఘడియలు ముంచుకొస్తున్నాయి. కేంద్ర కోర్ కమిటీ బుధవారం సమావేశమై సమస్యపై సుమారు అరగంటపాటు చర్చించింది. దీనిపై ఒకపేజీ డ్రాఫ్ట్‌ను తయారు చేసి అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని ఆమోదానికి ప్రణబ్ ముఖర్జీ తీసుకుని వెళ్లారు.Source: జాతీయ | 23 Dec 2009 | 2:02 am సోరేన్‌ను సీఎం చేస్తే ఎవరికైనా జేఎంఎం మద్దతు!జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తిమోర్ఛా అధినేత శిబూ సోరేన్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తే తాము ఎవరికైనా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు జేఎంఎం నేతలు బుధవారం ప్రకటించారు. జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడుతున్న విషయం తెల్సిందే. ఈ ఫలితాల ట్రెండ్‌లో ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ దక్కేలా కనిపించడం లేదు.Source: జాతీయ | 23 Dec 2009 | 12:43 am శీతాకాల విడిది కోసం రాజధానికి వస్తున్న రాష్ట్రపతిశీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈనెల 28వ తేదీన రాజధాని హైదరాబాద్‌లోని బొల్లారం అతిథి గృహానికి చేరుకోనున్నారు. రాజధానికి వచ్చే రాష్ట్రపతి క్రిస్మస్ పండగతో పాటు.. నూతన సంవత్సర వేడుకలను రాజధానిలోనే జరుపుకుంటారు. వచ్చే నెల ఆరో తేదీన తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.Source: ఏపీ న్యూస్ | 23 Dec 2009 | 12:27 am రాష్ట్ర విచ్ఛిన్నానికి కాంగ్రెస్ కుట్ర: తెదేపా నేతలుఅన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉన్న తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య కాంగ్రెస్ అధిష్టానం చిచ్చుపెట్టి, విడదీసేందుకు కుట్ర పన్నిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఆరోపించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర తెదేపా నేతలు చేపట్టిన బస్సు యాత్రం ప్రకాశం జిల్లాకు చేరుకుంది.Source: ఏపీ న్యూస్ | 23 Dec 2009 | 12:20 am హైదరాబాద్‌లో శాంతియాత్రకు అనుమతివ్వండి!సమైక్యాంధ్ర ఉద్యమంలో గొంతు కలిగిన సినీ నటుడు మోహన్ బాబు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో శాంతియాత్ర నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి రోశయ్యను విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు.Source: ఏపీ న్యూస్ | 22 Dec 2009 | 11:47 pm నిర్బంధ ఓటింగ్ బిల్లుపై ఈసీ పెదవి విరుపు!గుజరాత్‌లోని నరేంద్ర మోడీ సర్కారు ప్రవేశపెట్టిన నిర్బంధం ఓటింగు బిల్లుపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల అధికారి ఎస్.వై.ఖురేషీ పెదవి విరిచారు. స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రవేశపెట్టిన నిర్బంధం ఓటింగ్ బిల్లుకు గుజరాత్ అసెంబ్లీ ఆమోదం తెలిపిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 22 Dec 2009 | 11:05 pm మిస్టర్ కేసీఆర్.. కంట్రోల్ యువర్ టంగ్: మోహన్బాబుమిస్టర్ కేసీఆర్.. కంట్రోల్ యువర్ టంగ్ అని కలెక్షన్ సింగ్ మోహన్ బాబు హెచ్చరించారు. ఎంతమంది నాలుకలు కోస్తారు. మాట్లాడేటపుడు వాడే భాషను జాగ్రత్తగా ఉపయోగించడం నేర్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుకు సినీ నటుడు మోహన్ బాబు సూచన చేశారు. అలా కాకుండే ఎదురయ్యే పరిణామాల తీవ్రంగా ఉంటాయన్నారు.Source: ఏపీ న్యూస్ | 22 Dec 2009 | 10:58 pm కేసీఆర్.. తస్మాత్ జాగ్రత్త: చిరంజీవి హెచ్చరికతెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు తను వాడే భాషను మార్చుకోక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి హెచ్చరించారు. హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదనీ, అంతకంటే ముందు.. కేసీఆర్ సొత్తూ కాదని ఆయన అన్నారు.Source: ఏపీ న్యూస్ | 22 Dec 2009 | 9:53 pm హంగ్ దిశగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు!జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓటరు దేవుడు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. ఫలితంగా మరోమారు హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అయితే భారతీయ జనతా పార్టీ కూటమి 25 సీట్లతో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ కూటమి 18 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ బేరసారాలు దిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కనిపిస్తోంది.Source: జాతీయ | 22 Dec 2009 | 9:28 pm సంక్షోభ నివారణకు త్రిసూత్ర పథకం: నేడు ప్రకటన!ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమ సెగలను నివారించేందుకు కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్థాయిలో కసరత్తు చేపట్టింది. పార్టీ ప్రతిష్టతతో పాటు.. రెండు ప్రాంతాల ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని మూడు సూత్రాల పథకాన్ని తెరపైకి తెచ్చినట్టు సమాచారం.Source: జాతీయ | 22 Dec 2009 | 8:59 pm సీమ గొడ్డుకారం తిన్నవాడ్ని.. మాతో పెట్టుకోకు!!: మోహన్ బాబుమంగళవారంనాడు జూబ్లిహిల్స్‌లోని ఓ ప్రైవేటు భవంతిలో మోహన్ బాబు కుమార్తె నిర్మాతగా మంచు మనోజ్ హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్న చిత్రం షూటింగ్‌కు తెరాస కార్యకర్తలని చెప్పుకునేవారు తీవ్ర అంతరాయం కలగజేశారు. దీంతో కెమేరాలు పగిలిపోయాయి. లక్ష్మీప్రసన్న చేతులు పట్టుకుని నానా రభస చేశారు. ఇదంతా పోలీసు అధికారి మహేష్ గౌడ్ దగ్గరుండి చేయించారని లక్ష్మీప్రసన్న ఆరోపించింది. దీంతో కలత చెందిన మోహన్ బాబు తెరాస అధినేత చంద్రశేఖరరావుపై తీవ్రంగా స్పందించారు.Source: Yahoo! Telugu: Entertainment | 22 Dec 2009 | 9:42 am హైదరాబాదు గురించి మాట్లాడితే నాలుక కోస్తా: కేసీఆర్ప్రత్యేక తెలంగాణాను అడ్డుకుంటే అణువిస్పోటనం సంభవిస్తుందని హెచ్చరించారు. హైదరాబాదు తెలంగాణాకే చెందుతుందనీ, హైదరాబాదు గురించి ఎవరైనా మాట్లాడితే నాలుక కోస్తామని పరోక్షంగా మోహన్ బాబుపై తీవ్ర విమర్శలు చేశారు. సినిమావాళ్లు సినిమాలు తీసుకుంటూ బతకాలనీ, రాజకీయాల జోలికి వస్తే తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించారు.Source: ఏపీ న్యూస్ | 22 Dec 2009 | 8:48 am ఆంధ్రప్రదేశ్ అంశంపై రేపు వెలువడనున్న ప్రకటనఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ అంశం, సమైక్యాంధ్ర అంశాలకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం రేపు ప్రకటనించనుంది. కేంద్ర హోం శాఖామంత్రి చిదంబరం సోమవారం సాయంత్రం కోలకతాకు వెళ్ళడంతో ఈ రోజు ప్రకటించాల్సిన ప్రకటన రేపటికి వాయిదా పడింది.Source: జాతీయ | 22 Dec 2009 | 7:44 am మంత్రి చిదంబరం ఒక అబద్ధాల కోరు: కిషన్జీకేంద్ర హోం మంత్రి చిదంబరం పచ్చి అబద్దాల కోరని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. 2009 సంవత్సరం ఏమాత్రం ఆశాజనకంగా లేదని, తమపై దాడులు చేస్తే 2010 సంవత్సరం దారుణంగా ఉంటుందని మావోయిస్టులు హెచ్చరించారు. ఈ విషయాన్ని మావోయిస్టుకు చెందిన అగ్రనేత వెల్లడించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. చిదంబరం పెద్ద అబద్దాల కోరు. మావోయిస్టులపై ఎలాంటి చర్య చేపట్టడంలేదని మీడియాకు చెప్పారు.Source: జాతీయ | 22 Dec 2009 | 5:44 am అవును.. నేను కూడా లగడపాటి లానే...: వర్మపాతికేళ్ల క్రితం నా మిత్రుడు ఎంతటి దృఢ సంకల్పంతో, దృఢ చిత్తంతో ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడని సుప్రసిద్ధ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. ఇంతకీ ఆ మిత్రుడు ఎవరో తెలుసా... కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్. సమైక్యాంధ్ర సాధనకు దీక్షను సాగిస్తున్న లగడపాటి నాడు ఎంతపట్టుదల ఉన్నదో అదే పట్టుదల ఇప్పుడు కూడా కనిపిస్తోందని అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. రాజగోపాల్ మనస్తత్వం నిస్వార్థమైనదని వర్మ చెప్పారు.ఇటీవల లగడపాటి ఓ మీడియా ఇంటర్వ్యూలో తను, రామ్‌గోపాల్ వర్మ పాతికేళ్ల క్రితం స్నేహితులుగా ఉన్న నాటి పరిస్థితులను ఒక్కసారి నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా తామిద్దరం ఓ సమస్యపై హైదరాబాద్‌కి వెళ్లిన సందర్భాన్ని, అక్కడ ఓ ఎకౌంట్‌ను సెటిల్ చేసిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. వర్మ ఎంతో ధైర్యవంతుడనీ, తను చెప్పదలచుకున్నదీ ధైర్యంగా చెప్పి ఒప్పిస్తాడని లగడపాటి కితాబు ఇచ్చాడు.Source: Yahoo! Telugu: Entertainment | 22 Dec 2009 | 4:38 am హైదరాబాద్ కేసీఆర్ మేనమామ సొత్తా: మోహన్బాబురాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఏమైనా తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు మేనమామా సొత్తా అని విలక్షణ నటుడు మోహన్‌బాబు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం ఎలా చేస్తున్నావో అలాంటి హక్కే తమకు సమైక్యాంధ్ర ఉద్యమం చేసేందుకు ఉందన్నారు.Source: ఏపీ న్యూస్ | 22 Dec 2009 | 4:33 am కేసీఆర్‌లో కూడా మార్పు వస్తుంది: లగడపాటితెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావులో కూడా మార్పు వస్తుందని, అందువల్ల ఆయనను దూషించవద్దని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావ సమయంలో తెలంగాణకు అనుకూలమన్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సమైక్యాంధ్రకు జై కొట్టడం హర్షించదగ్గ పరిణామన్నారు.Source: ఏపీ న్యూస్ | 22 Dec 2009 | 4:19 am రేపు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి!జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. ఫలితాలపై కాంగ్రెస్, భాజపాలతో పాటు.. ప్రాంతీయ పార్టీలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సంఖ్యకు సమీపంలో వచ్చి ఆగినట్టయితే, ఇతర పార్టీల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో భాజపా, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.Source: జాతీయ | 22 Dec 2009 | 3:30 am హైదరాబాద్‌కు తీసుకొచ్చింది తెలంగాణా వారే!తాను రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వచ్చేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించింది తెలంగాణవారేనని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు తాను దొంగచాటుగా వచ్చేందుకు పోలీసుల అనుసరే ఏకైక కారణమని అన్నారు. ఆయన మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ తాను విజయవాడ పోలీసుల నిర్భంధంలో లేనన్నారు.Source: ఏపీ న్యూస్ | 22 Dec 2009 | 3:09 am
|