|
హైదరాబాద్‌కు తీసుకొచ్చింది తెలంగాణా వారే!తాను రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వచ్చేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించింది తెలంగాణవారేనని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు తాను దొంగచాటుగా వచ్చేందుకు పోలీసుల అనుసరే ఏకైక కారణమని అన్నారు. ఆయన మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ తాను విజయవాడ పోలీసుల నిర్భంధంలో లేనన్నారు.Source: Yahoo! Telugu: News | 22 Dec 2009 | 8:38 am డిజికేబుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఐబిఎమ్తమ సంస్థ కేబుల్, బ్రాడ్‌బ్యాండ్ ప్లేయర్ నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న అమెరికాకు చెందిన డిజికేబుల్ సంస్థతో రూ. 380 కోట్ల వ్యాపార ఒప్పందం కుదుర్చుకుందని, ఈ ఒప్పందం పది సంవత్సరాలపాటు కొనసాగుతుందని ఐబిఎమ్ సంస్థకు చెందిన ఇండియా, దక్షిణ ఆసియా డైరెక్టర్(సొల్యూషన్స్)కెఎస్ రఘునాథన్ మంగళవారం విలేకరులకు వెల్లడించారుSource: Yahoo! Telugu: News | 22 Dec 2009 | 8:28 am ఐవీ ఫ్లూయిడ్స్‌తో దీక్షలు చేయడం సిగ్గుచేటు: లగడపాటినిరాహారదీక్షల్లో రెండు రకాలు ఉంటాయి. వాటిలో ఒకటి జాతిపిత మహాత్మా గాంధీ చేసిన పవిత్రమైన దీక్ష. రెండోది ఐవీ ఫ్లూయిడ్స్‌ను తీసుకుంటూ ముఫ్పై సంవత్సరాల పాటు ఆస్పత్రిలో నిశ్చింతగా దీక్ష చేయవచ్చని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఇలాంటి దీక్షల్లో తాను పాలుపంచుకోవడంలో సిగ్గుపడుతున్నట్టు చెప్పారు.Source: Yahoo! Telugu: News | 22 Dec 2009 | 8:10 am జనవరిలో తగ్గనున్న నిత్యావసర సరుకుల ధరలుదేశంలోని నిత్యావసర సరుకుల ధరలు కొత్త సంవత్సరం జనవరి నాటికి తగ్గనున్నాయని కేంద్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా మంగళవారం కోలకతాలో తెలిపారు.Source: Yahoo! Telugu: News | 22 Dec 2009 | 8:02 am లాభాల్లో విదేశీ మార్కెట్లు: సెన్సెక్స్ వృద్ధిబాంబే స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతోంది. ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్ల ఆశాజనక సంకేతాలతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 2 గంటలకు 68 పాయింట్లు వృద్ధి చెంది, 16,669 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 29 పాయింట్లు బలపడి, 4,982 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 22 Dec 2009 | 7:44 am పుంజుకున్న ట్రేడింగ్: లాభాల్లో సెన్సెక్స్దేశీయ వాటాల ట్రేడింగ్ పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాల్లో పయనిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాల్లో కొనసాగుతోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 99 పాయింట్లు వృద్ధి చెంది, 16,700 పాయింట్ల వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 31 పాయింట్లు పుంజుకుని, 4,983 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 22 Dec 2009 | 7:32 am లాభాలతో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఆశాజనకంగా కొనసాగుతోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో 112 పాయింట్లు వృద్ధి చెంది, 16,713 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 35 పాయింట్లు పుంజుకుని, 4,988 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 22 Dec 2009 | 6:34 am లగడపాటికి కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలుపువిజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి రావాలని మంగళవారం కబురు పంపింది. దీంతో ఆయన ఆమరణ నిరాహారదీక్షను విరమించుకుని హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు.Source: Yahoo! Telugu: News | 22 Dec 2009 | 6:30 am దేశంలో 11 నగరాల్లో తీవ్రవాదుల దాడికి కుట్ర: ఐబీక్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలను అడ్డుపెట్టుకుని దేశంలో 11 నగరాల్లో తీవ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. తీవ్రవాదుల లక్ష్యాల్లో హైదరాబాద్, వైజాగ్ నగరాలతో పాటు.. అనేక ముఖ్య నగరాలపై దాడులు జరుగవచ్చని ఐబీ వర్గాలు పేర్కొన్నాయి.Source: Yahoo! Telugu: News | 22 Dec 2009 | 6:17 am గణితశాస్త్రంపై అధిక శ్రద్ధ చూపాలి: ఒబామా పిలుపుతమ బంగారు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఎక్కువగా గణితశాస్త్రపై దృష్టి కేంద్రీకరించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఆయన పలువురు చిన్నారులతో కొద్దిసేపు గడిపారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో జరిగిన ఈ వేడుకల్లో అమెరికాలోని బాయిస్ క్లబ్‌కు చెందిన 6-11 వయస్సు కలిగిన 27 మంది చిన్నారులు పాల్గొన్నారు.Source: Yahoo! Telugu: News | 22 Dec 2009 | 5:49 am అవును.. నేను కూడా లగడపాటి లానే...: వర్మపాతికేళ్ల క్రితం నా మిత్రుడు ఎంతటి దృఢ సంకల్పంతో, దృఢ చిత్తంతో ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడని సుప్రసిద్ధ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. ఇంతకీ ఆ మిత్రుడు ఎవరో తెలుసా... కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్. సమైక్యాంధ్ర సాధనకు దీక్షను సాగిస్తున్న లగడపాటి నాడు ఎంతపట్టుదల ఉన్నదో అదే పట్టుదల ఇప్పుడు కూడా కనిపిస్తోందని అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. రాజగోపాల్ మనస్తత్వం నిస్వార్థమైనదని వర్మ చెప్పారు.ఇటీవల లగడపాటి ఓ మీడియా ఇంటర్వ్యూలో తను, రామ్‌గోపాల్ వర్మ పాతికేళ్ల క్రితం స్నేహితులుగా ఉన్న నాటి పరిస్థితులను ఒక్కసారి నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా తామిద్దరం ఓ సమస్యపై హైదరాబాద్‌కి వెళ్లిన సందర్భాన్ని, అక్కడ ఓ ఎకౌంట్‌ను సెటిల్ చేసిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. వర్మ ఎంతో ధైర్యవంతుడనీ, తను చెప్పదలచుకున్నదీ ధైర్యంగా చెప్పి ఒప్పిస్తాడని లగడపాటి కితాబు ఇచ్చాడు.Source: Yahoo! Telugu: Entertainment | 22 Dec 2009 | 4:38 am హైదరాబాద్‌కు తీసుకొచ్చింది తెలంగాణా వారే!తాను రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వచ్చేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించింది తెలంగాణవారేనని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు తాను దొంగచాటుగా వచ్చేందుకు పోలీసుల అనుసరే ఏకైక కారణమని అన్నారు. ఆయన మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ తాను విజయవాడ పోలీసుల నిర్భంధంలో లేనన్నారు.Source: ఏపీ న్యూస్ | 22 Dec 2009 | 3:09 am ఐవీ ఫ్లూయిడ్స్‌తో దీక్షలు చేయడం సిగ్గుచేటు: లగడపాటినిరాహారదీక్షల్లో రెండు రకాలు ఉంటాయి. వాటిలో ఒకటి జాతిపిత మహాత్మా గాంధీ చేసిన పవిత్రమైన దీక్ష. రెండోది ఐవీ ఫ్లూయిడ్స్‌ను తీసుకుంటూ ముఫ్పై సంవత్సరాల పాటు ఆస్పత్రిలో నిశ్చింతగా దీక్ష చేయవచ్చని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఇలాంటి దీక్షల్లో తాను పాలుపంచుకోవడంలో సిగ్గుపడుతున్నట్టు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 22 Dec 2009 | 2:41 am లగడపాటికి కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలుపువిజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి రావాలని మంగళవారం కబురు పంపింది. దీంతో ఆయన ఆమరణ నిరాహారదీక్షను విరమించుకుని హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు.Source: ఏపీ న్యూస్ | 22 Dec 2009 | 1:00 am దేశంలో 11 నగరాల్లో తీవ్రవాదుల దాడికి కుట్ర: ఐబీక్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలను అడ్డుపెట్టుకుని దేశంలో 11 నగరాల్లో తీవ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. తీవ్రవాదుల లక్ష్యాల్లో హైదరాబాద్, వైజాగ్ నగరాలతో పాటు.. అనేక ముఖ్య నగరాలపై దాడులు జరుగవచ్చని ఐబీ వర్గాలు పేర్కొన్నాయి.Source: జాతీయ | 22 Dec 2009 | 12:47 am కేసీఆర్ తన భాషను సరిచేసుకోవాలి: చిరంజీవిపశ్చిమగోదావరి జిల్లాలో చిరంజీవి మంగళవారం సమైక్యాంధ్రకు మద్దతుగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి కేసీఆర్, చంద్రబాబులపై విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ భాష, పదజాలం ప్రజలను కించపరిచేలా ఉన్నాయన్నారు. ఆయన తన పదజాలాన్ని కాస్త అదుపులో పెట్టుకుంటే మంచిదని సూచించారు.Source: ఏపీ న్యూస్ | 21 Dec 2009 | 11:54 pm ముంబైలో సాధువులపై ఎంఎన్ఎస్ కార్యకర్తల వీరంగం!మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్)కు చెందిన కార్యకర్తలు మరోమారు తమ విచక్షణను మరిచిపోయారు. తమ పార్టీ అధినేతను ఎక్కడో ఓ సాధువు పరుష పదజాలంతో దూషించారన్న వార్త తెలుసుకున్న ఎంఎన్ఎస్ కార్యకర్తలు ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం వద్ద ఉండే సాధువులను పశువులను బాదినట్టు బాదారు. ఒక విధంగా చెప్పాలంటే.. ముంబైలో గూండా రాజ్యాన్ని తలపించజేశారు.Source: జాతీయ | 21 Dec 2009 | 11:37 pm మీడియాతో మాట్లాడేందుకు అనుమతివ్వండి!తాను మీడియాతో మాట్లాడాలని భావిస్తున్నానని అందువల్ల తనకు అనుమతి ఇవ్వాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, తాను మీడియాను ఎక్కడ కలుసుకోవాలో కూడా ప్రభుత్వమే స్థలాన్ని ఎంపిక చేయాలని తన విన్నపంలో కోరారు.Source: ఏపీ న్యూస్ | 21 Dec 2009 | 11:10 pm కఠువుగా నడుచుకుంటా: మంత్రులతో రోశయ్య!క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టానని, అప్పటి నుంచి తనకు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీకి చెందిన సభ్యులే తనను అనేక ఇక్కట్లకు గురి చేస్తున్నారన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునే మనస్తత్వం తనకు లేదన్నారు. అందువల్లే ఈ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 21 Dec 2009 | 10:54 pm నిమ్స్ నుంచి లగడపాటిని తరలించరు: జేసీఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను నిమ్స్‌ను తరలించే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేసీ.దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా లగడపాటి ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 21 Dec 2009 | 10:48 pm రాజధాని కంటే బెంగాల్‌లో శాంతిభద్రతలు భేష్!దేశ రాజధాని న్యూఢిల్లీ కంటే మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రమైన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోనే శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. అయితే, గత యేడాదితో పోల్చితే ఈ యేడాది నేరాల సంఖ్య కొద్దిగా పెరిగిందని ఆయన అంగీకరించారు. అదేసమయంలో శాంతిభద్రల పరిరక్షణలో ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల కంటే తాము ముందున్నట్టు వివరించారు.Source: జాతీయ | 21 Dec 2009 | 9:29 pm 'రాష్ట్ర విభజన' పరిష్కారంపై ప్రధాని తర్జనభర్జనలురాష్ట్ర విభజన సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా కాంగ్రెస్ అధిష్టానం చర్యలు ప్రారంభించింది. ఈ అంశంపై సీమాంధ్ర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆందోళనలపై కాంగ్రెస్ కోర్ కమిటీ సోమవారం రాత్రి రెండు గంటల పాటు సమీక్షా సమావేశం నిర్వహించింది. అయితే, సమస్య పరిష్కారానికి మాత్రం ఎలాంటి తీసుకోలేక పోయింది. దీంతో మంగళవారం మరోమారు సమావేశమై తుది నిర్మయం తీసుకోవాలని భావిస్తున్నారు.Source: జాతీయ | 21 Dec 2009 | 8:57 pm హాలీవుడ్ అవతార్ ట్రెయిలర్ మీకోసం...టాలీవుడ్‌లో ఆయా హీరోల సినిమాలు తెలంగాణా సెగతో ప్రదర్శనలకు నోచుకోలేకపోతున్నాయి. ఈ పరిస్థితిలో హాలీవుడ్ నుంచి దిగుమతి అయిన తోకమానవుల "అవతార్" రాష్ట్రంలోని అన్ని ప్రధాన థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతూ కలెక్షన్లను కురిపిస్తోంది. టైటానిక్ దర్శకుడు జేమ్స్ కేమరూన్ రూపొందించిన ఈ తోకమానవుల అవతార్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు. మొత్తానికి తెలంగాణా సమస్య, హాలీవుడ్ అవతార్‌కు కాసుల పంట కురిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్‌ను వీక్షించండి.Source: Yahoo! Telugu: Entertainment | 21 Dec 2009 | 11:46 am వెరైటీ లవ్‌స్టోరీ "తెలియదు" ఆడియో ఆవిష్కరణకేమ్ ఫ్రెండ్స్ అకాడమీ పతాకంపై హండ్రెడ్, శరత్, నాగతేజ, సంతోష్ పార్లలార్, అలేఖ్య హీరోహీరోయిన్లుగా డాక్టర్. రాజిరెడ్డి గుఱ్ఱం దర్శకత్వంలో రూపొందిన వెరైటీ లవ్‌స్టోరీ "తెలియదు". ఈ చిత్రం ఆడియో వేడుక ఇటీవలే వైభవంగా జరిగింది. తొలి సీడీని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆవిష్కరించి సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అందజేశారు. మలిసీడీని రచయిత సుద్దాల అశోక్ తేజకు అందజేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 Dec 2009 | 11:02 am "మంగళ"గా వస్తోన్న "మంత్ర"..!?"మంత్ర" వంటి హిట్ చిత్రాన్ని అందించిన తులసిరాం.. మళ్లీ ఛార్మి కాంబినేషన్‌లో మరో సూపర్ హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించనున్నాడు. ఈ చిత్రానికి "మంగళ" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిసిందే. ఇంకా జనవరి చివరిలో సెట్స్‌పైకి వస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. "మంత్ర" తర్వాత మనోరమ, కావ్యాస్ డైరీ, 16 డేస్ వంటి చిత్రాల్లో నటించిన ఛార్మికి మంచి హిట్ లభించలేదు. కానీ మంగళ పేరుతో రానున్న ఈ చిత్రం తప్పకుండా ఛార్మికి మంచి పేరు సంపాదించిపెడుతుందని సినీ జనం అనుకుంటున్నారు."మంగళ"గా విభిన్న పాత్రలో ప్రేక్షకులను ముందుకు రానున్న ఛార్మి.. ఇందులో నటనాపరంగా, గ్లామర్ పరంగా ఆకట్టుకోనుందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. "మంత్ర" తర్వాత ఈ బొద్దందాల ముద్దుగుమ్మ ఛార్మికి పలు అవకాశాలు వచ్చాయి. కానీ 2008లో ఛార్మికి ఓ హిట్‌కూడా లేకపోవడంతో.. వచ్చే ఏడాదైన మంత్రకు కలిసొస్తుందేమో చూడాలని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 Dec 2009 | 9:55 am లగడపాటిని తరలించే ప్రయత్నంలో ప్రభుత్వంసమైక్యాంధ్ర కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ను నిమ్స్ ఆసుపత్రి నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయిSource: ఏపీ న్యూస్ | 21 Dec 2009 | 7:07 am విష్ణు సలీమ్ ట్రెయిలర్ వీక్షించండివిలక్షణ నటుడు మోహన్‌బాబు తనయుడు విష్ణువర్థన్ బాబు, ఇలియానా జంటగా నటించిన చిత్రం "సలీమ్". లక్ష్మీ ప్రసన్న బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుత కాలానికి అనుగుణంగా తీసిన ప్రేమకథ. ప్రతి సన్నివేశం చాలా బాగా వచ్చింది.ఈ చిత్రంలో ఇలియానా, కావేరిఝా, ఆలీ, భరణి, జయప్రకాష్ రెడ్డి, జీవా, బెనర్జీ, తెలంగాణా శకుంతల, హేమ తదితరులు నటించారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 Dec 2009 | 5:03 am మళ్లీ మాట మార్చిన తీవ్రవాది అజ్మల్ కసబ్!ముంబై దాడుల కేసుల్లో సజీవంగా పట్టుబడిన పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ మరోమారు మాట మార్చాడు. 26/11 దాడుల సమయంలో తాను ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే వంటి టాప్ ఐపీఎస్ అధికారులపై కాల్పులు జరుపలేదని ప్రకటించాడు. సోమవారం జరిగిన కేసు విచారణ సమయంలో కసబ్ పైవిధంగా ప్రకటన చేశారు. దీంతో ఈ కేసు విచారణ మరోమారు మలుపు తిరిగింది.Source: జాతీయ | 21 Dec 2009 | 4:51 am రాష్ట్ర రాజధాని నిమ్స్‌లో ఎంపీ లగడపాటి!రాష్ట్ర రాజకీయ నేతల్లో నిజమైన హీరోగా విజయవాడ లోక్‌సభ లగడపాటి రాజగోపాల్ మారారు. తెలంగాణవాదులు తమ రాష్ట్ర రాజధానిగా చెప్పుకుంటున్న హైదరాబాద్‌కు పోలీసుల కన్నుగప్పి చేరుకోవడం ఓ సాహసోపేతమైన చర్యలాంటింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా లగడపాటి లాంటి వివాదాస్పద నేత సినీ ఫక్కీలో రాజధానిలోని నిమ్స్‌కు చేరుకోవడం రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్నే విస్మయానికి గురిచేసింది.Source: ఏపీ న్యూస్ | 21 Dec 2009 | 4:40 am లగడపాటి అదృశ్యం: బెజవాడ కమిషనర్‌పై వేటు!విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తప్పించుకొని వెళ్ళిన సంఘటనకు బాధ్యులను చేస్తూ బెజవాడ పోలీసు కమిషనర్ రాజేంద్రనాథ్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 21 Dec 2009 | 4:34 am మావోల నేపథ్యంలో ఆదిత్య ఓం హీరోగా కొత్త చిత్రం!"లాహిరి లాహిరి లాహిరి"లో ఫేమ్ ఆదిత్య ఓం కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో రూపొందుతోంది. మోడ్రన్ సినిమా పతాకంపై ఆదిత్య ఓం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆదిత్య ఓం మాట్లాడుతూ.. తుపాకీద్వారా రాజ్యాధికారం సంక్రమిస్తుందనే మావో పిలుపు నేపథ్యంగా కథను తయారుచేశామన్నారు. దాన్ని మన భారతదేశ పరిస్థితులకు అన్వయించి ఈ చిత్రాన్ని తీస్తున్నామని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 Dec 2009 | 3:56 am గూర్ఖాలాండ్‌పై నాలుగోదఫా త్రైపాక్షిక చర్చలు!గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంపై నాలుగో దఫా చర్చలు సోమవారం జరుగనున్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని రాణీగంజ్‌లో ఈ చర్చలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ, గూర్ఖాలాండ్ జనముక్తి మోర్ఛాకు చెందిన ప్రతినిధులు ఈ చర్చల్లో పాలు పంచుకుంటారు.Source: జాతీయ | 21 Dec 2009 | 2:42 am
|