|
కొత్త సంవత్సర కానుక అందించనున్న బిగ్ టీవీఅనిల్ ధీరూభాయ్ అంబానీకి చెందిన సంస్థల్లో ఒకటైన డైరెక్ట్ టు హోమ్(డీటీహెచ్) బిగ్ టీవీ రానున్న క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా తన వినియోగదారులకు స్క్రాచ్ అండ్ విన్ పేరున ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది.Source: Yahoo! Telugu: News | 21 Dec 2009 | 8:38 am ఆసియా మార్కెట్ల ప్రభావం: సెన్సెక్స్ పతనంఆసియా మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదుచేసుకోవడం ద్వారా సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. 64 పాయింట్లు కోల్పోయి, 16,655 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 19 పాయింట్ల నష్టంతో 4968 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 21 Dec 2009 | 8:35 am తిరిగి నష్టాల్లో కూరుకుపోయిన సెన్సెక్స్సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి బాంబే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడం, విదేశీ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదుచేసుకోవడం వంటి కారణాలతో సెన్సెక్స్ పతనమైంది. దీంతో సోమవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 50 పాయింట్లు క్షీణించి, 16,669 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 18 పాయింట్ల నష్టంతో 4,969 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 21 Dec 2009 | 8:16 am గూర్ఖాలాండ్‌పై నాలుగోదఫా త్రైపాక్షిక చర్చలు!గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంపై నాలుగో దఫా చర్చలు సోమవారం జరుగనున్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని రాణీగంజ్‌లో ఈ చర్చలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ, గూర్ఖాలాండ్ జనముక్తి మోర్ఛాకు చెందిన ప్రతినిధులు ఈ చర్చల్లో పాలు పంచుకుంటారు.Source: Yahoo! Telugu: News | 21 Dec 2009 | 8:12 am రాజీనామా చేయాలి వుంది: సీఎం రోశయ్య ఆవేదన!అత్యంత క్లిష్ట పరిస్థితిలో తాను చేపట్టిన ముఖ్యమంత్రి పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఉందని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత ఇరవై రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల్లో ఏ ఒక్కటి కూడా తనను ప్రశాంతంగా ఉండనీయడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా ఒకటేనని ఆయన మనస్థాపం చెందారు.Source: Yahoo! Telugu: News | 21 Dec 2009 | 7:59 am 15 గంటల ఉత్కంఠతకు తెర: నిమ్స్‌లో లగడపాటి!ఎట్టకేలకు 15 గంటలు ఉత్కంఠతకు తెరపడింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి అదృశ్యమైన ఎంపీ లగడపాటి రాజగోపాల్ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యక్ష మయ్యారు. దీంతో ఆదివారం రాత్రి సోమవారం మధ్యాహ్నం వరకు అంటే సుమారు 15 గంటల పాటు నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది.Source: Yahoo! Telugu: News | 21 Dec 2009 | 7:11 am నేడో.. రేపో... అన్యోన్యమైన పరిష్కారం: మన్మోహన్తెలంగాణ అంశ పరిష్కారానికి నేడో.. రేపో ఇరు వర్గాలకు అన్యోన్యమైన పరిష్కారమార్గం కనుగొంటామని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధానిని కలుసుకున్న సీమాంధ్ర ఎంపీలకు ఆయన హామీ ఇచ్చారు.Source: Yahoo! Telugu: News | 21 Dec 2009 | 6:49 am నగల దుకాణాలను ప్రారంభించనున్న రిలయన్స్ రిటైల్ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ సంస్థ రానున్న మూడు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా రిలయన్స్ జ్యువెలర్స్ పేరుతో 85 దుకాణాలను ప్రారంభించనుంది.Source: Yahoo! Telugu: News | 21 Dec 2009 | 6:44 am జపాన్ ప్రధానికి తగ్గుతున్న ప్రజాధారణ: సర్వేజపాన్ ప్రధాని యుకియో హతోయామాకు దేశ ప్రజల ఆదరణ నానాటికీ గణనీయంగా తగ్గిపోతున్నట్టు ఒక సర్వే వెల్లడిచింది. గత నవంబరు నెలలో నిర్వహించిన ఈ సర్వే ఫలితాలను తాజాగా వెల్లడించారు. హతోమాయా అధ్యక్షతన ఉన్న ప్రభుత్వానికి 62శాతం మంది ఆదరణ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 21 Dec 2009 | 6:28 am లగడపాటి అదృశ్యం: ఐదుగురు పోలీసుల సస్పెన్షన్!విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆస్పత్రి నుంచి అదృశ్యమైన సంఘటనకు సంబంధించి ఐదుగురు పోలీసు అధికారులపై రాష్ట్ర డీజీపీ గిరీష్ కుమార్ చర్య తీసుకున్నారు. ఏసీపీ ఏవీ సుబ్బారావు, సీఐలు ధర్మేంద్ర, లక్ష్మీపతి, ఎస్ఐలు భాస్కర్ కమలాకర్‌లను సస్పెండ్ చేస్తూ డీజీపీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.Source: Yahoo! Telugu: News | 21 Dec 2009 | 6:11 am విష్ణు సలీమ్ ట్రెయిలర్ వీక్షించండివిలక్షణ నటుడు మోహన్‌బాబు తనయుడు విష్ణువర్థన్ బాబు, ఇలియానా జంటగా నటించిన చిత్రం "సలీమ్". లక్ష్మీ ప్రసన్న బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుత కాలానికి అనుగుణంగా తీసిన ప్రేమకథ. ప్రతి సన్నివేశం చాలా బాగా వచ్చింది.ఈ చిత్రంలో ఇలియానా, కావేరిఝా, ఆలీ, భరణి, జయప్రకాష్ రెడ్డి, జీవా, బెనర్జీ, తెలంగాణా శకుంతల, హేమ తదితరులు నటించారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 Dec 2009 | 5:03 am మావోల నేపథ్యంలో ఆదిత్య ఓం హీరోగా కొత్త చిత్రం!"లాహిరి లాహిరి లాహిరి"లో ఫేమ్ ఆదిత్య ఓం కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో రూపొందుతోంది. మోడ్రన్ సినిమా పతాకంపై ఆదిత్య ఓం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆదిత్య ఓం మాట్లాడుతూ.. తుపాకీద్వారా రాజ్యాధికారం సంక్రమిస్తుందనే మావో పిలుపు నేపథ్యంగా కథను తయారుచేశామన్నారు. దాన్ని మన భారతదేశ పరిస్థితులకు అన్వయించి ఈ చిత్రాన్ని తీస్తున్నామని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 Dec 2009 | 3:56 am నిజమైన డేరింగ్.. డాషింగ్ హీరో ఎంపీ లగడపాటి!రాష్ట్ర రాజకీయ నేతల్లో నిజమైన హీరోగా విజయవాడ లోక్‌సభ లగడపాటి రాజగోపాల్ మారారు. తెలంగాణవాదులు తమ రాష్ట్ర రాజధానిగా చెప్పుకుంటున్న హైదరాబాద్‌కు పోలీసుల కన్నుగప్పి చేరుకోవడం ఓ సాహసోపేతమైన చర్యలాంటింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా లగడపాటి లాంటి వివాదాస్పద నేత సినీ ఫక్కీలో రాజధానిలోని నిమ్స్‌కు చేరుకోవడం రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్నే విస్మయానికి గురిచేసింది.Source: ఏపీ న్యూస్ | 21 Dec 2009 | 3:41 am రాజీనామా చేయాలని వుంది: సీఎం రోశయ్య ఆవేదన!అత్యంత క్లిష్ట పరిస్థితిలో తాను చేపట్టిన ముఖ్యమంత్రి పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఉందని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత ఇరవై రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల్లో ఏ ఒక్కటి కూడా తనను ప్రశాంతంగా ఉండనీయడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా ఒకటేనని ఆయన మనస్థాపం చెందారు.Source: ఏపీ న్యూస్ | 21 Dec 2009 | 3:29 am గూర్ఖాలాండ్‌పై నాలుగోదఫా త్రైపాక్షిక చర్చలు!గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంపై నాలుగో దఫా చర్చలు సోమవారం జరుగనున్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని రాణీగంజ్‌లో ఈ చర్చలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ, గూర్ఖాలాండ్ జనముక్తి మోర్ఛాకు చెందిన ప్రతినిధులు ఈ చర్చల్లో పాలు పంచుకుంటారు.Source: జాతీయ | 21 Dec 2009 | 2:42 am 15 గంటల ఉత్కంఠతకు తెర: నిమ్స్‌లో లగడపాటి!ఎట్టకేలకు 15 గంటలు ఉత్కంఠతకు తెరపడింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి అదృశ్యమైన ఎంపీ లగడపాటి రాజగోపాల్ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యక్ష మయ్యారు. దీంతో ఆదివారం రాత్రి సోమవారం మధ్యాహ్నం వరకు అంటే సుమారు 15 గంటల పాటు నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది.Source: ఏపీ న్యూస్ | 21 Dec 2009 | 1:41 am నేడో.. రేపో... అన్యోన్యమైన పరిష్కారం: మన్మోహన్తెలంగాణ అంశ పరిష్కారానికి నేడో.. రేపో ఇరు వర్గాలకు అన్యోన్యమైన పరిష్కారమార్గం కనుగొంటామని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధానిని కలుసుకున్న సీమాంధ్ర ఎంపీలకు ఆయన హామీ ఇచ్చారు.Source: జాతీయ | 21 Dec 2009 | 1:19 am మారిన పరిణామాలు.. తెలంగాణ కథ కంచికేనా!పల్లె, పట్టణం, నగరం అన్న తేడా లేకుండా సీమాంధ్రలో సమైక్యాంధ్ర లక్ష్య సాధనకు జరుగుతున్న ఉద్యమాల వేడి రోజురోజుకీ ఊపందుకుంటోంది. పోలీసులు ఒకచోట దీక్ష భగ్నం చేస్తుంటే మరోచోట కొత్తగా రెండు మూడు దీక్షా శిబిరాలు పుట్టుకొస్తున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగే సూచనలు ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.Source: జాతీయ | 21 Dec 2009 | 12:43 am లగడపాటి అదృశ్యం: ఐదుగురు పోలీసుల సస్పెన్షన్!విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆస్పత్రి నుంచి అదృశ్యమైన సంఘటనకు సంబంధించి ఐదుగురు పోలీసు అధికారులపై రాష్ట్ర డీజీపీ గిరీష్ కుమార్ చర్య తీసుకున్నారు. ఏసీపీ ఏవీ సుబ్బారావు, సీఐలు ధర్మేంద్ర, లక్ష్మీపతి, ఎస్ఐలు భాస్కర్ కమలాకర్‌లను సస్పెండ్ చేస్తూ డీజీపీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.Source: ఏపీ న్యూస్ | 21 Dec 2009 | 12:42 am విద్యార్థులే ఉద్యమ నిర్మాతలు: చిరంజీవి ప్రశంసరాష్ట్రంలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి విద్యార్థులే నిర్మాతలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. విద్యార్థులు తలచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదన్నారు. అనంతపురంలోని శ్రీకృష్ణ విశ్వవిద్యాలయ విద్యార్థులు అందించిన సమైక్యాంధ్ర ఉద్యమ స్ఫూర్తి రాష్ట్ర నలుమూలలా ఉవ్వెత్తున ఎగిసి పడుతోందన్నారు.Source: ఏపీ న్యూస్ | 20 Dec 2009 | 11:59 pm ఎంపీ లగడపాటి డిమాండ్‌కు తలొగ్గిన ప్రభుత్వం!విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఒత్తిడికి రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గింది. ఆయన కోరిక మేరకు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వం తరపున రాష్ట్రమంత్రి పార్థసారథి ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం ఉదయం ముఖ్యమంత్రి రోశయ్యతో ఫోనులో మాట్లాడిన తర్వాత విజయవాడలో మీడియా సమావేశంలో వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 20 Dec 2009 | 11:26 pm "మహా" అసెంబ్లీ ముందుకు ప్రధాన్ కమిటీ నివేదిక!ముంబై దాడులపై దర్యాప్తు చేపట్టిన రామ్ ప్రధాన్ కమిటీ నివేదికను సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర శాంతిభద్రతలపై ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ సమాధానం ఇస్తూ.. ప్రధాన్ కమిటీని అసెంబ్లీలో బహిర్గతం చేయనున్నట్టు ప్రకటించారు.Source: జాతీయ | 20 Dec 2009 | 11:11 pm 26న సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చిన జేఏసీ!సమైక్యాంధ్రకు మద్దతుగా ఈనెల 26వ తేదీన సీమాంధ్ర బంద్‌కు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) పిలుపునిచ్చింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన చేసింది. సమైక్యాంధ్ర నినాదంతో జేఏసీ తన కార్యక్రమాలను బంద్ ద్వారా మరింత ముమ్మరం చేయాలని నిర్ణయించింది.Source: ఏపీ న్యూస్ | 20 Dec 2009 | 10:31 pm లగడపాటి అదృశ్యం: హోంమంత్రి-డీజీపీ ఆగ్రహం!విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అదృశ్యం పట్ల రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై చర్య తీసుకోవాలని ఆమె సోమవారం ఆదేశించారు. ఎంపీ అదృశ్యంపై పూర్తి వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని ఆమె పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.Source: ఏపీ న్యూస్ | 20 Dec 2009 | 10:25 pm చిన్న రాష్ట్రాలు సమస్యలకు పరిష్కారం కాదు: కారత్దేశంలో ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చిన్న రాష్ట్రాలు ఏర్పాటే పరిష్కార మార్గం కాదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అభిప్రాయపడ్డారు. అన్ని సమస్యల పరిష్కారానికి ఒక దీర్ఘకాలిక ప్రణాళికను ఖరారు చేయాలని ఆయన సూచించారు.Source: జాతీయ | 20 Dec 2009 | 9:26 pm ఎంపీ లగడపాటి అదృశ్యం.. పోలీసుల ఆందోళన!సమైక్యాంధ్ర కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పోలీసుల కన్నుగప్పి అదృశ్యమయ్యారు. ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటన ఇటు రాష్ట్రంలో అటు హస్తినలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా, లగడపాటి ఉన్న ఆస్పత్రి ఆవరణలో తీవ్ర అలజడి నెలకొంది.Source: ఏపీ న్యూస్ | 20 Dec 2009 | 9:09 pm గూర్ఖాలాండ్ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం: బెంగాల్ సీఎంరాష్ట్రాన్ని విభజించి గూర్ఖాలాండ్ రాష్ట్ర ఏర్పాటును తాము తీవ్రవంగా వ్యతిరేకిస్తున్నట్టు పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య స్పష్టం చేశారు. బెంగాల్‌ను రెండుగా విభజించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యం తమకు ఏ కోశాన లేదని ఆయన ఉద్ఘాటించారు.Source: జాతీయ | 20 Dec 2009 | 8:53 pm ఎన్టీఆర్ సమైక్య స్ఫూర్తికి చంద్రబాబు హాని: రోజాస్వర్గీయ ఎన్.టి.రామారావు సమైక్య స్ఫూర్తిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కి హాని కలిగిస్తున్నారని ఆ పార్టీ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు, సినీ నటి ఆర్.కె.రోజా ఆరోపించారు. సమైక్యాంధ్ర కోసం కడపలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యమకారులను ఆమె ఆదివారం పరామర్శించి, సంఘీభావం ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 20 Dec 2009 | 5:37 am ప్రభుత్వాల సహకారం లేనిదే ఏం చేయలేం: పవార్దేశంలో నానాటికీ పెరిగిపోతున్న నిత్యావసర వస్తు ధరల పెరుగుదల అరికట్టే అంశంపై కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శరద్ పవార్ చేతులెత్తేశారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేనిదే ధరల పెరుగుదలను నియంత్రించలేమని స్పష్టం చేశారు. ఏ ఒక్కరి సహాయ సహకారం లేకుండా ధరల పెరుగుదలకు కళ్లెం వేయడం ఎంతో కష్టమన్నారు.Source: జాతీయ | 20 Dec 2009 | 5:24 am 'ప్రత్యేక తెలంగాణ' నిర్ణయంపై ఎన్సీపీ మండిపాటుతెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకులు ఒక్కొక్కటిగా ఆరంభమవుతున్నాయి. మొన్నటిమొన్న డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్‌లు యూపీఏ నిర్ణయాన్ని తప్పుబట్టగా, ఆదివారం మరో మిత్రపక్షం ఎన్సీపీ తీవ్రంగా మండిపడింది. తెలంగాణపై యూపీఏ తీసుకున్న నిర్ణయం తొందరపాటు చర్యగా ఆ పార్టీ అగ్రనేతలు అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 20 Dec 2009 | 3:09 am
|