భారత్‌ మార్కెట్‌పై దృష్టిపెట్టిన న్యూస్ కఫే

దక్షిణాఫ్రికాలో పేరొందిన ప్రీమియం కాక్‌టైల్ బార్ గ్రూపునకు చెందిన న్యూస్ కఫే భారత మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరించింది. వచ్చే ఐదేళ్లలో వంద కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులతో దేశ వ్యాప్తంగా న్యూస్ కఫేలను నెలకొల్పాలని నిర్ణయించింది.
Source: Yahoo! Telugu: News | 20 Dec 2009 | 8:23 am

స్మగ్లింగ్‌కు భారత్-నేపాల్ సరిహద్దు వినియోగం!

నకిలీ కరెన్సీతో పాటు.. తీవ్రవాద కార్యకలాపాలు సాగించే తీవ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు భారత్-నేపాల్ సరిహద్దును పాకిస్థాన్ వినియోగిస్తోదని భారత సరిహద్దుదళం ఆరోపించింది. ఇటీవలి కాలంలో సరిహద్దు ప్రాంతాల్లో అరెస్టు చేసిన తీవ్రవాదుల వద్ద జరిపిన విచారణలో వెల్లడైనట్టు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 20 Dec 2009 | 8:09 am

కోపెన్‌హాగెన్ ఒప్పందాన్ని స్వాగతించిన ఐరాస చీఫ్!

ప్రమాదకర వాతావరణ మార్పులను నియంత్రించేందుకు డెన్మార్క్ దేశంలోని కోపెన్‌హాగెన్‌లో జరిగిన ప్రపంచ సదస్సులో కుదిరిన ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ స్వాగతించారు. అమెరికా ఆమోదముద్ర వేసిన ఈ ఒప్పందానికి వచ్చే యేడాది చట్టబద్ధత కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.
Source: Yahoo! Telugu: News | 20 Dec 2009 | 6:31 am

పుట్టిన రోజు వేడుకలకు దూరంగా వైఎస్.జగన్మోహన్!

తన తండ్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అకాల మరణంతో శోకసముద్రంలో ఉన్న కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల ఈనెల 21వ తేదీన తనను అభినందించేందుకు ఎవరూ రావొద్దని ఆయన సూచించారు.
Source: Yahoo! Telugu: News | 20 Dec 2009 | 6:22 am

చంద్రబాబు మౌనం అర్థాంగీకారమా: మంత్రి సబిత ప్రశ్న!

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తమకేమాత్రం పట్టవన్న ధోరణితో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోందని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు ఆయనే కారణం అన్నట్టుగా, చంద్రబాబు మౌనం అర్థాంగీకారంగా ఉందన్నారు.
Source: Yahoo! Telugu: News | 20 Dec 2009 | 6:03 am

హోంమంత్రి గాడిదలు కాస్తున్నారా: నన్నపనేని ప్రశ్న?

రాష్ట్ర ప్రజల ఆగ్రహావేశాల కారణంగా రాష్ట్రం అగ్నిగుండంగా మారినప్పటికీ హోమంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహిస్తున్నారని తెదేపా మహిళా నేత, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆరోపించారు. రాష్ట్ర శాంతి భద్రతల పరిస్థితిని కేంద్రానికి వివరించాల్సింది ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, చిరంజీవి వంటి వారు కాదని, హోంమంత్రి ఢిల్లీకి వెళ్లి వివరించాలని సూచించారు. ఈ పని కూడా చేయకుండా గాడిదలు కాస్తున్నారా అని హోంమంత్రిని నన్నపనేని ప్రశ్నించారు.
Source: Yahoo! Telugu: News | 20 Dec 2009 | 5:56 am

ఏకాభిప్రాయం తర్వాతే తెలంగాణ సాధ్యం: మొయిలీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంత సులభమైన విషయం కాదని కేంద్ర న్యాయ శాఖామంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానం, ఏకాభిప్రాయసాధన లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ అయిన మొయిలీ మరోమారు నొక్కివక్కాణించారు.
Source: Yahoo! Telugu: News | 20 Dec 2009 | 5:46 am

శాంతియుతంగా ఉద్యమం చేద్దాం: వైఎస్ వివేకా

సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహిద్దామని దివంగత వైఎస్.రాజశేఖర రెడ్డి సోదరుడు ఎమ్మెల్సీ వైఎస్.వివేకానంద పిలుపునిచ్చారు. మన ఆస్తులను మనమే ధ్వంసం చేసుకోవడం ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నించారు.
Source: Yahoo! Telugu: News | 20 Dec 2009 | 5:35 am

లభ్యమైన హెడ్లీ వీసా దరఖాస్తు పత్రాలు: భారత్

లష్కర్ తోయిబా తీవ్రవాది డేవిడ్ హెడ్లీ వీసాకు సంబంధించిన ఒరిజినల్ దరఖాస్తు పత్రాలు లభ్యమైనట్టు చికాగోలోని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. ఈ పత్రాలు మాయం కాలేదని, తమ కార్యాలయంలోనే ఉన్నాయని ఆ కార్యాలయ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 20 Dec 2009 | 5:26 am

షర్మ్ ఏ లీక్ ప్రకటనకు కట్టుబడని భారత్: పాకిస్థాన్

ఈజిప్టులోని షర్మ్ ఏ లీక్‌లో భారత్-పాకిస్థాన్ దేశాధినేతలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడలేదని భారత్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ షాహిద్ మాలిక్ ఆరోపించారు. ఈ సంయుక్త ప్రకటనతో పాటు.. తీవ్రవాదంపై సంయుక్త చర్యలపై భారత్ ఇచ్చిన హామీని పూర్తి చేయడం లేదని ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 20 Dec 2009 | 5:21 am

కలిసి ఉంటే కలదు సుఖం: ప్రజారాజ్యం అధినేత!

రాష్ట్రంలోని మూడు ప్రాంతాలైన తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వాసులు కలిసి ఉంటేనే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. మనమంతా కలిసి ఉంటేనే మరింత అభివృద్ధి సాధించవచ్చని ఆయన ఉద్ఘాటించారు.
Source: ఏపీ న్యూస్ | 20 Dec 2009 | 3:21 am

'ప్రత్యేక తెలంగాణ' నిర్ణయంపై ఎన్సీపీ మండిపాటు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకులు ఒక్కొక్కటిగా ఆరంభమవుతున్నాయి. మొన్నటిమొన్న డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్‌లు యూపీఏ నిర్ణయాన్ని తప్పుబట్టగా, ఆదివారం మరో మిత్రపక్షం ఎన్సీపీ తీవ్రంగా మండిపడింది. తెలంగాణపై యూపీఏ తీసుకున్న నిర్ణయం తొందరపాటు చర్యగా ఆ పార్టీ అగ్రనేతలు అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 20 Dec 2009 | 3:09 am

పుట్టిన రోజు వేడుకలకు దూరంగా వైఎస్.జగన్మోహన్!

తన తండ్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అకాల మరణంతో శోకసముద్రంలో ఉన్న కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల ఈనెల 21వ తేదీన తనను అభినందించేందుకు ఎవరూ రావొద్దని ఆయన సూచించారు.
Source: ఏపీ న్యూస్ | 20 Dec 2009 | 12:52 am

చంద్రబాబు మౌనం అర్థాంగీకారమా: మంత్రి సబిత ప్రశ్న!

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తమకేమాత్రం పట్టవన్న ధోరణితో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోందని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు ఆయనే కారణం అన్నట్టుగా, చంద్రబాబు మౌనం అర్థాంగీకారంగా ఉందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 20 Dec 2009 | 12:33 am

హోంమంత్రి గాడిదలు కాస్తున్నారా: నన్నపనేని ప్రశ్న?

రాష్ట్ర ప్రజల ఆగ్రహావేశాల కారణంగా రాష్ట్రం అగ్నిగుండంగా మారినప్పటికీ హోమంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహిస్తున్నారని తెదేపా మహిళా నేత, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆరోపించారు. రాష్ట్ర శాంతి భద్రతల పరిస్థితిని కేంద్రానికి వివరించాల్సింది ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, చిరంజీవి వంటి వారు కాదని, హోంమంత్రి ఢిల్లీకి వెళ్లి వివరించాలని సూచించారు. ఈ పని కూడా చేయకుండా గాడిదలు కాస్తున్నారా అని హోంమంత్రిని నన్నపనేని ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 20 Dec 2009 | 12:27 am

ఏకాభిప్రాయం తర్వాతే తెలంగాణ సాధ్యం: మొయిలీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంత సులభమైన విషయం కాదని కేంద్ర న్యాయ శాఖామంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానం, ఏకాభిప్రాయసాధన లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ అయిన మొయిలీ మరోమారు నొక్కివక్కాణించారు.
Source: జాతీయ | 20 Dec 2009 | 12:16 am

శాంతియుతంగా ఉద్యమం చేద్దాం: వైఎస్ వివేకా

సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహిద్దామని దివంగత వైఎస్.రాజశేఖర రెడ్డి సోదరుడు ఎమ్మెల్సీ వైఎస్.వివేకానంద పిలుపునిచ్చారు. మన ఆస్తులను మనమే ధ్వంసం చేసుకోవడం ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 20 Dec 2009 | 12:05 am

షర్మ్ ఏ లీక్ ప్రకటనకు కట్టుబడని భారత్: పాకిస్థాన్

ఈజిప్టులోని షర్మ్ ఏ లీక్‌లో భారత్-పాకిస్థాన్ దేశాధినేతలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడలేదని భారత్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ షాహిద్ మాలిక్ ఆరోపించారు. ఈ సంయుక్త ప్రకటనతో పాటు.. తీవ్రవాదంపై సంయుక్త చర్యలపై భారత్ ఇచ్చిన హామీని పూర్తి చేయడం లేదని ఆయన తెలిపారు.
Source: జాతీయ | 19 Dec 2009 | 11:51 pm

ప్రజలను రెచ్చగొడుతున్న తెరాస అధినేత: చిరంజీవి

తెలంగాణ ప్రజలను తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు రెచ్చగొడుతున్నారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. ప్రజల ఉద్రేకాలతో కేసీఆర్ ఉద్యమం నడుపుతున్నాడని, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్దతి కాదని ఆయన హితవు పలికారు. తన సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా చిరంజీవి ఆదివారం విజయవాడకు వచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 19 Dec 2009 | 10:44 pm

ఓటు హక్కు వినియోగించుకోకుంటే వివరణ ఇవ్వాల్సిందే!

భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటైన ఓటును తప్పనిసరి వినియోగం చేస్తూ గుజరాత్‌లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక బిల్లును ప్రవేశపెట్టింది. ఒకవేళ తమ ఓటు హక్కును వినియోగించుకోలేని పక్షంలో నెల రోజుల్లో సంబంధింత అధికారులకు సదరు ఓటరు వివరణ ఇవ్వాల్సి ఉటుంది.
Source: జాతీయ | 19 Dec 2009 | 9:57 pm

ప్రత్యేక తెలంగాణాపై 22న కేంద్రం తాజా ప్రకటన..?

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అంశంపై.. తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాల వారందరూ సంతృప్తిపడే రీతిలో కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల్లో మరో తాజా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశం చేరుకున్న ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమై.. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన పరిణామాలన్నింటిపై కూలంకషంగా చర్చించిన తరువాతనే కేంద్రం తాజా ప్రకటన చేయనుందని సమాచారం.
Source: జాతీయ | 19 Dec 2009 | 9:05 pm

మరో గ్రహంలో మన "అవతార్".. ఏం చేశాడంటే...?

"అవతార్" ఆంగ్ల చిత్రమైనప్పటికీ భారతీయ సంస్కృతి కనిపిస్తుంది. రామాయణంలో వానరాలున్నట్లే, ఇందులో ఓ గ్రహంలో వానరాన్ని పోలిన మనుషులుంటారు. మాజీ మిలట్రీ అధికారి జాక్ (శామ్ వర్దింగ్టన్) ప్రమాదవశాత్తూ నడుము భాగంలో స్పర్శను కోల్పోతాడు. మామూలు స్థితికి రావాలంటే అవతార్ అనే కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సి వస్తుంది. ఆ దశలో అతను వేరే గ్రహానికి వెళ్లాల్సి వస్తుంది. అసలు విషయం ఏమిటంటే అక్కడ ఉండే వానరాల్లాంటి వాసుల (అవతార్స్) ప్రదేశమంతా భయంకరమైన అటవీ ప్రాంతం. తేలియాడే కొండలు, భయంకరమైన చెట్లు, జలపాతాలుంటాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Dec 2009 | 12:32 pm

"7 ప్రేమ కథలు"గా మారిన "ఫ్రూట్ సలాడ్"

ప్రేమ కథలను ఎప్పటికప్పుడు నవ్యతగా చూసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. సెవన్ హిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శియా గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న "ఫ్రూట్ సలాడ్" చిత్రం "7 ప్రేమ కథలు"గా టైటిల్ మార్చుకుంది. ఈ చిత్రానికి సురేష్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత ఇనగడప సతీష్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రేమ అన్న పదం ప్రతి మనిషిలో ఓ తియ్యని అనుభూతిని కల్గిస్తుంది. ఆడవాళ్లైనా, మగవాళ్లైనా.. "ప్రతి మనిషి ఏదో ఒక రోజున ప్రేమబారిన పడాల్సిందే. ప్రేమనుంచి తప్పించుకోవడం అసాధ్యం. అయితే కొందరు గెలుస్తారు. మరికొందరు ప్రేమ జ్ఞాపకాలతో గడిపేస్తారు. కొందరికి తీపి, మరికొందరికి చేదు. ఇలా ఎన్నో అనుభవాలు. తొలిచూపులో ప్రేమ, త్యాగం, విరహం, సంఘర్షణ, స్పర్శ, బంధం ఈ గుణాలనే ఏడు ప్రేమకథలుగా మలచిన "ఏడు ప్రేమకథలు" చిత్రం తొలికాపీ సిద్ధమైంది" అని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Dec 2009 | 11:17 am

ఉల్ఫా తీవ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేస్తున్న చైనా

దేశంలోని ఈశాన్య ప్రాంతంలోనున్న మిలిటెంట్లు, ఉల్ఫా తీవ్రవాదులకు చైనా దేశం నుంచి ఆయుధాలు సరఫరా అవుతున్నాయని అరుణాచలప్రదేశ్ ప్రభుత్వం శనివారం వెల్లడించింది.
Source: జాతీయ | 19 Dec 2009 | 8:51 am

విషమించిన లగడపాటి, దేవినేనిల ఆరోగ్యం: వైద్యులు

సమైక్యాంధ్ర కోసం గత ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపి లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావుల ఆరోగ్యం విషమించిందని వారిని పరీక్షించిన వైద్యులు తెలిపారు. వీరిరువురు వైద్యం చేయించుకునేందుకు నిరాకరిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో వారు వైద్యం చేయించుకోకపోతే కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని వైద్యులు సూచించారు. నిరాహారదీక్షకు పూనుకున్న వీరి శరీరంలో సోడియం స్థాయి పూర్తిగా తగ్గిపోయిందని వైద్యులు చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 19 Dec 2009 | 7:56 am

ఎంపీ లగడపాటిని నిమ్స్‌కు తరలించండి: హెచ్ఆర్‌సి

సమైక్యాంధ్ర కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించాలని రాష్ట్ర మానవహక్కుల సంఘం ఆదశాలు జారీ చేసింది. అలాగే, లగడపాటిని న్యాయవాదులు కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా హెచ్ఆర్‌సి ఛైర్మన్ జస్టీస్ సుభాషణ్ రెడ్డి ఆదేశించారు.
Source: ఏపీ న్యూస్ | 19 Dec 2009 | 7:06 am

వెంకీ, త్రిషల "నమో వెంకటేశ" ట్రైలర్ మీ కోసం..

విక్టరీ వెంటేష్, త్రిష కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం "నమో వెంకటేశ". శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీ, రాము, అనిల్ నిర్మిస్తున్నారు. డి. సురేష్ బాబు సమర్పిస్తున్నారు. ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. నానక్‌రామ్‌గూడాలో వెంకటేష్, త్రిష, కోట శ్రీనివాసరావు, ముఖేష్ రుషి, ఢిల్లీ రాజేశ్వరి, తెలంగాణా శకుంతల, బెనర్జీ, బ్రహ్మానందం, మాస్టర్ భరత్‌పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Dec 2009 | 6:12 am

మరో గ్రహంలో మన "అవతార్".. ఏం చేశాడంటే...?

"అవతార్" ఆంగ్ల చిత్రమైనప్పటికీ భారతీయ సంస్కృతి కనిపిస్తుంది. రామాయణంలో వానరాలున్నట్లే, ఇందులో ఓ గ్రహంలో వానరాన్ని పోలిన మనుషులుంటారు. మాజీ మిలట్రీ అధికారి జాక్ (శామ్ వర్దింగ్టన్) ప్రమాదవశాత్తూ నడుము భాగంలో స్పర్శను కోల్పోతాడు. మామూలు స్థితికి రావాలంటే అవతార్ అనే కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సి వస్తుంది. ఆ దశలో అతను వేరే గ్రహానికి వెళ్లాల్సి వస్తుంది. అసలు విషయం ఏమిటంటే అక్కడ ఉండే వానరాల్లాంటి వాసుల (అవతార్స్) ప్రదేశమంతా భయంకరమైన అటవీ ప్రాంతం. తేలియాడే కొండలు, భయంకరమైన చెట్లు, జలపాతాలుంటాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Dec 2009 | 5:29 am

పార్టీ బలోపేతానికి శక్తిమేరకు కృషి: నితిన్ గడ్కారీ

పార్టీ బలోపేతానికి శక్తిమేరకు కృషి చేస్తానని భారతీయ జనతా పార్టీ కొత్త రథసారథి నితిన్ గడ్కారీ ప్రకటించారు. పార్టీలోని అన్నే శ్రేణులను కలుపుకుని పోతానని ఆయన హామీ ఇచ్చారు. భాజపా జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ పేరును ప్రస్తుత అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించారు. దీనికి ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
Source: జాతీయ | 19 Dec 2009 | 4:29 am

ప్రధాని తిరిగొచ్చాక ఆమోదయోగ్యమైన ప్రకటన: జేపీ

విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ స్వదేశానికి తిరిగొచ్చాక రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన ప్రకటన వెలువడవచ్చని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి ప్రధానితో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా, కేంద్ర మంత్రులు ప్రణబ్, వీరప్ప మొయిలీ, చిదంబరం, భాజపా అగ్రనేత అద్వానీలకు రాష్ట్ర ప్రజల మనోభావుల, స్థితిగతులను వివరించారు.
Source: ఏపీ న్యూస్ | 19 Dec 2009 | 4:12 am

21 నుంచి వైద్యులు వెంటరాగా కేసీఆర్ బస్సు యాత్ర!

రెండు చేతుల ద్వారా డిప్స్ (ఫ్యూయిడ్స్) ఎక్కించుకుంటూ పది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు నిపుణులైన వైద్యులను వెంటబెట్టుకుని బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. సోమవారం నుంచి ఈ యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
Source: ఏపీ న్యూస్ | 19 Dec 2009 | 3:46 am

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న స్వైన్ ఫ్లూ మరణాలు!

దేశంలో స్వైన్ ఫ్లూ మరణాలు క్రమేణా పెరిగి పోతున్నాయి. ప్రపంచాన్ని వణించిన ఈ వైరస్ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోవడంతో ఈ వైరస్ మరింత విజృంభించేలా చేస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించిన గణాంకాల మేరకు 769 మంది మృత్యువాత పడినట్టు పేర్కొంది. అలాగే, స్వైన్ ఫ్లూ వైరస్ సోకిన వారి సంఖ్య 23 వేలకు చేరుకుందని వెల్లడించారు.
Source: జాతీయ | 19 Dec 2009 | 1:59 am