|
ముంబై దాడులతో తనకు సంబంధం లేదు: కసబ్ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రత్యక్షంగా పట్టుబడ్డ తీవ్రవాది ఏడాది తర్వాత తన మాట మార్చాడు. తను సిఎస్‌టీపై ఫైరింగ్ చేయలేదని, అలాగే తాజ్ హోటల్‌లోకి వెళ్ళలేదని అజ్మల్ కోర్టుముందు చెప్పాడు. ముంబైలోని ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి ఎదుట శుక్రవారం తన వాదన విన్నవించాడు. ముంబై దాడులతో తనకు సంబంధం లేదని చెప్పాడు.Source: Yahoo! Telugu: News | 18 Dec 2009 | 7:53 am నిరవధికంగా వాయిదా పడిన లోక్‌సభ సమావేశాలురాష్ట్రానికి చెందిన పలువురు ఎంపీలు శుక్రవారం కూడా లోక్‌సభలో తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో మరోసారి తమ నిరసనను తెలిపారు. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను వాయిదా వేశారు.Source: Yahoo! Telugu: News | 18 Dec 2009 | 7:29 am ఈశాన్యప్రాంతంలో సేవలను విస్తరించనున్న ఐడియాదేశీయ జీఎస్ఎమ్ మొబైల్ రంగంలో అగ్రగామిగానున్న ఐడియా సెల్యులార్ సంస్థ దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో తన సేవలను విస్తరించనుంది.Source: Yahoo! Telugu: News | 18 Dec 2009 | 6:59 am విదేశీ మార్కెట్ల ప్రభావం: నష్టాల్లో సెన్సెక్స్విదేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల బాటలో పయనిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి తిరోగమనంలో కొనసాగుతోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 37 పాయింట్ల నష్టంతో, 16,857 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీకూడా 9 పాయింట్ల స్వల్ప నష్టంతో 5,031 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 18 Dec 2009 | 6:58 am హీరోలతో రిలేషన్స్ కోసం రాలేదు: ఇలియానాతను ఇండస్ట్రీకి హీరోలతో రిలేషన్స్ మెయింటెయిన్ చేయడానకి రాలేదని, తనకిచ్చిన పాత్రను చేసేందుకే వచ్చాననీ స్లిమ్ బ్యూటీ ఇలియానా చెబుతోంది. ఇటీవలే ఆమె నటించిన సలీమ్ విడుదలైంది. ఈమధ్య హైదరాబాదులోని సంజీవరెడ్డి నగర్‌లో ఓ బేకరీని ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా ఆమె తనను అడిగిన ప్రశ్నలకు స్పందించింది. ఇండస్ట్రీలో ఎటువంటి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తున్నారని అడిగినప్పుడు... "నటించడం నా వృత్తి. పాత్రకు న్యాయం చేయాలనే చూస్తాను. మన పని మర్చిపోయి రిలేషన్స్ పెంచుకోవాలని నాకు లేదు. అలా అని రిలేషన్స్ అనవసరం అని నేను చెప్పను" అంటోంది. అంటే.. అంటీ అంటనట్లుగా ఉంటుందన్నమాట. సలీమ్‌లో ఎక్స్‌పోజింగ్ గురించి ప్రస్తావిస్తూ... అది పాత్రమేరకే చేయాల్సి వచ్చింది అని చెప్పింది. దేవదాసు చిత్రాన్ని చూసిన యూత్ బాగానే ఎంజాయ్ చేశారు కదా... అంటూ తను ఎక్స్ పోజింగ్ చేయడానికి వెనుకాడనని నిర్మొహమాటంగా చెబుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 18 Dec 2009 | 6:33 am ఇబ్బందులన్నీ పాకిస్థాన్‌తోనే: పెంటగాన్పాకిస్థాన్తో తమ స్నేహ హస్తం ఉంటుందని, కాని ఆ దేశం అప్పుడప్పుడు తలనొప్పిగా తయారవుతుందని ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్, సెంట్రల్ ఆసియాలకు చెందిన డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ డేవిడ్ సెడ్నే తెలిపారు. ఇరు దేశాల మధ్య జరిగిన భద్రతాధికారుల సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.Source: Yahoo! Telugu: News | 18 Dec 2009 | 6:18 am కాశ్మీర్ నుంచి భద్రతా బలగాలను తొలగించనున్నాం: ఆంటోనిప్రస్తుతం జమ్మూ-కాశ్మీర్ ప్రాంతాలలో పటిష్టమైన భద్రత కొనసాగుతోందని, దీంతో కేంద్రం తన బలగాలలోని రెండు డివిజన్లలోనున్న దాదాపు 30 వేల మంది భద్రతా బలగాలను జమ్మూ-కాశ్మీర్ నుంచి తొలగించనున్నామని ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాకు వెల్లడించారుSource: Yahoo! Telugu: News | 18 Dec 2009 | 6:13 am రాష్ట్ర విచ్ఛిన్నకర శక్తులను అడ్డుకుందాం: చిరంజీవిప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి శుక్రవారం తిరుపతిలో సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా పర్యటన ప్రారంభించారు. ప్రజలనుద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ... కొందరు స్వార్థ రాజకీయ నాయకులు తమ ప్రయోజనాలకోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆ కుటిల ప్రయత్నాన్ని మనమంతా మూకుమ్మడిగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.Source: Yahoo! Telugu: News | 18 Dec 2009 | 6:03 am క్షీణిస్తున్న వైఎస్ వివేకానంద రెడ్డి ఆరోగ్యంసమైక్యాంధ్రకు మద్దతుగా కడపలో గత నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కడప ఎమ్మెల్సీ వైఎస్ వివేకానంద రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు ధృవీకరించారు. నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వివేకానంద రెడ్డి ఆరోగ్యాన్ని శుక్రవారం వైద్యులు పరీక్షించారు. ఆయన ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తోందని, ప్రస్తుతం చలి విపరీతంగా ఉండటం కారణంగా ఆయన ఊపిరి తిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ సోకినట్లు వైద్యులు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 18 Dec 2009 | 5:42 am నష్టాల్లోనే స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ పతనంబాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే కొనసాగుతోంది. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాల బాటలో పయనిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 39 పాయింట్లు పతనమై, 16,854 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా పది పాయింట్లు క్షీణించి, 5,031 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 18 Dec 2009 | 5:37 am కేసీఆరూ.. ఇకనైనా నోరు పారేసుకోవద్దు: ఐటీఏ హెచ్చరిక"సమైక్యవాదపోరాట ఉద్యమం కృత్రిమం.. మా ప్రత్యేక తెలంగాణ పోరాటమే నిజం" అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ తెలుగు అసోసియేషన్ (ఐటీఏ) తీవ్రంగా స్పందించింది. ఈ విషయమై.. ఐటీఏ బహిరంగంగా సమాధాన మిచ్చింది.Source: Yahoo! Telugu: News | 18 Dec 2009 | 5:28 am నిరవధికంగా వాయిదా పడిన లోక్‌సభ సమావేశాలురాష్ట్రానికి చెందిన పలువురు ఎంపీలు శుక్రవారం కూడా లోక్‌సభలో తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో మరోసారి తమ నిరసనను తెలిపారు. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను వాయిదా వేశారు.Source: జాతీయ | 18 Dec 2009 | 2:24 am ముంబై దాడులతో తనకు సంబంధం లేదు: కసబ్ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రత్యక్షంగా పట్టుబడ్డ తీవ్రవాది ఏడాది తర్వాత తన మాట మార్చాడు. తను సిఎస్‌టీపై ఫైరింగ్ చేయలేదని, అలాగే తాజ్ హోటల్‌లోకి వెళ్ళలేదని అజ్మల్ కోర్టుముందు చెప్పాడు. ముంబైలోని ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి ఎదుట శుక్రవారం తన వాదన విన్నవించాడు. ముంబై దాడులతో తనకు సంబంధం లేదని చెప్పాడు.Source: జాతీయ | 18 Dec 2009 | 2:24 am కాశ్మీర్ నుంచి భద్రతా బలగాలను తొలగించనున్నాం: ఆంటోనిప్రస్తుతం జమ్మూ-కాశ్మీర్ ప్రాంతాలలో పటిష్టమైన భద్రత కొనసాగుతోందని, దీంతో కేంద్రం తన బలగాలలోని రెండు డివిజన్లలోనున్న దాదాపు 30 వేల మంది భద్రతా బలగాలను జమ్మూ-కాశ్మీర్ నుంచి తొలగించనున్నామని ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాకు వెల్లడించారుSource: జాతీయ | 18 Dec 2009 | 1:10 am ప్రతిపక్షనేత పదవికి రాజీనామా చేయనున్న అద్వానీభారతీయ జనతా పార్టీకి చెందిన అగ్రనాయత్వంలో మార్పులు సంభవించనున్నాయి. ఆ పార్టీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి పదవి నుంచి వైదొలగబోతున్నారు. ప్రస్తుతం లోక్‌సభలో భాజపా తరపున ఉప నాయకురాలిగా ఉన్న సుష్మాస్వరాజ్(57) ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.Source: జాతీయ | 18 Dec 2009 | 12:38 am రాష్ట్ర విచ్ఛిన్నకర శక్తులను అడ్డుకుందాం: చిరంజీవిప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి శుక్రవారం తిరుపతిలో సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా పర్యటన ప్రారంభించారు. ప్రజలనుద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ... కొందరు స్వార్థ రాజకీయ నాయకులు తమ ప్రయోజనాలకోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆ కుటిల ప్రయత్నాన్ని మనమంతా మూకుమ్మడిగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 18 Dec 2009 | 12:35 am కేసీఆరూ.. ఇకనైనా నోరు పారేసుకోవద్దు: ఐటీఏ హెచ్చరిక"సమైక్యవాదపోరాట ఉద్యమం కృత్రిమం.. మా ప్రత్యేక తెలంగాణ పోరాటమే నిజం" అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ తెలుగు అసోసియేషన్ (ఐటీఏ) తీవ్రంగా స్పందించింది. ఈ విషయమై.. ఐటీఏ బహిరంగంగా సమాధాన మిచ్చింది.Source: ఏపీ న్యూస్ | 18 Dec 2009 | 12:15 am క్షీణిస్తున్న వైఎస్ వివేకానంద రెడ్డి ఆరోగ్యంసమైక్యాంధ్రకు మద్దతుగా కడపలో గత నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కడప ఎమ్మెల్సీ వైఎస్ వివేకానంద రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు ధృవీకరించారు. నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వివేకానంద రెడ్డి ఆరోగ్యాన్ని శుక్రవారం వైద్యులు పరీక్షించారు. ఆయన ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తోందని, ప్రస్తుతం చలి విపరీతంగా ఉండటం కారణంగా ఆయన ఊపిరి తిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ సోకినట్లు వైద్యులు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 18 Dec 2009 | 12:14 am లోక్‌సభను కుదుపుతున్న సమైక్యాంధ్ర- తెలంగాణాజై సమైక్యాంధ్ర, జై తెలంగాణా నినాదాలతో శుక్రవారంనాడు కూడా లోక్‌సభ దద్దరిల్లింది. సీమాంధ్ర, తెలంగాణా ఎంపీలు లోక్‌సభలో జై సమైక్యాంధ్ర, జై తెలంగాణా ప్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో తొలుత స్పీకర్ మీరాకుమార్ పార్లమెంటును కొద్దిసేపు వాయిదా వేశారుSource: జాతీయ | 17 Dec 2009 | 11:51 pm రాష్ట్ర రాజధానికి చేరుకున్న దలైలామాబౌద్ధ మతగురువు దలైలామా శుక్రవారం ఉదయం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చేరుకున్నారు. స్థానిక ఓ హోటల్‌లో దలైలామాకు టిబెటన్లు ఘనస్వాగతం పలికారు.Source: ఏపీ న్యూస్ | 17 Dec 2009 | 11:23 pm జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్: ఇద్దరు పోలీసుల మృతిజార్ఖండ్లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. పోలీసులకు-మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. హుసేనాబాద్ నియోజకవర్గంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.Source: జాతీయ | 17 Dec 2009 | 11:06 pm మొయిలీ, అద్వానీతో సమావేశమైన జేపీ!రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ, బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీతో లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఇరువురు నేతలతో చర్చించినట్లు జేపీ విలేకరులతో చెప్పారు.Source: జాతీయ | 17 Dec 2009 | 10:59 pm నిజంగానే.. కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేశారా?తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు పదకొండురోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారా. ఇది సగటు సీమాంధ్ర (రాయలసీమ+ఆంధ్ర=సీమాంధ్ర) పౌరుడి మెదడును తొలుస్తున్న సందేహం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా గత నెల 29వ తేదీన ఆమరణ నిరాహారదీక్షకు బయలుదేరిన కేసీఆర్‌ను మార్గమధ్యంలోనే పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించిన విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 17 Dec 2009 | 10:40 pm గోవాలో విధ్వంసానికి తీవ్రవాదుల కుట్రపాకిస్థాన్లోనున్న కొన్ని ఉగ్రవాద సంస్థలు తమ ప్రాంతంలో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు రచించారని తమ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందించారని గోవా హోం శాఖామంత్రి రవి నాయక్ తెలిపారు.Source: జాతీయ | 17 Dec 2009 | 8:55 pm వ్యక్తి నుంచే వేర్పాటు ఉద్యమం వస్తుంది: లగడపాటిసమైక్యాంధ్రకోసం దీక్షలు చేస్తున్న ప్రజలను పెట్టుబడిదారుల దీక్షగా కేసీఆర్ పేర్కొనడంపై లగడపాటి మండిపడ్డారు. ఒక వ్యక్తి కారణంగానే వేర్పాటు ఉద్యమాలు వస్తాయని అన్నారు. సమైక్య ఆంధ్ర ఉద్యమం ప్రజల నుంచి వచ్చిందని పేర్కొన్నారు.ఒకవేళ రాష్ట్రం ముక్కలైతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని తేల్చి చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 17 Dec 2009 | 8:55 am ప్రారంభమైన తెలంగాణ ప్రజారాజ్యం పార్టీతెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజారాజ్యం పార్టీ నేతలు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీని గురువారం సాయంత్రం ప్రకటించారు.ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించి గురువారం ఉదయం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో నిరాశచెందిన తెలంగాణ ప్రరాపా నేతలు సామాజిక తెలంగాణ అనే అంశంతో ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 17 Dec 2009 | 7:53 am సోనియా గాంధీతో మరోసారి కోర్ కమిటీ భేటీకేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్, ఆంటోనీలతోపాటు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం కేంద్ర కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీతో మరోసారి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం తలెత్తిన సంక్షోభ నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది.Source: జాతీయ | 17 Dec 2009 | 7:25 am పోలీసుల అదుపులో హిజ్బుల్ తీవ్రవాదులుహైదరాబాద్లో విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్న ఇద్దరు తీవ్రవాదులను తాము అదుపులోకి తీసుకున్నట్లు గురువారం సాయంత్రం పోలీసు అధికారులు మీడియాకు తెలిపారు. వీరిని తాము అదుపులోకి తీసుకోవడంతో నగరంలో భారీ విధ్వంసానికి చెక్ పెట్టినట్లైందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.Source: ఏపీ న్యూస్ | 17 Dec 2009 | 7:23 am మనం కలిసుందాం... కలిసుందాం: మోహన్ బాబురాష్ట్రంలో కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు రేపిన చిచ్చు ఫలితంగా యావదాంధ్రప్రదేశ్ లోని ప్రతి పౌరుడూ నేడు తీవ్రమైన ఆవేదనకు గురై ఉన్నాడని నటుడు మోహన్ బాబు అన్నారు. తిరుపతిలో సమైక్యాంధ్ర అనుకూలంగా దీక్ష చేపడుతున్న విద్యార్థి శిబిరానికి వెళ్లిన మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు ఆంధ్రప్రదేశ్ యుద్ధభూమిలో ఉన్నది. దీని ఫలితంగా సామాన్యప్రజానీకం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు యువతను రెచ్చగొడుతున్నారు. ఫలితంగా కొందరు యువకులు ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలను పోగొట్టుకున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Dec 2009 | 6:27 am కేంద్రం ప్రకటన చేసే వరకు వైద్యం వద్దు: దేవినేని ఉమతెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం చేసిన సానుకూల ప్రకటనను ఉపసంహరించుకుని, సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన వెలువడేంత వరకు వైద్యం చేయించుకోబోనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు స్పష్టం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయన చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు గురువారం భగ్నం చేసిన విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 17 Dec 2009 | 6:11 am ప్రధాని విమానాన్ని ఢీకొన్న ఆయిల్ ట్యాంకరు!కోపెన్‌హాగెన్‌లో జరుగుతున్న పర్యావరణ మార్పు సదస్సుకు ప్రధాని మన్మోహన్ సింగ్ పరివారంతో బయలుదేరాల్సిన విమానం గురువారం మధ్యాహ్నం చిన్నపాటి ప్రమాదానికి గురైంది. రీ ఫ్యూయలింగ్ చేస్తున్న సమయంలో బోయింగ్ 747 విమానాన్ని ఆయిల్ ట్యాంకర్ ఢీకొంది. దీంతో ప్రధాని ప్రయాణం కొన్ని గంటల పాటు వాయిదా పడింది.Source: జాతీయ | 17 Dec 2009 | 5:30 am సమైక్యాంధ్ర వాసులవి దొంగ దీక్షలు: కేసీఆర్ ఎద్దేవా!సమైక్యాంధ్ర కోసం రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో రాజకీయ పార్టీలకు అంతీతంగా చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షలను దొంగ దీక్షలుగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఎద్దేవా చేశారు. తన నివాసంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి పచ్చి అవకాశవాదని, రాజకీయ పరిజ్ఞానం లేని నేతగా అభివర్ణించారు.Source: ఏపీ న్యూస్ | 17 Dec 2009 | 5:11 am అక్కినేనికి డబ్బు పిచ్చి అంటారు: నటసామ్రాట్"అవును. అక్కినేని ఇంకా సినిమాల్లో నటిస్తే.. ఆయనకు ఏం ఖర్చు.. ఇంకా డబ్బు పిచ్చి పట్టుకుందని అందరూ అంటారు. అందుకే నేను సినిమాల్లో నటించడం లేద"ని అక్కినేని నాగేశ్వరరావు చెబుతున్నారు. తను సినిమాల్లో నటించకపోవడానికి కారణాలను చెపుతూ.. "నా వయస్సు 86 సంవత్సరాలు. ఇన్నేళ్ల కెరీర్‌లో చేయని పాత్ర లేదు. అప్పుడేదో రామదాసులో చేయమంటే చేశాను. ఆ తర్వాత చేయాలని ఉన్నా.. వయస్సుకు తగిన పాత్రలు రాలేదు. అయితే సీతారామయ్యగారి మనవరాలు లాంటి సినిమాలు వస్తే తప్పకుండా నటిస్తాను. నా ప్రాణం పోయేవరకూ నటిస్తూనే ఉంటాను" అని అన్నారు అక్కినేని నాగేశ్వరరావు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Dec 2009 | 5:10 am త్వరలో ప్రేక్షకుల ముందుకు "సుభద్ర"సుప్రసిద్ధ నిర్మాత డా. డి. రామానాయుడు చేతుల మీదుగా శ్రీకాంత్ టాకీస్ వారి "సుభద్ర" లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. యువ నిర్మాత శ్రీకాంత్ గౌడ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజావన్నెంరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. "చందమామ" ఫేమ్ సింధుమీనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్, డబ్బింగ్ కార్యక్రమాల్ని ముగించుకుని రీ-రికార్డింగ్ జరుపుకుంటుంది.Source: Yahoo! Telugu: Entertainment | 17 Dec 2009 | 5:01 am
|